Category Archives: Latest Events


చిరంజీవి క్లాప్ తో ఘనం గా ప్రారంభమయిన పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం..!!

చిరంజీవి క్లాప్ తో ఘనం గా ప్రారంభమయిన పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం..!!

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ రామనాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి , నిర్మాత అల్లు అరవింద్ ,నాగబాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ముఖ్య అతిధులుగా విచ్చేయగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రులు శివప్రసాద్, విజయ దుర్గ, చిరంజీవి తల్లి అంజనాదేవి, మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల హాజరయ్యారు.. కాగా మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ని ప్రారంభించగా, అల్లు అరవింద్ కెమెరా స్విచాన్ చేశారు.. నాగబాబు , అల్లు అర్జున్ స్క్రిప్ట్ ని అందజేశారు.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా మార్చి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది..

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. మైత్రి మూవీస్ సంస్థ గురించి , ఆ సంస్థ సాధించిన విజయాల గురించి అందరికి తెలిసిందే.. కొత్త వారి ప్రతిభను ప్రోత్సహించే దిశగా సుకుమార్ రైటింగ్స్ సంస్థ ద్వారా సుకుమార్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను.. రామ్ చరణ్ తో చేసిన ‘రంగస్థలం’ సినిమా తో ఈ సంస్థతో , సుకుమార్ గారితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది..మంచి మనసున్న వ్యక్తులు ఈ సంస్థ నిర్మాతలు.. వీరికి సుకుమార్ కలిసి వైష్ణవ్ తేజ్ తో ఓ మంచి సినిమా ను తీయబోతున్నారు.. ఇంతచక్కటి అవకాశం ప్రారంభంలోనే లభించడం అదృష్టం..ఇలాంటి వారి అండదండలతో , వారు ఇస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.. డైరెక్టర్ బుచ్చి బాబు చాల కొత్త కథ రాశాడు.. చాల ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి.. ఈ కథను నాకు నేరేట్ చేసినప్పుడు రస్టిక్ ఎలిమెంట్స్ కనిపించాయి.. రస్టిక్ అనగానే రంగస్థలం గుర్తుకువస్తుంది.. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు.. రంగస్థలం కథ చర్చల్లో బుచ్చిబాబు పాత్ర చాల ఉందని సుకుమార్ చాల సార్లు చెప్పారు..మరి అంత మంచి టాలెంట్ ఉన్న బుచ్చిబాబు ఈ కథని తయారుచేయడంలో చాల కష్టపడ్డారు.. ఎంతో కృషి చేసి ఈ కథతో మా అందరిని ఆకట్టుకున్నాడు..

బుచ్చిబాబు మనసు పెట్టి రాసిన కథ..అలాంటి బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు, వారిందరి మన్నననలు తప్పకుండా పొందుతాడు అని చెప్పగలను..ఈ సందర్భంగా యువ దర్శకునికి అల్ ది బెస్ట్ చెప్తున్నాను.. పెద్ద మనసున్న డైరెక్టర్ సుకుమార్.. తాను మాత్రమే ఎదగాలని కాకుండా తనతో పాటు ఇతరులు ఎదగాలని సుకుమార్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. అలాంటి పెద్ద మనసున్న సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు..

నిర్మాత అల్లుఅరవింద్ మాట్లాడుతూ..ఈ సినిమా డిఫరెంట్ గా ఉంటుందని సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాలో భాగమైనప్పుడే అర్థమయ్యింది.. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ అయన శిష్యుడు బుచ్చిబాబు చేస్తున్న మంచి సినిమా ఇది.. ఇందులో నటిస్తున్న వైష్ణవ్ , మనీషా కు కంగ్రాట్స్.. మైత్రి మూవీ మేకర్స్ మంచి బ్యానర్.. ఖర్చుకు వెనకాడకుండా డైరెక్టర్ కి అడిగిందల్లా ఇచ్చే మంచి నిర్మాణ సంస్థ.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తోడయ్యి సినిమా స్టామినా ను పెంచేసింది.. సినిమా కు పనిచేస్తున్న అందరికి అల్ ది బెస్ట్ అన్నారు..

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. మైత్రి మూవీస్ తో కలిసి ఈ సినిమా చేస్తున్నందుకు చాల ఆనందంగా ఉంది.. నా శిష్యుడు ఈ సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది.. అద్భుతమైన కథ రాశాడు.. ఒక్క సిట్టింగ్ లోనే ఒకే చేసిన కథ ఇది..బుచ్చిబాబు గొప్ప డైరెక్టర్ అవుతాడని ఖచ్చితంగా చెప్పగలను.. వైష్ణవ్ కోసమే ఈ కథ పుట్టింది.. కథ రాస్తున్నప్పుడే వైష్ణవ్ అని ఫిక్స్ అయ్యాడు.. వేరే ఆప్షన్స్ చూడమన్నా వైష్ణవ్ ఈ సినిమా కి న్యాయం చేయగలడు అని ఒప్పించాడు.. ఈ ప్రాజెక్ట్ ఇంతదూరం రావడానికి కారణం ఈ సినిమా కథే.. మైత్రి మూవీ మేకర్స్ వారికి చాల థాంక్స్..పెద్ద పెద్ద సినిమాలు నిర్మిస్తున్నా ఇలాంటి కొత్త సినిమా చిన్న సినిమా ను నిర్మించడం వారికే చెల్లింది.. కొత్తమ్మాయి మనీషా తెలుగమ్మాయి.. చాల మందిని టెస్ట్ చేసి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశాడు.. ఒక మంచి అమ్మాయి సినిమా కు ఎంపిక అయ్యింది.. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్న దేవిశ్రీప్రసాద్ కి చాలా థాంక్స్.. ఈ సినిమా ఆల్బం ఓ రేంజ్ లో ఉంటుంది.. తప్పకుండా చెప్పగలను.. వైష్ణవ్ కి మంచి ఫ్యూచర్ ఉంది.. కళ్యాణ్ గారి తర్వాత ఆయనంత సింప్లిసిటీ ఉంది వైష్ణవ్ కే.. ఈ సినిమా హిట్ తో వైష్ణవ్ కి మంచి సినిమా లు రావాలని కోరుకుంటున్నాను.. ఈ కథ ఇంత బాగా రావడానికి మెగాస్టార్ చిరంజీవి గారే కారణం. ఈ సినిమా కోసం చాలా సమయం కేటాయించి, ఇన్ పుట్స్ ఇచ్చి ఇంత బాగా కథ రావడానికి ఆయనే ముఖ్య కారణం.. అన్నారు..

సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. మైత్రి మూవీస్ నాకు హోమ్ బ్యానర్ అయ్యింది.. ఈ బ్యానర్ లో ఏ సినిమా వచ్చినా, నేను మ్యూజిక్ చేసినా చేయకపోయినా సినిమా గురించి నాతో డిస్కస్ చేస్తారు.. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కూడా ఈ సినిమా లో భాగమవుతున్నందుకు ఆనందంగా ఉంది.. రెండు బ్యానర్స్ తో నాకు చాలా దగ్గర అనుబంధం ఉంది. బుచ్చిబాబు గారితో నాకు చాలారోజులనుంచి పరిచయం..సుకుమార్ గారితో చేస్తున్నప్పటినుంచి అయన తెలుసు.. ఎదుటి వ్యక్తి గురించి చాలా మంచి గా మాట్లాడే వ్యక్తుల్లో సుకుమార్ గారు ఫస్ట్ ఉంటారు అని నా అభిప్రాయం.. సుకుమార్ గారిని ఓ కథతో ఒప్పించడమే బుచ్చిబాబు ఆస్కార్ కొట్టినంత పనిచేశాడు.. ఈ సినిమా నేను చేయడానికి కారణం సుకుమార్ గారే.. బుచ్చిబాబు గారు ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఈ సినిమా తప్పకుండ చేయాలనిపించింది.. ఏ కథైనా విన్నప్పుడు డిఫరెంట్ కథ, కొత్త కథ అంటాం కానీ ఈ కథ అంతకుమించిన డిఫరెంట్ స్టోరీ.. బిగినింగ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నాయి.. తప్పకుండా ఈ సినిమా కు మంచి మ్యూజిక్ ఇస్తాను.. మెగా హీరోస్ అందరికి మ్యూజిక్ ఇచ్చాను.. చాలా థ్రిల్లింగ్ గా ఉంది.. అందరికి అల్ ది బెస్ట్ అన్నారు..

నిర్మాత నవీన్ యర్నేని మాట్లాడుతూ.. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి, అల్లు అర్జున్ గరుకు, వరుణ్ తేజ్ గారికి, సాయి ధరమ్ తేజ్ గారికి ధన్యవాదాలు.. అందరు చెప్పినట్లు ఇది చాల మంచి కథ.. అద్భుతంగా వచ్చింది.. కథకు కావాల్సిన హీరో హీరోయిన్స్ యాప్ట్ గా దొరికారు.. ఈ సినిమా కు పెద్ద విజయం చేకూరుతుందని అనుకుంటున్నాను.. మీ అందరి ఆశీర్వాదాలు కావలి న్నారు..

దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.. సుకుమార్ సర్ కి చాల థాంక్స్..థాంక్స్ కూడా సరిపోదు.. అంతకు మించి ఎదో చెప్పాలనిపిస్తుంది.. నా మీద నమ్మకం ఉంచిన చిరంజీవి గారికి, మా అమ్మానాన్నలకు చాల థాంక్స్.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్ తో మంచి సినిమా తీస్తాను.. దేవి గారి గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిందేమి ఉండదు.. ఎవరైనా దేవుడు ముందు సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు కానీ నేను మాత్రం దేవి శ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఇవ్వండి సినిమా నిలబెడతాడు అని కోరుకుంటాను.. వైష్ణవ్ గారు ఈ సినిమా కి యాప్ట్ హీరో.. సినిమా చాల బాగుంటుంది.. కొత్తగా ఉంటుంది.. అందరు చూడండి అన్నారు..

నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, మనీషా రాజ్

సాంకేతిక నిపుణులు :
కథ మరియు దర్శకత్వం: బుచ్చి బాబు సానా
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవి శంకర్, మోహన్ చెరుకూరి (CVM)
బ్యానర్లు: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: శాందత్
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ మౌనికా
ఎడిటర్: నవీన్ నూలి


వినయ విధేయ రామ ప్రపంచ వ్యాప్తంగా 10 రోజులు షేర్ కలెక్షన్స్

సంక్రాంతి పండక్కి భారీ అంచనాల తో విడుదలైన వినయ విధేయ రామ సినిమా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సినిమా టాక్ మంచిగా లేనప్పటికీ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు. రెండో వారంలో కూడా చాలా థియేటర్స్ లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో విజయవంతం గా ప్రదర్శింపబడుతోంది . ఈ 10 రోజులోవినయ విధేయ రామ సినిమా 60 కోట్ల షేర్ క్లబ్ లో చేరింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ఈ సినిమా కి బోయపాటి శ్రీను దర్శకుడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించాడు.

ప్రపంచ వ్యాప్తంగా 10 రోజులు షేర్ కలెక్షన్స్

నైజామ్: 12.50 cr

సీడెడ్: 11.54 cr

ఉత్తరాంధ్ర: 8.06 cr

కృష్ణ: 3.55 cr

గుంటూరు: 6.27 cr

ఈస్ట్ : 5.22 cr

వెస్ట్: 4.26 cr

నెల్లూరు: 2.76 cr

టోటల్: రూ. 54.16 cr (ఎపీ+తెలంగాణా)

రెస్ట్ అఫ్ ఇండియా : 5.36 cr

ఓవర్సీస్: 1.43 cr

వరల్డ్ వైడ్ టోటల్ (షేర్): రూ. 60.95 cr


అధికారిక ప్రకటన : కొరటాల శివ దర్శకత్వం లో మెగా స్టార్ చిరంజీవి సినిమా

కొరటాల శివ దర్శకత్వం లో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్నాడు అనే వార్త ఇప్పుడు నిజం అవుతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా ఈ మెగా సినిమా ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి కథ ఓకే అయింది మరియు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి.

ప్రస్తుతానికి చిరంజీవి గారు సైరా సినిమా లో బిజీ గా ఉన్నాను. ఈ సినిమా అనంతరం కొరటాల శివ దర్శకత్వం లో నటిస్తారు.


పదేళ్ళ తర్వాత హైదరాబాద్‌లో కాన్సర్ట్ చేయడం ఆనందంగా ఉంది – కె.జె.ఏసుదాస్

పదేళ్ళ తర్వాత హైదరాబాద్‌లో కాన్సర్ట్ చేయడం ఆనందంగా ఉంది
– కె.జె.ఏసుదాస్


లెజండరీ సింగర్ కె.జె.ఏసుదాస్ చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. జనవరి 20న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ కాన్సర్ట్ జరగనుంది. ఈ సంగీత విభావరిలో ఏసుదాస్‌తోపాటు విజయ్ ఏసుదాస్, కల్పన కూడా పాల్గొంటారు. ఈ నేపథ్యంలో జనవరి 19న కె.జె.ఏసుదాస్, ఆయన తనయుడు విజయ్ ఏసుదాస్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కె.జె.ఏసుదాస్ మాట్లాడుతూ ‘‘నేను అక్షరాల విషయంలో చాలా పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకుంటాను. ఇది నా తల్లి నుంచి నేర్చుకున్నాను. నేను క్రిష్టియన్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ సంస్కృతంలోని అక్షరాలను నేర్చుకోమని ఆమె చెప్పారు. అది ఆమె నాకు అందించిన ఆశీర్వాదం. మరో ఆశీర్వాదం ఏమిటంటే.. నేను ఐదేళ్ళ వయసులో ఉన్నప్పుడు చదువు గురించి ఎలాంటి బెంగా పెట్టుకోవద్దు. నార్మల్‌గా చదువుకుంటే చాలు. కానీ, కర్నాటిక్ క్లాసికల్ మ్యూజిక్‌ని ప్రాపర్‌గా నేర్చుకోమని చెప్పారు. మ్యూజిక్, ఆర్ట్స్‌లాంటివి ఏమీ వద్దు.. స్కూల్‌కి వెళ్ళి చదువుకోమని చెప్పే ఆరోజుల్లో నన్ను సంగీతం నేర్చుకోమని ప్రోత్సహించారు. నాకు బ్రదర్స్, సిస్టర్ ఉన్నారు. వాళ్ళు కూడా బాగా పాడేవారు. కానీ, వాళ్ళను మా నాన్నగారు ఎంకరేజ్ చెయ్యలేదు. నన్ను మాత్రమే ఈ విషయంలో ప్రోత్సహించారు. ఈ సందర్భంగా నా తల్లిదండ్రుల్ని, నా మాస్టర్‌ని గుర్తు చేసుకుంటున్నాను. గురువు లేకుండా ఎవరూ గొప్పవారు కాలేరు. మనల్ని తీర్చిదిద్దిన గురువులు అంతా దేవుళ్ళతో సమానం. అది నా నమ్మకం. నేను ఇప్పటివరకు ఏం సాధించినా అదంతా నా తల్లిదండ్రులు, గురువుల వల్లే సాధ్యమైంది. అలాగే నా పాటలు వినేవారు, సంగీత ప్రియుల ప్రార్థనల వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. అంతకుమించి మరేం లేదు. నేను దాదాపు 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో లైవ్ మ్యూజిక్ చేస్తున్నాను. మధ్యలో కొన్ని క్లాసికల్ కాన్సర్ట్స్ చేసినప్పటికీ లైవ్ మ్యూజిక్ మాత్రం చాలా కాలం తర్వాత చేస్తున్నాను. నా బ్రదర్ అలేఖ్య హోమ్స్ శ్రీనాథ్ నన్ను లైవ్ మ్యూజిక్ చెయ్యమని చెప్పారు. హైదరాబాద్‌లో మళ్లీ ఈ కాన్సర్ట్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది. ఈ కాన్సర్ట్‌లో ప్రధానంగా తెలుగు పాటలు పాడతాము. అలాగే కొన్ని తమిళ్, హిందీ, మలయాళం పాటలు ఉంటాయి. నేను త్రివేండ్రంలో విద్వాన్ కోర్సు చేశాను. ఆ సమయంలో నా తండ్రిగారు అస్వస్థతకు లోనుకావడం, ఆర్థికంగా సరైన స్థితిలో లేకపోవడం వల్ల ఆ కోర్సు పూర్తి చేయకుండానే వచ్చేయడం జరిగింది. అందుకే నేను సంగీతంలో విద్వాన్‌ని కాదు, విద్యార్థిని మాత్రమే. ప్రతి రోజూ కర్నాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటూనే ఉంటాను.

అంతకుముందు నేను చేసిన పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటాను. విద్యార్థులెవరైనా ఇది గుర్తుంచుకోవాలి. ముందు రోజు చేసిన తప్పుల్ని తెలుసుకొని వాటిని సరిదిద్దుకోగలిగితే ముందు ముందు ఎంతో సాధించవచ్చు. ఇది సంగీతానికి మాత్రమే కాదు, ఏ రంగానికైనా వర్తిస్తుంది. మా నాన్నగారు చనిపోయేవరకు కూడా ఒక్కసారి కూడా నేను బాగా పాడుతున్నానని చెప్పలేదు. మన పిల్లల్ని మనమే అప్రిషియేట్ చెయ్యకూడదు. వాళ్ళకు వాళ్ళు ఎదగాలి. మా అబ్బాయి విజయ్ కూడా పాటలు పాడుతున్నాడు. అతని వయసు ఇప్పుడు 40. నా వయసు 79. కానీ, నేను ఇప్పటికీ విద్యార్థిననే చెప్తున్నాను. కానీ, మా అబ్బాయి ఆలోచన వేరుగా ఉండొచ్చు. ఇప్పుడొస్తున్న సింగర్స్ చాలా మంది బాగా పాడుతున్నారు. ఇప్పుడు సౌకర్యాలు బాగా పెరిగాయి. ఆరోజుల్లో నేను, సుశీల డ్యూయట్ పాడితే ఒకే మైక్‌లో ఒకరి తర్వాత ఒకరం పాడేవాళ్లం. కానీ, ఇప్పుడలా కాదు. డిఫరెంట్ ట్రాక్స్ వచ్చేసాయి. నిన్న నేను ఓ మలయాళం పాట పాడాను. నాతో పాట పాడే అమ్మాయిని నేను చూడలేదు కూడా. నా ట్రాక్ వరకు నేను పాడాను. తర్వాత ఆమె పాడిన ట్రాక్‌ని మిక్స్ చేస్తారు. అయితే ఆరోజుల్లో సింగర్స్ మధ్య సాన్నిహిత్యం ఉండేది’’ అన్నారు.

విజయ్ ఏసుదాస్ మాట్లాడుతూ ‘‘మొదట్లో నేను నాన్నగారి అడుగుజాడల్లోనే వెళ్ళాను. ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను. ఎందుకంటే అవి ఆయన వేసుకున్న ఫుట్‌స్టెప్స్. అందుకే నా సొంతదారిలోనే వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. అయితే కొన్ని విషయాల్లో ఆయన గైడెన్స్ తీసుకుంటాను. నాన్నగారి టైమ్‌లో ఇళయరాజాగారితో కలిసి చాలా సినిమాలకు పనిచేశారు. ఇద్దరూ ఫ్రెండ్స్‌లా, బ్రదర్స్‌లా ఉండేవారు. అలాగే ఇప్పుడు నేను, యువన్‌శంకర్‌రాజా కలిసి పనిచేస్తున్నాం. నాన్నగారు ఈ వయసులో కూడా ఇంకా నేర్చుకుంటున్నానని చెప్పడం మా జనరేషన్‌కి టెన్షన్ కలిగిస్తుంది. నేను రెండు సినిమాల్లో నటించాను కూడా. అయితే నేను నటుడ్ని కాదు. కెమెరా ముందు ఉండడం, యాక్ట్ చేయడం నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు బయోపిక్‌లు చాలా వస్తున్నాయి. అలాగే నాన్నగారి బయోపిక్ చేసే ఆలోచన ఉందా అని అడుగుతున్నారు. అయితే నాకు అలాంటి ప్లాన్స్ ఏమీ లేవు. కానీ, ఎవరైనా చేస్తే నేను ఇన్‌వాల్వ్ అవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు.


‘గేమర్‌’ ట్రైలర్ ఆవిష్కరణ


బి.జి.వేంచర్స్‌ పతాకంపై నూతన నటీనటులతో రాజేష్‌ తడకల స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమర్‌’. శ్రనిత్‌ రాజ్‌, కల్యాణి పటేల్, అనిరుధ్‌, నేహా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి ట్రైలర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ట్రైలర్ చూశాను. అద్భుతంగా ఉంది. తడకల రాజేష్ నూతన నటీనటులను ప్రోత్సహిస్తూ ఈ సినిమా తీశారు. మంచి డాన్సెస్, ఎంటర్టైన్మెంట్, సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ అన్నింటితో ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా చేశాడు రాజేష్.

ఇలాంటి చిన్న సినిమాల దర్శకనిర్మాతలను ప్రోత్సహించే భాద్యత ప్రభుత్వం పైనా, సమాజం పైనా ఉంది. ఎందుకంటే వీళ్ళందరికి థియేటర్లు దొరకడం కష్టంగా ఉంది. కొత్త టాలెంట్ రావాలంటే చిన్న దర్శకనిర్మాతలను ఎంకరేజ్ చేయాలి. తద్వారా గ్రామాల్లో ఉన్న టాలెంట్ కు అవకాశాలు దక్కుతాయి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అనిపిస్తోంది. హీరోహీరోయిన్స్ శ్రనిత్‌ రాజ్‌, కల్యాణికి దర్శకనిర్మాత రాజేష్ కు ఆల్ ది బెస్ట్’ అన్నారు.

హీరో శ్రనీత్ మాట్లాడుతూ ‘ట్రైలర్ విడుదల చేసిన వివేక్ గారికి థాంక్స్. నా తల్లిదండ్రుల వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను. నాకు మెయిన్ కారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి థాంక్స్. ఎంతో క్లారిటీ ఉన్న దర్శకుడు ఆయన.

సినిమా టీమ్ అంతా ఈ సినిమా కోసం హార్డ్ వర్క్ చేశారు. అందరికి థాంక్స్. హీరోయిన్ కల్యాణి మాట్లాడుతూ ‘అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత రాజేష్ గారికి థాంక్స్. సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది అని, కచ్చితంగా చూడాలని ఆశిస్తున్నాను’ అని చెప్పింది.<>/p

దర్శకనిర్మాత రాజేష్ మాట్లాడుతూ ‘ఎంతో బిజీగా ఉండికూడా చిన్న సినిమాను ఎంకరేజ్ చేయడం కోసం
మా సినిమా ట్రైలర్ ను ఆవిష్కరించిన వివేక్ అన్నకు ధన్యవాదాలు. ఇప్పటికే ఆరు చిత్రాలు చేసిన నాకిది ఏడవ సినిమా.బి.

జి.యాక్టింగ్‌ అకాడమీ ద్వారా నటీనటులకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి అవకాశం ఇస్తున్నాను. ఈ సినిమాతో పరిచయం అవుతోన్న శ్రనీత్ రాజ్ పెర్ఫామెన్స్ బాగుంది. చాలా కష్టపడ్డాడు. కల్యాణి పటేల్ కూడా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. అనిరుద్, నరేందర్, అల్తాఫ్, సింధు నిహ ఇతర పాత్రలు పోషించారు. ప్రతీ సీన్ డిఫరెంట్ గా ఉంటూ ఆసక్తి రేపుతుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయిన ఈ సినిమాను ఫిబ్రవరి 1న విడుదల చేయబోతున్నాం. ప్రేక్షకులు విజయాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అనిరుద్, నరేందర్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.