Category Archives: Behind the Scenes

మే 21న వస్తున్న ‘తిమ్మరుసు’

‘బ్లఫ్ మాస్టర్‌, ఉమామ‌హేశ్వరాయ ఉగ్రరూప‌స్య’ వంటి చిత్రాలతో విలక్షణ హీరోగా మెప్పించిన‌ సత్యదేవ్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి’  ట్యాగ్‌లైన్. ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జ‌వాల్కర్ హీరోయిన్‌.  ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే 21న విడుద‌ల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.
 
ఈ సంద‌ర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘తిమ్మరుసు’ సినిమా చిత్రీకరణంతా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. సత్యదేవ్‌ పవర్‌ఫుల్ లాయర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఆయన లుక్‌, క్యారెక్టర్‌ డిజైనింగ్‌ చాలా కొత్తగా ఉంటుంది. డైరెక్టర్‌ శరణ్‌ కొపిశెట్టి, పక్కా ప్లానింగ్‌తో సినిమాను శరవేగంగా పూర్తి చేశారు. ఈ సినిమా టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి సందేశం కూడా ఉంటుంది’’ అన్నారు.

నటీనటులు:
సత్యదేవ్‌,  ప్రియాంక జ‌వాల్కర్‌, బ్రహ్మాజీ, అజయ్‌, రవిబాబు, అంకిత్, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌ తదితరులు

సాంకేతిక వర్గం:
దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి
నిర్మాతలు: మహేశ్‌ కోనేరు, సృజన్‌
సంగీతం:  శ్రీచరణ్‌ పాకాల
సినిమాటోగ్రఫీ:  అప్పూ ప్రభాకర్‌
ఆర్ట్‌:  కిరణ్‌ కుమార్‌ మన్నె
యాక్షన్‌: వెంకట్ మాస్టర్,  రియల్‌ సతీశ్‌
పి.ఆర్‌.ఒ:  వంశీ కాక





నితిన్‌ ‘మాస్ట్రో’ మూవీ ఫస్ట్‌ గ్లింప్స్‌‌

నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘మాస్ట్రో’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ ‘అంధాధూన్’కిది రీమేక్. మార్చి 30న(మంగళవారం) నితిన్‌ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌లో కళ్లకు నల్లటి గాగుల్స్‌ పెట్టుకొని, చేత్తో ఓ స్టిక్‌ పట్టుకొని నడుస్తూ అంధునిగా కనిపిస్తున్నాడు నితిన్‌. పోస్టర్‌లో పియానోపై రక్తపు మరకలు కథపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.

ఇక తాజాగా విడుదలైన గ్లింప్స్‌.. సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్‌ చేస్తోంది. ఈ గ్లింప్స్‌ చూసిన ప్రతి ఒక్కరూ.. రాజా ది గ్రేట్‌ లా.. నితిన్‌ ది గ్రేట్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహతిసాగర్‌ సంగీతం సినిమాపై క్రేజ్‌ని పెంచేలా ఉంది. శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్‌ హీరోయిన్‌. తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. నితిన్‌ 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూన్‌ 11న విడుదల చేస్తామని కూడా చిత్రయూనిట్ ప్రకటించింది


వి.వి.వినాయక్ చేతుల మీదుగా ‘నిన్ను చేరి’ వెబ్ సిరీస్ లోగో లాంచ్


తేజా హనుమాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజు ఆనేం, మాధురి హీరో హీరోయిన్లుగా గౌతమ్ రాజు, భద్రం, శాంతి స్వరూప్, కిషోరో దాసు నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న వెబ్ సిరీస్ ‘నిన్ను చేరి’. సాయికృష్ణ తల్లాడ డైరెక్షన్ చేసిన ఈ వెబ్ సిరీస్ టైటిల్‌ లోగోను హోలీ పండుగ సందర్భంగా ఈ సిరీస్ టైటిల్ లుక్ ని ప్రముఖ డైరెక్టర్ వి.వి.వినాయక్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్‌గా శంకర్ అందరికీ సుపరిచితుడు. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకి, నిన్ను చేరి టీమ్‌కి శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.

నిర్మాత శంకర్ కొప్పిశెట్టి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 175 సినిమాలకి డిస్ట్రిబ్యూటర్‌గా చేశాను, ఇప్పుడు నిర్మాతగా మారి నిన్ను చేరి అనే వెబ్ సిరీస్ ని నిర్మించాను. ఈ సిరీస్ లోగోని మా అన్నయ్య వి.వి.వినాయక్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది, అలానే మా డైరెక్టర్ సాయికృష్ణ అండ్ మా టీం బాగా కష్ట పడి మంచి అవుట్ ఫుట్ వచ్చేలా ఇష్టపడి పని చేశారు.

డైరెక్టర్ సాయికృష్ణ తల్లాడ మాట్లాడుతూ.. నేను సినిమాలు చేస్తున్నప్పుడు విడుదల సమయంలో థియేటర్లల్లో సరైన టైమ్‌కి విడుదల అయ్యేలా శంకర్ గారు హెల్ప్ చేశారు. అప్పుడే సినిమా మీద ఆయనకున్న గౌరవం తెలుసుకున్నాను. అలాంటి డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు నిర్మాతగా మారి నన్ను వారి బ్యానర్లో నేను డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది. చిన్నప్పుడు ఆది, లక్ష్మి లాంటి సినిమాలు చూస్తున్నప్పుడు వి.వి.వినాయక్ సార్‌ని ఒక్కసారైనా కలవాలని అనుకునే వాడిని. అలాంటిది ఈ రోజు ఆయన చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మా టీం అందరూ కరోనా టైమ్‌లో తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రాజెక్ట్ ని షూట్ చేసాం’ అని తెలిపారు.

‘నిన్ను చేరి’.. టీమ్


నటీనటులు: రాజు అనేం, మాధురి, బేబీ హాసిని, గౌతమ్ రాజు, భద్రం, కిషోర్ దాసు, శాంతి స్వరూప్ తదితరులు.
కథ మాటలు: శివ కాకు,
సంగీతం: వి.ఆర్.ఏ.ప్రదీప్,
సౌండ్ ఎఫెక్ట్స్‌: వెంకట్,
గ్రాఫిక్స్: రాహుల్ ,
బ్యానర్: తేజా హనుమాన్ ప్రోడక్షన్స్,
నిర్మాత: శంకర్ కొప్పిశెట్టి,
డైరెక్టర్: సాయికృష్ణ తల్లాడ


‘వకీల్ సాబ్’ ట్రైలర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘వకీల్ సాబ్’ ట్రైలర్ వచ్చేసింది. ‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ టీజర్‌తో తన పాత్ర ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ట్రైలర్‌లో తన విశ్వరూపం చూపించారు. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘పింక్‌’కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. శ్రీరామ్‌ వేణు దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించారు. శ్రుతిహాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో అభిమానుల మధ్య నిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు. ఇదొక కోర్టు డ్రామా కథాంశంతో రూపొందిన చిత్రం. దీనికి తగ్గట్లుగానే ట్రైలర్‌లో కోర్టు రూమ్‌ డ్రామానే ఎక్కువ చూపించారు. నివేదా కేసు వాదించే న్యాయవాదిగా పవన్‌ కనిపించారు. ప్రకాష్‌రాజ్‌ వీరిని వ్యతిరేకించే న్యాయవాదిగా నందా పాత్రలో కనిపించారు. ప్రచార చిత్రంలో ‘పింక్‌’ ఛాయలు కనిపించినా.. పవన్‌ ఇమేజ్‌కి తగ్గట్లుగా కథకు కావాల్సినంత కమర్షియల్‌ టచ్‌ ఇచ్చినట్లు అర్థమైంది. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌ – ప్రకాష్‌రాజ్‌ల మధ్య నడిచిన కోర్టు వాదనలు.. పవన్‌ యాక్షన్‌ హంగామా.. ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 


చెరుకు రసం తాగుతున్నారా.. ఉపయోగాలు తెలిస్తే వదలిపెట్టరు

వేసని సీజన్‌ వచ్చేసింది.. రోడ్లపై నిమ్మరసం, పుదీనా నీళ్లు, మజ్జిగ, చెరుకు రసాలకు డిమాండ్‌ పెరిగిపోతోంది. ఎండలో బయటికి వెళ్ళినపుడు తప్పనిసరిగా జ్యూస్‌ గానీ, కూల్‌డ్రింక్ గానీ తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే డీహైడ్రేషన్, అలసట ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్నింటికంటే చెరుకు రసం బెటరని చాలామంది సూచిస్తుంటారు. చెరుకు రసం కేవలం దాహాన్ని తీర్చేందుకే కాదు.. శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మలినాలను తొలగించి ఆరోగ్యాన్ని పెంచుతుంది. చెరుకు రసం సంతానోత్పత్తికి కూడా మంచిదని చెబుతున్నారు.

చెరుకు రసం వల్ల ఉపయోగాలు
* బాలింతలు చెరుకు రసాన్ని తాగితే పాల ఉత్పత్తి పెరుగుతుందట.
* మగవారిలో వీర్య కణాల నాణ్యతను మెరుగుపరుస్తుంది
మహిళలకు పీరియడ్స్‌లో వచ్చే నొప్పిని నివారిస్తుంది.
శరీరంలోని ఉబ్బరాన్ని తగ్గించడంతో పాటు కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.
కామెర్ల చికిత్సకు కూడా బాగా ఉపయోగపడుతుంది.
తరుచూ చెరుకు రసం తాగితే శరీరం స్మూత్‌గా తయారవుతుంది.
మొటిమలను నివారించడంతో పాటు చుండ్ర సమస్యను కూడా తొలగిస్తుంది.
సహజ డిటాక్స్‌గా పనిచేసే చెరుకు రసం వారంలో మూడుసార్లు తీసుకుంటే ఎంతో మంచింది.
జీర్ణ సంబంధమైన సమస్యలను తొలగిస్తుంది.


గుణ‌శేఖ‌ర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘శాకుంత‌లం’ మొదలైంది

టాలీవుడ్‌లో పౌరాణిక, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైన‌మిక్ డైరెక్టర్ గుణ‌శేఖ‌ర్ ఆదిప‌ర్వంలోని ఆహ్లాద‌క‌ర‌మైన ప్రేమ‌క‌థ ఆధారంగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం `శాకుంతలం`. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు స‌మ‌ర్పణ‌లో డీఆర్‌పీ-గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ నిర్మిస్తున్నారు. స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని శకుంతలగా టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు స‌న్నివేశానికి అల్లు అర‌వింద్ క్లాప్ నివ్వగా, ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు కెమెరా స్విఛాన్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు శాకుంతలం అనే పాన్ ఇండియా‌ సినిమాని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. డీఆర్పీ గుణ టీం వర్క్స్ (దిల్ రాజు ప్రొడక్షన్స్ అండ్ గుణ టీం వర్క్స్) కలిసి సంయుక్తంగా నిర్మించడం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా దిల్ రాజు వంటి మేకర్ ఈ ప్రాజెక్టును వెన్నుతట్టి అన్ని విషయాల్లో ప్రోత్సహించారు. నా లాంటి ఒక ద‌ర్శకుడికి దిల్‌రాజులాంటి మేక‌ర్ ప్రాత్సాహం ఉంటే దాని మేకింగ్, నిర్మాణ విలువలు ఎలా ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. దిల్ రాజు గారు నాతో చేతులు కలపడం ఎంతో ఆనందంగా ఉంది. నా ప్రథమ పుత్రిక నీలిమ గుణ ఆర్ట్స్ అండ్ విజువల్ కల్చర్‌లో మాస్టర్స్ చేసింది. ఈ మూవీతో నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దానికి దిల్‌రాజు ప్రోత్సాహం మ‌రింత ఆనంద‌దాయ‌కం.

 

ఇది కూడా చదవండి: రామ్‌తో ‘జగడం’ రీమేక్ చేయాలనుంది: సుకుమార్

 

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయడమంటే మామూలు విషయం కాదు. శాకుంతలం సినిమాలో శకుంతలగా ఎవరు నటిస్తారని ఎన్నో కథనాలు వచ్చాయి. ఆ సున్నితత్త్వం ఎవరికి ఉంది? అనుకుంటుండగా సినీప్రియుల నుంచి ఎక్కువగా నాకు సమంత పేరు వినిపించింది. సెలెక్టివ్‌గా కథలు ఎంచుకునే సమంత నేను కథ చెప్పగానే ఓకే చెప్పేశారు. ఈ పాత్ర కోసం నాలుగు నెలల క్రితమే అన్ని విద్యల్లో ఆరితేరింది. క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకుంది. వ్యాపార దృష్టితోనే కాకుండా మంచి సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో దిల్ రాజు గారు ఈ సినిమాకు ఎంత బ‌డ్జెట్ అయితే అంత‌ ఖర్చుపెట్టండి మీ వెన‌కాల నేను ఉన్నాను అన్న భరోసా ఇచ్చారు. ఇక దుష్యంతుడిగా దేవ్ మోహన్ గారిని కూడా నీలిమనే సెలెక్ట్ చేసింది. కథ గురించి అంతా తెలుసుకుని ఓకే చెప్పారు. సినిమాకు కావాల్సిన హార్స్ రైడింగ్‌, స్వోర్డ్‌ ఫైటింగ్ ఇలా అన్నీ నేర్చుకున్నారు. రేపు వీరిద్దరు సినిమాలో శకుంతలా? దుష్యంతుడా? అనేలా పోటాపోటీగా ఉంటారు` అని చెప్పుకొచ్చారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. ‘సమంత మేనేజర్ మ‌హేంద్ర వచ్చి నాతో శాకుంతలం సినిమా గురించి చెప్పాడు. గుణ శేఖర్ మళ్లీ నిర్మాతగా ఎందుకు చేస్తున్నారు.. ఆయన వెనక ఎవరైనా ఉంటే బాగుంటుంది అన్నాను. మీరు ఉంటారా స‌ర్ అని ఆయన అన్నప్పుడు స‌రే కాని నేను క‌థ వినాలి అని చెప్పాను. ఒక్కడు సినిమా రిలీజ్ రోజు సత్యం థియేటర్లో చూశాను. అలాంటి సినిమా ఒకటి తీయాలని కలలు కన్నాను.. కానీ తీయలేకపోయాను. ఇలాంటి సినిమాలు తీయాలనే కోరిక అప్పుడే మొదలైంది. శాకుంతలం లాంటి హిస్టారికల్ సినిమాను తీయడం మామూలు విషయం కాదు. సమంత ఆల్రెడీ కథకు ఓకే చెప్పింది కాబట్టి.. గుణ శేఖర్ కథ చెప్పేటప్పుడే సమంతను శ‌కుంత‌ల‌గా ఊహించుకున్నాను. అన్నీ ఎమోషన్స్‌ బాగా కుదిరాయి. ఎమోషన్స్ పరంగా చాలా సన్నివేశాలు అదిరిపోయాయి. సినిమాను ఇంకో లెవెల్‌కు తీసుకెళ్తాను అని గుణ శేఖ‌ర్ అన్నారు. నాలుగు నెలల నుంచి దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. గుణశేఖ‌ర్ ఈ సినిమాతో త‌న కూతురిని నిర్మాతగా ప‌రిచ‌యం చేస్తున్నారు. వారి వెనుక నేనున్నాను. 2022లో ఈ మూవీని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇక దుష్యంతుడిగా ఎవరు అని అనుకుంటున్న సమయంలో ఓ ఫోటో షూట్‌ చూడమని గుణ శేఖర్ రమ్మన్నారు. దేవ్ మీద చేసి ఫోటో షూట్ చూపించారు. ఆ గెట‌ప్‌లో నిజంగా కింగ్‌లాగే ఉన్నాడు. మంచి దుష్యంతుడు దొరికాడు అనుకున్నాను. గుణ శేఖర్‌కు తగ్గ టీం దొరికింది. అద్భుతమైన సినిమా మీకు అందించేందుకు ప్రయత్నం చేస్తాం’ అన్నారు.

ఇది కూడా చదవండి: దుమ్ము రేపుతున్న ‘సారంగ దరియా’ సాంగ్.. టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డు

 

చిత్ర నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ.. ‘నిర్మాతగా నా మొదటి సినిమా. మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అల్లు అర‌వింద్‌గారికి నా ధన్యవాదాలు. స‌మంత‌, హ‌న్షిత చాలా స‌పోర్ట్ చేస్తున్నారు’ అన్నారు.

హీరో దేవ్ మోహన్ మాట్లాడుతూ.. ‘తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కావడం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది. ఓ రాజుగా దుష్యంతుడి పాత్రలో కనిపించడం ఎంతో సంతోషంగా ఉంది. గుణ శేఖర్ లాంటి దర్శకుడితో పని చేయడం ఎంతో గర్వంగా ఉంది. అసలు సిసలు నిర్మాత దిల్‌రాజు గారు మా వెనక ఉన్నారు. మీరు కూడా నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. సమంతతో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉంది’ అని అన్నారు.

స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని మాట్లాడుతూ.. ‘నాకు ఎప్పుడూ ఓ చిన్న బాధ ఉండేది. నేను కొన్ని పాత్రలు పోషించలేనేమోనని అనుకున్నాను. రొమాంటిక్, విలన్, యాక్షన్ ఇలా అన్ని పాత్రలు చేశాను. కానీ నా డ్రీమ్ రోల్ అంటే పీరియాడిక‌ల్‌ రోల్, రాజకుమారి పాత్రలను చేయాలని అనుకున్నాను. ఇప్పటికీ నేను ఖాళీగా ఉంటే డిస్నీ సినిమాలు చూస్తుంటాను. నా కెరీర్‌లో ఇలాంటి సమయంలో ఈ పాత్ర ఇవ్వడం మరిచిపోలేని గొప్ప బహుమతి. దిల్ రాజు గారు, గుణ శేఖర్ గారు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. వంద శాతం నేను చేయాల్సింది చేస్తాను. గుణ శేఖర్ గారు ప్రతీ సీన్‌ను అద్భుతంగా చెప్పారు. రిఫరెన్సెస్ అడిగితే కూడా లేదని నీలిమ చెప్పింది. అంతా దర్శకుడి మైండ్‌లోనే ఉందని అన్నారు. ఈ పాత్రను పోషించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా బడ్జెట్ నా రేంజ్‌ను మించి ఉంది. అయినా సరే నేను నా ప్రయత్నం చేస్తాను’ అని పేర్కొన్నారు.

సినిమా వివరాలు
తారాగణం: స‌మంత అక్కి‌నేని, దేవ్ మోహ‌న్ తదితరులు
సినిమాటోగ్రాఫ‌ర్‌: శేఖ‌ర్ వి జోసెఫ్‌,
సంగీతం: మ‌ణిశ‌ర్మ,
ఆర్ట్ డైరెక్టర్‌: అశోక్ కుమార్‌,
ఎడిట‌ర్‌: ప్రవీణ్ పూడి,
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: నీతా లుల్లా,
డైలాగ్స్‌: సాయి మాధ‌వ్ బుర్రా,
లిరిక్స్‌: చైత‌న్య ప్రసాద్‌, శ్రీ‌మ‌ణి,
కొరియోగ్రాఫ‌ర్‌: రాజు సుంద‌రం, పీఆర్వో: బి.ఎ.రాజు,
స‌మ‌ర్ఫణ‌: దిల్‌రాజు,
నిర్మాత‌: నీలిమ గుణ‌,
ర‌చ‌న‌- ద‌ర్శక‌త్వం: గుణ‌శేఖ‌ర్‌.


రామ్‌తో ‘జగడం’ రీమేక్ చేయాలనుంది: సుకుమార్

పదిహేడేళ్ల కుర్రాడు… కొత్తగా గ్యాంగ్‌లో జాయిన్ అయ్యాడు. కొట్లాటకు గ్యాంగ్ సభ్యులతో కలిసి వెళ్ళాడు. ఎదురుగా పెద్ద గ్యాంగ్ ఉంది. వాళ్ళను చూసి కుర్రాడి గ్యాంగ్ లీడర్ భయపడి వెనకడుగు వేశాడు. కానీ కుర్రాడు వేయలేదు. చురకత్తుల్లాంటి చూపులతో తనకంటే బలవంతుడిని ఢీ కొట్టి ధైర్యంగా నిలబడ్డాడు. ఆ సీన్‌కి రాజమౌళి కూడా ఫ్యాన్ అయిపోయాడు. గ్యాంగ్‌కి కుర్రాడు కొత్త. కాని సినిమా ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు కాదు. అప్పటికే ‘దేవదాసు’తో అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ సీన్‌తో మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. యాక్షన్ హీరోకి కావాల్సిన లక్షణాలు ఇతడిలో ఉన్నాయని నిరూపించుకున్నాడు. ఇవన్నీ చెబుతుంటే ‘జగడం’లో సీన్ అని గుర్తొచ్చే ఉంటుంది. ఆ ఎనర్జిటిక్ హీరోయే రామ్ పోతినేని.

హీరోగా రామ్‌కి, దర్శకుడిగా సుకుమార్‌కీ ‘జగడం’ ఎంతో పేరు తెచ్చింది. రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా పైన చెప్పిన సీన్ గురించి ప్రస్తావించారంటేనే అందులో స్ట్రెంగ్త్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ‘జగడం (వయలెన్స్) ఈజ్ ఫ్యాషన్’, ‘5 ఫీట్ 8 ఇంచెస్ కింగు లాంటి శీనుగాడు’ పాటలు యూత్ ప్లే లిస్టులో ఉంటున్నాయి. ఓవర్ ద ఇయర్స్ ప్రేక్షకులలో అభిమానులను పెంచుకుంటూ వస్తున్న ‘జగడం’ విడుదలై మార్చి 16కి 14 వసంతాలు పూర్తి చేసుకుని 15వ ఏట ప్రవేశిస్తోంది.ఈ సందర్భంగా సినిమా విశేషాలను, అప్పటి సంగతులను దర్శకుడు సుకుమార్ మరోసారి గుర్తు చేసుకున్నారు.

ఆ ఆలోచన నుంచి… ‘జగడం’

చిన్నప్పటి నుంచి ఒక విషయం నాకు ఇన్స్పిరేషన్ గా ఉండేది. ఎక్కడైనా గొడవ జరుగుతుంటే… నేను వెళ్ళేసరికి ఆగిపోతుండేది. కొట్టుకుంటారేమో, కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలని ఉండేది. నేను ఎదుగుతున్న క్రమంలోనూ ఆ ఆలోచన పోలేదు. ఎక్కడైనా కొట్లాటలో వాళ్ళు కొట్టుకోలేదంటే డిజప్పాయింట్ అయ్యేవాడిని. నా స్నేహితులైనా అరుచుకుంటుంటే బాధ అనిపించేది. వీళ్ళు కొట్టుకోవడం లేదేంటి? అని! ఎక్కడో మనలో వయలెన్స్ ఉంది. వయలెన్స్ చూడాలని తపన ఉంది. ఉదాహరణకు, అడవిని తీసుకుంటే అందులో ప్రతిదీ వయలెంట్ గా ఉంటుంది. పులి-జింక తరహాలో ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి. ఎక్కడ చూసినా బ్లడ్ ఉంటుంది. ‘ఆహారాన్ని సాధించే దారి అంతా వయలెన్స్‌తో ఉంటుంది. అలాగే సెక్స్‌ను సాధించే దారి ప్రేమతో ఉంటుంది. ఇలా ఎన్నో ఆలోచనల నుంచి మొదలైనదే జగడం. మన చుట్టుపక్కల చూస్తే చిన్నపిల్లలు ఎవరైనా పడిపోతే, దెబ్బ తగిలితే… ‘నిన్ను కొట్టింది ఇదే నాన్నా’ అని రెండుసార్లు కొట్టి చూపిస్తాం. ఇటువంటి విషయాలు నాలో కనెక్ట్ అయ్యి ఓ సినిమా సినిమా చేద్దామని అనుకున్నా.

‘ఆర్య’ కంటే ముందే…
నిజాయతీగా చెప్పాలంటే… ‘ఆర్య’ కంటే ముందు ‘జగడం’ చేద్దామనుకున్నా. నా దగ్గర చాలా ప్రేమకథలు ఉన్నాయి. ‘ఆర్య’ తర్వాత వాటిలో ఏదైనా చేయవచ్చు. వయలెన్స్ నేపథ్యంలో కొత్తగా ఏదైనా చేద్దామని అనుకున్నా. అప్పటికి నాలో ఆలోచనలు రకరకాలుగా మారి ‘జగడం’ కథ రూపొందింది.

రామ్… చాలా షార్ప్!

‘జగడం’ కథ పూర్తయిన సమయానికి ‘దేవదాసు’ విడుదలై ఏడు రోజులు అయినట్టు ఉంది. నేను సినిమా చూశా. రామ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. హుషారుగా చేస్తున్నాడు. ఎఫ‌ర్ట్‌లెస్‌గా పెర్ఫార్మన్స్ చేస్తున్నాడని అనిపించింది. రామ్‌తో ‘జగడం’ చేయాలని ‘స్రవంతి’ రవికిశోర్ గారిని అప్రోచ్ అయ్యాం. ఆయన సరే అన్నారు. అలా ‘జగడం’ మొదలైంది. అప్పుడు రామ్‌కి పదిహేడేళ్లు అనుకుంట. ఆ టైమ్‌లో ఏం చెప్పినా చేసేసేవాడు. ‘నాకు రాదు. రాలేదు. చేయలేను’ అనే మాటలు ఉండేవి కావు. చేత్తో కాయిన్ తిప్పమని అడిగితే… పక్కకి వెళ్లి పది నిమిషాల్లో ప్రాక్టీస్ చేసి వచ్చి చేసేవాడు. అంత షార్ప్. నాకు తెలిసి… ఇప్పటికీ రామ్‌ని ఆ బ్రిలియన్స్ కాపాడుతుంది. దానివల్లే తను సక్సెస్ అవుతున్నాడు.

రామ్ మంచి స్థాయికి వస్తాడని అప్పుడే అనుకున్నా

నేను ప్రతిక్షణం రామ్‌ను చూసి షాక్ అవుతూ ఉండేవాడిని. అంటే… చిన్న వయసులో ప్రతిదీ ఈజీగా చేయగలుగుతున్నాడు. వెంటనే పట్టుకుని పెర్ఫార్మన్స్ చేయగలుగుతున్నాడు. ఈ సన్నివేశంలో ఇలా కాకుండా వేరేలా చేస్తే బావుంటుందని అడిగితే… మనం కోరుకున్న దానికి తగ్గట్టు ఎక్స్‌ప్రెష‌న్స్‌ వెంటనే మార్చి చేసేవాడు. అన్ని రియాక్షన్స్ ఉండాలంటే ఎక్కువ లైఫ్ ఎక్స్‌పీరియ‌న్స్‌లు ఉండాలి. అప్పటికి తనకు ఎటువంటి లైఫ్ ఎక్స్‌పీరియ‌న్స్‌లు ఉన్నాయో తెలియదు కానీ… ఎటువంటి రియాక్షన్ అడిగినా చేసి చూపించేవాడు. ‘జగడం’ చేసే సమయానికి రామ్‌ను చూస్తే వండర్ బాయ్ అనిపించాడు. ఇండస్ట్రీలో రామ్ మంచి స్థాయికి వస్తాడని అప్పుడే అనుకున్నాను. ఇప్పుడు అదే ప్రూవ్ అయ్యింది.

 

ప్రతి పాట హిట్టే

‘ఆర్య’తో దేవిశ్రీ ప్రసాద్‌తో నాకు అనుబంధం ఉంది. ‘జగడం’ చిత్రానికీ తనను సంగీత దర్శకుడిగా తీసుకున్నాను. ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ కాకుండా రెండు వస్తువుల మధ్య ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది? – ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చిందే ‘5 ఫీట్ 8 ఇంచెస్’ సాంగ్. చంద్రబోస్ గారికి నేను ఈ కథ అనుకున్నాని చెబితే వెంటనే పాట రాసిచ్చారు. దానికి దేవి ట్యూన్ చేశారు. అదే ‘వయలెన్స్ ఈజ్ ప్యాషన్’. సినిమాలో ప్రతి పాట హిట్టే. అప్పట్లో ‘జగడం’ ఆల్బమ్ సెన్సేషన్. సినిమాకి తగ్గట్టు దేవి మౌల్డ్ అవుతాడు. మంచి నేపథ్య సంగీతం ఇస్తాడు. ‘జగడం’ పతాక సన్నివేశాల్లో నేపథ్య సంగీతాన్ని నేను ఇప్పటికీ హమ్ చేస్తూ ఉంటాను.

‘వయలెన్స్’ ఎందుకు ‘జగడం’గా మారిందంటే?

వయలెన్స్ ను ఎక్కువ ఎగ్జాగరేట్ చేస్తున్నారని, గ్లామరస్ గా చూపిస్తున్నారని సెన్సార్ సభ్యులు అభ్యంతరం చెప్పారు. అందువల్ల ‘వయలెన్స్ ఈజ్ ప్యాషన్’ పాటలో వయలెన్స్ బదులు ‘జగడం’ అని పెట్టాల్సి వచ్చింది. అప్పట్లో సెన్సార్‌లో చాలా పోయాయి. సినిమా కథనమే మిస్ అయింది. అప్పట్లో నాకు సెన్సార్ ప్రాసెస్ గురించి పూర్తిగా తేలికపోవడం వల్ల చాలా కట్స్ వచ్చాయి. కట్స్ లేకుండా సినిమా ఉంటే ఇంకా బావుండేది. సినిమాకు సరైన అప్రిసియేష‌న్‌ రాలేదేమో అని నాలో చిన్న బాధ ఇప్పటికీ ఉంది.

స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌… సూపర్35… సినిమాటోగ్రఫీ!

సినిమాటోగ్రాఫర్ రత్నవేలుగారు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ది బెస్ట్ ‘జగడం’ అని చెప్పొచ్చు. ఎందుకంటే… అప్పుడే chooke s4 లెన్స్ వచ్చాయి. అప్పట్లో స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌ తన సినిమాలకు ఏ కెమెరా ఎక్విప్‌మెంట్ ఉపయోగించారో, మేమూ అదే ఎక్విప్‌మెంట్ ఉపయోగించాం. సూపర్ 35 ఫార్మాట్ లో షూట్ చేశాం. అప్పటివరకు మన దగ్గర ఎవరూ ఆ ఫార్మాట్ లో ఎవరూ చేయలేదు. కెమెరా యాంగిల్, లైటింగ్ మూడ్… రత్నవేలు ప్రతిదీ డిస్కస్ చేసి చేసేవారు. ప్రతిదీ పర్ఫెక్ట్ షాట్ అని చెప్పొచ్చు. ఇండియాలో సినిమాటోగ్రఫీ పరంగా చూస్తుంటే… వన్నాఫ్ ది బెస్ట్ ‘జగడం’ అని చెప్పొచ్చు. ఆ క్రెడిట్ మొత్తం రత్నవేలుగారిదే. సినిమాటోగ్రఫీనీ అప్రిషియేట్ చేయలేదు. ఆ సినిమా ఫొటోగ్రఫీ నాకు ఎంతో ఇష్టం.

ముంబైలో దర్శకుల దగ్గర… లైబ్రరీల్లో ‘జగడం’

ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ చేశారు. సినిమా విడుదలైన కొన్నాళ్లకు ఒకసారి మేమిద్దరం ఫ్లైట్‌లో కలిశాం. మాటల మధ్యలో ‘జగడం’ గురించి వచ్చింది. ‘ప్లాప్ సినిమా కదా. మాట్లాడుకోవడం ఎందుకు అండీ’ అన్నాను. అందుకు ‘అలా అనుకోవద్దు. నేను ముంబై నుంచి వస్తున్నాను. చాలామంది దర్శకుల దగ్గర, వాళ్ళ లైబ్రరీల్లో జగడం సినిమా ఉంది. నీకు అంతకన్నా ఏం కావాలి? చాలామంది నీకు ఫోనులు చేయలేకపోవచ్చు. నిన్ను కలవడం వాళ్ళకు కుదరకపోవచ్చు. కానీ, చాలా అప్రిసియేషన్ పొందిన సినిమా ఇది. టెక్నీషియన్స్ దానిని రిఫరెన్స్‌గా పెట్టుకున్నారు’ అని శ్రీకర్ ప్రసాద్ గారు చెప్పారు.

నిర్మాత గురించి…

చిత్రనిర్మాణంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ జేడీ సోంపల్లిగారు ఎంతో మద్దతుగా నిలిచారు. వాళ్ళ అబ్బాయి ఆదిత్యబాబు తరపున ఆయన సినిమా నిర్మించారు. ఆదిత్య ఇప్పటికీ నాతో టచ్ లో ఉంటాడు. నా ఫంక్షన్లకు తనను కూడా పిలుస్తాను.

ఆరు నెలలు ఆడిషన్స్ చేశాం!

అప్పట్లో ఆర్టిస్టులు చాలా తక్కువ మంది. ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ వస్తున్నాయి. వెబ్ సిరీస్ లు వచ్చాయి. చాలామంది ఆర్టిస్టులు దొరుకుతున్నారు. అప్పుడు అలా కాదు కాబట్టి ఎక్కువ ఆడిషన్స్ చేశాం. సుమారు ఆరు నెలలు ‘జగడం’ ఆడిషన్స్ జరిగి ఉంటాయి. తాగుబోతు రమేష్, వేణు, ధనరాజ్… ఇలా ఆ సినిమా నుంచి చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. ఇప్పటికి వాళ్ళు అదే గౌరవం, ప్రేమతో చూస్తారు.

త్వరలో రామ్‌తో సినిమా చేస్తా!

రామ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. త్వరలో మళ్ళీ తప్పకుండా చేస్తా. మరో మంచి సినిమా చేయాలి. యాక్చువల్లీ… ఇప్పటి రామ్‌తో మళ్ళీ ‘జగడం’ రీమేక్ చేయాలని ఉంది. మళ్ళీ ఇప్పటి రామ్‌తో మళ్ళీ జగడం చూసుకోవాలని ఉంది.