Category Archives: Latest Events


స్టార్ యాక్టర్ రావు రమేష్ వాయిస్ ఓవర్ తో ఫిబ్రవరి 22న “ప్రేమ‌క‌థాచిత్రమ్ 2” గ్రాండ్ రిలీజ్

స్టార్ యాక్టర్ రావు రమేష్ వాయిస్ ఓవర్ తో ఫిబ్రవరి 22న “ప్రేమ‌క‌థాచిత్రమ్ 2” గ్రాండ్ రిలీజ్



ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ క్రియేట్ చేసి, జక్కన్న చిత్రంతో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ సాధించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థాచిత్ర‌మ్2 . ఈచిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యమౌతున్నాడు. సుమంత్ అశ్విన్‌, సిద్ధి ఇద్నాని జంట‌గా న‌టిస్తున్నారు. శాటిలైట్, హిందీ డ‌బ్బింగ్ రైట్స్‌ ద్వారా కోటి 43 ల‌క్ష‌లు దక్కించుకోవడం విశేషం. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌ డూప‌ర్ హిట్ చిత్రంలో త‌న పెర్‌ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. సూప‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మొద‌టి పార్ట్‌కి ధీటుగా వ‌స్తున్న ఈ చిత్రానికి నందిత శ్వేతా న‌ట‌న మరో ప్ల‌స్ అవుతుంది. ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెర‌కెక్కుతున్న‌ “ప్రేమ కథా చిత్రం 2” చిత్రానికి మరో ఆకర్షణ రావు రమేష్. ఆయన నటనకే కాదు వాయిస్ కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం రావు రమేష్ వాయిస్ ఓవర్ తో నడుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 22న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.


ఈ సంద‌ర్భంగా నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. దీనికి సీక్వెల్ గా వ‌స్తున్న ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2 ని కూడా అంతే క్రేజ్ తో రూపొందిస్తున్నాం. హిందీ శాటిలైట్, డ‌బ్బింగ్ రైట్స్ ని కొటి న‌ల‌భై మూడు ల‌క్ష‌ల‌కి కొనుగోలు చేశారు. మనందరికీ ఎంతో ఇష్టమైన నటుడు రావు రమేష్ గారు ఈ చిత్రం కోసం వాయిస్ ఓవర్ చెప్పడం విశేషం. ఆయన వాయిస్ ఓవర్ తో ప్రేక్షకులు కథలోకి లీనమవుతారు. ఆయనకు ఈ సందర్భంగా మా యూనిట్ తరపున స్పెషల్ థాంక్స్ తెలియజేస్తున్నాం. ఇక ఈ చిత్రంలో నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సుమంత్ అశ్విన్ హీరోగా, సిధ్ధి ఇద్నాని మ‌రో హీరోయిన్ గా నటిస్తున్నారు. విధ్యుల్లేఖ‌, ప్ర‌భాస్ శ్రీను మ‌ధ్య వ‌చ్చే కామెడీ హిలేరియస్ గా ఉంటుంది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నాం. పూర్తి స‌ర్‌ప్రైజింగ్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న మా ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2 అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుందనే నమ్మకముంది. అని అన్నారు

న‌టీన‌టులు.. సుమంత్ అశ్విన్‌, నందిత శ్వేత‌, సిధ్ధి ఇద్నాని, కృష్ణ తేజ‌, విధ్యులేఖ‌, ప్ర‌భాస్ శ్రీను, ఎన్‌.టి.వి.సాయి త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు :
కెమెరామెన్ – సి. రాం ప్రసాద్,
ఎడిటర్ – ఉద్ధవ్ య‌స్‌.బి
సంగీతం – జె.బి
డైలాగ్ రైటర్ – గ‌ణేష్‌
లిరిక్ రైట‌ర్‌- అనంత్ శ్రీరామ్,కాస‌ర్ల్య శ్యామ్‌, పూర్ణా చారి.
పీఆర్వో – ఏలూరు శ్రీను
ఆర్ట్ – కృష్ణ‌
కో ప్రొడ్యూసర్స్ – ఆయుష్ రెడ్డి, ఆర్ పి అక్షిత్ రెడ్డి
నిర్మాత – ఆర్. సుదర్శన్ రెడ్డి
దర్శకుడు – హరి కిషన్


Mr Majnu Movie Pre Release Event MATTER AND STILLS

‘Mr మజ్ను’ డెఫినిట్ గా పెద్ద హిట్ అవుతుంది. అఖిల్‌ విల్‌ బికమ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్‌ యాక్టర్స్ – ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌

అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ చిత్రాల  నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న యూత్‌పుల్‌ లవ్ ఎంటర్‌టైనర్‌ ‘మిస్టర్‌ మజ్ను’. ఈ చిత్రం  జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న సందర్భంగా  ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ హైదరాబాద్‌ జె ఆర్ సి కన్వెన్షన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ విడుదల చేసిన ‘Mr మజ్ను’ థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడమే కాక విడుదలైన 3 గంటల్లోనే 1  మిలియన్ వ్యూస్, 12  గంటల్లో 2 మిలియన్ వ్యూస్, 15 గంటల్లోపే 3 మిలియన్ వ్యూస్  సాధించి దూసుకెళ్తోంది. ఇదే వేదిక పై ‘Mr మజ్ను’ తొలి టికెట్‌ను కింగ్‌ నాగార్జున చేతుల మీదుగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కోనుగోలు చేశారు. టికెట్ అందుకుంటున్నప్పుడు ఎన్టీఆర్‌ స్వయంగా జేబులోనుంచి 2 వేల నోటు తీసి నాగార్జున చేతికి ఇచ్చి ఈ టికెట్ కొనడం విశేషం. ఈ సందర్భంగా…

కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ – ”ఎన్టీఆర్‌ మా పెద్ద పెద్దబ్బాయి. తను నన్ను ఎంతో ఆప్యాయంగా బాబాయ్‌ అని పిలుస్తుంటాడు. అలా అన్నప్పుడల్లా సంతోషంగా అనిపిస్తుంది. ఈ వేడుకకి వచ్చినందుకు తారక్‌కి థాంక్స్‌. అఖిల్‌, తారక్‌ నుండి యాక్టింగ్‌ తో పాటూ మాస్‌ నేర్చుకోవాలి. బివిఎస్ఎన్‌ ప్రసాద్‌ గారికి నిర్మాతగా 25వ సినిమా. ఇండస్ట్రీలో ‘మగధీర’, ‘అత్తారింటికి దారేది’ వంటి రెండు బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఆయన ప్రొడక్షన్‌లో అఖిల్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. తమన్‌ తాతగారు ఘంటసాల బలరామయ్యగారు, ఎక్కడో నాన్నగారిని రైల్వేస్టేషన్‌లో చూసి ఆర్టిస్ట్‌గా పనికొస్తావని చెన్నైకు తీసుకెళ్లారు. తమన్‌ ఈ సినిమాకు పని చేయడం చూస్తుంటే ఓ సర్కిల్‌ పూర్తయినట్లుగా ఉంది. వెంకీ అట్లూరి, మా సినిమాలను చూసి ఇన్‌స్పైర్‌ అయ్యి ఇక్కడకు వచ్చాడని తెలిసింది. తొలిప్రేమ సినిమా  చూశాను. లవ్‌స్టోరీకి ఏ అంశాలు కావాలో వెంకీ బాగా తెలుసు. నవ్వించడం, ఏడిపించడం, ప్రేమించడం వెంకీకి  బాగా తెలుసు. పాటలు బావున్నాయి. కొన్ని సీన్స్‌ చూశాను. చాలా బావున్నాయి. సినిమా తప్పకుండా హిట్‌ అవుతుంది. మజ్ను టైటిల్‌ నాన్నగారి టైటిల్‌.. తర్వాత నా దగ్గరికి వచ్చింది. ఆ రెండు సినిమాలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో, ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ – ”నాగార్జునగారిని నేను బాబాయ్‌ అని పిలిస్తే.. ఆయన నన్ను అబ్బాయ్‌ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. ఇక్కడకు గెస్ట్‌లా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిలా వచ్చాను. ఇక్కడ కేవలం బాబాయ్‌, చైతు, అఖిలే కాకుండా సినిమాకు పనిచేసిన చాలా మంది నాకు చాలా కావాల్సిన వాళ్లు. ఆ వరుసలో ముందుగా బివిఎస్ఎన్‌ ప్రసాద్‌ గారు ఉంటారు. ఓ మంచి సినిమా తీయాలంటే నిర్మాతకు వ్యామోహం ఉంటే సరిపోదు. వ్యాపారం కూడా తెలిసి ఉండాలి. వ్యాపారం తెలిస్తే, ఓ సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలి?. దాన్ని ఎలా మార్కెట్‌ చేయాలి? అది హిట్‌ అయిన తర్వాత మనం కూడా ఎలా డబ్బులు సంపాదించుకోవాలి? అనేది తెలుస్తుంది. వ్యామోహం ఉన్నప్పుడు ఈ సినిమాను ఎంత అద్భుతంగా తెరకెక్కించాలి. ప్రేక్షక దేవుళ్లకు అందించాలనేది తెలుస్తాయి. కాబట్టి నిర్మాతకు వ్యామోహం, వ్యాపారం రెండూ తెలియాలి. నేను ఈ బ్యానర్‌లో ‘ఊసరవెళ్లి’, ‘నాన్నకు ప్రేమతో’  రెండు సినిమాలు చేశాను. ‘ఊసరవెళ్లి’ సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా. ‘నాన్నకు ప్రేమతో’ నాకు బాగా దగ్గరైన సినిమా. ప్రసాద్‌గారిని చాలా దగ్గరగా గమనించాను. ఆయనకు వ్యాపారం తెలియదు. సినిమా అంటే ఆయనకు వ్యామోహం. అదే ఆయనలో గొప్ప లక్షణం.

సంపాదించిన ప్రతి రూపాయిని తిరిగి చలనచిత్ర సీమకే అందించే గొప్ప నిర్మాత. అలాంటి నిర్మాత పది కాలాల పాటు సుఖంగా ఉండాలి. పది కాలాల పాటు మంచి చిత్రాలను మనకు అందిస్తూ సంతోషంగా ఉండాలి. ‘ప్రసాద్‌గారు కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందండీ’.. అంటే. ‘పర్లేదు బాబు.. ఇది కాకపోతే మరో సినిమా. నా జీవితం సినిమా ఇండస్ట్రీకే అంకితం’ అని చెప్పిన వ్యక్తి ఆయన. ఇలాంటి నిర్మాత సుఖంగా పది కాలాల పాటు ఉండి మరిన్ని మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. “మిస్టర్‌ మజ్ను”అనే సినిమా ఆయన కెరీర్‌లో మైలురాయి కావాలి. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్‌ ఉండేవాళ్లు. వాళ్ళలో వెంకీ ఒకడు. తను నాకొక నటుడిగా పరిచయం. తర్వాత రచయితగా పరిచయం. తర్వాత దర్శకుడిగా పరిచయమైయ్యాడు. నేను వెంకీకి కూడా చెప్పని మాట ఒకటుంది. తను నటుడిగా చేశాడు, రైటర్‌ అంటున్నాడు.. ఇప్పుడు దర్శకుడు అంటున్నాడు. నాకు తనలో చిన్న కన్‌ఫ్యూజన్‌ కనపడేది. తను రాణించకపోతే ఏం చేస్తాడు? అనే బెరుకు, భయం ఉండేది. అందుకు కారణం తను నాకు బాగా కావాల్సిన వ్యక్తి. సుదీర్ఘమైన తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో ప్రేమకథలు వచ్చాయి. ఎందరో ఎన్నో ప్రేమకథలు రాశారు… నటించారు. మళ్లీ ప్రేమకథ అంటున్నాడు. ‘తొలిప్రేమ’అనే టైటిల్‌ను పెట్టుకున్నాడు. కొత్తగా ఏం చూపిస్తాడనే టెన్షన్ ఉండేది. తొలిప్రేమ చూసిన తర్వాత తనను చూసి గర్వపడ్డాను. ఆషామాషీ విషయం కాదు. ఫైట్స్‌ ,  డ్యాన్సులు పెట్టి కమర్షియల్‌ సినిమా చేయడం కంటే కేవలం కథా బలంతో, నటీనటుల బలంతో ఓ కథను తెరకెక్కించడం చాలా కష్టమైన పని. తొలి చిత్రంతో అది సాధించాడు. తను ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన పనిలేదు. వెంకీ జీవితంంలో ఎంతో సాధించాలి. సాధిస్తాడు. అయితే “మిస్టర్‌ మజ్ను”తన కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అవుతుంది. అలాగే ‘బృందావనం’ చేసే సమయం నుండి తమన్‌తో పరిచయం ఉండేది. తనతో ఎన్నో చిత్రాలకు కలిసి పనిచేశాను. తన చుట్టూ చాలా నెగిటివిటీ ఏర్పడింది. అది చూసి నాకు చాలా బాధ కలిగేది. ఎందుకంటే తన పొటెన్షియల్‌ ఏంటో నాకు తెలుసు. ‘దేవుడా! తనకు ఏదో ఒకరోజు ఓ అవకాశం రావాలి. తను కదంతొక్కుకుంటూ పైకి రావాలి’ అని అనుకుంటున్న సమయంలో ‘తొలిప్రేమ’ సినిమా వచ్చింది. తర్వాత ‘అరవింద సమేత’లో తనతో దగ్గరగా ఉండి పనిచేసినప్పుడు తమన్‌ ఇక వెనక్కి తిరిగి చూడడనిపించింది. అందుకు ఇప్పుడు” మిస్టర్‌ మజ్ను” మరో ఉదాహరణ. తమన్‌ ఫెంటాస్టిక్‌ మ్యూజిక్‌ అందించాడు. తను ఇంకా గొప్ప చిత్రాల్లో పనిచేయాలని కోరుకుంటున్నాను. ఇక నా తమ్ముడు అఖిల్‌ గురించి చెప్పాలంటే.. ఓ నటుడికి ముఖ్యంగా కావాల్సిన ఆత్మ విమర్శ గుణం అఖిల్‌లో ఉన్నట్లు ఎవరికీ ఉండదు. ఆత్మ విమర్శ చేసుకోవాలంటే దమ్ముండాలి. ఎన్నోసార్లు తనని తాను ఆత్మ విమర్శ చేసుకుంటూ, తనని తాను మార్చుకుంటూ, తన పంథాని తాను మార్చుకుంటూ ఈ మజిలీకి చేరాడు. ఈ రోజు నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి ‘అఖిల్‌ విల్‌ బికమ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్‌ యాక్టర్స్’. నేను కూడా మీ అందరితో పాటు ఆరోజు కోసం వెయిట్‌ చేస్తుంటాను. ఆరోజు ఎంతో దూరంలో లేదు. దగ్గర్లోనే ఉంది. అది మిస్టర్‌ మజ్ను అనే చిత్రంతో తెలుస్తుంది. ఈ చిత్రం, అఖిల్‌ కెరీర్‌లో ఒక గొప్ప చిత్రంగా మిగలాలి అని ఆ దేవుడ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బివిఎస్ఎన్‌ గారికి వెనుక ఉండే బాపినీడు, నా ఆప్తమిత్రుడు, నాకెంతో కావాల్సిన వ్యక్తి.  వాళ్ళ నాన్నకి వెనక తోడుగా ఉండేది మా బాపినీడే.   ఈ సినిమా అద్భుత చిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు” అన్నారు.

అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ – ”వెంకీ అట్లూరి అఖిల్‌కు చాలా చక్కటి టైటిల్‌ పెట్టాడు. తను ఫైట్స్‌ బాగా చేస్తాడు. డ్యాన్సులు బాగా చేస్తాడని మనకు తెలుసు. తనని పూర్తి స్థాయి లవ్‌స్టోరీలో చూడాలని ఉండేది. తన బాడీ లాంగ్వేజ్‌కి లవ్‌స్టోరీస్‌ చక్కగా సూట్‌ అవుతుందనిపించింది. ఇప్పుడు వెంకీ అలాంటి లవ్‌స్టోరీ చేశాడు. యంగ్‌ డైరెక్టర్స్‌ తొలి సినిమాతో ఓ మార్క్‌ని సెట్‌ చేసుకుంటారు. గత ఏడాది వెంకీ ‘తొలిప్రేమ’తో అలాంటి మార్క్‌ సెట్‌ చేసుకున్నాడు. గత ఏడాది విడుదలైన చిత్రాల్లో ‘తొలిప్రేమ’ నా ఫేవరేట్‌ మూవీ. నటీనటులను ప్రెజెంట్‌ చేయడంలో కానీ.. మ్యూజిక్‌లో కానీ.. రైటింగ్‌లో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు. అలాగే “మిస్టర్ మజ్ను”ని కూడా కేర్‌ తీసుకుని తెరకెక్కించాడు. థమన్‌ అద్భుతమైన పాటలను అందించాడు. ప్రతి సినిమాకు కొత్త తరహా మ్యూజిక్‌ అందిస్తున్నాడు. నిధికి ఈ సినిమాతో పెద్ద సక్సెస్‌ దక్కుతుందని భావిస్తున్నాను. తెలుగులో చాలా పెద్ద సక్సెస్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ప్రసాద్‌గారు.. ఆయన నిర్మాణంలో “మిస్టర్‌ మజ్ను”సినిమా రూపొందడం ఆనందంగా ఉంది. అఖిల్‌కు సపోర్ట్‌ చేయడానికి వచ్చిన ఎన్టీఆర్‌కి థాంక్స్‌” అన్నారు.

అఖిల్‌ అక్కినేని మాట్లాడుతూ – ”సినిమాను మొదలు పెట్టి సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయాలంటే మంచి నిర్మాత కావాలి. ఈ సినిమాకు గాడ్‌ఫాదర్‌ బివిఎస్ఎన్‌. ప్రసాద్‌గారు. మా తాతగారితో సినిమా చేసిన ఆయన నన్ను నమ్మి సినిమా చేసినందుకు ఆనందంగా, గర్వంగా ఉంది. ప్రతి సినిమాకు కష్టాలుంటాయి. కష్టాలు ముఖ్యం కాదు. వాటిని ఎలా దాటుతామనేదే ముఖ్యం. మా డైరెక్టర్‌ వెంకీకి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ సహా అందరికీ థాంక్స్‌. తమన్‌ ఆరు అమేజింగ్‌ సాంగ్స్‌ను అందించాడు. ఈ ఆల్బమ్‌ నాకు ఎంతో స్పెషల్‌. శేఖర్‌ మాస్టర్‌గారు.. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఇక డైరెక్టర్‌ వెంకీ నాకు మంచి ఫ్రెండ్‌. మూడేళ్ల క్రితం నాకు తను ఈ స్క్రిప్ట్‌ చెప్పాడు. మూడో సినిమాకు ఈ స్క్రిప్ట్‌ కరెక్ట్‌, వెయిట్‌ చేస్తావా? అన్నాను. తను సరేనని వెయిట్‌ చేసి ఇప్పుడు సినిమా తీశాడు. తను నాకు పెద్ద ఫ్యాన్‌. నా కోసం వెయిట్‌ చేసినందుకు తనకు థాంక్స్‌. నా మెంటర్‌, గైడ్‌ నాన్నగారే. ఆయన నాకు స్నేహితుడు.. పెద్దన్నయ్యతో సమానం. ఆయన ఇచ్చే సపోర్ట్‌, ఇచ్చే గైడెన్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన లేకుంటే ఈ సినిమా లేదు. ఎన్టీఆర్‌ని నేను టైగర్‌ అనే పిలుస్తాను. నిజంగా ఆయన టైగర్‌. ఎందుకంటే ఆయన ఎనర్జీని ఎవరూ మ్యాచ్‌ చేయలేరు. తారక్‌గారు అంటే ఆయన తట్టుకోలేరు. తారక్‌కి ఇక్కడ వచ్చినందుకు థాంక్స్‌. తను ఈ ఫంక్షన్‌కి వస్తున్నానని చెప్పగానే తనకు థాంక్స్‌ మెసేజ్‌ పంపాను. ‘అరే అలా ఫార్మల్‌గా ఉండకు. ఇది నా బాధ్యత’ అని తను అన్నాడు. అక్కినేని అభిమానులకు, ఎన్టీఆర్‌ అభిమానులకు థాంక్స్‌. మీరే మా ధైర్యం, మా అండ” అన్నారు.

చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ – ”తారక్‌ సార్‌ ఏ ఫంక్షన్‌కి వచ్చినా పాజిటివ్‌ వైబ్స్‌ కమ్ముకుంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి వాతావరణం కనపడుతుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌గారికి థాంక్స్‌. సినిమా గురించి చెప్పాలంటే, నేను అక్కినేని అభిమానిని. నేను థియేటర్‌లో చూసిన తొలి సినిమా ‘శివ’ ఆ సినిమాలో చైన్‌లాగడం చూసి నేను కూడా చైన్‌ లాగితే గ్రీజు అంటుకుంది కానీ.. చైన్‌ రాలేదు. ‘ప్రేమ్‌నగర్‌’ను చూసి అలాంటి ఓ సినిమా చేయాలనుకున్నాను. అందుకే ఆ సినిమాలో ఇంపార్టెంట్‌ డైలాగ్‌, ‘ఎక్స్క్యూజ్ మీ మిస్’ ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్‌కు పెట్టాం. థమన్‌, జార్జ్‌, సతీష్‌, అవినాష్‌ నవీన్‌, శేఖర్‌ మాస్టర్‌, ఆది, రాజా, ప్రియదర్శి, శ్రీమణి.. ఇలా అందరం హార్ట్‌ పెట్టి పనిచేశాం. సినిమా రేంజ్‌ ఏంటో చెప్పలేను కానీ.. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మా ప్రయత్నాన్ని సపోర్ట్‌ చేయాలని కోరుతున్నాం” అన్నారు.

హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ మాట్లాడుతూ – ”నాగార్జునగారికి, ఎన్టీఆర్‌గారికి, చైతన్యకి, అఖిల్‌కి థాంక్స్‌. తమన్‌ మ్యూజిక్‌, జార్జ్‌ విజువల్స్‌కు థ్రిల్‌ అయ్యాను. నాకు అవకాశం ఇచ్చిన వెంకీకి థాంక్స్‌” అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.థమన్‌ మాట్లాడుతూ – ”జీవితంలో నమ్మకం అనేది చాలా ముఖ్యం. అలాంటి నమ్మకాన్ని నాపై పెట్టుకున్న దర్శకుడు వెంకీకి థాంక్స్‌. ఆ భయంతోనే ఈ సినిమాకు మ్యూజిక్‌ అందించాను. శ్రీమణి ట్యూన్‌కు తగినట్లు సాహిత్యాన్ని అందించాడు. ఆల్బమ్‌ను సక్సెస్‌ చేసిన అందరికీ థాంక్స్‌. బెస్ట్‌ ఔట్‌ పుట్‌ ఇచ్చాం. జనవరి 25 వరకు వెయిట్‌ చేయాలంటే కష్టంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇక ఎన్టీఆర్‌.. నాకు తెలిసి ఆయన ప్రేమ చాలా గొప్పది. నాపై నమ్మకంతో ‘అరవిందసమేత’ సినిమా ఇచ్చారు. ఆయనకు థాంక్స్‌” అన్నారు.

పాటల రచయిత శ్రీమణి మాట్లాడుతూ – ”తమన్‌తోగారి మ్యూజిక్‌లో పాటలు రాయడం చాలా హ్యాపీ. వెంకీ అట్లూరిగారు అన్ని సిచ్యువేషన్స్‌కు తగ్గట్టు లిరిక్స్‌ రాయించుకున్నారు. అలాగే బివిఎస్ఎన్‌ ప్రసాద్‌గారికి థాంక్స్‌” అన్నారు.

ప్రియదర్శి మాట్లాడుతూ – ”అఖిల్‌ 25న సందడి చేయబోతున్నారు. అవకాశం ఇచ్చిన ప్రసాద్‌గారికి, వెంకీ అట్లూరికి థాంక్స్‌” అన్నారు.


దర్శకరత్న డాక్టర్ దాసరి విగ్రహావిష్కరణ


దర్శకరత్న డాక్టర్ దాసరి విగ్రహావిష్కరణ

– – – – – – – – – – – – – – – – –

శతాధిక చిత్ర దర్శకులు కీర్తిశేషులు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ మహోత్సవం 26 – 01 – 2019న “దాసరి విగ్రహ నిర్మాణ కమిటీ ” ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పాలకొల్లులో జరగనుంది. చలనచిత్ర, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొనే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో దాసరి నారాయణరావు ప్రియ శిష్యులు, సుప్రసిద


ఇండియా, పాకిస్థాన్ బోర్డర్ లో గోపీచంద్, డైరెక్టర్ తిరు , ఏకే ఎంటర్టైన్మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం..!!

ఇండియా, పాకిస్థాన్ బోర్డర్ లో గోపీచంద్, డైరెక్టర్ తిరు , ఏకే ఎంటర్టైన్మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం..!!

యాక్ష‌న్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ సోమవారం ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ జైసల్మేర్ లో ప్రారంభమయ్యింది.. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ భారీ ఫైట్ సీక్వెన్స్ తో మొదలవగా, యాక్షన్ డైరెక్టర్ సెల్వన్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నారు.. యాభై రోజు ల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో రాజస్థాన్, న్యూ ఢిల్లీ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరపనున్నారు.. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా, వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై ప్రొడక్షన్ నెంబర్ 18 గా అనిల్ సుంకర ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.. వేసవి కానుకగా మే లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..

నటీనటులు : గోపీచంద్

సాంకేతిక నిపుణులు :
కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం: తిరు
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకే ఎంటర్టైన్మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి
సహ నిర్మాతలు: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి
రచయిత: అబ్బూరి రవి
ఆర్ట్: రమణ వంక
కో డైరెక్టర్ : దాసమ్ సాయి, రాజ్ మోహన్
పబ్లిసిటీ ఇన్ ఛార్జ్ : విశ్వా CM
పి.ఆర్.ఓ : వంశీ శేఖర్


LOVERS DAY movie audio event news


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
ముఖ్య అతిథిగా
ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన ‘లవర్స్ డే ‘ ఆడియో రిలీజ్ వేడుక

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘ఒరు ఆడార్ ల‌వ్‌ ‘ ప్రచార చిత్రంలో కొంటెగా కంటి సైగతో మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అంతేకాకుండా 2018లో గూగుల్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో ఒకరిగా ఓ ఘనతను సాధించింది. `ఒరు ఆడార్ ల‌వ్‌`లో కేవ‌లం 27 సెక‌న్ల పాటు ఆమె చేసిన క‌నుసైగ‌కు రెండు రోజుల్లోనే 45 ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి. ఇప్ప‌టికి రెండు కోట్ల మంది ఆ వీడియో చూశారు.

ఇలా ప్రస్తుతం యూత్‌ను విశేషంగా ఆకట్టుకొన్న ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన ‘ఒరు ఆడార్ ల‌వ్‌ ‘ చిత్రం తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో విడుదలకు సిద్ధమైంది. మలయాళంలో క్రేజీ డైరెక్టర్ ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి సుఖీభ‌వ సినిమాస్ బ్యానర్‌పై ప్రేమికుల దినం రోజు అంటే ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మలయాళ వెర్షన్ కూడా అదే రోజున విడుదల కానుంది .

ఇప్పటికే ‘లవర్స్ డే’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. ప్రచార కార్యక్రమంలో భాగంగా ‘లవర్స్ డే ‘ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జనవరి 23న వైభవంగా నిర్వహించేందుకు నిర్మాతలు గురురాజ్, వినోద్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

‘‘లవర్స్ డే ‘ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు ఆహ్వానించిన వెంటనే అల్లు అర్జున్ మా కోరికను మన్నించి ఒప్పుకొన్నారు. ఆయన రానుండటంతో మా సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. మా ఆహ్వానాన్ని సహృదయంతో అంగీకరించిన అల్లు అర్జున్‌కు మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నామని’’ నిర్మాతలు గురురాజ్, వినోద్ రెడ్డి తెలిపారు.

న‌టీన‌టులు: నూరిన్ షెరిఫ్‌, రోష‌న్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, మైఖేల్ యాన్ డేనియ‌ల్‌, దిల్‌రూపా, హ‌రీష్ పెరుమ‌న్న‌, అనీష్ జి మీన‌న్‌, షాన్ సాయి, అర్జున్ హ‌రికుమార్‌, అతుల్ గోపాల్‌, రోష్న అన్‌రాయ్ త‌దిత‌రులు.

సాంకేతిక నిపుణులు:
కెమెరా : శీను సిద్ధార్థ్‌
ఎడిటింగ్‌: అచ్చు విజ‌య‌న్‌
సంగీతం: షాన్ రెహ‌మాన్‌
స్క్రీన్‌ప్లే: సారంగ్ జ‌య‌ప్ర‌కాష్‌, లిజో ప‌నాడా
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఒమ‌ర్ లులు
నిర్మాత‌లు: ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి


Adhiroh Creative Signs llp Launched at Rama Naidu Studios.

Adhiroh Creative Signs llp – Production No.1 Launched

Adhiroh Creative Signs is a new production house, based in Hyderabad., started their first venture to day at 10.00 am at Rama Naidu Studios.

Producers sri Allu Aravind, Gemini kiran, sharrath Marar, sreenivasaraju, Directors Chandra siddhardha, Karunakaran, kishorePardhasani(dali), jonnalagadda sreenivasaravu, sreeraam balaji, Musi Director koti an sri Professor G,Sreeraamulu Participated for this grand gala function and wished the unit for the grand success.

The hero of the film is Udayshankar of ‘Aata Gadara Shiva’ (Telugu) fame and the heroine is Aishwarya Rajesh of ‘Kaka Muttai’ (Tamil) and ‘Kanna’ (Tamil) fame, (she is the daughter of late Actor Rajesh). Director NV Nirmal Kumar is debuting in Telugu. He has directed the Tamil superhit film ‘Salim’, ftg Vijay Anthony. The Cinematographer is Ganesh Chandrra. The story is by Bhupathi Raja, a story writer of many a hit fame.

Adhiroh Creative Signs is introducing a new Music Director Gifton Elias through this film.

The storyline of the film is a holistic family entertainer with a sports element being dealt with.

The film started rolling from today and shall continue in various schedules running through the months of January, February, March and April.

The locales would be in both the Telugu States culminating with a schedule to be shot abroad.

The remaining cast is Sanjay Swarup, Pradeep Rawat, Roopa Lakshmi and others.
Crew; Dialogues Rajendra Kumar and Madhu, Lyrics by Sri Seetharama Sastri and Suddala Ashoka Teja, Art Direction by Manivasagam

Producers – G.Sriram Raju, Bharat Ram

Director: Nv. Nirmal kumar

క్రీడల నేపథ్యంలో ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్ జంటగా ‘అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ తొలి చిత్రం ప్రారంభం’

నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ తమ తొలి చిత్రాన్ని నేడు ప్రారంభించింది. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రం నేడు హైదరాబాద్ లోని రామానాయుడు స్థూడియో లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయింది.

రామా నాయుడు స్థూడియోలో వైభవంగా ప్రారంభమైన ఈ చిత్రం వేడుకకు ప్రముఖ నిర్మాత శ్రీ అల్లు అరవింద్, జెమిని కిరణ్,శరత్ మరార్, ప్రముఖ దర్శకులు చంద్ర సిద్దార్ధ, కరుణాకరన్, కిషోర్ పార్ధసాని (డాలి), జొన్నలగడ్డ శ్రీనివాసరావు, శ్రీరామ్ బాలాజీ, సంగీత దర్శకుడు కోటి, ప్రొఫెసర్ జి. శ్రీరాములు తదితరులు విచ్చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్నో ఘనవిజయం సాధించిన చిత్రాలకు కధలందించిన ప్రముఖ రచయిత భూపతిరాజా ఈ చిత్రానికి కథ నందించారు. గిఫ్టన్ ఇలియాస్ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్నారు. క్రీడల నేపథ్యంలో సాగే వినోదభరితమైన కుటుంబ కధా చిత్రమిదని దర్శకుడు ఎన్ వి.నిర్మల్ కుమార్ తెలిపారు.

నేడు ప్రారంభమైన ఈ చిత్రం ఈ నెల మరియు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే వివిధ షెడ్యూల్స్ లో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది అని చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రదేశాలలోను, విదేశాలలోను ఈ చిత్రం కథానుసారం షూటింగ్ ను జరుపుకుంటుంది అని తెలిపారు నిర్మాతలు.

చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం.

నిర్మాతలు:జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్
దర్శకత్వం: ఎన్ వి. నిర్మల్ కుమార్


చిరంజీవి క్లాప్ తో ఘనం గా ప్రారంభమయిన పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం..!!

చిరంజీవి క్లాప్ తో ఘనం గా ప్రారంభమయిన పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం..!!

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ రామనాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి , నిర్మాత అల్లు అరవింద్ ,నాగబాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ముఖ్య అతిధులుగా విచ్చేయగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రులు శివప్రసాద్, విజయ దుర్గ, చిరంజీవి తల్లి అంజనాదేవి, మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల హాజరయ్యారు.. కాగా మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ని ప్రారంభించగా, అల్లు అరవింద్ కెమెరా స్విచాన్ చేశారు.. నాగబాబు , అల్లు అర్జున్ స్క్రిప్ట్ ని అందజేశారు.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా మార్చి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది..

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. మైత్రి మూవీస్ సంస్థ గురించి , ఆ సంస్థ సాధించిన విజయాల గురించి అందరికి తెలిసిందే.. కొత్త వారి ప్రతిభను ప్రోత్సహించే దిశగా సుకుమార్ రైటింగ్స్ సంస్థ ద్వారా సుకుమార్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను.. రామ్ చరణ్ తో చేసిన ‘రంగస్థలం’ సినిమా తో ఈ సంస్థతో , సుకుమార్ గారితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది..మంచి మనసున్న వ్యక్తులు ఈ సంస్థ నిర్మాతలు.. వీరికి సుకుమార్ కలిసి వైష్ణవ్ తేజ్ తో ఓ మంచి సినిమా ను తీయబోతున్నారు.. ఇంతచక్కటి అవకాశం ప్రారంభంలోనే లభించడం అదృష్టం..ఇలాంటి వారి అండదండలతో , వారు ఇస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.. డైరెక్టర్ బుచ్చి బాబు చాల కొత్త కథ రాశాడు.. చాల ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి.. ఈ కథను నాకు నేరేట్ చేసినప్పుడు రస్టిక్ ఎలిమెంట్స్ కనిపించాయి.. రస్టిక్ అనగానే రంగస్థలం గుర్తుకువస్తుంది.. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు.. రంగస్థలం కథ చర్చల్లో బుచ్చిబాబు పాత్ర చాల ఉందని సుకుమార్ చాల సార్లు చెప్పారు..మరి అంత మంచి టాలెంట్ ఉన్న బుచ్చిబాబు ఈ కథని తయారుచేయడంలో చాల కష్టపడ్డారు.. ఎంతో కృషి చేసి ఈ కథతో మా అందరిని ఆకట్టుకున్నాడు..
బుచ్చిబాబు మనసు పెట్టి రాసిన కథ..అలాంటి బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు, వారిందరి మన్నననలు తప్పకుండా పొందుతాడు అని చెప్పగలను..ఈ సందర్భంగా యువ దర్శకునికి అల్ ది బెస్ట్ చెప్తున్నాను.. పెద్ద మనసున్న డైరెక్టర్ సుకుమార్.. తాను మాత్రమే ఎదగాలని కాకుండా తనతో పాటు ఇతరులు ఎదగాలని సుకుమార్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. అలాంటి పెద్ద మనసున్న సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు..

నిర్మాత అల్లుఅరవింద్ మాట్లాడుతూ..ఈ సినిమా డిఫరెంట్ గా ఉంటుందని సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాలో భాగమైనప్పుడే అర్థమయ్యింది.. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ అయన శిష్యుడు బుచ్చిబాబు చేస్తున్న మంచి సినిమా ఇది.. ఇందులో నటిస్తున్న వైష్ణవ్ , మనీషా కు కంగ్రాట్స్.. మైత్రి మూవీ మేకర్స్ మంచి బ్యానర్.. ఖర్చుకు వెనకాడకుండా డైరెక్టర్ కి అడిగిందల్లా ఇచ్చే మంచి నిర్మాణ సంస్థ.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తోడయ్యి సినిమా స్టామినా ను పెంచేసింది.. సినిమా కు పనిచేస్తున్న అందరికి అల్ ది బెస్ట్ అన్నారు..

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. మైత్రి మూవీస్ తో కలిసి ఈ సినిమా చేస్తున్నందుకు చాల ఆనందంగా ఉంది.. నా శిష్యుడు ఈ సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది.. అద్భుతమైన కథ రాశాడు.. ఒక్క సిట్టింగ్ లోనే ఒకే చేసిన కథ ఇది..బుచ్చిబాబు గొప్ప డైరెక్టర్ అవుతాడని ఖచ్చితంగా చెప్పగలను.. వైష్ణవ్ కోసమే ఈ కథ పుట్టింది.. కథ రాస్తున్నప్పుడే వైష్ణవ్ అని ఫిక్స్ అయ్యాడు.. వేరే ఆప్షన్స్ చూడమన్నా వైష్ణవ్ ఈ సినిమా కి న్యాయం చేయగలడు అని ఒప్పించాడు.. ఈ ప్రాజెక్ట్ ఇంతదూరం రావడానికి కారణం ఈ సినిమా కథే.. మైత్రి మూవీ మేకర్స్ వారికి చాల థాంక్స్..పెద్ద పెద్ద సినిమాలు నిర్మిస్తున్నా ఇలాంటి కొత్త సినిమా చిన్న సినిమా ను నిర్మించడం వారికే చెల్లింది.. కొత్తమ్మాయి మనీషా తెలుగమ్మాయి.. చాల మందిని టెస్ట్ చేసి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశాడు.. ఒక మంచి అమ్మాయి సినిమా కు ఎంపిక అయ్యింది.. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్న దేవిశ్రీప్రసాద్ కి చాలా థాంక్స్.. ఈ సినిమా ఆల్బం ఓ రేంజ్ లో ఉంటుంది.. తప్పకుండా చెప్పగలను.. వైష్ణవ్ కి మంచి ఫ్యూచర్ ఉంది.. కళ్యాణ్ గారి తర్వాత ఆయనంత సింప్లిసిటీ ఉంది వైష్ణవ్ కే.. ఈ సినిమా హిట్ తో వైష్ణవ్ కి మంచి సినిమా లు రావాలని కోరుకుంటున్నాను.. ఈ కథ ఇంత బాగా రావడానికి మెగాస్టార్ చిరంజీవి గారే కారణం. ఈ సినిమా కోసం చాలా సమయం కేటాయించి, ఇన్ పుట్స్ ఇచ్చి ఇంత బాగా కథ రావడానికి ఆయనే ముఖ్య కారణం.. అన్నారు..

సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. మైత్రి మూవీస్ నాకు హోమ్ బ్యానర్ అయ్యింది.. ఈ బ్యానర్ లో ఏ సినిమా వచ్చినా, నేను మ్యూజిక్ చేసినా చేయకపోయినా సినిమా గురించి నాతో డిస్కస్ చేస్తారు.. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కూడా ఈ సినిమా లో భాగమవుతున్నందుకు ఆనందంగా ఉంది.. రెండు బ్యానర్స్ తో నాకు చాలా దగ్గర అనుబంధం ఉంది. బుచ్చిబాబు గారితో నాకు చాలారోజులనుంచి పరిచయం..సుకుమార్ గారితో చేస్తున్నప్పటినుంచి అయన తెలుసు.. ఎదుటి వ్యక్తి గురించి చాలా మంచి గా మాట్లాడే వ్యక్తుల్లో సుకుమార్ గారు ఫస్ట్ ఉంటారు అని నా అభిప్రాయం.. సుకుమార్ గారిని ఓ కథతో ఒప్పించడమే బుచ్చిబాబు ఆస్కార్ కొట్టినంత పనిచేశాడు.. ఈ సినిమా నేను చేయడానికి కారణం సుకుమార్ గారే.. బుచ్చిబాబు గారు ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఈ సినిమా తప్పకుండ చేయాలనిపించింది.. ఏ కథైనా విన్నప్పుడు డిఫరెంట్ కథ, కొత్త కథ అంటాం కానీ ఈ కథ అంతకుమించిన డిఫరెంట్ స్టోరీ.. బిగినింగ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నాయి.. తప్పకుండా ఈ సినిమా కు మంచి మ్యూజిక్ ఇస్తాను.. మెగా హీరోస్ అందరికి మ్యూజిక్ ఇచ్చాను.. చాలా థ్రిల్లింగ్ గా ఉంది.. అందరికి అల్ ది బెస్ట్ అన్నారు..

నిర్మాత నవీన్ యర్నేని మాట్లాడుతూ.. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి, అల్లు అర్జున్ గరుకు, వరుణ్ తేజ్ గారికి, సాయి ధరమ్ తేజ్ గారికి ధన్యవాదాలు.. అందరు చెప్పినట్లు ఇది చాల మంచి కథ.. అద్భుతంగా వచ్చింది.. కథకు కావాల్సిన హీరో హీరోయిన్స్ యాప్ట్ గా దొరికారు.. ఈ సినిమా కు పెద్ద విజయం చేకూరుతుందని అనుకుంటున్నాను.. మీ అందరి ఆశీర్వాదాలు కావలి న్నారు..

దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.. సుకుమార్ సర్ కి చాల థాంక్స్..థాంక్స్ కూడా సరిపోదు.. అంతకు మించి ఎదో చెప్పాలనిపిస్తుంది.. నా మీద నమ్మకం ఉంచిన చిరంజీవి గారికి, మా అమ్మానాన్నలకు చాల థాంక్స్.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్ తో మంచి సినిమా తీస్తాను.. దేవి గారి గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిందేమి ఉండదు.. ఎవరైనా దేవుడు ముందు సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు కానీ నేను మాత్రం దేవి శ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఇవ్వండి సినిమా నిలబెడతాడు అని కోరుకుంటాను.. వైష్ణవ్ గారు ఈ సినిమా కి యాప్ట్ హీరో.. సినిమా చాల బాగుంటుంది.. కొత్తగా ఉంటుంది.. అందరు చూడండి అన్నారు..

నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, మనీషా రాజ్

సాంకేతిక నిపుణులు :
కథ మరియు దర్శకత్వం: బుచ్చి బాబు సానా
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవి శంకర్, మోహన్ చెరుకూరి (CVM)
బ్యానర్లు: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: శాందత్
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ మౌనికా
ఎడిటర్: నవీన్ నూలి