శరీరానికి నిమ్మకాయ వల్ల ఇన్ని లాభాలా….?
Category : Health new Sliders
అందరూ నిమ్మకాయలను ఆహారంలో మరియు కేశాలు మెరుపు రావడం కోసం వాడుతుంటారు. అయితే ఈ నిమ్మకాయ ద్వారా మన మొహానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. నిమ్మరసంలో విటమిన్ ‘ సి ‘ మాత్రమే కాకుండా మన శరీరానికి ఉపయోగపడే చాలా రకాల పోషకాలు ఉన్నాయి.
రోజూ ఉదయం నిద్ర లేవగానే నిమ్మకాయ రసం తీసుకోవడం వలన వచ్చే లాభాలు:
1. ఉదయాన్నే ఒకనిమ్మకాయను గ్లాస్ నీళ్లలో వేసుకుని త్రాగటం వలన పలు ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ఇందులో వుండే ఆమ్లాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
2. నిమ్మరసంలో సహజ సిద్ధంగా వుండే యాంటీ ఫంగల్, యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ గుణాల వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
3. నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి మన చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది మచ్చలు కూడా తొలగి పోతాయి.
4. నిమ్మకాయలో పొటాషియం ఎక్కువగా ఉండటం వలన మాసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. నిమ్మరసం రోజూ తీసుకోవడం వలన మన శరీరంలో ఉండే వ్యర్దాలు బయటికి వెళ్లిపోతాయి.
5. అధిక బరువు ఉన్న వారు ప్రతిరోజూ ఈ నిమ్మకాయను గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగటం వలన బరువు తగ్గించుకోవచ్చు.
6. ప్రతిరోజూ నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటితో తీసుకోవడం వలన మలబద్దకాన్ని నోరోదించవచ్చు. అంతేకాకుండా ఇలా చేయడంవలన శరీరంలో పొటాషియం లెవెల్ పెరిగి కిడ్నీలో వుండే రాళ్ళూ నెమ్మదిగా తగ్గిపోతాయి.
7. ఉదయాన్నే నిమ్మరసం తీసుకోవడం వలన గొంతు నొప్పి, జలుబు లాంటి ఇన్ఫెషన్ వ్యాధులు సోకకుండా ఉంటాయి.
8. నిమ్మరసం తీసుకోవడం వలన శరీరంలో ఉండే యాసిడ్ లెవెల్ తగ్గుతుంది. శరీర ద్రవ్యాలు సమతుల్యంగా ఉంటాయి.
9. నిమ్మరసం వలన ఎవరికైనా సరే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వుండవు. నిమ్మరసంలో రుచి కోసం అందులో ఉప్పు, చెక్కెర కాకుండా కొంచెం తేనె వేసుకుంటే మన శరీరానికిఇంకా మంచిది.
10. నిమ్మరసం ప్రతిరోజూ తీసుకోవడం వలన ఎలాంటి మెడిసిన్స్ తీసుకునే అవసరమే ఉండదు.