Category Archives: Latest Events

రాజ్‌తరుణ్‌, కొండా విజయ్‌కుమార్‌, కె.కె.రాధామోహన్‌ ల ‘ఒరేయ్‌ బుజ్జిగా…’ ఫస్ట్ లుక్ విడుదల

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా…’ ఈ చిత్రం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయనున్నారు. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాళవిక నాయర్ లతో కూడిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఫిబ్రవరి 10 ఉదయం 10:10 లకు చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ ” మా ‘ఒరేయ్ బుజ్జిగా…’ ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నాం . ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. రాజ్‌ తరుణ్‌ కి తగిన యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సమ్మర్ స్పెషల్ గా చిత్రాన్ని విడుదల చేయనున్నాం. మా బ్యానర్ లో ‘ఏమైంది ఈ వేళ’, ‘అధినేత’, ‘బెంగాల్ టైగర్’, ‘పంతం’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ ఇది. రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్, అనూప్ రూబెన్స్ లకు, మా బ్యానర్ కు తప్పకుండా మా ‘ఒరేయ్‌ బుజ్జిగా…’ చాలా మంచి కమర్షియల్ సినిమా అవుతుంది” అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.


యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ ఎంట్రీ

యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ ఎంట్రీ
‘మా పల్లెలో గోపాలుడు, జెంటిల్‌మెన్, ఒకే ఒక్కడు, జైహింద్, పుట్టింటికి రా చెల్లి, హనుమాన్ జంక్షన్ వంటి సూపర్ సక్సెస్‌పుల్ చిత్రాలతో హీరోగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిరమైన స్థానం పొందిన నటుడు అర్జున్ సర్జా. హీరోగానే కాకుండా దేశభక్తి విషయంలోనూ అర్జున్ ప్రథమస్థానంలో నిలుస్తారు. కాగా, అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ పుట్టినరోజు నేడు (ఫిబ్రవరి 10). ఈ నేపథ్యంలో అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నారు. తన స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్ర పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు

Processed with VSCO with aga1 preset Processed with VSCO with al3 preset

Bheeshma: Sara Sari Song

* ‘భీష్మ’ నుంచి ‘సరాసరి’ గీతం విడుదల
* నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ‘భీష్మ’
* ఫిబ్రవరి 21 న విడుదల

‘భీష్మ’
నితిన్,రష్మిక మందన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’.
ఈ చిత్రంలోని మరో గీతం ఈరోజు అధికారికంగా సామాజిక మాధ్యమం అయిన ‘యు ట్యూబ్’ ద్వారా విడుదల అయింది. హీరో నితిన్, నాయిక రష్మిక మందన బృందంపై చిత్రీకరించిన ఈ గీతానికి శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఈ పాట చిత్రీకరణ జరిగింది. గీత రచయిత శ్రీమణి సాహిత్యానికి, సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చగా, గాయకుడు అనురాగ్ కులకర్ణి గాత్రంలో ప్రాణం పోసుకుందీ పాట. ‘సరాసరి’ పేరుతో విడుదలయిన ఈ గీతానికి సంగీత ప్రియులనుంచి, అభిమానులనుంచి విశేష స్పందన లభించింది. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరి 21 న విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ …ఈ చిత్రం లోని మరో గీతం ఈరోజు విడుదల అయింది. ‘సరాసరి’ పేరుతో విడుదల అయిన ఈ గీతానికి ప్రేక్షకాభిమానులనుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ గీతానికి శేఖర్ మాస్టర్ సమకూర్చిన నృత్య రీతులు అభిమానులను అలరిస్తాయి. ఈ చిత్రం నుంచి విడుదల అవుతున్న ప్రతి గీతానికి ప్రేక్షకాభిమానులనుంచే కాక, సామాజిక మాధ్యమాలలో సైతం విశేషమైన ప్రాచుర్యం లభిస్తోంది. ‘భీష్మ’ చిత్ర కధ,కధనాలు,సన్నివేశాలు,సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ‘భీష్మ’ ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్.. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.

నటీ,నటులు :
నితిన్,రష్మిక మండన,నరేష్,సంపత్,రఘుబాబు,బ్రహ్మాజీ,నర్రా శ్రీనివాస్,వెన్నెల కిషోర్,అనంత నాగ్,శుభలేఖ సుధాకర్,జస్సెన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్,రాజశ్రీ నాయర్,ప్రవీణ తదితరులు నటిస్తున్నారు.
మ్యూజిక్ : మహతి స్వర సాగర్ , డి .ఓ .పి : సాయి శ్రీరామ్ , ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్,
ఎడిటర్ : నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం(వెంకట్ ),
సమర్పణ : పి.డి .వి. ప్రసాద్ ,
ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగ వంశి ,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : వెంకీ కుడుముల.



లక్ష్ లోని ప్యాషన్ ‘వలయం’ ట్రైలర్ లో కనిపించింది- హీరో అడివి శేష్

లక్ష్ లోని ప్యాషన్ ‘వలయం’ ట్రైలర్ లో కనిపించింది
– హీరో అడివి శేష్

లక్ష్ హీరోగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిలిమ్స్ బ్యానర్ పై పద్వామవతి చదలవాడ నిర్మిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘వలయం’. చదలవాడ బ్రదర్స్ సమ ర్పిస్తోన్న ఈ చిత్రం ద్వారా రమేష్ కడుముల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దిగంగన సూర్యవంశీ నాయికగా నటించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీత దర్శకుడు. ఫిబ్రవరి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో జరిగిన కార్యక్రమంలో హీరో అడివి శేష్ ‘వలయం’ ట్రైలర్ ను ఆవిష్కరించారు.

సీనియర్ డైరెక్టర్ కె.ఎస్. నాగేశ్వరరావు మాట్లాడుతూ, “నేను 20 సినిమాలు డైరెక్ట్ చేస్తే, వాటిలో 5 సినిమాలు ఈ బ్యానర్ లోనే చేశాను. లక్ష్ బార్న్ ఆర్టిస్ట్. నేను డైరెక్ట్ చేసిన ‘రిక్షా రుద్రయ్య’లోనే తను తొలిసారి నటించాడు. ‘వలయం’ సూపర్ హిట్ కావాలని ఆశిస్తున్నా” అన్నారు.

నిర్మాత శోభారాణి మాట్లాడుతూ, “ఇంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్ కొత్తగా అనిపించింది. ఇప్పుడు ట్రైలర్ చూశాక సినిమా మీద మరింత ఆసక్తి పెరిగింది. లక్ష్ కొత్తగా కనిపిస్తున్నాడు. అతని బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా కనిపిస్తోంది. అతను డెడికేషన్ ఉన్న నటుడు. ‘వలయం’ బాగా ఆడి నిర్మాతలకు కనక వర్షం కురిపిస్తుందని ఆశిస్తున్నా” అన్నారు.

ఈ సినిమాకు డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు, హీరో లక్ష్ కు థాంక్స్ చెప్పుకుంటున్నానని డైరెక్టర్ రమేష్ కడుముల తెలిపారు.

నటుడు రవిప్రకాశ్ మాట్లాడుతూ అంతా తానే అయ్యి, ఈ సినిమాని లక్ష్ నిర్మించారనీ, ఒక జెన్యూన్ ఫిలింగా ‘వలయం’ను దర్శకుడు రూపొందించారనీ అన్నారు. లక్ష్ చాలా బాగా నటించాడన్నారు.

డైరెక్టర్ నాగు గవర మాట్లాడుతూ, లక్ష్ ఒక విజనరీ యాక్టర్ అనీ, ‘వలయం’ ఆయనకు కంబ్యాక్ లాంటి సినిమా అనీ అన్నారు.

డైరెక్టర్ చంద్రమహేష్ మాట్లాడుతూ ఒకవైపు నిర్మాతగా, మరోవైపు హీరోగా రెండు బాధ్యతల్ని ఈ సినిమాతో లక్ష్ చక్కగా నిర్వర్తించాడని చెప్పారు. టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయన్నారు.

సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ, “ఇది సూపర్బ్ కాన్సెప్ట్ తో చేసిన సినిమా. సస్పెన్స్, థ్రిల్లింగ్, లవ్ ఎలిమెంట్స్ తో డైరెక్టర్ రమేష్ చాలా బాగా తీశారు. ఆయన చాలా క్లారిటీ, మ్యూజిక్ టేస్ట్ ఉన్న డైరెక్టర్. లక్ష్ క్యారెక్టర్ తో పాటు ప్రతి క్యారెక్టర్ కూ ఈ సినిమాలో ప్రాముఖ్యం ఉంటుంది. తప్పకుండా సినిమా ఆడుతుందని ఆశిస్తున్నా” అన్నారు.

చిత్ర సమర్పకుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, “పోసాని కృష్ణమురళికి రైటర్‌గా మా బేనర్‌లోనే ‘అడవి దొర’, ‘వాల్మీకి’ సినిమాలకు అడ్వాన్స్ ఇచ్చాను. కె.ఎస్. నాగేశ్వరరావు మేం నిర్మించిన ‘రిక్షా రుద్రయ్య’ సినిమాతో డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. అదే సినిమాలో మా అబ్బాయి హీరో తమ్ముడిగా నటించాడు. మేం రిలీజ్ చేసిన ‘బిచ్చగాడు’ 20 ఏళ్ల కాలంలో అత్యధిక మార్జిన్‌తో కలెక్షన్లు వసూలు చేసిన సినిమా. లక్ష్ పెద్ద హీరోగా పేరు తెచ్చుకుంటే సంతోషమే కానీ మంచి కొడుకుగా ఉంటే ఇంకా సంతోషం. అతను అడివి శేష్ లాగా సక్సెస్ అవుతాడని ఆశిస్తున్నా” అన్నారు.

హీరో లక్ష్ మాట్లాడుతూ, “నేను శశికాంత్ గా ప్రేక్షకులకు ఇంతదాకా తెలుసు. ఇప్పుడు లక్ష్ గా మీ ముందుకు వస్తున్నా. నేను స్పోర్ట్స్ ఆడేవాడ్ని కాబట్టి టీం ఎఫర్ట్ అనేది ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ‘వలయం’ అనేది నా ఒక్కడి సినిమా కాదు. మా టీం అంతా ఎంతో కష్టపడితే వచ్చిన సినిమా. మా నాన్న నాకో చాన్స్ ఇచ్చారు. ఆయన సపోర్ట్ లేకపోతే మళ్లీ ఇలా వచ్చేవాడ్ని కాదు. ఈ నెల 21న సినిమాని విడుదల చేస్తున్నాం. ఈసారి సక్సెస్ అవుతానని ఆశిస్తున్నా. నా ఫ్రెండ్ శేష్ అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నా” అన్నారు.

హీరో అడివి శేష్ మాట్లాడుతూ, “లక్ష్ నాకు మొదట నైబర్. తర్వాత ఫ్రెండ్ అయ్యాడు. ఒక డ్రీమ్ ఉండటం, ఒక ప్యాషన్ తో పాటు ఒక పెయిన్ ఉండటం, ఆ పెయిన్ తో పనిచేయటం, వాటి ఫలితం, పడిపోవటం.. ఆ అనుభవాలన్నీ నాకు ఉన్నాయి. నిజం చెప్పాలంటే నేను ఫ్రెండ్షిప్, రిలేషన్స్ కన్నా కూడా ప్యాషన్ నే ఎక్కువ నమ్ముతాను. ఆ ప్యాషన్ ఉన్నప్పుడే మనందరం ఉంటాం అనేది నా నమ్మకం. ఆ ప్యాషన్ లక్ష్ లో ఉంది. అది ట్రైలర్ లో కనిపించింది. జెన్యూన్ గా ట్రైలర్ నాకు నచ్చింది. సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అడ్వాన్స్ గా కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నా” అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో నటులు నోయల్, రఘురాం శ్రీపాద, సినిమాటోగ్రాఫర్ రామకృష్ణ కూడా మాట్లాడారు.

తారాగణం:

లక్ష్, దిగంగన సూర్యవంశీ, రవిప్రకాష్, నోయల్, రవివర్మ, చిత్రం శ్రీను, కిరీటి, రఘురాం శ్రీపాద, కృష్ణేశ్వరరావు

సాంకేతిక బృందం:

సంగీతం: శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫీ: రామకృష్ణ ఎస్.

ఎడిటింగ్: ఉపేంద్ర

ఆర్ట్: బ్రహ్మ కడలి

పీఆర్వో: వంశీ-శేఖర్

ప్రొడక్షన్ కంట్రోలర్: శ్రీనివాస్ అక్కినేని

సమర్పణ: చదలవాడ బ్రదర్స్

నిర్మాత: పద్మావతి చదలవాడ

దర్శకుడు: రమేష్ కడుముల

బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిలిమ్స్

రిలీజ్ డేట్: 21 ఫిబ్రవరి 2020


జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో,’ఆర్జీవీ’ చిత్ర ముహూర్తం

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో,’ఆర్జీవీ’ చిత్ర ముహూర్తం

కార్తికేయ చిత్రనిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం సమర్పణలో, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో, మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి నిర్మిస్తున్న ‘ఆర్జీవీ’ చిత్ర ముహూర్తం మరియు పూజా కార్యక్రమాలు ది 09-02-2020న హైదరాబాద్ లో నిర్మాణ సంస్థ కార్యాలయంలో చిత్ర బృందం సమక్షంలో జరిగాయి, ఈ సందర్భంగా నిర్మాత బాల కుటుంబరావు పొన్నూరి మాట్లాడుతూ ఒక విద్యావేత్తగా పాఠాలు చెప్పి మంచిని బోధించే వృత్తిలో ఉన్న తనకు జొన్నవిత్తుల గారు చెప్పిన కథ నచ్చి సామాజిక బాధ్యతగా మొదటిసారి ఈ చిత్ర నిర్మాణానికి పూనుకున్నానని ఒక మంచి చిత్రం అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్రానికి కధా, మాటలు, పాటలు, చిత్రానువాదం సమకూర్చిన దర్శకులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో లో కొందరు వ్యక్తులు స్వేచ్ఛ పేరుతో యువతను తప్పుదోవ పట్టించే భావజాలాన్ని ఒక సిద్ధాంతంలా ఎక్కించడం వల్ల సమాజానికి కలిగే నష్టాన్ని ఒక ఆసక్తికరమైన చిత్రంగా తెరకెక్కిస్తున్నానని, ఈ చిత్రం పిచ్చెక్కించే వినోదంతో పాటు అటువంటి వాళ్లకు పిచ్చి తగ్గించే ఔషధం అవుతుందని, ప్రధాన నటులు, మరియు సాంకేతికనిపుణుల వివరాలు త్వరలో నిర్మాత తెలియజేస్తారని, చిత్రీకరణ కార్యక్రమం మార్చి మొదటివారంలో ప్రారంభిస్తామని తెలియజేసారు.


తెలుగువారి భ‌విష్య‌త్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గేమ్ చేంజ‌ర్ `ఆహా ఓటీటీ` – విజ‌య్ దేవ‌ర‌కొండ‌

తెలుగువారి భ‌విష్య‌త్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గేమ్ చేంజ‌ర్ `ఆహా ఓటీటీ` – విజ‌య్ దేవ‌ర‌కొండ‌

నేటి యువ‌త ఆలోచ‌న‌ల‌ను, అభిరుచికి త‌గిన విధంగా కొత్త కంటెంట్‌తో సినిమా రంగానికి ధీటుగా డిజిట‌ల్ రంగంలో అభివృద్ధి చెందుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇత‌ర భాష‌ల‌కు చెందిన ఓటీటీ ఫ్లాట్‌పామ్స్‌ను మాత్ర‌మే చూశాం. కానీ తొలిసారి 100 శాతం ప‌క్కా తెలుగు కంటెంట్‌ను తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది `ఆహా ఓటీటీ` ఫ్లాట్ ఫామ్‌. తెలుగు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫ్యూచ‌ర్‌లోనే బిగ్గెస్ట్ గేమ్ చేజింగ్ అనౌన్స్‌మెంట్ `ఆహా ఓటీటీ`. శ‌నివారం ఆహా ఓటీటీ ప్రివ్యూ ఫంక్ష‌న్‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ..

న‌వదీప్ మాట్లాడుతూ – “సాధార‌ణంగా మ‌నుషుల మ‌ధ్య ఉండే సంబంధాలు ఈవాళ రోజుల్లో ఎలా ఉన్నాయి? అనే పాయింట్‌తో ఈ మ‌స్తీ వెబ్‌సిరీస్‌ను చేశాం. డైరెక్ట‌ర్ క్రిష్‌గారు దీనికి క‌థ‌ను అందించారు. అన్నీ క్యారెక్ట‌ర్స్ క‌ల్పితాలే. తెలుగు ప్రేక్ష‌కులు కొత్త కాన్సెప్ట్‌ల‌ను ఆద‌రించ‌డంలో ఎప్పుడూ ముందుంటారు. గీతాఆర్ట్స్‌లో ఎలాంటి సినిమాలు వ‌స్తుంటాయో మ‌నం చూసే ఉంటాం. ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అహాలోనూ అలాంటి వైవిధ్యమైన కాన్సెప్ట్‌లు వ‌స్తాయి“ అన్నారు.

జాగ‌ర్ల‌మూడి క్రిష్ మాట్లాడుతూ – “సంతోషం, దుఃఖం, గ‌ర్వం, సిగ్గుప‌డ‌టం, ప్రేమ‌, వాంచ‌, అతృత‌, ఇబ్బంది ప‌డ‌టం ఇలా ప్ర‌తిదీ ఓ ఎమోష‌న్‌. జీవితం అంటేనే ఎమోష‌న్‌. ప్ర‌తిరోజూ మ‌నం ఒక ఎమోష‌న్‌లో ట్రావెల్ చేస్తుంటాం. మ‌స్తీ సిరీస్ అనేది మ‌న జీవితం. ప్ర‌తి వాడి చేతిలో సెల్‌ఫోన్స్ వ‌చ్చేశాయి. ప‌ట్ట‌ణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సిరీస్ ఇది. అనేక జీవితాల స‌మాహారం, స‌మూహమే ఈ మస్తీస్‌. నేను రాసిన వాటిలో ఇదొక బెస్ట్ రైటింగ్ అని చెప్పొచ్చు. నేను పీరియాడిక్ సినిమాలే చేస్తున్నానని అంద‌రూ అంటుంటారు. కానీ సినిమాల్లో క‌న‌ప‌డే క్రిష్ వేరు. లోప‌ల కూడా మ‌రో క్రిష్ ఉంటాడు. నా రైటింగ్‌లోని మ‌రో కోణ‌మే ఈ మ‌స్తీస్‌. ఈ అవ‌కాశం ఇచ్చిన అల్లు అర‌వింద్‌గారికి, రామ్‌గారికి, అజిత్ ఠాగూర్‌కి థాంక్స్‌. అల్లు అర‌వింద్‌గారు నాకు మెంట‌ర్. ఈ మ‌స్తీస్‌కు ఆయ‌న హెడ్ మాస్ట‌ర్‌లా వ్య‌వ‌హ‌రించారు. స్క్రిప్ట్ ముందు నుండి ఆయ‌న ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. ఈ స్క్రిప్ట్‌లో ఏదైనా క్రెడిట్ వ‌స్తే నాకు యాబై శాతం వ‌స్తే.. మిగిలిన యాబై శాతం అర‌వింద్‌గారికి ద‌క్కుతుంది. అజ‌య్ భుయాన్ అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. ఇంత మంచి అవ‌కాశం ఇచ్చినందుకు అంద‌రికీ థాంక్స్‌“ అన్నారు.
అల్లు అర‌వింద్ మాట్లాడుతూ – “ఏడాది క్రితం ఓ మీడియం మ‌న సినిమాల‌ను తినేస్తుందేమో అనే భ‌యంతో ఆహా ఓటీటీ ప్ర‌యాణం మొద‌లైంద‌ని చెప్ప‌వ‌చ్చు. దీన్ని ఓ శ‌త్రువుగా చూడటం క‌న్నా.. దానిలో మంచి త‌నాన్నో మ‌రేదైనా కానీ.. మ‌న అచ్చ తెలుగువారికి తెలుగు కంటెంట్‌ను చూపిస్తే బావుంటుంద‌ని అనుకున్నాను. ఓసారి మై హోమ్ రామేశ్వ‌ర్‌రావుగారితో, రామ్‌తో ఈ విష‌యం గురించి మాట్లాడితే.. వాళ్లు వెంట‌నే త‌మ మ‌ద్దుతుని ఇస్తూ పార్ట్‌న‌ర్స్‌గా మారారు. ఇందులో మ‌రికొంత మంది ఎగ్జ‌యిటింగ్ పార్ట్‌న‌ర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు అహా ప్రివ్యూ మాత్ర‌మే చేస్తున్నాం. ఉగాది రోజున ఇంకా పెద్ద లాంచ్ ఉంటుంది. ఇక అహాను పెట్ట‌బోతున్నాన‌ని మా అబ్బాయిల‌కు చెప్ప‌గానే నాన్న నువ్వు రేప‌టిని చూస్తున్నావని అన్నారు. టెక్నాల‌జీ బిజినెస్ గురించి మా కోల్‌క‌తా స్నేహితుల స‌పోర్ట్ తీసుకున్నాను. అలాగే ఓ అమెరిక‌న్ కంపెనీ కూడా స‌పోర్ట్ అందిస్తున్నారు. డిజిట‌ల్ రంగానిదే భ‌విష్య‌త్తు. సినిమా ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను ఎంత‌లా హ‌త్తుకుంటుందో.. డిజిట‌ల్ కూడా అంతేలా హ‌త్తుకుంటుంది. ఎవ‌రైనా ఈ మీడియంలోకి రావాల‌నుకుంటే సందేహించ‌వ‌ద్దు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జాగర్ల‌మూడి క్రిష్‌. నేను నా ఆలోచ‌న చెప్ప‌గానే త‌న‌కు తానుగా షో చేస్తాన‌ని ముందుకు వ‌చ్చాడు. అన్వేష్ ప్యూర్ తెలంగాణ సినిమాలో న‌టిస్తూ డైరెక్ట్ చేశాడు. అలాగే వైవా హ‌ర్ష‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ స‌పోర్ట్‌తో ఇప్పుడు నాలుగు షోస్‌ను స్టార్ట్ చేశాం. ఈ ఏడాదిలో 25 షోస్‌ను చూస్తారు. కొన్ని సినిమాలు కూడా ఇందులోకి వ‌స్తాయి. ఇది మాకు కొత్త‌. ఏదీ క‌రెక్టో తెలియ‌దు. కాబ‌ట్టి అంద‌రూ స‌హ‌కారాన్ని అందించాల‌ని కోరుకుంటున్నాను. అజ‌య్ ఠాకూర్ దీన్ని అంత‌టినీ హ్యాండిల్ చేశాడు. ఇందులో కంటెంట్ బోల్డ్‌గా ఉంటుంది. మ‌నం ఎలా వ్య‌వ‌హరిస్తామో? ఎలా మాట్లాడుతామో? ఈ మీడియాలో చూపిస్తున్నాం. కాబ‌ట్టి పేరంట్ కంట్రోలింగ్ సిస్ట‌మ్ ఉండేలా చూసుకోండి“ అన్నారు.
రాము రావు జూప‌ల్లి మాట్లాడుతూ – “మేం గృహ నిర్మాణ రంగం నుండి ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగు పెట్టాం. అందులో భాగంగా డిజిట‌ల్ మీడియంలోకి అడుగు పెట్టాం. డిజిట‌ల్ రంగ‌మే భ‌విష్య‌త్‌. ఆహా ఓటీటీ .. అర‌వింద్‌గారి ఆలోచ‌న‌ల నుండి పుట్టింది. ఆయ‌న గ‌త ఎనిమిది నెల‌లుగా అజిత్ స‌హాకారంతో చాలా హార్డ్ వ‌ర్క్ చేశారు. ఇందులో 100 శాతం తెలుగు కంటెంట్ ఉంటుంది. ఇది అంద‌రికీ అందులో బాటులో ఉండాల‌ని ఏడాది ప్రీమియం 365 రూపాయ‌లుగా నిర్ణ‌యించాం. ఇందులో భాగ‌మైన అంద‌రికీ థ్యాంక్స్‌“ అన్నారు.

క్రేజీ స్టార్ విజ‌య్ దేర‌వ‌కొండ మాట్లాడుతూ – “ఆహా ఓటీటీ` ఫ్యూచ‌ర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గేమ్ చేంజ‌ర్ అని చెప్పొచ్చు. ఇప్పుడే ఒక ల‌క్ష యాప్స్ డౌన్ లోడ్ అయ్యాయి. ఈ ఓటీటీ టీవీని రీప్లేస్ చేస్తుంది. మీ న్యూస్‌, కామెడీ షోస్‌, సినిమాల ఇలా అన్నీ ఒక్క బ‌ట‌న్‌తో మీ చేతికి వ‌చ్చేస్తాయి. మ‌న లైఫ్ స్టైల్లో మ‌నం ఎప్పుడూ ఫ్రీగా ఉంటే అప్పుడు మ‌న‌కు కావాల్సిన షోస్ చూసుకునే అవ‌కాశం దొరుకుతుంది. ఒక‌ప్పుడు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో మ‌న‌కు ప‌ద‌కొండు ఆట‌గాళ్లు మాత్ర‌మే తెలుసు. కానీ ఐపీఎల్ వ‌చ్చాక వంద‌ల మంది బ‌య‌ట‌కు వ‌చ్చారు. అలాగే ఆహా వ‌చ్చిన త‌ర్వాత కొత్త టాలెంట్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. వెబ్ నుండి సినిమాకు టాలెంట్ క్రాస్ ఓవ‌ర్ అవుతుంది. అలాగే సినిమాల నుండి వెబ్‌కి యాక్ట‌ర్స్ క్రాస్ ఓవ‌ర్ అవుతారు. చాలా వ‌ర్క్ క్రియేట్ అవుతుంది. ఇదే భ‌విష్య‌త్‌. గొప్ప‌గా ఉంటుంది“ అన్నారు.


‘యూత్’ టైటిల్ అనౌన్స్ మెంట్.

బాపట్ల ఎం పి నందిగం సురేష్ సమర్పణలో పెదరావూరు ఫిల్మ్ సిటీ బ్యానర్ పై దిలీప్ రాజా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘యూత్’ .కుర్రాళ్ళ గుండె చప్పుడు ఉప శీర్షిక. ఈ చిత్రం యొక్క టైటిల్ అనౌన్స్ మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ… ఇది వరకు నేను అలీ గారితో ‘పండుగాడి ఫోటో స్టూడియో’ సినిమాను చేసాను. సెప్టెంబర్ లో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఆ స్పూర్తితో నే ఇప్పుడు యూత్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. దీనికి కుర్రాళ్ళ గుండె చప్పుడు అనేది ఉప శీర్షిక. నా ముందు సినిమా కూడా నా బలం, నా ధైర్యం నా స్ఫూర్తి,నా శ్రేయోభిలాషి అయిన సుకుమార్ గారు స్టోరీ విని ఒకే అంటేనే ప్రాజెక్ట్ పట్టాలెక్కింది ప్రేక్షకులచే ఆదరించబడింది. అలానే ఇపుడు ఈ యూత్ చిత్రం కూడా అతను విని బాగుంది అంటేనే మొదలు కానుంది. ఇక సినిమా విషయానికి వస్తే.. ఒక 22 ఏళ్ల కుర్రాడు కోర్టును మెర్సీ కిల్లింగ్ ను అడుగుతాడు అందుకు ఆ జడ్జ్ ఎందుకు అని అడిగితే ఆ కుర్రాడు నేటి సమాజం లో కుర్రాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడో.. ఎలాంటి బాధలను భరిస్తున్నాడో తెలియచెబుతాడు.. అదే ఈ చిత్ర కాన్సెప్ట్. ప్రతి ఒక్క కుర్రాడు ఈ కాన్సెప్ట్ కు కనెక్ట్ అవుతాడు. తమ లైఫ్ లో ఇలానే జరుగుతోందని భావిస్తాడు. ఈ చిత్రాన్ని బాపట్ల
ఎం పి నందిగం సురేష్ గారు ఈ చిత్రాన్ని సమర్పించనున్నారు .అందుకు ఆయనకు నా ధన్యవాదాలు తెలియచేస్తున్నా… ఇక ఈ చిత్రం పెనుమూడి, తెనాలి, నిజాం పట్నం హార్బర్, భీమిలి బీచ్, అరకు లోయ, సూర్య లంక తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనున్నాము.. మార్చి నుంచి రెగ్యులర్ షూట్ మొదలు పెట్టి జూన్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇందులో లీడ్ రోల్ ధన్య బాలకృష్ణ నటించనుంది. అలానే వెన్నెల తో పాటు హిందీ నుండి ఇద్దరు ప్రముఖ నటులు, ఆలోక్ జైన్ విలన్ పాత్రలో, తమిళ్ నుండి మరో ఇద్దరు ప్రముఖ నటులు నటించనున్నారు. మంచి కాన్సెప్ట్ తో వచ్చే ఈ సినిమాను ఆదరించమని, అలానే చిన్న సినిమాలు వెంటిలేటర్ మీద ఉన్నాయి వాటిని బ్రతికించమని తెలుగు రాష్ట్రల వారిని కోరుకుంటున్నాను అన్నారు.

సంగీత దర్శకుడు యాజమాన్య మాట్లాడుతూ… దిలీప్ రాజా గారి దర్శకత్వంలో నేను చేస్తున్న రెండవ సినిమా ఇది. కాన్సెప్ట్ చాలా బాగుంది. ప్రస్తుతం పాటలకు సంబంధించిన ట్యూన్స్ రెడీ
అయ్యాయని చెప్పారు.

హీరోయిన్ రావత్ సింధు మాట్లాడుతూ.. నా పాత్ర ఈ సినిమాలో చాలా బాగుంది. ఈ సినిమాతో నాకు బ్రేక్ వస్తుందని నమ్ముతున్నాను. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుందని తెలియచేశారు.

సబ్జెక్ట్ విని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి, యూత్ కు ఏం కావాలో అన్నీ ఈ సినిమాలో ఉండనున్నాయి. పండుగాడి ఫోటో స్టూడియో సినిమా తరువాత దిలీప్ రాజా దర్శకత్వంలో నేను చేస్తున్న సినిమా ఇది. మంచి పాత్ర లభించిందని నటుడు జబర్దస్త్ ఫణి తెలిపారు.

ధన్య బాలకృష్ణ, రావత్ సింధు, వెన్నెల, ఆలోక్ జైన్ తదితర ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: యాజమాన్య, డిఓపి: మల్లికార్జున్( రేయ్,
మహం కాళీ, బాలకృష్ణ నటించిన ఒకే ఒక్కడు ఫేమ్), ఫైట్స్: జాషువా, ( ఖైదీ నెం వ్150, సాహో ఫేం), ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు- దర్సకత్వం: దిలీప్ రాజా.
పి. అర్. ఓ:వీరబాబు


జిఏ 2 పిక్చర్స్ , అల్లు అరవింద్ , బొమ్మరిల్లు భాస్కర్, అఖిల్ అక్కినేని కాంబినేషన్ లో ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఫ‌స్ట్ లుక్ కి అనూహ్య‌మైన స్పంద‌న‌ Inbox x

జిఏ 2 పిక్చర్స్ , అల్లు అరవింద్ , బొమ్మరిల్లు భాస్కర్, అఖిల్ అక్కినేని కాంబినేషన్ లో ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఫ‌స్ట్ లుక్ కి అనూహ్య‌మైన స్పంద‌న‌

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయ‌గానే సినిమా అభిమానులు నుంచి సాధ‌ర‌ణ ప్రేక్ష‌కులు వ‌ర‌కు విప‌రీత‌మైన పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో ట్రేండింగ్ అవ్వ‌డం ఈ సినిమాకి మీద ఉన్న క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. ఇక‌ అక్కినేని న‌ట వార‌సుడిగా హ్యాండ్ స‌మ్ హీరో అఖిల్ వైవిధ్య‌మైన క‌థ‌లు ఎంచుకుంటూ ఇటీవ‌లే మిస్ట‌ర్ మ‌జ్ను, హ‌లో వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌‌స్ట‌ర్స్ సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అఖిల్ మ‌రోసారి త‌న‌ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చే స్టోరీతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ గా రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని బొమ్మ‌‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో నిర్మాత‌లు బ‌న్నీవాసు , వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. అలానే ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అఖిల్, పూజా హెగ్ధే మ‌ధ్య న‌డిచే కెమిస్ట్రీ ఈ సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతుందని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలిపారు. ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని ఫ‌స్ట్ లుక్ ని ఈ రోజు చిత్ర నిర్మాత‌లు విడుద‌ల చేశారు.

ఫిబ్ర‌వ‌రి 15 నుంచి తదుప‌రి షెడ్యూల్

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. హైద‌రాబాద్, అమెరికా త‌దిత‌ర ప్రాంతాల్లో ఇప్పిటికే షూటింగ్ జ‌రుపుకున్న ఈ చిత్ర యూనిట్ అదే ఉత్సాహాంతో ఫిబ్ర‌వ‌రి 15 నుంచి మ‌రో షెడ్యూల్ మొద‌ల‌పెట్ట‌బోతున్నారు.ఈ షెడ్యూల్ లో మేజ‌ర్ టాకీ పార్ట్ పూర్తిచేస్తున్న‌ట్లుగా చిత్ర యూనిట్ తెలిపారు.

గోపీ సుంద‌ర్ మ్యూజిక‌ల్ మ్యాజిక్

జీఏ 2 బ్యాన‌ర్ తో గోపీ సుంద‌ర్ ఉన్న జ‌ర్నీ గురించి అంద‌రికీ తెలిసిందే. గ‌తంలో జీఏ2 బ్యాన‌ర్ లో రిలీజైన గీతగోవిందం సినిమాకి గోపీ అద్భుత‌మైన బ్లాక్ బ‌స్ట‌ర్ సంగీతం ఇచ్చారు. ఈ నేప‌థ్యంతోనే ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ కి ఆరు పాట‌లు రెడీ చేశారు గోపీ సుంద‌ర్. ఈ ఆరు పాట‌ల్లో నాలుగు పాట‌లు ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసిన‌ట్లుగా చిత్ర బృందం తెలిపింది. అలానే మిగ‌తా రెండు పాటలు ఫారిన్ లో చిత్రీక‌ర‌ణ‌కు ప్లాన్ చేస్తున్న‌ట్లుగా తెలిపారు.

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న జీఏ2

పిల్లా నువ్వు లేని జీవితం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, గీత‌గోవిందం, ప్ర‌తిరోజూ పండ‌గే వంటి టాలీవుడ్ ట్రెండ్ సెట్టింగ్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించిన యంగ్ ఇంటిల్జెంట్ ప్రొడ్యూస‌ర్ బ‌న్ని వాసు మ‌రోసారి అదే ఉత్సాహాంతో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్వ‌క‌త్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నిర్మిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్. అలానే ఈ చిత్రాన్ని లెజండరీ ప్రోడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మాత వాసు వ‌ర్మ‌తో క‌లిసి బ‌న్ని వాసు సంయుక్తంగా నిర్మించడం విశేషం.
ఇక ఈ సినిమాను ఏప్రిల్ లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ‌

న‌టీ న‌టులు

అఖిల్ అక్కినేని
పూజా హెగ్ఢే
ఆమ‌ని
ముర‌ళి శ‌ర్మ‌
జ‌య ప్ర‌కాశ్
ప్ర‌గ‌తి
సుడిగాలి సుధీర్
గెటెప్ శ్రీను
అభ‌య్
అమిత్

టెక్నీష‌య‌న్స్

డైరెక్ట‌ర్ : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్
మ్యూజిక్ : గోపీ సుంద‌ర్
సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ
ఎడిట‌ర్ : మార్తండ కే వెంక‌టేశ్
ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా
నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌
స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్
బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్


అల్లు అర్జున్ డాన్స్ స్టెప్స్ కి పాన్ ఇండియా క్రేజ్

అల వైకుంఠపురంలో మూవీలోని ‘బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టూకుంటివే జిందగికే అట్టబొమ్మై జంటకట్టూకుంటివే’ అంటూ సాగే మెలోడీ సాంగ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. తమన్ తనదైన శైలిలో సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్‌ అందించగా.. అర్మాన్‌ మాలిక్‌ ఆలపించాడు.

ఈ సాంగ్ టిక్ టాక్ లో మరింత ఫేమస్ అయ్యింది. తమిళనాడు, కేరళ, బెంగాలీ భాషల్లో ఈ సాంగ్ ను టిక్ టాక్ చేశారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా ఈ సాంగ్ ను టిక్ టాక్ చేసి చేసింది, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సాంగ్ ఎంతటి పావులర్ అయ్యిందో. బుట్టబొమ్మ సాంగ్ కి టిక్ టాక్ లో దాదాపు 4.6 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.

https://vm.tiktok.com/VKKSjw/