Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
వైవిధ్యభరితమైన చిత్రాలతో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వానంద్. కంటెంట్ ప్రాధాన్యతను బట్టి సినిమాలను ఎంచుకుంటూ..హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలను చేస్తున్నారు. ఇటీవలే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఒకే ఒక జీవితం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు డైరెక్టర్ శ్రీకార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉంది.
శర్వానంద్ ఏదో మ్యూజిక్ కాంపిటేషన్‌కు ప్రాక్టీస్ చేస్తున్నట్లు ట్రైలర్ ప్రారంభమయ్యింది. అంతలోనే రీతూవర్మ కంగ్రాట్స్ ఆది.. ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయ్యావు అంటూ మాట్లాడం ఆకట్టుకుంది. అలాగే ఇందులో వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలకపాత్రలలో కనిపించనున్నారు. సీనియర్ నటుడు నాజర్ శాస్త్రవేత్తగా కనిపించనున్నాడు. శర్వానంద్, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ ముగ్గురిని నాజర్ బాల్యంలోకి పంపిస్తాడు. అసలు వీళ్ల గతంలో ఏం జరిగింది ?. మళ్లీ ఎందుకు గతంలోకి వెళ్లాలనుకున్నారు ? అనేది ఈ సినిమా స్టోరీ అన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా శర్వానంద్ తల్లిగా అక్కినేని అమల నటింటారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళంలో సెప్టెంబర్ 9న విడుదల కానుంది.
కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం విక్రాంత్ రోణ. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్() సుదీప్ సరసన ఆడిపాడింది. జులై 28న కన్నడతో పాటు తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజైంది. మిస్టరీ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. ఇక ఈ సినిమాలో మంగ్లీ పాడిన రక్కమ్మ సాంగ్ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోంది. సిల్వర్‌స్ర్కీన్‌పై అలరించిన ఈ ఇంటెన్సివ్ రివేంజ్ థ్రిల్లర్ ఇప్పుడు డిజిటల్ మీడియంలోనూ ప్రసారం కానుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో ఈరోజు (సెప్టెంబర్ 2న) నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఇదిలా ఉంటే విక్రాంత్ రోణ తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ తాజాగా బయటకు వచ్చింది. సెప్టెంబర్ 16 నుంచి తెలుగు వెర్షన్ డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి డిస్నీ హాట్‌స్టార్ యాజమాన్యం అధికారిక ప్రకటన కూడా వెలువరించింది.
అనూప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మంజునాథ్ గౌడ్ నిర్మాతగా వ్యవహరించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. హీరో హీరోయిన్లతో పాటు నిరూప్ భండారి, నీతా అశోక్, రవిశంకర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి బిగ్ స్ర్కీన్‌పై ఈ సినిమాను చూడలేకపోయిన వారు, ఎంచెక్కా ఓటీటీలో చూసి ఆస్వాదించండి.
వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) ‘ఉప్పెన’ (Uppena) అనే సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి (Chiranjeevi) మేనల్లుడుగా.. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. వైష్ణవ్ తేజ్ రెండో సినిమా ‘కొండపొలం’ (Kondapolam) సరిగా ఆడకపోయినా.. నటుడిగా అతనికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మూడో సినిమా – ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga) విడుదలైంది. చినమామయ్య పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు నాడు ఈ సినిమా విడుదలవడం వైష్ణవ్ తేజ్‌కి ప్లస్ పాయింట్‌గా భావించారు. దీనికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఇచ్చారు ఈ సినిమాలో కేతిక శర్మ (Ketika Sharma) కథానాయికగా చేసింది. ఈ ‘రంగ రంగ వైభవంగా’ సినిమా ఎలా ఉందో చూద్దాం..
స్నేహానికి నిలువెత్తు నిదర్శనం రాముడు (ప్రభు), చంటి (నరేష్). ఇద్దరివీ పక్క పక్క ఇళ్లే. చంటి కొడుకు రిషి (వైష్ణవ్ తేజ్), రాముడు కూతురు రాధ (కేతికా శర్మ).. ఇద్దరూ ఒకే రోజున.. ఒకే ఆస్పత్రిలో జన్మిస్తారు. ఈ తల్లిదండ్రుల మధ్య ఉన్న చక్కటి స్నేహ బంధమే పిల్లల మధ్య మొగ్గ తొడుగుతుంది. అయితే రిషి, రాధ స్నేహం స్కూల్ డేస్‌లోనే ప్రేమ బంధంగా మారుతుంది. స్కూల్‌లో జరిగిన ఓ చిన్న సంఘటన వీరిద్దరి మధ్య దూరం పెంచుతుంది. ఇగోతో పంతాలకు పోయి ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం మానేస్తారు. ఇద్దరూ ఒకే మెడికల్ కాలేజీలో చదువుతున్నా.. ఒకరితో ఒకరు ఒక్క మాట కూడా మాట్లాడుకోరు. కానీ, ఇద్దరికీ ఒకరంటే మరొకరికి చచ్చేంత ప్రేమ. ఈ జంట మధ్యనున్న ఇగో వార్ చల్లారి.. ఒక్కటయ్యే సమయంలోనే వీరి కుటుంబాల్లో మరో ప్రేమకథ అలజడి రేపుతుంది. అది రిషి అన్నయ్య.. రాధ అక్క ప్రేమకథ. వీరి వల్ల రిషి – రాధ ప్రేమ ఎందుకు సమస్యల్లో పడింది? ప్రాణ స్నేహితులుగా ఉన్న కుటుంబాల మధ్య గొడవలు మొదలవడానికి కారణమేంటి? ఇందులో రాధ అన్నయ్య వంశీ (నవీన్ చంద్ర) పాత్ర ఏంటి? ఈ రెండు ప్రేమకథలు ఎలా సుఖాంతమయ్యాయి? రెండు కుటుంబాల్ని ఒక్కటి చేయడానికి రిషి చేసిన సాహసాలేంటి? అన్నది మిగిలిన కథ.
ఈ సినిమాతో గిరీశాయ (Gireesaaya) అనే కొత్త దర్శకుడు పరిచయమయ్యాడు. కథ, స్ర్కీన్‌ప్లే కూడా ఆయనే అందించాడు. కానీ ఒక పాత కథను తీసుకొని కొంచెం అటు ఇటు మార్చడం తప్ప గిరీశాయ చేసిందేమీ లేదు. అలాగే దర్శకుడిగా సినిమాని ఆసక్తికరంగానూ చిత్రీకరించలేకపోయాడు, ఎందుకంటే కథలో పట్టులేదు కాబట్టి. ప్రేక్షకులకి రాబోయే సన్నివేశాలు ఏ విధంగా వుంటాయో, ఏమి జరగబోతుందో అనేది ముందే తెలిసిపోతుంది. ఎక్కడా కూడా కొత్తదనం కనిపించదు. ‘కంటెంట్ బాగుండాలి…’ అని అంటూ ఉంటారు కదా, మరి ఒక సీనియర్ నిర్మాత అయిన బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ కథని ఎలా అంగీకరించారో ఆయనకే తెలియాలి. అందుకని కాబోలు ఆయన ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ మీద కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు. (Ranga Ranga Vaibhavanga Review)
ఎవరెలా చేశారంటే: రిషి పాత్రలో వైష్ణవ్ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకునేలా కనిపించారు. కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన, పలికించిన హావభావాలు పవన్ కల్యాణ్‌ను గుర్తు చేస్తాయి. అయితే కథలోనే సరైన బలం లేకపోవడంతో నటన పరంగా ఆయన కొత్తగా చేయడానికి అవకాశం దొరకలేదు. వైష్ణవ్‌కు జోడీగా కేతిక అందచందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. నవీన్ చంద్ర, ప్రభు, నరేశ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. దర్శకుడు కథ రాసుకున్న విధానం.. దాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు ఏమాత్రం ప్రేక్షకుల్ని మెప్పించదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి కాస్త బలాన్నిచ్చింది. మూడు పాటలు వినసొంపుగా ఉన్నాయి. శ్యామ్ దత్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. అదే ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం’. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా… ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన ‘వినాయకుడు’ ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం. ఉత్తరాయణ కాలంలో (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలంలో (జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం.
ఈ ఆలయంలో మరో విచిత్రం కూడా వుంది. ఆలయ ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.. నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది. ఇక్కడున్న ఈ బావి. ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే.. ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో..ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి. వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ ఈ ఆలయంలో ఉన్న మర్రిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని ‘మిరాకిల్ వినాయకర్ ఆలయం’ అని కూడా పిలుస్తారు.
ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే గణేశుడి ఈ ఆలయం నిర్మించారు. అందుకే ఈ ఆలయాన్ని ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్’ ఆలయం అని పిలుస్తారు. ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించడం జరిగింది. ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాక ఈ ఆలయం తమిళనాడులో పరిధిలోకి వచ్చింది. ఈ ఆలయానికో చరిత్ర కూడా ఉంది. ఆ రోజుల్లో ‘కేరళపురం’ రాజు తీర్థయాత్రలకని ‘రామేశ్వరం’ బయలుదేరారు. అక్కడ తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తన్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం సముద్ర కెరటాల్లో తడుస్తూ కనిపించింది. రాజు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుకి అప్పగించబోతే దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మమని అని భావించి రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని ‘కేరళపురం’ రాజుకే ఇస్తూ మరొక మరకత(పచ్చల) గణపతిని కూడా బహూకరించాడు. కేరళపురం రాజు ఆ రెండు విగ్రహాలనూ తన రాజ్యం తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు.
అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతి కొల్లగొట్టబడి ఈ గణపతి మాత్రం మిగిలిపోయాడు. ఈ ఆలయం ప్రతిష్ఠ కూడా ఆగమశాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు. అయినా ఈ ఆలయం ఇంత ప్రఖ్యాతి చెందడానికి ఈ వినాయకుని మహిమే కారణం అంటారు భక్తులు. ఈ ఆలయ ప్రాకార గోడల మీద అతి పురాతరమైన వర్ణచిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ వినాయకునికి ఉదయము, సాయంకాలము కూడా అభిషేకాలు జరుగుతూండడం విశేషం. ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపు మూట గానీ, ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది నమ్మకం.
సకల దేవతగణాలకు అధిపతి విఘ్నేశ్వరుడు. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా తొలి పూజ గణనాధునికే. ఆయన అనుగ్రహాం పొందితే అన్ని కార్యం జయమవుతుంది. సాక్షాత్తు విధాత సైతం సృష్టి ప్రారంభానికి ముందు గణపతిని పూజించినట్టు ‘ఋగ్వేదం’ చెబుతోంది. అలాంటి వినాయకుడి పుట్టిన రోజైన ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ పండుగను జరుపుకుంటారు.
తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పిచడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది. దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్లింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు….ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీ దేవి, జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు…గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. అతడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బందిపడుతూ కైలాసం చేరుకున్నాడు.
శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని విఘ్ననాధుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి నిన్నుచూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది.
పార్వతీ చంద్రుని శపించిన సమయంలోనే సప్తఋషులు తమ భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషి పత్నుల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు, వారిని త్వజించారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వల్లే ఋషి పత్నులు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవిని శాపాన్ని ఉపసంహరించుకోమని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది.
భాద్రపద శుద్ధ చవితి నాడు శ్రీకృష్ణుడి ఆవు పాలను పితుకుతుండగా పాత్రలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందోనని చింతించాడు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత సత్రాజిత్తు అనే రాజు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు తనకు ఆ మణిని ఇవ్వమని సత్రాజిత్తును కోరాడు. దీనికి సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరచుకుని పోతూన్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు. శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. తనపై ఉన్న నిందను పోగొట్టుకోడానికి మణిని వెదుకుంటూ అడవులకు వెళ్లిన జాంబవంతుడితో యుద్ధం చేసి తిరిగి దానిని సత్రాజిత్తుకు అప్పగించాడు.
శాస్త్రీయ దృక్పథం ఇది.. సాధారణం వినాయక చవితిని చాంద్రమానంలోని ఆరో నెలలో జరుపుకుంటాం. అంటే ఆగస్టు లేదా సెప్టెంబరులో ఈ పండుగ వస్తుంది. అయితే భాద్రపద శుద్ధ చవితి ముందు రోజు, మర్నాడు కూడా చంద్రుని చూడరాదు. నాలుగో రోజైన చవితిని వృద్ది చెందుతున్న చంద్రకాలంగా పేర్కొంటారు. అదే సమయంలో సూర్యుడు, భూమి, చంద్రుడు వేర్వేరు కోణాల్లో ఉంటాయి. ఈ సమయంలో భూమిపై పడిన చంద్రకాంతి ప్రతికూల ప్రభావం చూపుతుంది. మానసిక ఆరోగ్యాన్ని సైతం ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ రోజున చంద్రుని చూడరాదని పురాతన భారతీయులు పేర్కొన్నారు. దీన్ని ఓ మూఢనమ్మకంగా కొందరు పేర్కొంటున్నా వెనుకున్న శాస్త్రీయ దృక్పథం మాత్రం ఇదే.
వినాయకుడి పుట్టిన రోజైన (Lord Ganesh Birthday) ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ (Vinayaka Chavithi) పండుగను హిందువులు జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని.. గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. వినాయక చవితి (Vinayakachavithi Pooja) రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికి వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి, దీపారాధన తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ పూజను ప్రారంభించాలి.
పీటపై వినాయక ప్రతిమను ఉంచి, పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు, పళ్లతో అలంకరించాలి. ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లెడుకాయలు మొదలైన పిండివంటలు సిద్దం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి, అందులో నీళ్లువేసి, పైన టెంకాయ, జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి.
వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి. తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పిచడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది.
దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్లింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు….ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీ దేవి, జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు…గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. అతడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బందిపడుతూ కైలాసం చేరుకున్నాడు.
శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని విఘ్ననాధుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి నిన్నుచూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది.
ఋషి పత్నులకు నీలాపనిందలు పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు, వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో ‘అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది. కావున శాపాన్ని ఉపసంహరించుకో’ అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. శమంతకోపాఖ్యానం ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక ‘స్వామీ! ఈ రోజు వినాయక చవితి. పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు. నేను వెళ్తాను’ అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరచుకుని పోతూన్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు.
శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషంవల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. శమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు. ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెదుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి, దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు.
ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో ‘మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి?’ అన్నారు. ‘భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు.ఈ కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి.
కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి… అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి.
తిరుమలకు వెళ్ళినప్పుడు చాలామంది తప్పకుండా దర్శించుకునే వినాయక దేవాలయం కాణిపాకం. ఈ వినాయకుడు రోజురోజుకి పెరిగి భగవంతుని మహిమ ఎటువంటిదో చూపిస్తున్నాడు. ఆ కాణిపాక వినాయకుని ఆలయచరిత్ర నిజానిజాలేంటో మీకు తెలుసా? తెలుసు కానీ అంత వివరంగా తెలీదు కదా. మరెందుకాలస్యం ఆ కాణిపాకం వినాయకుని గూర్చి వివరంగా తెలుసుకుందాం. హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుణ్ణి. వినాయకుణ్ణి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. వినాయకుడనగానే మనకెక్కువగా గుర్తుకొచ్చేది కాణిపాకం. వినాయకుడు వెలసిన పవిత్రమైన స్థలం. తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం వున్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి. ఇక్కడ వినాయకుణ్ణి ఎవరూ ప్రతిష్టించలేదు. తానే స్వయంగా వెలశాడు. అందుకే కాణిపాకం వినాయకుణ్ణి స్వయంభూ అంటారు.
ఆలయ చరిత్ర చిత్తూరు జిల్లాలో బాహుదా నదీ తీరంలో వెలసిన గణపయ్యకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. పూర్వం విహారపురి అనే ఊరిలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు. అందులో పెద్దవాడు గుడ్డివాడైతే, మిగతా ఇద్దరు మూగ, చెవిటివారిగా పుట్టారు. కొన్నాళ్లకు ఆ ఊరిని కరువు కమ్మేసింది. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలో ఈ సోదరులు పంటలు పండించుకునేందుకు తమ స్థలంలో ఒక బావిని తవ్వడం ప్రారంభించారు. కొంత లోతు తవ్విన తరువాత అక్కడ ఒక పెద్దరాయి అడ్డు వచ్చింది. దాన్ని పెకళించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో రాయికి పార తగిలింది. వెంటనే రాయి నుంచి రక్తం చిమ్మి ఆ సోదరుల మీద పడిందట. ఆ మరుక్షణమే వారి వైకల్యం పోయింది. ఈ విషయాన్ని వాళ్లు తమ ఊరి ప్రజలందరికీ చెప్పారు. పరుగు పరుగున గ్రామ ప్రజలు బావి వద్దకు వచ్చి చూడగా వినాయకుడి రూపం దర్శన మిచ్చిందట. వెంటనే ఆ స్వామికి ప్రజలంతా కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఆ కాయల నుంచి వచ్చిన నీరు ఎకరం(కాణి) దూరం పారిందట. అలా విహారపురికి కాణి పారకమ్ అని పేరు వచ్చింది. క్రమేణా అదే పేరు కాణిపాకంగా మారింది.
విగ్రహంలోనూ ఎదుగుదల బావిలో ఉద్భవించిన వినాయకుడి విగ్రహంలోనూ ఎదుగుదల ఉండడం విశేషం. చోళ రాజుల కాలంలో కాణిపాక ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కుళతుంగ చోళరాజు 11వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. 65 ఏళ్ల క్రితం బహుకరించిన వెండికవచం, 2000, 2002, 2006, 2007 సంవత్సరాల్లో భక్తులు ఇచ్చిన తొడుగులు స్వామికి ఇప్పుడు సరిపోక పోవడం విగ్రహం వృద్ధికి నిదర్శనంగా చెబుతారు. ఈ కవచాలను భక్తుల దర్శనార్థం ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించి ఉన్నారు.
సత్యప్రమాణాల దేవుడిగా.. వరసిద్ధి వినాయకుడు సత్యప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధికెక్కారు. స్వామి ఎదుట తప్పుడు ప్రమాణాలు చేస్తే శిక్షపడుతుందని భక్తుల విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు ఇక్కడ ప్రమాణం చేస్తే వాటికి దూరమవుతారని నమ్మకం. దీంతోపాటు రాజకీయ ప్రమాణాలు సైతం చేస్తుండడం విశేషం. అసెంబ్లీలో నాయకులు సైతం ఆరోపణలు వచ్చిన సమయంలో కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా? అంటూ సవాళ్లు విసురుకోవడం గమనార్హం. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాల్లో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం.”బ్రహ్మహత్యా పాతక నివృత్తి” కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధిచెందింది.
ఆలయంలో సర్పం ఈ ఆలయంలో ఎప్పుడు ఒక సర్పం తిరుగుతూ ఉంటుంది. అది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు ధాఖలాలు లేవు. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమ గలదని, ఆ పాము పడగఫై మణి కుడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు, భక్తులు చెప్పుతూ ఉంటారు.
శ్రీ వరదరాజస్వామి ఆలయం
శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం వుంది. పూర్వం జనమేజయుడు సర్ప యాగం చేసిన తర్వాత శ్రీ మహా విష్ణువు అతనికి కలలో కనపడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించమని అజ్ఞాపించడం చేత దీన్ని కట్టించాడని అంటారు. కాణిపాకంలో ప్రసిద్దమైన ఆంజనేయస్వామి గుడి కూడా వుంది. అద్దాల మేడ వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాల మండపం, అద్దాల మేడ కూడా ఉంది. కాణిపాకం మూడో వంతు వివిధ దేవాలయాలతో నిండి వుంది.
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య నిన్న(ఆగస్టు 25న) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. రిలీజ్‌కు ముందు చేసిన ప్రచార కార్యక్రమాలు, పాటలు, ట్రైలర్‌తో సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. అయితే అదేక్కడ సినిమాలో కనిపించలేదని అంటున్నారు ప్రేక్షకులు.
పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ‘లైగర్’ ఆగస్టు 25న విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్‌కు ముందు చేసిన ప్రచార కార్యక్రమాలు, పాటలు, ట్రైలర్‌తో సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. అయితే ఇదెక్కడా సినిమాలో కనిపించలేదని అంటున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాకు రూ.90కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మూవీ బడ్జెట్, హీరోహీరోయిన్లు, ఇతర నటుల రెమ్యునరేషన్ హాట్‌టాపిక్‌గా మారింది.
లైగర్‌ను భారీ తారాగణంతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. లీడ్ రోల్స్‌తో పాటు లైగర్‌లో ప్రధాన పాత్రలు పోషించిన సీనియర్ నటి రమ్యకృష్ణ, మైక్ టైసన్‌ల పారితోషికంపై కూడా ఆసక్తి నెలకొంది. జరుగుతున్న ప్రచారాన్ని బట్టి విజయ్ దేవరకొండ ఈ మూవీకి రూ. 35 కోట్ల పారితోషికం తీసుకున్నాడట. హీరో తల్లిగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన రమ్యకృష్ణ కోటి రూపాయలు తీసుకోగా.. కోచ్‌గా కనిపించిన రోనిత్ రాయ్ రూ. 1.5 కోట్లు తీసుకున్నాడట. ఇక హీరోయిన్‌గా అందాలు ఆరబోసిన అనన్య పాండే రూ.3 కోట్ల అందుకుందని సమాచారం. ఇక సినిమాకు హైలెట్‌గా నిలిచిన మైక్ టైసన్‌గా హీరో కంటే ఎక్కువగా రూ.40కోట్లు అందుకున్నాడట.
విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ ఆగస్ట్ 25న థియేటర్లలోకి రావడం ప్రేక్షకులని నిరాశపరచడం జరిగిపోయాయి. రిలీజ్‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్‌తో మొదటి రోజు బాగానే కలెక్ట్ చేసినప్పటికీ.. రెండో రోజు చాలా చోట్ల ఈ సినిమాకి సరిగా థియేటర్స్ ఫిల్ కాలేదు. దీంతో భారీ పరాజయం తప్పదు అనేలా అప్పుడే సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ టామ్ టామ్ చేస్తున్నారు. అయితే సినిమా విడుదలకు ముందు.. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన ఛార్మీ కౌర్ ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని వెల్లడించింది.
విజయ్, పూరీతో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘సినిమా నిర్మాణం సమయంలో మా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. ఒక్క రూపాయి కూడా లేదు. ఆ సమయంలో మాకు ఓటీటీ నుండి భారీ ఆఫర్ వచ్చింది. కానీ సినిమాపై ఉన్న నమ్మకంతో ఆ డీల్‌ని కాదనుకున్నాం. అందుకు పూరీగారికి ఎన్ని ఘట్స్ కావాలి’’ అంటూ చార్మీ విషయం రివీల్ చేసింది. ఈ విషయం చెబుతూ ఆమె కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఇప్పుడిదే విషయాన్ని హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమాకి ఓటీటీ డీల్ రూ. 200 కోట్లు (డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేసేందుకు) వచ్చిందట. దానిని వారు ఎందుకు కాదని అనుకున్నారో? ఇంతోటి సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముందో? అంటూ ఛార్మిని, పూరిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ కురిపిస్తున్నారు. ఇప్పుడున్న టాక్ ప్రకారం ఈ సినిమా రూ. 50 కోట్లు వసూలు చేయడం కూడా కష్టమే అన్నట్లుగా పరిస్థితులు మారాయి. అలాగే, ఇప్పుడు ఓటీటీ డీల్ కూడా చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంది. సో.. చేజేతులా రూ. 200 కోట్లు హుష్ కాకి అనేలా.. సినిమాపై ఉన్న ‘నమ్మకం’తో పూరి, ఛార్మీ అండ్ టీమ్ పోగోట్టుకున్నట్లేనంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.