Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
‘క్రాక్’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన మాస్ మహరాజ్ రవితేజ ఈసారి ‘ఖిలాడి’గా రాబోతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డా.జయంతిలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లు. గత కొన్ని రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి సోమవారం టీజర్ విడుదల చేసింది యూనిట్.
ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ‘ఖిలాడి’ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. డిఫరెంట్ షేడ్స్‌లో మాస్ మహారాజ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటోంది. థ్రిల్లింగ్, యాక్షన్ కలయికలో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ‘ఖిలాడి’ని తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తూనే తెలుస్తోంది. ఈ మూవీలో రవితేజ సైకో తరహా పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో ఆంజనేయ స్వామికి అనేక ప్రసిద్ధ ఆలయాలున్నాయి. అందులో మొదటిటి కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆలయం. అంజన్న అంటూ భక్తులు భక్తితో కొలిచే ఈ ఆంజనేయుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని నమ్మకం. కొండగట్టు పుణ్యక్షేత్రం కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి 35 కి.మీ.లు, వేములవాడ క్షేత్రానికి కేవలం 30 కి.మీల దూరంలో ఉంది. ఆలయ ప్రాంగణంలో ప్రకృతి సిద్ధంగా వెలసిన పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తుంటారు.
స్థల పురాణం
సుమారు 500 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరగణాలో నివసించే సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు గుట్టలో తన పశువులను మేపుతుండగా ఓ ఆవు తప్పిపోయింది. దాన్ని వెతికి వెతికి విసిగిపోయిన సంజీవుడు చెట్టుకింద సేదతీరుతూ నిద్రలోకి జారుకోగా ఆంజనేయస్వామి కలలోకి వచ్చి కోరంద పొదల్లో వెలసిన తనకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించాలని సూచించి ఆవు జాడ చెప్పాడట. కళ్లు తెరచి చూడగా ఆవు కనిపించడంతో సంజీవుడి ఆనందానికికి అవధుల్లేకుండా పోయాయి. భక్తిభావంతో కోరంద ముళ్లపొదల్లో వెతగ్గా స్వామివారి విగ్రహం కనిపించింది. దీంతో ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి చిన్న ఆలయం నిర్మించి పూజలు నిర్వహించేవాడని చరిత్రకారులు చెబుతారు.
నారసింహ వక్త్రంతో వెలసిన కొండగట్టు అంజన్న ఆలయానికి ఈశాన్య భాగంలోని గుహల్లో మునులు తపస్సు ఆచరించినట్లు ఆధారాలున్నాయి. శ్రీరాముడు సీత కోసం లంకకు వెళ్లే సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోగా ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకొని వస్తుండగా అందులోంచి ఓ ముక్కరాలిపడి కొండగట్టుగా ప్రసిద్ధి పొందిందని మరికొందరు చెబుతుంటారు. ఆలయానికి వెళ్లే దారి పక్కన సీతాదేవి రోదించినట్టు చెప్పే కన్నీటి గుంతలు భక్తులకు దర్శనమిస్తాయి.
ఏటా చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ చిన్న జయంతి, వైశాఖ బహుళ దశమి నాడు వచ్చే పెద్ద హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి దీక్ష తీసుకున్న లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుని ముడుపులు కట్టి వెళ్తుంటారు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా మూడ్రోజులపాటు హోమం నిర్వహిస్తారు. ఉగాది పండుగ రోజు స్వామివారి సన్నిధిలో పంచాంగ శ్రవణం జరుగుతుంది.
చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరావమనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండువగా జరుగుతుంది. శ్రావణ మాసంలో సప్తాహ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఏటా ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నెల రోజుల పాటు తిరుప్పావై, గోదారంగనాయకుల కల్యాణం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం గావిస్తారు. దీపావళి పర్వదినం సందర్భంగా సహస్ర దీపాలంకరణతో ఆలయాన్ని తీర్చిదిద్దుతారు.
కొండగట్టుకు ఇలా చేరుకోవచ్చు.. హైదరాబాద్‌కు 160 కి.మీ.ల దూరంలో ఉన్న కొండగట్టుకు వెళ్లేందుకు ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి జగిత్యాలకు వెళ్లే బస్సు ఎక్కితే కొండగట్టులో దిగొచ్చు. కరీంనగర్ నుంచి ప్రతి 30 నిమిషాలకో బస్సు సర్వీసు ఉంది. కరీంనగర్ నుంచి క్యాబ్‌లు, ఆటో సౌకర్యం కూడా ఉంటుంది.
మనదేశంలో పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి. ‘సౌరాష్ట్రే సోమనాథంచ..’ అని ఆరంభమయ్యే శ్లోకంలో ‘శ్రీశైలే మల్లికార్జునం’ అంటూ భ్రమరాంబికా సతీ హృదయేశ్వరుడి ప్రస్తుతి కనిపిస్తుంది. దేవీ నవరాత్రుల్లో ఆదిపరాశక్తికి నవమరూపంగా భ్రమరాంబను ఆరాధించడం శాక్తేయులకు పరమ పవిత్రం. అరుణుడనే రాక్షసుడు గాయత్రిని విస్మరించిన ఫలితంగా భ్రమర రథాంకృతులతో ఆదిశక్తి అతణ్ణి సంహరించిన గాథ ప్రాచుర్యంలో ఉంది. ఆదిశక్తి కొలువుదీరిన పద్దెనిమిది శక్తి పీఠాల్లో భ్రమరాంబ వెలసిన శ్రీశైలానికి ప్రత్యేక స్థానం ఉంది.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి 37 కి.మీ.ల దూరంలో స్వర్ణముఖి నదీతీరంలో వెలసిన శ్రీ కాళహస్తీశ్వరాలయం.. భక్తుల పాలిట భూకైలాసంగా.. వాయులింగ స్థానంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. పంచభూత లింగాల్లో పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగం తమిళనాడులో ఉంటే.. ఒక్క వాయులింగం మాత్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొలువైంది. ఈ క్షేత్రం రాహు,కేతు, సర్పదోష నివారణ క్షేత్రంగా విరాజిల్లుతోంది. జ్యోతిర్లింగం, శక్తి పీఠాలు ఒకే గిరిశృంగం మీద వెలసిన పుణ్యక్షేత్రమైన శ్రీశైలం సకల లోకారాధ్యంగా భాసిల్లుతోంది.\
లక్షా 47 వేల 456 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో – ఎనిమిది శృంగాలతో అలరారే శ్రీశైలంలో 44 నదులు, 60 కోట్ల తీర్థరాజాలు, పరాశర, భరద్వాజాది మహర్షుల తపోవన సీమలు, చంద్ర కుండ, సూర్యుకుండాది పుష్కరిణులు, స్పర్శవేదులైన లతలు, వృక్షసంతతులు, అనేక లింగాలు, అద్భుత ఔషధాలు ఉన్నాయని ప్రతీతి. గిరుల బారులను దాటి శ్రీశైల మల్లన్న సన్నిధికి చేర్చే మార్గం అత్యంత ఆహ్లాదకరం. పౌరాణిక ప్రశస్తికి గుర్తుగా సీతారాములు ప్రతిష్ఠించిన సహస్ర లింగాలు, పాండవులు సభక్తికంగా సంస్థాపించిన సద్యోజాతి లింగం, పంచపాడవ లింగాలు పూజలందుకుంటున్నాయి.
దేశంలో మరే క్షేత్రానికీ లేని ప్రత్యేకత శ్రీశైల క్షేత్రానికి ఉంది. పూజారంభంలో సంకల్పంలో శ్రీశైల క్షేత్రానికి ఏ దిశలో కూర్చొని తాము భగవదారాధనచేస్తున్నదీ విధిగా పేర్కొనడం ఈ క్షేత్ర ప్రామాణికతకు నిదర్శనం. శ్రీశైల క్షేత్రం ఎప్పుడు వెలసిందీ స్పష్టంగా తెలియజేసే ఆధారాల్లేవు. అష్టాదశ పురాణాల్లోనూ భారత రామాయణాది ఇతిహాసాల్లోనూ శ్రీశైల వైభవం స్తుతుల్ని అందుకొంది. సంస్కృత, ఆంధ్ర, కన్నడ, మరాఠీ గ్రంథాల్లో ఈ క్షేత్ర వర్ణనలున్నాయి. ఆయా భాషల కవులు శ్రీగిరిని కీర్తిస్తూ వ్యోమకేశ, హైమవతుల సంధ్యా సుందర నృత్యాన్ని సమనోజ్ఞంగా అభివర్ణించారు.
64 అధ్యాయాలున్న స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండం, ఈ క్షేత్ర మహత్తును వివరిస్తోంది.ఈ క్షేత్ర ప్రశాంతతకు ముగ్ధులైన ఆదిశంకరులు కొంతకాలం ఇక్కడ తపస్సు చేసి, ‘శివానంద లహరి’ని రచించి, మల్లికార్జునుడికి పూజాసుమాలు అర్పించారు. భ్రమరాంబ సన్నిధిలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు. దత్తావతార పరంపరలో భక్తుల పూజలందుకొనే నృసింహ సరస్వతీ స్వామి శ్రీశైల మహత్యాన్ని వివరిస్తూ తన పాదుకల్ని పట్టుకొన్న తంతుడు అనే భక్తుడికి ఈ క్షేత్ర దర్శన భాగ్యాన్ని కలిగించినట్లు ‘గురు చరిత్ర’ చెబుతోంది. ఆ స్వామీజీ తన అవతారాన్ని సైతం ఇక్కడి పాతాళగంగలో పరిసమాప్తి గావించి, కదలీవనంలో గుప్తరూపంలో ఉన్నట్లు దత్తభక్తులు విశ్వసిస్తారు.
కృతయుగంలో హిరణ్యకశిపుడు శ్రీశైలాన్ని తన పూజా మందిరంగా చేసుకొన్నాడనీ, త్రేతా యుగంలో రామ చంద్రుడు రావణుణ్ణి వధించిన తరవాత బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి సతీసమేతంగా ఈ క్షేత్రాన్ని దర్శించి, సహస్రలింగాల్ని ప్రతిష్ఠించి, ఆర్చించాడనీ ప్రతీతి. ద్వాపరయుగంలో పాండవులు సైతం వనవాస కాలంలో ఈ గిరిని దర్శించి లింగప్రతిష్ఠ చేసినట్టు ప్రాచుర్యంలో ఉంది.
స్కాందపురాణంలో శ్రీశైల ఆవిర్భావానికి సంబంధించిన కథ ఉంది. శిలాథుడు అనే మహర్షికి నంది, పర్వతుడు అనే ఇద్దరు కుమారులుండేవారు. వారు శివభక్తి పరాయణులు. పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలనుకుని శివదీక్ష స్వీకరించి, కఠోర తపస్సు చేశారు. వారి భక్తి కైలాసపతి మనస్సును కరిగించింది. స్మరణ మాత్రం చేత ఆపన్నుల భారాల్ని స్వీకరించే మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. తెరచిన కన్నుల ఎదుట త్రినేత్రుణ్ణి దర్శించిన ఆనందంతో నంది పరవశుడయ్యాడు. పశుపతికి వాహనంగా నిలిచిపోవాలన్న మనోభీష్టాన్ని వ్యక్తం చేశాడు. తాండవప్రియుడు ‘తథాస్తు’ అనడంతో నందికి నిఖిలేశ్వరుడికి వాహనమయ్యే యోగం సంప్రాప్తించింది. రెండో భక్తుడైన పర్వతుడు సైతం పరమేశ్వర సాక్షాత్కారానికి పరవశుడయ్యాడు. క్షణమాత్ర దర్శనభాగ్యం వల్లనే కొండంత ఆనందం పొందిన పర్వతుడు, దాన్ని శాశ్వతం చేసుకోవాలని సంకల్పించాడు. ఆదిదంపతులైన ఉమామహేశ్వరులు తనపై అన్నివేళలా కొలువుదీరి ఉండాలని వరం కోరుకుని కొండగా మారిపోయాడు. ఆ విధంగా శిలాథుడి రెండో కుమారుడైన పర్వతుడే ఈ శ్రీశైల శిఖర రూపుడని స్కాందపురాణం చెబుతోంది. మొదట్లో శ్రీపర్వతం అని పిలిచేవారనీ, కాలక్రమంలో అది శ్రీశైలంగా మారిందనీ అంటారు.
క్రీస్తు పూర్వం నుంచి అనేక రాజవంశాలు శ్రీశైలాన్ని సేవించినట్లు శిలాశాసనాలు, ఇతర చారిత్రక ఆధారాలు వర్ణిస్తున్నాయి. ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర సామ్రాజ్యాధీశులు, భ్రమరాంబికా సమేతుడైన మల్లికార్జునుణ్ణి దర్శించి, ఆలయ ప్రాకారాలు నిర్మించి, అశేష వస్తుసంపదలు సమర్పించినట్లు ఆధారాలున్నాయి. బౌద్ధయుగంలో మహాయానానికి పూర్వం నుంచీ ఈ ఆలయం ప్రాచుర్యంలో ఉందని తెలుస్తోంది. చైనా యాత్రికుడు హ్యూయన్‌త్సాంగ్ గ్రంథంలో శ్రీశైలం ప్రసక్తి ఉంది. ఆలయ పూర్వ చరిత్రకు సంబంధించి 14 శతాబ్దానికి చెందిన కాకతీయ ప్రతాప రుద్రుడి శాసనమే ప్రాచీనమైనది. అది ప్రస్తుతం చెన్నైలోని మ్యూజియంలో ఉంది.
అనేక ప్రత్యేకతలున్న శ్రీశైల ఆలయానికి నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి. ప్రకాశం జిల్లాలో త్రిపురసుందరి వెలసిన త్రిపురాంతకాన్ని తూర్పు ద్వారంగానూ, మహబూబ్‌నగర్ జిల్లాలో జోగులాంబ విరాజిల్లే శక్తిపీఠమైన ఆలంపూర్ పశ్చిమ ద్వారంగానూ, కడప జిల్లాలో సిద్ధేశ్వరుడు కొలువుతీరిన సిద్ధవటం దక్షిణద్వారం గానూ, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఉమామహేశ్వరాన్ని ఉత్తర ద్వారంగానూ భావిస్తారు. ఇవి కాకుండా ఆగ్నేయంలో పుష్పగిరి క్షేత్రం, నైరుతిలో సోమశిల క్షేత్రం, వాయువ్యంగా సంగమేశ్వర క్షేత్రం, ఈశాన్యంలో ఏకేశ్వర క్షేత్రం ఉన్నాయి.
శ్రీశైలాన్ని అనేక క్షేత్రాల సమాహారంగా భావిస్తారు. గిరిపంక్తుల్ని దాటి వెళ్తుంటే ఆలయానికి ఎనిమిది కిలో మీటర్ల దూరంలో శిఖరేశ్వరం దర్శనమిస్తుంది. శ్రీశైల శిఖర దర్శనం సర్వపాపహరణమని భక్తులు విశ్వసిస్తారు. అదేవిధంగా కుంభాకారుడు కేశప్పను స్వర్ణలింగ రూపంలో శివుడు అనుగ్రహించిన హటకేశ్వరం, ఆదిశంకరులు పావనం చేసిన పాలధార, పంచధారలు, తన జననీ జనకుల్ని దర్శించవచ్చిన వారి మోక్షార్హతను నిర్ధరించే సాక్షి గణపతి, కుంతీసుత మధ్యముడైన భీమసేనుడి గదాఘాతంతో ఏర్పడిందని భావించే ‘భీముని కొలను’ ఇలా శ్రీశైల యాత్రలో విధిగా సందర్శించాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇక్కడి నందీశ్వరుడి ప్రస్తావన ఉంది. ‘శనగల బసవన్న’ అని పిలిచే ఈ పశుపతి వాహనం కలియుగాంతంలో పెద్ద రంకె వేస్తాడని బ్రహ్మంగారు పేర్కొన్నారు.
శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతమైన కర్నూలు జిల్లాలో ఉంది. హైదరాబాద్ నుంచి 214 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి శ్రీశైలానికి బస్సు సర్వీసులు ఉన్నాయి.
★ దేశంలో అడుక్కునే వాడికి అన్నం దొరుకుతుంది. కష్టపడే వాడికి నీడ దొరుకుతుంది. కానీ పేదవాడికి మాత్రం న్యాయం దొరకడం లేదు
★ ఆశకి, భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్లవి. వాళ్లు నన్ను పట్టించుకోకపోయినా నేను వాళ్లను పట్టించుకుంటాను.
★ ఓటమి అంటే అవమానం కాదు. మనల్ని మనం గెలుచుకునే అవకాశం.
★ నాకు కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు.
★ రాముడు అయోధ్యలో ఉన్నా అడవిలో ఉన్నా సంతోషంగానే ఉంటాడు. కానీ భక్తులే బాధపడతారు.
★ న్యాయం కోసం పోరాడేటప్పుడు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది.
★ ఒక అమ్మాయి వ్యక్తిత్వాన్ని ఆమె వేసుకునే దుస్తుల్లో, చేసే పనుల్లో, ఆమె ప్రవర్తన బట్టి అంచనా వేయడం తప్పు. వాళ్లకు నచ్చినట్లు వాళ్లు ఉండటం ప్రాథమిక హక్కు.
★ ఆడది అంటే బ్రాతూమ్‌లో ఉండే బొమ్మ కాదు. నిన్ను కనిపెంచిన అమ్మ కూడా. చీడ పురుగులు మగవాళ్ల తలలో పెట్టుకుని మందు ఆడవాళ్ల మీద కొడితే ఎలా?
★ ఆశతో ఉన్నవాడే గెలుపు, ఓటములు గురించి ఆలోచిస్తాడు. ఆశయంతో ముందుకు వెళ్లే వాడికి కేవలం ప్రయాణం గురించి మాత్రమే ఆలోచన ఉంటుంది.
★ నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా.. కానీ దాని బలం ముందు ఎవ్వరైనా తతలొగ్గాల్సిందే.. నువ్వు గెలుపు కోసం వచ్చావ్.. నేను న్యాయం కోసం వచ్చా.
★ మన ఇంట్లో ఉండే గడియారంలో చిన్న ముల్లు కూడా అమ్మాయి క్యారెక్టర్‌ని డిసైడ్ చేస్తుంది. రాత్రిపూట ఓ అమ్మాయి ఒంటరిగా వెళ్తే.. బైకులు, కార్లు, ఆటోలు అన్నీ స్లో డౌన్ అవుతాయి. సైడ్ మిర్రర్లు కిందికి దిగుతాయి. జిరాఫీల్లా తలలు పొడుచుకొస్తాయి. చూపులు సూదులవుతాయి. అబ్బాయిలు బయటికొస్తే సరదా.. అమ్మాయిలు బయటికొస్తే మాత్రం తేడా
★ మద్యం తాగడం హానికరం… ఆడవాళ్లకైనా, మగవాళ్లకైనా. ఆడవాళ్లు తాగితే పడుకుంటారు అనుకోవద్దు. అయినా ఒక మనిషికి ఉన్న అలవాట్లను బట్టి క్యారెక్టర్‌ని ఎలా డిసైడ్ చేస్తాం?
★ అమ్మాయి జీన్స్ వేసుకోకూడదు. స్కర్ట్ వేసుకోకూడదు. వాళ్లకి నచ్చిన బట్టలు వేసుకోకూడదు. ఎందుకంటే అలాంటి బట్టల వల్ల అమ్మాయిలకు ప్రమాదకంర కాదు. అబ్బాయిలకి ప్రమాదం. పాపం ఎందుకంటే.. అబ్బాయిలు టెంప్ట్ అయిపోతారు. అందుకే ఇలాంటి అమాయకులైన అబ్బాయిలను మనం కాపాడుకుందాం..
★ ఆడవాళ్లు మనకు ఆనందాన్ని మాత్రమే ఇవ్వాలి. హక్కుల గురించి అడిగితే… ఇలా బోనులో నిలబెట్టి వేశ్య అని ముద్ర వేసేస్తాం.
‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ తొలి షోతోనే సెన్సేషనల్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని సెంటర్స్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ రావడంతో యూనిట్ సంబరాల్లో మునిగిపోయింది. యూనానమస్ సూపర్ హిట్ రెస్పాన్స్ నేపథ్యంలో “వకీల్ సాబ్” చిత్ర బృందం హైదరాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీసులో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా… నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ….నిర్మాతగా మారి 18 ఏళ్లవుతోంది. లైఫ్‌లో ఎన్నో సక్సెస్ లు చూశాను. డిస్ట్రిబ్యూటర్‌గా అంతకుముందు నుంచే విజయాలు చూశాను. అయితే ‘వకీల్ సాబ్’ సక్సెస్ ఎందుకో కొత్తగా అనిపిస్తోంది. ఉదయం 4.30 కూకట్ పల్లిలో ప్రీమియర్ షోస్ చూశాను. ఆ ఫ్యాన్స్ మధ్యలో సినిమా చూస్తుంటే నన్ను నేను మర్చిపోయాను. నిర్మాతనని మర్చిపోయి ఫ్యాన్స్‌లాగే పేపర్స్ విసిరేశాను. పది నిమిషాల తర్వాత రియలైజ్ అయ్యాను. వకీల్ సాబ్ మీద మాసివ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమాను ఒక్కో స్టేజీలో చూస్తుంటే ఇలాంటి ఘన విజయాన్ని అంచనా వేశాం. ప్రేక్షకులు, అభిమానుల మధ్యలో సినిమా చూస్తుంటే ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. అప్పటికే అమెరికా, దుబాయ్ షోస్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. విదేశాల నుంచి సినిమా సూపర్ హిట్ అనే టాక్ వచ్చింది. వకీల్ సాబ్ విజయం నాకు కొత్తగా అనిపించడానికి కారణం, నేను కళ్యాణ్ గారితో సినిమా చేయాలనే కోరిక కావొచ్చు, ఇలాంటి సబ్జెక్ట్ కావొచ్చు. పవన్ గారితో పాటు ఈ సినిమా సక్సెస్ ఘనత దర్శకుడు శ్రీరామ్ వేణుకి ఇస్తాను. ఒక హీరోను ఇలా చూడాలి అనే ఆలోచనతో తను రాసుకున్న సీన్స్ కానీ, ప్రెజంటేషన్ గానీ సూపర్బ్. ప్రతి సీన్‌కు, ప్రతి డైలాగుకు ఆడియెన్స్ రియాక్ట్ అవుతున్నారు. గంటా పదిహేను నిమిషాల సెకండాఫ్ అయితే విజిల్స్, చప్పట్లు కొడుతున్నారు.
సినిమా అయ్యాక దర్శకుడు వేణుకు కాల్ చేశాను. ఇద్దరం కలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్లాం. ఆయనకు ముందుగా చెప్పలేదు, ఆ సంతోషంలో ఆయన ఇంటికి వెళ్లి పవన్ గారిని కలిసి సినిమా సక్సెస్ గురించి చెప్పాం. ఆయన కూడా చాలా సంతోషంగా ఫీలయ్యారు. కళ్యాణ్ గారు చాలా సక్సెస్‌లు చూశారు కానీ వకీల్ సాబ్‌లో అమ్మాయిలు, మహిళల గొప్పదనం తెలిపే కంటెంట్ ప్రేక్షకులకు రీచ్ అయితే ఆ సంతృప్తి వేరుగా ఉంటుంది. వేణు, పవన్ గారు ప్రతి సీన్ ఎలా చేయాలో డిస్కషన్ చేసుకుని షూట్ చేశారు. ఆ సీన్స్ ఇప్పుడు థియేటర్లో బాగా ఆకట్టుకుంటున్నాయి. దాదాపు గంట సేపు పవన్ గారితో మాట్లాడాం. నేను ప్రసాద్ ఐమాక్స్, సుదర్శన్ థియేటర్లకు వెళ్లి అక్కడ ఆడియెన్స్ రెస్పాన్స్ గమనించాను. టెర్రఫిక్ రెస్పాన్స్ ఉంది. ఏదో తెలియని అనుభూతికి లోనవుతున్నాను. ఇంతలో చాలా మంది మీడియా పర్సన్స్ ఫోన్ చేసి సినిమాను ప్రశంసిస్తూ మాట్లాడారు. మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. ఇదొక అద్భుతమైన ఎక్సీపిరియన్స్. బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్, కళ్యాణ్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటూ చెబుతున్నారు. ఈ సినిమా ఎంత సునామీ సృష్టిస్తుందో ఇప్పుడో చెప్పలేం. ఇప్పటిదాకా వచ్చిన రిపోర్ట్ మాత్రం ట్రెమండస్‌గా ఉన్నాయి. ఏ సినిమా ఎంత డబ్బు తెస్తుందనేది నేనెప్పుడూ ఆలోచించలేదు. మంచి సినిమా చేశాక డబ్బు ఆటోమేటిక్‌గా వస్తుంది. 18 ఇయర్స్ నుంచి మా సంస్థలో ఉన్న వేణు, నా డ్రీమ్ ప్రాజెక్ట్‌కు ఇంత విజయాన్ని ఇచ్చాడు. అందుకు అతన్ని సత్కరిస్తున్నాం’ అని అన్నారు.
దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ….ఓవర్సీస్‌తో పాటు అన్ని చోట్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూత్ మాస్ మహిళలు.. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆస్వాదిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అని చెబుతున్నారు. ఇవాళ టికెట్స్ దొరకని వారు రేపు బుక్ చేసుకుని వెళ్లండి. సినిమాను ఎంజాయ్ చేయండి. టాక్ బాగా స్ప్రెడ్ చేస్తున్న మీడియా వాళ్లకు థాంక్స్. రాజు గారు మార్నింగ్ షో సినిమా చూసి దర్శకుడిని పిలిచి మాట్లాడుతారు. ఇలాగే ఇవాళ నన్ను మాట్లాడేందుకు పిలిచారు. ఇద్దరం కలిసి పవన్ గారి దగ్గరకు వెళ్లాం. అభిమాన హీరోతో హిట్ సినిమా చేసి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారో తిరిగి ఆయనతో చర్చించుకోవడం మాటల్లో చెప్పలేని అనుభూతినిచ్చింది. లైఫ్ లాంగ్ ఈ మూవ్‌మెంట్స్ గుర్తుపెట్టుకుంటాను.
పవన్ గారి వ్యక్తిత్వం ఒక అభిమానిగా నాకు తెలుసు. అందుకే ఆయన పాత్రకు సత్యదేవ్ అని పేరు పెట్టి, ఆయన సమాజాన్ని చూసే కోణంలోనే డైలాగ్స్ రాశాను. సత్యదేవ్ క్యారెక్టర్ ప్రజల కోస పోరాడతాడు. ఆ కోణంలోనే మాటలు రాశాం. ఇవి జనసేన పార్టీ రిలేటెడ్‌గా కుదిరాయని ఎవరైనా అంటే సంతోషమే కదా. వకీల్ సాబ్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన రాజు గారికి, కళ్యాణ్ గారికి, త్రివిక్రమ్ గారికి థాంక్స్. ఈ విజయం ఆర్టిస్టుల సహా కంప్లీట్ టీమ్ వర్క్. అంతా తమ బెస్ట్ వర్క్ చేశారు. మా చిత్ర బృందం అందరికీ థాంక్స్’ అంటూ ఆయన ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీరామ్ వేణుకు నిర్మాత దిల్ రాజు శాలువా కప్పి, పుష్పగుచ్చంతో సత్కరించారు. అనంతరం యూనిట్ బాణాసంచా కాలుస్తూ వకీల్ సాబ్ సక్సెస్ సంబరాలు జరుపుకున్నారు.
మూడేళ్లు వెండితెరకు దూరమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’గా తిరిగి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలయ్యే ఏప్రిల్ 9వ తేదీ కోసం ఆయన అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ చేస్తున్న ప్రమోషన్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే వకీల్ సాబ్ ట్రైలర్ విడుదలై ఒక్క రోజులోనే రికార్డులు కొల్లగొట్టింది. తాజాగా ఈ ట్రైలర్ పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన మనసులో మాట బయటపెట్టారు.
వకీల్ సాబ్ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ చాలా ఫ్రెష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇప్పటివరకూ చూడని పవర్ స్టార్ స్క్రీన్‌పై కనిపిస్తున్నారు. ట్రైలర్‌లో పవన్ ఆటిట్యూడ్ నచ్చింది. అమ్మాయి తరపున వాళ్ళ కోసం పోరాడే లాయర్ పాత్రలో ఆయన అదరగొట్టేశారు పేర్కొంది. ముఖ్యంగా మీరు వర్జినా అంటూ చివర్లో అబ్బాయిని పవన్ ప్రశ్నించడం బాగుంది. మొదటి నుంచి చివరి వరకు ‘వకీల్ సాబ్’ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది’ అంటూ రేణుదేశాయ్ కితాబిచ్చింది. ఆమె స్పందన చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ తెలుగు రీమేక్‌గా ఈ ‘వకీల్ సాబ్’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శృతి హాసన్ నటించారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సినిమా మొత్తం ఈ ముగ్గురు అమ్మాయిల చుట్టూనే తిరుగుతుందని ట్రైలర్ చూస్తూనే తెలుస్తోంది. బోనీ కపూర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 9వ తేదీన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించింది తెలుగమ్మాయి అంజలి. “వకీల్ సాబ్” గురించి, ఈ చిత్రంలో తన పాత్ర గురించి అంజలి మీడియాతో పంచుకున్నారు.. ఈ విశేషాలు మీకోసం…
“డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు నన్ను అప్రోచ్ అయినప్పుడు పింక్ సినిమా రీమేక్ చేస్తున్నాం. కానీ తెలుగు నేటివిటీకి తగినట్లు కొత్తగా ఉంటుంది అని చెప్పారు. సినిమా గురించి ఆయన చెప్పిన కాన్సెప్ట్ బాగా నచ్చింది. మేము ఈ సినిమాలో చేసిన మార్పులు వకీల్ సాబ్ ట్రైలర్ చూశాక మీకే అర్థమై ఉంటుంది. హిందీ పింక్‌తో వకీల్ సాబ్ ను కంపేర్ చేసి చూడలేం. పవన్ కళ్యాణ్ గారితో నటించడం మొదట్లో కొన్ని రోజులు ఇబ్బందిగానే ఉండేది. ఆయన వస్తుంటే సెట్లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. నేను జనరల్‌గా ఎక్కువగా మాట్లాడతా. అలాంటి టైమ్ లో నా వల్ల మిగతా వారు ఏదైనా డిస్ట్రబ్ అవుతారా అని భయపడేదాన్ని. పవన్ గారు చాలా ఇన్ పుట్స్ ఇస్తూ సినిమా చేయించారు. అవన్నీ చూశాక మన క్యారెక్టర్ మనం సరిగ్గా చేస్తే సరిపోతుంది అనే నమ్మకం వచ్చింది. నాకూ, నివేదా, అనన్యకు మధ్య చాలా సీన్స్ ఉంటాయి. మా మధ్య రిలేషన్ లేకుంటే క్యారెక్టరైజేషన్స్ సరిగ్గా రావు. మా మధ్య చాలా తక్కువ టైమ్ లో బాండింగ్ ఏర్పడింది. అందుకే చాలా ఈజీగా నటించగలిగాం.
నా క్యారెక్టర్ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. పవన్ గారు సెట్స్లో చాలా కామ్‌గా ఉంటూనే అందరితోనూ మాట్లాడతారు. ఆయన దగ్గరకు వెళ్లి మాట్లాడాలంటేనే నాకు పదిహేను రోజులు పట్టింది. పవన్ గారితో సినిమా అనగానే జంప్ చేశాను. అయితే నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో అని ఆలోచించాను. పవన్ గారితో సినిమా చేస్తున్నాను అనేదే నా మనసులో ఉండేది. పెద్ద హీరోతో పనిచేస్తున్నప్పుడు లేడీ క్యారెక్టర్స్ కొట్టుకుపోతాయి. కానీ వకీల్ సాబ్‌లో నాకు చాలా కీలకమైన పాత్ర దక్కింది. వకీల్ సాబ్‌ను పింక్‌తో పోలిస్తే.. పింక్ కథలోని సోల్ ఇందులో అలాగే ఉంటుంది. మార్పులన్నీ ఆ మెయిన్ స్టోరీ చుట్టూ చేశారు. మహిళల మీద జరిగే అఘాయిత్యాలు మనకు నిత్యకృత్యం అయ్యాయి. ఆ వార్తలు మనకు కామన్ అయి పోయాయి. కానీ అలాంటి ఘటన మన ఇంట్లో ఇలాంటిది జరిగితే ఎలా రెస్పాండ్ అవుతాం అనేది చూపిస్తున్నాం. ఇలాంటి సందర్భాలు ఏ అమ్మాయికీ రాకూడదు.
సినిమా ఇండస్ట్రీలో నాయికలకు కొన్ని చేదు సందర్భాలు ఎదురవుతుంటాయి అంటారు. అయితే ఇక్కడ సెలబ్రిటీ, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అని కాదు అమ్మాయి అమ్మాయే. ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంటుంది. అవును డబ్బులు తీసుకున్నాం అని. ఆ ఒక్క సీన్ చాలు నా క్యారెక్టర్ ఎంత బలంగా ఉంటుంది అని చెప్పేందుకు. ఈ సీన్ మరో రోజు చేయాల్సింది. కానీ ఆ రోజు సడెన్‌గా షూట్ చేశాం. ఈ కోర్ట్ సీన్ చేశాక, నేను వణికిపోయాను. అంత ఉద్వేగానికి గురయ్యాను. ఇలాంటి ఎమోషనల్ సీన్స్ చేసేప్పుడు నటిగా నేనూ ఉద్వేగపడతాను. అలా లీనమైతేనే సీన్ కరెక్ట్‌గా వస్తుంది.
వకీల్ సాబ్‌లో ప్రకాష్ రాజ్ గారితో మరోసారి పనిచేసే అవకాశం వచ్చింది. రెండు సీన్స్‌లో ప్రకాష్ రాజ్ గారితో కలిసి నటించాను. మన ఎదుట ఉన్న ఆర్టిస్ట్ బాగా నటిస్తేనే మనకూ ఆ టైమింగ్ వస్తుంది. వాళ్లు ఫర్మార్మ్ చేయకుంటే మనమూ డల్ అయిపోతాం. ప్రకాష్ రాజ్ గారితో పనిచేసినప్పుడు మనకూ తెలియకుండానే ఆ ఎనర్జీ వచ్చేస్తుంది. మీకు ఇష్టమైతే ఎస్ లేకుంటే నో చెప్పడం మీ ఛాయిస్. నో చెప్పకూడదు అని ప్రశ్నించే రైట్ ఎవరికీ లేదు. ఇష్టపడటం ఇష్ట పడకపోవడం అమ్మాయి నిర్ణయానికి వదిలేయాలి. సినిమాలోనూ పవన్ గారు ఇదే విషయాన్ని చెప్పబోతున్నారు.
‘మగువా మగువా’ పాట హిందీలో లేదు. మహిళల మీద ఈ పాట చేయడం సినిమాలో చేసిన మంచి మార్పు. మగువా పాట విన్నప్పుడు మీ ఫేస్‌లో ఒక సంతోషం వస్తుంది. ఈ సాంగ్ కోసం చాలా మాంటేజ్‌లు షూట్ చేశాం. వాటిలో బెస్ట్ అనిపించుకున్నవి పాటలో పెట్టాం. పింక్ హిందీ, తమిళ చిత్రాల్లో మగువా లాంటి పాట ఉండదు. ట్రైలర్‌లో మీరు చూసిన సీన్ చేశాక పవన్ గారు క్లాప్ కొట్టి నన్ను అప్లాజ్ చేశారు. సాధారణంగా పవన్ గారు ఎక్స్ ప్రెసివ్‌గా ఉండరు. కానీ ఆయన ప్రశంసించాక సంతోషం కలిగింది.
ప్రీమారిటల్ సెక్స్ అనేది వ్యక్తిగత విషయం. వారి వారి ఇష్టాలను బట్టి ఉంటుంది. ఎవరి ఆలోచనలు బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఫెమినిజం అనే విషయాన్ని గుడ్ వేలో వాడితే మంచిదనేది నా ఉద్దేశం. నేను గతంలో కొన్ని గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేశాను. వాటిలో వకీల్ సాబ్ క్యారెక్టర్ తప్పకుండా ఉంటుంది. తెలుగు, తమిళంలో కొన్ని ఎగ్జైటింగ్ చిత్రాలు చేస్తున్నాను. వాటి వివరాలు త్వరలో చెబుతాను. ఏ హీరోయిన్ అయినా తన కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటుంది అనే దానిపైనే ఆమె కెరీర్ ఆధారపడి ఉంటుంది. నాకు కెరీర్ లో ఎప్పుడూ గ్యాప్ రాలేదు. నచ్చిన సినిమాలు ఎంపిక చేసుకుంటూ నటిస్తున్నాను. నేను ఇప్పుడు ఏ దారిలో వెళ్తున్నానో భవిష్యత్‌లోనూ అలాగే కంటిన్యూ చేస్తా” అంటూ తన ఇంటర్వ్యూని ముగించారు అంజలి.
“లవ్ స్టోరి” చిత్రంలోని ‘సారంగ దరియా’ పాట యూట్యూబ్ వ్యూస్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 32 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించింది. సౌతిండియాలో మరే లిరికల్ సాంగ్ ఇంత తక్కువ టైమ్‌లో వంద మిలియన్ మార్క్ చేరుకోలేదు. ‘రౌడీ బేబీ’, ‘బుట్ట బొమ్మ’ వంటి సంచలన పాటలు కూడా లిరికల్ సాంగ్ వ్యూస్ లో ‘సారంగ దరియా’ వెనకబడిపోవడం గమనార్హం. ఫిబ్రవరి 28న ఆదిత్య మ్యూజిక్ ఛానెల్‌లో అప్ లోడ్ అయిన ‘సారంగ దరియా’ పాట తొలి రోజు నుంచే శ్రోతలను ఆకట్టుకుంటూ మిలియన్ల కొద్దీ వ్యూస్ అందుకుంటూ వచ్చింది. ‘సారంగ దరియా’కు సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ ఇచ్చిన క్యాచీ ట్యూన్, సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం, ఉత్సాహంగా మంగ్లీ పాడిన తీరు సామాన్యుడి నుంచి విశిష్ట వ్యక్తుల దాకా అందరినీ ఆకట్టుకుందది.
ఈ పాటలో శేఖర్ మాస్టర్ స్టెప్పులను నాయిక సాయి పల్లవి తనదైన స్టైల్‌లో మెరుపు తీగలా చేసింది. సాయి పల్లవి టైమింగ్, ఎనర్జీ, ఎక్స్ ప్రెషన్స్, ఇన్‌వాల్వ్ మెంట్ ‘సారంగ దరియా’ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. “లవ్ స్టోరి” చిత్రంలో ‘సారంగ దరియా’ పాటను తీసుకోవాలి అని దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన ఆలోచన 100 శాతం సక్సెస్ అయింది. ఈ సినిమాకు ‘సారంగ దరియా’ డ్రైవింగ్ ఫోర్స్ అయ్యిందనే చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల.
మెగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిందిన ‘ఆచార్య’ టీమ్. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయిక. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చరణ్ ఈ సినిమాను సిద్ధ అనే కీలక పాత్రలో కనిపించనున్నాడు. చిరంజీవి 152వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’లోని మొదటి లిరికల్ సాంగ్‌ను బుధవారం విడుదల చేసింది చిత్ర బృందం.
‘లాహే లాహే’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇందులో సీనియర్ నటి సంగీత ప్రత్యేక ఆకర్షణగా నిలవగా చందమామ కాజల్ అగర్వాల్ ఆమెతో కలిసి కాలు కదిపింది. గుడి సమీపంలో సాగే ఈ పాటకు మధ్యలో చిరు తనదైన శైలిలో స్టెప్పులేశాడు. దీనికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. మణిశర్మ స్వరాలు సమకుర్చారు. సింగర్స్ హరిక నారాయణ్, సాహితి చాగంటిలు ఆలపించిన ఈ పాటకు దినేష్ కొరియోగ్రఫీ అందించాడు.
‘ఓ మై ఫ్రెండ్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు శ్రీరామ్ వేణు. నాని హీరోగా ‘ఎంసీఏ’ చిత్రాన్ని రూపొందించి మంచి విజయం అందుకున్నారు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ అభిమాని అయిన శ్రీరామ్ వేణు…ఒక అభిమానిగానే ఈ సినిమా తీశానని చెబుతున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమాకు దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.
క్వారెంటైన్ వల్ల అందరం ఇళ్లలోనే ఉన్నాం. ఇన్నాళ్లూ థియేటర్ సెలబ్రేషన్స్‌కు ఆడియెన్స్ దూరంగా ఉన్నారు. మొన్న థియేటర్లో వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఓ పావు గంట లోపలికి వెళ్లేందుకు మరో పావుగంట బయటకు వచ్చేందుకు పట్టింది. అంత పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చారు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి. పవన్ గారి సినిమా కోసం వాళ్లు ఎంత వేచి చూస్తున్నారో అప్పుడు అర్థమైంది.
అభిమాన హీరోను డెరెక్ట్ చేయడం కంటే కావాల్సింది ఏముంటుంది. ఈ ప్రాజెక్ట్ ను ఎంతో సంతోషంగా తీసుకున్నాను. మేకింగ్ టైమ్‌లో ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదు. దర్శకుడిగా చెబుతున్నా.. వకీల్ సాబ్ సినిమా బాగుంటుందనే పూర్తి నమ్మకం ఉంది. మనకు నచ్చిన పని చేసినప్పుడు వచ్చే సంతృప్తిని సంతోషాన్ని ఇప్పుడు పొందుతున్నా. కష్ట సుఖాలు ప్రతి పనిలో ఉంటాయి. ఒత్తిడి, కష్టం ప్రతి సినిమాకు, ప్రతి దర్శకుడికి ఉంటాయి. ఎంసీఏ టైమ్ లోనూ ఒత్తిడిది. వకీల్ సాబ్ సినిమా చేసేప్పుడు ప్రతి రోజూ ఎంజాయ్ చేశాను. పవన్ గారిని చూడగానే సంతోషం కలుగుతుంది. హ్యాపీగా ఫీలవుతాను.
ఈ ప్రాజెక్ట్ సెట్ అయినప్పుడు పవన్ గారిని వెళ్లి కలిశాను. ఆయన నాతో మాట్లాడుతూ… పింక్ రీమేక్ సినిమాను ఎలా చేద్దామనుకుంటున్నారు, మీ ఆలోచనలు ఏంటి అని అడిగారు. కళ్యాణ్ గారితో రెండు మూడు సార్లు మీటింగ్ జరిగింది. వకీల్ సాబ్ కథ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్ గురించి నేను అనుకునే విషయాలు ఆయనతో చెప్పాను.ఆయన కూడా కొన్ని ఇన్ ఫుట్స్ ఇచ్చారు. దాన్ని బట్టి ముందుకు వెళ్ళాం. కళ్యాణ్ గారికి రకరకాల ఫ్యాన్స్ ఉంటారు. ఏ,బీ,సీ అనే కేటగిరీలు ఉంటాయి. వాళ్లందరికీ చేరేలా సినిమాను రూపొందించాను. పింక్ ఒరిజినల్ అలా ఉండదు. కథ రాస్తున్నప్పుడు, స్క్రీన్ ప్లే విషయంలో, మాటల విషయంలో పవన్ గారి ఇమేజ్ గుర్తు చేసుకుంటూ వచ్చాను.
సబ్జెక్ట్, నేను రాసుకున్న స్క్రీన్ ప్లేకు తగినట్లే పవన్, నాయికల క్యారెక్టర్స్ ఉంటాయి. ట్రైలర్‌లోనే కథ చెప్పేశాను. ట్రైలర్ చూశాక మీకు అది అర్థమయి ఉంటుంది. వుమెన్ ఎంపవర్ మెంట్ గురించి ఇప్పటికే రెండు భాషల్లో ఇదే సినిమా చేశారు. వకీల్ సాబ్‌లోనూ ఆ మెయిన్ పాయింట్ ఉంటుంది. అది వదిలేసి కోర్ పాయింట్ తప్పించుకుని వేరే విధంగా సినిమాను రూపొందించలేదు.
నా మొదటి సినిమా ఓ మై ఫ్రెండ్ సరిగ్గా ఆడలేదు. ఆరేడేళ్లు టైమ్ తీసుకుని ఎంసీఏ చిత్రాన్ని చేశాను. ఫ్రెండ్స్ కథతో ఓ మై ఫ్రెండ్, వదిన మరిది కాన్సెప్ట్ తో చేసిన ఎంసీఏ ఈ రెండు సినిమాలు వకీల్ సాబ్ సినిమా చేసేందుకు ఉపయోగపడ్డాయి. నా ఫస్ట్ సినిమా రిలీజై ఈ నవంబర్ కు సరిగ్గా పదేళ్లు పూర్తవుతున్నాయి. నాకు సినిమాలంటే ఇష్టం. హిట్స్ ఫ్లాప్స్ ఏది వచ్చినా ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాను. పవన్ గారితో పనిచేయాలి అనేది నా డ్రీమ్. నా జీవితంలో ఏడేళ్లు సినిమాకు దూరంగా ఉన్నాను. అదే నా జీవితంలో అది పెద్ద కష్టం. ఇక అంతకంటే కష్టమేదీ ఉండదు.
పవన్ గారితో పనిచేస్తున్నప్పుడు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. నా పని ఏంటో నాకు తెలుసు కాబట్టి ఇబ్బంది అనిపించలేదు. కోర్ట్ రూమ్ డ్రామా కాబట్టి దాన్ని మార్చలేదు. కోర్ ఐడియా అలాగే ఉంటుంది. ఒక స్టార్ హీరో సినిమా చేస్తున్నప్పుడు ఒక వ్యాపారం, ట్రేడ్ దాని చుట్టూ అల్లుకుని ఉంటాయి. దానికి తగినట్లే వకీల్ సాబ్ సినిమా తెరకెక్కించాను. టీజర్‌లో చూసినట్లు ఎక్కువ సేపు కోర్ట్ రూమ్ డ్రామానే చూపించాను. వకీల్ సాబ్ సినిమా విషయంలో ఎలాంటి గొప్ప స్పందన వస్తుందో చూడాలి.
ఫెయిల్యూర్ వచ్చినా, సక్సెస్ వచ్చినా తెల్లవారి పెన్ పేపర్ పట్టుకుని నా పని నేను చేయాల్సిందే. నేను మనసునే నమ్ముతాను. జయాపజయాలు ఏది వచ్చినా మన పని మనం చేయాల్సిందే. ప్రతి వంద కిలోమీటర్లకు భారతదేశంలో ప్రతిదీ మారిపోతుంటుంది. హిందీ పింక్ ఒకలా ఉంటుంది. తమిళ పింక్ మరోలా ఉంటుంది. పవన్ గారు అంటే ఏంటో, ఒక అభిమానిగా, దర్శకుడిగా నాకు తెలుసు. కాబట్టి ఆయనకు సరిపోయేలా సబ్జెక్ట్‌లో మార్పులు చేశాను. ఎవరి ఊహలకు తగినట్లు సినిమా చేయలేను. బద్రి సినిమాను గుర్తు చేయడానికే ప్రకాష్ రాజ్ గారి పాత్రకు నందా అని పెట్టాను. అందులో సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారితో ఓ స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ ఉంటుంది. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పలేము. అది సంగీత దర్శకుడు థమన్ గారు రివీల్ చేస్తారు.
పవన్ కళ్యాణ్ గారితో ప్రతి ఒక్క దర్శకుడు సినిమా చేయాలని కోరుకుంటారు. పవన్ గారికున్న స్టేచర్‌కు ఉమెన్ ఎంపవర్‌మెంట్ కంటే మంచి కాన్సెప్ట్ ఉండదు. ఆయనకు ప్రస్తుతం బాధ్యత గల సినిమాలే సరైనవి. నేనో కథ రాశాను, ఓ పాత్రను డిజైన్ చేశాను. అందులో ఎలాంటి పొలిటికల్ వ్యూస్ ఉన్నాయో లేదో అనేది చెప్పలేను. మీరు సినిమా చూసి చెప్పాలి. పింక్ కథలో మార్పులు చెప్పినప్పుడు పవన్ గారు బాగున్నాయని అన్నారు. పవన్ గారితో ప్రతి రోజూ బెస్ట్ మూవ్ మెంట్ అనుకోవచ్చు. మిగిలిన పుటేజ్ చూసుకున్నప్పుడు కూడా నాకు ఎగ్జైటింగ్ గానే ఉంది.
వకీల్ సాబ్ సినిమా విషయంలో నేను ఒత్తిడికి లోనయ్యే టైమ్ కూడా లేదు. కథ కుదిరింది, ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. సినిమా చేసుకుంటూ వెళ్లాం. నెక్ట్ సినిమా గురించి ఇంకా స్పష్టత లేదు.త్వరలో డీటెయిల్స్ చెప్తాను. వకీల్ సాబ్ తీసుకొచ్చే ఎలాంటి రికార్డ్స్ గురించి ఆలోచించడం లేదు. మొన్న ఫ్యాన్స్ తో మీటింగ్ జరిగింది. మనకు సినిమా రికార్డ్స్ తో గుర్తుండదు. ఒక సినిమా అంకెలతో గుర్తుండదు. మనం ఎమోషన్ తో కనెక్ట్ అయితే ఆ సినిమా ఎప్పటకీ గుర్తుంటుంది. బొమ్మరిల్లు సినిమాను మనం అంకెలతో గుర్తుపెట్టకోలేదు కదా.
వకీల్ సాబ్‌లోని ఒక స్టిల్ లీక్ చేశారు ఫ్యాన్స్. అది బాగుందని చూసి. ఆ స్టిల్‌నే పోస్టర్ లో పెట్టాను. లాయర్ సాబ్, మగువా లోకానికి తెలుసా నీ విలువజజ లాంటి కొన్ని టైటిల్స్ అనుకున్నాం. కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేయకుండా వకీల్ సాబ్ అని పెట్టుకున్నాం. మగువా మగువా అని పదాలు పెట్టాలని నేనే సూచించాను. అమ్మాయిల్లో ఓ క్యారెక్టర్ అమాయకంగా ఉండాలి. ఆ క్యారెక్టర్ కు అనన్య నాగళ్లను తీసుకున్నాను. కాన్ఫిడెన్స్ ఉన్న మరో అమ్మాయి పాత్రకు అంజలిని తీసుకున్నాం. మోడ్రన్ గర్ల్ క్యారెక్టర్‌కు నివేదాను సెలెక్ట్ చేశాం. ఈ ముగ్గురూ తమ క్యారెక్టర్స్ అద్భుతంగా చేశారు.