Category Archives: Celebrity

పవర్ స్టార్ కాంప్లిమెంట్ జీవితంలో మర్చిపోలేను: అంజలి

‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించింది తెలుగమ్మాయి అంజలి. “వకీల్ సాబ్” గురించి, ఈ చిత్రంలో తన పాత్ర గురించి అంజలి మీడియాతో పంచుకున్నారు.. ఈ విశేషాలు మీకోసం…

“డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు నన్ను అప్రోచ్ అయినప్పుడు పింక్ సినిమా రీమేక్ చేస్తున్నాం. కానీ తెలుగు నేటివిటీకి తగినట్లు కొత్తగా ఉంటుంది అని చెప్పారు. సినిమా గురించి ఆయన చెప్పిన కాన్సెప్ట్ బాగా నచ్చింది. మేము ఈ సినిమాలో చేసిన మార్పులు వకీల్ సాబ్ ట్రైలర్ చూశాక మీకే అర్థమై ఉంటుంది. హిందీ పింక్‌తో వకీల్ సాబ్ ను కంపేర్ చేసి చూడలేం. పవన్ కళ్యాణ్ గారితో నటించడం మొదట్లో కొన్ని రోజులు ఇబ్బందిగానే ఉండేది. ఆయన వస్తుంటే సెట్లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. నేను జనరల్‌‌గా ఎక్కువగా మాట్లాడతా. అలాంటి టైమ్ లో నా వల్ల మిగతా వారు ఏదైనా డిస్ట్రబ్ అవుతారా అని భయపడేదాన్ని. పవన్ గారు చాలా ఇన్ పుట్స్ ఇస్తూ సినిమా చేయించారు. అవన్నీ చూశాక మన క్యారెక్టర్ మనం సరిగ్గా చేస్తే సరిపోతుంది అనే నమ్మకం వచ్చింది. నాకూ, నివేదా, అనన్యకు మధ్య చాలా సీన్స్ ఉంటాయి. మా మధ్య రిలేషన్ లేకుంటే క్యారెక్టరైజేషన్స్ సరిగ్గా రావు. మా మధ్య చాలా తక్కువ టైమ్ లో బాండింగ్ ఏర్పడింది. అందుకే చాలా ఈజీగా నటించగలిగాం.

నా క్యారెక్టర్ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. పవన్ గారు సెట్స్లో చాలా కామ్‌గా ఉంటూనే అందరితోనూ మాట్లాడతారు. ఆయన దగ్గరకు వెళ్లి మాట్లాడాలంటేనే నాకు పదిహేను రోజులు పట్టింది. పవన్ గారితో సినిమా అనగానే జంప్ చేశాను. అయితే నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో అని ఆలోచించాను. పవన్ గారితో సినిమా చేస్తున్నాను అనేదే నా మనసులో ఉండేది. పెద్ద హీరోతో పనిచేస్తున్నప్పుడు లేడీ క్యారెక్టర్స్ కొట్టుకుపోతాయి. కానీ వకీల్ సాబ్‌లో నాకు చాలా కీలకమైన పాత్ర దక్కింది. వకీల్ సాబ్‌ను పింక్‌తో పోలిస్తే.. పింక్ కథలోని సోల్ ఇందులో అలాగే ఉంటుంది. మార్పులన్నీ ఆ మెయిన్ స్టోరీ చుట్టూ చేశారు. మహిళల మీద జరిగే అఘాయిత్యాలు మనకు నిత్యకృత్యం అయ్యాయి. ఆ వార్తలు మనకు కామన్ అయి పోయాయి. కానీ అలాంటి ఘటన మన ఇంట్లో ఇలాంటిది జరిగితే ఎలా రెస్పాండ్ అవుతాం అనేది చూపిస్తున్నాం. ఇలాంటి సందర్భాలు ఏ అమ్మాయికీ రాకూడదు.

సినిమా ఇండస్ట్రీలో నాయికలకు కొన్ని చేదు సందర్భాలు ఎదురవుతుంటాయి అంటారు. అయితే ఇక్కడ సెలబ్రిటీ, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అని కాదు అమ్మాయి అమ్మాయే. ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంటుంది. అవును డబ్బులు తీసుకున్నాం అని. ఆ ఒక్క సీన్ చాలు నా క్యారెక్టర్ ఎంత బలంగా ఉంటుంది అని చెప్పేందుకు. ఈ సీన్ మరో రోజు చేయాల్సింది. కానీ ఆ రోజు సడెన్‌గా షూట్ చేశాం. ఈ కోర్ట్ సీన్ చేశాక, నేను వణికిపోయాను. అంత ఉద్వేగానికి గురయ్యాను. ఇలాంటి ఎమోషనల్ సీన్స్ చేసేప్పుడు నటిగా నేనూ ఉద్వేగపడతాను. అలా లీనమైతేనే సీన్ కరెక్ట్‌గా వస్తుంది.

వకీల్ సాబ్‌లో ప్రకాష్ రాజ్ గారితో మరోసారి పనిచేసే అవకాశం వచ్చింది. రెండు సీన్స్‌లో ప్రకాష్ రాజ్ గారితో కలిసి నటించాను. మన ఎదుట ఉన్న ఆర్టిస్ట్ బాగా నటిస్తేనే మనకూ ఆ టైమింగ్ వస్తుంది. వాళ్లు ఫర్మార్మ్ చేయకుంటే మనమూ డల్ అయిపోతాం. ప్రకాష్ రాజ్ గారితో పనిచేసినప్పుడు మనకూ తెలియకుండానే ఆ ఎనర్జీ వచ్చేస్తుంది. మీకు ఇష్టమైతే ఎస్ లేకుంటే నో చెప్పడం మీ ఛాయిస్. నో చెప్పకూడదు అని ప్రశ్నించే రైట్ ఎవరికీ లేదు. ఇష్టపడటం ఇష్ట పడకపోవడం అమ్మాయి నిర్ణయానికి వదిలేయాలి. సినిమాలోనూ పవన్ గారు ఇదే విషయాన్ని చెప్పబోతున్నారు.

‘మగువా మగువా’ పాట హిందీలో లేదు. మహిళల మీద ఈ పాట చేయడం సినిమాలో చేసిన మంచి మార్పు. మగువా పాట విన్నప్పుడు మీ ఫేస్‌లో ఒక సంతోషం వస్తుంది. ఈ సాంగ్ కోసం చాలా మాంటేజ్‌లు షూట్ చేశాం. వాటిలో బెస్ట్ అనిపించుకున్నవి పాటలో పెట్టాం. పింక్ హిందీ, తమిళ చిత్రాల్లో మగువా లాంటి పాట ఉండదు. ట్రైలర్‌లో మీరు చూసిన సీన్ చేశాక పవన్ గారు క్లాప్ కొట్టి నన్ను అప్లాజ్ చేశారు. సాధారణంగా పవన్ గారు ఎక్స్ ప్రెసివ్‌గా ఉండరు. కానీ ఆయన ప్రశంసించాక సంతోషం కలిగింది.

ప్రీమారిటల్ సెక్స్ అనేది వ్యక్తిగత విషయం. వారి వారి ఇష్టాలను బట్టి ఉంటుంది. ఎవరి ఆలోచనలు బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఫెమినిజం అనే విషయాన్ని గుడ్ వేలో వాడితే మంచిదనేది నా ఉద్దేశం. నేను గతంలో కొన్ని గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేశాను. వాటిలో వకీల్ సాబ్ క్యారెక్టర్ తప్పకుండా ఉంటుంది. తెలుగు, తమిళంలో కొన్ని ఎగ్జైటింగ్ చిత్రాలు చేస్తున్నాను. వాటి వివరాలు త్వరలో చెబుతాను. ఏ హీరోయిన్ అయినా తన కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటుంది అనే దానిపైనే ఆమె కెరీర్ ఆధారపడి ఉంటుంది. నాకు కెరీర్ లో ఎప్పుడూ గ్యాప్ రాలేదు. నచ్చిన సినిమాలు ఎంపిక చేసుకుంటూ నటిస్తున్నాను. నేను ఇప్పుడు ఏ దారిలో వెళ్తున్నానో భవిష్యత్‌లోనూ అలాగే కంటిన్యూ చేస్తా” అంటూ తన ఇంటర్వ్యూని ముగించారు అంజలి.


రామ్‌తో ‘జగడం’ రీమేక్ చేయాలనుంది: సుకుమార్

పదిహేడేళ్ల కుర్రాడు… కొత్తగా గ్యాంగ్‌లో జాయిన్ అయ్యాడు. కొట్లాటకు గ్యాంగ్ సభ్యులతో కలిసి వెళ్ళాడు. ఎదురుగా పెద్ద గ్యాంగ్ ఉంది. వాళ్ళను చూసి కుర్రాడి గ్యాంగ్ లీడర్ భయపడి వెనకడుగు వేశాడు. కానీ కుర్రాడు వేయలేదు. చురకత్తుల్లాంటి చూపులతో తనకంటే బలవంతుడిని ఢీ కొట్టి ధైర్యంగా నిలబడ్డాడు. ఆ సీన్‌కి రాజమౌళి కూడా ఫ్యాన్ అయిపోయాడు. గ్యాంగ్‌కి కుర్రాడు కొత్త. కాని సినిమా ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు కాదు. అప్పటికే ‘దేవదాసు’తో అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ సీన్‌తో మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. యాక్షన్ హీరోకి కావాల్సిన లక్షణాలు ఇతడిలో ఉన్నాయని నిరూపించుకున్నాడు. ఇవన్నీ చెబుతుంటే ‘జగడం’లో సీన్ అని గుర్తొచ్చే ఉంటుంది. ఆ ఎనర్జిటిక్ హీరోయే రామ్ పోతినేని.

హీరోగా రామ్‌కి, దర్శకుడిగా సుకుమార్‌కీ ‘జగడం’ ఎంతో పేరు తెచ్చింది. రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా పైన చెప్పిన సీన్ గురించి ప్రస్తావించారంటేనే అందులో స్ట్రెంగ్త్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ‘జగడం (వయలెన్స్) ఈజ్ ఫ్యాషన్’, ‘5 ఫీట్ 8 ఇంచెస్ కింగు లాంటి శీనుగాడు’ పాటలు యూత్ ప్లే లిస్టులో ఉంటున్నాయి. ఓవర్ ద ఇయర్స్ ప్రేక్షకులలో అభిమానులను పెంచుకుంటూ వస్తున్న ‘జగడం’ విడుదలై మార్చి 16కి 14 వసంతాలు పూర్తి చేసుకుని 15వ ఏట ప్రవేశిస్తోంది.ఈ సందర్భంగా సినిమా విశేషాలను, అప్పటి సంగతులను దర్శకుడు సుకుమార్ మరోసారి గుర్తు చేసుకున్నారు.

ఆ ఆలోచన నుంచి… ‘జగడం’

చిన్నప్పటి నుంచి ఒక విషయం నాకు ఇన్స్పిరేషన్ గా ఉండేది. ఎక్కడైనా గొడవ జరుగుతుంటే… నేను వెళ్ళేసరికి ఆగిపోతుండేది. కొట్టుకుంటారేమో, కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలని ఉండేది. నేను ఎదుగుతున్న క్రమంలోనూ ఆ ఆలోచన పోలేదు. ఎక్కడైనా కొట్లాటలో వాళ్ళు కొట్టుకోలేదంటే డిజప్పాయింట్ అయ్యేవాడిని. నా స్నేహితులైనా అరుచుకుంటుంటే బాధ అనిపించేది. వీళ్ళు కొట్టుకోవడం లేదేంటి? అని! ఎక్కడో మనలో వయలెన్స్ ఉంది. వయలెన్స్ చూడాలని తపన ఉంది. ఉదాహరణకు, అడవిని తీసుకుంటే అందులో ప్రతిదీ వయలెంట్ గా ఉంటుంది. పులి-జింక తరహాలో ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి. ఎక్కడ చూసినా బ్లడ్ ఉంటుంది. ‘ఆహారాన్ని సాధించే దారి అంతా వయలెన్స్‌తో ఉంటుంది. అలాగే సెక్స్‌ను సాధించే దారి ప్రేమతో ఉంటుంది. ఇలా ఎన్నో ఆలోచనల నుంచి మొదలైనదే జగడం. మన చుట్టుపక్కల చూస్తే చిన్నపిల్లలు ఎవరైనా పడిపోతే, దెబ్బ తగిలితే… ‘నిన్ను కొట్టింది ఇదే నాన్నా’ అని రెండుసార్లు కొట్టి చూపిస్తాం. ఇటువంటి విషయాలు నాలో కనెక్ట్ అయ్యి ఓ సినిమా సినిమా చేద్దామని అనుకున్నా.

‘ఆర్య’ కంటే ముందే…
నిజాయతీగా చెప్పాలంటే… ‘ఆర్య’ కంటే ముందు ‘జగడం’ చేద్దామనుకున్నా. నా దగ్గర చాలా ప్రేమకథలు ఉన్నాయి. ‘ఆర్య’ తర్వాత వాటిలో ఏదైనా చేయవచ్చు. వయలెన్స్ నేపథ్యంలో కొత్తగా ఏదైనా చేద్దామని అనుకున్నా. అప్పటికి నాలో ఆలోచనలు రకరకాలుగా మారి ‘జగడం’ కథ రూపొందింది.

రామ్… చాలా షార్ప్!

‘జగడం’ కథ పూర్తయిన సమయానికి ‘దేవదాసు’ విడుదలై ఏడు రోజులు అయినట్టు ఉంది. నేను సినిమా చూశా. రామ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. హుషారుగా చేస్తున్నాడు. ఎఫ‌ర్ట్‌లెస్‌గా పెర్ఫార్మన్స్ చేస్తున్నాడని అనిపించింది. రామ్‌తో ‘జగడం’ చేయాలని ‘స్రవంతి’ రవికిశోర్ గారిని అప్రోచ్ అయ్యాం. ఆయన సరే అన్నారు. అలా ‘జగడం’ మొదలైంది. అప్పుడు రామ్‌కి పదిహేడేళ్లు అనుకుంట. ఆ టైమ్‌లో ఏం చెప్పినా చేసేసేవాడు. ‘నాకు రాదు. రాలేదు. చేయలేను’ అనే మాటలు ఉండేవి కావు. చేత్తో కాయిన్ తిప్పమని అడిగితే… పక్కకి వెళ్లి పది నిమిషాల్లో ప్రాక్టీస్ చేసి వచ్చి చేసేవాడు. అంత షార్ప్. నాకు తెలిసి… ఇప్పటికీ రామ్‌ని ఆ బ్రిలియన్స్ కాపాడుతుంది. దానివల్లే తను సక్సెస్ అవుతున్నాడు.

రామ్ మంచి స్థాయికి వస్తాడని అప్పుడే అనుకున్నా

నేను ప్రతిక్షణం రామ్‌ను చూసి షాక్ అవుతూ ఉండేవాడిని. అంటే… చిన్న వయసులో ప్రతిదీ ఈజీగా చేయగలుగుతున్నాడు. వెంటనే పట్టుకుని పెర్ఫార్మన్స్ చేయగలుగుతున్నాడు. ఈ సన్నివేశంలో ఇలా కాకుండా వేరేలా చేస్తే బావుంటుందని అడిగితే… మనం కోరుకున్న దానికి తగ్గట్టు ఎక్స్‌ప్రెష‌న్స్‌ వెంటనే మార్చి చేసేవాడు. అన్ని రియాక్షన్స్ ఉండాలంటే ఎక్కువ లైఫ్ ఎక్స్‌పీరియ‌న్స్‌లు ఉండాలి. అప్పటికి తనకు ఎటువంటి లైఫ్ ఎక్స్‌పీరియ‌న్స్‌లు ఉన్నాయో తెలియదు కానీ… ఎటువంటి రియాక్షన్ అడిగినా చేసి చూపించేవాడు. ‘జగడం’ చేసే సమయానికి రామ్‌ను చూస్తే వండర్ బాయ్ అనిపించాడు. ఇండస్ట్రీలో రామ్ మంచి స్థాయికి వస్తాడని అప్పుడే అనుకున్నాను. ఇప్పుడు అదే ప్రూవ్ అయ్యింది.

 

ప్రతి పాట హిట్టే

‘ఆర్య’తో దేవిశ్రీ ప్రసాద్‌తో నాకు అనుబంధం ఉంది. ‘జగడం’ చిత్రానికీ తనను సంగీత దర్శకుడిగా తీసుకున్నాను. ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ కాకుండా రెండు వస్తువుల మధ్య ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది? – ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చిందే ‘5 ఫీట్ 8 ఇంచెస్’ సాంగ్. చంద్రబోస్ గారికి నేను ఈ కథ అనుకున్నాని చెబితే వెంటనే పాట రాసిచ్చారు. దానికి దేవి ట్యూన్ చేశారు. అదే ‘వయలెన్స్ ఈజ్ ప్యాషన్’. సినిమాలో ప్రతి పాట హిట్టే. అప్పట్లో ‘జగడం’ ఆల్బమ్ సెన్సేషన్. సినిమాకి తగ్గట్టు దేవి మౌల్డ్ అవుతాడు. మంచి నేపథ్య సంగీతం ఇస్తాడు. ‘జగడం’ పతాక సన్నివేశాల్లో నేపథ్య సంగీతాన్ని నేను ఇప్పటికీ హమ్ చేస్తూ ఉంటాను.

‘వయలెన్స్’ ఎందుకు ‘జగడం’గా మారిందంటే?

వయలెన్స్ ను ఎక్కువ ఎగ్జాగరేట్ చేస్తున్నారని, గ్లామరస్ గా చూపిస్తున్నారని సెన్సార్ సభ్యులు అభ్యంతరం చెప్పారు. అందువల్ల ‘వయలెన్స్ ఈజ్ ప్యాషన్’ పాటలో వయలెన్స్ బదులు ‘జగడం’ అని పెట్టాల్సి వచ్చింది. అప్పట్లో సెన్సార్‌లో చాలా పోయాయి. సినిమా కథనమే మిస్ అయింది. అప్పట్లో నాకు సెన్సార్ ప్రాసెస్ గురించి పూర్తిగా తేలికపోవడం వల్ల చాలా కట్స్ వచ్చాయి. కట్స్ లేకుండా సినిమా ఉంటే ఇంకా బావుండేది. సినిమాకు సరైన అప్రిసియేష‌న్‌ రాలేదేమో అని నాలో చిన్న బాధ ఇప్పటికీ ఉంది.

స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌… సూపర్35… సినిమాటోగ్రఫీ!

సినిమాటోగ్రాఫర్ రత్నవేలుగారు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ది బెస్ట్ ‘జగడం’ అని చెప్పొచ్చు. ఎందుకంటే… అప్పుడే chooke s4 లెన్స్ వచ్చాయి. అప్పట్లో స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌ తన సినిమాలకు ఏ కెమెరా ఎక్విప్‌మెంట్ ఉపయోగించారో, మేమూ అదే ఎక్విప్‌మెంట్ ఉపయోగించాం. సూపర్ 35 ఫార్మాట్ లో షూట్ చేశాం. అప్పటివరకు మన దగ్గర ఎవరూ ఆ ఫార్మాట్ లో ఎవరూ చేయలేదు. కెమెరా యాంగిల్, లైటింగ్ మూడ్… రత్నవేలు ప్రతిదీ డిస్కస్ చేసి చేసేవారు. ప్రతిదీ పర్ఫెక్ట్ షాట్ అని చెప్పొచ్చు. ఇండియాలో సినిమాటోగ్రఫీ పరంగా చూస్తుంటే… వన్నాఫ్ ది బెస్ట్ ‘జగడం’ అని చెప్పొచ్చు. ఆ క్రెడిట్ మొత్తం రత్నవేలుగారిదే. సినిమాటోగ్రఫీనీ అప్రిషియేట్ చేయలేదు. ఆ సినిమా ఫొటోగ్రఫీ నాకు ఎంతో ఇష్టం.

ముంబైలో దర్శకుల దగ్గర… లైబ్రరీల్లో ‘జగడం’

ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ చేశారు. సినిమా విడుదలైన కొన్నాళ్లకు ఒకసారి మేమిద్దరం ఫ్లైట్‌లో కలిశాం. మాటల మధ్యలో ‘జగడం’ గురించి వచ్చింది. ‘ప్లాప్ సినిమా కదా. మాట్లాడుకోవడం ఎందుకు అండీ’ అన్నాను. అందుకు ‘అలా అనుకోవద్దు. నేను ముంబై నుంచి వస్తున్నాను. చాలామంది దర్శకుల దగ్గర, వాళ్ళ లైబ్రరీల్లో జగడం సినిమా ఉంది. నీకు అంతకన్నా ఏం కావాలి? చాలామంది నీకు ఫోనులు చేయలేకపోవచ్చు. నిన్ను కలవడం వాళ్ళకు కుదరకపోవచ్చు. కానీ, చాలా అప్రిసియేషన్ పొందిన సినిమా ఇది. టెక్నీషియన్స్ దానిని రిఫరెన్స్‌గా పెట్టుకున్నారు’ అని శ్రీకర్ ప్రసాద్ గారు చెప్పారు.

నిర్మాత గురించి…

చిత్రనిర్మాణంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ జేడీ సోంపల్లిగారు ఎంతో మద్దతుగా నిలిచారు. వాళ్ళ అబ్బాయి ఆదిత్యబాబు తరపున ఆయన సినిమా నిర్మించారు. ఆదిత్య ఇప్పటికీ నాతో టచ్ లో ఉంటాడు. నా ఫంక్షన్లకు తనను కూడా పిలుస్తాను.

ఆరు నెలలు ఆడిషన్స్ చేశాం!

అప్పట్లో ఆర్టిస్టులు చాలా తక్కువ మంది. ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ వస్తున్నాయి. వెబ్ సిరీస్ లు వచ్చాయి. చాలామంది ఆర్టిస్టులు దొరుకుతున్నారు. అప్పుడు అలా కాదు కాబట్టి ఎక్కువ ఆడిషన్స్ చేశాం. సుమారు ఆరు నెలలు ‘జగడం’ ఆడిషన్స్ జరిగి ఉంటాయి. తాగుబోతు రమేష్, వేణు, ధనరాజ్… ఇలా ఆ సినిమా నుంచి చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. ఇప్పటికి వాళ్ళు అదే గౌరవం, ప్రేమతో చూస్తారు.

త్వరలో రామ్‌తో సినిమా చేస్తా!

రామ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. త్వరలో మళ్ళీ తప్పకుండా చేస్తా. మరో మంచి సినిమా చేయాలి. యాక్చువల్లీ… ఇప్పటి రామ్‌తో మళ్ళీ ‘జగడం’ రీమేక్ చేయాలని ఉంది. మళ్ళీ ఇప్పటి రామ్‌తో మళ్ళీ జగడం చూసుకోవాలని ఉంది.


ఆ విషయంలో హద్దులేమీ పెట్టుకోలేదు: ‘శశి’ హీరోయిన్ సుర‌భి

ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘రఘువరన్ బీటెక్’ సినిమాలో నటించి, ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల నటి సురభి.. బీరువా, ఎక్స్‌ప్రెస్‌ రాజా, ఎటాక్, జెంటిల్‌మెన్‌, ఒక్కక్షణం, ఓటర్‌ సినిమాల‌తో మెప్పించింది. ఆది సాయికుమార్ హీరోగా, శ్రీనివాస్ నాయుడు నందికట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శశి’లో హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. మార్చి 19న ‘శశి’ విడుద‌ల‌వుతున్న సంద‌ర్భంగా హీరోయిన్ సుర‌భితో ఇంట‌ర్వ్యూ విశేషాలు..

నిర్మాత‌లు నాకు ఫోన్ చేసి డైరెక్టర్‌తో మూడున్నర‌ గంట‌లు క‌థ నేరేట్ చేయించారు. స్టోరీ విన‌గానే చాలా థ్రిల్‌గా ఫీలై వెంటనే సైన్ చేశాను. ఈ సినిమా రెగ్యుల‌ర్ ల‌వ్‌స్టోరీ కాదు. ఎమోష‌న్స్‌, ఇంటెన్సిటీతో కూడిన ర‌గ్‌డ్ ల‌వ్‌స్టొరీ. అందుకే ఈ సినిమాలో ఆది లుక్ అంత ర‌గ్‌డ్‌గా ఉంది. చాలా అంశాల‌తో కూడిన ఒక కంప్లీట్ ప్యాకేజ్. ఈ సినిమాలో న‌ట‌న‌కు మంచి స్కోప్ ఉన్న పాత్ర నాది. ఆడియ‌న్స్‌కి తప్పకుండా ఒక ఇంపాక్ట్ అయితే చూపుతుంది. ఈ మూవీలో రాజీవ్ క‌న‌కాల నాకు తండ్రిగా నటించారు. ఒక్క కూతురునే కాబ‌ట్టి చాలా గారాబంగా పెంచుతాడు. నిజ జీవితంలోనూ నేను మా పేరెంట్స్‌కి ఏకైక కూతురిని. అందుకే ఈ సినిమాలో నా పాత్రతో వెంట‌నే క‌నెక్ట్ అయ్యాను.

కాలేజ్‌లో నా బ్యాచ్‌తో క‌లిసి ర్యాగింగ్ చేసే స‌న్నివేశాలు చాలా ఫ‌న్నీగా ఉంటాయి. నాది ఒక డామినేటింగ్ ప‌ర్సనాలిటీ. అయితే ఈ సినిమాలో నా క్యారెక్టర్లో మ‌రో షేడ్ ఉంటుంది. అదేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంటుంది. నాతోపాటు ఈ సినిమాలో ప్రతి పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది.

ఈ సినిమాలో ఆదికి మ్యూజిక‌ల్ బ్యాండ్ ఉంటుంది. గిటార్ ప్లే చేస్తాడు. ఒక మంచి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌నుకునే క్యారెక్టర్ నాది. నేను ఎందుకు అలా చేసుకోవాలి అనుకుంటాను అనే రీజ‌న్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆదితో ఫ‌స్ట్‌టైమ్ స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఆయన చాలా హంబుల్ పర్సన్‌. వెరీ వెరీ డౌన్ టు ఎర్త్‌. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వ‌చ్చినా అస‌లు ఆ ఫీలింగ్ ఉండ‌దు. చాలా మంచి డ్యాన్సర్ కూడా. కొన్ని స‌న్నివేశాల్లో నాకు చాలా స‌పోర్ట్ చేశారు. అలాగే నిర్మాత వ‌ర్మగారు మోస్ట్ నైస్ ప‌ర్సన్‌. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఫుల్ స‌పోర్ట్ చేసి ఈ చిత్రాన్ని నిర్మించారు. రోజూ సెట్‌కి వ‌చ్చి మంచి ఇన్‌పుట్స్ ఇచ్చేవారు.

‘శశి’ పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తున్నందుకు హ్యాపీగా ఉంది. ‘ఒకే ఒక లోకం’ పాట 50 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసింది. ఆ క్రెడిట్ మొత్తం మ్యాజిక్ డైరెక్టర్ అరుణ్‌కే చెందుతుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌, వైవా హర్ష పాత్రలు హిలేరియ‌స్‌గా ఉంటాయి. ‘శశి’ ట్రైల‌ర్‌, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారు ట్రైల‌ర్ చూసి చాలా బాగుంది అన్నారు. టీమ్ అంద‌రూ చాలా క‌ష్టప‌డి సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, దాని ద్వారా నాకు మరిన్ని ఛాన్సులు రావాలని కోరుకుంటున్నాను. ఇప్పటివ‌ర‌కూ 13 సినిమాలు చేశాను. అందులో తమిళమే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు తెలుగులోనూ మంచి ఛాన్సులు వ‌స్తున్నాయి.

గ్లామ‌ర‌స్ రోల్స్ చేయ‌డానికి ఎప్పుడు సిద్దంగానే ఉంటాను. ఇండ‌స్ట్రీలోని గ్రేట్ పీపుల్స్ అంద‌రితో వ‌ర్క్ చేయాల‌న్నది నా కోరిక. అలాగే మైథాలాజిక‌ల్ మూవీస్‌లో న‌టించ‌డం ఇష్టం. వెబ్‌ సిరీస్‌ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాను. కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ యాక్టింగ్‌కు స్కోప్‌ ఉన్న స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌‌నే చేయాలనుకుంటున్నాను. అలాంటివి వస్తే వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తాను.



A STAR WHO INHERITED A DOYENS GENES.

Jr.NTR (Nandamuri Taraka Ramarao) a Star set his foot on 20th May 1983, his facial features not only emitted a Light of Stardom before he could make his debut but also inherited the name and Genes of his Late Grandfather Dr.Nandamuri Taraka Ramarao churning Harikrishna as a Proud Father seeing his commendable Acclaims and accolades.
Stars have their own identity and style, but the real acting epic is written by the young star who blossomed with his own versatile style of acting, embossing an unerasable impression on Telugu Film Industry.
Be it Historical Cinema, Family Entertainer, Action Packed Genres Jr.NTR has successfully embarked them with aplomb.

Started his debut with Gunashekhars Bala Ramayanam in 1996 that fetched National Award for the Best Children film and Jr.NTR an Identity. There was no stopping for this young Chubby Boy who was recommended by Gunasekhar to the Sculptor in SS Rajmouli who sculpted him into a hero in Student No.1 which was a tremendous success, and there was no looking back for the hardworking young thunder.

Big directors in VV Vinayak, B.Gopal and AMRathnam moulded him into more fiery and skilled Actor with films like Aadhi, Allari Alludu, Naaga hitting the bull’s eye at the box office. It was SS Rajmouli once again with his Simhadri that gave Jr a title honor of YOUNG TIGER to JR who with his different appearance and high tide acting captivated the filmy audience, While Andhrawala and Rakhi gave Jr.NTR the required recognition for his stellar performance.

SS.Rajmouli gave a completely new look to Jr.NTR in his Yama Donga by having him trim his accumulated fat by 20 kilos, which was a stupendous success, followed by VV Vinayak Adhurs which erased box office collections record and grossed 400 million. Jr. NTR diverted his route towards romantic genres and once again his magic continued scoring with Vamsi Paidapallys Brindavanam. With hattrick of flops in Shakti, Osaravalli, and Dammu Jr NTRs image turned sour though his performances received mixed responses from the audience.

srinu vaitla Pumped his disappointed stature with Badshaah, and once again Jr.NTR rose as he took every failure as a lesson to learn and grew stronger with every film.

Puri Jagannath’s Temper elevated his Pride, while Sukumars Nanaku Premotho gave him a refined tag of a Directors Complete Actor followed by back to back hits in Koratala Sivas Janatha Garage and K.S.Ravindra alias Bobbys Jai Lava Kusa , Jr. NTRs churned his identity into an enigma of Telugu Cinema.

Even though Politics was distanced from him, Destiny almost hit Jr. NTR on 26th May 2009 when campaigning for Telugu Desam Party en route to Hyderabad, his SUV struck head-on with another Vehicle suffering head injuries. But through his wellwishers and fans prayers, he made a speedy recovery to reenter to the Entertainment Groove.
.

With SS.Rajmoulis forthcoming #RRR starring Jr.NTR and Ramcharan, Jr.NTR will be a volcano that erupts Powerful Lava inform of his power-packed performances leaving audience as the most preferred Actor who carry away treasured memories of him and for Producers a Saleable Star whose stardom yields a bounty on their investments.

Jr NTR at such a young age receiving 11 Filmfare awards a couple of Nandi Awards and several awards for his Outstanding performances from 2002-18 is to be applauded.

Still Hungry for Hightide Performances Jr.Ntr will definitely reach to the heights which his Late Grandfather Dr.NTRamaRao achieved and set a benchmark for talented brunch to follow


WHERE IS DIRECTOR SV.KRISHNA REDDY.?

S.V.KrishnaReddy the renowned director who entertained the audience with his family entertainment films leading as a captain in all departments, be it direction, Screenwriting, Music Composer, and Producer. and a brief stint as an Actor is at present only seen in Audio Releases and award Functions totally distancing away from films.

90’s was a successful era, with SV Krishna Reddy’s films being the buzz of the town, his entertainment elements, Human Emotions, his Love story integrated to Indian embedded atmosphere created a milestone in his career films like Rajendrudu Gajendrudu,(1993), SubhaLagnam (1994), , Ghatothkachudu (1995), Maavichiguru (1996), Vinodam (1996), Egire Paavurama (1997), Ahvanam (1997) , Pelli Peetalu (1998), Premaku Velayara (1999), Sakutumba Saparivaara Sametham (2000), Premaku Swagatham(2002), Pellam Oorelithe (2003),

Our Heartful Gratitude to S.V. KrishnaReddy the ace director who tuned the careers of Present Stars in Rajendra Prasad, Ali, Srikanth, Jagapathi Babu to be a refined prodigies of Telugu Film Industry, Its is very sad our Telugu Film Industry ignoring such a stalwart who is deprived of another chance, due to the advent of talented young directors well equipped with the latest technology, and taste of the present era, but his sculpting of roles can’t be aped or shown even at present without his Midas touch.

SV Krishnareddy received Nandi Awards for his films Subhalagnam (1994), Ahvanam (1997), SahakutumbaSahaparivara Sametham (2001), and Film Fare Best Director Award for Subhalagnam (1994)

But from 2002 SV. KrishnaReddy fame slowly started to decline due to stereotyped stories and unable to adapt to the taste of the Present Audience and his films faded away as his presence in Telugu films and an end to the era of Family Oriented Subjects.
Even Producers who followed a beeline to get the nod of a Successful busy director started distancing him due to present trend.
If Producers once again come forward with a good concept to rope in the talented director, he would definitely do justice in giving us a good output.

S.V.Krishna Reddy also served as Member at Telugu Film Directors Association, Directors Guild of America.


JAGAPATHI BABU (A GRUMPY VOICE’S SECOND INNINGS)

Jagapathi Babu the handsome dashing hero of the 90’s, son of Legendary Producer V.B.Rajendra Prasad never dreamt acting would be his passion and career, But the Aromatic Cinema flavor spread all over his genes had to announce his debut.

Jagapathi Babu Played a Safe and Mediocre First Innings that gave him a tag of Family Audience Hero, His Major Successful stint as an Angry young man in Ram Gopal Verma’s Gayam reached the audience who applauded his presence and performance, even though his 1992 film Peddarikam won him the solace to his debut.

From 1994 -2000 Destiny favored Jagapathi Babu where real Stardom elevated his status and his fame spread all over Indian Cinema Industry for his back to back swashbuckling hits in S.V.KrishnaReddys Subha Lagnam in 1994 and Mavachigaru in 1996 which earned him Nandi Awards for his amazing Performance and the industry terming him as family audience hero.
Jagapathi Babu adjusted his Roles as Script Demanded but retained his Family Audience Tag safely with Subhakankshalu and Pelli Pandiri faring well at the box office.
From 2000-2014 many other roles in films like Kabbadi Kabbadi, Athade Oka Sainyam, Pedababu and Anukokunda Oka Roju, Dongata, Anthapuram fared well but not the fame he deserved, he even set his foot in Tamil and Kannada film Industry, but that never earned the expected Laurels for the handsome hero.

Films started to fall out of Jagapathi Babu’s hands, destiny started to frustrated the hero, added to it the demise of his Support and his father VB Rajendra Prasad passed away, the properties seized due to nonpayment of Loans.
Added to his frustration his daughter getting married to a foreigner initially depressed him but later compromised.

Even Filmy fans felt their heroes innings ending abruptly as age also catching up with the talented star.

It is from 2014 Jagpathi babu made his second appearance with a Negative Grumpy Voice and shabby grey beard that took film industry by storm. Jagapathi Babu steadied his second innings with negative roles that earned him fame and acclaims from the entire film fraternities of South Indian Cinema and offers started pouring with lucrative assignments.

Jagapathis Babus Characters in Legend, Nanaku Prematho, Rangasthalam, Nella Ticket in Telugu, Rajinikanth’s Linga in Tamil, Mohanlal’s Pullimurugan in Malayalam and Manyam Puli in Telugu and Successful Supporting Character roles in Mahesh babus Srimanthudu and Nagchaitanyas Rarandao Vedika Chudam left him rest in a safe zone earning him fame, Wealth and Status that he lost in the middle and has no time to look back . As Jagapathi Babu’s journey is tuned for a long and cherished innings

Big Directors and Renowned Producers geared up to get the actors nod for their respective ventures proved the Fighter in Jagapathi Babu Rise from an Ordinary Hero, His Emotional Struggle, and Rising Demand for his Stature.

Japathi babu in the span of Three decades and more than 130 films in his kitty that won him 3 Filmfare Awards for Lakshyam, Legend, and Nanaku Prematho, 7 Nandi Awards, 3 SIIMA Awards, 2 IIFA Utsavam, 1 Asianet Film Awards.


CHANDRA SIDHARTHA STAGES A STRONG COMEBACK By NARENDRA BABU

Chandra Sidhartha the talented and renowned director of Telugu Film Industry is back in Action after a gap of 4 years and is coming up with a fresh new bilingual Genre titled AATAGADHARA SHIVA under the banner of Rockline Entertainment Films, the film is made in Telugu and Kannada. The trailers already creating sensation among the viewers assuming the film to be a great hit .

#AATAGADHARA SHIVA has new cast, new concept and fresh music that can keep the audiences glued to their seats. The film will also remind the Producers to believe in Talent and take Telugu film Industry to high esteem and not depend on Business Trend by deceiving the hard earned money of the filmy viewers by producing stereo type concepts.

Who can forget Chandra Sidhartha a diligent in chalking out a philosophical enigma “Aa Naluguru” which made a hallmark in Telugu film Industry receiving the Prestigious Nandi award and many acclaims and accolades from different Film Fraternities .

Mind you this brilliant directors magic wand did produce magic in most of his films be it Andharu Bandhuvayya & Madhumasam. Even though Chandra Sidhartha showered with ample opportunities he with his hardest effort churned those in to Awards and Critic Acclaims thus showering sparks of his brilliance on Telugu film Industry.

Chandra Sidhartha needs no mention of his master piece films, after garnering three state Nandi awards for his brilliant work in Aa Naluguru and Andhari Bandhuvayya he took up a mantle of producing Nirantharam in 1995 under Film and Television Institute of India and did received accolades at Cairo and Locarno International Film Festival.

Chandra Sidhartha also claims the honor of being the first Telugu director to make debut as a director in 2001 released English movie “The Inscrutable Americans” based on Anurag Mathur’s best selling novel of the same name.

The Inscrutable Americans was also premiered at Milan, Newyork, Atlanta, London and Kerala International film festivals.

Chandra Sidhartha’s presence went unnoticed even after serving as a Jury member for AP State Nandi awards from 2013-2015, Film fare Jury 6 times and South Indian Cinematographers Association awards as Jury Head, but that didn’t matter for the Confident Genius who always made a successful comeback with his swashbuckling presence.

In this Competitive era Talent is abundantly found but to remain with that tag for long is a daunting task, but legends are born with talent to remain and be remembered for ever, Ace Director Chandra Sidhartha belongs to the legendary clan.

Our best wishes to Chandra Sidhartha on his bilingual film “Aatagadhura Shiva” and may his comeback stint be a memorable and successful one .


MAHESH BABU-Enduring Enigma


Mahesh Babu the tall handsome hero who conquered Telugu Film Industry and Fans hearts with his versatile style is the buzz of tinsel town.
Even with Stardom Tag received Courtesy : Father Dr.Krishna, created his own brand to elevate his form to reach the peak.

Mahesh babus richest asset his elegant style ranked him twelfth on Times 50 Most desirable Men in India for 2010, and ascended the ladder to be on top most position for the year, beating the Bollywood Big Stars in Hrithik Roshan, Salman Khan, and Sharukh khan and taking Telugu Industry to soaring heights.

It was not easy for Mahesh Babu to keep the Stardom intact , with every failure he strongly staged a comeback to hit the bulls eye at box office collections.

Even with Child hood roles in his early stint with Telugu Cinema, that only quenched Mahesh Babus thirst for passion and not profession.
When he made his debut under Legendary director K. Raghavendra Rao’s Rajakumaradu opposite Bollywood Queen Preety Zinta, people only recognized him to be a chocolate hero promoted by Telugu Doyen Krishna
.
Rajakumarudu earned Mahesh Babu success but not recognition , followed by string of flops in his Kitty be it Yuvaraju, Takkari Donga, Vamsy and Bobby not until Krishna Vamsi boosted him with a Successful Murari that was the turning point for him to stage a comeback.

But with Gunashekhars Block buster hit Okadu he rose to touch the Portrait of Stardom, but followed Flop Charts striking his blurry vision of choosing scripts and fans slowly started to term “End to an Illustrious Career ”


The year 2004-2010 saw Mahesh Babu recover from his Scars, Courtesy his Lady Luck in the form of wife Namrata Shirodkar with Trivikram Srinivas Athadu and Puri Jagannaths Pokii hitting the bulls eye raking huge profits for Producers ad Distributors and staying as biggest Hits in Mahesh Babus Career. Fans still believed him and Mahesh babu Justified their belief.
But Once again Destiny hit Mahesh Babu with unsuccessful films in Khaleja and Sainukudu that demotivated him and discouraged his fans.

2011-2014 Saw Mahesh Babu rise from the Slump of failure, any one in his place would have surrendered and replaced their career, but with Sreenu Vaitlas Dookudu, Puri Jagannaths BusinessMan , Srikkanth Adalas Seethamma Vakitlo Sirimalu Chettu rose him to be on peak of his career and top the List of Superstars in Tollywood. All these films reaped Profits, Awards and Accolades and Fans Trust in their Super Star.

Mahesh Babu gained the honor of being the Second after Super Star Rajanikanth to be paid highest remuneration for his work.

But that was not the end Once again Mahesh Babu films flipped and flopped at the Box with Aagadu, Nenokkadene inviting losses to Producers and distributors even with tag of renowned directors to the films.

2015 till date had Mahesh Babu stay in a safe Zone with Koratala Shivas Srimanthudu giving him a Successful break with film receiving many awards and inspired many to adopt villages in serving the poor . But once again Brahmotsavam and Spyder deceived him and his folly in selecting the right scripts after success blindfolded him.

Koratala Shiva lifted Mahesh Babu from danger zone by giving him a career hit Bharat Ane Nenu an inspirational Movie which also caught the attention of Telanganas Governance and that’s not the end. Mahesh Babu has decided to concentrate on Scripts before signing up any new venture to keep his Stardom and his fans belief in him intact.

Awards and Accomplishments: Mahesh Babu received 5 Film Fare Awards from 2004-2016 for his films for Okadu, Pokiri, Dookudu, Seethammavakitlo Sirimali Chettu, Businessman, Srimanthudu.

Nandi Awards: Dookudu (2011), Srimanthudu (2016)

South Indian International Movie Awards: Dookudu (2012), Sitamma Vakitlo Sirimalli Chetu (2014).

Media and Advertisements endorsed by Mahesh Babu
Mahesh Babu is chosen as Ambassador for numerous South Indian Brands, Thums up being his lucrative endorsement.
Mahesh Babu stands 37th among the top 100 Celebrity List ranked by Forbes-100 and a Pride for Telugu Film Industry .


The inspiring journey of Mahesh Babu from being a star’s son to super star


Mahesh Babu, the name is just enough to remind anyone in India of the tall and every young super star of our Tollywood. Although he has never been a direct part of movies of any other industry, he as an actor is famous across the nation and not to forget how most Bollywood actresses mention his name when asked about their favorite star down south. But was it all a cake walk? A definite no! Being the son of yester-generation’s super star Krishna and having ravishing looks weren’t just enough to bring him success. All the worked was PERSEVERANCE! Yes, here’s a look into the inspiring journey of Mahesh Babu:

Filmy Background and easy debut:
As the son of Krishna, film was a passion he had since his childhood. At a very tender age of 4, he made his film debut under Dasari Narayana Rao. After that he did a couple of movies as a child actor before going for his further studies. From Gudachari 117 to Bala Chandrudu, most of his movies were commercially successful, but yet he was still under the shadow of being Krishna’s son.


Debut as a hero:
In 1999 he debuted as a hero in Raja Kumarudu, after which he got the name of Prince. Under the director of Raghvendra Rao, the movie had Priety Zinta as the other lead. This debut was the only thing that came easily to him. If there was anything that his father’s reputation made easier for him, it is undoubtedly only his easy debut.

The weak phase:
Right from Rajakumarudu, none of his movies that followed were commercial hits. Except for his well-acclaimed performance in Murari, most of his initial films failed at the box office creating a black period in his career. Yuvaraju, Takkari Donga, Vamsy and Bobby were all rejected at the box-office. Never taken aback by these failures, Mahesh took time to retrospect and went forward with the next project.

Finding his love:
His love story with Namrata, whom he met on the sets of Vamsy is completely adorable. It was probably this decision that helped in the making of a super star!


Bulls Eye with Okkadu:
Not many bounce back after continuous failures. Mahesh amazed everyone with not just a comeback, but also industry records! Made under the direction of Gunashekar, Okkadu was the biggest blockbusters of the year and set many records. This movie also paved the path of starhood to Mahesh Babu.

Back to pavilion again:
Expectations were quite high on him after Okkadu. But wrong choices made him get back to pavilion again. Although Athadu is a movie enjoyed even today, it was commercially a flop. So were Nijam and Arjun. Gosspimongers even started calling him a flop hero.

Movie that made him the super star:
The release of Pokiri made him the star that he is. It was again the biggest hit of the industry and then there was no stopping further.

After that regardless of his movie being a hit or flop, he is always celebrated as a superstar and is the most bankable star of the generation. His journey of ups and downs are a great lesson to anyone who dreams big and fails at times to succeed finally.