‘ఒకే ఒక జీవితం’ టీజర్… శర్వానంద్ హిట్ కొట్టేలా ఉన్నాడు
Category : Behind the Scenes Movie News Sliders Teasers
టాలెంటెడ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా శ్రీ కార్తీక్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. రీతూ వర్మ కథానాయిక. అమల అక్కినేని, నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను కోలీవుడ్ ప్రముఖ నటుడు సూర్య బుధవారం విడుదల చేశారు. ఈ సినిమా టైమ్ మెషీన్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. స్నేహితులైన శర్వానంద్, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ భవిష్యత్తు నుంచి వర్తమానంలోకి రావటం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తల్లీకొడుకుల అనుబంధం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉంది….
ఈ చిత్రాన్ని ఎస్. ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదలకానుంది. ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ స్వరాలందిస్తున్నారు. సుజిత్ సారంగ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. శర్వానంద్, వెన్నెల కిషోర్, ప్రియదర్శిల నటన మరోసారి హైలెట్‌గా నిలిచే అవకాశం ఉంది. జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఈ టీజర్ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో సరైన హిట్టు లేని శర్వానంద్.. ఈ చిత్రంతో మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడనే భరోసా ఇస్తుంది ఈ టీజర్. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి..