చెరుకు రసం తాగుతున్నారా.. ఉపయోగాలు తెలిస్తే వదలిపెట్టరు
Category : Behind the Scenes Health new
వేసని సీజన్ వచ్చేసింది.. రోడ్లపై నిమ్మరసం, పుదీనా నీళ్లు, మజ్జిగ, చెరుకు రసాలకు డిమాండ్ పెరిగిపోతోంది. ఎండలో బయటికి వెళ్ళినపుడు తప్పనిసరిగా జ్యూస్ గానీ, కూల్‌డ్రింక్ గానీ తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే డీహైడ్రేషన్, అలసట ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్నింటికంటే చెరుకు రసం బెటరని చాలామంది సూచిస్తుంటారు. చెరుకు రసం కేవలం దాహాన్ని తీర్చేందుకే కాదు.. శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మలినాలను తొలగించి ఆరోగ్యాన్ని పెంచుతుంది. చెరుకు రసం సంతానోత్పత్తికి కూడా మంచిదని చెబుతున్నారు.
చెరుకు రసం వల్ల ఉపయోగాలు
* బాలింతలు చెరుకు రసాన్ని తాగితే పాల ఉత్పత్తి పెరుగుతుందట.
* మగవారిలో వీర్య కణాల నాణ్యతను మెరుగుపరుస్తుంది
మహిళలకు పీరియడ్స్‌లో వచ్చే నొప్పిని నివారిస్తుంది.
శరీరంలోని ఉబ్బరాన్ని తగ్గించడంతో పాటు కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.
కామెర్ల చికిత్సకు కూడా బాగా ఉపయోగపడుతుంది.
తరుచూ చెరుకు రసం తాగితే శరీరం స్మూత్‌గా తయారవుతుంది.
మొటిమలను నివారించడంతో పాటు చుండ్ర సమస్యను కూడా తొలగిస్తుంది.
సహజ డిటాక్స్‌గా పనిచేసే చెరుకు రసం వారంలో మూడుసార్లు తీసుకుంటే ఎంతో మంచింది.
జీర్ణ సంబంధమైన సమస్యలను తొలగిస్తుంది.