గిరిజన గ్రామాల డిజిటలీకరణకు హీరో ఆదిత్య ఓం చేయూత
Category : Latest Reviews Movie News Sliders
గిరిజన గ్రామాల డిజిటలీకరణకు హీరో ఆదిత్య ఓం చేయూత
సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే హీరో ఆదిత్య ఓం భద్రాచలం పరిధిలోని చెరుపల్లి, కొత్తపల్లి,
కొత్తపల్లి, కోయనరసాపురం గ్రామాల డిజిటలీకరణకు శ్రీకారం చుట్టారు. పేస్ గ్రూప్‌కి చెందిన ‘టి.సేన’తో ఒప్పందం కుదుర్చుకొని గిరిజన గ్రామ యువతకు శిక్షణ ఇచ్చి ఈ ఆన్లైన్ కేంద్రాల ఏర్పాటుకు ఆర్థిక చేయూతనిస్తున్నారు. సినీ నిర్మాత, దర్శకులు విజయ్‌వర్మ పాకాలపాటి సహకారంతో కోయనరసాపురం గ్రామానికి చెందిన రామకృష్ణకి శిక్షణ ఇచ్చి సంక్రాంతి సందర్భంగా ఆ గ్రామంలో ‘టి.సేవ’ కేంద్రాన్ని ప్రారంభించారు. మిగతా గ్రామాలలో అతి త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా చెరుపల్లి పరిసర గ్రామాల వృద్ధులకు రగ్గులను, యువతకు క్రికెట్ కిట్లను అందించారు. అలాగే చెరుపల్లి స్కూల్‌కి కొన్ని బెంచీలను సమకూర్చుతున్నారు. ఈ కార్యక్రమాలను తన సన్నిహితుడు విజయ్‌వర్మ పాకాలపాటి చేతుమీదుగా చేయిస్తున్నట్టు వివరించారు హీరో ఆదిత్య ఓం.