Category Archives: Daily Updates

ప్రపంచంలోనే ఒంటరి ఇల్లు.. 100ఏళ్లుగా ఒక్క మనిషీ అక్కడ లేడు

ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు, ఆశ్చర్యకరమైన ప్రదేశాలున్నాయి. కొన్ని చోట్ల జనం కిక్కిరిసిపోయి ఉంటే మరికొన్ని చోట్ల ఒక్క మనిషి కూడా ఉండరు. అయితే 100 సంవత్సరాలుగా ఖాళీగా ఉంటున్న ఒక ఇల్లును ఇటీవలే ఇటలీలో గుర్తించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆశ్చర్యపరుస్తుంది. నిజానికి ఈ ఇల్లు భారీ డోలమైట్ పర్వతాల మధ్యలో నిర్మించారు. దీనిని ‘ప్రపంచంలోని ఒంటరి ఇల్లు’ అని పిలుస్తారు. ఈ ఇల్లు సముద్ర మట్టానికి దాదాపు 9వేల అడుగుల ఎత్తులో నిర్మించడం విశేషం. ఇంత ఎత్తులో ఇల్లు ఎలా నిర్మించారు.. ఎందుకు నిర్మించారు ఇక్కడ ఎవరు ఉండేవారు తదితర విషయాల గురించి తెలుసుకుందాం.

ఈ ఇంటిని మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో నిర్మించారని తెలుస్తోంది. ఆస్ట్రో-హంగేరియన్ సైన్యంతో జరిగిన యుద్ధంలో ఇటాలియన్ సైనికులు విశ్రాంతి తీసుకోవడానికి ఇంత ఎత్తులో నిర్మించారని చరిత్ర కారులు చెప్పారు. అప్పట్లో సైనికులు ఈ ఇంటిని స్టోర్ రూమ్‌గా కూడా ఉపయోగించారు. సైనికుల కోసం తీసుకువచ్చిన వస్తువులు ఇప్పటికీ భద్రంగా ఉండటం విశేషం. ఈ ఇల్లు పూర్తిగా భిన్నమైన రీతిలో నిర్మించారు. దీని నిర్మాణంలో చెక్క, తాడు, కేబుల్ ఉపయోగించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఇల్లు నిర్మించి 100 సంవత్సరాలకు పైగా గడిచినప్పటికీ ఈ ఇల్లు చెక్కుచెదరకుండా అలాగే ఉంది. పర్వతం మధ్యలో ఈ ఇల్లు ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఈ ఇంటి చుట్టూ పర్వతాలు తప్ప ఇంకెమీ కనిపించవు. దీంతో ప్రజలెవరూ ఇక్కడికి రావడం లేదు. ఇక్కడికి చేరుకునే మార్గం కూడా చాలా కష్టంతో కూడుకున్నది. ఒక పాత చెక్క వంతెనను దాటితేనే ఇక్కడికి చేరుకోగలం. గొప్పదనం ఏంటంటే ఈ ఇంటికి వచ్చిన తర్వాత మరో లోకంలోకి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ప్రమాదం కారణంగా ప్రజలు ఇక్కడికి రాకుండా సాధారణంగా నిషేధించినా సాహసాలను ఇష్టపడే వ్యక్తులు ఇక్కడికి వెళ్లాలని అనుకుంటే సొంత పూచీతో అనుమతిస్తున్నారు.


గూగుల్‌‌లో అత్యధిక మంది వెతికిన టాప్‌-10 మూవీస్ ఇవే

ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీకి గడ్డు కాలం ఎదురైంది. కరోనాతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ప్రజలందరూ ఓటీటీలకే అంకితమైపోయారు. సినిమా థియేటర్ల వైపు ప్రజలు రావడం మానేస్తారని అందరు అంచనా వేశారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సినిమా హాళ్ల వైపు ప్రజలు పోటెత్తడం మొదలుపెట్టారు. దీంతో సినిమాలకు ఏమి కాదని అర్థమైంది. అత్యధిక మంది నెటిజన్లు వెతికిన 10సినిమాల జాబితాను ప్రతి ఏడాది గూగుల్ ఇండియా విడుదల చేస్తుంది. ఈ ఏడాది కూడా ఆ జాబితాను గూగుల్ ఇండియా విడుదల చేసింది. అత్యధిక మంది నెటిజన్లు వెతికిన చిత్రంగా ‘‘జై భీమ్’’ నిలిచింది. నెటిజన్లు అత్యధికంగా వెతికిన టాప్ 10 సినిమాల జాబితాపై ఓ లుక్కేద్దామా..

  1. జై భీమ్

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించారు. మంచి కథాంశంతో రూపొందడంతో పాటు వివాదాలు కూడా చుట్టుముట్టడంతో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయిన ఈ సినిమాకు టీజే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. సూర్య తన సొంత నిర్మాణ సంస్థపై ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.

  1. షేర్‌షా
    సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ హీరో, హీరోయిన్లుగా నటించారు. కార్గిల్ యుద్ధంలో అసమాన ప్రతిభ పాటవాలను చూపిన విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. విష్ణువర్ధన్ తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయింది.
  2. రాధే
    కొరియన్ చిత్రం ‘‘ద అవుట్ లాస్’’ రీమేక్‌గా రాధే తెరకెక్కింది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, దిశా పటానీ హీరో, హీరోయిన్లుగా నటించారు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా జీ ప్లెక్స్ వేదికగా విడుదల అయింది. ఈ మూవీ ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది.
  3. బెల్ బాటమ్
    అక్షయ్ కుమార్, వాణీకపూర్ హీరో, హీరోయిన్లుగా నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రియుడు జాకీ భగ్నానీ నిర్మాతగా వ్యవహరించారు. హైజాక్ కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కింది. రంజిత్ తివారి దర్శకత్వం వహించారు.

5.ఎటర్నల్స్
మార్వెల్ కామిక్స్‌కు చెందిన అమెరికన్ సూపర్ హీరోలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. మార్వెల్ కామిక్స్‌లో ఇది 26వ చిత్రం. మార్వెల్ స్టూడియోస్ నిర్మించగా, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది.

  1. మాస్టర్
    కోలీవుడ్‌కు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు విజయ్, విజయ్ సేతుపతి ఈ సినిమాలో సందడి చేశారు. విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు. ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తయినప్పటికి కరోనా కారణంగా వాయిదాపడింది. సంక్రాంతి కానుకగా థియేటర్లల్లో విడుదల అయిన ఈ చిత్రానికి అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
  2. సూర్యవంశీ
    అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ హీరో, హీరోయిన్లుగా నటించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. ఓటీటీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినప్పటికి ఈ చిత్రాన్ని సినిమా హాళ్లల్లోనే విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నారు. అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడం విశేషం.
  3. గాడ్జిల్లా vs కాంగ్
    ఆడమ్ విన్ గార్డ్ ఈ సినిమాను తెరకెక్కించారు. భారతీయ భాషల్లోను ఈ చిత్రం సందడి చేసింది. గ్రాఫిక్స్‌తో ఒక విజువల్ వండర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ప్రపంచం మీద విరుచుకుపడుతున్న గాడ్జిల్లాకు కాంగ్ ఎలా చెక్ పెట్టిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
  4. దృశ్యం-2
    మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. 2013లో విడుదలైన దృశ్యం చిత్రానికి సీక్వెల్‌గా దృశ్యం-2 తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ చిత్రం విడుదలయింది.
  5. భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా
    అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా హీరో, హీరోయిన్లుగా నటించారు. దేశభక్తి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. డిస్నీ+హాట్ స్టార్ వేదికగా ఈ మూవీ విడుదల అయింది.

RRR ట్రైలర్.. విజువల్ విస్ఫోటనం.. మాస్ మాయాజాలం

తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు ఎట్టకేలకు వచ్చేసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌- రౌద్రం రణం రుధిరం’ (RRR) ట్రైలర్‌ గురువారం ఉదయం విడుదలైంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, ప్రతి భారతీయుడిలో ప్రేరణ నింపేలా సాగిన డైలాగ్‌లతో ట్రైలర్‌ ఆద్యంతం అదరహో అనేలా సాగింది. ఇక, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్ (RamCharan)‌, కొమురం భీమ్‌గా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR) నటన చూడటానికి రెండు కళ్లూ సరిపోవడం లేదు. ‘‘భీమ్‌.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’’ అంటూ రామ్‌చరణ్‌ చెప్పే డైలాగ్‌ ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తోంది.

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కోసం మొదటిసారి రామ్‌చరణ్‌ – తారక్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఇందులో ఆమె చరణ్‌కు జోడీగా సీత పాత్రలో కనిపించనున్నారు. హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌.. తారక్‌కు జంటగా నటించారు. దక్షిణాది, బాలీవుడ్‌, హాలీవుడ్‌కు చెందిన పలువురు తారలు ఇందులో కీలకపాత్రలు పోషించారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు. పాన్‌ ఇండియా చిత్రంగా నిర్మితమైన ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.


మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు సీఎంగా పనిచేసిన రోశయ్య.. ఆర్థిక మంత్రిగా కూడా సేవలు అందించారు. అంతేకాకుండా తమిళనాడుకి గవర్నర్ గా పనిచేసిన ఆయన.. గతకొంతకాలంగా రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. కాగా రోశయ్య మృతిపట్ల రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ చదివారు. ఆయన భారత జాతీయ కాంగ్రెసు పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం.. బడ్జెట్ కూర్పులో ఘనాపాటిగా రోశయ్యకి మంచి పేరుంది. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24వ తేదీన తన పదవికి రాజీనామా చేసారు. ఆ తరవాత రోశయ్య 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. ఆ తర్వాత గతకొంతకాలంగా రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. కాగా రోశయ్య మృతిపట్ల రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


Bigg Boss 5 Telugu: పింకీ ఔట్!.. త్రుటిలో తప్పించుకున్న కాజల్, సిరి

బిగ్‌బాస్-5 చివరి అంకానికి చేరుకుంది. మరో రెండు వారాల్లో ఈ సీజన్‌ ఫినాలే జరగనుంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచీ 13వ వారం ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకూ కేవలం తన గేమ్ తోనే అందర్నీ ఆకర్షించిన ప్రియాంక సింగ్ బిగ్‌బాస్ ప్రయాణం ముగిసింది. ట్రాన్స్ జెండర్‌గా బిగ్‌బాస్ హౌస్ లోకి ఏంటరైన పింకీ తనదైన స్టైల్లో గేమ్ ఆడుతూ అందరినీ ఆకట్టుకుంది. ఆటతోనే కాకుండా, అందంతో సైతం ప్రేక్షకులని ఆకర్షించింది.

బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ముందుగానే సోషల్ మీడియాలో తెలుస్తున్నా కూడా ఎలిమినేషన్ అయ్యేవరకూ టెన్షన్ గానే ఉంటోంది. ఎందుకంటే రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఐదో సీజన్ కూడా ముగింపు దశకు చేరుకోవడంతో ఇప్పటివరకు హౌస్‌లో మిగిలివున్న వారంతా విజేతలుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే, చాలావారాలు హౌస్ లో సేఫ్ అవుతూ 19మంది కంటెస్టెంట్స్ ని దాటుకుంటూ వాళ్ల గేమ్ ని ప్రూవ్ చేసుకున్నారు.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. అందులో ఐదుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో ప్రియాంక , కాజల్ ఇద్దరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారని గతవారం రోజులుగా టాక్ వినిపిస్తోంది. అన్ అఫీషియల్ సైట్స్ లో ఓటింగ్ ముగిసిన తర్వాత అన్ని చోట్లా ప్రియాంకసింగ్ లీస్ట్ లోనే ఉంది. దీంతో పింకీ ఎలిమినేట్ అవుతుందని ముందుగానే చెప్పేశారు. తాజా వీక్‌లో ఆమె ఎలిమినేట్ అయినట్లు సోషల్‌మీడియాలో కోడైకూస్తోంది.


బాలయ్య బాక్సాఫీస్ ఊచకోత.. ‘అఖండ’ కలెక్షన్ల ప్రభంజనం, తొలిరోజే రికార్డుల మోత

బాలయ్య బాక్సాఫీస్ దుమ్ముతులుపుతున్నాడు. అఘోరాగా అదరగొడుతున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ’ ఎన్నో అంచనాలతో డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు మించి తొలి షోతోనే మాస్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ఎంతగానో ఎదురుచూసిన నందమూరి ఫ్యాన్స్ తొలి రోజు సినిమా చూసి ఫుల్ ఖుషీ అయ్యారు. మాస్ ఆడియన్స్ చేత గోలలు పెట్టిస్తూ క్లాస్ ఆడియన్స్ దృష్టిని లాగేసి ఈ సినిమా తొలిరోజే కలెక్షన్ల ఊచకోత మొదలు పెట్టేసింది. విడుదలైన అన్ని ఏరియాల్లో బాలకృష్ణ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్పే కలెక్షన్స్ వచ్చాయి. బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడని అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. బొయపాటి మార్క్ ఎలివేషన్స్‌ను జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడక్కడా ఫైట్స్ కొంచెం ఓవర్ అయ్యాయన్న మాటలు వినిపిస్తున్నా.. బాలయ్య అంటే ఆ మాత్రం ఉండాలి అంటున్నారు ఫ్యాన్స్.

ఓవరాల్‌గా మౌత్ టాక్ బాగుందని రావడంతో జనాలు సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఊహించని విధంగా చాలా థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ముందు ఈ బోర్డులు కనిపించి చాలా రోజులైందనే చెప్పాలి. మొత్తంగా డిసెంబర్ 2న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద మాస్ జాతర నడిచింది. దీంతో ఊహించిన దానికంటే కలెక్షన్లు కాస్త ఎక్కువే వచ్చినట్లు తెలుస్తోంది. టోటల్‌గా ఈ మూవీకి తొలిరోజు 23 కోట్ల గ్రాస్, 15.39 నెట్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కలెక్షన్స్
నైజాం- 4.39 కోట్లు
సీడెడ్- 4.02 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.36 కోట్లు
ఈస్ట్ గోదావరి- 1.05 కోట్లు
వెస్ట్ గోదావరి- 96 లక్షలు
గుంటూరు- 1.87 కోట్లు
కృష్ణా- 81 లక్షలు
నెల్లూరు- 93 లక్షలు

మొత్తంగా అఖండ 53 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అంటే.. 54 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్‌లోకి వెళ్తుంది. తొలిరోజే హిట్ టాక్ తెచ్చుకోవడం, మౌత్ టాక్ బాగుండటం, మరో వారం వరకు పెద్ద సినిమాలేవీ లేకపోవడం ‘అఖండ’కు కలిసిరానుంది. వీకెండ్ హాలిడేస్ కూడా ఉండనే ఉన్నాయి. దీంతో ఈ వారాంతం ముగిసేసరికి బాలయ్య సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

థియేటర్లలో ఫ్యాన్స్ గోలల మధ్య సినిమా చూసి ఎంజాయ్ చేస్తే వచ్చే ఆ కిక్కే వేరప్పా అని కొందరు ఫస్ట్ షో సినిమాకి వెళ్లినా.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ఆ డైలాగులు వినడానికి మళ్లీ థియేటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. చాలామంది అభిమానులు ఒక్క రోజులోనే రెండు సార్లు సినిమా చూసేసారు. దీంతో 2021లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా అఖండ చరిత్ర సృష్టించింది. సాధారణంగా బాలకృష్ణ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ తక్కువగా ఉంటుంది. కానీ అఖండ అక్కడ కూడా ప్రభంజనాన్ని సృష్టించింది.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ రికార్డులను సైతం దాటేసి దూసుకుపోతోంది ‘అఖండ’. మరీ ముఖ్యంగా నార్త్ అమెరికాలో బాలయ్య సినిమాకి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడ సినిమా ప్రీమియర్స్ నుంచే 3.25 లక్షల డాలర్స్ వచ్చాయి. అంటే దాదాపు 2.75 కోట్లు. బాలయ్య కెరీర్‌లోనే ఇది మూడో బెస్ట్ ఓపెనింగ్ ఇది. గతంలో ఎన్టీఆర్ కథానాయకుడు 3.74 లక్షల డాలర్స్, గౌతమీ పుత్ర శాతకర్ణి 3.50 లక్షల డాలర్స్ వసూలు చేసింది. తాజాగా అఖండ మూడో స్థానంలో ఉంది. ఇక తెలుగులో వకీల్ సాబ్ 3 లక్షల డాలర్లు వసూలు చేస్తే, నాగచైతన్య, సాయి పల్లవిల లవ్ స్టోరీ 3.13 లక్షల డాలర్స్ వసూలు చేసింది. ఈ రెండు సినిమాల ప్రీమియర్ షోస్ కలెక్షన్స్‌ను అఖండ సినిమా క్రాస్ చేసింది. మాస్ హీరోకి పక్కా అర్థం చెప్పిన బాలయ్య ‘అఖండ’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు 15 కోట్లకు పైగానే వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.


బిగ్‌బాస్ సీజన్-5: యాంకర్ రవికి కళ్లుచెదిరే రెమ్యునరేషన్!

బిగ్‏బాస్ – 5 సీజన్ ఇప్పటికి 12వారాలు పూర్తిచేసుకుంది. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ యాంకర్ రవి హౌస్ నుంచి ఇంటికొచ్చేశాడు. అయితే టాప్ కంటెస్టెంట్స్‏లో ఒకరిగా ఉన్న రవి… అలా ఆకస్మాత్తుగా ఎలిమినేట్ కావడంతో అంతా షాకయ్యారు. సిరి, ప్రియాంక కంటే ఓట్స్ ఎలా తక్కువ వచ్చాయో చూపించాలంటూ నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద రవి అభిమానులు చేసిన రచ్చ గురించి తెలిసిందే. మరోవైపు రవి ఎలిమినేట్ కావడానికి గల ఏంటీ అని ఆరాతీస్తున్నారు.

ఇక మరోవైపు రవి రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‏గా మారింది. రవిని ఇలా ఆకస్మాత్తుగా ఎలిమినేట్ చేయడానికి తన రెమ్యునరేషన్ కూడా ఒక కారణమంటూ వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లలో రవి మాత్రమే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నాడట. వారానికి రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షల మధ్యలో ఇస్తున్నారట. అంటే రవి 12 వారాలకు దాదాపు రూ. 80 లక్షల నుంచి రూ. 96 లక్షల వరకు తీసుకుంటున్నట్లుగా టాక్. అంటే బిగ్‏బాస్ విజేతకు అందించే రూ. 50 లక్షల ప్రైజ్ మనీ కన్నా ఎక్కువ కావడం విశేషం..

అలాగే ఇప్పుడున్న కంటెస్టెంట్స్‏లో టాప్-5లోకి రావడానికి ఎక్కువగా అబ్బాయిలే ఉండడంతో ఈసారి ఒక అమ్మాయిని పంపాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే రవిని ఎలిమినేట్ చేసారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మొత్తానికి యాంకర్ రవి ఎలిమినేషన్ మాత్రం అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ వాదిస్తున్నారు. గతంలో ఏ కంటెస్టెంట్‌ ఎలిమినేషన్‌కు రాని వ్యతిరేకత రవి విషయంలో రావడం గమనార్హం. ఈ వ్యవహారం ఏకంగా రాజకీయ రంగు కూడా పులుముకోవడం విశేషం. బిగ్‌బాస్‌ కార్యక్రమాన్ని నిషేధించాలంటూ కేంద్రానికి లేఖ రాస్తానంటూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.


శివశంకర్ మాస్టర్ కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఇటీవల శివశంకర్ మాస్టర్ కుటుంబం వైరస్‌ మహమ్మారి బారిన పడింది. ప్రస్తుతం శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కరోనాతో పోరాడుతున్నారు. వారి కుటుంబ చికిత్స కోసం మాస్టర్ చిన్న కుమారుడు అజయ్‌ విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే.

గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం గురించి టాలీవుడ్ ప్రముఖులు ఆరా తీస్తున్నారు. ఆయన పరిస్థితి చూసి చలించిపోయిన మెగాస్టార్ చిరంజీవి వైద్యం నిమిత్తం మూడు లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. రియల్ హీరో సోనూ సూద్ సైతం శివ శంకర్ మాస్టర్ పరిస్థితిపై ఆరా తీశారు. మంచు విష్ణు మా అధ్యక్షుడి హోదాలో హాస్పిటల్ బృందంతో మాట్లాడాడు. ఇక వీరందరికంటే ముందుగానే హీరో ధనుష్ ఎవ్వరికీ తెలియకుండా ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని కూడా చేశారట. కానీ ఇవేవీ కూడా శివ శంకర్ మాస్టర్ ప్రాణాలను కాపాడలేకపోయాయి.

డిసెంబర్ 7, 1948న చెన్నైలో పుట్టిన శివశంకర్ మాస్టర్‌ జన్మించారు. శివశంకర్ తండ్రి కళ్యాణ సుందరం పండ్ల వ్యాపారి కాగా 1974లో మాస్టర్ సలీమ్ వద్ద సహాయ నృత్యదర్శకుడిగా శివశంకర్ మాస్టర్‌ పనిచేశారు. తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషల్లో చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చారు. 800 చిత్రాలకుపైగా డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసిన శివశంకర్ సుమారు 30 సినిమాల్లో నటించారు. 2011లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. అమ్మోరు, సూర్యవంశం, అల్లరి పిడుగు, మగధీర, అరుంధతి, మహాత్మా, బాహుబలి ది బిగినింగ్ చిత్రాలకు శివశంకర్ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు.


శ్రీదేవి కూతురుతో ఎన్టీఆర్ రొమాన్స్.. వాట్ ఎ కాంబినేషన్!

యంగ్ టైగర్ యన్టీఆర్, కొరటాల శివ కలయికలోని రెండో సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. #NTR30 గా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో సామాజిక సందేశం అందించేదిగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ విషయమై కొంతకాలంగా రూమర్స్ గుప్పుమంటున్నా యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కొద్దిరోజులుగా కథానాయికగా కియారా అద్వానీ పేరు వినిపించగా… తాజా సమాచారం ప్రకారం ఇందులో అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీకపూర్‌‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ వార్త నందమూరి అభిమానులతో పాటు శ్రీదేవి అభిమానులను ఖుషీ చేస్తోంది. నిజానికి జాన్వీని సౌత్ నుంచే హీరోయిన్‌గా పరిచయం చేయాలని శ్రీదేవి అనుకున్నా సాధ్యం కాలేదు. కొరటాల శివ సినిమాతో అది ఇన్నాళ్ళకు సాధ్యం కానుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం కొరటాల శివ స్ర్కిప్ట్ వర్క్ మీద ఉన్నారని సమాచారం. యన్టీఆర్ సూచించిన స్వల్ప మార్పుల్ని సవరిస్తున్నారట. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 22న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. జనతా గ్యారేజ్ యన్టీఆర్, కొరటాల కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.


శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం

శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం యొక్క వివరణ బ్రహ్మ పురాణంలో కనిపిస్తుంది. శ్రీ లలిత సహస్రనామ లలిత దేవికి అంకితం చేయబడిన దైవిక శ్లోకం. లలిత దేవి ఆదిశక్తి యొక్క ఒక రూపం. ఆమెను “షోడాషి” మరియు “త్రిపుర సుందరి” దేవత పేరుతో పూజిస్తారు. దుర్గాదేవి, కాళి, పార్వతి, లక్ష్మి, సరస్వతి మరియు భగవతి దేవి ప్రార్థనలను లలిత సహస్రనామ ఫలశృతి మరియు శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలో కూడా ఉపయోగిస్తారు. లలిత సహస్రనామ కర్మ చేయడం ద్వారా, ఆ వ్యక్తికి మాత ప్రత్యేక దయ లభిస్తుంది. అన్ని రకాల విపత్తులను నాశనం చేస్తుంది. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం పఠనం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

అస్య శ్రీలలితా దివ్యసహస్రనామస్తోత్ర మహామంత్రస్య వశిన్యాది వాగ్దేవతా ఋషయః అనుష్టుప్ఛందః శ్రీలలితాపరమేశ్వరీ దేవతా శ్రీమద్వాగ్భవకూటేతి బీజమ్ మధ్యకూటేతి శక్తిః శక్తికూటేతి కీలకమ్ మూలప్రకృతిరితి ధ్యానమ్ మూలమంత్రేణాంగన్యాసం కరన్యాసం చ కుర్యాత్ మమ శ్రీలలితా మహాత్రిపురసుందరీ ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |

ధ్యానమ్ |
సిందూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్
తారానాయకశేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ |
పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికామ్ ||

అరుణాం కరుణాతరంగితాక్షీం
ధృతపాశాంకుశపుష్పబాణచాపామ్ |
అణిమాదిభిరావృతాం మయూఖై-
రహమిత్యేవ విభావయే భవానీమ్ ||

ధ్యాయేత్పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాంగీమ్ |
సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం
శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీమ్ ||

సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశామ్ |
అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికామ్ ||

లమిత్యాది పంచపూజాం కుర్యాత్ |
లం – పృథ్వీతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై గంధం పరికల్పయామి |
హం – ఆకాశతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై పుష్పం పరికల్పయామి |
యం – వాయుతత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై ధూపం పరికల్పయామి |
రం – వహ్నితత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై దీపం పరికల్పయామి |
వం – అమృతతత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై అమృతనైవేద్యం పరికల్పయామి |

స్తోత్రం

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః |

శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ |
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా || ౧ ||

ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహుసమన్వితా |
రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్జ్వలా || ౨ ||

మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా |
నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా || ౩ ||

చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా |
కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా || ౪ ||

అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా |
ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా || ౫ ||

వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా |
వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా || ౬ ||

నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా |
తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా || ౭ ||

కదంబమంజరీక్లుప్తకర్ణపూరమనోహరా |
తాటంకయుగళీభూతతపనోడుపమండలా || ౮ ||

పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః |
నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా || ౯ ||

శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా |
కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా || ౧౦ ||

నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ |
మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా || ౧౧ ||

అనాకలితసాదృశ్యచిబుకశ్రీవిరాజితా |
కామేశబద్ధమాంగళ్యసూత్రశోభితకంధరా || ౧౨ ||

కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా |
రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా || ౧౩ ||

కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ |
నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయీ || ౧౪ ||

లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా |
స్తనభారదళన్మధ్యపట్టబంధవళిత్రయా || ౧౫ ||

అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ |
రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా || ౧౬ ||

కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా |
మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితా || ౧౭ ||

ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా |
గూఢగుల్ఫా కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా || ౧౮ ||

నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా |
పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా || ౧౯ ||

శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా |
మరాళీమందగమనా మహాలావణ్యశేవధిః || ౨౦ ||

సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణభూషితా |
శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీనవల్లభా || ౨౧ ||

సుమేరుమధ్యశృంగస్థా శ్రీమన్నగరనాయికా |
చింతామణిగృహాంతస్థా పంచబ్రహ్మాసనస్థితా || ౨౨ ||

మహాపద్మాటవీసంస్థా కదంబవనవాసినీ |
సుధాసాగరమధ్యస్థా కామాక్షీ కామదాయినీ || ౨౩ ||

దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవైభవా |
భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్వితా || ౨౪ ||

సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితా |
అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతా || ౨౫ ||

చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృతా |
గేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవితా || ౨౬ ||

కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతా |
జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగా || ౨౭ ||

భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితా |
నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుకా || ౨౮ ||

భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందితా |
మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితా || ౨౯ || [విశుక్ర]

విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందితా | [విషంగ]
కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరా || ౩౦ ||

మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితా |
భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణీ || ౩౧ ||

కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిః |
మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసురసైనికా || ౩౨ ||

కామేశ్వరాస్త్రనిర్దగ్ధసభండాసురశూన్యకా |
బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుతవైభవా || ౩౩ ||

హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధిః |
శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజా || ౩౪ ||

కంఠాధఃకటిపర్యంతమధ్యకూటస్వరూపిణీ |
శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణీ || ౩౫ ||

మూలమంత్రాత్మికా మూలకూటత్రయకళేబరా |
కులామృతైకరసికా కులసంకేతపాలినీ || ౩౬ ||

కులాంగనా కులాంతస్థా కౌళినీ కులయోగినీ |
అకులా సమయాంతస్థా సమయాచారతత్పరా || ౩౭ ||

మూలాధారైకనిలయా బ్రహ్మగ్రంథివిభేదినీ |
మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథివిభేదినీ || ౩౮ ||

ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథివిభేదినీ |
సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ || ౩౯ ||

తటిల్లతాసమరుచిష్షట్చక్రోపరిసంస్థితా |
మహాశక్తిః కుండలినీ బిసతంతుతనీయసీ || ౪౦ ||

భవానీ భావనాగమ్యా భవారణ్యకుఠారికా |
భద్రప్రియా భద్రమూర్తిర్భక్తసౌభాగ్యదాయినీ || ౪౧ ||

భక్తిప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా |
శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ || ౪౨ ||

శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచ్చంద్రనిభాననా |
శాతోదరీ శాంతిమతీ నిరాధారా నిరంజనా || ౪౩ ||

నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా |
నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామా నిరుపప్లవా || ౪౪ ||

నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా |
నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా || ౪౫ ||

నిష్కారణా నిష్కళంకా నిరుపాధిర్నిరీశ్వరా |
నీరాగా రాగమథనీ నిర్మదా మదనాశినీ || ౪౬ ||

నిశ్చింతా నిరహంకారా నిర్మోహా మోహనాశినీ |
నిర్మమా మమతాహంత్రీ నిష్పాపా పాపనాశినీ || ౪౭ ||

నిష్క్రోధా క్రోధశమనీ నిర్లోభా లోభనాశినీ |
నిస్సంశయా సంశయఘ్నీ నిర్భవా భవనాశినీ || ౪౮ ||

నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశినీ |
నిర్నాశా మృత్యుమథనీ నిష్క్రియా నిష్పరిగ్రహా || ౪౯ ||

నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా |
దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా || ౫౦ ||

దుష్టదూరా దురాచారశమనీ దోషవర్జితా |
సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధికవర్జితా || ౫౧ ||

సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా |
సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ || ౫౨ ||

సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మనీ |
మాహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీర్మృడప్రియా || ౫౩ ||

మహారూపా మహాపూజ్యా మహాపాతకనాశినీ |
మహామాయా మహాసత్త్వా మహాశక్తిర్మహారతిః || ౫౪ ||

మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబలా |
మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరీ || ౫౫ ||

మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా మహాసనా |
మహాయాగక్రమారాధ్యా మహాభైరవపూజితా || ౫౬ ||

మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణీ |
మహాకామేశమహిషీ మహాత్రిపురసుందరీ || ౫౭ ||

చతుష్షష్ట్యుపచారాఢ్యా చతుష్షష్టికళామయీ |
మహాచతుష్షష్టికోటియోగినీగణసేవితా || ౫౮ ||

మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండలమధ్యగా |
చారురూపా చారుహాసా చారుచంద్రకళాధరా || ౫౯ ||

చరాచరజగన్నాథా చక్రరాజనికేతనా |
పార్వతీ పద్మనయనా పద్మరాగసమప్రభా || ౬౦ ||

పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణీ |
చిన్మయీ పరమానందా విజ్ఞానఘనరూపిణీ || ౬౧ ||

ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మవివర్జితా |
విశ్వరూపా జాగరిణీ స్వపన్తీ తైజసాత్మికా || ౬౨ ||

సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థావివర్జితా |
సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ || ౬౩ ||

సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ |
సదాశివాఽనుగ్రహదా పంచకృత్యపరాయణా || ౬౪ ||

భానుమండలమధ్యస్థా భైరవీ భగమాలినీ |
పద్మాసనా భగవతీ పద్మనాభసహోదరీ || ౬౫ ||

ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః |
సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్ || ౬౬ ||

ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమవిధాయినీ |
నిజాజ్ఞారూపనిగమా పుణ్యాపుణ్యఫలప్రదా || ౬౭ ||

శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా |
సకలాగమసందోహశుక్తిసంపుటమౌక్తికా || ౬౮ ||

పురుషార్థప్రదా పూర్ణా భోగినీ భువనేశ్వరీ |
అంబికాఽనాదినిధనా హరిబ్రహ్మేంద్రసేవితా || ౬౯ ||

నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా |
హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయవర్జితా || ౭౦ ||

రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా |
రంజనీ రమణీ రస్యా రణత్కింకిణిమేఖలా || ౭౧ ||

రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా |
రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణలంపటా || ౭౨ ||

కామ్యా కామకలారూపా కదంబకుసుమప్రియా |
కళ్యాణీ జగతీకందా కరుణారససాగరా || ౭౩ ||

కళావతీ కళాలాపా కాంతా కాదంబరీప్రియా |
వరదా వామనయనా వారుణీమదవిహ్వలా || ౭౪ ||

విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచలనివాసినీ |
విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసినీ || ౭౫ ||

క్షేత్రస్వరూపా క్షేత్రేశీ క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ |
క్షయవృద్ధివినిర్ముక్తా క్షేత్రపాలసమర్చితా || ౭౬ ||

విజయా విమలా వంద్యా వందారుజనవత్సలా |
వాగ్వాదినీ వామకేశీ వహ్నిమండలవాసినీ || ౭౭ ||

భక్తిమత్కల్పలతికా పశుపాశవిమోచినీ |
సంహృతాశేషపాషండా సదాచారప్రవర్తికా || ౭౮ ||

తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రికా |
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోపహా || ౭౯ ||

చితిస్తత్పదలక్ష్యార్థా చిదేకరసరూపిణీ |
స్వాత్మానందలవీభూతబ్రహ్మాద్యానందసంతతిః || ౮౦ ||

పరా ప్రత్యక్చితీరూపా పశ్యంతీ పరదేవతా |
మధ్యమా వైఖరీరూపా భక్తమానసహంసికా || ౮౧ ||

కామేశ్వరప్రాణనాడీ కృతజ్ఞా కామపూజితా |
శృంగారరససంపూర్ణా జయా జాలంధరస్థితా || ౮౨ ||

ఓడ్యాణపీఠనిలయా బిందుమండలవాసినీ |
రహోయాగక్రమారాధ్యా రహస్తర్పణతర్పితా || ౮౩ ||

సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా |
షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా || ౮౪ ||

నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయినీ |
నిత్యాషోడశికారూపా శ్రీకంఠార్ధశరీరిణీ || ౮౫ ||

ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ |
మూలప్రకృతిరవ్యక్తా వ్యక్తావ్యక్తస్వరూపిణీ || ౮౬ ||

వ్యాపినీ వివిధాకారా విద్యాఽవిద్యాస్వరూపిణీ |
మహాకామేశనయనకుముదాహ్లాదకౌముదీ || ౮౭ ||

భక్తహార్దతమోభేదభానుమద్భానుసంతతిః |
శివదూతీ శివారాధ్యా శివమూర్తిశ్శివంకరీ || ౮౮ ||

శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా |
అప్రమేయా స్వప్రకాశా మనోవాచామగోచరా || ౮౯ ||

చిచ్ఛక్తిశ్చేతనారూపా జడశక్తిర్జడాత్మికా |
గాయత్రీ వ్యాహృతిస్సంధ్యా ద్విజబృందనిషేవితా || ౯౦ ||

తత్త్వాసనా తత్త్వమయీ పంచకోశాంతరస్థితా |
నిస్సీమమహిమా నిత్యయౌవనా మదశాలినీ || ౯౧ ||

మదఘూర్ణితరక్తాక్షీ మదపాటలగండభూః |
చందనద్రవదిగ్ధాంగీ చాంపేయకుసుమప్రియా || ౯౨ ||

కుశలా కోమలాకారా కురుకుళ్లా కుళేశ్వరీ |
కుళకుండాలయా కౌళమార్గతత్పరసేవితా || ౯౩ ||

కుమారగణనాథాంబా తుష్టిః పుష్టిర్మతిర్ధృతిః |
శాంతిః స్వస్తిమతీ కాంతిర్నందినీ విఘ్ననాశినీ || ౯౪ ||

తేజోవతీ త్రినయనా లోలాక్షీకామరూపిణీ |
మాలినీ హంసినీ మాతా మలయాచలవాసినీ || ౯౫ ||

సుముఖీ నళినీ సుభ్రూశ్శోభనా సురనాయికా |
కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ || ౯౬ ||

వజ్రేశ్వరీ వామదేవీ వయోఽవస్థావివర్జితా |
సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ || ౯౭ ||

విశుద్ధిచక్రనిలయాఽఽరక్తవర్ణా త్రిలోచనా |
ఖట్వాంగాదిప్రహరణా వదనైకసమన్వితా || ౯౮ ||

పాయసాన్నప్రియా త్వక్స్థా పశులోకభయంకరీ |
అమృతాదిమహాశక్తిసంవృతా ఢాకినీశ్వరీ || ౯౯ ||

అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా |
దంష్ట్రోజ్జ్వలాఽక్షమాలాదిధరా రుధిరసంస్థితా || ౧౦౦ ||

కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతా స్నిగ్ధౌదనప్రియా |
మహావీరేంద్రవరదా రాకిన్యంబాస్వరూపిణీ || ౧౦౧ ||

మణిపూరాబ్జనిలయా వదనత్రయసంయుతా |
వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా || ౧౦౨ ||

రక్తవర్ణా మాంసనిష్ఠా గుడాన్నప్రీతమానసా |
సమస్తభక్తసుఖదా లాకిన్యంబాస్వరూపిణీ || ౧౦౩ ||

స్వాధిష్ఠానాంబుజగతా చతుర్వక్త్రమనోహరా |
శూలాద్యాయుధసంపన్నా పీతవర్ణాఽతిగర్వితా || ౧౦౪ ||

మేదోనిష్ఠా మధుప్రీతా బందిన్యాదిసమన్వితా |
దధ్యన్నాసక్తహృదయా కాకినీరూపధారిణీ || ౧౦౫ ||

మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాఽస్థిసంస్థితా |
అంకుశాదిప్రహరణా వరదాదినిషేవితా || ౧౦౬ ||

ముద్గౌదనాసక్తచిత్తా సాకిన్యంబాస్వరూపిణీ |
ఆజ్ఞాచక్రాబ్జనిలయా శుక్లవర్ణా షడాననా || ౧౦౭ ||

మజ్జాసంస్థా హంసవతీముఖ్యశక్తిసమన్వితా |
హరిద్రాన్నైకరసికా హాకినీరూపధారిణీ || ౧౦౮ ||

సహస్రదళపద్మస్థా సర్వవర్ణోపశోభితా |
సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖీ || ౧౦౯ ||

సర్వౌదనప్రీతచిత్తా యాకిన్యంబాస్వరూపిణీ |
స్వాహా స్వధాఽమతిర్మేధా శ్రుతిః స్మృతిరనుత్తమా || ౧౧౦ ||

పుణ్యకీర్తిః పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తనా |
పులోమజార్చితా బంధమోచనీ బంధురాలకా || ౧౧౧ || [బర్బరాలకా]

విమర్శరూపిణీ విద్యా వియదాదిజగత్ప్రసూః |
సర్వవ్యాధిప్రశమనీ సర్వమృత్యునివారిణీ || ౧౧౨ ||

అగ్రగణ్యాఽచింత్యరూపా కలికల్మషనాశినీ |
కాత్యాయనీ కాలహంత్రీ కమలాక్షనిషేవితా || ౧౧౩ ||

తాంబూలపూరితముఖీ దాడిమీకుసుమప్రభా |
మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ || ౧౧౪ ||

నిత్యతృప్తా భక్తనిధిర్నియంత్రీ నిఖిలేశ్వరీ |
మైత్ర్యాదివాసనాలభ్యా మహాప్రళయసాక్షిణీ || ౧౧౫ ||

పరాశక్తిః పరానిష్ఠా ప్రజ్ఞానఘనరూపిణీ |
మాధ్వీపానాలసా మత్తా మాతృకావర్ణరూపిణీ || ౧౧౬ ||

మహాకైలాసనిలయా మృణాలమృదుదోర్లతా |
మహనీయా దయామూర్తిర్మహాసామ్రాజ్యశాలినీ || ౧౧౭ ||

ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా |
శ్రీషోడశాక్షరీవిద్యా త్రికూటా కామకోటికా || ౧౧౮ ||

కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితా |
శిరస్స్థితా చంద్రనిభా ఫాలస్థేంద్రధనుఃప్రభా || ౧౧౯ ||

హృదయస్థా రవిప్రఖ్యా త్రికోణాంతరదీపికా |
దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞవినాశినీ || ౧౨౦ ||

దరాందోళితదీర్ఘాక్షీ దరహాసోజ్జ్వలన్ముఖీ |
గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా గుహజన్మభూః || ౧౨౧ ||

దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణీ |
ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండలపూజితా || ౧౨౨ ||

కళాత్మికా కళానాథా కావ్యాలాపవినోదినీ |
సచామరరమావాణీసవ్యదక్షిణసేవితా || ౧౨౩ ||

ఆదిశక్తిరమేయాఽఽత్మా పరమా పావనాకృతిః |
అనేకకోటిబ్రహ్మాండజననీ దివ్యవిగ్రహా || ౧౨౪ ||

క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్యపదదాయినీ |
త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తిస్త్రిదశేశ్వరీ || ౧౨౫ ||

త్ర్యక్షరీ దివ్యగంధాఢ్యా సిందూరతిలకాంచితా |
ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవితా || ౧౨౬ ||

విశ్వగర్భా స్వర్ణగర్భాఽవరదా వాగధీశ్వరీ |
ధ్యానగమ్యాఽపరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞానవిగ్రహా || ౧౨౭ ||

సర్వవేదాంతసంవేద్యా సత్యానందస్వరూపిణీ |
లోపాముద్రార్చితా లీలాక్లుప్తబ్రహ్మాండమండలా || ౧౨౮ ||

అదృశ్యా దృశ్యరహితా విజ్ఞాత్రీ వేద్యవర్జితా |
యోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరా || ౧౨౯ ||

ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణీ |
సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ || ౧౩౦ ||

అష్టమూర్తిరజాజైత్రీ లోకయాత్రావిధాయినీ |
ఏకాకినీ భూమరూపా నిర్ద్వైతా ద్వైతవర్జితా || ౧౩౧ ||

అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మాత్మైక్యస్వరూపిణీ |
బృహతీ బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా || ౧౩౨ ||

భాషారూపా బృహత్సేనా భావాభావవివర్జితా |
సుఖారాధ్యా శుభకరీ శోభనాసులభాగతిః || ౧౩౩ ||

రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా |
రాజత్కృపా రాజపీఠనివేశితనిజాశ్రితా || ౧౩౪ ||

రాజ్యలక్ష్మీః కోశనాథా చతురంగబలేశ్వరీ |
సామ్రాజ్యదాయినీ సత్యసంధా సాగరమేఖలా || ౧౩౫ ||

దీక్షితా దైత్యశమనీ సర్వలోకవశంకరీ |
సర్వార్థదాత్రీ సావిత్రీ సచ్చిదానందరూపిణీ || ౧౩౬ ||

దేశకాలాపరిచ్ఛిన్నా సర్వగా సర్వమోహినీ |
సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణీ || ౧౩౭ ||

సర్వోపాధివినిర్ముక్తా సదాశివపతివ్రతా |
సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండలరూపిణీ || ౧౩౮ ||

కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ |
గణాంబా గుహ్యకారాధ్యా కోమలాంగీ గురుప్రియా || ౧౩౯ ||

స్వతంత్రా సర్వతంత్రేశీ దక్షిణామూర్తిరూపిణీ |
సనకాదిసమారాధ్యా శివజ్ఞానప్రదాయినీ || ౧౪౦ ||

చిత్కళాఽఽనందకలికా ప్రేమరూపా ప్రియంకరీ |
నామపారాయణప్రీతా నందివిద్యా నటేశ్వరీ || ౧౪౧ ||

మిథ్యాజగదధిష్ఠానా ముక్తిదా ముక్తిరూపిణీ |
లాస్యప్రియా లయకరీ లజ్జా రంభాదివందితా || ౧౪౨ ||

భవదావసుధావృష్టిః పాపారణ్యదవానలా |
దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతరవిప్రభా || ౧౪౩ ||

భాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్తకేకిఘనాఘనా |
రోగపర్వతదంభోళిర్మృత్యుదారుకుఠారికా || ౧౪౪ ||

మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా |
అపర్ణా చండికా చండముండాసురనిషూదినీ || ౧౪౫ ||

క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ |
త్రివర్గదాత్రీ సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మికా || ౧౪౬ ||

స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్పనిభాకృతిః |
ఓజోవతీ ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రతా || ౧౪౭ ||

దురారాధ్యా దురాధర్షా పాటలీకుసుమప్రియా |
మహతీ మేరునిలయా మందారకుసుమప్రియా || ౧౪౮ ||

వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ |
ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ || ౧౪౯ ||

మార్తాండభైరవారాధ్యా మంత్రిణీన్యస్తరాజ్యధూః |
త్రిపురేశీ జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా || ౧౫౦ ||

సత్యజ్ఞానానందరూపా సామరస్యపరాయణా |
కపర్దినీ కళామాలా కామధుక్కామరూపిణీ || ౧౫౧ ||

కళానిధిః కావ్యకళా రసజ్ఞా రసశేవధిః |
పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా || ౧౫౨ ||

పరంజ్యోతిః పరంధామ పరమాణుః పరాత్పరా |
పాశహస్తా పాశహంత్రీ పరమంత్రవిభేదినీ || ౧౫౩ ||

మూర్తాఽమూర్తా నిత్యతృప్తా మునిమానసహంసికా |
సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామినీ సతీ || ౧౫౪ ||

బ్రహ్మాణీ బ్రహ్మజననీ బహురూపా బుధార్చితా |
ప్రసవిత్రీ ప్రచండాఽఽజ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతిః || ౧౫౫ ||

ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ |
విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః || ౧౫౬ ||

ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ |
భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రవర్తినీ || ౧౫౭ ||

ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ |
ఉదారకీర్తిరుద్దామవైభవా వర్ణరూపిణీ || ౧౫౮ ||

జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ |
సర్వోపనిషదుద్ఘుష్టా శాంత్యతీతకళాత్మికా || ౧౫౯ ||

గంభీరా గగనాంతస్థా గర్వితా గానలోలుపా |
కల్పనారహితా కాష్ఠాఽకాంతా కాంతార్ధవిగ్రహా || ౧౬౦ ||

కార్యకారణనిర్ముక్తా కామకేళితరంగితా |
కనత్కనకతాటంకా లీలావిగ్రహధారిణీ || ౧౬౧ ||

అజా క్షయవినిర్ముక్తా ముగ్ధా క్షిప్రప్రసాదినీ |
అంతర్ముఖసమారాధ్యా బహిర్ముఖసుదుర్లభా || ౧౬౨ ||

త్రయీ త్రివర్గనిలయా త్రిస్థా త్రిపురమాలినీ |
నిరామయా నిరాలంబా స్వాత్మారామా సుధాసృతిః || ౧౬౩ ||

సంసారపంకనిర్మగ్నసముద్ధరణపండితా |
యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమానస్వరూపిణీ || ౧౬౪ ||

ధర్మాధారా ధనాధ్యక్షా ధనధాన్యవివర్ధినీ |
విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణీ || ౧౬౫ ||

విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ |
అయోనిర్యోనినిలయా కూటస్థా కులరూపిణీ || ౧౬౬ ||

వీరగోష్ఠీప్రియా వీరా నైష్కర్మ్యా నాదరూపిణీ |
విజ్ఞానకలనా కల్యా విదగ్ధా బైందవాసనా || ౧౬౭ ||

తత్త్వాధికా తత్త్వమయీ తత్త్వమర్థస్వరూపిణీ |
సామగానప్రియా సౌమ్యా సదాశివకుటుంబినీ || ౧౬౮ ||

సవ్యాపసవ్యమార్గస్థా సర్వాపద్వినివారిణీ |
స్వస్థా స్వభావమధురా ధీరా ధీరసమర్చితా || ౧౬౯ ||

చైతన్యార్ఘ్యసమారాధ్యా చైతన్యకుసుమప్రియా |
సదోదితా సదాతుష్టా తరుణాదిత్యపాటలా || ౧౭౦ ||

దక్షిణాదక్షిణారాధ్యా దరస్మేరముఖాంబుజా |
కౌళినీకేవలాఽనర్ఘ్యకైవల్యపదదాయినీ || ౧౭౧ ||

స్తోత్రప్రియా స్తుతిమతీ శ్రుతిసంస్తుతవైభవా |
మనస్వినీ మానవతీ మహేశీ మంగళాకృతిః || ౧౭౨ ||

విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ |
ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ || ౧౭౩ ||

వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ |
పంచయజ్ఞప్రియా పంచప్రేతమంచాధిశాయినీ || ౧౭౪ ||

పంచమీ పంచభూతేశీ పంచసంఖ్యోపచారిణీ |
శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహినీ || ౧౭౫ ||

ధరా ధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ |
లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా || ౧౭౬ ||

బంధూకకుసుమప్రఖ్యా బాలా లీలావినోదినీ |
సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ || ౧౭౭ ||

సువాసిన్యర్చనప్రీతాఽశోభనా శుద్ధమానసా |
బిందుతర్పణసంతుష్టా పూర్వజా త్రిపురాంబికా || ౧౭౮ ||

దశముద్రాసమారాధ్యా త్రిపురాశ్రీవశంకరీ |
జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణీ || ౧౭౯ ||

యోనిముద్రా త్రిఖండేశీ త్రిగుణాఽంబా త్రికోణగా |
అనఘాఽద్భుతచారిత్రా వాంఛితార్థప్రదాయినీ || ౧౮౦ ||

అభ్యాసాతిశయజ్ఞాతా షడధ్వాతీతరూపిణీ |
అవ్యాజకరుణామూర్తిరజ్ఞానధ్వాంతదీపికా || ౧౮౧ ||

ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్యశాసనా |
శ్రీచక్రరాజనిలయా శ్రీమత్త్రిపురసుందరీ || ౧౮౨ ||

శ్రీశివా శివశక్త్యైక్యరూపిణీ లలితాంబికా |
ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః | ౧౮౩ ||

ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీహయగ్రీవాగస్త్యసంవాదే శ్రీలలితా రహస్యనామసాహస్రస్తోత్రకథనం నామ ద్వితీయోధ్యాయః |

సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం మాణిక్య మౌళిస్ఫుర-
త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్ ।
పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామంబికామ్ ॥