రాగి జావ… ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
Category : Behind the Scenes Health new Latest Events
ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో రాగుల ఆహారంలో భాగంగా ఉండేవి. ఆ తర్వాత చాలాకాలం మరుగున పడిపోయాయి. అయితే ఇటీవల కాలంలో ప్రజలను ఆరోగ్యంపై అవగాహక పెరగడంతో పాటు ఆరోగ్య నిపుణుల సూచనలతో మళ్లీ రాగుల వైపు చూపు మళ్లింది. రాగుల వల్ల శరీరానికి ఎంత మంచి జరుగుతుందో తెలిస్తే ఎవరూ వీటిని వదలిపెట్టరు. రాగుల్లో ఉన్న పోషకాలు మెండు. తక్కువ ధరలో, అందరికీ సులభంగా లభించే ఈ రాగులతో ఎన్నో అద్భుత గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో రాగిజావ తీసుకుంటే చాలా మంచిది. రాగులను ఆహారంగా తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటే తెలుసుకుందా…
రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్ధాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది. రాగుల్లో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మినిరల్స్ , అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ ధాన్యంలో ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది. ముఖ్యంగా అసంతృప్త కొవ్వు కలిగి ఉండటం వల్ల చాలా సులభంగా జీర్ణమవుతుంది. గ్లూటెన్ లోపంతో బాధపడేవారు ఈ ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి.
వరితో సమానంగా రాగుల్లోనూ ప్రొటీన్ ఉంటుంది. ఇందులో ఉన్నన్ని పోషకాలు మిగిలిన ఏ ధాన్యాల్లోనూ లేవు. కాబట్టి, రోజువారీ ఆహారంలో దీన్ని భాగం చేసుకున్నవారికి పోషకాహారలేమి ఉండదు. శాకాహారులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ధాన్యమిది.
ఎముకలకి బలంగా..
రాగుల్లో మినరల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్ కూడా ఎక్కువగా ఉండటంతో కాల్షియం సప్లిమెంటు తీసుకునే బదులు రాగులు తినడం మంచిది. హీమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు, ఆస్టియోపొరాసిస్ వచ్చే అవకాశం ఉన్నవారూ రాగుల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. వయసు పెరిగిన వారు, చిన్నపిల్లలు వీటిని రెగ్యులర్‌గా తీసుకోవాలి.
వీర్యం వృద్ధి
రాగి అంబలిని రోజూ తాగుతుంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది. సెక్స్ సమస్యలను దూరం చేసి దాంపత్య జీవితాన్ని ఆస్వాదించేలా చేస్తుంది. ఎదిగే పిల్లలకు దీనిని ఇవ్వడం వల్ల శక్తివంతంగా తయారవుతారు. మెదడు చురుగ్గా పనిచేసి ప్రతిభావంతులుగా మారతారు.
షుగర్ కంట్రోల్..
షుగర్ వ్యాధి ఉన్నవారికి రాగులు మంచి ఆహారం. రాగుల పై పొరలో మిగిలిన ధాన్యాలకంటే ఎక్కువ పాలిఫినాల్స్ ఉంటాయి. రాగులు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడమే కాకుండా హైపోగ్లెసీమిక్ స్ట్రెస్‌ని తగ్గిస్తాయి. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో గాయం తొందరగా తగ్గడానికి కూడా ఇవి సహకరిస్తాయి. కాబట్టి వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది.
గుండె జబ్బులు దూరం..
రాగులు ట్రైగ్లిసరైడ్స్ ఏర్పడకుండా చేసి గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. హార్ట్ ఎటాక్స్ గానీ, స్ట్రోక్స్ గానీ రాకుండా చేస్తాయి. అందుకే చాలా మంది వీటిని ఇప్పుడు తమ ఆహారంలో చేర్చుకుంటున్నారు. రాగులను కేవలం జావలాగే కాకుండా… రాగి మాల్ట్, రాగి లడ్డూ, రాగి హల్వా, రాగి పకోడా, రాగి బిస్కెట్లూ, రాగి దోసె, రాగి సంకటి వంటి పదార్థాలుగానూ తీసుకోవచ్చు. రాగులు అతి తక్కువ నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల దగ్గర్నించీ ఋతుపవనాల ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల వరకూ, ఇంకా చెప్పాలంటే హిమాలయాల్లో కూడా పండుతాయి.
జ్వరానికి విరుగుడు
యాంటీ-బాక్టీరియల్ గుణాలు రాగుల్లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, ఫుడ్ పాయిజనింగ్ కీ, టైఫాయిడ్ లాంటి జ్వరాలకీ, సెల్యులైటిస్ లాంటి స్కిన్ ఇన్ ఫెక్షన్స్ ఉన్నప్పుడు వీటిని జావలా చేసుకుని తాగడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. చాలా మంది జ్వరంగా ఉన్న సమయంలో మందులు వాడుతుంటారు. అలా కాకుండా దీనిని రెగ్యులర్‌గా తీసుకుంటే ఆ సమస్య తగ్గిపోతుంది.
కాన్సర్ రాకుండా..
రాగుల్లో యాంటీ-ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీ-ఆక్సిడెంట్స్ సెల్ డామేజ్ జరగకుండా చేసి కాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా చేస్తాయి. ముందు నుంచే వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల కాన్సర్ కారక సమస్యలు రాకుండా ఉంటాయి. రాగులు తరుచూ తినడం వల్ల వయసు పెరిగిన ఛాయలు కనపడకుండా చేసుకోవచ్చు.