Category Archives: Latest Events

పివియమ్‌ జ్యోతి ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ నెం-1 కొత్త చిత్రం షూటింగ్‌ ప్రారంభం

పివియమ్‌ జ్యోతి ఆర్ట్స్‌ పతాకంపై మహి రాథోడ్‌ హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న ప్రొడక్షన్‌ నెం-1 చిత్రం షూటింగ్‌ ఈ రోజు రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. శివ పాలమూరి దర్శకత్వం వహిస్తున్నారు. రేణుక బైరాగి హీరోయిన్‌. దిల్‌ రమేష్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ముహూర్తపు సన్నివేశానికి నటుడు దిల్‌ రమేష్‌ క్లాప్‌నివ్వగా నిర్మాత సిస్టర్‌ మణి కెమెరా స్విచాన్‌ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు శివ పాలమూరి మాట్లాడుతూ..‘‘దర్శకుడుగా ఇది నా తొలి చిత్రం. నేటి సమాజంలో ప్రేమ, పెళ్లిళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూపిస్తూ పూర్తి స్థాయి కమర్షియల్‌ చిత్రంగా మా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఫిబ్రవరి 14 న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి సింగిల్‌ షెడ్యూల్‌ లో షూటింగ్‌ పూర్తి చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. అధిక శాతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరిస్తాం. ఇందులో దిల్‌ రమేష్‌ గారు హీరోయిన్‌ ఫాదర్‌ గా నటిస్తున్నారు. త్వరలో టైటిల్ ప్రకటిస్తాం“ అన్నారు.

నటుడు దిల్‌ రమేష్‌ మాట్లాడుతూ…‘‘యాత్ర `సినిమా తర్వాత నాకు మంచి పాత్రలు పడుతున్నాయి. ఈ సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నా. ఒక ఇన్నోసెంట్ కుర్రాడు ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందు ఎదుర్కొన్నాడు అనేది సినిమా. పాత్రకు తగ్గట్టుగానే నేచరల్‌గా ఉండటానికి ఒక ఇన్నోసెంట్‌ కుర్రాడిని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నారు’’అన్నారు.
హీరో, నిర్మాత మహి రాథోడ్‌ మాట్లాడుతూ…‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నా. ఇందులో ఇన్నో సెంట్‌ క్యారక్టర్‌ లో నటిస్తున్నా’ అన్నారు.

హీరోయిన్‌ రేణుక బైరాగి మాట్లాడుతూ…‘‘తెలుగులో నా ఫస్ట్‌ ఫిలిం ఇది. నా క్యారక్టర్‌ చాలా ట్రెండీగా, డిఫరెంట్ గా ఉంటుంది’’ అన్నారు.
సంగీత దర్శకుడు కన్ను సమీర్‌ మాట్లాడుతూ..‘‘నేను గతంలో సంగీత దర్శకులు ఇయస్‌ మూర్తి, కళ్యాన్‌ మాలిక్‌, సాయి కార్తిక్‌ గార్ల వద్ద అసిస్టెంట్‌గా పని చేశాను. అలాగే మరాఠీ, కన్నడ చిత్రాలకు మ్యూజిక్‌ చేశాను. ఆ అనుభవంతో ఈ సినిమాకు మ్యూజిక్‌ చేస్తున్నా. ప్రస్తుతం పాటల రికార్డింగ్‌ జరుగుతోంది’’ అన్నారు.

మహి రాథోడ్‌, రేణుక బైరాగి, దిల్‌ రమేష్‌, జబర్దస్త్‌ రాజశేఖర్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: కన్ను సమీర్‌, ఎడిటింగ్‌: ఉద్దవ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌, నిర్మాత: మహి రాథోడ్‌, రచన`దర్శకత్వం: శివ పాలమూరి.


ఓ మై క‌డవులే` త‌మిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా

`ఓ మై క‌డవులే` త‌మిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా

బ‌లుపు, క్ష‌ణం, ఘాజీ, రాజుగారిగ‌ది 2,మ‌హ‌ర్షి వంటి స్ట్ర‌యిట్ సినిమాల‌తో పాటు ఎవ‌రు, ఊపిరి వంటి రీమేక్ చిత్రాల‌తోనూ నిర్మాత‌గా సూప‌ర్‌హిట్స్ అందుకున్నారు పివిపి సినిమా అధినేత ప్ర‌సాద్ వి.పొట్లూరి. నిర్మాణ సంస్థ‌గా భారీ బ‌డ్జెట్ చిత్రాల‌నే కాదు.. రీమేక్ చిత్రాల‌ను కూడా అందిస్తున్న పివిపి సినిమా ఇప్పుడు త‌మిళ చిత్రం ఓ మై క‌డ‌వులే సినిమా రీమేక్ హ‌క్కుల‌ను ద‌క్కించుకుంది.

త‌మిళంలో అశోక్ సెల్వ‌న్‌, రితికా సింగ్‌, వాణీ బోజ‌న్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో మెప్పించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు రీమేక్ హ‌క్కులు ద‌క్కించుకున్నాం, త్వ‌ర‌లోనే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.


`జాను`కి వ‌స్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో మాట‌లు రావ‌డం లేదు – శ‌ర్వానంద్‌

`జాను`కి వ‌స్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో మాట‌లు రావ‌డం లేదు – శ‌ర్వానంద్‌

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `జాను`. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేశారు.

రామ్ పాత్ర‌కు ఎలా అప్రోచ్ అయ్యారు?
– నాకు దిల్‌రాజుగారి జ‌డ్జ్‌మెంట్ మీద నాకు బాగా న‌మ్మ‌కం ఉంటుంది. శ‌త‌మానం భ‌వ‌తి సమ‌యంలోనూ క‌థ విని క‌థ బావుంది కానీ.. నా పాత్ర‌కేం లేదు అన్నాను. అప్పుడు కూడా ఆయ‌న న‌న్ను న‌మ్ము అన్నారు. ఆయ‌న్ని న‌మ్మి సినిమా చేశాను. సినిమా పెద్ద హిట్ అయ్యింది. అలా ఆయ‌న జ‌డ్జ్‌మెంట్‌పై నాకు మంచి న‌మ్మ‌కం ఉంది. దిల్‌రాజు అన్న `96` సినిమా చూడ‌మంటే చూశాను. బాగా న‌చ్చింది. క్లాసిక్ మూవీ క‌దా! సినిమా చేద్దామా? అవ‌స‌ర‌మా? అని ప్ర‌శ్నించాను. దానికి ఆయ‌న `లేదు.. న‌న్ను న‌మ్ము` అన్నారు. ఓకే చెప్పిన మూడు నాలుగు నెలల త‌ర్వాతే సినిమా స్టార్ట్ అయ్యింది. అయితే నేను ఒక‌సారి మాత్ర‌మే చూశాను. త‌ర్వాత ఎప్పుడూ 96 సినిమాను చూడ‌లేదు. అలాగే పాత్ర కోసం ప్రత్యేకంగా హోం వ‌ర్క్ అంటూ ఏమీ చేయ‌లేదు. డైరెక్ట‌ర్‌కే వ‌దిలేశాను. ప్రేమ్ ఎలా అంటే.. ఓ సీన్ చేసేముందు దానికి సంబంధించిన బ్యాక్ స్టోరినీ ప‌ది నిమిషాల పాటు వివ‌రించేవాడు. రెండు షెడ్యూల్స్ వ‌ర‌కు ఎందుకు ఇలా చేయ‌మంటున్నారో అర్థం కాలేదు. అయితే త‌ర్వాత నా క్యారెక్ట‌ర్‌ని ఎంత డెప్త్‌గా ఆలోచించుకుని రాసుకున్నారో అర్థ‌మైంది. స‌మంత సెట్స్‌లో జాయిన్ అయిన త‌ర్వాత మ‌రింత క్లారిటీ వ‌చ్చింది.

క్యారెక్ట‌ర్‌ను మీరెంత కంఫ‌ర్ట్‌గా ఫీల‌య్యారు?
– నేను క్యారెక్ట‌ర్‌ను కంఫ‌ర్ట్‌గా ఏమీ ఫీల్ కాలేదు. 96 సినిమా చూసిన‌ప్పుడు ఓ రాత్రిలో జ‌రిగే క‌థే క‌దా! సుల‌భంగా చేసెయొచ్చులేన‌ని అనుకున్నాను. అయితే నా కెరీర్‌లో నేను చాలా క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా ఏదైనా ఉందంటే జానునే. తొలిసాంగ్‌ను 20 రోజుల పాటు కెన్యా ఇత‌ర ప్రాంతాల్లో హార్డ్ వ‌ర్క్‌తో చిత్రీక‌రించాం. ఆ స‌మ‌యంలో నాకు యాక్సిడెంట్ కూడా అయ్యింది. ఇవ‌న్నీ ఒక ప‌క్క ఉంటే.. మ‌రో ప‌క్క స‌మంత సీన్స్‌ను తినేస్తుంది క‌దా! అని ఆలోచించాను. అలాగే త‌మిళ చిత్రానికి కంపేర్ చే్తూ ఎక్క‌డ ట్రోలింగ్స్ స్టార్ట్ చేస్తారోన‌ని ఆలోచించాను. ఇన్ని ఆలోచ‌న‌లున్న‌ప్పుడు కంఫ‌ర్ట్ ఎక్క‌డుంటుంది. అలాగని ఇబ్బంది ప‌డ‌లేదు. త‌ప‌న ప‌డ్డాను. డైరెక్ట‌ర్‌కి ఏం కావాలో అదివ్వ‌డానికి తాప‌త్ర‌య‌ప‌డ్డాను.

సినిమా షూటింగ్ స‌మ‌యంలో మీ ఆలోచ‌న శైలి ఎలా ఉండేది?
– త‌క్కువ డైలాగ్స్‌, ఎక్కువ హావ‌భావాలు ప‌లికించాలి. చాలా క‌ష్ట‌మే. కానీ క్యారెక్ట‌ర్‌లో బాగా ఇన్‌వాల్వ్ అయ్యాను. సినిమా షూటింగ్ జ‌రుగుతున్నంత సేపు ఆ క్యారెక్ట‌ర్ మూడ్‌లోనే ఉండేవాడిని.

మీరు రీ యూనియ‌న్ పేరుతో స్నేహితుల‌ను క‌లుస్తుంటారా?
– రెగ్యుల‌ర్‌గా క‌లుస్తుంటాం. ఈ మ‌ధ్య‌న సినిమా షూటింగ్‌ల కార‌ణంగా త‌గ్గింది. నేను, చ‌ర‌ణ్‌, విక్కీ క్లాస్‌మేట్సే క‌దా.

మీ లైఫ్‌లో ఫ‌స్ట్ ల‌వ్ బ్రేక‌ప్‌లాంటి విష‌య‌మేదైనా జ‌రిగిందా?
– సాధార‌ణంగా ఫ‌స్ట్ లవ్‌ని పెళ్లి చేసుకునే కుర్రాళ్లు ఐదు శాతానికి మించి ఉండ‌రు. చాలా మందికి బ్రేకప్స్ ఉంటాయి. అలా నా జీవితంలో జ‌రిగింది కాబ‌ట్టే నేను సినిమా చేశానేమో.

యాక్ట‌ర్‌గా ఏ సీన్‌కు బాగా క‌నెక్ట్ అయ్యారు?
– నీ పెళ్లి జ‌రిగేట‌ప్పుడు నేను వ‌చ్చాను జాను అని రామ‌చంద్ర పాత్ర జానుకి చెప్పే సీన్ నా జీవితంలో జ‌రిగింది కాబ‌ట్టి.. ఆ సీన్‌ను బాగా క‌నెక్ట్ అయ్యాను.

సినిమాకు ఎలాంటి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి?
– సినిమా చూసిన వారంద‌రూ అస‌లు రీమేక్‌లా అనిపించ‌డం లేదు ఫ్రెష్ మూవీలా అనిపిస్తుంది అంటున్నారు. అదే మా తొలి స‌క్సెస్ అని భావిస్తున్నాం. అలాగే విజ‌య్ సేతుప‌తి, త్రిష‌ను మ‌ర‌చిపోయి శ‌ర్వా, స‌మంత‌నే చూస్తున్నామ‌ని అన్నారు. ప్రేక్ష‌కులు, ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుండి వ‌స్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో మాట‌లు రావ‌డం లేదు.

స‌మంత‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌?
– ఎవ‌రూ ఊర‌క‌నే సూప‌ర్‌స్టార్స్ అయిపోరు. ఈ సినిమాలో ఆమెతో క‌లిసి న‌టించ‌డం వ‌ల్ల చాలా విష‌యాలు నేర్చుకున్నాను. ఆమెలో ఎక్క‌డా గ‌ర్వప‌డ‌దు. ప్ర‌తిషాట్‌ను స్క్రీన్‌లో చూసుకుని ఇంకా బెట‌ర్‌మెంట్ ఎలా చేయాలా? అని చేసేది. ఆమెను చూసి నేను కూడా ఇప్పుడు సీన్స్‌ను స్క్రీన్‌పై చూసుకోవ‌డం మొద‌లు పెట్టాను. ఆమె ఫార్ములాను నేను స్టార్ట్ చేశాను. ప్ర‌తి సీన్‌ను ఇద్ద‌రం డిస్క‌స్ చేసుకుని చేశాం.

రెండు పాత్ర‌ల‌తో సినిమాను న‌డిపించ‌డం అనేది రిస్క్ అనిపించ‌లేదా?
– అలాంటివి ఆలోచించ‌లేదు. ఓసారి న‌మ్మాను క‌దా.. కాబ‌ట్టి రిస్క్ గురించి ఆలోచించ‌లేదు. న‌టుడుగా పాత్ర‌కు న్యాయం చేయ‌డానికి వంద‌శాతం ప్ర‌య‌త్నిస్తాను. అయితే రెండు పాత్ర‌లతో సినిమాను న‌డిపించ‌డం అనేది సామాన్య‌మైన విష‌యం కాదు. ఆ క్రెడిట్ మాత్రం డైరెక్ట‌ర్ ప్రేమ్‌కే ద‌క్కుతుంది. సాధార‌ణంగా న‌టుడిగా ఎన్నో హిట్స్ రావ‌చ్చు. కానీ కొన్ని సినిమాలే గుర్తుండిపోతాయి. అలా నా కెరీర్‌లో నాకు గుర్తుండిపోయే సినిమా జాను. న‌టుడిగా నా ఆక‌లిని తీర్చిన సినిమా ఇది.

రీమేక్ సినిమాలు చేయ‌డం న‌టుడిగా మీకెలా అనిపిస్తుంది?
– నిజానికి నేను రీమేక్స్ చేయ‌కూడ‌ద‌ని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే రీమేక్స్ చేస్తే.. అంత‌కు ముందు ఆ పాత్ర చేసిన హీరోతో పోల్చి చూస్తారు. మ‌న‌కు తెలియ‌కుండానే ఒత్తిడి ఉంటుంది.

సినిమాలు చేయ‌డంలో స్పీడు పెంచిన‌ట్టున్నారుగా?
– ప‌డిప‌డి లేచె మ‌న‌సు, ర‌ణ‌రంగం సినిమాల త‌ర్వాత మంచి క‌థ‌లున్న సినిమాలను, త‌క్కువ రోజుల కాల్షీట్స్‌తో చేయాల‌ని అక్ష‌య్‌కుమార్‌లా నిర్ణ‌యిం తీసుకున్నాను. మూడు సినిమాలు పూర్తి కాగానే.. మ‌రో మూడు సినిమాల‌ను ట్రాక్ ఎక్కిస్తాను.

`శ్రీకారం` ఎంత వ‌ర‌కు వ‌చ్చింది?
– దాదాపు పూర్తి కావొస్తుంది. ఏప్రిల్ 24న విడుద‌ల చేయాల‌నుకుంటున్నాం. ఇందులో రైతు పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. రైతు కొడుకు రైతు ఎందుకు కాకూడ‌దు? అనే పాయింట్‌ను ఆధారంగా సినిమా ఉంటుంది. జెన్యూన్ అటెంప్ట్‌. మార్చికి రెండు సినిమాలు పూర్తి చేస్తాను. ఇందులో ఎవ‌రిపై విమ‌ర్శ‌లు చేయ‌డం లేదు. తండ్రీ కొడుకుల మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్ష‌ణే ఈ చిత్రం.

మీ ద్విభాషా చిత్రం ఎంత వ‌ర‌కు వ‌చ్చింది?
– సినిమా అనుకున్నాం కానీ.. ఎప్పుడు చేయాల‌ని అనుకోలేదు. నాకు తెలిసి త్వ‌ర‌లోనే స్టార్ట్ అవుతుంది. ఇది అమ్మ కొడుకు కాన్సెప్ట్ మీద న‌డిచే సినిమా. అక్కినేని అమ‌ల‌గారితో క‌లిసి న‌టిస్తున్నాను.


మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుద‌ల చేసిన సముద్ర ‘జై సేన` చిత్రంలోని`పల్లె తల్లి నుదిటిమీద బొట్టే రైతన్నా..పాట‌

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుద‌ల చేసిన సముద్ర ‘జై సేన` చిత్రంలోని`పల్లె తల్లి నుదిటిమీద బొట్టే రైతన్నా..పాట‌

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయిఅరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. ఇప్పటికే విడుదలైన టీజ‌ర్‌, పాటలకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కాగా ఈ చిత్రంలోని `పల్లె తల్లి నుదిటిమీద బొట్టే రైతన్నా..` సాంగ్ ను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా..

చిత్ర దర్శకుడు సముద్ర మాట్లాడుతూ – “రైతుల గొప్పతనాన్ని తెలియజేసే పాటను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదలచేయడం చాలా సంతోషంగా ఉంది. అభినయ శ్రీనివాస్ చక్కని సాహిత్యం అందించిన ఈ పాటను కారుణ్య అంతే శ్రావ్యంగా ఆలపించారు. సంగీత దర్శకుడు రవిశంకర్ మంచి ట్యూన్ ఇచ్చాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ పాట‌కి అంతకన్నా మంచి రెస్పాన్స్‌ వస్తుందని ఆశిస్తున్నాం. అందరి అభిమానులు, రెండు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా చూడాల్సిన చిత్రం ‘జైసేన“ అన్నారు.

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌గౌతమ్‌ పరిచయం అవుతున్నారు. అజయ్‌ ఘోష్‌, మధు, ఆజాద్‌, ధనరాజ్‌, వేణు, చమ్మక్‌ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: తిరుమల శెట్టి సుమన్‌, పార్వతిచందు, పాటలు: అభినయ్‌ శ్రీను, సిరాశ్రీ, సంగీతం: రవిశంకర్‌, డ్యాన్స్‌: అమ్మారాజశేఖర్‌, అజయ్‌, ఫైట్స్‌: కనల్‌ కన్నన్‌, నందు, రవివర్మ, కెమెరా: వాసు, కో ప్రొడ్యూసర్స్‌: పి.శిరీష్‌ రెడ్డి, దేవినేని శ్రీనివాస్‌, నిర్మాత: వి.సాయి అరుణ్‌ కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.సముద్ర.


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి హెచ్ బీ వో ఇండియా స్పెష‌ల్ స‌ర్ప‌రైజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి హెచ్ బీ వో ఇండియా స్పెష‌ల్ స‌ర్ప‌రైజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి సూపర్ మేన్ బొమ్మలన్నా, మాస్కులు అన్నా చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. సూపర్ హీరోల సినిమాలను వరుణ్ ఒక్కటి వదలకుండా చూస్తారు. అది గుర్తించే హెచ్ బీ ఓ ఇండియా వ‌రుణ్ తేజ్ కి ఇష్టమైన డీసీ కామిక్ ఆట బొమ్మలను బహుమతి గా ప్రెజెంట్ చేసింది. బాట్ మ్యాన్ మాస్క్, వండర్ వుమెన్, మాస్క్ ల్ని, ఓ కారు బొమ్మను ఈ సంస్థ పంపించింది. ఈ విషయాన్ని వరుణ్ త‌న సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో షేర్ చేస్తూ హెబీఓ ఆఫ్ ఇండియా కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇటీవ‌లే మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, గ‌ద్దల‌కొండ గ‌ణేశ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందుకొని అదే ఉత్సాహంతో ప్ర‌స్తుతం త‌న త‌దుప‌రి సినిమా స‌న్నాహాలు ఉన్నారు. సిద్ధు ముద్దా, అల్లు వెంక‌టేశ్ నిర్మాత‌లుగా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌బోతుంది. థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీత‌మందిస్తున్నారు.


ఏప్రిల్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ‘నిశ్శ‌బ్దం’

ఏప్రిల్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ‘నిశ్శ‌బ్దం’

`అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `నిశ్శ‌బ్దం`.హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, కోనవెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఏప్రిల్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.
ఈ క్రాస్ జోన‌ర్ చిత్రంలో సాక్షి అనే డిఫ‌రెంట్ పాత్ర‌లో అనుష్క మెప్పించ‌నున్నారు. అలాగే మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే, సుబ్బ‌రాజ్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల , మైకేల్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఈ పాత్ర‌ల లుక్స్‌తో పాటు ఇటీవల విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను పెంచింది.

నటీనటులు:
నుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో మెయిన్ రోల్స్ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
సంగీతం: గోపీ సుంద‌ర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్: నీర‌జ కోన‌, స్టంట్స్: ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌ఫీ: షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కోన వెంక‌ట్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్, స్టోరీ, డైరెక్ష‌న్ – హేమంత్ మ‌ధుక‌ర్.–


గోపీచంద్ ` సీటీమార్‌`లో కబడ్డి కోచ్ జ్వాలా రెడ్డిగా త‌మ‌న్నా లుక్ విడుద‌ల‌

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మాణంలో హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న‌ భారీ చిత్రం` సీటీమార్‌`. ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. తరుణ్ అరోర ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రం నుండి కబడ్డి కోచ్ జ్వాలా రెడ్డి గా మిల్కీబ్యూటి తమన్నా లుక్ ని ఈరోజు ఉదయం 9:24 నిమిషాలకి విడుదలచేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా..

మిల్కీబ్యూటి తమన్నా మాట్లాడుతూ – “వెరీ ఇంట్రెస్టింగ్, ఇన్స్‌పైరింగ్ మరియు ఛాలెంజింగ్ రోల్ కబడ్డి కోచ్ జ్వాలా రెడ్డి. గోపిచంద్ గారితో ఫస్ట్ టైమ్ క‌లిసి నటిస్తున్నాను. అలాగే సంపత్ నంది గారి దర్శకత్వంలో `రచ్చ`, `బెంగాల్ టైగర్` తర్వాత చేస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బేనర్‌లో చేయడం చాలా హ్యాపీగా ఉంది” అన్నారు.

చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ – “రాజ‌మండ్రి షెడ్యూల్ పూర్తి చేసుకొని ఆర్‌.ఎఫ్‌.సిలో కొత్త షెడ్యూల్ ప్రారంభించాం. ఈ షెడ్యూల్ లో తమన్నా జాయిన్ అయ్యారు. నాన్ స్టాప్‌గా షెడ్యూల్ జ‌రిపి స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. గోపిచంద్ కెరీర్ లోనే ఇది హై బడ్జెట్, భారీ క‌మ‌ర్షియ‌ల్ ఫిలిం. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బేనర్ లో సంపత్ నంది గారు హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో ప్రెస్టీజియస్‌ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు“ అన్నారు.

మ్యాచో స్టార్‌ గోపీచంద్‌, మిల్కీబ్యూటి తమన్నా, దిగంగన సూర్యవన్షి, తరుణ్ అరోర, భూమిక, పోసాని కృష్ణమురళి, రావురమేష్, అన్నపూర్ణమ్మ, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: సౌందర్‌ రాజన్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: డి.వై.సత్యనారాయణ, సమర్పణ: పవన్‌ కుమార్‌, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: సంపత్‌ నంది


“మహానటి” కీర్తి సురేష్ నటించిన “మిస్ “ఇండియా నుండి “కొత్తగా కొత్తగా” పాట విడుదల

“మహానటి” కీర్తి సురేష్ నటించిన “మిస్ “ఇండియా నుండి “కొత్తగా కొత్తగా” పాట విడుదల

‘మహానటి’తో జాతీయ ఉత్త‌మ‌న‌టి అవార్డుని ద‌క్కించుకున్న కీర్తిసురేశ్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ మిస్ ఇండియా. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌రేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని మార్చి నెల‌లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఈ చిత్రంలో తొలి పాట‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

‘‘కొత్తగా కొత్త‌గా కొత్త‌గా రంగులే నింగిలో పొంగి సారంగ‌మై
లిప్త‌లో క్షిప్త‌మై కాన‌నే కాల‌మే మొల‌క‌లే వేసె నా సొంత‌మై…’’ అంటూ సాగే ఈ పాట‌లో హీరోయిన్ జీవితంపై త‌న‌కున్న పాజిటివ్ దృక్ప‌థాన్ని తెలియ‌జేస్తుంది. ఈ సాంగ్‌ను యూర‌ప్‌లో అంద‌మైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించారు.

మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందించిన ఈ పాట‌కు క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి సాహిత్యం అందించారు. శ్రేయా ఘోష‌ల్, త‌మ‌న్ పాట‌ను పాడారు.
ఈ సంద‌ర్భంగా…
నిర్మాత మ‌హేష్ కోనేరు మాట్లాడుతూ – “`మ‌హాన‌టి`తో జాతీయ ఉత్త‌మ‌నటిగా అవార్డును సంపాదించుకున్న కీర్తి సురేశ్‌గారు మ‌న‌కు గ‌ర్వ కార‌ణంగా నిలిచారు. త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం మా బ్యానర్‌లోనే కావడం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్ర‌స్తుత సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌ర‌పుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మార్చి నెల‌లో విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు.

న‌టీన‌టులు:
కీర్తి సురేశ్‌
జ‌గ‌ప‌తిబాబు
వి.కె.న‌రేశ్‌
న‌వీన్ చంద్ర‌
న‌దియా
రాజేంద్ర ప్ర‌సాద్‌
భాను శ్రీ మెహ్ర‌
పూజిత పొన్నాడ‌
క‌మ‌ల్ కామ‌రాజు త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌: ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాత‌: మ‌హేశ్ కోనేరు
ద‌ర్శ‌క‌త్వం: న‌రేంద్ర నాథ్‌
కెమెరా: సుజిత్ వాసుదేవ్‌, డాని షాన్‌సెజ్ లోపెజ్‌
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు
ఆర్ట్‌: సాహి సురేశ్‌
ర‌చ‌న‌: న‌రేంద్ర‌నాథ్‌, త‌రుణ్ కుమార్‌


అశ్వథ్థామ’తో టాలీవుడ్ కు నాగశౌర్య రూపంలో మరో యాక్షన్ స్టార్ లభించాడు – నిర్మాత శరత్ మరార్

‘అశ్వథ్థామ’తో టాలీవుడ్ కు నాగశౌర్య రూపంలో మరో యాక్షన్ స్టార్ లభించాడు
– నిర్మాత శరత్ మరార్

నాగశౌర్య, మెహ్రీన్ పిర్జాడ జంటగా ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉష ముల్పూరి నిర్మించిన ‘అశ్వథ్థామ’ చిత్రం జనవరి 31న విడుదలై థియేటర్లలో దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది. రమణతేజ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ సమర్పించారు. శుక్రవారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటరులో చిత్ర బృందం గ్రాండ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి మాట్లాడుతూ, “మా ‘అశ్వథ్థామ’ను గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమా చాలా బాగుందనీ, నాగశౌర్య చాలా బాగా చేశాడనీ అంటుంటే సంతోషంగా ఉంది. ఐరా క్రియేషన్‌కు ఇంత మంచి సక్సెస్ రావడానికి కారకులైన అందరికీ థాంక్స్” అన్నారు.

నిర్మాత ఉష ముల్పూరి మాట్లాడుతూ, “శౌర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమాగా ‘అశ్వథ్థామ’ నిలిచినందుకు హ్యాపీ. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్లకు నమస్కారాలు. ఐరా క్రియేషన్స్‌లో ఇది బిగ్గెస్ట్ హిట్. శౌర్య నటన, అతను చేసిన ఫైట్లు చాలా బాగున్నాయని చెబుతున్నారు. మునుముందు ఐరా క్రియేషన్స్‌లో మరింత మంచి సినిమాలు అందిస్తాం” అని చెప్పారు.

దర్శకుడు రమణతేజ మాట్లాడుతూ, “ఈ సినిమాకు ఇంత ట్రెమండస్ రిజల్ట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. ఈ సినిమాలో శౌర్య నటించిన విధానానికి హ్యాట్సాఫ్. ఇంత మంచి సినిమాలో నన్ను భాగం చేసినందుకు ఆయనకు రుణపడి ఉంటా. దర్శకుడిగా నా మొదటి సినిమాకే ఇంత మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీ” అన్నారు.

నటుడు ప్రిన్స్ మాట్లాడుతూ, “యాక్టర్ గానే కాకుండా రైటర్ గానూ శౌర్యకు కంగ్రాట్స్. నిర్మాతలు నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు. శౌర్యకు ఇంత మంచి సక్సెస్ వచ్చినందుకు హ్యాపీ. ‘అశ్వథ్థామ’ ఒక విజువల్ ట్రీట్. దీన్ని మిస్ చేయవద్దు. నేను పనిచేసిన బెస్ట్ మూవీస్ లో ఇదొకటి’ అని చెప్పారు.

నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్ అధినేత, నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ, “ఈ సినిమా సక్సెస్ కు చాలా సంతోషంగా ఉంది. శౌర్య కథ రాసిన విధానం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది సెన్సిటివ్ సబ్జెక్ట్, అమేజింగ్ స్క్రీన్ ప్లే. డైరెక్టర్ రమణతేజ సినిమాని బాగా తీశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ‘అశ్వథ్థామ’ మూవీతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నాగశౌర్య రూపంలో మరో యాక్షన్ స్టార్ లభించాడు” అన్నారు.

రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి మాట్లాడుతూ, “తాను రొమాంటిక్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాననీ, ఈ సినిమాతో యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు శౌర్య చెప్పినప్పుడు ఆశ్చర్యపోయా. ఇందులో శౌర్య ఎవర్ని కొడుతున్నా, వాళ్లని అలాగే కొట్టాలనిపించింది. తను కథను బాగా రాసుకున్నాడు. కొడుకుతో హిట్ కొడితే వచ్చే ఆనందం ఎలా ఉంటుందో నిర్మాతల ముఖాల్లో తెలుస్తోంది” అని చెప్పారు.

డైరెక్టర్ నందినీరెడ్డి మాట్లాడుతూ, “ఈ సినిమా జర్నీ, ఐరా క్రియేషన్స్ జర్నీ దగ్గర్నుండి చూస్తూ వస్తున్నా. ఏ సినిమా చేసినా, ఏ టెక్నీషియన్లు, యాక్టర్లు పనిచేసినా ఒక ఫ్యామిలీలా చేస్తారు. అది ఐరా క్రియేషన్స్ బలం. సంపాదించిన డబ్బుతో సినిమా తియ్యడం పెద్ద రెస్పాన్సిబిలిటీ. ‘అశ్వథ్థామ’ సక్సెస్ అవడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఎవరేమనుకున్నా శౌర్య ఇంకా కథలు రాయాలి. నేను డైరెక్ట్ చేసిన నాలుగు సినిమాల్లో రెండు శౌర్యతో పనిచేయడం సంతోషంగా ఉంది” అన్నారు.

హీరో నాగశౌర్య మాట్లాడుతూ, “సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని మౌత్ టాక్ వ్యాప్తి చెయ్యడం వల్లే సినిమా ఇంత పెద్ద హిట్టయింది. ఇలాంటి సినిమా నాతో తీసినందుకు అమ్మకు చాలా థాంక్స్. మరోసారి ‘నర్తనశాల’ లాంటి సినిమా చెయ్యాను. డైరెక్టర్ రమణతేజకు ఫుడ్, సినిమా.. ఈ రెండే ప్రాణం. అతడిని నమ్మినందుకు చాలా బాగా ఈ సినిమా తీశాడు. సినిమాటోగ్రాఫర్ మనోజ్ వేరే లెవల్లో కెమెరా పనితనం చూపించాడు. ఈ సినిమా పూర్తయ్యాక 7 రోజుల్లో రీరికార్డింగ్ పూర్తిచేసి ఇచ్చిన జిబ్రాన్ కు థాంక్స్. స్టోరీలోని ఇంటెన్సిటీకి తగ్గట్లు అన్బరివు బ్రదర్స్ యాక్షన్ ఎపిసోడ్స్ చేశారు. ఈ సినిమాలో విలన్ గా చేసిన బెంగాలీ నటుడు జిషుసేన్ గుప్తా టాలీవుడ్ లో సెటిలవుతారని ఆశిస్తున్నా” అని చెప్పారు.

చిత్ర సమర్పకులు శంకర్ ప్రసాద్ పాల్గొన్న ఈ సక్సెస్ మీట్ లో సినిమాటోగ్రాఫర్ మనోజ్ రెడ్డి, ఎడిటర్ గ్యారీ బీహెచ్ కూడా మాట్లాడారు.