కిన్నెరసాని ట్రైలర్: ఆకట్టుకుంటున్న మెగా అల్లుడు
Category : Behind the Scenes Sliders Teasers
‘విజేత’ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్.. ‘కిన్నెరసాని’ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా విడుదల చేసిన కిన్నెరసాని ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రవీంద్రవిజయ్ కీలకపాత్ర పోషించారు. ‘నీ ముందు ఉన్న సముద్రపు అలల్ని చూడు. కోపగించుకుని సముద్రాన్ని వదిలి వెళ్లిపోతున్నట్టున్నాయ్. కానీ, సముద్రం వాటిని వదలదు. వదులుకోలేదు. నేను కూడా అంతే’ అంటూ కథానాయిక అన్ షీతల్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ముఖ్యంగా కల్యాణ్‌దేవ్, రవీంద్ర విజయ్‌ల నటన ఆకట్టుకునేలా సాగింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.