Category Archives: Latest Events


జనవరి 24న ‘చీమ – ప్రేమ మధ్యలో భామ’ విడుదలకు రెడీ

జనవరి 24న ‘చీమ – ప్రేమ మధ్యలో భామ’ విడుదలకు రెడీ
* సంక్రాంతి తరువాత ‘చీమ – ప్రేమ మధ్యలో భామ’ సందడి షురూ
* నందమూరి బాలకృష్ణగారి అభిమానులకు ఓ నజరానా
మాగ్నమ్ ఓపస్ (Magnum Opus ) ఫిలిమ్స్ పతాకంపై శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు దర్శకత్వంలో ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘చీమ – ప్రేమ మధ్యలో భామ!’. అమిత్, ఇందు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరి 24న విడుదలయ్యేందుకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు మాట్లాడుతూ.. ‘‘చెప్పకూడని రహస్యం – హీరో నందమూరి బాలకృష్ణగారి అభిమానులు మా సినిమా చూస్తే, థియేటర్లో చప్పట్లు, ఈలలు గ్యారంటీ! ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం ఈ జనవరి 24న తెలుస్తుంది. సినిమా అంతా చాలా బాగా వచ్చింది.. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు.
నిర్మాత ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ‘‘ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా సినిమా ‘చీమ – ప్రేమ మధ్యలో భామ!’ను దర్శకుడు విలక్షణమైన శైలిలో తెరకెక్కించారు. పసందైన పాటలతో, అద్భుతమైన కథనంతో సాగుతూ పెద్ద సినిమాలకు ధీటుగా అందరినీ అలరిస్తుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్‌తో పాటు మంచి ప్రశంసలు అందాయి. జనవరి 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను..’’ అన్నారు.
హీరోయిన్ ఇందు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్ – ఎందుకంటే ఇది నా తొలి సినిమా! యువ ప్రేమికుల భావావేశాలతో సాగే సృజనాత్మకమైన కథ అందంగా ఉండి అందరికీ కనెక్ట్ అవుతుంది. చీమ హీరో కావడం ఇంకా స్పెషల్! తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
అమిత్, ఇందు, సుమన్, హరిత, పురంధర్, వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్, కిషోర్ రెడ్డి, వెంకటేశ్, సురేష్ పెరుగు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రవి వర్మ, సింగర్స్: ఎస్.పి. బాలసుబ్రమణ్యం, గీతా మాధురి; సినిమాటోగ్రఫీ: ఆరిఫ్ లలాని, ఎడిటర్: హరి శంకర్, నిర్మాత : ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ; కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు.


‘భీష్మ’ టీజర్ విడుదల

‘భీష్మ’ టీజర్ విడుదల

‘భీష్మ’
నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రం టీజర్ ఈరోజు ఉదయం విడుదల అయింది
చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ …ఈ చిత్రం టీజర్ ను ఈరోజు విడుదల చేయటం జరిగింది. పూర్తి స్థాయి వినోద ప్రధానంగా ఈ చిత్రం ‘భీష్మ’ఉంటుంది అనటానికి ఈ టీజర్ ఒక శాంపిల్ మాత్రమే. దానికి తగినట్లుగానే చిత్రం కధ,కధనాలు,సన్నివేశాలు,సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల. ఈ ఏడాది ఫిబ్రవరి లో చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

నటీ,నటులు :
నితిన్,రష్మిక మండన,నరేష్,సంపత్,రఘుబాబు,బ్రహ్మాజీ,నర్రా శ్రీనివాస్,వెన్నెల కిషోర్,అనంత నాగ్,శుభలేఖ సుధాకర్,జస్సెన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్,రాజశ్రీ నాయర్,ప్రవీణ తదితరులు నటిస్తున్నారు.
మ్యూజిక్ : మహతి స్వర సాగర్ ,డి .ఓ .పి : సాయి శ్రీరామ్ , ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్, ఎడిటర్ : నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం(వెంకట్ ),
సమర్పణ : పి.డి .వి. ప్రసాద్ ,
ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగ వంశి ,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : వెంకీ కుడుముల.


ఆల్ టైమ్ టాప్ టెన్ యుఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ లో అల వైకుంఠపురంలో !!!

ఆల్ టైమ్ టాప్ టెన్ యుఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ లో అల వైకుంఠపురంలో !!!

సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ప్రీమియర్ కలెక్షన్లను అల వైకుంఠపురంలో క్రాస్ చేసింది. ఫుల్ పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది.

అమెరికాలో ‘అల వైకుంఠపురంలో’ ఓ రేంజ్‌లో దూసుకుపోతోందనే చెప్పాలి. అమెరికాలోనే కాదు న్యూజిల్యాండ్‌లో ‘అల వైకుంఠపురంలో’ రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ 176 ప్రదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఐదు షోలకే 793k డాలర్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదు. సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ఇది ఆల్ టైమ్ రికార్డ్ గా చెప్పుకోవచ్చు.


‘పంగా’లో తల్లి పాత్ర చెయ్యడం గొప్పగా అనిపించింది – కంగనా రనౌత్

సూపర్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా అశ్వినీ అయ్యర్ తివారీ డైరెక్ట్ చేసిన సినిమా ‘పంగా’. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జస్సీ గిల్, రిచా చద్దా కీలక పాత్రలు పోషించారు. జనవరి 24న విడుదలవుతున్న సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో కంగన, అశ్విని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వాళ్లు జవాబిచ్చారు.
కంగనా రనౌత్

‘పంగా’లో మీ పాతేమిటి?
ఒక మిడిల్ క్లాస్ విమన్గా, అందులోనూ బిడ్డల తల్లిగా నటించా. తల్లి పాత్ర పోషించడం చాలా గొప్పగా అనిపించింది. మహిళ సాధికారత కోసం చాలా సినిమాల్లో నటించాను.. కానీ ‘మణికర్ణిక’ తరువాత ఈ సినిమాలో నేను ఓ తల్లిగా జీవించాను.
డైరెక్టర్ అశ్వినితో పనిచెయ్యడం ఎలా అనిపించింది?
అశ్విని మంచి డైరెక్టర్. నా గురించి తనకు చాలా మంది అనేక విషయాలు చెప్పినా వాటిని అశ్విని ఎప్పుడు పట్టించుకోలేదు. వర్క్పై మంచి ఫోకస్, క్లారిటీ ఉన్న డైరెక్టర్. నేను చాలా మందితో వరుసగా సినిమాలు చేశాను. కంగనాతో పని చేయడం కష్టం అని మాట్లాడిన వారికి అశ్విని లాంటి వారే సమాధానం చెప్తున్నారు.
ఈ కథలో మీకు నచ్చిన విషయమేమిటి?
ఇందులో నాది నేషనల్ లెవల్ కబడ్డీ క్రీడాకారిణి పాత్ర. ఆ ఆటకూ, కుటుంబ బాధ్యతలకూ మధ్య నలిగే పాత్ర. అశ్విని స్క్రిప్ట్ చెప్పినప్పుడు, ఆ క్యారెక్టరైజేషన్, అందులోని కాన్ఫ్లిక్ట్ బాగా నచ్చాయి. జనరల్గా సెట్ కి వెళ్లే ముందే నేను సీన్ గురించి తెలుసుకుంటాను. కానీ ‘పంగా’ సమయం లో నా పరిస్థితులను అర్ధం చేసుకుని.. నాకు ప్రతి విషయాన్ని అశ్విని వివరంగా చెప్పేవారు.
ఇప్పుడు జయలలిత బయోపిక్ చేస్తున్నారు కదా.. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై మీ అభిప్రాయమేమిటి?
అంతకుముందు ‘మణికర్ణిక’, ఇప్పుడు జయలలిత బయోపిక్ ‘తలైవి’ సినిమా చేస్తూ, హైదరాబాద్, చెన్నై తిరుగుతూ నేను పూర్తి సౌత్ ఇండియన్గా మారిపోయా. సౌత్ ఇండియాలో గొప్ప గొప్ప సినిమాలు వస్తున్నాయి. ఇక్కడి సినిమా కల్చర్ నాకు బాగా నచ్చింది.

అశ్విని అయ్యర్
సమాజంలో మహిళా సాధికారికత ఎలా ఉందని అనుకుంటున్నారు?
మన సమాజంలో మహిళ సాధికారత గురించి చర్చిస్తున్నాం కానీ వాటి అమలు అంతగా లేదు.
ఇంట్లో భర్త రోల్ ఎలా ఉండాలంటారు?
ఈ సినిమాలో కంగన పేరు జయా నిగం. ప్రతి ఇంట్లో ఒక జయ వుంది. మగవాళ్లకు గర్ల్ ఫ్రెండ్ లో ప్రతి విషయం నచ్చుతుంది. ఒకసారి పెళ్లై పిల్లలు పుట్టాక మాత్రం మహిళకు సంబంధించిన ప్రతి విషయం మారి పోతుంది. కానీ ఇవాళ్టి రోజున పరిస్థితి అది కాదు.. పిల్లల పెంపకం ఇద్దరి బాధ్యత. భర్తే భార్యకి సపోర్ట్ చేయకపోతే ఇంక ఎవరు చేస్తారు!
ఈ సినిమాతో ఆ సందేశం ఇద్దామనుకున్నారా?
కంగనా వంటి సూపర్ స్టార్ ద్వారా మార్పు రావాల్సిన అవసరాన్ని చెప్పించడం బావుంటుంది. ఈ సినిమా ద్వారా కొంతమందైనా ఆలోచిస్తే, దీన్ని తీసిన ప్రయోజనం నెరవేరినట్లే. ఎందుకంటే దాదాపు 40 శాతం మహిళలు పిల్లలు పుట్టాక జాబ్ మానేస్తున్నారని గణాకాలు చెబుతున్నాయి.
కంగననే ఈ పాత్రకు ఎందుకు ఎంచుకున్నారు?
కంగన ఎలాంటి నటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంగనా లాంటి నటి మాత్రమే ఇలాంటి ఒక స్క్రిప్ట్ కి న్యాయం చేస్తారు అనిపించింది. ఆమెకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు వెంటనే ఒప్పుకున్నారు. కబడ్డీ అనేది కామన్మ్యాన్ ఆట. అందుకే మేము కండల గురించి చెప్పలేదు. తల్లిగా, క్రీడాకారిణిగా జీవించే వాళ్లు కావాలని ఇందులో చెప్పాం.
ఆమెతో పనిచేయడం ఎలాంటి అనుభూతినిచ్చింది?
ఈ సినిమా కోసం దాదాపు 2 ఏళ్ళు పనిచేసాము. ఇప్పుడు మేము ఒక కుటుంబంలా మారిపోయాం. సెట్స్పై తను పూర్తి ప్రొఫెషనల్. బయట మేం స్నేహితులమై పోయాం. నేను తనతో జీవిత కాలం సరిపోయే ఎమోషనల్ అగ్రిమెంట్ చేసుకున్నాను. యాక్టర్, డైరెక్టర్ మధ్య మంచి సంబంధాలు ఉండాలి. ఒక కుటుంబంలో ఎప్పుడు, ఎవరు కోప్పడకుండా ఉంటారా! ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి


‘అల వైకుంఠపురములో’ థియేటర్స్ నుంచి జనం ఒక పరిపూర్ణమైన అనుభూతితో,ఆనందంతో బయటకు వస్తారు! – మాటల మాయాంత్రికుడు, దర్శకుడు ‘త్రివిక్రమ్’

‘అల వైకుంఠపురములో’ థియేటర్స్ నుంచి జనం ఒక కంప్లీట్ ఫీలింగ్తో, ఆనందంతో బయటకు వస్తా రని చెప్పారు త్రివిక్రమ్. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి ఆయన దర్శకుడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్,,పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించిన ఆ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఆ సినిమా గురించి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు…

* ఎవరికైనా కెరీర్ స్టార్ట్ అయ్యేటప్పుడు తనలో ఉన్న ఆలోచనలన్నీ అందరికీ చెప్పెయ్యాలనీ, వాళ్లందరి ప్రశంసలూ పొందాలనీ, తన ఆలోచనలతో వాళ్లందరూ ఏకీభవించాలని ఉంటుంది. కొన్ని సంవత్సరాలు గడిచాక.. ప్రశంస తగ్గిపోతుంది, అంచనాలు పెరిగిపోతాయి. ఎప్రిసియేషన్ తగ్గిపోవడం మూలంగా, క్రియేట్ చేసేవాళ్లకు మన పనిలో ఏమైనా లోపముందా అనిపించే ఛాన్స్ ఉంది. దాంతో దారి మార్చుకొని ఎందుకూ పనికిరాకుండా పోయే ప్రమాదమూ ఉంది. లేదంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడం మూలంగా ఆ బరువుకు కుంగిపోయి, చెప్పాలనుకున్నది చెప్పలేక కుంగిపోయి, ఒక నార్మల్ లేదా సేఫ్ రూట్లోకి ఎస్కేప్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. ప్రతిసారీ ఈ రెంటినీ గెలవడానికి ఎవరైనా ప్రయత్నించాల్సిందే. ‘అరవింద సమేత’ నుంచి నా భయాలతో ఫైట్ చేస్తూ వస్తున్నా. ‘అజ్ఞాతవాసి’ ఫ్లాపైన తర్వాత అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే.. ఆయనకు అలవాటైన హ్యూమర్లోకి, ఎంటర్టైన్మెంట్లోకి వెళ్లిపోతే బాగుంటుంది కదా.. అనిపిస్తుంది. నా చుట్టూ ఉన్నవాళ్లు కూడా ముందు దానివైపే తోస్తారు. నేనది చెయ్యలేదు. అది కావాలని తీసుకున్న డెసిషన్. ఎంత పరాజయం చూసినా కానీ కొత్తగా భయపెట్టేది ఏముంటుంది! ఈ భయాన్ని గెలవాలంటే ఇదే సమయం, ఇదే స్టెప్. అందుకని సీరియస్ గా ఉండే సబ్జెక్ట్ ట్రై చేశా. అందులో కమర్షియల్ గా ఉండే సాగ్స్ కానీ, హ్యూమర్ కానీ, ట్రాక్ కానీ.. అలాంటివేవీ మైండ్లోకి కూడా రానివ్వలేదు. దాన్ని నేను బిగ్గెస్ట్ టేకెవేగా ఫీలవుతా. ‘అరవింద తర్వాత’ మళ్లీ అలాంటి కథే చెప్పకూడదు కదా.. దాన్నుంచి బ్రేక్ కావాలి కదా.. ప్రతిసారీ మనం మారడానికి ప్రయత్నించడమే. అందుకే ‘అల వైకుంఠపురములో’ సినిమా తీశా.

*సినిమాలు చూశాక ‘సరిలేరు నీకెవ్వరు’ జానర్, ‘అల వైకుంఠపురములో’ జానర్ వేర్వేరుగా ఉన్నాయని ప్రేక్షకులు ఫీలవుతారని నేననుకుంటున్నా. ట్రైలర్ లను బట్టే అవి భిన్న తరహా కథలని తెలిసిపోతుంది.

*ఈ సినిమా ప్రధానంగా ఏ పాయింట్ మీద నడుస్తుంది? కొత్తగా ఏం చెప్పారు?
మనం ఎవరికైనా స్థానం ఇవ్వగలం కానీ, స్థాయి ఇవ్వలేం. స్థాయి అనేది ఎవరికి వాళ్లు తెచ్చుకోవాల్సింది. ఇదే థాట్ ఆఫ్ ద ఫిల్మ్. దానికి ఇల్లు ఆధారం. మనం ఏ కథ చెప్పినా రామాయణ భారతాలు దాటి చెప్పలేమనేది ఈ ప్రపంచంలో అందరూ ఒప్పుకొనే మాట. వాటిని దాటైతే మనం కొత్త కథ చెప్పలేం. అందువల్ల వాటికి సంబంధించిన ఏదో ఒక ఛాయ కథలో కనిపిస్తూ ఉండవచ్చు.

*మీ బలం హ్యూమర్. ‘అరవింద సమేత’ను అందుకు భిన్నంగా తీశారేం?
కొత్త కథ ఎత్తుకోవడంలో తప్పు లేదు. అర్జునుడు బాణాలు బాగా వేస్తాడు. అవసరమనుకున్నప్పుడు, అప్పుడప్పుడు కత్తి తీయడంలో తప్పులేదు. శత్రువు మనకు బాగా సమీపానికి వచ్చినప్పుడు బాణం తీసి, ఎక్కుపెట్టి వేసే సమయం ఉండదు. అప్పుడు కత్తితీసి నెగ్గితే తప్పేమీ లేదు కదా. ఒక్కోసారి మన బలాలు లేకుండా కూడా ఫైట్ చెయ్యాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల కొత్త కథలు సమకూర్చుకోవడంలో తప్పులేదనుకుంటాను. జనంలోని ఇష్టం, అభిమానం కూడా మనల్ని బందీని చేస్తుంది. భయాన్ని గెలవడమనేది గేం ఆఫ్ లైఫ్ అంటాను.

*’అల వైకుంఠపురములో’ పేరు పెట్టడానికి ఇన్స్పిరేషన్ ఏమిటి?
పోతన గారి పద్యమే స్ఫూర్తి.

*మిమ్మల్ని ప్రేక్షకులు ఇంతగా అభిమానించడం చూస్తుంటే మీకేమనిపిస్తుంది?

*ప్రేక్షకులు అభిమానించేది మనం ఇచ్చే వర్కుని, మనల్ని కాదు. దాన్ని డిటాచ్డ్ గా చూస్తేనే, వాటినుంచి మనం విడిపోయి మనకు నచ్చిన పని చేసుకోగలం, లేకపోతే మరీ సీరియస్ అయిపోయి, స్తబ్దతకు గురవుతాం. కాబట్టి ఆ సినిమావరకు మనం ప్రజల ఇష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలి. చేసిన ఏ సినిమా కూడా నచ్చలేదని చెప్పారంటే, అప్పటిదాకా నేను చేసిన పని నేను చేసినట్లు కాదు, తర్వాత చేసేపని కూడా నేను చేసేది కాదు. ఆ క్షణానికి వాళ్లకు నచ్చదు. ప్రేక్షకులనేవాళ్లు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు. అందుకే వాళ్లను ప్రేక్షక దేవుళ్లు అంటుంటాం. థియేటర్లో లైట్లు ఆర్పిన తర్వాత కులం, మతం, జాతి.. వీటన్నిటికీ అతీతంగా తమ ముందున్న సినిమాని చూస్తారు. వాళ్లను ఏదీ ఆ టైంలో ఎఫెక్ట్ చెయ్యదు. నవ్వొస్తే నవ్వుతారు, ఆనందం వస్తే ఆనందిస్తారు. కళ్లల్లో నీళ్లొస్తే ఏడుస్తారు. ప్రేక్షక దేవుడంటే మనం తెలుసుకోవాల్సింది.. పొజిషన్ కాదు, కండిషన్. అదొక స్థితి. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఒక అమ్మాయిమీద యాసిడ్ పోస్తే వాడు దేవుడెలా అవుతాడు!

* పాటల వెనుక మీ మ్యూజిక్ టేస్ట్ ఉందా? ముఖ్యంగా ‘సామజవరగమన’ పాటలో మీ ఇన్పుట్స్ ఉన్నాయంటారు?
నాకు సంగీతం చెయ్యడం రాదు, పాడ్డం రాదు. నాలో ఎన్నో కోరికలు.. గిటారు వాయించాలని, అమ్మాయిలు నావైపు ఆరాధనగా చూడాలని.. ఉండేవి. కానీ నాకు ఏవీ రావు. నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు. ఒక్క సిద్ శ్రీరాం వాయిస్ తప్ప, లైవ్ గా ఎగ్జాక్టుగా మీరు ఏ పాటైతే ఇప్పుడు వింటున్నారో దాన్ని తమన్ నాకు వినిపించేశాడు. అప్పుడు ‘సామజవరగమన’ అనేది పెడితే బాగుంటుందని నేను సజెస్ట్ చేశానంతే. శాస్త్రి గారికి చెబితే, 45 నిమిషాల్లో పాట రాసేశారు. ఈ పాటను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని చెప్పింది బన్నీ. అప్పుడు ఆలోచించి, తమన్, సిద్ శ్రీరాం లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లు షూట్ చేసి రిలీజ్ చేశాం. కాకినాడలో షూటింగ్ జరిగేటప్పుడు బన్నీ, నేను, తమన్.. ముగ్గురం కూర్చొని.. ‘సామజవరగమన’, ‘రాములో రాములా’, ‘ఓమైగాడ్ డాడీ’ పాటల్ని ఎలా జనంలోకి తీసుకెళ్లాలని మూడు పేజీలు రాసుకున్నాం. అప్పటికి ఆ మూడు పాటలూ ట్యూన్స్ పూర్తయి ఉన్నాయి.

*’అల వైకుంఠపురములో’ సినిమా ఎలా ఉంటుందనుకోవచ్చు?
జనం థియేటర్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక కంప్లీట్ ఫీలింగ్తో, ఆనందంతో బయటకు వస్తారు. చీర నేసినవాడికి దాని అందం తెలీదు. ఒక అనుభూతితో నేసుకుంటూ వెళ్లిపోతాడు. నేనూ అంతే. నా సినిమా ఎలా ఉందో ప్రేక్షకులే చెప్పాలి. ఒక సినిమాతో నేనింత ఎత్తుకు ఎదగాలని ఏ దర్శకుడూ అనుకొని చెయ్యడు. కథ రాసేంతవరకే రచయిత దానికి రాజు. తర్వాత ఆ కథకు అతను బానిస.

* డైలాగ్స్ అలా రాయాలని ఆలోచించి రాస్తారా? ఎక్కడ కూర్చొని రాస్తుంటారు?
డైలాగ్స్ గురించి నిజంగా నేను ఆలోచించను. స్పాంటేనియస్ రచయితగా నన్ను నేను చూసుకుంటా. నేనెక్కడికో వెళ్లి రాస్తుంటానని అనుకుంటారు. నేను మా ఇంట్లోనే రాసేసుకుంటూ ఉంటాను. నేను చాలా తేలిగ్గా, ప్రశాంతంగా పనిచేయడానికి ఇష్టపడతా.

* ఈ మధ్య మీ సినిమాల్లో స్త్రీలపై గౌరవాన్ని పెంచే పాత్రలు కనిపిస్తున్నాయి. కాన్షియస్ గానే వాటికి ప్రాముఖ్యం కల్పిస్తున్నారా?
1950ల నుంచి 1970 దాకా కూడా ఇంట్లో స్త్రీలే ఇంటి బాధ్యతలు చూసుకునేవాళ్లు. అంటే పైకి చెప్పని ఒక మాతృస్వామ్య విధానం ఉండేది. ఇంటికి సంబంధించిన అన్ని పనులూ వాళ్ల ద్వారానే నడిచేవి. ’70ల తర్వాత ప్రయాణాలు పెరిగి, ఉన్న చోటు నుంచి వేరే చోట్లకు వెళ్లి ఉద్యోగాలు, వ్యాపారాలు చేయాల్సి రావడం వల్ల ఇళ్లల్లో వాళ్ల భాగస్వామ్యం తగ్గింది. తెలీకుండా మనం కూడా వేరే సంస్కృతికి ప్రభావితమవడం, మన మూలాల్ని మనం వదిలేయడం, దాంతో వాళ్లను అగౌరవపరిచేవిధంగా చూడటం, అలా మనం మగవాళ్లమే చూడ్డం వల్ల, లేని ఒక యాక్సెప్టెన్స్ రావడం, వాళ్లు మౌనంగా ఉండటాన్ని కూడా మనం యాక్సెప్టెన్స్ కింద చూడ్డం వంటివి 35 ఏళ్లు నడిచాయి. నాకు తెలిసి ఇప్పుడవి మారిపోయాయి. ‘అత్తారింటికి దారేది’ అలా రాయడానికి కారణం.. నాకు మా అత్తంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పట్నుంచీ విన్న నానుడి.. తల్లి తర్వాత పిన్ని, తండ్రి తర్వాత మేనత్త అని. అలాంటి అత్తని మనం ఎందుకు తక్కువచేసి చూపిస్తాం? అత్తతో అల్లుడు వేళాకోళమాడ్డం బేసిగ్గా మన సంస్కృతిలో లేదు. దాన్ని కొత్తగా తీసుకొచ్చి పెట్టారు. పెళ్లిలో అల్లుడ్ని విష్ణువుగా చూస్తాం. అందుకే కాళ్లు కడుగుతాం. అంటే అల్లుడి బాధ్యతను పెంచడం కోసం అతని కాళ్లు కడుగుతాం. అలాంటివాడు అత్తతోటి ఎలా వేళాకోళమాడతాడు? అతను దేవుడిలాగే బిహేవ్ చెయ్యాలి. అందర్నీ బాగా చూసుకోవాలి, మంచి సమాజాన్ని నిర్మించాలి. ఇవన్నీ తెలీకుండానే నా సినిమాలో ప్రతిఫలించి ఉండొచ్చు. కాన్షియస్గా నేను వాటిని చెప్పాననట్లేదు.

* ఇటీవల మీ సినిమాల్లో కథ ఒక ఇంటిచుట్టూ నడవడం కనిపిస్తుంది. ఎందుకలా?
మనం ప్రపంచం అంతా తిరగొచ్చు. కానీ ఇంటికొచ్చాక ఒక సుఖం వస్తుంది. ఆ ఇంటికొచ్చిన ఫీలింగే వేరు. అందుకే ‘హోం కమింగ్’ అంటాం. మనకు తెలీకుండానే ఇల్లు మన సంస్కృతిలో ఒక భాగం. అది చిన్నదే కావచ్చు. ఇంట్లో ఉంటే ఆ ఆనందమే వేరు. బహుశా నేను ఆ ఇంట్లో ఆనందాన్ని వెతుక్కొనే ప్రయత్నం చేస్తానేమో. అందుకే నా సినిమాల్లో కథకి ఇల్లు కేంద్రంగా ఉంటూ ఉండొచ్చు. ‘అల.. వైకుంఠపురములో’ మూవీలో ‘వైకుంఠపురం’ అనే ఇంటికి ఉన్న విలువను అలా సింబలైజ్ చేశాను. ఆ ఇంటికి హీరో వెళ్లడం ఎందుకు ముఖ్యమైన విషయమయ్యింది? అందుకే ఆ ఇంటికి ఆ పేరుపెట్టి, అదే సినిమాకి టైటిల్ గా పెట్టా.

* మీ డైలాగ్స్ వల్లే సినిమాలు హిట్టయ్యాయనే పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు వస్తున్న రైటర్స్ కొంతమంది మిమ్మల్ని అనుకరిస్తున్నారు కూడా. వాళ్ల సినిమాలు చూసినప్పుడు మీరెలా ఫీలవుతారు?
నేను ఏ సినిమానైనా ఏ నెగటివ్ లేకుండా చూస్తా. చాలా సార్లు ఆశ్చర్యానికి గురవుతా. ఆడియెన్స్ ఎలా ఫీలవుతారో నేనూ అలాగే ‘అరె.. భలే రాశాడే’ అని ఫీలవుతా. తక్కువ బడ్జెట్తోటే వీళ్లు ఈ సినిమా భలే చేశారే, మనం చెయ్యలేకపోయామే అని కచ్చితంగా అనిపిస్తుంది. కొన్ని సినిమాలు చూస్తే, ఈ ఐడియా మనకెందుకు రాలేదననే జెలసీ కూడా వస్తుంది. వీడు నాలా రాస్తున్నాడే అని ఎప్పుడూ నాకనిపించలేదు. నిజాయితీగా చెప్తున్నా. ఇందులో హ్యూమిలిటీ ఏమీ లేదు. డైలాగ్స్ వల్ల సినిమా ఆడుతుందనే దాన్ని నేను ఏకీభవించను. ఎందుకంటే.. కథ, పాత్రలు, సన్నివేశాలు.. తర్వాతే మాటలు. మాట అనేది వాటికి బలమవ్వాలే తప్ప, మాట వల్ల ఇవన్నీ రావు. నా డైలాగ్స్ కి పేరు రావడానికి కారణం నేననుకొనేదేమంటే.. ఆ సన్నివేశాన్ని మరింత సూటిగా, బలంగా చెప్పడానికి నేను మాటల్ని వాడానని..

* ‘జులాయి’ నాటికీ, ఇప్పటికీ అల్లు అర్జున్లో మీకు కనిపించిన మార్పు ఏమిటిది?
‘జులాయి’ నాటికీ, ఇప్పటికీ పోల్చుకుంటే అల్లు అర్జున్ పని మీద మరింత ఫోకస్డ్ గా ఉన్నాడనే విషయం తెలిసింది. వేరే ధోరణే తనకు లేదు. ఎంతసేపూ సినిమాపైనే అతని దృష్టి.

* మీరు పాన్-ఇండియా సినిమాలు ఎందుకు తియ్యట్లేదు?
నేను పాన్-ఇండియాకు వెళ్లకపోవడానికి నాకు కరెక్ట్ కథ తగలకపోవడం, నేనింకా అలాంటి కథ రాయలేకపోవడం.

* ఈమధ్య ఎక్కువగా మీ సినిమాలకు ‘ఆతో మొదలయ్యే టైటిల్స్ పెడుతున్నారు. అది సెంటిమెంటా?
నాకు సెంటిమెంట్లున్నాయి కానీ, ‘ఆ అక్షరంతో టైటిల్ మొదలుపెట్టాలనే సెంటిమెంటైతే లేదు.

* తర్వాత ఎవరితో సినిమా చెయ్యబోతున్నారు?
తర్వాతి సినిమా ఏమిటనేది ఇంకా డిసైడ్ అవలేదు. కథ అల్లుకొని, దానికి ఎవరు సరిపోతారనుకుంటే వాళ్లతో చేస్తా.


‘సరిలేరు నీకెవ్వరు` ప్ర‌తి సాంగ్‌కి ఎక్స్‌ట్రార్డిన‌రి రెస్పాన్స్ రావ‌డం హ్యాపీగా ఉంది – రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్.

టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ మ్యూజికల్ హిట్స్ ను అందించి అందరి అభిమానుల మన్ననలు పొందుతూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్. ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. చిత్రానికి స్వరాలను అందించారు. ఇప్పటికే విడుదలైన అన్ని పాటలకు దేశవ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న సినిమా విడుదలవుతున్న సందర్భంగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇంటర్వ్యూ..

ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు కదా ఇంకా ఏం చేయగలం అని ఎప్పుడైనా అనిపించిందా?
లక్కీ గా ఎప్పుడూ అలా అనిపించింది లేదు. ఎందుకంటే 2020 లో విడుదలయ్యే నా మొదటి సినిమా `సరిలేరు నీకెవ్వరు`. నిజంగా ఇది నాకు ఫస్ట్ సినిమాలానే అనిపిస్తుంది. ప్రతి సినిమా కి ఆ భయం అయితే ఉంటుంది. ‘అది ఉన్నంతకాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆ భయం మనలో ఉంటే ప్రతి సినిమా ఒక ఛాలెంజ్ లా తీసుకొని చేస్తాము. ఈ విషయం ‘మన్మధ బాణం’ సినిమా చేస్తున్నప్పుడు కమల్ హాసన్ గారు చెప్పారు. అలాగే మా టీమ్ అందరి ఎఫర్ట్ కూడా ఒక కారణం. మనచుట్టూ ఉన్నవాళ్ళని భయపడకుండా వాళ్ళ ఒపీనియన్ మనకు చెప్పే ఫ్రీడమ్ ఇవ్వడం కూడా మన సక్సెస్ లో ఒక పార్ట్ అని నా భావన.
ఈ సినిమా ఓపెనింగ్ రోజు మహేష్ బాబు ఫ్యాన్స్ కి మాస్ సాంగ్, ల‌వ్‌, పార్టీ సాంగ్ ఇస్తానని మాట ఇచ్చారు క‌దా?
– ఈ సినిమా ఓపెనింగ్ రోజు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ నచ్చేలా ఒక మాస్ సాంగ్ ఇస్తానని చెప్పాను. అలాగే `మైండ్ బ్లాక్`,`డాంగ్ డాంగ్‌` సాంగ్ కి సోషల్ మీడియా లో టెర్రిఫిక్ రెస్పాన్స్ వస్తోంది. అందరి హీరోలకి మాస్ సాంగ్స్ చేశాను. ఇప్పుడు మహేష్ గారికి మాస్ సాంగ్ చేయాలన్నకోరిక ఈ సినిమాతో తీరింది. అందుకు కారణమైన అనిల్ రావిపూడి గారికి ఈ సందర్భంగా థాంక్స్ తెలియజేస్తున్నా అలాగే డిసెంబర్ లో మాస్ `ఎస్ఎస్‌ఎంబి మండేస్` అని ప్రతి సోమవారం ఒక సాంగ్ ని విడుదల చేశాం. ఇది నాకు, మా టీమ్ అందరికీ ఒక పరీక్ష లాంటిది. అయితే విడుదల చేసిన ప్రతి సాంగ్ కి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. అన్ని పాటలను ఆదరించిన ప్రేక్షకులకి, మీడియా వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
మహేష్ బాబుతో మీ జ‌ర్నీ గురించి?
– మహేష్ గారితో ఇది నా ఐదవ సినిమా. ఆయనతో జర్నీ చేయడం ఎప్పుడూ గొప్పగా ఉంటుంది. నేను ఎప్పుడూ చెప్తుంటాను `మహేష్ గారు కేవలం సూపర్ స్టార్ మాత్రమే కాదు ఒక సూపర్ స్టార్ కి కావాల్సిన మంచి మనసు ఉంది’అని. ఎందుకంటే ఇప్పటివరకు ఆయనతో పనిచేసిన డైరెక్టర్స్ అందరితో నేను వర్క్ చేశాను. అందరూ కూడా ఒకే మాట అంటారు ఏంటంటే `మహేష్ తో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలనుంది` అని. ఒక సారి కథ విని ఓకే అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఆయన టెక్నీషియన్స్ కి సపోర్ట్ చేస్తారు. కంప్లీట్ గా డైరెక్టర్స్ యాక్టర్ ఆయన. అంత పెద్ద స్టార్ మనమీద నమ్మకం పెట్టినప్పుడు మనకు తెలియకుండానే పని మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. అందుకే అన్నీ బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవ్వగలిగాను.
ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడితో వ‌ర్క్ ఎక్స్‌పీరియ‌న్స్‌?
– అనిల్ రావిపూడి గారితో నేను `ఎఫ్ 2` మూవీ చేశాను. ఈ సినిమాను చాలా ఎక్స్ట్రార్డినరీ గా హ్యాండిల్ చేశారు. అనిల్ అనగానే మనకు ఎంటర్టైన్మెంట్ గుర్తొస్తుంది. కానీ మహేష్ బాబు గారి సినిమాల్లో ఉండే సందేశం మిస్ కాకుండా, మహేష్ ఫ్యాన్స్ ఆయన్ని ఎంత ఎనర్జీ గా చూడాలనుకుంటున్నారో ఈ రెండు పర్ఫెక్ట్ మిక్స్ గా ఈ సినిమా వచ్చింది. మహేష్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. నేను ఆర్.ఆర్ చేస్తున్నప్పుడే రిపీటెడ్ గా చూశాను. ఈ సినిమాలో ఆయన డాన్సులు ఆడియన్స్ కి బోనస్.
సరిలేరు నీకెవ్వరు ఆంథ‌మ్‌ సాంగ్ గురించి?
– నాకు ఆర్మీ అంటే చాలా గౌరవం. ఇప్పటివరకు ఆ జోనర్ లో సినిమా చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు ఒక సూపర్ స్టార్ తో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సినిమా అనగానే చాలా హ్యాపీ గా ఫీలయ్యాను. అనిల్ గారు ఫస్ట్ చెప్పడమే సరిలేరు నీకెవ్వరు అనేది ఆర్మీ వారికి ఒక ట్రిబ్యూట్ అని చెప్పారు. ఆ ఇన్స్పిరేషన్ తోనే ఆంథ‌మ్‌ సాంగ్ `భగ భగ భగ భగ మండే నిప్పులవర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకే వాడే సైనికుడు`.. నేనే రాశాను. ఆ లిరిక్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే యూరప్ లో మేసెడోనియన్ సింఫనీ ఆర్కస్ట్రా తో రికార్డ్ చేశాం. వారు కూడా చాలా ఎగ్జైట్ గా ఫీలయ్యారు. మహేష్ గారు కూడా ఆ పాట విని డైరెక్టర్ ఒక కథ రెండున్నర గంటల కథ చెప్తే దేవి ఒక పాటలో వినిపించాడు. దేవి మామూలోడు కాదు అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది.
మైండ్ బ్లాక్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది కదా! దాని గురించి చెప్పండి?
– నా దృష్టిలో ఒక పెద్ద హీరో నుండి మాస్ సాంగ్ వచ్చినపుడు ఆ పాట ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి అదేవిధంగా ఆ సాంగ్ కి హీరోకి లింక్ కూడా ఉండాలి అనేది నా కోరిక. అందులోనూ కథ చెప్పటప్పుడే మహేష్ గారిని పక్కా మాస్ గా చూపించబోతున్నాము అని చెప్పారు. నాకు చాలాఎగ్జైట్ మెంట్ వచ్చింది. అందుకే ఎపుడు ప్యాంటేసే వాడు ఇపుడు లుంగీ తొడిగాడు,.అని రాశాం. ఆ పాట‌ని మహేష్ గారు విన్నప్పుడు పడి పడి నవ్వారు. ఏంటి ఇప్పుడు ఇవన్నీ నాతో చేయిస్తారా? అని అడిగారు. అందుకే కదా సర్ లిరిక్స్ లో రాశాం అని చెప్పాము. మీరు ముందునుండి ప్రిపేర్ అయి ఉన్నారు అన్నట్టుగా చూశారు. రేపు థియేటర్ లో ఆ సాంగ్ వేరే రేంజ్ లో ఉంటుంది.
తొమ్మిది ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు కదా ! రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతారా?
– తప్పకుండా అండీ, నేను అవార్డ్స్ ని రెండు కోణాలలో చూస్తాను. ఒకటి మన వర్క్ నచ్చి ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేశారో దాన్ని మించిన అవార్డ్ లేదు. ఇక అవార్డ్ అనేది వారు మనకు ఇచ్చే గొప్ప గౌరవం. అది నాకు రెస్పాన్సిబుల్ ని పెంచుతుంది.
నిర్మాత అనిల్ సుంకర గురించి?
– మా నిర్మాత అనిల్ సుంకర గారు చాలా స్వీట్ పర్సన్. చాలా ఎంకరేజింగ్ గా ఉంటారు. ఒక సాంగ్ యూరప్ వెళ్లి కంపోజ్ చేద్దాం అన్నప్పుడు తప్పకుండా చెప్పడం అని సపోర్ట్ చేశారు. ఒక ప్యూర్ సినిమా లవర్. మాస్ సాంగ్ చేయబోతున్నాం అన‌గానే తప్పకుండా చేద్దాం. మహేష్ గారిని అలా చూపించాలి. చాలా బాగుంటుంది. అని చాలా ఎగ్జైట్ అయ్యారు.
మీరు హీరోగా సినిమా చేస్తున్నారనే వార్త చాలా సంవత్సరాలుగా వినిపిస్తోంది. ఆ సినిమా ఎంతవరకూ వచ్చింది ?
– సినిమా చేయమని అడుగుతున్నారు గాని, నాకు మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రస్ట్ వల్లనేమో యాక్టింగ్ చేయాలనే ఆసక్తి రావడం లేదు. అయితే నాకు తమిళంలో ఎక్కువమంది కథలు చెబుతున్నారు. సంగీతం ప్రధానంగా సాగే కొత్త కథ ఉంటే ఏదైనా ఉంటే త‌ప్ప‌కుండా చేస్తాను.
మీ తదుపరి సినిమాల గురించి ?
– సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లోఒక సినిమా చేస్తున్నాను. మా కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఉంటుంది. అలాగే ‘ఉప్పెన’ సినిమా చేస్తున్నాను. నితిన్, కీర్తి సురేష్ ల ప్యూర్ లవ్ స్టోరీ ‘రంగ్ దే’ చేస్తున్నాను. అలాగే కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ సినిమా కూడా చేస్తున్నాను. అలాగే హిందీలో ఒక సినిమా చేయబోతున్నాను దాని వివరాలు త్వరలో తెలియజేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.


“విట్టల్ వాడి” రిలీజ్ కి ముందే హిందీ రీమేక్ రైట్స్ కోసం ఉత్సాహం చూపిస్తున్న గురుదేవ్ పిక్చర్స్

ఎన్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రోహిత్,సుధా రావత్,నటీనటులుగా నాగేందర్.టి.దర్శకత్వంలో జి.నరేష్ రెడ్డి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా
నిర్మిస్తున్న చిత్రం “విట్ఠల్ వాడి” ఈ కొత్త మూవీ రిలీజ్ కి రెడి అయిన సందర్భంగా చిత్ర యూనిట్ సినీ ప్రముఖుల కు సినిమా ప్రివ్యూ చూయించారు. సినిమా ప్రివ్యూ చూసిన కొంతమంది ప్రముఖులు సినిమా బాగా చిత్రీకరించారని సాంగ్స్ సినిమా కి హైలెట్ అని రోషన్ కోటి మ్యూజిక్ చాలా బావుందని కొత్తవాళ్ళైన హీరో రోహిత్ ని హీరోయిన్ ని మెచ్చుకున్నారు. గొప్ప కథ ని ప్రేక్షకులకు అందించబోతున్న డైరెక్టర్ టి నాగేందర్, ప్రొడ్యూసర్ నరేష్ గారిని అభినందించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జి.నరేష్ రెడ్డి మాట్లాడుతూ: -ఇందులో రొమాంటిక్ సీన్స్ బాగా వచ్చాయి.హీరో రోహిత్ బాగా యాక్ట్ చేసాడు,సెంటిమెంట్స్ సీన్స్ కూడా బాగా వచ్చాయి.ఈ యాక్షన్, సెంటిమెంట్స్ సీన్స్ కు అందరూ కనెక్ట్ అయ్యారు.సినిమా చూసిన గురుదేవ్ పిక్చర్స్ అధినేత ప్రమోద్ కుమార్ సినిమా బాగుందని హిందీ లో ఒక ప్రముఖ నటుడి కొడుకుని లాంచ్ చెయ్యడానికి హిందీ రీమేక్ రైట్స్ కోసం ఆసక్తి చూపుతున్నారని ప్రొడ్యూసర్ నరేష్ హర్షం వ్యక్తం చేశారు..సినిమా ఫస్ట్ లుక్ తో పాటు ట్రైలర్ పై మంచి రేస్పాన్స్ రావడం తో మేమంతా చాలా సంతోశంగా ఉన్నాము.త్వరలో గ్రాండ్ గా ప్రి రేలీజ్ ఈవెంట్ జరిపి,భారీ ఎత్తున
“విట్టల్ వాడి” సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

నటీనటులు
రోహిత్ రెడ్డి
కైషా రావత్
అమిత్
రోల్ రిడా
అప్పాజీ అంబరీష్ దర్బా
చమ్మక్ చంద్ర

సాంకేతిక నిపుణులు
కెమెరా మెన్ – సతీష్ అడపా
మ్యూజిక్ – రోషన్ కోటి
ఎడిటింగ్ – శ్రీనివాస్ మోపర్తి
పి ఆర్ ఓ – మధు వి ఆర్
ఫైట్స్ – శంకర్
ప్రొడ్యూసర్ – జి నరేష్ రెడ్డి
డైరెక్టర్ – నాగేందర్ టి