‘సారంగ దరియా’ సెన్సేషనల్ రికార్డ్.. ఎవరికీ సాధ్యం కాదిది


“లవ్ స్టోరి” చిత్రంలోని ‘సారంగ దరియా’ పాట యూట్యూబ్ వ్యూస్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 32 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించింది. సౌతిండియాలో మరే లిరికల్ సాంగ్ ఇంత తక్కువ టైమ్‌లో వంద మిలియన్ మార్క్ చేరుకోలేదు. ‘రౌడీ బేబీ’, ‘బుట్ట బొమ్మ’ వంటి సంచలన పాటలు కూడా లిరికల్ సాంగ్ వ్యూస్ లో ‘సారంగ దరియా’ వెనకబడిపోవడం గమనార్హం. ఫిబ్రవరి 28న ఆదిత్య మ్యూజిక్ ఛానెల్‌లో అప్ లోడ్ అయిన ‘సారంగ దరియా’ పాట తొలి రోజు నుంచే శ్రోతలను ఆకట్టుకుంటూ మిలియన్ల కొద్దీ వ్యూస్ అందుకుంటూ వచ్చింది. ‘సారంగ దరియా’కు సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ ఇచ్చిన క్యాచీ ట్యూన్, సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం, ఉత్సాహంగా మంగ్లీ పాడిన తీరు సామాన్యుడి నుంచి విశిష్ట వ్యక్తుల దాకా అందరినీ ఆకట్టుకుందది.

ఈ పాటలో శేఖర్ మాస్టర్ స్టెప్పులను నాయిక సాయి పల్లవి తనదైన స్టైల్‌లో మెరుపు తీగలా చేసింది. సాయి పల్లవి టైమింగ్, ఎనర్జీ, ఎక్స్ ప్రెషన్స్, ఇన్‌వాల్వ్ మెంట్ ‘సారంగ దరియా’ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. “లవ్ స్టోరి” చిత్రంలో ‘సారంగ దరియా’ పాటను తీసుకోవాలి అని దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన ఆలోచన 100 శాతం సక్సెస్ అయింది. ఈ సినిమాకు ‘సారంగ దరియా’ డ్రైవింగ్ ఫోర్స్ అయ్యిందనే చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల.

Related Images:

FacebookFacebookTwitterTwitterEmailEmailShareShare

AddThis Website Tools
Telugu BOX Office:
Related Post
whatsapp
line