Category Archives: Latest Events

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘వధుకట్నం ‘

శ్రీహర్ష , ప్రియ, రఘు , కవిత , ఆర్యన్ , రేఖ, కుషాల్, అనోన్య, మణిచందన, నాగలక్ష్మి ఇంజి ప్రధాన పాత్ర ధారులుగా ‘గ్రీన్ క్రాస్ థియోసోఫికల్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ సొసైటీ ‘ సమర్చణలో ‘షబాబు ఫిలిమ్స్’, పతాకం పై, భార్గవ గొట్టిముక్కల దర్శకత్వం లో షేక్ బాబు సాహెబ్ నిర్మిస్తున్న సందేశాత్మక కుటుంబ కథా చిత్రం “వధుకట్నం.. ఇలా జరగొచ్చేమో..” షూటంగ్ పూర్తి చేసుకుంది.

సమాజంలో స్త్రీ కి జరుగుతున్న అన్యాయానికి కారకులైన వారిని ప్రశ్నిస్తూ, పరిష్కారానికి ముందుకు రండి అని మహిళా లోకానికి పిలుపునిచ్చే ఒక మహిళా నాయకురాలిగా- “ఉద్యమం ఇదిరా… ” , అనే పాటలో ప్రముఖ నటి మణిచందన నటించారు. వర్థమాన యువ రచయిత శ్రీరాం తపస్వి రచియించిన ఈ గీతానికీ యువ సంగీత దర్మకుడు ప్రభు ప్రవీణ్ లంక (నాని) ఉద్వేగభరితమైన బాణీని అందించారు.

ఈ పాటకు యువ నృత్య దర్శకుడు వి .యమ్ . కృష్ణ దర్శకత్వం వహించగా, ప్రముఖ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ యస్.డి జాన్ గారి నేతృత్వంలో, వందలాది మంది జూనియర్ ఆర్టిస్ట్ ల సహకారం తో మూడు రోజుల పాటు రాజధాని నగర వీధుల్లో భారీ ఎత్తున చిత్రీకరించడం జరిగింది.

దర్శకుడు భార్గవ గొట్టిముక్కల మాట్లాడుతూ- నిర్మాత నన్ను నమ్మి, పూర్తి స్వేచ్ఛనిస్తూ, ఈ చిత్రానికి దర్శకత్వ భాధ్యతలను నాకివ్వడం నేను చేసుకున్న అదృష్టం. నన్ను నమ్మిన నిర్మాత నమ్మకాన్ని వమ్ము చేయకుండా నటీనటులు, సాంకేతిక నిపుణులందరి సహకారంతో షూటింగ్ పూర్తి చేశామని తెలిపారు.

నిర్మాత షేక్ బాబు సాహెబ్ మాట్లాడుతూ, దర్శకుడికి టెక్నికల్ నాలెడ్జి కన్నా, నేటి సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన ఎక్కువుండాలనుకునేవాన్ని . ఇవన్నీ దర్శకుడు భార్గవ లో పుష్కలంగా ఉన్నాయన్న నమ్మకంతోనే అతన్ని దర్శకుడిగా ఎన్నుకోవడం జరిగింది. నేను ఊహించినట్లే స్త్రీ వివక్ష పైన, నేను రచించిన కథకు అనుగునంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా, మెచ్చేలా చిత్రీకరించి పూర్తి న్యాయం చేశాడని చెబుతూ .. ఇప్పటికే డబ్బింగ్ పూర్తి చేసుకుని , రీ-రికార్డింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అతి త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

నటీనటులు:-
శ్రీ హర్ష, ప్రియ, రఘు, కవిత , ఆర్యన్ , రేఖ, కుషాల్, అనోన్య, మణి చందన, పూజ (ముంబాయి) జ్యోతి, నాగలక్ష్మి ఇంజి , చైతన్య, రాకెట్ రాఘవ (జబర్దస్త్), రాము (జబర్దస్త్), కోటేష్ మానవ్, శ్రీనివాసులు, నిట్టల శ్రీ రామమూర్తి, చలపతిరావు , మల్లాది భాస్కర్, రవిశంకర్, కృష్ణమోహన్ రాజు, జయరాం, శ్రీకాంత్, అర్జున్ రాజు, రజని, సిరి, మాస్టర్ అన్షీ శుక్లా , మాస్టర్ ధీరజ్

సాంకేతిక వర్గం:
డైరెక్టర్‌ అఫ్ ఫోటోగ్రఫీ : యస్ .డి .జాన్ ,
సంగీతం – ప్రభు ప్రవీణ్ లంక (నాని),
ఆర్ట్: విజయకృష్ణ
ఎడిటింగ్: సునీల్ మహారాణా ,
పాటలు:- శ్రీరామ్ తపస్వి, షేక్ బాబు సాహెబ్ (బాబుషా),
మేకప్:- బాలరాజు,
కాస్టూమ్స్ – డి. నాగేశ్వరరావు,
స్టిల్స్ -శ్రీను
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ :- యమ్. రమేష్

డైరెక్షన్ డిపార్ట్మెంట్ :- నరేష్ కూరాకుల , యమ్. కృష్ణ, చిన్నతిమ్మిరాజు.
కో-డైరెక్టర్స్ :- రామారావు శీతిరాల, గోలి వెంకటేశ్వర్లు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :- షేక్ హమీద్ బాబు (బబ్లు)
కథ , నిర్మాత : షేక్ బాబు సాహెబ్ (బాబుషా)
డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భార్గవ గొట్టిముక్కల.


విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ షురూ

సంచలన కథానాయకుడు విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో తయారవుతున్న క్రేజీ మూవీ షూటింగ్ ముంబైలో సోమవారం ఉదయం పూజా కార్యక్రమాలతో మొదలైంది.
హీరో విజయ్ దేవరకొండపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చార్మీ కౌర్ క్లాప్ నిచ్చారు.

‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్క్రిప్టుకు ఫిదా అయిన కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాణ భాగస్వాములుగా ఈ ప్రాజెక్టులో జాయిన్ అయ్యారు.

పాన్ ఇండియా మూవీగా హిందీతో పాటు, అన్ని దక్షిణాది భాషల్లోనూ ఇది రూపొందుతోంది. తన హీరోలను అదివరకెన్నడూ కనిపించని రీతిలో చూపించే స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న పూరి, వారిలోని బెస్ట్ పర్ఫార్మెన్సును రాబట్టడానికి కృషి చేస్తుంటారు. అదే తరహాలో, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ విషయంలో పూరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

తన పాత్ర కోసం తీవ్ర శిక్షణ తీసుకున్న ఆ యంగ్ హీరో, తన రూపాన్ని తీర్చిదిద్దుకోడానికి కఠిన ఆహార నియమాలు పాటిస్తున్నారు. థాయిలాండ్ కు వెళ్లిన ఆయన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, ఇతర పోరాట పద్ధతుల్ని నేర్చుకున్నారు. ఇప్పటి దాకా తను చేసిన పాత్రల్లోనే మోస్ట్ చాలెంజింగ్ రోల్ చేస్తున్న విజయ్ దేవరకొండ, ఈ మూవీలో పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనున్నారు.

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ తో పాటు కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ యాక్షన్ సినిమాని నిర్మిస్తున్నారు.

రమ్యకృష్ణ, రోణిత్ రాయ్, విష్ణురెడ్డి, అలీ, గెటప్ శ్రీను కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీని ధర్మా ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది.

బ్యానర్: పూరి కనెక్ట్స్
సమర్పణ: ధర్మా ప్రొడక్షన్స్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా


మా నాన్నతో కలిసి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టడమనే ఆనందం త్రివిక్రమ్ గారిచ్చారు

*“మా నాన్నతో కలిసి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టడమనే ఆనందం త్రివిక్రమ్ గారిచ్చారు”
– ‘అల వైకుంఠపురములో’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్*

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల్ని బద్దలుకొడుతూ దూసుకుపోతోంది. పూజా హెగ్డే నాయికగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించారు. మొదటి వారంలోనే ‘అల వైకుంఠపురములో’ మూవీ 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ నాన్-బాహుబలి2 రికార్డుల్ని సృష్టించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం ఆదివారం సాయంత్రం వైజాగ్ లో గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.
ఈ ఉత్సవంలో ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్. ప్రకాష్ మాట్లాడుతూ “ఆర్ట్ డైరెక్టర్ గా నా మొదటి సినిమా ‘ఆర్య’. మళ్లీ ఇన్నాళ్లకు అల్లు అర్జున్ సినిమాకు పనిచేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాకు నేను వేసిన సెట్స్ అందరికీ నచ్చినందుకు హ్యాపీ” అన్నారు.
నటుడు అజయ్ మాట్లాడుతూ “ఈ సినిమా ఒక మ్యాజిక్. ప్రతి డైలాగ్, ప్రతి సీన్ నాకు చాలా బాగా నచ్చాయి. బన్నీ ఈ సినిమాని తన భుజాలపై మోసుకువెళ్లారు” అని తెలిపారు.
ఏపీ టూరిజం మినిస్టర్ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ “బాహుబలి తర్వాత బిగ్గెస్ట్ హిట్ కొట్టిన చినబాబు గారు తనపేరును పెదబాబుగా మార్చుకోవాలి. అలాగే మా గురువు, బావగారు అల్లు అరవింద్ గారు బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. మొన్న ఆడియో ఫంక్షన్ లో బన్నీ గారు చెప్పినట్లు అరవింద్ గారు ఒక లెజెండరీ పర్సనాలిటీ. ఇన్ని సంవత్సరాలు సినిమా రంగంలో ఉండటం, ఇన్ని విజయవంతమైన సినిమాలు నిర్మించడం, అదురూబెదురూ లేని జీవనప్రయాణం సాగించడం ఆయన తల్లితండ్రులు చేసిన పుణ్యం. మెగా అభిమానులకు చిరంజీవి గారు దేవుడైతే, అరవింద్ గారు క్షేత్ర పాలకుడు లాంటివారు. చిరంజీవి గారి జర్నీలో అరవింద్ గారి పాత్ర ఎంతో కొంత ఉంది. ఒక రైటర్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందో ఇదివరకు దాసరి నారాయణరావు గారిని చూశాం, ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని చూస్తున్నాం. నంబర్ వన్ స్థానంలో ఉన్న పూజా హెగ్డే రాబోయే రోజుల్లో ఈ విజయ పరంపరను కొనసాగించాలని ఆశిస్తున్నా. అరవింద్ గారు, చినబాబు గారు విశాఖపట్నంలో ఫిల్మ్ ఇండస్ట్రీని నెలకొల్పడంలో ముందడుగు వెయ్యాలని కోరుతున్నా. సినిమా ఇండస్ట్రీని నెలకొల్పడానికి అనుకూలమైన వాతావరణం ఉన్న నగరం ఇది. అరవింద్ గారు తన అదృష్టాన్ని విశాఖ నగరానికి కూడా అందించాలని కోరుకుంటున్నా” అని చెప్పారు.
హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడుతూ “ఈ సినిమా సక్సెస్ గురించి ఇదివరకే ఇంటర్వ్యూల్లో మాట్లాడేశాను. అదే విషయాన్ని మళ్లీ తెలుగులో చెప్తాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఒక సినిమాకి సక్సెస్ రావాలంటే అది టీం ఎఫర్ట్ వల్లే సాధ్యమవుతుంది. అందుకే మా మొత్తం బృందానికి కంగ్రాట్స్. నాకు ఇంత పెద్ద హిట్టిచ్చినందుకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు థాంక్స్. నన్ను ఇంత అందంగా చూపించినందుకు థాంక్స్. ‘బుట్టబొమ్మ’ పాట మొత్తం నామీద రాసినందుకు థాంక్స్. ఇప్పుడు నేను తెలుగు అమ్మాయిని అయిపోయాను. షారుఖ్ ఖాన్, సుస్మితా సేన్ లాంటి ‘ఆరా’ను అల్లు అరవింద్ గారిలో చూస్తున్నాను. చినబాబు, నాగవంశీ లాంటి అందమైన హృదయమైన నిర్మాతల్ని నేను అదివరకు కలవలేదు. బంటూ (అల్లు అర్జున్ ను ఉద్దేశించి) మీ గురించి మాట్లాడాలంటే కొంచెం ప్రాబ్లెం ఉంది. ఎందుకంటే ఆడియెన్స్ మీ గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. వాళ్లు మిమ్మల్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అనీ, మల్లు అర్జున్ అనీ, టిక్ టాక్ స్టార్ అల్లు అర్జున్, గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ అల్లు అర్జున్ అని అంటుంటారు. మీతో హీరోయిన్ గా రెండోసారి నటించాను. రాబోయే రోజుల్లో మీరు మరింత సక్సెస్ కావాలని ఆశిస్తున్నా. మళ్లీ మీతో కలిసి నటించాలని ఆశిస్తున్నా. కొన్ని జాతకాలంతే. తమన్ తన మ్యూజిక్ తో సినిమాని ఎలివేట్ చేశారు. ఈ సీజన్ లో అవార్డ్స్ అన్నీ అతనికే వస్తాయి. తెలుగు ఫ్యాన్స్ లాగా ఏ ఫ్యాన్స్ లేరు” అని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ “జనవరికి ఎలా గెలవాలని ఆరు నెలలుగా మానసికంగా పరిగెత్తుతూ వచ్చాం. దాంతో బ్రెయిన్ కొంచెం చిక్కిపోయింది. బన్నీ, త్రివిక్రమ్ వల్లే ఈ ఆల్బం ఇలా వచ్చింది. ఈ భూగ్రహం పైనే కూలెస్ట్ డైరెక్టర్ త్రివిక్రమ్. పదేళ్ల కాలంలో వంద సినిమాలు చేశాను. త్రివిక్రమ్ గారితో పనిచేయడానికి నాకు పదేళ్లు పట్టింది. అందుకే పదేళ్లు మించిపోయే పాట ఇచ్చాను. సాధారణంగా ఒక దర్శకుడితో పరిగెత్తడం కష్ట. అదే రైటర్ కూడా అయిన దర్శకుడితో పరిగెత్తడం మరీ కష్టం. ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’, ఇప్పుడు ఈ సినిమాతో బన్నీతో హ్యాట్రిక్ సాధించాను. సాధారణంగా సైకిల్ ట్యూబులు పంక్చరవడం మనం చూస్తుంటాం. ఈ సినిమాకి యూట్యూబులే పంక్చరయ్యాయి. ఇండియాని కాపాడ్డానికి బోర్డర్లో ఆర్మీవాళ్లు ఉంటారు. కానీ మన తెలుగు భాషను కాపాడే ఒకే సోల్జర్ త్రివిక్రమ్ గారు. ఆయన అమ్మలాంటి మనిషి. ఆయనను జాగ్రత్తగా కాపాడుకుందాం. నిర్మాతలు రాధాకృష్ణ, అరవింద్ గార్లు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. వంద మిలియన్ కాదు వెయ్యి మిలియన్ వ్యూస్ కొడతాం” అని తెలిపారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “మా నాన్న అల్లు రామలింగయ్య గారిని తలుచుకొని మాట్లాడుతున్నా. సినిమా అనేది అందరికంటే గొప్పది. ఇది 2020. 2060లోనూ ఈ సినిమా పాటలు పాడతారని నేను ప్రామిస్ చేస్తున్నాను. ‘శంకరాభరణం’కు నేను పనిచేశాను. ఆ సినిమా పాటలు ఇప్పటికీ పాడుకుంటున్నారు. ఒక గొప్ప సినిమాకు, ఒక గొప్ప సంగీతం తోడైతే, అది వందేళ్లు నిలిచిపోతుంది. అలాగే ఈ సినిమాని వంద సంవత్సరాలు ఉంచుతారు. ఇది వాస్తవం. నేను కర్నూలులో ఈ సెలబ్రేషన్స్ పెట్టుకుందామని బన్నీతో అంటే, నాకు ‘వైజాగే కావాలి’ అన్నాడు. కోట్లాది మంది చూసిన సినిమాలో బన్నీ ఎలా చేశాడో చెబితే అపహాస్యంగా ఉంటుంది. మాకు కడుపు నిండిపోయింది. త్రివిక్రమ్ కు మాటల మాంత్రికుడు అనే మాట తక్కువగా అనిపిస్తుంది. అతను మాటల మాంత్రికుడు కాదు, సెల్యులాయిడ్ తాంత్రికుడు. తాంత్రికుడు మనను మాయలో ఉంచేస్తాడు. మూడు గంటల సేపు అలా మనల్ని ఉంచే తాంత్రికుడు త్రివిక్రమ్. నా కొడుకుకి ఇలాంటి సినిమా ఇచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు. ఈ వయసులో నాకు చినబాబు లాంటి మంచి మిత్రుడు దొరకడం నా అదృష్టం. మీరు (ప్రేక్షకులు) లేకపోతే మేము లేము, ఈ సినిమా లేదు, ఈ పండగ లేదు. మీకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను” అని చెప్పారు.
దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ “నేను వైజాగ్ లోనే చదువుకున్నా. వైజాగ్ అంటే నాకు గుర్తొచ్చేవి అందమైన అమ్మాయిలు, ఆంధ్రా యూనివర్సిటీ, ఆహ్లాదకరమైన బీచ్. శ్రీశ్రీ, చలం గారు, రావిశాస్త్రి గారు, సీతారామశాస్త్రి గారు వంటి సాహితీపరుల్ని అందించిన మహానగరం ఇది. ఈ సినిమాని తన భుజం మీద మోసుకుంటూ తీసుకొచ్చిన తమన్ కు థాంక్స్. విలువలతో సినిమా తియ్యండి, మేమెందుకు ఆదరించమో చూపిస్తామని మీరంతా చెప్పారు. అది మాకే కాదు, తెలుగు సినిమాకే నమ్మకాన్నిచ్చింది. పూజా హెగ్డే, టబు గారు, నివేదా పేతురాజ్, రోహిణి గారు పోషించిన గౌరవప్రదమైన స్త్రీ పాత్రల్ని మేం గుండెల్లో పెట్టుకుంటామని వాళ్లను ప్రేమించి ఈ సినిమాని మీరంతా అంత ముందుకు తీసుకువెళ్లారు. మీ సంస్కారానికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. చెన్నైలో పుట్టి పెరిగిన తెలుగువాడు సినిమాటోగ్రాఫర్ వినోద్, వైజాగ్ వాడైన ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ కలిసి ఈ సినిమాని విజువల్ గా వేరే స్థాయికి తీసుకువెళ్లారు. అన్నింటికీ మించి ఈ కథను విన్నప్పటి నుంచీ ఈ రోజు దాకా వదిలేయకుండా ముందుండి నడిపించిన మన బన్నీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఒక ఆఫీస్ బాల్కనీలో మొదలుపెట్టిన ఈ ప్రయాణాన్ని వైజాగ్ ఆర్కే బీచ్ దాకా విజయవంతంగా తీసుకువచ్చి ఈ కథకీ, ఈ సినిమాకీ తనే నాయకుడై నడిపించిన మన కథానాయకుడు బన్నీ. అతనిలో ఎంత పరిణితి కనిపించిందని, మేమేం అనుభూతికి లోనయ్యామో మీరందరూ అదే అనుభూతికి లోనయ్యామని మీరు చెబుతుంటే ఆనందించాం. తను ఇంటర్వెల్లో కనిపించే దృశ్యాల్లో కానీ, క్లైమాక్సులో యాక్ట్ చేసిన దృశ్యాల్లో కానీ, కామెడీ పండించడంలో కానీ, సెంటిమెంటులో కానీ, పాటలు కానీ, ఫైట్లు కానీ.. బంటూని ముందుపెట్టి బన్నీ వెనకాల నిల్చున్నాడు. ఇది చాలా పరిణితితో చెయ్యాల్సిన ఫీట్. కమర్షియల్ హీరోకి రేజర్ ఎడ్జ్ మీదుండే ఫీట్. కొంచెం అటైనా, ఇటైనా అభాసుపాలైపోయే ఫీట్. ఇంత రిస్కుని బలంగా నమ్మి ఈ సినిమాని ఇక్కడి దాకా తీసుకురాగలిగిన బన్నీ.. నాకు తెలిసి తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లగలడు. ఆయన సినిమాని ఎంతగా ప్రేమిస్తాడో నాకు తెలుసు కాబట్టి, మన నేల నుంచి మన కథని గొప్ప సినిమాలుగా ప్రపంచం నలుమూలలకీ చెప్పేంత శక్తిని ఆయనకు మనమందరం ఇవ్వాలని కోరుకుంటున్నా” అని చెప్పారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ “నా ఫస్ట్ సినిమా ఇక్కడ (వైజాగ్) షూట్ చేశాను. ఇప్పటికి ఇరవై సినిమాలు చేశాను. నా విజయం, నా జర్నీ ఎప్పుడూ వైజాగ్ ప్రజలతోనే ఉంది. మళ్లీ వైజాగ్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకరు నాతో ‘ప్రతి ఒక్కరికీ ఒక కంచుకోట ఉంటుంది. మీ కంచుకోట వైజాగ్ అండీ’ అన్నారు. నిజంగా అది కలెక్షన్లు చూస్తే తెలుస్తుంది. థాంక్యూ వెరీ మచ్ వైజాగ్. నా మొట్టమొదటి థాంక్యూ తెలుగు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. ఫోన్లో వొచ్చేస్తున్నాయ్, టీవీలో వచ్చేస్తున్నాయ్, థియేటర్లకు జనం రావట్లేదు అనే టైంలో.. మీరు మంచి సినిమా ఇవ్వండి, మేం తెలుగువాళ్లం అందరం కలిసికట్టుగా థియేటర్లకు వచ్చి చూస్తాం.. అని చెప్పిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎలాంటి ఆల్బం కావాలని తమన్ అడిగాడు. 1 బిలియన్ వ్యూస్ వచ్చే ఆల్బం కావాలన్నాను. నిజంగా తను 1 బిలియన్ వ్యూస్ వచ్చే ఆల్బమే ఇచ్చాడు. మాట నిలబెట్టుకున్నందుకు అతనికి థాంక్స్. ‘సామజవరగమన’ పాటతో ‘సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అనిపించుకున్నాడు. ప్రపంచమంతా ఇది అతనికిచ్చిన బిరుదు. అలాగే ‘రాములో రాములా’తో ‘చార్ట్ బస్టర్ ఆఫ్ ది ఇయర్’ అనిపించుకున్నాడు. అలాగే ఒక దాన్ని మించి ఒకటి అన్నట్లుగా ‘ఓ మైగాడ్ డాడీ’, ‘బుట్టబొమ్మ’, ‘అల వైకుంఠపురములో’, ‘సిత్తరాల సిరపడు’ పాటలు ఇచ్చి, ‘ ఆల్బం ఆఫ్ ద డికేడ్’ అనిపించుకున్నాడు. నిజంగా తమన్ నేను ఇష్టపడే మ్యూజిక్ డైరెక్టర్. ఎంతో కష్టపడుతూ వచ్చి ఈ సినిమాతో టాప్ మ్యూజిక్ డైరెక్టరుగా కిరీటం పెట్టుకున్నాడు. ఆ కిరీటాన్ని ఈ డికేడ్ అంతా దింపకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మిగతా టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఆర్టిస్టులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మేడం సార్ మేడం అంతే అన్నట్లు పూజ తెలుగులో బాగా మాట్లాడింది. టబు గారు, ఈశ్వరీరావు, రోహిణి వంటి చాలామంది ఆడవాళ్లు చేశారు. వాళ్లందరికీ నీరాజనంగా ఈ సినిమాలోని డైలాగ్.. ‘దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది.. ఒకటి నేలకి, రెండు వాళ్లకి. అలాంటివాళ్లతో మనకు గొడవేంటి సార్. సరండరైపోవాలంతే’. ‘జులాయి’తో మేం మొదలుపెట్టిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో ఇప్పుడు మూడో సినిమా చేశాను. తన హీరోని ఒక మెట్టు పైకెక్కించాలనే ప్రేమతో నిర్మాత రాధాకృష్ణ గారు సినిమాలు తీస్తారు. ఆయనకు థాంక్స్. ఇక నన్ను ‘గంగోత్రి’తో హీరోగా పరిచయం చేసిన మా నాన్న, ఆ తర్వాత ‘బన్నీ’, ‘హ్యాపి’, ‘బద్రినాథ్’, ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’, ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ తీశారు. ఆయనకు థాంక్స్. టెక్నీషియన్లు, ఆర్టిస్టులు ఎంత బాగా చేసినా హిట్టు మాత్రం ఒక్క డైరెక్టర్ గారే ఇస్తారు. మా అందరికీ హిట్టిచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. సినిమాని ఒక పెయింటింగ్ అనుకుంటే, దానికి హీరో ఒక కాన్వాస్ కావచ్చు. ఆ కాన్వాస్ నిలిపే ఫ్రేం ఒక ప్రొడ్యూసర్ అవ్వొచ్చు. ఆ పెయింటింగ్ వేసే బ్రష్షులు టెక్నీషియన్స్ అవ్వొచ్చు. ఆ పెయింటింగ్ మీద మేగ్నిఫిసియంట్ కలర్స్ ఆర్టిస్టులు అవ్వొచ్చు. కానీ ఈ మొత్తం పెయింటింగును ఊహించి, తనొక్కడే గీసి,దానికి ఒక రూపం తీసుకొచ్చే ఆర్టిస్టే డైరెక్టర్. అలాంటి త్రివిక్రమ్ గారి గురించి నేనెంత చెప్పినా తక్కువే. నేను చాలా సినిమాలు చేశాను. అందులో నేను అది బాగా చేశాను, ఇది బాగా చేశానని చెప్తారు. కానీ నా లైఫ్ లో ఫస్ట్ టైం ఎవరు ఫోన్ చేసినా నా పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని చెప్పారు. అంతటి గిఫ్ట్ నాకిచ్చారు త్రివిక్రమ్ గారు. మా నాన్నగారు ఎన్నో హిట్లు తీశారు. చిరంజీవి గారితో కొల్లలుగా హిట్లు తీశారు. ఇండస్ట్రీ హిట్లు తీశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టారు. చరణ్ తో ‘మగధీర’ తీసి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టారు. హిందీలో ఆమిర్ ఖాన్ తో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టారు. ఎప్పటికైనా మా నాన్నగారితో ఒక్క ఇండస్ట్రీ రికార్డ్ సినిమా కొట్టాలి అనుకొనేవాడ్ని. నిజంగా ఈ సినిమాతో ఫస్ట్ టైం ఇండస్ట్రీ హిట్ కొడుతున్నా. ఇది నాకు స్వీటెస్ట్ మెమరీ. మా నాన్నతో కలిసి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టడమనే ఆనందం త్రివిక్రమ్ గారిచ్చారు. ఇదొక్కటి చాలు.. థాంక్యూ సో మచ్. ఎవరితో రికార్డ్ కొట్టినా ఇంత ఆనందం సంపూర్ణంగా ఉండేది కాదు. మా మొత్తం ఫ్యామిలీ తరపున థాంక్యూ సర్. చివరగా నా ఫ్యాన్స్ కు థాంక్యూ. ఇవాళ పొద్దున వైజాగ్ కు వస్తుంటే 500 బైకులు ర్యాలీగా వచ్చాయి. వాటిని చూసి పూజ ‘హౌ డు ఫీల్ అర్జున్?’ అనడిగింది. పూజా.. ఒకటిన్నర సంవత్సరం గ్యాప్ తీసుకొని, ఒక రూములో ఒక ఖాళీ గోడమీద ఏమీ లేనిచోట నేనది ఊహించా.. వాళ్లలా వస్తారని. అదివాళ నా కళ్లారా చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది. మొన్న చెప్పిందే మళ్లీ చెప్తున్నా. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. మీరందరూ గర్వించే స్థాయివరకూ నేను వెళ్తాను. ఇది నా మొదటి మెట్టు. ఈ మొత్తం దశాబ్దం ఎలా చేశానని చూసుకుంటే నాకు సంతృప్తి కలగలేదు. ఇలా చేశానేమిటి, ఇంకా గొప్పగా చెయ్యాలి కదా.. అనుకున్నాను. ఏదైనా బలం కావాలనిపించింది. 2020 మొదట్లో ఆ బలం చూపించిన ప్రేక్షకులకు, అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కచ్చితంగా ఇది నా మొదటి అడుగుగా భావించి, మీ దీవెనలు తీసుకొని, మీ అందరికీ దండం పెట్టుకొని ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ఎప్పట్నించో నన్ను సపోర్ట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ అందరికీ థాంక్స్. మెగా అంటే అందరం. ఇవాళ సినిమా ఇండస్ట్రీలోనే ఒక బిగ్గెస్ట్ సినిమాగా నిలవబోతోంది. ఒక గొప్ప సినిమా చూసిన ఫీలింగ్ శాశ్వతం. రికార్డులనేవి వెరీ వెరీ టెంపరరీ. ఇప్పుడు నేను కొడతాను, ఆర్నెల్ల తర్వాత ఇంకొకరు కొడతారు. అలా కొడుతూనే ఉంటారు. మీ మనసుకి ఎంజాయ్మెంట్ ఇచ్చాను కదా, అది అమూల్యమైంది. దానిముందు రికార్డులనేవి నథింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే రికార్డ్స్ ఆర్ టెంపరరీ, ఫీలింగ్స్ ఆర్ ఫరెవర్” అని చెప్పారు.

హైలైట్స్
* శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ విజయోత్సవంలో స్టేజిపై హుషారుగా సింగర్స్ పాడిన అల్లు అర్జున్ సినిమాల్లోని పాటలు, డాన్సర్ల పర్ఫార్మెన్సులు అమితంగా అలరించాయి.
* హీరోయిన్ పూజా హెగ్డే ‘సామజవరగమన’ పాటలోని “నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి నా కళ్లు.. నా చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు” అనే లైన్ పాడి అలరించింది.
* హీరో డైరెక్టర్లు అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఒకేసారి వేదిక వద్దకు రావడంతో ఫ్యాన్స్ ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు.
* ‘సిత్తరాల సిరపడు’ పాటను ఆలపించిన గాయకుడు సూరన్నను స్టేజిపైకి వచ్చి అల్లు అరవింద్ కౌగలించుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
* ‘ఓ మై గాడ్ డాడీ’ పాటకు ప్రఖ్యాత సంగీతకారుడు డ్రమ్స్ శివమణి పర్ఫార్మెన్స్ ఇవ్వగా, రోల్ రైడా బృందం ఆ పాటను ఆలపించింది.
* హీరోయిన్ పూజా హెగ్డే “వైజాగ్ సార్.. వైజాగ్ అంతే” అంటూ తన స్పీచ్ ను మొదలుపెట్టడంతో కింద కుర్చీలో కూర్చున్న బన్నీ ‘వ్వావ్’ అంటూ గట్టిగా నవ్వేశారు.
* సూరన్న కోసం బన్నీ తెచ్చిన కోటును తమన్ స్వయంగా ఆయనకు తొడగగా, తనకు ఈ సినిమాలో పాడే అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్ కు, తమన్ కు థాంక్ చెప్పి మరో గాయకుడు సాకేత్ తో కలిసి ‘సిత్తరాల సిరపడు’ పాటను ఆలపించారు.
* డ్రమ్మర్ శివమణి ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఆహూతులను మెస్మరైజ్ చేసింది. సూట్ కేసు, వాటర్ క్యాన్ వంటి వస్తువులపై కూడా స్వరాలు పలికించడమే కాకుండా అరవింద్, త్రివిక్రమ్, పూజా హెగ్డేల చేత కూడా డ్రమ్స్ పై స్వరాలు పలికింపజేశారు. కిందికి వెళ్లి మరీ బన్నీని స్టేజిపైకి తీసుకు వచ్చారు. అయితే బన్నీ పూజతో కలిసి ‘రాములో రాములా’ సాంగ్ సిగ్నేచర్ స్టెప్ వేసి అలరించారు.


నన్ను సరికొత్తగా చూడాలన్న నాన్నగారి అభిమానుల, నా అభిమానుల కోరికను `స‌రిలేరు నీకెవ్వ‌రు`తో

నన్ను సరికొత్తగా చూడాలన్న నాన్నగారి అభిమానుల, నా అభిమానుల కోరికను `స‌రిలేరు నీకెవ్వ‌రు`తో
నెరవేర్చిన అనిల్ రావిపూడి గారికి థ్యాంక్యూ- సూపర్‌స్టార్‌ మహేశ్.

సూపర్‌స్టార్‌ మహేశ్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌సమర్పణలోజి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన‌ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటించారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తుంది.ఈ సంద‌ర్భంగా `స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ సెల‌బ్రేష‌న్స్‌ను జ‌న‌వ‌రి 17 (శ‌నివారం)న వ‌రంగ‌ల్ హ‌న్మ‌కొండ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రు స్టేడియంలో అశేష అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి వర్యులు ఎర్ర బెల్లి దయాకర్ రావు, ఎంఎల్ఏ వినయ్ భాస్కర్, వరంగల్ సిపి రవిందర్ పాల్గొన్నారు. ‘సరిలేరు నీకెవ్వరు` చిత్రం మొదటి వారంలోనే 100 కోట్ల షేర్ రాబట్టిన సందర్భంగా చిత్ర‌ డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ సంయుక్తంగా
పోస్టర్ ని ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో…

యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ మాట్లాడుతూ – “ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ వరుసగా మూడు సినిమాలలో మాకు అవకాశం ఇచ్చిన మహేష్ బాబు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఫైట్ సీక్వెన్సులకి మంచి రెస్పాన్స్ వస్తోంది. మీరిచ్చే ప్రోత్సాహంతోనే ఇంత దూరం రాగలిగాము. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు” అన్నారు.

నటుడు అజయ్ మాట్లాడుతూ – ” మహేష్ గారితో `ఒక్కడు` సినిమా నుండి అసోసియేట్ అవుతున్నాను. మళ్ళీ ఇన్నేళ్లకి కొండా రెడ్డి బురుజు దగ్గర సెట్ చూడగానే నోస్టాలజి ఫీలింగ్ వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి గారికి, నిర్మాత అనిల్ సుంకర గారికి ధన్యవాదాలు” అన్నారు.

దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ – “చాలా పాజిటివ్ వైబ్స్ మధ్య ఈ సినిమా ప్రారంభం అయింది. అన్ని ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా కలగలిపి అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. హీరోయిజం కామెడీ అన్ని అంశాలు ఉండేలా చాలా శ్రద్ద తీసుకున్నారు. ఈ సినిమా స్టోరీ లైన్ వినగానే గుంటూరు ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని తీసుకొని పద్మాకర్ సినిమాస్ ద్వారా రిలీజ్ చేశాం. అక్కడ మహేష్ బాబు గారి కెరీర్ బిగ్గెస్ట్ కలెక్షన్ ని ఈ సినిమా క్రాస్ చేసింది. సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడే చెప్పలేము. తెలుగు సినీ పరిశ్రమకి ఈ సంక్రాంతికి గొప్ప వరం ‘సరిలేరు నీకెవ్వరు” అన్నారు.

నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ – “పండుగ అంటే అర్ధం ఏంటో నా కళ్లతో చూస్తున్నాను. ఈ పండుగకి పండుగ చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి, అలాగే సినిమా అంతా వారి పక్కనే ఉండి నటించే అవకాశం ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ గారికి మరియు చిత్ర నిర్మాతలకి నా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా సంవత్సరాల తర్వాత విజయశాంతి గారితో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమా ఇంత పెద్ద విజయవంతం కావడానికి కారణమైన ప్రేక్షకులకి ధన్యవాదాలు” అన్నారు.

డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – “ఇంతకు ముందే డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు మొదటి వారంలోనే లాభాలు వస్తున్నాయని..ఈ సినిమా బ్లాక్ బస్టరా అంతకుమించా అనేది ఎంత చెప్పిన సరిపోదు. 13 ఏళ్ల తర్వాత విజయశాంతి గారు మంచి పాత్రలో నటించారు. అనిల్ సుంకర గారికి దిల్ రాజు గారు మంచి సపోర్ట్ ఇచ్చారు . దేవి మహేష్ గారికి వరుసగా మూడు సినిమాలకి బ్లాక్ బస్టర్ ఆల్భ‌మ్స్‌ ఇచ్చారు. మహర్షి సక్సెస్ మీట్ లో అనిల్ చెప్పారు మహేష్ గారిలో ఒక హ్యాపినెస్ చూస్తున్నాను అది కంటిన్యూ చేస్తాను అని. దానికి మించి హ్యాపినెస్ ఇచ్చాడు అనిల్. దీనికి మించిన హ్యాపినెస్ ని కొనసాగించాల్సిన భాద్యత ఇప్పుడు నాది. తప్పకుండా కంటిన్యూ చేస్తాను” అన్నారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ – “ఈరోజు చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నా..ఎందుకంటే వరంగల్ పట్టణంలో దిల్ రాజు గారు రెండవ ఫంక్షన్ ని నా మాట మీద ఏర్పాటు చేశారు. అందుకు ఆయనకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన మాస్ లీడర్, మా మిత్రులు కృష్ణ గారి కొడుకు మహేష్ గారికి స్వాగతం. మహేష్ స్వయంగా ఫోన్ చేసి వరంగల్ వస్తున్నాను. ఈవెంట్ ని సక్సెస్ చేయాలి అని కోరినప్పుడు చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను. అలాగే డైనమిక్ లీడర్ విజయశాంతి గారికి దన్యవాదాలు. దాదాపు గా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మీరందరిని ఒక్కటే కోరుకుంటున్నాను హైదరాబాద్ తర్వాత వరంగల్ ని సినీ పరిశ్రమకు అడ్డాగా మీరు ఎన్నుకోవాలి. దానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినందుకు మహేష్ బాబు గారికి దన్యవాదాలు. మీరు కృష్ణ గారి కొడుకు.. మీరు వస్తానంటే మా వరంగల్ ప్రజలు పండుగ చేసుకుంటారు. మీరింకా సక్సెస్ అవుతారు. నెం1 హీరో అవుతారు” అన్నారు.

మొదటి వారంలోనే 100 కోట్ల షేర్ ని అనౌన్స్ చేయడం సంతోషంగా ఉంది!!
చిత్ర నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ – “అందరూ బాబు ఈ సినిమాలో మాస్ చేశారు బ్లాక్ బస్టర్ కావాలి అన్నారు. కానీ బ్లాక్ బస్టర్ సరిపోలేదు బ్లాక్ బస్టర్ కా బాప్ అయింది. మైండ్ బ్లాక్ ఒక్క సాంగ్ చాలు సినిమా ఏ రేంజ్ కి తీసుకువెళ్తుంది అనేదానికి. ఈరోజు ఏడవ రోజు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ప్రాఫిట్స్ లోకి వచ్చారని వారి మోహంలో చిరునవ్వు కనిపిస్తుంది. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి మొదటి రోజు నుండి మాకున్న నమ్మకాన్ని కలెక్షన్స్ రూపంలో తీసుకువచ్చారు. మహేష్ బాబు అభిమానిగా నాది ఒకటే కోరిక ప్రతి సినిమాలో ఒక మైండ్ బ్లాక్ సాంగ్ కావాలి. ఎందుకంటే థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు సినిమా అంతా ఒక ఎత్తు మైండ్ బ్లాక్ సాంగ్ ఒకెత్తు. అన్ని వయసుల వారు డాన్స్ వేస్తున్నారు. అలాగే 13 ఏళ్ల తర్వాత విజయశాంతి గారు నటించారు. ఆమెకు ఇది పర్ఫెక్ట్ రీ ఎంట్రీ అని మేము భావిస్తున్నాము. దూకుడు సినిమాకి 100కోట్ల గ్రాస్ ని నేనే అనౌన్స్ చేశాను. ఇప్పుడు మొదటి వారంలోనే 100 కోట్ల షేర్ ని అనౌన్స్ చేయడం సంతోషంగా ఉంది. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకి నా నమస్కారాలు” అన్నారు.

ఏడు రోజుల్లోనే ఒక సినిమా ప్రాఫిట్స్ లోకి వెళ్లడం చాలా అరుదు!!
చిత్ర సమర్పకులు దిల్ రాజు మాట్లాడుతూ – “మా సినిమా సక్సెస్ అయితే తిరుపతికి వస్తాము అని మొక్కుకున్నాం. మాములుగా తిరుపతి వెళ్లి ఇంటికి వెళ్తాము.. కానీ ఇదే మా ఇల్లు అనుకొని మా యూనిట్ మొత్తం తిరుపతికి వెళ్లి నేరుగా వ‌రంగ‌ల్‌కే వచ్చాం. రెండు రోజుల్లోనే ఈ ఫంక్షన్ కి అన్ని ఏర్పాట్లు చేసిన ఎర్రబెల్లి దయాకర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ కి మా దన్యవాదాలు. ఆరు ఏడు రోజుల్లోనే ఒక సినిమా ప్రాఫిట్స్ లోకి వెళ్లడం అనేది చాలా అరుదు అది మా సినిమాకి వచ్చినందుకు హ్యాపీ. మా దర్శకుడు అనిల్ రావిపూడి చేసింది అయిదు సినిమాలు. అయిదు సినిమాలతో డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ని హ్యాపీ గా ఉంచడం ఒక్క అనిల్ కే సాధ్యం అయింది. అనిల్ ఇలాగే సక్సెస్ ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. విజయశాంతి గారు 13 ఏళ్ల తరువాత మా సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. మహేష్ గారు ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’తో హ్యాట్రిక్ సాధించారు. ఆయన సక్సెస్ లు ఇలానే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ – “మహేష్ బాబు గారితో ఇలాంటి జోనర్ చేయాలని చాలా రోజుల నుండి కోరిక ఉంది. అది మీ ద్వారా నెరవేరినందుకు అనిల్ రావిపూడి గారికి దన్యవాదాలు. నామీద నమ్మకంతో ప్రతి సినిమా నాకు ఇస్తున్న మహేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో ఎవరు ఊహించని విధంగా పెర్ఫామ్ చేశారు. మైండ్ బ్లాక్ సాంగ్ అదరగొట్టారు. ఈ అవకాశం ఇచ్చిన అనిల్ సుంకర గారికి, దిల్ రాజు గారికి నా కృతజ్ఞతలు” అన్నారు.

హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ – “నాకు ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చిన మహేష్ బాబు గారికి, అనిల్ రావిపూడి గారికి, అలాగే అనిల్ సుంకర, దిల్ రాజు గారికి ధన్యవాదాలు“అన్నారు.

నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ చూస్తున్నాను!!
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ నా పాదాభివందనం. మహర్షి సక్సెస్ మీట్లో అన్నాను.. మ‌హేశ్ సర్ నా సినిమాతో మీ మోహంలో నవ్వు కావాలి, మిమ్మల్ని ఆనందంగా చూడాలి అని. సినిమా విడుదలైనప్పటి నుండి ఆయనతోనే ఉంటున్నాను. ఆయన ఎంతో సంతోషంగా ఉంటున్నారు. ఇంత పెద్ద ఫంక్షన్ ని ఏర్పాటు చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, ఈ సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషన్స్ కి నా హృదయపూర్వక దన్యవాదాలు. విజయశాంతి గారిది వరంగల్. ఆమె మా ఒప్పుకొని నటించినందుకు ధన్యవాదాలు. బాబు బ్యాటింగ్ మొదలయింది. మొదటి వారం రోజుల్లోనే 100 కోట్ల షేర్ తెచ్చారు. ఇంకా ఎంత దూరం తీసుకెళ్తారో తెలీదు. ఇది నాకు ఐదవ సినిమా ప్రతి సినిమా హిట్ చేశారు. మీ వల్ల నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ చూస్తున్నాను. అదేకాదు ఈ కథ విన్నప్పుడు మహేశ్ గారికి ఉన్న నమ్మకం, షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఆయనకున్న కాన్ఫిడెన్స్, డబ్బింగ్ జరిగాక ఆయనకున్న ప్రిడిక్షన్, సినిమా విడుదలైన మొదటి రోజు ఆయనిచ్చిన జడ్జి మెంట్ అన్ని నిజమయ్యాయి. మ‌హేశ్ గారు మీ క్లారిటీకి, మీ విజన్ కి, మీ ఎక్స్పీరియన్స్ కి టేక్ ఏ బౌ..మా నిర్మాతలు దిల్ రాజు గారితో ఐదవ సినిమా. థాంక్స్ మీట్ లో కనివిని ఎరుగని రీతిలో బాక్స్ ఆఫీస్ రెవెన్యూ చూడబోతున్నారు అని చెప్పారు. అలాగే ఇచ్చారు. ఇక అనిల్ సుంకర గారు మొదటి రోజు ఒక మాట అన్నారు మా బాబు కి బ్లాక్ బస్టర్ స‌రిపోదు బ్లాక్ బస్టర్
కా బాప్ కావాలని. అలాగే జరిగింది. నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చిన ప్రతి హీరోకి నా కృతజ్ఞతలు. నాకు తెలిసిన సినిమా ఒకటే నా ప్రొడ్యూసర్ గల్లాలో డబ్బులు, ప్రేక్షకుల ఫేస్ లో నవ్వులు. నాకు తెలిసిన స్టేట్ మెంట్ ఇదే. దాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి దన్యవాదాలు” అన్నారు.

మన ఓరుగల్లు..సరిలేరు సినిమాకి ప్రజలు అందిస్తున్న ఓరుజల్లు!!
లేడీ అమితాబ్ విజయశాంతి మాట్లాడుతూ – “మన ఓరుగల్లు..సరిలేరు సినిమాకి ప్రజలు నీరాజనం అందిస్తున్న ఓరుజల్లు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’సినిమాని బ్లాక్ బస్టర్ కా బాప్ గా నిలిపిన మీఅందరికి నా శిరసువంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 13 ఏళ్లకు ముందు మీ రాములమ్మ, మీ బిడ్డని ఏ రకంగా ఆదరించారో.. ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్లారో..నేను ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోవాలో తెలీట్లేదు. 13 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు అనే మంచి సినిమా నాదగ్గరికి రావడానికి ముఖ్య కారణం అనిల్ రావిపూడి. కథ విన్నాను నచ్చింది.. చేశా.. హిట్ కొట్టాం అని తెలియజేసుకుంటున్నాను. భారతి ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచి పోయింది. సైనికుల తల్లి తండ్రుల భాద ఏంటి అనేది అనిల్ చక్కగా, సందేశాత్మకంగా చూపించారు.సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో ‘కొడుకు దిద్దన కాపురం’ సినిమాలో కలిసి నటించాను అది సూపర్ హిట్. ఇప్పడు `సరిలేరు నీకెవ్వరు` లో కలిసి నటించాను ఇది సూపర్ డూపర్ హిట్. బాబు తో పని చేయడం చాలా కంఫర్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారు. ఇంకా సినిమాలు చేయి రాములక్క అని అందరూ అడుగుతున్నారు. మీ అందరికి తెలుసు సబ్జెక్ట్ బాగుండాలి..పాత్ర దద్దరిల్లాలి అలాగైతేనే ఈ రాములక్క చేస్తుంది. ఎందుకంటే సినిమా ఒకటే కాదు రాజకీయం కూడా ఉంది. నేను ప్రజల మనిషిని ప్రజలకోసమే పనిచేస్తాను. మీరెప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను“ అన్నారు.

మీ ప్రేమ‌కు, అప్యాయ‌త‌కు, మీ అభిమానానికి టేక్ ఎ బౌ!!
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ మాట్లాడుతూ – “అనిల్ రావిపూడి ఈ సినిమాలో ఎన్నో గొప్ప డైలాగ్స్ రాశాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ ర‌మ‌ణ లోడ్ ఎత్తాలిరా.. అనే డైలాగ్ మాత్రం బీభ‌త్సంగా పేలింది. ఈరోజు స్వామి వారి ద‌ర్శ‌నం త‌ర్వాత వరంగ‌ల్‌కి వ‌చ్చి ప్రేక్ష‌కుల‌కు క‌లుసుకోవ‌డం ఆనందంగా ఉంది. మా డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ 7 రోజుల్లో రూ.100 కోట్లు సాధించింద‌నే విష‌యాన్ని చెబుతూ ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. వారికి ఈ వేదిక‌పై థ్యాంక్స్ చెబుతున్నాను. యాక్ష‌న్ కంపోజ్ చేసిన రామ్ ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్‌కి, సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలుగారికి, ఈ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్ర‌సాద్‌కి థ్యాంక్స్‌. క‌థ విన‌గానే, మాస్ సాంగ్ చేయ‌డానికి ఛాన్స్ ఉంద‌ని అప్పుడే దేవిశ్రీ చెప్పాడు. అలా వ‌చ్చిందే మైండ్ బ్లాక్ సాంగ్‌. అలాగే శేఖ‌ర్ మాస్ట‌ర్ అద్భుతంగా ఈ సాంగ్‌ను కంపోజ్ చేశారు. నా 20 ఏళ్ళ‌ కెరీర్‌లో ఇంత రెస్పాన్స్‌ను ఎప్పుడు ఎక్స్‌పీరియ‌న్స్ చేయ‌లేదు. శేఖ‌ర్ మాస్ట‌ర్‌, దేవిశ్రీ , అనిల్ రావిపూడికి థ్యాంక్స్‌. విజ‌య‌శాంతిగారితో `కొడుకు దిద్దిన కాపురం` చిత్రానికి ప‌నిచేశాను. త‌ర్వాత ఆవిడ‌తో థ‌ర్టీ ఇయ‌ర్స్ త‌ర్వాత ప‌నిచేసే అవ‌కాశం ఈ సినిమాకే క‌లిగింది. ఆవిడను క‌లిసిన‌ప్పుడు `కొడుకు దిద్దిన కాపురం` నిన్నే చేసిన‌ట్లు అనిపించింది. `కొడుకు దిద్దిన కాపురం` పెద్ద హిట్టు.. `స‌రిలేరు నీకెవ్వ‌రు` ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమెతో ప‌నిచేయ‌డం మెమొర‌బుల్ ఎక్స్‌పీరియెన్స్‌. మ‌ళ్లీ ఆవిడతో క‌లిసి ప‌నిచేయాల‌నుకుంటున్నాను. ర‌ష్మిక స్వీటెస్ట్ కోస్టార్‌. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారితో ప‌నిచేయడం అమేజింగ్‌గా అనిపించింది. `సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు`, `మ‌హ‌ర్షి` చిత్రాల త‌ర్వాత దిల్‌రాజుగారితో ఈ సినిమాకు ప‌నిచేయడం చాలా గొప్ప‌గా ఉంది. హ్యాట్రిక్ హిట్ సాధించాం. దిల్‌రాజుగారు కేవలం నిర్మాత మాత్ర‌మే కాదు.. మంచి డిస్ట్రిబ్యూట‌ర్ కూడా. సినిమాను ప్రేక్ష‌కుల‌కు ఎలా రీచ్ చేయించాలో బాగా తెలిసిన నిర్మాత‌. ఆయ‌న‌తో క‌లిసి మ‌రో హ్యాట్రిక్ ఇవ్వ‌బోతున్నాం. ఇక నిర్మాత అనిల్ సుంక‌ర విష‌యానికి వ‌స్తే .. అంద‌రి కంటే ఆయ‌న పెద్ద అభిమాని. ఈరోజు ఆయ‌న కోరిక తీరినందుకు ఆనందంగా ఉంది. ఆయ‌న‌తో జ‌ర్నీ ఇలాగే కొన‌సాగాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా డైరెక్ట‌ర్ అనిల్ .. త‌ను ముందు 40 నిమిషాల నేరేష‌న్ మాత్ర‌మే ఇచ్చాడు. త‌న‌లో ఎన‌ర్జీ చూసి ఇది ముందు చేయ‌డానికి కుదురుతుందా? అన‌గానే మొత్తం స్క్రిప్ట్‌ను రెండు నెల‌ల్లోనే సిద్ధం చేసి ఇచ్చాడు. దానికి కారణం నాన్న‌గారి,నా అభిమానులే. నాలుగైదేళ్లుగా అంద‌రూ కొత్త మ‌హేష్ కోరుకుంటున్నార‌ని తెలుసు. కంటెంట్ బేస్డ్‌ సినిమాలు, వేరే జోన‌ర్ సినిమాలు చేశాను. సినిమా చేసేట‌ప్పుడు అభిమానులు ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటారు. ప్రేక్ష‌కులు, అభిమానుల‌ను దృష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్‌ను ఎంచుకున్నాను. నా కెరీర్‌లో నేను తీసుకున్న బెస్ట్ డిసిష‌న్ ఇదేన‌ని ఫీల్ అవుతున్నాను. నాన్న‌గారి అభిమానులు, నా అభిమానుల త‌రపున అనిల్‌కి థ్యాంక్స్‌. వారి కోరిక‌ను తీర్చాను. ఈ సంక్రాంతిని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోను. ప్రేక్ష‌కుల అభిమానుల అభిమానం వ‌ల్లే ఇలా దొరికింది. మీ ప్రేమ‌కు, అప్యాయ‌త‌కు, మీ అభిమానానికి టేక్ ఎ బౌ.. థ్యాంక్యూ“ అన్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు బాబు,కౌముది, రచ్చ రవి, అజయ్, చిట్టి, చిత్ర‌ డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ తదితరులు పాల్గొన్నారు.


విష్ణు మంచు , సునీల్ శెట్టి మ‌ధ్య హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ ఆధ్వ‌ర్యంలో `మోస‌గాళ్ళు` భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌

విష్ణు మంచు క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ నిర్మిస్తోన్న చిత్రం `మోస‌గాళ్ళు`. జెఫ్రీ గీ చిన్ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. విష్ణు మంచు, సునీల్ శెట్టి మ‌ధ్య భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ను ఇప్పుడు చిత్రీక‌రిస్తున్నారు. హాలీవుడ్ యాక్ష‌న్ నిపుణుల ఆధ్వ‌ర్యంలో.. హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్‌లో ఈ యాక్ష‌న్ సీన్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా నిపుణుల‌ పర్యవేక్ష‌ణ‌లో ఈ యాక్ష‌న్ పార్ట్‌ను మాస్ట‌ర్ పీస్‌లా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.
ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు తెర‌పై రాన‌టువంటి విధంగా ఈ యాక్ష‌న్ సీన్ ఉండ‌బోతుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు. ఈ స‌న్నివేశం కోసం ఇద్ద‌రు స్టార్స్ ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను కూడా తీసుకుంటున్నారు.

అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

న‌టీన‌టులు:
విష్ణు మంచు , సునీల్ శెట్టి, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర‌, రూహి సింగ్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
నిర్మాత‌: విష్ణు మంచు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్ కుమార్‌.ఆర్‌
ద‌ర్శ‌క‌త్వం: జెఫ్రీ గీ చిన్‌
సినిమాటోగ్ర‌ఫీ: షెల్డ‌న్ చౌ
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: కిర‌ణ్ కుమార్‌.ఎం


యంగ్ టీమ్ అందరూ కలిసి చేసిన సినిమా చూసి చూడంగానే అందరికి నచ్చుతుంది – రాజ్ కందుకూరి. జనవరి 31న గ్రాండ్ రిలీజ్

‘పెళ్ళిచూపులు’, ‘మెంట‌ల్ మ‌దిలో’ వంటి చిత్రాల‌ను నిర్మించి స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌గా జాతీయ అవార్డ్‌, ఫిలింఫేర్ అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు నిర్మాత రాజ్ కందుకూరి నిర్మాత‌గా, ఆయ‌న త‌న‌యుడు శివ కందుకూరి హీరోగా న‌టిస్తోన్న తొలి చిత్రానికి ‘చూసీ చూడంగానే`. ఈ చిత్రం ద్వారా శేష సింధు రావు ద‌ర్శకురాలిగా ప‌రిచ‌యం కానుంది. జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ….

మీడియా మిత్రలకు నమస్కారం. జనవరి 31న సురేష్ ప్రొడక్షన్ ద్వారా చూసి చూడంగానే విడుదల కానుంది. నేను యంగ్ ట్యాలెంట్ తో సినిమాలు చెయ్యడానికి ఇష్టపడతాను. అలా ఒక యంగ్ టీమ్ అందరూ కలిసి చేసిన సినిమా చూసి చూడంగానే. ఈ చిత్రానికి మా అబ్బాయి శివ కందుకూరి అయితే బాగుంటుందని డైరెక్టర్ శేష నాకు చెప్పడంతో శివను ఈ సినిమాతో పరిచయం చేశాను. ఈ మూవీ చాలా సహజంగా ఉంటుంది, మధురా ఆడియో ద్వారా ఈ చిత్ర పాటలను విడుదల చేస్తున్నాము. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లాభిస్తోంది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం మరింత హైలెట్ కానుంది. నన్ను ఎప్పుడూ సుపోర్టు చేసే మీడియా ఈ మూవీకి మరింత సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

శివ కందుకూరి మాట్లాడుతూ….
సినిమా చెయ్యలను డిసైడ్ అయినప్పటినుండి అందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు. శేష సింధు రావు ఈ సినిమా స్క్రిప్ట్ నాకు చెప్పినప్పుడే బాగా నచ్చింది. నాకోసం ఒక మంచి స్క్రిప్ట్ రాసినందుకు థాంక్స్. యంగ్ టీమ్ అందరూ కలిసి చేసిన సినిమా ఇది. మా సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ మూవీకి పనిచేసిన అందరూ టెక్నీషియన్స్ కు స్పెషల్ థాంక్స్. నాన్న రాజ్ కందుకూరి గారు నన్ను నమ్మి నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, థాంక్స్ టు హిమ్. మా సినిమాను విడుదల చేస్తున్న నిర్మాత సురేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

మధుర శ్రీధర్ మాట్లాడుతూ….
రాజ్ కందుకూరి గారు చిన్న సినిమాలకు ఎక్కువ ప్రోత్సహం ఇస్తున్నారు. ఆయన నిర్మించిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. హీరోగా పరిచయం అవుతున్న శివ కందుకూరికి ఇది బెస్ట్ సబ్జెక్ట్. గోపిసుందర్ ఈ మూవీకి అందించిన పాటలు పాపులర్ అయ్యాయి. జనవరి 31న విడుదల కాబోతున్న ఈ చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

డైరెక్టర్ శేష సింధు మాట్లాడుతూ…
నేను ఈ సినిమా కోసం ఈగల్ గా ఎదురు చూస్తున్నాను. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ చేసిన శివ కందుకూరి గారికి థాంక్స్. శివ కందుకూరికి యాక్టింగ్ కి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. హీరోయిన్ వర్ష ఈ సినిమాలో బాగా యాక్ట్ చేసింది, షూటింగ్ పూర్తి అయ్యేలోపు తను తెలుగు నేర్చుకుంది. డైలాగ్స్ రాసిన పద్మకు స్పెషల్ థాంక్స్, ఇతర టెక్నిషియన్స్, ఆర్టిస్ట్స్ అందరికి ప్రేత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.

హీరోయిన్ వర్ష మాట్లాడుతూ…
నేను తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ ఇది. నాకు షూటింగ్ సమయంలో సపోర్ట్ చేసిన అందరికి ధన్యవాదాలు. శివ కందుకూరి గారు నన్ను నమ్మి ఈ రోల్ ఇచ్చారు. శివ కందుకూరి అనుభవం కలిగిన హీరోల నటించాడు. డైరెక్టర్ శేష సింధు మంచి స్క్రిప్ట్ తో మన ముందుకు వస్తున్నారు. జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమాను బ్లస్ చెయ్యండని తెలిపారు.

హీరోయిన్ మాళవిక మాట్లాడుతూ…
చూసి చూడంగానే మీ అందరికి నచ్చే సినిమా అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్, డైరెక్టర్ శేష సింధు గారు రాసుకున్న పాయింట్ ను అందంగా స్క్రీన్ పై చూపించారు. తెలుగులో నాకు ఈ మూవీ మంచి బ్రేక్ ఇస్తుందని నముతున్నాను, మా సినిమాను మీ అందరూ చూసి సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.


మాస్ మహారాజ రవితేజ డిస్కోరాజ నుండి మూడో పాట రమ్ పమ్ బమ్ విడుదల !!!

మాస్ మహా రాజ ర‌వితేజ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల ఫేం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న డిస్కో రాజా సినిమాని రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఫేమ్‌ నభా నటేశ్, పాయల్‌ రాజ్‌పుత్‌ లు తాన్యా హోప్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలలో నటింస్తున్న ఈ సినిమాకి స్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నా ఈ సినిమాలోని మూడో పాట హైదరాబాద్ లో పాత్రికేయుల సమావేశంలో విడుదల అయ్యింది. ఈ కార్యక్రమంలో వి.ఐ. ఆనంద్, సునీల్, నభ నటేష్, తమన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు విఐ. ఆనంద్ మాట్లాడుతూ….
డిస్కో రాజా అనే సినిమా ఆడియన్స్ కొత్త అనుభూతిని ఇస్తుంది. రవితేజ గారి క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. తమన్ అందించిన సాంగ్స్ ఈ మధ్య పాపులర్ అయ్యాయి, అలాగే మా సినిమా కోసం తమన్ మరో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చాడు. రమ్ పమ్ బమ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది అన్నారు.

తమన్ మాట్లాడుతూ….
రమ్ పమ్ బమ్ సాంగ్ చేస్తున్నప్పుడు ఛాలెంజింగ్ గా తీసుకున్నాను, ఇప్పుడు సాంగ్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, గుడ్ రెస్పాన్స్ లభిస్తోంది, ఇదంతా చూస్తుంటే కష్టం మర్చిపోయాను. డిస్కో రాజా సినిమాకు మంచి పాటలు చేసే అవకాశం లభించింది. ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన ఢిల్లీవాలా, నువ్వు నాతో సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించిందన్నారు.

సునీల్ మాట్లాడుతూ…
రవితేజ గారితో నేను కొంత గ్యాప్ తరువాత చేసిన సినిమా ఇది. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఆనంద్ గారు డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తీశాడు, ఆడియన్స్ కు ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ మూవీలా ఉంటుంది అన్నారు.

నభ నటేష్ మాట్లాడుతూ…
రవితేజ గారితో వర్క్ చెయ్యడం మర్చిపోలేని అనుభూతి, ఈ సినిమాలో నా పాత్ర పేరు నభ, మీ అందరికి నచ్చుతుంది. ఢిల్లీ వాలా సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సాంగ్ లో నా డ్యాన్స్ మూమెంట్స్ బాగుంటాయి. జనవరి 24న విడుదల కానున్న డిస్కో రాజా సినిమాను అందరూ చూసి సపోర్ట్ చెయ్యాలని కోరారు.


వ‌రంగ‌ల్‌లో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్

వ‌రంగ‌ల్‌లో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్

సూపర్‌స్టార్‌ మహేశ్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన‌ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటించారు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న సినిమా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తున్న ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ సెల‌బ్రేష‌న్స్‌ను శ‌నివారం సాయంత్ర 5 గంట‌ల‌కు వ‌రంగ‌ల్ హ‌న్మ‌కొండ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రు స్టేడియంలో నిర్వ‌హిస్తున్నారు. ఈ వేడుక‌ల్లో ఎంటైర్ యూనిట్ పాల్గొంటున్నారు.


బొంబాట్‌లో `ఇష్క్ కియా…` సాంగ్‌ను విడుద‌ల చేసిన మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

క‌ళ్ల‌లోన దాచినానులే.. రెప్ప‌దాటి పోలేవులే
కాటుకైన పెట్ట‌నులే.. నీకు అంటుకుంటుంద‌ని
పెద‌వికే తెల‌ప‌ని ప‌లికె నీ పేరునే ప్రియ‌త‌మా.. ఓ ప్రియ‌త‌మా
లోక‌మే ఆన‌దు మైక‌మే వీడ‌దు.. తెలుసునా ఇది ప్రేమేన‌ని
ఎందుకిలా ఓ ఎందుకిలా….. ఇష్క్ కియా అంటూ త‌న ప్రేమ‌ను హీరోయిన్ హీరోకు వ్య‌క్తం చేస్తే ఎలా ఉంటుంది? ఎంతో అందంగా ఉంటుంది. ఆ అందం చూసేయాలంటే `బొంబాట్‌` సినిమా చూసేయాల్సిందే.

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై `ఈన‌గ‌రానికి ఏమైంది` ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్స్‌గా రాఘ‌వేంద్ర వర్మ(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో విశ్వాస్ హ‌నూర్‌క‌ర్ నిర్మిస్తోన్న‌ చిత్రం `బొంబాట్`. జోష్ బి సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెండో లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ విడుద‌ల చేశారు. పాట విన‌డానికి అహ్లాదంగా ఉంద‌ని చిత్ర యూనిట్‌ను త‌మ‌న్ అభినందించారు.

రామాంజ‌నేయులు రాసిన ఈ పాట‌ను సునీతా సార‌థి శ్రావ్యంగా ఆల‌పించారు. హీరో సుశాంత్‌, సిమ్రాన్ మ‌ధ్య సాగే ల‌వ్ మెలోడీ ఇది. లిరిక‌ల్ వీడియోలో చూపించిన కొన్ని విజువ‌ల్స్ క్యూట్‌గా అనిపిస్తున్నాయి. ప్రేయ‌సి త‌న మ‌న‌సులోని ప్రేమ‌ను ప్రేమికుడికి ఎంత అందంగా చెప్పింద‌నే స‌న్నివేశంలో వ‌చ్చే పాట ప్రేక్ష‌కుల‌ను త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు అంటున్నారు.
రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు సినిమాను తీసుకురావ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.


ఎంత మంచివాడ‌వురా త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే కుటుంబ క‌థా చిత్రం – ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్

ఎంత మంచివాడ‌వురా త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే కుటుంబ క‌థా చిత్రం – ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న‌

జాతీయ అవార్డ్ ద‌క్కించుకున్న శ‌త‌మానం భ‌వ‌తి వంటి చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న‌. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `ఎంత మంచివాడ‌వురా`. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణప్రసాద్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సంక్రాంతి సంద‌ర్భంగా ఈ చిత్రం జ‌న‌వ‌రి 15న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న‌తో ఇంట‌ర్వ్యూ…


సంక్రాంతి స‌తీశ్ అయ్యారని అన‌నుకుంటున్నారా?
– అయ్యో లేదండీ!.. సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న నా రెండో చిత్ర‌మిది. మంచి స‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను.
`ఎంత మంచివాడ‌వురా`లో ఏం చెప్పాల‌నుకుంటున్నారు?
– మంచి అనే విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకున‌దే. ప్ర‌పంచంలో ఉండేదే. ఇందులో హీరో క్యారెక్ట‌ర్ ఎదుటివారికి ఏదైనా స‌మ‌స్య‌, బాధ ఉంటే దాన్ని త‌గ్గించే క్యారెక్ట‌ర్‌. త‌న క్యారెక్ట‌ర్‌ను బేస్ చేసుకునే ఈ టైటిల్‌ను పెట్టాం. ఒక మ‌నిషికి ప్రేమ‌, ఆప్యాయ‌త‌ను పంచాలంటే వారు మ‌న బంధువులు, స్నేహితులే కాన‌వ‌స‌రం లేదు. స‌మ‌స్య‌ల్లో ఉండేవారికి మ‌నం ప్రేమ‌, ఆప్యాయ‌త‌లు ఇచ్చి సంతోష‌ప‌డిన‌ప్పుడు వారూ మ‌న మ‌న‌సుకు చుట్టాలే.
క‌థ రాసుకున్న త‌ర్వాత హీరోగారిని క‌లిశారా? లేక హీరోను క‌లిసిన త‌ర్వాత ఈ క‌థ‌ను రాసుకున్నారా?
– క‌థ కోస‌మే క‌ల్యాణ్‌రామ్‌గారండి. హీరోల‌ను దృష్టిలో పెట్టుకుని క‌థ‌లు రాసుకుంటే ఎక్క‌డో ఒక‌చోట వారి ఇమేజ్ కోసం మ‌నం కాంప్ర‌మైజ్ కావాల్సి ఉంటుంది. అదే క‌థ రాసుకున్న త‌ర్వాత ఏ హీరో అయితే బావుంటాడ‌ని అనుకుని వారిని సంప్ర‌దించి ఒప్పిస్తే.. త‌ర్వాత చిన్న చిన్న మార్పులేమైనా ఉంటే చేసుకోవ‌చ్చు.
ఈ క‌థ‌కు క‌ల్యాణ్‌రామ్ ఎలా యాప్ట్ అవుతాడ‌నిపించింది?
– ఎప్పుడూ ఓ జోన‌ర్‌లో సినిమాలు చేసేవారు డిఫ‌రెంట్‌గా చేస్తే ప్రేక్ష‌కుల్లో ఓ ఆస‌క్తి ఏర్ప‌డుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు క‌ల్యాణ్‌రామ్‌గారు చాలా యాక్ష‌న్ సినిమాలు చేశారు. ఆయ‌న‌తో నేను మ‌ళ్లీ అలాంటి సినిమానే చేస్తే ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ఆస‌క్తిగా అనిపించ‌దు. అదే నేను ఓ కూల్ సినిమా చేస్తే ప్రేక్ష‌కుల‌కు కొత్త‌గా అనిపిస్తుంది. అలాగే నా క‌థ‌కు ఓ మెచ్యూర్డ్ వ్య‌క్తి అవ‌స‌రం. అప్పుడు నాకు క‌ల్యాణ్‌రామ్‌గారే ఐడియాకు వ‌చ్చారు. క‌ల్యాణ్‌రామ్‌గారు అన్‌స్క్రీన్ కోపంగా క‌న‌ప‌డతారు. కానీ.. ఆఫ్ స్క్రీన్ చాలా కూల్‌గా, న‌వ్వుతూ ఉంటారు. కాబ‌ట్టి ఆయ‌న్ని క‌లిశాను. ఆయ‌న్ని క‌లిసి క‌థ చెప్ప‌గానే ఆయ‌న‌కు న‌చ్చింది.
మంచి గురించి చెప్పేట‌ప్పుడు యాక్ష‌న్ ఎలిమెంట్స్ ఎందుకు?
– నా గ‌త రెండు చిత్రాల్లో యాక్ష‌న్ చేయ‌డానికి స్కోప్ లేదు. అవ‌కాశం కూడా లేదు. కానీ ఈ సినిమాలో క‌థానుగుణంగా యాక్ష‌న్ అస‌వ‌ర‌మైంది. కల్యాణ్‌రామ్‌గారి కోసం నా పంథాను మార్చుకోలేదు. కథలో అవసరం మేరకు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాను. అంతే తప్ప నేను యాక్షన్ సినిమాలు చేయగలనని నిరూపించుకోవడానికి ఈ సినిమా చేయలేదు.
మీ గత చిత్రానికి, దీనికి డిఫరెన్స్ ఏంటి?

– సంప్రదాయాలను ఎక్కడో వదిలేస్తున్నాం.. పెళ్లి గురించి చెప్పాలని చేశాను. శ్రీనివాస కల్యాణంతో మనకు తెలసిన దాన్ని నలుగురు చెప్పాలి అనడం కోసం సినిమా చేయకూడదనే విషయం తెలిసింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా చేయాలని చేసిన సినిమా.
రీమేక్ చేయడం వెనుక కారణమేంటి?
– నిజానికి నా దగ్గర చాలా కథలున్నాయి. రీమేక్ చేూయాలనే ఆలోచన లేదు. ఆ సమయంలో నిర్మాత ఉమేష్ గుప్తగారికి ఆయన స్నేహితుడు గుజరాతీ సినిమా ‘ఆక్సిజన్’ గురించి చెప్పాడట. ఆయన కృష్ణ ప్రసాద్‌గారికి చెప్పాడట. ఆయన బేసిక్‌గానే రైటర్ ఆయనకు నచ్చుతుందో లేదో అని అన్నారట. సరే..ఓసారి ఆ సినిమాను చూడమనండి అని ఉమేష్‌గారు అన్నారట. కృష్ణప్రసాద్‌గారు నాకు విషయం చెప్పగానే నేను మంచి సినిమా అయితే చేద్దాం సార్… ముందుగానే ఆ సినిమా కోర్ పాయింట్ బాగా నచ్చింది. చాలా చేంజస్ చేయాలని చెప్పాను. తెలుగు నెటివిటీ ప్రకారం కథను వీలైనంత మార్చేస్తా అని అన్నాను. నిర్మాతలు ఒప్పుకోవడంతో సినిమా స్టార్ట్ అయ్యింది.
ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
– మన చుట్టూ పిల్లలకు దూరంగా ఉండేవాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటి వారిని మనం పలకరిస్తే వాళ్లు హ్యాపీగా ఫీలవుతారు అనే అంశాన్ని ఈ సినిమా ద్వారా చెప్పాం. ఈ సినిమాను చేసేటప్పుడు నేను పెద్దగా ఏం ఆలోచించలేదు. ఏ సినిమాకైనా ఓ భయముంటుంది. కానీ సినిమా రన్నింగ్‌లో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇచ్చే ఫీడ్ బ్యాక్ మనకు కాన్ఫిడెంట్‌నిస్తుంది. ఈ సినిమాలో అలాంటి ఫీడ్ బ్యాక్ చాలానే వచ్చింది.
మెహరీన్‌ని హీరోయిన్‌గా తీసుకోవడానికి రీజనేంటి?
– మెహరీన్ ఎఫ్ 2లో చక్కగా నటించింది. కామెడీ బాగా చేసింది. ఎవరైతే కామెడీ బాగా చేస్తారో వారు ఎమోషన్స్ కూడా బాగా పండిస్తారు. అందుకనే మెహరీన్‌ని హీరోయిన్‌గా తీసుకున్నాం.
ఫ్యామిలీ చిత్రాల దర్శకుడనే ఇమేజ్ మీకు ప్లస్సా, మైనస్సా?
– ప్లస్ అవుతుందండీ..
నెక్ట్స్ మూవీ?
– ‘ఎంత మంచివాడవురా’ రిలీజ్ తర్వాత తర్వాత చిత్రం గురించి ఆలోచిస్తాను