Category Archives: Latest Events

షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం` ఒక ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ – న‌టి ష‌కీల


‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం` ఒక ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ – న‌టి ష‌కీల

ష‌కీల ప్రధానపాత్రధారిణిగా విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా 24 క్రాఫ్ట్స్ బ్యానర్ పై సీవీ రెడ్డి సమర్పణలో సి.హెచ్ వెంకట్ రెడ్డి నిర్మాత‌గా సాయిరాం దాసరి దర్శకత్వ పర్యవేక్షణలో సతీష్ వి.ఎన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం’. ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ఆవిష్కరణ ఆదివారం ఫిల్మ్ చాంబర్లో జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో..

న‌టి షకీల మాట్లాడుతూ – `’నేను నిర్మించిన ‘లేడీస్ నాట్ అలౌడ్’ సినిమా పది నెలలుగా సెన్సార్ అవడం లేదు. ఎంతో వల్గారిటీతో వచ్చిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ మా సినిమాకే సెన్సార్ వాళ్లు ఎందుకు అభ్యంతరాలు చెపుతున్నారో అర్థం కావడం లేదు. ప్రస్తుతం ట్రిబ్యునల్ లో ఉంది. షకీలా అంటే వల్గారిటీ సినిమాలేనా.. ఫ్యామిలీ సినిమాలు చేయదా అనే విమర్శలున్నాయి. అన్ని రకాల సినిమాలు చేయగలనని నిరూపించడం కోసం కుటుంబ కథాచిత్రంగా ఈ సినిమా చేస్తున్నాను. షకీలా నిర్మాత అంటేనే సెన్సార్ ఇవ్వడం లేదు.. ఇది నేను రాసిన కథ అంటే ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారో. కానీ ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స “ అన్నారు.

దర్శకుడు సతీష్ వి.ఎన్ మాట్లాడుతూ – ‘ కొత్తగా ప్రయత్నించాం. అన్ని వర్గాలకు నచ్చే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఏప్రిల్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’ అని అన్నాడు. హీరో విక్రాంత్ మాట్లాడుతూ ‘గత చిత్రం ‘లేడీస్ నాట్ అలౌడ్’కి సహనిర్మాతగా పనిచేశాను. ఆ సినిమా విడుదలకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సాయిరాం దాసరి కొత్తగా ప్రయత్నించాడు. కచ్చితంగా ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం` అన్నారు

డిఓపి తరున్ కరామ్‌తోత్ మాట్లాడుతూ – సాయిరాంతో నాలుగు సినిమాలకు పని చేశా. ఈ చిత్రానికి మంచి డైలాగులు అందించడమే కాదు బాగా తెరకెక్కించారు. అందరినీ ఆకట్టుకుంది’అని అన్నారు.

ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మిత్ర, నటుడు హర్ష తదితరులు పాల్గొన్నారు.

షకీలా, విక్రాంత్, పల్లవి ఘోష్, నల్లబెల్లి, తేజ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి
దర్శకత్వ పర్యవేక్షణ: సాయిరాం దాసరి,
దర్శకుడు: సతీష్ విఎన్,
నిర్మాత: సి హెచ్ వెంకట రెడ్డి,
సహ నిర్మాత: లండన్ గణేష్, ఆడియో గ్రాఫి: శ్రీ మైత్రా,
ఎడిటర్: కెఆర్ స్వామి,
డిఓపి: శ్యామ్ ప్రసాద్, తరున్ కరామ్‌తోత్‌.
పిఆర్ఒ: సాయి స‌తీష్.


జయంత్ సి పరాన్జి స‌రికొత్త యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘నరేంద్ర`లో ఫీమేల్ ఫైటర్ పైలట్ గా ప్రత్యేక పాత్రలో పాయల్ రాజ్ పూత్.


జయంత్ సి పరాన్జి స‌రికొత్త యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘నరేంద్ర`లో ఫీమేల్ ఫైటర్ పైలట్ గా ప్రత్యేక పాత్రలో పాయల్ రాజ్ పూత్.

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసి ‘వెంకీమామ’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్ పూత్ ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జి లేటెస్ట్ మూవీ ‘నరేంద్ర’ లో ఇండియన్ ఫస్ట్ ఫీమేల్ ఫైటర్ పైలట్ గా ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. ఒక అమాయకుడైన భారతీయ బాక్సర్ పాకిస్థాన్ జైలులో ఎలా బందీ అయ్యాడు అక్కడి నుండి ఎలా తప్పించుకుని బయట పడ్డాడు అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘నరేంద్ర’ తెరకెక్కుతోంది. చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ రిలీజ్ కి సిద్దం అవుతోంది. హీరోగా పరిచయం అవుతున్న నీలేష్ పాకిస్థాన్ జైల్ లో ఖైదీ అయిన మాజీ బాక్సర్ గా నటిస్తున్నారు. బ్రెజిలియన్ బ్యూటీ ఇసాబెల్లా లియేటి స్వేఛ్చా పోరాటానికి మద్దతు ఇచ్చే మానవ హక్కుల కార్యకర్త పాత్ర పోషిస్తుంది. అలాగే భారత ఖైదీలను రక్షించే ప్రయత్నంలో తనను తాను త్యాగం చేసుకునే ఆఫ్ఘన్ ఖైదీ గా ఫేమస్ W.W.E స్టార్ ద గ్రేట్ ఖలి నటిస్తున్నారు. ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, బావగారూ బాగున్నారా, లక్ష్మి నరసింహా, టక్కరి దొంగ, ఈశ్వర్, శంకర్ దాదా ఎంబిబిఎస్, వంటి ఎన్నో కమర్షియల్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు జయంత్ సి పరాన్జి సరికొత్త ట్విస్టులతో తెలుగు స్క్రీన్ మీద ఇంతవరకూ రాని అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ గా ‘నరేంద్ర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

పాయల్ రాజపూత్, ది గ్రేట్ ఖలి, ఇసాబెల్లా లియేటి, నీలేష్ ఏటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: విరేన్ తంబిదొరై, సంగీతం: రామ్ సంపత్, నిర్మాణ సంస్థ: ఈషాన్ ఎంటర్టైన్మెంట్, రచన, దర్శకత్వం: జయంత్ సి పరాన్జి



తమిళనాడు లోని కురుమలై లో విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ యాక్షన్ సీక్వెన్సెస్

తమిళనాడు లోని కురుమలై లో విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ యాక్షన్ సీక్వెన్సెస్

‘ఎఫ్‌2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ 74వ చిత్రం ‘నారప్ప’ షూటింగ్‌ అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండలోని పాల్తూరు గ్రామంలో ప్రారంభమైంది. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం తమిళ నాడు లోని కురుమలై లో ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ‘నారప్ప’ కి సంబంధించి కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యాక విక్టరీ వెంకటేష్, చిత్ర బృందం అనంతపురం లో షెడ్యూల్ కంటిన్యూ చేస్తారు. సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేశారు.

విక్టరీ వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్‌.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌, ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌, కథ: వెట్రిమారన్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌, లిరిక్స్‌: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం, ఫైనాన్స్‌ కంట్రోలర్‌: జి.రమేష్‌రెడ్డి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రామబాలాజి డి., ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఏపీ పాల్‌ పండి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ శంకర్‌, కో- ప్రొడ్యూసర్‌: దేవిశ్రీదేవి సతీష్‌, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల


రూపేష్‌, శివల‌ క్రైమ్ థ్రిల్ల‌ర్ `22` టీజ‌ర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా డెఫినెట్‌గా పెద్ద హిట్ అవుతుంది – కింగ్ నాగార్జున.

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్‌ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ’22’. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవ‌ల డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ చేతుల‌మీదుగా విడుద‌లైన హీరో ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్ కు ట్రెమండ‌స్ రెస్పాన్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం టీజర్ ను 2ఫిబ్రవరి2020న ఉద‌యం 8:59 నిమిషాలకు కింగ్ నాగార్జున విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి ముఖ్య అతిథిగా పాల్గొని `22` మూవీ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత కొండా కృష్ణం రాజు పాల్గొన్నారు.

కింగ్ నాగార్జున మాట్లాడుతూ – “అందరికి ఎంతో ఇష్టమైన బి.ఎ.రాజు గారి, జయగారి అబ్బాయి శివ. జయగారు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి చాలా ఇష్టం. వాళ్ళిద్దరితో నేను బాగా క్లోజ్ గా ఉంటాను. జయగారు ఇప్పుడు మన మధ్య లేరు కానీ వాళ్ళ అబ్బాయి డైరెక్టర్ అవుతున్నాడు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆమె అందరికి బాగా తెలిసిన మహిళా దర్శకురాలు. శివ ద‌ర్శ‌కుడిగా జయగారి పేరు నిలబెట్టాలి. అలాగే బి.ఎ.రాజు గారిది కూడా. రూపేష్ వెల్ కమ్ టు ఫిలిం ఇండస్ట్రీ. బయట ఎన్నో సక్సెస్ ఫుల్ బిజినెస్ లు ఉన్నా సినిమా అంటే ఫ్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చాడు. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. ఇప్పుడే టీజర్ చూశాను. ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టైటిల్ 22. టీజర్ విడుదలయింది 2-2-2020. అన్ని రెండులే ఉన్నాయి. న్యూమరాల‌జి ప్రకారం నాది కూడా రెండు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్” అన్నారు.

శివ ద‌ర్శ‌కుడిగా త‌ప్ప‌క స‌క్సెస్ అవుతాడు!!
సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి మాట్లాడుతూ – శివ ద‌ర్శ‌కుడు కావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఫ‌స్ట్ కాపీ కూడా వారం రోజుల్లో రెడీ అవుతుంద‌ని చెప్పాడు. ఒక అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా నా వ‌ద్ద‌కు వ‌చ్చి ఓ సినిమా ప్రొస్ట్ ప్రొడ‌క్ష‌న్ అంతా హ్యాండిల్ చేశాడు. రాజుగారు ఎలా ఒక సినిమా స‌క్సెస్ అవ్వాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకొని క‌ష్ట‌ప‌డి ప్ర‌మోష‌న్ చేస్తారో… అలా శివ కూడా చాలా క‌ష్ట‌ప‌డ‌తాడు. ద‌ర్శ‌కుడుగా స‌క్సెస్ కావ‌డానికి ఈ సినిమాతో ఒక మంచి ప్ర‌య‌త్నం చేశాడు. కొత్త‌గా ద‌ర్శ‌కులు కావాల‌నుకునేవారు తొలుత ప్రేమ‌క‌థ‌ను తీయాల‌నుకుంటారు. కానీ శివ విభిన్నంగా ఆలోచించి ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌ను తీసుకుని ఇంత బాగా తీశాడంటే అత‌ని మెచ్యూరిటీ లెవ‌ల్ ఏంటో తెలుస్తోంది. ఈ క‌థ‌ను న‌మ్మి, రూపేష్ హీరోగా న‌టించాడు. రూపేష్ కూడా చాలా హార్డ్ వ‌ర్క్ చేశాడ‌నిపిస్తోంది. స‌లోనితో పాటు టీమ్ అంద‌రు బాగా చేశారు. టీమ్ అంద‌రికీ ఆల్‌దిబెస్ట్‌.అలాగే నాగార్జున‌గారు కొత్త‌వారిని ప్రొత్స‌హించ‌డంలో ఎప్పుడూ ముందుఉంటారు. టీజ‌ర్ చూసి ఆయ‌న అంత మాట్లాడారు అంటే…రాజుగారిపై అభిమానం ఉన్న‌ప్ప‌టికీ టీజ‌ర్ ఆయ‌న‌తో మాట్లాడేలా చేసింది. నేను శివ చేసిన ఓ వెబ్‌సిరీస్ చూసి షాక్ అయ్యాను. టెక్నిక‌ల్‌గా బాగా చేశాడు. ఒక‌ క‌థ రాసుకుని, ఇంత త‌క్కువ స‌మ‌యంలో దాన్ని స్క్రీన్‌మీద‌కు తీసుకురావ‌డం అంత సులువు కాదు. వి.వి.వినాయ‌క్‌గారు, నేను ఈ సినిమా లాంచ్ చేశాం. అప్పుడే ఈ సినిమా టీజ‌ర్ లాంచ్‌లో పాల్గొన‌డం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ద‌ర్శ‌కుడు ఇండ‌స్ట్రీకి చాలా అవ‌స‌రం. శివ ద‌ర్శ‌కుడిగా త‌ప్ప‌క స‌క్సెస్ అవుతాడు. కో-డైరెక్ట‌ర్ పుల్లారావుగారు ఉంటే ఆ ప్రొడక్ట్ బాగా వ‌స్తుంది. ఆయ‌న సినిమాను సినిమాలాగే చూస్తారు చాలా సిన్సియ‌ర్‌గా వ‌ర్క్ చేస్తారు. ఇలాంటి సీనియ‌ర్ ద‌ర్శ‌కులతో ప‌ని చేసే అవ‌కాశం శివ‌కు వ‌చ్చింది. ఈ సినిమాను ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాల‌నుకుంటున్నాను. టీమ్ అంద‌రికీ ఆల్‌దిబెస్ట్‌“ అన్నారు.

ప్ర‌ముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు మాట్లాడుతూ – “నాగార్జునగారు, పూరీ జ‌గ‌న్నాథ్‌గారు, మారుతిలాంటి ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖులు ఈ సినిమాకు ముందుకొచ్చి శివ‌మీద వారికి ఉన్న‌ప్రేమ‌ను, న‌మ్మ‌కాన్ని తెలియ‌జేస్తుంటే శివ చాలా అదృష్ట‌వంతుడ‌నిపిస్తోంది. ఇంత‌మంది పెద్ద‌ల అశీస్సుల‌తో శివ‌కు, రూపేష్ గారికి ఈ సినిమా పెద్ద బ్రేక్ అవ్వాల‌ని, ఎంటైర్ యూనిట్‌కి ఈ ఇదొక పెద్ద సినిమా అవ్వాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.

ఆదిత్య‌మ్యూజిక్ నిరంజ‌న్‌ మాట్లాడుతూ – “రాజుగారు, జ‌య‌గారు మొద‌టి సినిమా నుంచి మ‌మ్మ‌ల్ని ఆద‌రించి, వారి సినిమాల ఆడియో హ‌క్కుల‌ను మాకే ఇచ్చి మ‌మ్మ‌ల్ని ప్రోత్స‌హిస్తున్నారు. ఆ ప‌రంప‌ర‌ని అలాగే కొన‌సాగిస్తూ ఇప్పుడు వారి అబ్బాయి శివ‌గారు డైరెక్ట‌ర్‌గా రూపొందించిన ఈ సినిమా ఆడియో హ‌క్కుల‌ను కూడా మాకు ఇవ్వ‌డం చాలా సంతోషం. శివ‌గారికి జ‌య‌గారితో స‌హ మా అంద‌రి ఆశీస్సులు ఉన్నాయి. అలాగే బి.ఎ.రాజుగారు తోడుగా ఉన్నారు. భ‌విష్య‌త్‌లో ఇంకా మంచి సినిమాలు చేయాలి. వీరి ప‌రంప‌ర ఇలాగే మాతోనే కొన‌సాగ‌ల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ల‌డానికి మాకు సాధ్య‌మైనంత స‌హాయం చేస్తామ‌ని స‌భాముఖంగా తెలియ‌జేస్తున్నాను“ అన్నారు.

కో డైరెక్ట‌ర్ పుల్లారావు కొప్పినీడి మాట్లాడుతూ – “శివ ఫ‌స్ట్ క‌థ చెప్పిన‌ప్పుడు ఎంత గొప్ప‌గా ఫీల‌య్యామో, సినిమాను కూడా అంతే గొప్ప‌గా తీశాడు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. టీజ‌ర్ అద్భుతంగా ఉంది. హీరోహీరోయిన్లు చాలా బాగా చేశారు. ఈ సినిమా త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుందని నేను పూర్తిగా న‌మ్ముతున్నాను.

హీరో రూపేష్‌కుమార్ చౌద‌రి మాట్లాడుతూ – ` మా అయి ఈ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ లొగొ లాంచ్ కార్య‌క్ర‌మానికి మారుతిగారు వ‌చ్చి వారి ఆశీస్సులు అందించారు. మ‌ళ్లీ ఈ సినిమా క్యాలెండ‌ర్ లాంచ్ చేసినందుకు మారుతిగారికి థ్యాంక్స్‌. నాగార్జున‌గారిచేతుల మీదుగా మా సినిమా టీజ‌ర్ లాంచ్ అవ‌డం నెక్ట్స్ లెవ‌ల్ ఆనందంగా ఉంది“ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు శివకుమార్‌ బి.మాట్లాడుతూ – “నాగార్జున టీజ‌ర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. కొత్త ద‌ర్శ‌కుల‌ను ప్రొత్స‌హించే నాగార్జున‌గారి చేతుల మీదుగా మా టీజ‌ర్ లాంచ్ కావ‌డం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎంటైర్ 22టీమ్ త‌రఫున నాగార్జున‌గారికి థ్యాంక్స్‌. మారుతిగారు ఇటీవ‌ల ప్ర‌తిరోజూపండ‌గే సినిమాతో పెద్ద స‌క్సెస్ అందుకున్నారు. ఆ పండ‌గ‌ను ఈ పండ‌గ‌కి తీసుకువ‌చ్చారు. మా 22లో ఆ పండ‌గ జ‌రుగుతుంది. ఈ సినిమాకు ప‌ని చేసిన సాంకేతిక నిపుణులు అంద‌రికీ థ్యాంక్స్‌. కొండాకృష్ణంరాజుగారికి, మారుతిగారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌. ఆడియో విష‌యంలో ఆదిత్య‌మ్యూజిక్ మాధ‌వ్‌గారు, నిరంజ‌న్‌గారు చాలా స‌పోర్ట్ చేశారు. క‌మ‌ర్షియ‌ల్‌గాకూడా ప్రొత్స‌హిస్తున్నారు. ఇప్పుడు ఈ టీజ‌ర్‌లాంచ్‌కి కూడా వారి స‌హ‌కారం అందించారు. క‌థ ప్ర‌కార‌మే 22 అనే టైటిల్ పెట్టాం. నాకు స‌పోర్ట్ చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌“ అన్నారు.

హీరోయిన్ స‌లోని మిశ్రా మాట్లాడుతూ – ఇక్క‌డికి వ‌చ్చిన మారుతిగారికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. ఈ సినిమాలో భాగ‌మ‌వ్వ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నాకు కంఫ‌ర్ట్‌జోన్‌కు విభిన్న‌మైన మంచి పాత్ర ఇచ్చిన శివ‌గారికి థ్యాంక్స్‌. ఇదొక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. రూపేష్‌గారు బాగా న‌టించారు. ఈ సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది“ అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ ర‌వికిర‌ణ్ మాట్లాడుతూ -“ టీజ‌ర్ విడుద‌ల‌చేసిన నాగార్జున‌గారికి, ఇక్క‌డికి వ‌చ్చిన మారుతిగారికి థ్యాంక్స్‌. మా సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది. టీమ్ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

ఆర్ట్ డైరెక్ట‌ర్ పెద్దిరాజు మాట్లాడుతూ – “సినిమా బాగా వ‌చ్చింది. మాకు సహాయం చేసిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

న‌టుడు కృష్ణ‌చైత‌న్య మాట్లాడుతూ – “టైటిల్ మాదిరిగానే సినిమా కూడా చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ఈ సినిమాలో శివ నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారు. ఈ ఏడాదిలోనే నా కెరీర్‌లో ఇదొక బెస్ట్ క్యారెక్ట‌ర్‌ అని చెప్ప‌గ‌ల‌ను“ అన్నారు.

నిర్మాత బి.ఎ. రాజు మాట్లాడుతూ – “ఎంతోమంది కొత్త ద‌ర్శ‌కుల‌ను ప్రొత్స‌హించి, వారు ఈ రోజు మంచి స్థాయిలో ఉండ‌టానికి కార‌ణ‌మైన నాగార్జున చేతులు మీదుగా టీజ‌ర్‌ను లాంచ్ చేయించాల‌ని వారిని క‌లిశాను. మా అబ్బాయి..శివ ఓ సినిమాను
డైరెక్ట్ చేశాడు..అని చెబుతుండ‌గానే నాగార్జున‌గారు త‌ప్ప‌క లాంచ్ చేస్తాన‌ని ప్రోత్స‌హించి టీజ‌ర్ రిలీజ్ చేసి ఆశీస్సులు అందించారు. అలాగే నాగ‌చైత‌న్య‌గారు ఆల్‌ది బెస్ట్ చెప్పారు. డైరెక్ట‌ర్ మారుతి గారి దగ్గ‌ర శివ వ‌ర్క్ చేశాడు, శివ మీద అభిమానంతో మారుతి గారు విచ్చేసి క్యాలెండ‌ర్ లాంచ్ చేసినందుకు థాంక్స్‌. అలాగే మా ఆత్మీయులు కొండా కృష్ణంరాజుగారు రావ‌డం ఎంతో ఆనందం. శివ కు ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇచ్చిన రూపేష్ గారికి స్పెష‌ల్ థాంక్స్. ఇండస్ట్రీ ప్ర‌ముఖుల స‌పోర్ట్‌తో ఈ సినిమా ముందుకు వెళుతోంది.టీజ‌ర్ చూసిన‌వారు శివ పెద్ద ద‌ర్శ‌కుడు అవుతాడ‌ని అంటున్నారు. అది త‌ప్ప‌క జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాను. శివ‌కు జ‌య ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయి.“ అన్నారు.

రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా, విక్రమ్‌ జీత్‌ విర్క్‌, దేవిప్రసాద్‌, జయప్రకాష్‌, రవి వర్మ, శశిధర్‌ కోసూరి, ఫిదా శరణ్య, రాజశ్రీనాయర్‌, పూజా రామచంద్రన్‌, కృష్ణ చైతన్య, ఆఫ్ఘనిస్తాన్‌ రామరాజు, బేబి సంస్కృతి, మాస్టర్‌ తరుణ్‌, మాస్టర్‌ దేవాన్ష్‌, బేబి ఓజల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ : బి.వి. రవికిరణ్‌, సంగీతం: సాయికార్తీక్‌, ఎడిటింగ్‌: శ్యామ్‌ వాడవల్లి, కొరియోగ్రఫీ: అనీలామా, ఆర్ట్‌: పెద్దిరాజు అడ్డాల, స్టంట్స్‌: జాషువ, లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, ప్రొడక్షన్‌ మేనేజర్‌: కిరణ్‌ కాసా, పిఆర్ఓ: బి.ఎ రాజు, చీఫ్‌ కో-డైరెక్టర్‌: పుల్లారావు కొప్పినీడి, నిర్మాత: శ్రీమతి సుశీలాదేవి, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: శివకుమార్‌ బి.


‘జాను’ …మనతో పాటు ఇంటికి తీసుకెళ్లే సినిమా : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నేచుర‌ల్ స్టార్ నాని ‘జాను’ చూసిన త‌ర్వాత ఆ హ్యోంగోవ‌ర్‌లో ఉండిపోతాం: దిల్‌రాజు

‘జాను’ …మనతో పాటు ఇంటికి తీసుకెళ్లే సినిమా : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నేచుర‌ల్ స్టార్ నాని

‘జాను’ చూసిన త‌ర్వాత ఆ హ్యోంగోవ‌ర్‌లో ఉండిపోతాం: దిల్‌రాజు

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ ‘జాను’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో బిగ్ సీడీని ఆవిష్క‌రించారు. నేచుర‌ల్ స్టార్ నాని, వంశీ పైడిప‌ల్లి ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా …

17 ఏళ్ల‌లో తొలి రీమేక్‌: దిల్‌రాజు
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – ‘‘మా బ్యాన‌ర్ స్టార్ట్ అయ్యి 17 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్ల‌లో మేం ఎప్పుడూ రీమేక్ చేయ‌నేలేదు. మా బ్యాన‌ర్‌లో వ‌స్తోన్న తొలి రీమేక్ ఇది. రీమేక్ చేయాలంటే నాకు భ‌యం. ఎందుకంటే ఒరిజిల్ ఫీల్‌ను మిస్ కాకుండా తెర‌పైకి తీసుకురావ‌డం చాలా క‌ష్టం. త‌మిళంలో ‘96’ సినిమాను రిలీజ్ కంటే ఒక నెల ముందు చూశాను. చూసిన త‌ర్వాత ప్రివ్యూ థియేట‌ర్ నుండి బ‌య‌ట‌కు రాగానే ఈ సినిమాను నేను తెలుగులో రీమేక్ చేస్తానంటూ.. ప్రొడ్యూస‌ర్‌కి చెక్ ఇచ్చేశాను. అందుకు కార‌ణం సినిమా చూసే స‌మ‌యంలో ఎమోష‌న్స్‌తో గుండె బ‌రువెక్కింది. అప్పుడు మా ‘ఎంసీఏ’ షూటింగ్ జ‌రుగుతుంది. ‘96’ చిత్రాన్ని రీమేక్ చేయాల‌నుకుంటున్నాన‌ని నానితో చెప్పాను. త‌ను కూడా చెన్నై వెళుతున్నాన‌ని చెప్పాడు. అప్పుడు త‌న కోసం ఓ షో ఏర్పాటు చేస్తే.. త‌ను సినిమా చూసి సినిమా ‘క్లాసిక్ సినిమా సార్‌! చాలా బావుంది’అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. త‌మిళంలో సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత మళ్లీ ఆడియెన్స్‌తో క‌లిసి సినిమా చూశాను. నాకు తమిళంలో పూర్తిగా రాకపోయినప్పటికీ ప్రేక్ష‌కుల నుండి వ‌చ్చిన రెస్పాన్స్ చూసి ఎవ‌రు ఏమ‌నుకున్నా..ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాల‌ని డిసైడ్ అయ్యాను. జానుగా స‌మంత‌ను ఈ సినిమాలో యాక్ట్ చేయించాల‌ని అనుకున్నాను. త‌నని త‌ప్ప‌.. ఆ పాత్ర‌లో మరొక‌రిని ఆ పాత్ర‌లో ఊహించుకోలేక‌పోయాను. ఈ మ‌ధ్య త‌ను చేస్తున్న సినిమాలన్నీ సూప‌ర్బ్‌గా సెల‌క్ట్ చేసుకుంటుంది. త‌న‌తో మాట్లాడి సినిమాకు ఒప్పించాను. ఇక నా బ్ర‌ద‌ర్ శ‌ర్వాకి ఫోన్ చేసి సినిమా చూడ‌మంటే సినిమా చూసి సూప‌ర్బ్‌గా ఉంద‌ని ఫోన్ చేశాడు. అలా శ‌ర్వా, స‌మంత ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. మా ఆర్య సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా ప‌నిచేసిన ప్రేమ్‌కుమార్ ‘96’ సినిమాకు డైరెక్ట‌ర్‌గా మారాడు. త‌మిళంలో సినిమా చేసిన త‌న‌తో మాట్లాడి తెలుగులోనూ డైరెక్ట్ చేయ‌మ‌ని చెప్పాను. త‌మిళంలో చేసిన టెక్నీషియ‌న్సే ఈ సినిమాకు ప‌నిచేశాను. సినిమా స్టార్ట్ చేసిన త‌ర్వాత కెన్యాలో శ‌ర్వా న‌డుపుతున్న జీపు బోల్తా పడింది.. దేవుడి దయవల్ల త‌న‌కు ఏమీ కాలేదు. త‌ర్వాత మ‌రో డిస్ట్ర‌బెన్స్ వచ్చింది. ఏంటి? ఇంత మంచి సినిమాకు ఇన్ని అడ్డంకులు? అని అనుకున్నాను. అయితే అన్నింటినీ ఒక్కొక్క‌టిగా దాటుకుంటూ వ‌చ్చి సినిమాను పూర్తి చేశాం. ఈ సినిమాను చేస్తున్న‌ప్పుడు ‘దిల్‌రాజుకేమైనా మెంటలా? డ‌బ్బింగ్ చేయొచ్చు క‌దా?’ అని చాలా కామెంట్స్ విన్నాను. ఆ ఫీల్‌ను తెలుగులో అలాగే క్యారీ చేశాం. అదే ఫ్లేవ‌ర్‌ను డైరెక్ట‌ర్ ప్రేమ్ తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ఫిబ్ర‌వ‌రి 7న మా ‘జాను’ సినిమాను చూసిన తెలుగు ప్రేక్ష‌కులు వావ్ అంటారు. చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. ఈ సినిమా హ్యాంగోవ‌ర్‌లో ఉండిపోతాం. జాను సినిమా చూసిన త‌ర్వాత మ‌న లైఫ్‌లోని మెమొరీస్‌ను ఇంటికి తీసుకెళ్తాం. ఫిబ్ర‌వ‌రి 7న నేను చెప్పిన‌వ‌న్నీ నిజాలు అవుతాయి’’ అన్నారు.

మర్యాద ఉన్న సినిమా
వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ – ‘‘రాజుగారు ఈ రీమేక్ చేస్తున్నామ‌ని అనుకున్న‌ప్పుడు వ‌ద్ద‌ని వారించిన వారిలో నేనూ ఒక‌డ్ని. కానీ ట్రైల‌ర్‌ను చూసి షాక‌య్యాను. ప్రేమ్ అదే మూమెంట్స్‌ను తెలుగులో రీ క్రియేట్ చేశాడు. అందుకు కారణం ఈ సినిమా త‌న మ‌న‌సులో నుండి వ‌చ్చిన ఆలోచ‌న. అందుక‌నే అద్భుతంగా ఈ సినిమాను మ‌లిచాడు. ఇక తమిళంలో త్రిష‌..తెలుగులో స‌మంతగా న‌టించిన గౌరికి నేను పెద్ద ఫ్యాన్‌ని. భవిష్యత్తులో తెలుగు సినిమా గురించి రాసేట‌ప్పుడు స‌మంత గురించి కూడా కొన్ని పేజీలు రాసేంత స్థాయికి ఎదిగింది. అయినా స‌మంత విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమా ఫెయిలైతే నా కెరీర్ ఏంటి? అని ఇప్ప‌టికీ ఆలోచిస్తుంటుంది. ఆ భ‌యం, ప్యాష‌న్‌తోనే ఇప్పటికీ సినిమాలు చేస్తుంది. నేను డైరెక్ట‌ర్‌గా మారే క్ర‌మం నుండి శ‌ర్వానంద్ తెలుసు. త‌ను అప్ప‌టికీ యాక్ట‌ర్ కాలేదు. ఇప్పుడు సినిమాలు చేసుకుంటూ ఈ స్థాయికి చేరాడు. ‘జాను’ క‌మ‌ర్షియ‌ల్ సినిమా కాదు.. మ‌ర్యాద ఉన్న సినిమా. అదే గౌర‌వం, మ‌ర్యాదతో రాజుగారు సినిమా చేశారు. ఆయ‌న డ‌బ్బు క‌న్నా గౌర‌వం సంపాదించాల‌నుకుంటారు. 96 సినిమా తమిళంలో ఎంత పెద్ద విజ‌యాన్ని సాధించిందో తెలుగులోనూ అలాగే నిల‌బ‌డుతుంద‌ని న‌మ్ముతున్నాను’’ అన్నారు.

గర్వంగా ఫీలవుతారు
సమంత అక్కినేని మాట్లాడుతూ – ‘‘అభిమానుల‌ను డిస‌ప్పాయింట్ చేయ‌కూడ‌ద‌నే నేను ప్ర‌తీ సినిమాకు భ‌య‌ప‌డుతుంటాను. ప్ర‌తి సినిమాను.. షూటింగ్‌కి వెళ్లే ప్ర‌తిరోజుని నా మొద‌టి సినిమాకు మొద‌టి రోజు వెళ్లేలాగానే ఫీల్ అవుతాను. ప్రేక్ష‌కులు అందిస్తున్న స‌పోర్ట్‌కు థ్యాంక్స్‌. క్లాసిక్ సినిమా రీమేక్ ఇది. దీని గురించి ఇప్పుడు ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది. ఫిబ్ర‌వ‌రి 7 త‌ర్వాత త‌ప్ప‌కుండా మాట్లాడుతాను. ప్ర‌తిరోజూ ఈ సినిమా షూటింగ్‌లో ఏదో ఒక మేజిక్ జ‌రుగుతూనే ఉండింది. దిల్‌రాజుగారు అడ‌గ్గానే నేను పారిపోయాను. అయినా కూడా ఆయ‌న రెండోసారి అడిగి గొప్ప అవ‌కాశాన్ని ఇచ్చారు. నా రామ్‌లాగా న‌టించిన శ‌ర్వాకు థ్యాంక్స్‌. నా పెర్ఫామెన్స్‌కు ఏదైనా క్రెడిట్ ద‌క్కితే అది శ‌ర్వా వ‌ల్ల‌నే కుదిరింది. ప్రేమ్‌కుమార్‌గారికి థ్యాంక్స్‌. ఆయ‌న మేజిషియ‌న్‌లా మ‌రోసారి మేజిక్‌ని క్రియేట్ చేశాడు. నేను మీ అందరినీ గ‌ర్వంగా ఫీల‌య్యేలా చేస్తాన‌నే అనుకుంటున్నాను’’ అన్నారు.

తొంబై ఏళ్ల వరకు కనెక్ట్ అయ్యే సినిమా
హీరో శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘కొంత మంది హీరోయిన్స్‌తో ప‌నిచేయాలంటే కాస్త ఆలోచించుకుంటాం. నిత్యామీన‌న్‌, సాయిప‌ల్ల‌వి..స‌మంత వంటి వాళ్లు సీన్స్‌ను తినేస్తారు. వీళ్ల‌తో సినిమా అన‌గానే కొంచెం మ‌నం అల‌ర్ట్‌గా ఉండాలి. స‌మంత‌తో తొలిసారి ప‌నిచేశాను. ప్ర‌తి సీన్‌ను వంద శాతం చెక్ చేసుకునే న‌టిస్తుంది. అందుకే త‌ను సూప‌ర్‌స్టార్ అయ్యింది. స‌మంత జానుగా చేయ‌కుంటే ఈ సినిమా లేదు. నాకు ఏదైనా క్రెడిట్ అంటూ వ‌స్తే.. దానికి కార‌ణం స‌మంతే. ఆరు నుండి 90 ఏళ్ల వ‌ర‌కు అంద‌రికీ ఈ సినిమా క‌నెక్ట్ అవుతుంది. ఫ‌స్ట్ ల‌వ్‌ను ఎవ‌రూ మార్చ‌లేరు. చాలా స్వీట్ మెమురీస్ ఉన్నాయి. ర‌మేశ్‌, కిషోర్ క్యారెక్ట‌ర్స్ మ‌న‌కు క‌న‌ప‌డ‌తాయి. నా టీమ్ అంద‌రికీ థ్యాంక్స్‌. ఇలాంటి అద్భుత‌మైన సినిమాను ఇచ్చిన శిరీషన్న‌, రాజన్న‌, హ‌ర్షిత్‌ల‌కు థ్యాంక్స్‌. నేను ఈ సినిమాను చూసి ‘క్లాసిక్ మూవీ క‌దా! మ‌నం చేయాలా?’ అన్నాను. ‘నువ్వు న‌న్ను న‌మ్ము’ అని దిల్‌రాజు అన్నారు. ఆయ‌న‌పై న‌మ్మకంతో సినిమా చేశాను. సార‌థి స్టూడియోలో నానితో ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ అయ్యింది. నేను, న‌రేశ్‌, నాని క‌లిసి చాలా ట్రిప్స్‌కు వెళ్లాం. త‌న‌కు థ్యాంక్స్‌’’ అన్నారు.

మనతో పాటు ఇంటికి తీసుకెళ్లే సినిమా
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ – ‘‘రాజుగారితో పాటు నాకు ఈ సినిమాను చూడ‌మ‌న్నప్పుడు.. ‘ఇంత మంచి సినిమా, ఎంతో బాగా చేశారు. దీన్ని ట‌చ్ చేయ‌కండి’ అని నా ఒపీనియ‌న్ చెప్పాను. తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నార‌ని నా ద‌గ్గ‌ర ప్ర‌స్తావ‌న వ‌చ్చిన ప్ర‌తిసారీ తెలుగులో ఈ సినిమాను తీయ‌కూడ‌ద‌ని నేను చెప్పేవాడిని. కానీ.. ఈ సినిమాలో శ‌ర్వానంద్‌, స‌మంత చేస్తున్నార‌ని అనౌన్స్ చేయ‌గానే ఈ సినిమాను తెలుగులో ఎప్పుడు చూస్తామా? అనిపించింది. ట్రైల‌ర్ చూసిన‌ప్పుడు ఆ న‌మ్మ‌కం నిజ‌మైంది. త‌మిళంలో నేను ఏదైతే చూశానో అదంతా పోయింది. ఇప్పుడు రామ్, జాను అంటే శ‌ర్వా, సామ్‌లే గుర్త‌కొస్తున్నారు. త‌మిళంలో సినిమాను డైరెక్ట్ చేసిన ప్రేమ్‌కుమారే ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. కాబ‌ట్టి ఫీల్ ఎక్క‌డా మిస్ అయ్యుండ‌దు. శ‌ర్వా.. నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చినప్పుడు నా తొలి ఫ్రెండ్. శ‌ర్వా, సామ్ ఇద్ద‌రూ మంచి పెర్ఫామెర్స్‌. పోటీ ప‌డి న‌టించారు. శ‌ర్వా ఏ సినిమా చేసినా స‌రే! వాడికి మాత్రం చాలా మంచి పేరు వ‌స్తుంటుంది. ఈ సినిమాకు మంచి పెర్ఫామర్ అవ‌స‌రం. అందుక‌నే త‌మిళంలో విజ‌య్‌సేతుప‌తిని, తెలుగులో శ‌ర్వానంద్‌ని తీసుకున్నారు. ఇక సామ్ గురించి చెప్పాలంటే.. త‌న‌ను చూసి.. త‌ను ఎంచుకుంటున్న సినిమాల‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను. ప్ర‌తి సంవత్స‌రం ప‌ది మంచి సినిమాలున్నాయంటే అందులో రెండు, మూడు స‌మంత సినిమాలుంటున్నాయి. ఇప్పుడు త‌న లిస్టులో మ‌రొక‌టి జాయిన్ అవుతుంది. రాజుగారి కౌంటింగ్ సంక్రాంతి నుండి స్టార్ట్ అయ్యింది. మ‌ళ్లీ ఫిబ్రవ‌రి 7 నుండి మళ్లీ స్టార్ట్ అయ్యి మార్చి 25వ‌ర‌కు కంటిన్యూ అవుతుంది. అక్క‌డి నుండి నేను చూసుకుంటా. అలాగే శిరీష్‌గారికి కంగ్రాట్స్‌. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌రే కాదు.. రాజుగారికి ఎప్ప‌టికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. కొన్ని సినిమాల‌ను చూసి ఎంజాయ్ చేస్తాం. కొన్నింటిని ఎంజాయ్ చేయ‌డ‌మే కాదు.. ఇంటికి కూడా తీసుకెళ‌తాం. అలా ఇంటికి తీసుకెళ్లే సినిమాల్లో ‘జాను’ ఒక‌టి. ఎంటైర్ యూనిట్‌కి కంగ్రాట్స్‌’’ అన్నారు.
జూనియర్ శర్వానంద్‌గా(రామ్ పాత్రలో) నటించిన సాయికిర‌ణ్ మాట్లాడుతూ – ‘‘నాకు అవ‌కాశం ఇచ్చిన దిల్‌రాజు, శిరీష్‌గారికి థ్యాంక్స్‌. ప్రేమ్‌కుమార్‌గారు మేజిషియ‌న్‌. నాకు ఎంతో స‌పోర్ట్ అందించారు. యంగ్ రామ్ పాత్ర‌లో న‌టించినందుకు హ్యాపీగా ఉంది. కిర‌ణ్‌గారు చాలా మంచి డైలాగ్స్ రాశారు. స‌మంత‌గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఆమెతో క‌లిసి సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది’’ అన్నారు.
జూనియర్ సమంతగా(జాను చిన్నప్పటి పాత్రలో) నటించిన గౌరి మాట్లాడుతూ – ‘‘96’ సినిమాను నా డెబ్యూ మూవీగా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. జాను సినిమాతో అదే పాత్రను చేయడం మరింత అదృష్టంగా భావిస్తున్నాను. ప్రేమ్‌కుమార్‌గారు నా పాత్ర‌ను అద్భుతంగా మ‌లిచారు. స‌మంత‌గారి చిన్న‌ప్ప‌టి పాత్ర‌లో న‌టించ‌డం గౌర‌వంగా ఉంది. మేం మేజిక్‌ను రీ క్రియేట్ చేశాం. ప్రేక్ష‌కుల అభిమానాలు, ఆశీస్సులు ఉంటాయ‌ని భావిస్తున్నాను’’ అన్నారు.


ఇంకా ఈ సినిమాలో ఎంటైర్ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.


‘‘పలాస 1978’’ మూవీ నుండి నక్కిలీసు గొలుసు అనే సాంగ్ ను రిలీజ్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్

రక్షిత్ నటన నన్ను ఆశ్చర్య పరిచింది- ‘‘పలాస 1978’’ మూవీ నుండి నక్కిలీసు గొలుసు అనే సాంగ్ ను రిలీజ్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘‘పలాస 1978’’ . తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో
రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. డైరెక్టర్ కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ విడుదలకు ముందే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. జిఎ2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్న ఈ
మూవీ త్వరలో విడుదలకు సిద్దం అవుతుంది. ‘పలాస 1978’ సినిమా చూసి, టీం ని అభినందించి ‘పక్కన పడ్డాది చూడరో పిల్లా నాది నక్కిలీసు గొలుసు’ అనే పాటను టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ గారు లాంఛ్ చేసారు..

ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ గారు మాట్లాడుతూ:
‘దర్శకుడు కరుణ్ కుమార్ గారు రైటర్ గా ఉన్నప్పుటి నుండి నాకు తెలుసు, ఆయన కథలు కొన్ని నేను చదివాను చాలా బాగుంటాయి. దర్శకుడిగా తన తొలి ప్రయత్నంలోనే వాస్తవ సంఘటనల ఆధారంగా కథను రెడీ చేసుకొని ‘పలాస 1978’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు రక్షిత్ నటన నన్ను ఆశ్చర్యపరిచింది. కొత్త కుర్రాడు ఎలా చేస్తాడు అనుకున్నాను కానీ చాలా బాగా చేసాడు. పల్లెటూరి కుండే సంస్కృతిని తెరమీద ఆవిష్కరించే దర్శకులు తెలుగులో తక్కువ మంది ఉన్నారు. వారి కంటే దర్శకుడు కరుణాకుమార్ ముందడుగు వేసాడు. మిగతా వారు ఆయన్ను ఫాలో అవ్వాలి. ఇందులో పాటలు కూడా చాలా బాగున్నాయి. ఉత్తరాంధ్ర జానపదం చాలా ఫేమస్ మా కాలేజ్ రోజుల్లో కూడా ఆపాటలే పాడుకునే వాళ్ళం. అలాంటి ఉత్తరాంధ్ర జానపదం నుండి వచ్చిన ‘ పక్కన పడ్డాది చూడరో పిల్లా నాది నక్కిలీసు గొలుసు’ పాట చాలా బాగుంది. ఈ సినిమాకు మ్యూజిక్ ని అందించడమే కాకుండా ముఖ్య పాత్రను పోషించిన రఘ కుంచె ను అభినందిస్తున్నాను. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని
కోరుకుంటున్నాను’ అన్నారు.

రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్
సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్దం అవుతున్న ఈ చిత్రానికి పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం :
రఘు కుంచె,
పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా,
నిర్మాత : ధ్యాన్ అట్లూరి.
రచన- దర్శకత్వం : కరుణ కుమార్.


స్టార్ కమిడియన్ సంతానం హీరోగా సర్వర్ సుందరం ఫిబ్రవరి 14న విడుదల

స్టార్ కమిడియన్ సంతానం హీరోగా సర్వర్ సుందరం ఫిబ్రవరి 14న విడుదల !!

స్టార్ కమెడియన్ సంతానం హీరో గా తెరకెక్కిన సర్వర్ సుందరం తమిళ, తెలుగు భాషల్లో ఈ ప్రేమికులు రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదలకి సిద్ధం అయ్యింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన కమిడియన్ సంతానం ఈ కమర్షియల్ కామెడీ ఎంటెర్టైనెర్ లో హీరో గా ఆడియన్స్ ని ఫుల్ గా అలరించబోతున్నారు. అలానే ఈ సినిమాలో హీరోయిన్ వైభవి సంతానంకు జోడిగా నటించింది. ప్రముఖ నటుడు రాధా రవి ఈ మూవీలో కీలక పాత్రలో నటించడం జరిగింది.

కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు మాస్ ఆడియన్స్ కు కావాల్సిన యాక్షన్ సన్నివేశాలు ఈ మూవీలో ఉండడం విశేషం. బల్కి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను ఉదయ్ హర్ష వడ్డెల, డి.వెంకటేష్ నిర్మాతలు. ఫిబ్రవరి 14న తెలుగులో భారీ రేంజ్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి అని నిర్మాతలు తెలిపారు.

నటీనటులు:
సంతానం, వైభవి, రాధా రవి
దర్శకత్వం: బల్కి
నిర్మాతలు: ఉదయ్ హర్ష వడ్డెల, డి.వెంకటేష్
సంగీతం: శీలంబరసం
కెమెరామెన్: అభినందన్ రామనుజం
ఎడిటింగ్: అంథోని


కళాత్మక దృశ్యకావ్యం ‘శంకరాభరణం’ – ఫిబ్రవరి 2కు నాలుగు దశాబ్దాలు పూర్తి

కళాత్మక దృశ్యకావ్యం ‘శంకరాభరణం’

– ఫిబ్రవరి 2కు నాలుగు దశాబ్దాలు పూర్తి
తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం ‘శంకరాభరణం’. ఈ సినిమా విడుదలై ఫిబ్రవరి 2వ తేదీకి 40 సంవత్సరాలు
పూర్తవుతుంది. ఫిబ్రవరి 2 , 1980లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఈ కళాఖండం విడుదలైంది. కళా తపస్వి కె.విశ్వనాధ్ దర్శకత్వంలో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్
పతాకం పై ఏడిద నాగేశ్వరరావు – ఆకాశం శ్రీరాములు దీన్ని నిర్మించారు . శంకరశాస్త్రి, తులసి మధ్య అలవికాని అనుబంధం చక్కగా ఆవిష్కరించిన సినిమా ఇది. ఇది ఒక్క
తెలుగులోనే కాదు పక్క రాష్ట్రాలైన తమిళనాడు , కర్ణాటక, కేరళ లలో కూడా అఖండ విజయం సాధించింది . అమెరికా లో రెగ్యులర్ థియేటర్స్ లో విడుదలైన మొట్ట మొదటి
చిత్రం ఇదే. అలాగే ప్రపంచ నలు మూలల్లో ఎన్నో దేశాల్లో విడుదలై తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది . అప్పట్లో ఎవరి నోట విన్నా ‘శంకరాభరణం’ గురించే ప్రస్తావన .
శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన రోజుల్లో ఈ సినిమా విడుదల తరువాత ఎంతో మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టారు . ప్రతి తెలుగు వాడు ఇది మా
సినిమా అని గర్వంగా చెప్పుకొనేవారు.

ఇక అవార్డుల విషయానికి వస్తే , జాతీయ అవార్డుల్లో కళాత్మక విలువలు , వినోదాత్మకం తో కూడిన జనరంజక చిత్రంగా స్వర్ణ కమలం
అందుకుంది. తెలుగులో స్వర్ణ కమలం అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. అలాగే గాయకులు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కు ఉత్తమ నేపధ్య గాయకుడిగా తొలి సారి
జాతీయ అవార్డు , శ్రీమతి వాణి జయరాం కు ఉత్తమ గాయకురాలి గా , కె.వి.మహదేవన్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు లభించిన సినిమా ఇది . అలాగే
మన ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డులతోపాటు, దేశంలోని అనేక సాంస్కృతిక సంస్థలు ఈ చిత్ర బృందాన్ని అవార్డులు, సన్మానాలతో ముంచెత్తాయి .

కథేమిటి?
శంకరశాస్త్రి (జె. వి. సోమయాజులు) గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన సంగీతమంటే చెవి కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వేశ్య కూతురు, గొప్ప నర్తకి అయిన తులసి (మంజు భార్గవి) ఆ వృత్తిని అసహ్యించుకుంటుంది. కళలను ఆరాధించే తులసి, శంకరశాస్త్రిని గురుభావంతో ఆరాధిస్తుంది. ఆమె తల్లి మాత్రం ఆ వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. ఆమెను బలాత్కరించి శంకర శాస్త్రిని తులనాడిన విటుణ్ణి విధిలేని పరిస్థితులలో హతమారుస్తుంది తులసి. ఈ కేసు నుంచి ఆమెను బయటకు తీసుకురావడానికి శంకర శాస్ర్తి అండగా నిలుస్తాడు. లాయర్ అయిన తన స్నేహితుడి సాయంతో తులసిని విడిపిస్తాడు. వేశ్యకు ఆశ్రయం ఇచ్చారని శంకరశాస్త్రిని అందరూ చిన్న చూపు చూస్తారు. తన వల్ల శంకరశాస్త్రి నిందలు పడవలసి రావడం తట్టుకోలేని తులసి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. కాలక్రమంలో పాశ్చాత్య సంగీతపు ఒరవడిలో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరవై శంకరశాస్ర్తి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనపై జరిగిన అత్యాచార ఫలితంగా తులసి ఒక పుత్రుడికి తల్లి అవుతుంది. శంకరశాస్త్రి దగ్గర నేర్చుకోవడానికి అతన్ని నియమిస్తుంది. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది. చివరకు తన కొడుకును ఆయన సంగీతానికి వారసుడిగా నియమిస్తుంది. కన్ను మూసిన శంకరశాస్త్రి పాదాల దగ్గరే ప్రాణాలు ఆమె కూడా ప్రాణాలువిడుస్తుంది. సంగీతమే ప్రాణం ఈ సినిమాకి కె.వి. మహదేవన్ సంగీతం ప్రాణంగా నిలిచింది. జంధ్యాల మాటలు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణీజయరాం పాటలు, జేవీ సోమయాజులు, మంజుభార్గవి, బేబీ తులసి, అల్లు రామలింగయ్యల నటన… వెరసి ‘శంకరాభరణం’ అనే కళాఖండం. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు చాగంటి కోటేశ్వర రావు ఈ సినిమాపైనే మూడు రోజులు ప్రవచనాలు చేశారంటే ఈ సినిమా విశిష్టత ఎలాంటిదో అర్థంచేసుకోవచ్చు. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేక గౌరవాన్ని తీసుకు వచ్చిందీ చిత్రం. ఈ సినిమా పాటలు ఇప్పటికీ జనం నోళ్లలో నానుతూనే ఉన్నాయి. కాలం మారినా ఇది మాత్రం కలకాలం నిలిచి ఉండే సినిమా అని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.

నటీ నటులు
జె.వి .సోమయాజులు
మంజు భార్గవి
అల్లు రామలింగయ్య
చంద్ర మోహన్
రాజ్యలక్ష్మి
తులసి

నేపధ్య గానం
ఎస్ .పి.బాలసుబ్రహ్మణ్యం
ఎస్. జానకి
వాణి జయరాం


‘అల.. వైకుంఠపురములో’ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు

* ‘అల.. వైకుంఠపురములో’ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు!
* తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను
– స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

“రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇదొక దాటుకుంటూ వెళ్ళిపోయే దశ. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో రికార్డ్ కొడతారు. ఈ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు. తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను” అన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మాటల మాంత్రికుడుగా పేరుపొందిన సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్,గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (నాన్-బాహుబలి) సాధించిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన థాంక్స్ మీట్ లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను షీల్డులతో సత్కరించారు.

ఈ వేడుకలో నటుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ, “ప్రేక్షకులందరికీ హత్తుకొన్నట్లే ఈ సినిమాలోని డైలాగ్స్ నాకు హత్తుకున్నాయి. పండగ పూట ఈ సినిమా రిలీజ్ చేశారు అని అనుకున్నాను కానీ, నా జీవితంలో ఈ సినిమాతో పండగ స్టార్ట్ అవుతుంది అని నాకు తెలియదు. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే నాకు రెండు పెద్ద సినిమాలు వచ్చాయి. చాలా థాంక్స్” అన్నారు.
నటుడు మురళీ శర్మ మాట్లాడుతూ, “మా నాన్నగారు పోయి ఇంకా ఒక సంవత్సరం కాలేదు. అప్పటినుంచి చూసుకుంటే ఈ సినిమాతో నాకు, నా ఫ్యామిలీకి ఎంత ఆనందం ఇచ్చారో మాటల్లో చెప్పలేను. త్రివిక్రమ్ గారూ.. థాంక్యూ సో మచ్. ఈ సినిమాతో చాలా కలలు నావి నిజమయ్యాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తండ్రిగా చేయడం ఒక పెద్ద కల. అది నెరవేరింది. గీతాఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్లలో పెద్ద క్యారెక్టర్ చేసి పేరు తెచ్చుకోవాలి అన్నది ఇంకో కల. అది కూడా నిజమైంది. త్రివిక్రమ్ ను మాటల మాంత్రికుడు అంటారు. కానీ ఆయన నా జీవితానికి ప్రేమ. ‘అల వైకుంఠపురంలో’ అనే కథ రాసినందుకు, అందులో వాల్మీకి అనే పాత్రను సృష్టించి దానికి నన్ను తీసుకున్నందుకు థాంక్స్. నాకు నిజంగా మాటల్లేవు. తమన్ రాక్ స్టార్. బన్నీ ఐ లవ్ యు. నేను సెట్లో బన్నీని చూడలేదు, బంటూని మాత్రమే చూశాను. అద్భుతమైన సహనటుడు. సినిమాకు ఈ రకమైన స్పందన ఇచ్చినందుకు ప్రేక్షకులకు థాంక్స్” అన్నారు.

నటుడు సుశాంత్ మాట్లాడుతూ, “ఎవరిమైనా సినిమా బాగా ఆడాలని కోరుకుంటాం. అయితే ఇంత హిట్టవుతుందని నాకు తెలియదు. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి అందరూ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నేను చూశాను. ఫలితం ఇలా వచ్చినందుకు చాలా హ్యాపీ. టీం మొత్తానికి నా అభినందనలు. ప్రేక్షకులు ఈ సినిమాని ఈ స్థాయి హిట్ చేసినందుకు థాంక్స్. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్.. నాన్ బాహుబలి రికార్డ్స్ ఈ చిత్రం సొంతం. బన్నీ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది డాన్స్. ఇందులో గొప్పగా నటించాడు. త్రివిక్రమ్ గారితో పని చేసేటప్పుడు చాలా నేర్చుకున్నాను. నా తర్వాతి సినిమాకి వాటిని అమలుచేయడానికి ప్రయత్నం చేస్తాను. అల్లు అరవింద్ గారు, చినబాబు గారు చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. తమన్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ‘రాములో రాములా’ వంటి మంచి పాటలో నేను కూడా డ్యాన్స్ చేసినందుకు సంతోషంగా ఉంది” అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నుంచి షీల్డ్ అందుకున్న ఆదిత్య మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య మాట్లాడుతూ, “తమన్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఇవి మేము గర్వపడే క్షణాలు. సంగీత పరంగా ఈ సినిమా ఆల్ టైం హిట్ అయింది. సినిమా కూడా అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

తమన్ మాట్లాడుతూ, “క్రికెట్లో హ్యాట్రిక్ అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఇక్కడ కూడా హ్యాట్రిక్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. త్రివిక్రమ్ కు, బన్నీకి హ్యాట్రిక్. నాకు, బన్నీకి ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’ తర్వాత ఇది హ్యాట్రిక్. అందుకే మొత్తం ఎనర్జీ ఈ సినిమాకి పని చేసింది. మా టెక్నీషియన్స్ అందరూ 100 శాతం బెస్ట్ వర్క్ ఇచ్చారు. కలెక్షన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చాయి. ఇండస్ట్రీ హిట్ కావటం వెరీ వెరీ హ్యాపీ. ఇది చాలా అరుదుగా జరిగే విషయం. ఇండస్ట్రీకి, సినిమాకి చాలా మంచిది. ‘అల వైకుంఠపురములో’ ఈ రికార్డ్స్ క్రియేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక ఆల్బమ్ హిట్టయితే మ్యూజిషియన్స్ కు చాలా హెల్ప్ అవుతుంది. కచేరీల్లో పాటలు పాడుకోవచ్చు. సీతారామశాస్త్రి గారు, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ చాలా బాగా పాటలు రాశారు. ఇప్పటిదాకా నేను పనిచేసిన టీమ్స్ లో ఇది బెస్ట్ టీం. కొంతమంది హీరోలు పాటల్ని ఇంకో స్థాయికి తీసుకెళ్తారు. బన్నీ అలాంటి హీరో. త్రివిక్రమ్ గారితో పని చేయటం ఒక మ్యాజిక్. నా జీవితంలో అలాంటి వ్యక్తిని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా హృదయంలో నా మనసులో ఆయన చాలా మార్పులు తీసుకువచ్చారు. నాలో ఒక కొత్త నరం వేశారు. అల్లు అరవింద్ గారు, రాధాకృష్ణ గారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా మంచి సినిమా ఇచ్చారు. ఈ సక్సెస్ నా జీవితంలో ధైర్యాన్ని ఇచ్చింది. ఇంకా కొంచెం ప్రయోగాలు చేయొచ్చు అనే శక్తినిచ్చింది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ముందు ముందు మరింత కష్టపడి మరింత మంచి మ్యూజిక్ ఇవ్వడానికి కృషి చేస్తాను” అని చెప్పారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, “మేము తీశాము, మీరు చూశారు. మేము తీయటానికి మీరు చూడటానికి మధ్య డిస్ట్రిబ్యూటర్లు అనే వారధులు ఉన్నారు. సినిమాని మీకు (ప్రేక్షకులకు) చూపించడానికి మాకు డబ్బులు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ ని, ఎగ్జిబిటర్స్ ని గౌరవించుకోవడం మా విధి. నేను ‘విజేత’ సినిమా నుంచి పదుల సంఖ్యలో చిరంజీవి గారి సినిమాలకు పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసి, షీల్డులు ఇస్తూ వచ్చాను. ఇప్పుడు సినిమా ఆడే రోజులు తగ్గిపోయి, లెక్కలు కలెక్షన్ల కింద, రెవెన్యూ కింద మారిపోయాక ఈ ఫంక్షన్ లు లేకుండా పోయాయి. కానీ మళ్లీ ఈ రోజుకి ఇంత ఆల్ టైం రికార్డు కొట్టడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు.

దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ, “ఇంత ప్రేమగా మమ్మల్ని దగ్గరకు తీసుకొని పాటల దగ్గర్నుంచి ఇక్కడిదాకా నడిపించి ఆశీర్వదించిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా మా అందరి తరపున కృతజ్ఞతలు, నా పాదాభివందనం” అన్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ, “గీతా ఆర్ట్స్ లో ప్రొడక్షన్ కంపెనీయే కాకుండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఉంది. ఎప్పుడైనా ఆఫీసు వైపు వెళ్ళినప్పుడు ‘ఏవండీ ఎప్పుడూ సెలబ్రేషన్ మీరేనా చేసుకునేది, మమ్మల్ని జనం దగ్గరికి తీసుకెళ్ళరా, మమ్మల్ని పట్టించుకోరా, మాకు షీల్డ్స్ ఇచ్చి సత్కరించరా?’ అని అడిగేవాళ్లు. ‘అంత సినిమా వచ్చినప్పుడు కచ్చితంగా చేస్తాను’ అని చెప్పేవాడిని. నిజంగా అలాంటి సినిమా ఇప్పుడు వచ్చింది. మాకు ఆ అవకాశం ఇచ్చింది ప్రేక్షకులు. మా టీం కలిసి చేసింది 50 శాతం అయితే ప్రేక్షకుల దగ్గరకు సినిమాని తీసుకువచ్చింది 50 శాతం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు. వాళ్లందరికీ చాలా కృతజ్ఞతలు. నాతో పని చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరి తరఫున ప్రేక్షకులకు థాంక్స్ చెబ్తున్నా. నిర్మాతలు రాధాకృష్ణ గారికి, అల్లు అరవింద్ గారికి నా ధన్యవాదాలు. మా నాన్నను ఎలా సంబోధించాలా అని ఒక్కోసారి నాకు కన్ఫ్యూజన్ వస్తుంటుంది. మా నాన్న నన్ను పరిచయం చేస్తూ ‘గంగోత్రి’, తర్వాత ‘బన్నీ’, ఇంకా ఎన్నో హిట్లిచ్చారు. రాధాకృష్ణ గారితో మొదటిసారి ‘జులాయి’ చేశాను. అది సక్సెస్ ఫుల్ ఫిలిం. తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చేశాను. వీళ్ళిద్దరూ నాకు బెస్ట్ ప్రొడ్యూసర్లు. ఇద్దరితో సూపర్ హిట్స్ కొట్టాను కానీ ఇద్దరూ కలిస్తే ఆల్ టైం రికార్డ్ హిట్ వచ్చింది. ఇద్దరికీ చాలా థ్యాంక్స్. నేను ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది.. బన్నివాసు, వక్కంతం వంశీకి. ఎప్పటి నుంచో నేను త్రివిక్రమ్ తో సినిమా చేయాలనుకుంటున్నా కానీ ఆయనతో చేస్తే బాగుంటుంది అని నాకు బూస్ట్ ఇచ్చింది, త్రివిక్రమ్ గారిని తీసుకొచ్చింది వాళ్ళిద్దరు. వాళ్లకి థాంక్స్. అలాగే నేను ఎక్కువగా గడిపే నా పర్సనల్ స్టాఫ్ కు థాంక్స్. ఇంత పెద్ద హిట్ వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తో సెలబ్రేషన్స్ చేసుకోవడం మా బాధ్యత. ఇక రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇదొక దాటుకుంటూ వెళ్ళిపోయే దశ. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో రికార్డ్ కొడతారు. ఈ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు. తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం.. ‘సిత్తరాల సిరపడు’ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. అందులో నేను సిగరెట్ తాగుతాను. అది సినిమాలో ఆ క్యారెక్టర్ ని బట్టి చేసింది. నిజజీవితంలో అది మంచిది కాదు. పిల్లలు స్మోక్ చేయవద్దు. పిల్లలే కాదు పెద్దలు కూడా స్మోక్ చెయ్యొద్దని కోరుకుంటున్నాను. అది ఆరోగ్యానికి హానికరం. దయచేసి పొగ తాగకండి. మరోసారి నా అభిమానులకు, నా ఆర్మీకి థాంక్స్ చెప్పుకుంటున్నాను. కేవలం మీ ప్రేమ వల్లే ఇంత దూరం వచ్చాను. ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించిన తెలుగు ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్” అని చెప్పారు.
ఈ ఈవెంట్ లో డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు అల్లు అర్జున్, సుశాంత్, త్రివిక్రమ్ షీల్డులను బహూకరించారు. అలాగే చిత్ర నటీ,నటులకు, సాంకేతిక నిపుణులకు షీల్డ్స్ బహుకరించారు. ఈ చిత్రం నైజాం, వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, సీడెడ్ ఏరియాల్లో ‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్ (నాన్-బాహుబలి) అయిందని డిస్త్రి బ్యూటర్స్ తెలిపారు. సుమతో పాటు నటుడు బ్రహ్మాజీ కూడా ఈ ఈవెంట్ కు యాంకర్ గా వ్యవహరించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.