Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిథిని రాఖీ పూర్ణిమ (Rakhi pournami 2022) అంటారు. ఇది శ్రావణ మాసంలో వస్తుంది కాబట్టి దీన్ని శ్రావణ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం శ్రావణ పూర్ణిమ ఆగస్టు 11, అంటే గురువారం నాడు రక్షాబంధన్ పండుగను జరుపుకుంటున్నారు. శ్రావణ పూర్ణిమ రోజున ఆయుష్మాన్ యోగం, సౌభాగ్య యోగం అనే రెండు శుభ యోగాలు ఉంటాయి. అయితే ఈ రోజున భద్ర పూర్ణిమ తిథితో పాటు భద్ర కూడా జరుగుతోంది. శ్రావణ పూర్ణిమ తిథి, యోగ ,శ్రావణ పండుగ గురించి తెలుసుకుందాం.
శ్రావణ పూర్ణిమ తిథి ఆగస్టు 11వ తేదీ ఉదయం 10:38 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ ఆగష్టు 12వ తేదీ మరుసటి రోజు ఉదయం 07:05 వరకు చెల్లుతుంది. ఆగస్టు 12న సూర్యోదయానికి ముందే పౌర్ణమి తిథి ముగుస్తుంది కాబట్టి రాఖీ పూర్ణిమను ఆగష్టు 11నే జరుపుకుంటున్నారు. శ్రావణ పూర్ణిమ రోజున ఆయుష్మాన్ , సౌభాగ్య యోగాల అందమైన కలయిక ఏర్పడుతుంది. ఈ రోజు ఉదయం నుండి మధ్యాహ్నం 03.32 వరకు ఆయుష్మాన్ యోగం ఉంది. ఆ తర్వాత సౌభాగ్య యోగం ప్రారంభమవుతుంది. సౌభాగ్య యోగం మధ్యాహ్నం 03.32 నుండి మరుసటి రోజు ఉదయం 11.34 వరకు.
శ్రావణ పూర్ణిమ నాడు సాయంత్రం 08:51భద్ర సమయం ముగుస్తుంది. ఈ సమయంలో రక్షాబంధన్ పండుగను జరుపుకోకూడదు. ఆ ఘడియలు ముగిసిన తర్వాత మాత్రమే రాఖీ కట్టండి. సాయంత్రం సౌభాగ్య యోగంలో రాఖీ కట్టండి. అంటే ఆగస్టు 11వ తేదీ రాత్రి 08: 51 గంటల నుంచి ఆగస్టు 12 ఉదయం 7: 05 వరకు కట్టొచ్చు. కొన్ని నిబంధనల మినహా సాయంత్రం 06:08 నుండి 08:00 గంటల మధ్య సోదరులకు రాఖీ కట్టవచ్చని పండితులు చెబుతున్నారు.
భద్ర కాలంలో రాఖీ కట్టిన శూర్పణఖ.. లంక నాశనం
రావణుడి సామ్రాజ్యం అంతం కావడానికి కూడా ఈ భద్ర కాలమే కారణమని చెబుతారు. రక్షాబంధన్ సందర్భంగా భద్ర కాలంలో లంకేశుడికి తన సోదరి శూర్పణఖ రాఖీ కట్టింది. ఆ తరువాత లంక చెడు దశ ప్రారంభమైంది. రావణుడిరి దురదృష్టం మొదలైందని చెబుతారు.
ఏ ఆలయంలో అయినా దేవుడికి రకరకాల తినుబండారాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకు భిన్నంగా ఓ ఆలయంలో డబ్బు, బంగారం, విలువైన రాళ్ల నగల్ని అమ్మవారికి నివేదిస్తారు భక్తులు. పండుగలూ ప్రత్యేక సందర్భాల్లో వాటినే ప్రసాదంగానూ పంచుతారు. మధ్యప్రదేశ్‌లోని రాత్లాంలో ఏకంగా వజ్ర వైఢూర్యాలతో పూజలందుకుంటోంది మహాలక్ష్మి అమ్మవారు. వందల ఏళ్లక్రితం నిర్మించిన ఆలయమిది. అప్పట్లో రాజులు తాము సంపాదించుకున్న సంపదను ఈ అమ్మవారికి నివేదించేవారట. అలా చేయడం వల్ల ఆ ధనం రెట్టింపవుతుందని వారు నమ్మేవారట. అందుకే అప్పటి నుంచి అక్కడ భక్తులు అమ్మవారికి పాయసం, చక్రపొంగలి, రవ్వకేసరి, పులిహోర వంటి వాటికి బదులుగా డబ్బునీ, బంగారాన్నీ నైవేద్యంగా సమర్పిస్తున్నారట.
భక్తులకు నిత్యం దర్శనమిస్తూ, ఏడాది పొడవునా పూజలందుకునే రాత్లాం మహాలక్ష్మి అమ్మవారికి భక్తులు మొక్కుల కింద కోట్లాది రూపాయల నగదు, బంగారం- వెండి నాణేలు, నగలు సమర్పించుకుంటారు. అందుకే ఆ దేవాలయం కుబేరనిధిగానూ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పండుగలూ, ప్రత్యేక దినాలూ, దీపావళి సమయంలో అమ్మవారినీ, ప్రాంగణాన్నీ పూలతో కాకుండా డబ్బు, బంగారు ఆభరణాలు, వజ్రవైఢూర్యాలతో అలంకరిస్తారు. అందుకోసం అమ్మవారికి కానుకలుగా అందినవాటితో పాటు భక్తుల వద్ద నుంచి కూడా డబ్బూ, నగలూ స్వీకరిస్తారు. ఆ సమయంలో ఆలయం ట్రస్టు సభ్యులు డబ్బూ, నగలూ ఇచ్చిన వారి వివరాలను నమోదు చేసుకుని ఎంత ఇచ్చారో రాసి వారి చేత సంతకం పెట్టించుకుని టోకెన్ ఇస్తారు. ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలన్నీ అయ్యాక టోకెన్ల ఆధారంగా ఎవరివి వారికి అందజేస్తారు.
దీపావళి, ధనత్రయోదశి సమయంలో అమ్మవారికి డబ్బూ, బంగారం సమర్పించిన భక్తులు అక్కడికి దర్శనానికి వచ్చిన వారికి బంగారం, వెండి నాణేలను ప్రసాదంగా పంచుతుంటారు. అలా పంచడం వల్ల తాము కూడా సిరి సంపదలతో వర్థిల్లుతామని నమ్ముతుంటారు. అందుకే అక్కడ బంగారు నాణేలు గ్రాము కంటే తక్కువ బరువులో వివిధ పరిమాణాల్లో దొరుకుతాయి. ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు వాటిని కొనుగోలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తరవాత పంచుతారన్నమాట.
ఎలా చేరుకోవాలంటే..
విమానంలో వెళ్లాలనుకునేవారు ఇండోర్ ఎయిర్‌పోర్టులో దిగాలి. అక్కడికి 102 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాత్లాం వరకూ బస్సులో వెళ్లాలి. బస్టాండ్ నుంచి స్థానిక వాహనాల్లో ఆలయాన్ని చేరుకోవచ్చు. రైలు మార్గంలో వెళ్లేవారు ఉజ్జయిని స్టేషన్లో దిగాలి. అక్కడి నుంచి ఆలయానికి బస్సు లేదా ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సి ఉంటుంది.
భారతదేశం ఐటీ(Information Technology) రంగంలో బాగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే అగ్రగామిగా వెలుగొందున్న ఐటీ కంపెనీల్లో చాలావాటికి భారతీయులే సీఈవోలుగా ఉండటం గర్వపడే విషయం. బెంగళూరు, పుణె, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలు ఐటీ రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్నాయి. ఏటా కొన్ని లక్షల మంది యువత ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని ఉద్యోగ వేటలో పడుతున్నారు. ఈ రంగంలో ఉద్యోగావకాశాలు మెరుగ్గానే ఉన్నా సరైన నైపుణ్యం లేని కారణంగా చాలామంది ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. ఇలాంటి వారికి ట్రైనింగ్ ఇచ్చేందుకు ఎన్నో సంస్థలున్నాయి. అయితే వాటిలో అన్నింటికంటే ఉత్తమమైనది Eazygurus. చాలా శిక్షణా సంస్థలు ట్రైనింగ్ పూర్తిచేసేసి సర్టిఫికెట్ ఇచ్చి చేతులు దులుపుకుంటుంటాయి. అయితే Eazygurus అలాంటి సంస్థ కాదు. సిలబస్‌ను బోధించడంతో పాటు క్లయింట్‌కు ఏం కావాలి.. అభ్యర్థి నుంచి వారు ఏం ఆశిస్తున్నారు అన్నవాటిని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా శిక్షణ ఇస్తుంది.
Eazygurus వ్యక్తులు, చిన్న సంస్థలు, కార్పోరేట్, ప్రభుత్వ సంస్థలో పాటు విద్యా సంస్థలకు సైతం సాంకేతిక విద్య అభ్యాసం మరియు శిక్షణతో కూడిన పరిష్కారాలు అందిస్తుంది. ఐటీ రంగంలో శిక్షణతో పాటు సమస్యల పరిష్కారానికి Eazygurus మీకు కచ్చితమైన సేవలు అందిస్తుంది. ఐటీ రంగంలో పెరుగుదల కోసం అవసరమైన పునాది, బలమైన నైపుణ్యాన్ని అందిస్తుంది. Eazygurusలో రెండు దశాబ్దాల అనుభవం కలిగిన నిష్ఠాతులైన అధ్యాపక బృందం ఉంది. వీరంతా బిగ్‌డేటా అనలిటిక్స్, ఐఓటీ, ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ రోబోటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, క్వాలిటీ మేనేజ్‌మెంట్‌తో పాటు AWS, DevOps, బిగ్‌డేటా/ హడూప్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (RPA), PMP, PRINCE2, LSSGB, ITIL, Cassandra, MongoDB, R తో డేటా సైన్స్, పైథాన్‌తో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ISMS, 5S కోర్సులను పూర్తి నైపుణ్యంలో శిక్షణ ఇవ్వగలరు. అభ్యర్థులకు మెరుగైన శిక్షణ అందించడం, అదే సమయంలో కంపెనీలు ఆశించే నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దడం ఇదే Eazygurus లక్ష్యం.
☞ Eazygurus అందించే కోర్సులివే
Artificial Intelligence Robotics Cyber Security Service Now Work Day Sales Force Mule Soft Snowflake Flutter/Unity Blockchain
Eazygurus సంస్థకు ఇండియాతో పాటు అమెరికాలోనూ బ్రాంచులున్నాయి. మరింత సమాచారం కోసం info@eazygurus.comకి మెయిల్ చేయండి లేదా… www.eazygurus.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.
‘మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం.. అలాగే మంచి స్నేహితుడు లైబ్రరీతో సమానం’ అని పెద్దలు చెబుతారు.. “నీ శత్రువును మిత్రుడిగా మార్చేందుకు వేయి అవకాశాలు ఇవ్వు.. కానీ స్నేహితుడిని శత్రువుగా మార్చేందుకు ఒక్క అవకాశం కుడా ఇవ్వకు, “మంచి స్నేహితుడు అద్దంలాంటి వాడు, అద్దం ఉన్నది ఉన్నట్టుగా చూపినట్లే, మంచి స్నేహితుడు మనం చేసిన తప్పు ఒప్పులను, ఉన్నది ఉన్నట్టుగా ముఖం పైనే చెపుతాడు.” ఇలా ఎన్నో సామేతాలు స్నేహం గొప్పతనాన్ని చాటిచెబుతుంటాయి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, బంధువులను దేవుడు నిర్ణయిస్తాడు.. కానీ స్నేహితులని మాత్రం మనమే ఎంపిక చేసుకుంటాం.. అందుకే జీవితంలో ఒక్క మంచి స్నేహితుడు ఉన్నా చాలంటారు. మన పురాణాల్లో శ్రీకృష్ణుడు – కుచేలుడు, దుర్యోధనుడు – కర్ణుడు స్నేహానికి ప్రతీకగా నిలిచారు. నేడు ప్రజలందరూ స్నేహితుల దినోత్సవం(ఆగస్టు నెల తొలి ఆదివారం) జరుపుకుంటున్నారు.. అసలు స్నేహితుల దినోత్సవం ఎందుకు..? ఎక్కడ..? ఎలా? పుట్టింది..? ఏ ఏ దేశంలో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసుకుందాం..
సాధారణంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ఏటా ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు… స్నేహం విలువతెలిపే కార్డులు, బ్యాండ్లు వంటి ఫ్రెండ్షిప్ డే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.. అయితే, 1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది. అప్పటి నుండి జాతీయ స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలు స్నేహితులకు ఒక రోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని స్వీకరించాయి.
నిజానికి స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం 1930లో ఫక్తు మార్కెట్ వ్యూహాలతో మొదలైంది. 1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది. అంతే కాదు హాల్‌మార్క్ గ్రీటింగ్ కార్డుల వ్యవస్థాపకుడు జోయస్ హాల్ ఏటా ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించారు. అప్పటి నుండి జాతీయ స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారింది. అందుకు తగ్గట్లు కొన్ని గ్రీటింగ్ కార్డులు మార్కెట్లోకి పంపారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా దేశాలు స్నేహితులకు ఒక రోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇక, 1997 లో యునైటెడ్ నేషన్స్ “స్నేహం” యొక్క ప్రపంచ అంబాసిడర్ “విన్నీ ది పూ”. నేడు స్నేహితుల దినోత్సవాన్ని అనేక దేశాలు ఉత్సాహవంతంగా జరుపుకుంటున్నాయి. మరోవైపు, వరల్డ్ ఫ్రెండ్‌షిప్ క్రూసేడ్ అనే సంస్థ 1958లో పరాగ్వేలో జూలై 30న ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించింది. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు దానిని పాటించడం మొదలుపెట్టాయి. 2011లో ఐక్యరాజ్యసమితి కూడా ఈ రోజును అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. మరోవైపు, అర్జెంటీనా, బ్రెజిల్, ఈక్వెడార్, ఉరుగ్వేల్లో జూలై 20వ తేదీన నిర్వహిస్తుండగా.. భారత్, మలేసియా, బంగ్లాదేశ్, కొన్ని అరబ్ దేశాలు అయితే, ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటున్నాయి..
ఈ సృష్టిలో.. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న లాంటి బంధాలను ఒక మనిషి సృష్టించుకోలేడు.. కానీ, తనస్నేహితులను మాత్రం తనే ఎంచుకుంటాడు.. ఆస్తి, అంతస్తు, కులంతో సంబంధం లేకుండా పుట్టేదే స్నేహం. స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. తప్పు చేసినప్పుడు మందిలించడమే కాకుండా ఆపదలో రక్షిస్తూ వారికి దారి చూపే వాడే నిజమైన స్నేహితుడు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహమే అంటే అతిశయోక్తి కాదు. స్నేహితులు అనే వారు ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకుని ఎలాంటి సందేహాలు లేకుండా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు.
కొన్ని సందర్భాల్లో కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని కొన్ని విషయాలను, సమస్యలను ఆత్మీయ స్నేహితులతో మోహమాటం లేకుండా షేర్ చేసుకుంటారు. అలాంటి స్నేహాన్ని ఒక్కరోజుకే పరిమితం చేయకూడదు.. కానీ, ఇలాంటి రోజులు.. వారిలో మరింత ఉత్సాహాన్నే నింపుతాయి.. సెలబ్రేట్ చేసుకోవడానికి మరో రోజును అదనంగా ఇస్తాయనే చెప్పుకోవాలి.
కమ్మనైన పదం స్నేహం
స్నేహం అనేది ఇద్దరు పరిచయస్తుల మధ్య మాత్రమే ఉండే బంధం కాదు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు…. ప్రతీ వ్యక్తిలో ఉండాల్సిన ముఖ్యమైన భావన. స్నేహం అనేది ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య పొరపచ్చాలు తగ్గి ఒకరినొకరు అర్ధం చేసుకుని మసులుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. దీనివల్ల సమస్యలు తీవ్ర రూపం దాల్చకముందే పరిష్కారమవుతాయి. స్నేహంగా ఉన్నప్పుడు అనుమానం, కోపం, ద్వేషం కూడా దరిదాపులకు రావడానికి జంకుతాయి. కాని ఒక్కోసారి స్నేహం కూడా దుర్వినియోగం అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అందరినీ స్నేహితులని నమ్మి మోసపోవడం కంటే ముందే జాగ్రత్త పడడం మంచిది. ఎదుటి వాడిలోని కోపాన్ని, లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు అంటారు. స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు నిస్సంకోచంగా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు.
కోడి రామకృష్ణ.. తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవసరం లేని పేరు. వంద సినిమాలు తీసిన అతి కొద్దిమంది తెలుగు దర్శకుల్లో ఆయనొకరు. సమాజంలో ప్రతి కోణాన్ని స్పృశించి సినిమా తీసి విజయం సాధించారాయన. కేవలం తెలుగే కాక తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలకూ సైతం దర్శకత్వం వహించారు. ఆయన చివరి చిత్రం ‘నాగాభరణం’ 2016లో విడుదలైంది. ఆయన తీసిన సినిమాలే కాకుండా, ఆహార్యం కూడా ప్రేక్షకులను, అభిమానులను మెప్పించేది. మణికట్టు నిండా రక్షా తాళ్లు, వేళ్లకు ఉంగరాలతో పాటు, ఆయన నుదుటికి ఒక కట్టు కట్టేవారు. ఎక్కువగా తెల్లకట్టుతోనే ఆయన బయట ఫంక్షన్లు, షూటింగ్‌లలో కనిపించేవారు. అయితే దాని వెనుక ఉన్న రహస్యాన్ని ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో పంచుకున్నారు.
ఆయన రెండో చిత్రం ‘తరంగిణి’(1992) షూటింగ్‌లో ఉండగా సీనియర్ ఎన్టీయార్ మేకప్‌మేన్ మోకా రామారావు మీ ‘నుదురు భాగం పెద్దగా ఉంది. ఎండ తాకకుండా నుదుటికి కట్టు కట్టండి’ అని ఆయనే ఒక తెల్ల కర్చీఫ్ ఒకటి కట్టారట. ఆ రోజంతా కోడి రామకృష్ణ షూటింగ్‌లో ఉత్సాహంగా పని చేశారట. ఆ మరుసటి రోజు కూడా బ్యాండ్ ఒకటి ప్రత్యేకంగా తయారుచేయించి ధరించారట. అది ధరించి ఉన్న సమయంలో ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లు గమనించిన ఆయన దానిని సెంటిమెంట్‌గా కొనసాగించారట.
ఒకసారి దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ కూడా ‘ఇది మీకు ప్రత్యేక గుర్తింపునిస్తుంది. మీ పూర్వ జన్మ బంధానికి సంకేతం. ఎప్పుడూ తీయకండి’ అని కోడి రామకృష్ణకి సలహా ఇచ్చారట. ఎప్పుడైనా కథ విషయంలో సందిగ్ధం ఏర్పడినపుడు, సమస్యలు వచ్చినపుడు నుదుటికి కట్టు కడితే వెంటనే పరిష్కారం దొరికేదని సన్నిహితులతో కోడి రామకృష్ణ అనేవారట. ఆయన సెంటిమెంటు ఎలా ఉన్న ఆ తల‘కట్టు’ మాత్రం ఆయన ఆహార్యానికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. ఎక్కువగా ఆధ్యాత్మిక భావనలతో ఉండే కోడి రామకృష్ణ అమ్మోరు(1995), దేవి(1999), దేవుళ్లు(2000)లాంటి సినిమాలతోనూ విజయాలను సాధించారు. సీనియర దర్శకుడిగా ‘అరుంధతి’తో ఆయన బ్లాక్‌బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే.
తిరుచానూరు పుణ్యక్షేత్రం తిరుపతి జిల్లా(ఉమ్మడి చిత్తూరు) తిరుపతి పట్టణం సమీపంలో ఉంది. దీన్ని అలమేలు మంగాపురమని కూడా పిలుస్తారు. ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీదేవి అవతారమైన అలమేలు మంగ ఆలయం ప్రసిద్ధి చెందింది.
పురాణ గాథ..
త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడు. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళింది. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం, ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పెండ్లాడాడు.
అలమేలు మంగ ఆలయ సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజ, రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న మరి కొన్ని సన్నిధులు… శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సూర్యనారాయణ స్వామి. చారిత్రిక ఆధారాల ప్రకారం పల్లవ రాజుల కాలంలో ఇది “తిరువెంగడ కూటం”గా ఉంది. ఇంతకు ముందు కాలంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఒకటుండేది. తరువాత ఆ విగ్రహాలను వేరే చోటికి తరలించారు.
తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ యాత్రకు ఫలం లభించదని ప్రతీతి. పదివేల జనాభా మాత్రమే ఉన్న తిరుచానూరులో 50కి పైగా కళ్యాణ మంటపాలున్నాయి. ఏటా వెయ్యికి పైగా వివాహాలు జరుగుతాయి. అమ్మవారి ఆలయంలో ప్రతిదినం ఉదయం సుప్రభాత సేవ జరుగుతుంది. తరువాత సహస్ర నామార్చన, కళ్యాణోత్సవము, ఊంజల్ సేవ ఉంటాయి. రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేస్తారు.
ప్రతి సోమవారం “అష్టదళ పదపద్మారాధన” జరుగుతుంది. శుక్రవారం అభిషేకం జరుగుతుంది. గురువారం తిరుప్పావడ సేవ ఉంటుంది. శ్రావణ మాసంలోను, మరి కొన్ని దినాలలోను లక్ష్మీపూజ జరుగుతుంది. ఇక్కడ ప్రసాదంతో పాటు ఇచ్చే పసుపు కుంకుమలను భక్తులు అతి పవిత్రమైనవిగా స్వీకరిస్తారు. కార్తీక బ్రహ్మోత్సవాలు ఇక్కడి ముఖ్యమైన ఉత్సవం. అమ్మవారి అవతరణ దినమైన కార్తీక శుద్ధ పంచమి నాడు తిరుమల నుండి గజవాహనంపై వచ్చే చక్రత్తాళ్వార్‌తో అమ్మవారు స్నానమాచరించడం సంప్రదాయం. ఆ సుముహూర్తంలో లక్షలాది జన సందోహం భక్తితో పుష్కరిణిలో స్నానమాచరిస్తారు.
ఆనాడు ఆది శంకరాచార్యులు అమ్మవారికి అలంకరించినట్లు చెప్పబడే మంగళ సూత్రాలను దర్శిస్తారు. దసరాకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా తెప్పోత్సవం, వసంతోత్సవం, రథ సప్తమి ముఖ్యమైన ఉత్సవాలు. సుందరరాజ స్వామి గుడిలో మూడు రోజుల పాటు అవతారోత్సవం జరుగుతుంది. అమ్మవారి ఆలయం వెనకాల ఉన్న కోనేరు, శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం, పద్మావతి గార్డెన్, శ్రీరామ ఆలయం, రామకృష్ణ తీర్థం, గోవిందరాజ స్వామి ఆలయం, శేష తీర్థం, ఆంజనేయస్వామి ఆలయం మొదలగునవి చూడదగ్గవి.
సందర్శించు వేళలు : ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు
అలమేలు మంగాపురం ఎలా చేరుకోవాలి ?
తిరుపతి బస్టాండ్ నుంచి తిరుచానూరు ఆలయానికి లోకల్ బస్సులు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, జీపులు రెగ్యులర్‌గా తిరుగుతుంటాయి. లోకల్ గా తిరిగే షేర్ ఆటోల్లో ఎక్కి ఆలయానికి చేరుకోవచ్చు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి, రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుంచి డైరెక్ట్‌గా క్యాబ్ లేదా టాక్సీ మాట్లాడుకొని కూడా అలమేలు మంగాపురం చేరుకోవచ్చు.
సప్త మోక్ష క్షేత్రాలలో ఒకటైన కాశీ నగరంలో పవిత్ర గంగానదీ తీరంలో వెలసిన జ్యోతిర్లింగం కాశీవిశ్వేశ్వరుడు. వరణ, అసి అనే రెండు నదుల మధ్య ఉన్న నగరం కాబట్టే దీనికి వారణాశి అనే పేరొచ్చింది. ప్రపంచంలో అందరూ బ్రతకడం కోసం ఎన్నో కష్టాలు పడుతుంటే, చాలామంది హిందువులు మాత్రం ఈ వారణాశిలో మరణించి మోక్షాన్ని పొందాలని తాప్రతాయిపడుతుంటారు. కాశీలో మరణించిన వారు సరాసరి ఈశ్వర సాన్నిధ్యాన్ని చేరుకొంటారని ప్రతీతి.
పురాణ గాథ కాశీ క్షేత్రానికి వారణాసి, మహాస్మశానం, ఆనందకాననం, రుద్రవాసం, ముక్తిభూమి, శివపురి మొదలైన పేర్లు చాలా ఉన్నాయి. వేదాలలో,పురాణాలలో కాశీక్షేత్రం మహిమ గురించి వివరించారు. సనాతనమైనటువంటి బ్రహ్మ సృష్టి మొదట్లో నిర్గుణం నుంచి సగుణమైన శివరూపాన్ని చేశాడు. తిరిగి ఆ శివశక్తితో స్త్రీ ,పురుష భేధంతో ప్రకృతి, పురుషులని సృష్టించాడు. వారిరువురిని ఉత్తమసృష్టి సాధనకై తపస్సు చేయమని ఆనతినిచ్చాడు. తపస్సు కోసం అనువైన స్థలం చెప్పమని వారు బ్రహ్మను ప్రార్ధించగా ఆయన శివుడు నించున్నచోటు నుండి ఎటుచూసినా అయిదు క్రోసుల దూరం ఉండేట్టు భూమిని సృష్టించి అత్యంత శోభాయమానమైన పంచకాశీ నగరాన్ని నిర్మించాడు.
అక్కడ ప్రకృతి, పురుషులు తపస్సు చేశారు. ఈ చోటనే విష్ణువు శివుని కోసం తపస్సు చేశాడు. ఆ తపము ఫలించి అక్కడ అనేక జలధారలు ప్రవహించాయి. ఆదృశ్యాన్ని చూసి విష్ణువు తలాడించగా, ఆయన చెవి నుండి ఒక మణి క్రిందపడింది. ఆ స్థానం మణికర్ణిగా గా పేరుగాంచింది. మహేశ్వరుడు ఈ కాశీ నగరమందు జ్యోతిర్లింగరూపంలో విశ్వేశ్వరుడు నామధేయుడై అవతరించాడు. ప్రళయకాలమందున ప్రపంచమంతా మునిగిపోయినా ఈ కాశీపట్టణంను మాత్రం పరమేశ్వరుడు తన త్రిశూలంతో పైకెత్తి పట్టుకొని రక్షించాడు. ఈ విధంగా కాశి అవినాశి అయ్యింది. ఈ కాశి నగరాన్ని దండపాణి, కాలబైరవుడు సంరక్షకులుగా కాపాడుతుంటారు. ఇక్కడ గంగానదిలో 84 ఘాట్ లున్నాయి. ఎన్నో తీర్ధకుండాలున్నాయి.
విశ్వేశ్వరుని మందిరం చుట్టుప్రక్కల వందలాది శివలింగాలు, ఆలయాలు, ఆలయం వెలుపుల విశాలాక్షి అమ్మవారి మందిరం, కాశీ అన్నపూర్ణేశ్వరి మాత మందిరం, వారాహి మాత మందిరం ఉన్నాయి. ఒకటేమిటి కాశీక్షేత్రమంతా పరమేశ్వరుని దివ్యధామం. ఉదయం గంగాస్నానాంతరం కేధార్ ఘాట్ లో పెద్దలకు నివాళి, కేధార్నాధుని మందిరంలో స్వామిని దర్శించడం, మిట్ట మధ్యాహ్నం సమంత్రయుక్తంగా మణికర్ణికఘాట్ లో స్నానం, తదుపరి కాశీ విశ్వేరుని, అమ్మవార్లను దర్శించడం, సాయంత్రం దశాశ్వమేధఘాట్ లో గంగాహరతిని చూడటం అనీర్వచనీయమైన దివ్యానుభూతి.
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతా రామం’. ‘వైజయంతి మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన, దర్శకుడు తరుణ్ భాస్కర్, సుమంత్, గౌతమ్ మీనన్, భూమిక తదితరులు కీలక పాత్రల్లో పోషించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. శుక్రవారం(ఆగస్టు 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో తొలిరోజు ఫర్వాలేదనింపిచే స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. టాక్‌కు తగ్గ కలెక్షన్లు అయితే కాదని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
‘సీతారామం’ ఫస్ట్ డే కలెక్షన్లు ఏరియాల వారీగా…
నైజాం – రూ. 54 లక్షలు
సీడెడ్ – రూ. 16 లక్షలు
ఉత్తరాంధ్ర – రూ. 23 లక్షలు
ఈస్ట్ – రూ. 15 లక్షలు
వెస్ట్ – రూ. 8 లక్షలు
గుంటూరు – రూ. 15 లక్షలు
కృష్ణ – రూ. 13 లక్షలు
నెల్లూరు – రూ. 5 లక్షలు
‘సీతారామం’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.16.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.17 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం రూ.3.2 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు రూ. 13.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే సీతారామం చిత్రానికి రూ. 3.05 కోట్లు వసూళ్లు వచ్చాయి. గ్రాస్ వసూళ్లు ప్రకారం చూస్తే రూ. 5.60 కోట్లు అని సినీ వర్గాలంటున్నాయి. అయితే శని, ఆదివారాల్లో కలెక్షన్లను బట్టి సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.
నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం ‘బింబిసార’. సోసియో ఫాంటసీ, టైం ట్రావెల్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. సంయుక్త మీనన్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ తెరకెక్కించాడు. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ తన బావమరిది హరికృష్ణతో కలిసి ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ అయిన ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ పై నిర్మించాడు. టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని చూడాలనే ఆసక్తిని కలిగించాయి. అందుకు తగ్గట్టే శుక్రవారం(ఆగస్టు 5న) విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే…
ఏరియాల వారీగా ‘బింబిసార’కు వచ్చిన వసూళ్లు
నైజాం – రూ. 2.15 కోట్లు
సీడెడ్ – రూ. 1.29 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 90 లక్షలు
ఈస్ట్ – రూ. 43 లక్షలు
వెస్ట్ – రూ. 36 లక్షలు
గుంటూరు – రూ. 57 లక్షలు
కృష్ణా – రూ. 34 లక్షలు
నెల్లూరు – రూ. 26 లక్షలు
‘బింబిసార’కు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 6.3 కోట్లు రూపాయలు వచ్చాయి. అమెరికాలో రూ. 48 లక్షలు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 40 లక్షలు షేర్ వసూళ్లు వచ్చాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.08 కోట్లు షేర్ కలెక్షన్లు వచ్చాయి. గ్రాస్ వసూళ్ల ప్రకారం రూ. 11.5 కోట్లు వచ్చాయి. ‘బింబిసార’ సినిమాకు రూ. 16.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే సినిమాకు రూ. 17 కోట్లు రావాలి. తొలిరోజునే సినిమాకు రూ. 7.08 కోట్లు షేర్ రావటంపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు.
జయాపజయాలను పట్టించుకోకుండా కొత్త కథల్ని భుజానికెత్తుకుంటూ.. కొత్త దర్శకులకు అవకాశాలిస్తూ సినీ కెరీర్‌ను వైవిధ్యభరితంగా ముందుకు తీసుకెళ్తున్నారు కథానాయకుడు కల్యాణ్ రామ్. ఈ క్రమంలోనే ఇప్పుడాయన ‘బింబిసార’గా ప్రేక్షకుల్ని పలకరించారు. కొత్త దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన చిత్రమిది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే సోషియో ఫాంటసీ సినిమా కావడం.. ఇందుకు తగ్గట్లుగానే ప్రచార చిత్రాలు చక్కటి గ్రాఫిక్స్ హంగులతో ఆసక్తిరేకెత్తించేలా ఉండటంతో అందరి దృష్టి దీనిపై పడింది. మరి ఈ బింబిసారుడి కథేంటి? ఆయన చేసిన కాల ప్రయాణం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించింది?.. తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్దాం…
కథ త్రిగర్తల సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపతిగా పాలిస్తుంటాడు బింబిసారుడు (కల్యాణ్ రామ్). అహం, తనను ఎవరు ఎదిరించలేరనే పొగరుతో, పాలించే ప్రజలను, చిన్న పిల్లలను సైతం చూడకుండా అతి కిరాతకంగా చంపే కర్కోటకుడిగా రాజ్యాన్ని ఏలుతుంటాడు. ఈ క్రమంలోనే ఒక మాయ దర్పణం ద్వారా భూలోకానికి వస్తాడు. భూలోకంలో అతనికి వారసులు ఉన్నారని, అతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని తెలిసిన బింబిసారుడు ఏం చేశాడు? అతి క్రూరుడైన రాజు రాజు బింబిసారుడు.. తన ప్రజల కోసం ప్రాణాలిచ్చే నిజమైన చక్రవర్తిగా, ఒక మానవత్వం గల మనిషిగా ఎలా మారాడు? టైమ్ ట్రావెల్ చేసేందుకు వీలుగా ఉన్న మాయ దర్పణం ఎలా వచ్చింది? బింబిసారుడు దాచిన నిధి తలపులు తెరవడానికి ప్రయత్నిస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రి (వివాన్ భటేనా) ఎవరు? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ‘బింబిసార’ సినిమాను కచ్చితంగా చూడాల్సిందే.
క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు బింబిసారుడు. నిజానికి ఇతను హర్యాంక రాజవంశానికి చెందినవాడు. అయితే ఈ బింబిసారుడు అనే పాత్రను తీసుకుని పూర్తి కల్పిత కథతో ‘బింబిసార’ను తెరకెక్కించారు డైరెక్టర్ వశిష్ఠ. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనే ఒక్క క్యాప్షన్‌తో సినిమా కథను చెప్పేశారు. చరిత్రలో బింబిసారుడు ఎలా ఉన్న ఈ సినిమాలో మాత్రం అత్యంత క్రూరుడిగా, మద గజ మహారాజుగా చిత్రీకరించారు. రాజ్యాన్ని తాను ఒక్కడే పాలించాలనే కోరికతో సొంత తమ్మున్ని సైతం చంపించే అన్నగా బింబిసారుడి పాత్రను ఆవిష్కరించారు.
నటీనటుల విషయానికి వస్తే.. అతనొక్కడే, త్రీడీ మూవీగా తెరకెక్కిన ఓం వంటి సినిమాలను గమనిస్తే హీరోగా, నిర్మాతగా చేసిన కళ్యాణ్ రామ్ స్టైల్‌ను ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయన కొత్తదనానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అర్థం చేసుకోవచ్చు. అదే ప్యాషన్‌తో బింబిసార సినిమాలో యాక్ట్ చేశారు. ఇప్పటివరకు ఆయన రాజ్యాన్ని పాలించిన చక్రవర్తి పాత్రను పోషించలేదు. కానీ ఏదో ఒక వెరైటీని అందించాలనే లక్ష్యంతో డిఫరెంట్ లుక్, బాడీ లాంగ్వేజ్‌ను ఆపాదించుకుని బింబిసారుడు అనే పాత్రను క్యారీ చేశాడు. ఆ పాత్ర కోసం తను ఎంత కష్టపడ్డాడనేది సినిమాలో తెరపై కనిపిస్తుంది. లుక్‌తో పాటు డైలాగ్ డెలివరీని ఆయన చేంజ్ చేసుకున్నారు. అంతే కాదండోయ్ నెగిటివ్ టచ్‌లో సాగే పాత్ర అనే చెప్పాలి. ఈ పాత్రలో విలనిజాన్ని చూపించడానికి వంద శాతం ట్రై చేశారు. అందులో సక్సెస్ అయ్యారు.
మెయిన్ విలన్‌గా నటించిన వివాన్ తన పరిధి మేరకు చక్కగా నటించారు. హీరోయిన్స్‌గా నటించిన క్యాథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ పాత్రలు పరిమితంగానే ఉన్నాయి. జుబేదా పాత్రలో శ్రీనివాస రెడ్డి కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే చమ్మక్ చంద్ర పాత్ర చిన్నదే అయినా నవ్వించారు. ప్రకాష్ రాజ్, రాజీవ్ కనకాల తదితరులు పాత్రల పరిధి మేరకు తమదైన నటనతో అలరించారు. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే ఒక రాక్షస రాజుగా నటనతో మెస్మరైజ్ చేసిన కల్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమా కచ్చితంగా చూడాల్సిందే.