కోణార్క్ సూర్య దేవాలయం అద్భుత వీడియో
Category : Behind the Scenes Features Spiritual videos
Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
Category : Behind the Scenes Features Spiritual videos
Category : Behind the Scenes Features Sliders Spiritual
విజయవాడ కనకదుర్గమ్మకు పుట్టిల్లు.. నమ్మిన వారి ఇంట ఆవిడ కొంగు బంగారంలా కొలువై ఉండేది. అక్కడ ఆవిడ చేసిన మహిమలు కోకొల్లలు.. ఆవిడ ప్రతి రోజు విజయవాడ నగర సంచారం చేస్తుందని చెబుతుంటారు. దానికి గుర్తుగా ఇప్పటికి ఎందరో ఉపాసకులకి, కొండ మీద రాత్రి నిద్రించే వాళ్లలో కొందరికి అమ్మవారి కాలి గజ్జెల చప్పుడు వినపడుతుంది. ఈ కోవలోనే 1955లో జరిగిన యదార్థ గాథ ఇది..
1950 కాలంలో విజయవాడలో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు. ఆయన అమ్మవారి భక్తుడు. కాయ కష్టం చేసుకుంటూ వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించేవాడు. 1955లో ఏఎన్నార్, వహీదా రెహ్మాన్ జంటగా నటించిన ‘రోజులు మారాయి’ సినిమా విడుదలైంది. రిక్షా కార్మికుడైన వెంకన్న రాత్రివేళ మారుతి టాకీస్ వద్ద ఉండేవాడు. చివరి ఆట చూసిన ప్రేక్షకులెవరైనా రిక్షా కావాలని అడిగితే వారిని ఎక్కించుకుని గమ్యస్థానంలో దించేవాడు. ఈ ఏడాది ఓ రోజు అర్ధరాత్రి ఆట ముగిసిన తర్వాత వెంకన్న ఎప్పటిలాగే మారుతి టాకీస్ వద్ద నిలబడి ఉన్నాడు.
అప్పుడు ఓ పెద్దావిడ ఎర్రటి చీర ధరించి నుదుటిన పెద్దబొట్టుతో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కింది. ఎక్కడికి వెళ్లాలని అతడు అడగ్గా ఇంద్రకీలాద్రి వద్ద దించమని చెప్పింది. వెంకన్న రిక్షా తొక్కుతుండగా ఆ పెద్దావిడ అతడితో మాట కలిపింది. ‘రాత్రి వేళ మొత్తం చీకటిగా ఉంది.. దుర్గమ్మ ఈ సమయంలో గ్రామ సంచారానికి వస్తుందని విన్నాను. నీకు భయం వేయడం లేదా?’ అని అడిగింది. దానికి సమాధానంగా.. ఆవిడ మా తల్లి… అమ్మ దగ్గర బిడ్డలకు భయమెందుకు? అని ఢిల్లీ వెంకన్న సమాధానమిచ్చాడు. ఇంద్రకీలాద్రి వద్దకు రాగానే రిక్షా ఆపిన వెంకన్న.. ఏ ఇంటికి వెళ్లాలమ్మా? అని వెనక్కి తిరిగి చూడగా ఆ పెద్దావిడ కనిపించలేదు. దీంతో అతడు మెట్ల వైపు చూడగా ఆవిడ పైకి నడుచుకుంటూ కనిపిస్తుంది. డబ్బులివ్వకుండా వెళ్లిపోతున్నావేంటమ్మా అని రిక్షావాడు అడగ్గా.. డబ్బులు నీ తలపాగాలో పెట్టాను చూడు అని అంటుంది. దీంతో అతడు తలపాగా తీసి చూడగా… అందులో బంగారు గాజు, రూ.10ల నోటు కనిపించాయి. వాటిని తీసుకుని వెంకన్న మెట్లవైపు చూడగా ఆవిడ అదృశ్యమైంది.
దీంతో తన రిక్షా ఎక్కింది.. అమ్మలగన్నఅమ్మ.. కనకదుర్గమ్మే అని నిర్ధారించుకున్న వెంకన్న.. అమ్మా అంటూ వెర్రికేకలు వేయడం ప్రారంభించాడు. దీంతో నిద్రలేచిన చుట్టుపక్కల వాళ్లు అక్కడికి చేరుకుని ఏం జరిగిందని అడగ్గా.. అసలు సంగతి చెబుతాడు. ఈ విషయం బ్రాహ్మణ వీధిలో ఉండే అమ్మవారి ఉపాసకుల చెవిన పడింది. వారు ధ్యానం చేసి వచ్చింది కనకదుర్గమ్మే అని నిర్ధారించారు. ఈ సంఘటన అప్పటి ‘ఆంధ్రకేసరి’ అనే వార్తాపత్రికలో గాజు ఫోటోతో సహా ప్రచురితమైంది. దుర్గమ్మ రాత్రివేళల్లో నగరంలో సంచరిస్తుటుందని బెజవాడ ప్రజలు ఇప్పటికీ నమ్ముతుంటారు. ఈ వార్త కొంతకాలంగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
Tags : Health TipsWalking Benefits
Category : Behind the Scenes Features Health new Sliders
ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజలు వ్యాయామానికి తగిన సమయం కేటాయించడం లేదు. తరుచూ వ్యాయామం చేయకపోతే శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయానికి దారి తీయొచ్చని, దాని కారణంగా అనేక వ్యాధులు శరీరంపై దాడి చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే చాలామంది టైమ్ లేదంటూ వ్యాయామాన్ని పట్టించుకోరు. అలాంటివారికి నడక చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. రోజూ కాస్త సమయం నడిస్తే స్థూలకాయాన్ని తగ్గించడమే కాకుండా.. అనేక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఊబకాయం సమస్యతతో బాధపడుతున్న వారు రోజూ ఉదయం, సాయంత్రం 30 నిమిషాలు నడవడం వల్ల శరీరంలోని అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చని పేర్కొంటున్నారు. రోజూ నడవడం వల్ల మీ శరీరం అదనపు కేలరీలను బర్న్ చేయడంతో పాటు బరువును అదుపులో ఉంచుతుంది. అలాగే ఉత్సాహం రెట్టింపవుతుంది. నిత్యం క్రమం తప్పకుండా ఓ అరగంట పాటు నడిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒత్తిడి నుంచి ఉపశమనం
ఈ రోజుల్లో ఒత్తిడి కూడా పెను సమస్యగా మారుతోంది. ఒత్తిడి వల్ల ఊబకాయం, మెదడు సంబంధిత, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అయితే క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. దీని వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.
హై బీపీ కంట్రోల్
హై బీపీ, కొలెస్ట్రాల్ గుండెపోటుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. హైబీపీ ఉన్నా, శరీరంలో కొలస్ట్రాల్ స్థాయి పెరుగుతున్నట్లు అనిపించినా క్రమం తప్పకుండా నడవడం మంచింది. ఈ ప్రక్రియ వల్ల హైబీపీ కంట్రోల్ కావడమే కాకుండా కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
బోలు ఎముకల వ్యాధి ప్రమాదం తగ్గుతుంది
ప్రస్తుతం 30 ఏళ్లలోపు యువతలోనూ ఆస్టియోపోరోసిస్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. శారీరక శ్రమ లేకపోవడం, సరైన ఆహారం లేకపోవడం వల్ల ఈ సమస్య వెంటాడుతోంది. బోలు ఎముకల వ్యాధి సమయంలో పగుళ్లు ప్రమాదం పెరుగుతుంది. దీనితో పాటు, భవిష్యత్తులో మోకాలు, తుంటి దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది. అయితే క్రమం తప్పకుండా నడిచేవారిలో ఆస్టియోపోరోసిస్ ముప్పు చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
షుగర్ కంట్రోల్..
షుగర్ పేషెంట్లకు నడక ఎంతో మేలు చేస్తుంది. మధుమేహానికి దీన్ని సరైన ఔషధంగా చెబుతుంటారు. ఏదైనా వ్యాధి కారణంగా లేదా వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి నడక ఎంతో మేలు చేస్తుంది.
Category : Behind the Scenes Features Health new Sliders
పొద్దుతిరుగుడు విత్తనాలను సూపర్ ఫుడ్ అంటారు. ఈ విత్తనాలు పువ్వు మధ్య భాగంలో ఉంటాయి. వీటిలో క్యాలరీలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలతో పాటు అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ శరీరాన్ని అన్ని వ్యాధుల నుంచి దూరంగా ఉంచుకోవచ్చని డాక్టర్లు చెబుతుంటారు. చాలా మంది ఈ విత్తనాలను స్నాక్స్‌గా తీసుకుంటారు. ఈ నలుపు రంగు విత్తనాలు ఈ ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు.
గుండె ఆరోగ్యం కోసం
చలికాలం హృద్రోగులకు కష్టాలను పెంచుతుంది. ఈ పరిస్థితిలో పొద్దుతిరుగుడు విత్తనాలు వారి అన్ని సమస్యలను పరిష్కరిస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని విత్తనాలను తీసుకోవడం వల్ల రక్తనాళాలు విస్తరించి రక్త ప్రసరణ మెరుగపడుతుంది. ఇవి హై బీపీని నియంత్రిస్తాయి. ఈ విత్తనాలలో ఫ్లేవనాయిడ్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఒలీక్, లినోలిక్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ విత్తనాలు ఎల్‌డిఎల్.. అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
మధుమేహం కోసం
మధుమేహ వ్యాధిగ్రస్తులు పొద్దుతిరుగుడు విత్తనాలను చిరుతిండిగా తినవచ్చు. ఇందులో కార్బోహైడ్రేట్ల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని గింజలను తీసుకోవడం ద్వారా రక్తంలో షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.
రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది
మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే ఖచ్చితంగా ఈ విత్తనాలను తినాలి. పొద్దుతిరుగుడు విత్తనాలలో జింక్, సెలీనియం మీ రోగనిరోధక శక్తిని అమాంతం పెంచేస్తాయి.
బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి
బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఏ వ్యక్తికైనా చాలా ప్రమాదకరం. పొద్దుతిరుగుడు విత్తనాలను రోజూ తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఈ సందర్భంలో బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఈ స్ట్రోక్‌ను నివారించడంలో సహాయపడుతుంది. దీని వినియోగం వల్ల జ్ఞాపకశక్తి కూడా బలపడుతుంది.
బోలు ఎముకల వ్యాధి నుంచి రక్షణ
ఈ విత్తనాలు ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివిగా భావిస్తారు. ఈ గింజల్లో పుష్కలంగా కొవ్వులు, మినరల్స్, విటమిన్లు, ప్రొటీన్లు, విటమిన్ ఈ, బి-కాంప్లెక్స్, మెగ్నీషియం వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేస్తాయి ఆస్టియోపోరోసిస్ నుంచి రక్షిస్తాయి.
Tags : Coconutcoconut spoiled puja
Category : Behind the Scenes Features Sliders Spiritual
కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతుంటాం. ఏదో అనర్థం జరుగుతుందని భయపడిపోతాం. ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా?.. అనర్థమా? చెడు ప్రభావం ఉంటుందని సంకేతమా ? కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది ?.. ఇప్పుడు తెలుసుకుందాం..
కొబ్బరికాయ కొట్టినప్పుడు సరిగ్గా పగలకపోయినా, చెడిపోయినా మీరు అనుకుంటున్నంత అపచారమేమీ లేదు. అసలు భయపడాల్సిన పనేలేదు. అయితే కొబ్బరికాయ కొట్టే విధానం తెలిసివుండాలి. అప్పుడే అది అడ్డంగా..చూడటానికి అందంగా రెండు చెక్కలుగా పగులుతుంది. కొబ్బరికాయ సమానంగా పగలడం వలన, మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుందని చెబుతుంటారు. కొత్తగా పెళ్లైన వాళ్లు కొట్టిన కొబ్బరికాయలో ‘పువ్వు’ వస్తే, అది సంతాన యోగాన్ని సూచిస్తుందని అంటారు. కుటుంబంలో ఎవరు కొబ్బరికాయ కొట్టినా నిలువుగా పగిలితే, ఆ కుటుంబంలోని కూతురు గానీ, కోడలు గానీ సంతాన యోగాన్ని పొందుతారనడానికి సూచనగా భావిస్తుంటారు. ఇలా కొబ్బరికాయ తాను పగిలిన తీరు కారణంగా ఫలితాన్ని ముందుగానే చెబుతుందనే విశ్వాసం.
పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్లితే ఎలాంటి దోషమూ ఉండదు. అపచారం అంతకంటే ఉండదు. ఆలయంలో కొబ్బరికాయ కుళ్లిపోతే ఆ కాయను నీటితో శుభ్రంచేసి మళ్లీ దేవుడికి అలంకరణ చేసి పూజ చేస్తారు. ఈ పక్రియ దోషం చెడిపోయిన కొబ్బరికాయదని, భక్తుడిది కాదని సూచిస్తుంది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్లిపోతుంది. అప్పుడు ఏదో పూజలో అపచారం జరిగిందని చాలామంది కంగారు పడతారు. అయితే ఇందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొబ్బరికాయ చెడిపోయి ఉంటే.. కుళ్లిన భాగాన్ని తీసేసి.. కాళ్లూ, చేతులు, ముఖం శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని మళ్లీ శుభ్రం చేసి పూజ ప్రారంభిస్తే దోషం పోయినట్లే. వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే దిష్టిపోయినట్టే అని అర్థం. కాబట్టి మళ్లీ వాహానాన్ని శుభ్రం చేసి కొబ్బరికాయ కొడితే మంచిది.
భగవద్గీతలో చెప్పినట్టుగా, భక్తితో అర్పించిన పండుగానీ, పువ్వుగానీ, ఆకుగానీ, ఆ స్వామి స్వీకరిస్తాడు. ఇక్కడ భక్తి ముఖ్యంగానీ తెచ్చిన వస్తువు కాదు. భక్తితో తెచ్చిన పండైనా, ఆకైనా, పూవైనా, నీరైనా సరే, నేను ప్రేమతో స్వీకరిస్తాను అని భగవద్గీతలో చెప్పినట్టుగా, కొబ్బరికాయ చెడిపోయినా సరే! ఆస్వామీ ప్రేమతో స్వీకరిస్తాడని పండితులు చెబుతున్నారు.
Tags : bheemla nayakpawan kalyan
Category : Behind the Scenes Gossips Movie News Sliders
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘భీమ్లా నాయక్’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి బరిలో దిగనుంది. 2022 సంవత్సరం జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నిర్మాతలు.. విడుదల తేదీ మార్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.
ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని సమాచారం. సాగర్ కె.చంద్ర ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటానని భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా సంక్రాంతి రేసులో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాలకు పోటీగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ కూడా అదే సమయంలో విడుదల కానుండటంతో ‘భీమ్లా నాయక్’ విడుదల తేదీ మార్చాలని పవన్‌ను కోరుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు భీమ్లా నాయక్ సినిమాకు 95 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఏపీలో టికెట్ రేట్ల తగ్గించడంతో ఆ ఏరియాకు తక్కువ ధరకే హక్కులు అమ్మినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ‘భీమ్మా నాయక్’ నిర్మాతలకు సుమారు రూ.10కోట్ల వరకు ఆదాయం తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Category : Behind the Scenes Daily Updates Movie News Sliders
యంగ్ టైగర్ యన్టీఆర్, కొరటాల శివ కలయికలోని రెండో సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. #NTR30 గా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో సామాజిక సందేశం అందించేదిగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ విషయమై కొంతకాలంగా రూమర్స్ గుప్పుమంటున్నా యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కొద్దిరోజులుగా కథానాయికగా కియారా అద్వానీ పేరు వినిపించగా… తాజా సమాచారం ప్రకారం ఇందులో అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీకపూర్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ వార్త నందమూరి అభిమానులతో పాటు శ్రీదేవి అభిమానులను ఖుషీ చేస్తోంది. నిజానికి జాన్వీని సౌత్ నుంచే హీరోయిన్‌గా పరిచయం చేయాలని శ్రీదేవి అనుకున్నా సాధ్యం కాలేదు. కొరటాల శివ సినిమాతో అది ఇన్నాళ్ళకు సాధ్యం కానుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం కొరటాల శివ స్ర్కిప్ట్ వర్క్ మీద ఉన్నారని సమాచారం. యన్టీఆర్ సూచించిన స్వల్ప మార్పుల్ని సవరిస్తున్నారట. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 22న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. జనతా గ్యారేజ్ యన్టీఆర్, కొరటాల కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.
Category : Behind the Scenes Features Sliders Spiritual
కాలభైరవుడు అంటే శివుడి యొక్క భయంకరమైన రూపం. కాల అనే పదానికి శివుడు వలసవాది అనే అర్థం ఉంది. అదే విధంగా భైరవ అనే పదానికి అత్యంత భయంకరమైన రూపం అని అర్థం. ఆ రూపం భయంకరమైనది అయినప్పటికీ ఈశ్వరుడు తన భక్తుల పట్ల చాలా దయగలవాడు. అతడిని కొలిచేవారి కోరికలను తీరుస్తూ వారికి అనేక ప్రయోజనాలు కలిగిస్తాడని చాలా మంది భక్తులు నమ్ముతారు. కాలభైరువుడికి ఎనిమిది రూపాలు ఉన్నాయి. కాలభైరవ అష్టకం చదవడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
కాలభైరవ అష్టకం..
దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||
శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగమండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభీషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||
అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ || ౯ ||
ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ |
Category : Behind the Scenes Features Sliders Spiritual
గోస్వామి తులసీదాసు అందించిన మేటి రచనల్లో హనుమాన్ చాలీసా ఒకటి. హిందూ మతంలో హనుమాన్ చాలీసాకి ప్రత్యేక స్థానం ఉంది. హనుమాన్ చాలీసా పఠనం వల్ల, హనుమంతుడ్ని మెప్పించి ఆయన దీవెనలు పొందవచ్చని అంటారు. హనుమాన్ చాలీసా చదవటం వల్ల శనిప్రభావం కూడా పోతుంది. హనుమాన్ చాలీసా చదవటానికి ఒక సమయం, పద్ధతి ఉన్నాయి. అందులోని ప్రతి శ్లోకానికి ప్రత్యేక అర్థం ఉన్నది. హనుమాన్ చాలీసా పఠనం వల్ల ఒక వ్యక్తిపై అద్భుత ప్రభావం ఉందని అంటారు. పొద్దున లేదా రాత్రి హనుమాన్ చాలీసా చదవటానికి మంచి సమయాలు. శనిప్రభావం ఉన్నవారు రోజూ రాత్రివేళ హనుమాన్ చాలీసాను 8సార్లు చదవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
హనుమాన్ చాలీసా
శ్రీ గురు చరణ సరోజ రజ
నిజమన ముకుర సుధారి
వరణౌ రఘువర విమల యశ
జో దాయక ఫలచారి ||
అర్థం – శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి నా మనస్సును శుభ్రపరుచుకుని, చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీరఘువర (రామచంద్ర) కీర్తిని నేను తలచెదను.
బుద్ధిహీన తను జానికే
సుమిరౌ పవనకుమార
బల బుద్ధి విద్యా దేహు మోహి
హరహు కలేశ వికార ||
అర్థం – బుద్ధిహీన శరీరమును తెలుసుకొని, ఓ పవనకుమారా (ఆంజనేయా) నిన్ను నేను స్మరించుచున్నాను. నాకు బలము, బుద్ధి, విద్యను ప్రసాదించి నా కష్టాలను, వికారాలను తొలగించుము.
చౌపాఈ-
జయ హనుమాన జ్ఞానగుణసాగర |
జయ కపీశ తిహు లోక ఉజాగర || ౧ ||
అర్థం – ఓ హనుమంతా, జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రమువంటి నీకు, వానరజాతికి ప్రభువైన నీకు, మూడులోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయము.
రామదూత అతులిత బలధామా |
అంజనిపుత్ర పవనసుత నామా || ౨ ||
అర్థం – నీవు శ్రీరామునకు దూతవు, అమితమైన బలము కలవాడవు, అంజనీదేవి పుత్రుడిగా, పవనసుత అను నామము కలవాడవు.
మహావీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతి కే సంగీ || ౩ ||
అర్థం – నీవు మహావీరుడవు, పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు, చెడు మతి గల వారిని నివారించి మంచి మతి కలవారితో కలిసి ఉండువాడవు,
కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా || ౪ ||
అర్థం – బంగారురంగు గల దేహముతో, మంచి వస్త్రములు కట్టుకుని, మంచి చెవి దుద్దులు పెట్టుకుని, ఉంగరాల జుట్టు కలవాడవు.
హాథ వజ్ర ఔరు ధ్వజా విరాజై |
కాంధే మూంజ జనేవూ సాజై || ౫ ||
అర్థం – ఒక చేతిలో వజ్రాయుధము (గద), మరొక చేతిలో విజయానికి ప్రతీక అయిన ధ్వజము (జెండా) పట్టుకుని, భుజము మీదుగా జనేయును (యజ్ఞోపవీతం) ధరించినవాడవు.
శంకర సువన కేసరీనందన |
తేజ ప్రతాప మహా జగవందన || ౬ ||
అర్థం – శంకరుని అవతారముగా, కేసరీ పుత్రుడవైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనము చేసినవి.
విద్యావాన గుణీ అతిచాతుర |
రామ కాజ కరివే కో ఆతుర || ౭ ||
అర్థం – విద్యావంతుడవు, మంచి గుణములు కలవాడవు, బుద్ధిచాతుర్యము కలవాడవు అయిన నీవు శ్రీ రామచంద్ర కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు.
ప్రభు చరిత్ర సునివే కో రసియా |
రామ లఖన సీతా మన బసియా || ౮ ||
అర్థం – శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వము పొంది, శ్రీ సీతా, రామ, లక్ష్మణులను నీ మనస్సులో ఉంచుకున్నవాడవు.
సూక్ష్మరూప ధరి సియహి దిఖావా |
వికటరూప ధరి లంక జరావా || ౯ ||
అర్థం – సూక్ష్మరూపము ధరించి సీతమ్మకు కనిపించినవాడవు, భయానకరూపము ధరించి లంకను కాల్చినవాడవు.
భీమరూప ధరి అసుర సంహారే |
రామచంద్ర కే కాజ సంవారే || ౧౦ ||
అర్థం – మహాబలరూపమును ధరించి రాక్షసులను సంహరించినవాడవు, శ్రీరామచంద్రుని పనులను నెరవేర్చినవాడవు.
లాయ సంజీవన లఖన జియాయే |
శ్రీరఘువీర హరషి వుర లాయే || ౧౧ ||
అర్థం – సంజీవిని తీసుకువచ్చి లక్ష్మణుని బ్రతికించిన నీ వల్ల శ్రీరఘువీరుడు (రాముడు) చాలా ఆనందించాడు.
రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరత సమ భాయీ || ౧౨ ||
[** పాఠభేదః – కహా భరత సమ తుమ ప్రియ భాయి **]
అర్థం – అంత ఆనందంలో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకుని, తన తమ్ముడైన భరతుని వలె నీవు తనకు ఇష్టమైనవాడవు అని పలికెను.
సహస వదన తుమ్హరో యశ గావై |
అస కహి శ్రీపతి కంఠ లగావై || ౧౩ ||
అర్థం – వేనోళ్ల నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందంతో నిన్ను కౌగిలించుకున్నాడు.
సనకాదిక బ్రహ్మాది మునీశా |
నారద శారద సహిత అహీశా || ౧౪ ||
యమ కుబేర దిగపాల జహాఁ తే |
కవి కోవిద కహి సకే కహాఁ తే || ౧౫ ||
అర్థం – సనకాది ఋషులు, బ్రహ్మాది దేవతలు, నారదుడు, విద్యావిశారదులు, ఆదిశేషుడు, యమ కుబేరాది దిక్పాలురు, కవులు, కోవిదులు వంటి ఎవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరు?
తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
రామ మిలాయ రాజ పద దీన్హా || ౧౬ ||
అర్థం – నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారము ఏమిటంటే రాముని తో పరిచయం చేయించి రాజపదవిని కలిగించావు.
తుమ్హరో మంత్ర విభీషణ మానా |
లంకేశ్వర భయె సబ జగ జానా || ౧౭ ||
అర్థం – నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికి తెలుసు.
యుగ సహస్ర యోజన పర భానూ |
లీల్యో తాహి మధుర ఫల జానూ || ౧౮ ||
అర్థం – యుగ సహస్ర యోజనముల దూరంలో ఉన్న భానుడిని (సూర్యుడిని) మధురఫలమని అనుకుని అవలీలగా నోటిలో వేసుకున్నవాడవు.
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ |
జలధి లాంఘి గయే అచరజ నాహీ || ౧౯ ||
అర్థం – అలాంటిది శ్రీరామ ప్రభు ముద్రిక (ఉంగరమును) నోటకరచి సముద్రాన్ని ఒక్క ఉదుటన దూకావు అంటే ఆశ్చర్యం ఏముంది?
దుర్గమ కాజ జగత కే జేతే |
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే || ౨౦ ||
అర్థం – జగములో దుర్గము వలె కష్టమైన పనులు నీ అనుగ్రహం వలన సుగమం కాగలవు.
రామ దువారే తుమ రఖవారే |
హోత న ఆజ్ఞా బిను పైఠారే || ౨౧ ||
అర్థం – శ్రీరామ ద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు. నీ అనుమతి లేకపోతే ఎవరైన అక్కడే ఉండిపోవాలి.
సబ సుఖ లహై తుమ్హారీ శరణా |
తుమ రక్షక కాహూ కో డరనా || ౨౨ ||
అర్థం – నీ ఆశ్రయములో అందరు సుఖముగా ఉంటారు. నీవే రక్షకుడవు అయితే ఇంకా భయం ఎందుకు?
ఆపన తేజ సంహారో ఆపై |
తీనోఁ లోక హాంక తేఁ కాంపై || ౨౩ ||
అర్థం – నీ తేజస్సును నీవే నియంత్రిచగలవు. నీ కేకతో మూడులోకాలు కంపించగలవు.
భూత పిశాచ నికట నహిఁ ఆవై |
మహావీర జబ నామ సునావై || ౨౪ ||
అర్థం – భూతములు, ప్రేతములు దగ్గరకు రావు, మహావీర అనే నీ నామము చెప్తే.
నాసై రోగ హరై సబ పీరా |
జపత నిరంతర హనుమత వీరా || ౨౫ ||
అర్థం – రోగములు నశిస్తాయి, పీడలు హరింపబడతాయి, ఓ హనుమంతా! వీరా! నీ జపము వలన.
సంకటసే హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై || ౨౬ ||
అర్థం – మనస్సు, కర్మ, వచనము చేత ధ్యానము చేస్తే సంకటముల నుంచి, ఓ హనుమంతా, నీవు విముక్తునిగా చేయగలవు.
సబ పర రామ తపస్వీ రాజా |
తిన కే కాజ సకల తుమ సాజా || ౨౭ ||
అర్థం – అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు. ఆయనకే నీవు సంరక్షకుడవు.
ఔర మనోరథ జో కోయీ లావై |
సోయి అమిత జీవన ఫల పావై || ౨౮ ||
అర్థం – ఎవరు కోరికలతో నీవద్దకు వచ్చినా, వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు.
చారోఁ యుగ ప్రతాప తుమ్హారా |
హై పరసిద్ధ జగత ఉజియారా || ౨౯ ||
అర్థం – నాలుగుయుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగత్తుకు తెలియపరచబడినది.
సాధుసంతకే తుమ రఖవారే |
అసుర నికందన రామ దులారే || ౩౦ ||
అర్థం – సాధువులకు, సంతులకు నీవు రక్షకుడవు. అసురులను అంతము చేసినవాడవు, రాముని ప్రేమపాత్రుడవు.
అష్ట సిద్ధి నవ నిధి కే దాతా |
అసవర దీన్హ జానకీ మాతా || ౩౧ ||
అర్థం – ఎనిమిది సిద్ధులు, తొమ్మిది నిధులు ఇవ్వగలిగిన శక్తి జానకీమాత నీకు వరంగా ఇచ్చినది.
రామ రసాయన తుమ్హరే పాసా |
సదా రహో రఘుపతి కే దాసా || ౩౨ ||
అర్థం – నీ వద్ద రామరసామృతం ఉన్నది. దానితో ఎల్లప్పుడు రఘుపతికి దాసునిగా ఉండగలవు.
తుమ్హరే భజన రామ కో పావై |
జన్మ జన్మ కే దుఖ బిసరావై || ౩౩ ||
అర్థం – నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి, జన్మ జన్మలలో దుఃఖముల నుండి ముక్తుడను అవ్వగలను.
అంతకాల రఘుపతి పుర జాయీ | [** రఘువర **]
జహాఁ జన్మ హరిభక్త కహాయీ || ౩౪ ||
అర్థం – అంత్యకాలమున శ్రీరఘుపతి పురమునకు వెళితే, తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడని కీర్తింపబడుతారు.
ఔర దేవతా చిత్త న ధరయీ |
హనుమత సేయి సర్వసుఖకరయీ || ౩౫ ||
అర్థం – వేరే దేవతలను తలుచుకునే అవసరంలేదు. ఒక్క హనుమంతుడే సర్వసుఖాలు కలిగించగలడు.
సంకట హటై మిటై సబ పీరా |
జో సుమిరై హనుమత బలవీరా || ౩౬ ||
అర్థం – కష్టాలు తొలగిపోతాయి, పీడలు చెరిగిపోతాయి, ఎవరైతే బలవీరుడైన హనుమంతుని స్మరిస్తారో.
జై జై జై హనుమాన గోసాయీ |
కృపా కరహు గురు దేవ కీ నాయీ || ౩౭ ||
అర్థం – జై జై జై హనుమాన స్వామికి. గురుదేవుల వలె మాపై కృపను చూపుము.
యహ శతవార పాఠ కర కోయీ |
ఛూటహి బంది మహాసుఖ హోయీ || ౩౮ ||
అర్థం – ఎవరైతే వందసార్లు దీనిని (పై శ్లోకమును) పఠిస్తారో బంధముక్తులై మహా సుఖవంతులు అవుతారు.
జో యహ పఢై హనుమాన చాలీసా |
హోయ సిద్ధి సాఖీ గౌరీసా || ౩౯ ||
అర్థం – ఎవరైతే ఈ హనుమాన చాలీసాను చదువుతారో, వారి సిద్ధికి గౌరీశుడే (శివుడు) సాక్షి.
తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహ డేరా || ౪౦ ||
అర్థం – తులసీదాసు (వలె నేను కూడా) ఎల్లపుడు హరికి (హనుమకు) సేవకుడిని. కాబట్టి నా హృదమును కూడా నీ నివాసముగ చేసుకో ఓ నాథా (హనుమంతా).
దోహా-
పవనతనయ సంకట హరణ
మంగళ మూరతి రూప ||
రామ లఖన సీతా సహిత
హృదయ బసహు సుర భూప ||
అర్థం – పవన కుమారా, సంకటములను తొలగించువాడా, మంగళ మూర్తి స్వరూపా (ఓ హనుమంతా), రామ లక్ష్మణ సీతా సహితముగా దేవతా స్వరూపముగా నా హృదయమందు నివసించుము
Category : Behind the Scenes Movie News Pic of the day Posters Sliders
ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ నయనతార హవా కొనసాగుతోంది. వయసు పైబడుతున్నా ఆమె రేంజ్ పెరుగుతోందో గానీ.. ఎక్కడా తగ్గడం లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటున్న నయనతార గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో కనిపించనుంది. ‘సైరా నరసింహారెడ్డి’ లో చిరుకు భార్యగా నటించిన నయన్.. తాజా సినిమాలో ఆయనకు చెల్లెలిగా నటిస్తుండటం విశేషం.
అయితే ఈ సినిమా కోసం నయనతార ఏకంగా నాలుగు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. నయనతార నటించడం వల్ల ఇతర భాషల్లో కూడా రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిర్మాతలు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం. మలయాళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘లూసిఫర్’ రీమేక్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో హీరో చెల్లెలి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందువల్లే ఈ రోల్‌కి నయనతారను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే ‘గాడ్ ఫాదర్’ సినిమా కోసం నయన్ తీసుకున్న పారితోషికం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా రూ.4కోట్లు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.మునుపెన్నడూ లేనివిధంగా ఆమె పవర్ ఫుల్ లుక్‌లో కనిపించనున్నారట.
‘గాడ్ ఫాదర్’ సినిమా విషయానికి వస్తే కొణిదెల ప్రొడెక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సత్యదేవ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. నయనతార భర్తగా ఆయన కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఈ సినిమాలో నటించనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి ప్రచారం సాగుతోంది.
© Copyright 2020. All Rights Reserved