Category Archives: Latest Events
- January 29, 2020
-
-
-
-
- January 27, 2020
-
-
మ్యాచోస్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్‌నంది కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం` సీటీమార్`. ఫస్ట్‌లుక్ విడుదల!!
Category : Latest Events Latest Reviews Movie News Sliders
మ్యాచోస్టార్ గోపీచంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ‘యు టర్న్’లాంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న భారీ చిత్రం` సీటీమార్`. ఈ ప్రెస్టీజియస్ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. తరుణ్ అరోర ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు ఉదయం 8.47నిమిషాలకి విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ..
చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ – “ఇటీవల హైదరాబాద్, రాజమండ్రిలో బిగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఈరోజు నుండి ఆర్.ఎఫ్.సిలో కొత్త షెడ్యూల్ ప్రారంభించాం. నాన్ స్టాప్‌గా షెడ్యూల్ జరిపి సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. గోపిచంద్ కెరీర్ లోనే ఇది హై బడ్జెట్ ఫిలిం. హై టెక్నికల్ వేల్యూస్‌తో ప్రెస్టీజియస్ మూవీగా రూపొందుతోంది. హీరో గోపిచంద్ కి భారీ కమర్షియల్ మూవీ“ అన్నారు.
మ్యాచో స్టార్ గోపీచంద్, మిల్కీబ్యూటి తమన్నా, దిగంగన సూర్యవంశి, తరుణ్ అరోర, భూమిక, పోసాని కృష్ణమురళి, రావురమేష్, అన్నపూర్ణమ్మ, ప్రగతి
తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: సౌందర్ రాజన్, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్: డి.వై.సత్యనారాయణ, సమర్పణ: పవన్ కుమార్, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: సంపత్ నంది.
- January 23, 2020
-
-
‘సరిలేరు నీకెవ్వరు` చిత్రాన్ని మహేష్‌గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిపిన ప్రేక్షకులకు ధన్యవాదాలు – ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర.
Category : Latest Events Latest Reviews Movie News Sliders
సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్‌రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ `సరిలేరు నీకెవ్వరు`. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రొఫెసర్ భారతీగా లేడీ అమితాబ్ విజయశాంతి పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ సూపర్‌స్టార్ మహేశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా హైదరాబాద్ సంస్థ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..
ఇలాంటి సంక్రాంతిని ఇంత వరకూ చూడలేదు!!
సూపర్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు మాట్లాడుతూ – ”నేను ఇండస్ట్రీకి వచ్చి 22 సంవత్సరాలైంది. ఇలాంటి సంక్రాంతి ఇప్పటివరకూ చూడలేదు. కేవలం ఐదు నెలల్లోనే సూపర్‌స్టార్ మహేష్, అనిల్ రావిపూడి ఈ సినిమా కంప్లీట్ చేసి సరిలేరు మాకెవ్వరు అన్పించారు. ప్రేక్షకులు కూడా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ కా బాప్ అనే రేంజ్‌లో రెవెన్యూ క్రియేట్ చేసి, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నిజమైన సంక్రాంతి అనుకునేలాగా చేశారు. అనిల్ ఇప్పటివరకూ అయిదు సినిమాలు చేశారు. అయిదురు హీరోలకి వారి కెరీర్ బెస్ట్ సక్సెస్ ఇచ్చారు. అలాగే ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌కిగానీ, మా బేనర్‌కి గానీ హయ్యస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేసిన సినిమాగా క్రియేట్ చేశారు. ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడే చెప్పలేం. అలాగే డిస్ట్రిబ్యూటర్స్‌కి ఎంత ప్రాఫిట్ కావాలో అంత ప్రాఫిట్ క్రియేట్ చేసి ఇచ్చారు. సంక్రాంతికి రావాలనే ఒక్క సంకల్పంతో అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా అయిదు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసిన మహేష్‌బాబుగారికి థాంక్స్. ఈ సంక్రాంతికి ఇంత మంచి రెవెన్యూ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు” అన్నారు.
అనిల్‌కి ఒన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అఛీవ్‌మెంట్!!
ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ – ”సంక్రాంతి ముగిసింది. పండగ సినిమాలకి ఇంకా సంక్రాంతి నడుస్తూనే ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’ మహేష్‌గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఒక సూపర్‌స్టార్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అంటే సాధారణ విషయం కాదు. దర్శకుడు అనిల్ రావిపూడికి ఒన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అఛీవ్‌మెంట్. అనిల్ కష్టానికి తగ్గ ప్రతిఫలం మా అందరికీ లభించింది. ఈ సినిమాకి దిల్‌రాజుగారి కోపరేషన్ మరువలేనిది. మేం ఏదైతే అనుకున్నామో దానికన్నా ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీలోనే ది బెస్ట్ సంక్రాంతి అని మా డిస్ట్రిబ్యూటర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సంక్రాంతిలో మా సినిమా ఉండటం నిజంగా మా అదృష్టం” అన్నారు.
ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దద్దరిల్లిపోతోంది!!
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – ”అందరూ చెప్పినట్లే తెలుగు సినిమా కళకళలాడుతోంది. సంక్రాంతికి బాక్సాఫీస్ దద్దరిల్లిపోతోంది. ఐయాం వెరీ హ్యాపీ. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసి మహేష్‌గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిపిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంకా రెండు మూడు వారాలు రన్ ఉంది. అలాగే రిపీటెడ్‌గా చూడాలనుకునే ఆడియన్స్ కోసం ఒకటిన్నర నిమిషాల నిడివి గల సన్నివేశాన్ని యాడ్ చేస్తున్నాం. దాంతో ఇంకొంచెం నవ్వులు బోనస్‌గా లభిస్తాయి. ‘రమణా లోడు ఎత్తాలిరా’ అనే డైలాగ్‌కు మేం ఊహించినదాన్ని కన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది.అందుకే మేము కూడా ‘రమణా బాక్సాపీస్ లోడ్ ఎత్తాలిరా’ అంటున్నాం. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ఎంతో గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు” అన్నారు.
-
-
Vaishnav Tej’s debut film title confirmed as ‘Uppena’
Category : Latest Events Latest Reviews Movie News Sliders
Megastar Chiranjeevi’s nephew and Sai Dharam Tej’s younger brother Vaishnav Tej is getting introduced as hero and the film is officially titled ‘Uppena.’
Buchi babu Sana who worked as associate to legendary director Sukumar is directing his debut film Uppena for which first look poster is being released tomorrow at 4:05 pm.
Newgirl Krithi Shetty is also making her debut with this film while Tamil star actor Vijay Sethupathi is playing an important role.
Hero, heroine and actor Brahmaji will be taking part in Puri schedule of shooting.
‘Rockstar’ Devi Sri Prasad will be composing music while Shamdat Sainudeen will handle the cinematography.
Mythri Movie Makers is producing ‘Uppena’ in association with Sukumar Writings banner.
Cast: Panja Vaisshnav Tej, Vijay Sethupathi, Kriti Shetty, Sai Chand, Brahmaji
Crew:
Story & Direction: Buchi Babu Sana
Producers: Naveen Yerneni, Y Ravi Shankar
Executive Producer: Anil Y
CEO: Cherry
Banner: Mythri Movie Makers, Sukumar Writings
Cinematography: Shamdat Sainudeen
Music director: Devi Sri Prasad
Editor: Naveen Nooli
Art Director: Mounika Ramakrishna
Pro: Vamsi Shekar, Madhu Maduri
- January 22, 2020
-
-
పూరి జగన్నాధ్ చేతుల మీదుగా అశ్వద్ధామ ట్రైలర్
Category : Latest Events Latest Reviews Movie News Sliders
యూవ హీరో నాగ శౌర్య రాసుకున్న కథ ఆధారంగా తెరకెక్కిన అశ్వద్ధామ మూవీ టీజర్ ను ఇటీవల సమంత విడుదల చేసిన సంగతి తెలిసిందే, టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్ర ట్రైలర్ ను డైరెక్టర్ పూరి జగన్నాధ్ విడుదల చేయబోతున్నాడు.
అశ్వద్ధామ ట్రైలర్ జనవరి 23న సాయంత్రం 5.04 గంటలకు పూరి జగన్నాధ్ చేతుల మీదుగా విడుదల కాబోతొంది. అందరి అంచనాలకు తగ్గటు ట్రైలర్ ఉండబోతొంది.
నాగ శౌర్య సరసన మెహిరిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సమాజంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనకు ఆధారంగా తెరకెక్కింది. అశ్వద్ధామ జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
నటీనటులు: నాగ శౌర్య, మెహరిన్
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: ఐరా క్రియేషన్స్
నిర్మాత: ఉషా మూల్పూరి
కథ: నాగ శౌర్య
డైరెక్టర్: రమణ తేజ
కెమెరా: మనోజ్ రెడ్డి
మ్యూజిక్: శ్రీచరన్ పాకాల
ఎడిటర్: గ్యారీ
లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి
డిజిటల్: గౌతమ్
డైలాగ్స్: పరుశురాం శ్రీనివాస్
యాక్షన్ డైరెక్టర్: అన్బరివ్
-
-
`ప్రాణం నా ప్రాణం..నీతో ఇలా….` అనే హార్ట్ టచింగ్ మెలోడీ సాంగ్‌తో ఆకట్టుకుంటున్న `జాను`
Category : Latest Events Latest Reviews Movie News Sliders
శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం `జాను`. ఈ సినిమాలో తొలి లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
“ప్రాణం నా ప్రాణం..నీతో ఇలా
గానం తొలి గానం పాడే వేళ
తారా తీరం మన దారిలోకాంతులే కురిసేలా
చాలా దూరం రాబోవు ఉదయాలనే విసిరేలా…“ అంటూ హార్ట్ టచింగ్ మెలోడీ ప్రేమలోని గాఢత ఈ పాటలో తెలియచేస్తుంది.
గోవింద్ వసంత సంగీత సారథ్యంలో శ్రీమణి రాసిన ఈ పాటను చిన్నయి, గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే మిగిలిన పాటలను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
నటీనటులు:
శర్వానంద్, సమంత
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: సి.ప్రేమ్‌కుమార్
నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్
సమర్పణ: శ్రీమతి అనిత
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సంగీతం: గోవింద్ వసంత
సినిమాటోగ్రఫీ: మహేంద్రన్ జయరాజ్
ఆర్ట్: రామాంజనేయులు
మాటలు: మిర్చి కిరణ్
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీమణి
- January 21, 2020
-
-
“కాక్ టైల్” ప్రారంభం
Category : Latest Events Latest Reviews Movie News Sliders
చిత్రలహరి మూవీ మేకర్స్ పతాకంపై జై దర్శకత్వంలో,అట్లూరి మాదవి నిర్మించనున్న హిలెరియస్ కామెడీ ఎంటర్ టైనర్ “కాక్ టైల్”. ఈచిత్ర ప్రారంభోత్సవం ఇటీవల ఫిల్మ్ నగర్ ధైవసన్నిదానం లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జై మాట్లాడుతూ “యువత భవిత పై సోషల్ మీడియా ప్రభావం”అనే అంశంతో,అన్నికమర్షియల్ హంగులతో రూపుదిద్దుకొనున్న చిత్రమిది.పాత,కొత్త ఆర్టిస్ట్ లతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఫిబ్రవరి 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్,గోవాలలో జరపనున్నాం. అన్నారు.
ఈ చిత్రానికి కధ,మాటలు:శ్రీకుమార్ దాలిపర్తి సంగీతం:భాను.జె. ప్రసాద్,కేమెరా:శ్రీనివాస్ సబ్బి,డాన్స్:శైలజ, రాక్ వేణు ఫైట్స్:నాబా,ఎడిటింగ్:శివ,సమర్పణ:పవన్ కుమార్ వాసికర్ల,పి.ఆర్.ఓ:బి.వీరబాబు,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:ఆనంద్.వి,ప్రొడ్యూసర్:అట్లూరి మాధవి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:జై
- January 20, 2020
-
-
-
-
Search
Latest Updates
- శ్రీకృష్ణుడు ఏకలవ్యుడిని ఎందుకు చంపాడో తెలుసా?
- రూ.16వేల కోట్లు చాలవు… ‘అవతార్ 2’ హిట్ కావాలంటే
- నా వారసుడు వచ్చేస్తున్నాడు.. నందమూరి బాలకృష్ట
- విశాఖ కనకమహాలక్ష్మి.. ఇక్కడ భక్తులే పూజలు చేయొచ్చు
- ప్రభాస్ ఫ్యాన్‌కి బ్యాడ్‌న్యూస్… ‘ఆదిపురుష్’ మళ్లీ వాయిదా?
- ‘కాంతార’ సర్ప్రైజ్.. ఈ అర్ధరాత్రి నుంచే ఓటీటీ స్ట్రీమింగ్
© Copyright 2020. All Rights Reserved