Category Archives: Features

బుల్లి బుల్లి క్యాబేజీలతో కోలన్ క్యాన్సర్‌ మటాష్…!

Category : Health new Sliders

బుల్లి బుల్లి క్యాబేజీలను తీసుకుంటే కోలన్ క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. వీటిని వారానికి ఒక్కసారైనా తీసుకుంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. బుల్లి క్యాబేజీలోని పీచు, యాంటీయాక్లిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బ్రస్సెల్‌స్ప్రౌట్స్‌, బెంగళూరు క్యాబేజీగా పిలిచే ఇందులో థియోసైనేట్లూ, ఇండోల్సూ, ల్యూటెన్‌, జియా-క్సాంథిన్‌, సల్ఫొరాఫేన్‌, ఐసోథియోసైనేట్లు ఉంటాయి. ఇవి ప్రొస్టేట్‌, కోలన్‌, ఎండోమెట్రియల్‌ క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి. ఇవన్నీ కలిసి హృద్రోగాల్నీ నివారిస్తాయి.
ఈ క్యాబేజీలోని మీథేన్ అనే పదార్థం వ్యాధినిరోధక శక్తిని పెంచి.. యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ ఏజెంట్‌గానూ పనిచేస్తుంది. ఇంకా బుల్లి క్యాబేజీలోని ఎ-విటమిన్‌ కూడా యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తూ చర్మం, కంటి సమస్యల్ని నివారిస్తుంది. ముఖ్యంగా జియా-క్సాంథిన్‌ అనే కెరోటినాయిడ్‌ వయసుతోపాటు వచ్చే కంటిసమస్యలు రాకుండా నివారిస్తుంది. ఇందులో సమృద్ధిగా దొరికే కె-విటమిన్‌ మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. అంతేకాదు, అల్జీమర్స్‌ వంటి వ్యాధుల్నీ అడ్డుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


వయసు ఛాయలు కనిపించకుండా ఉండటానికి చిట్కా !

Category : Health new Sliders

చాల మంది మొహం మీద లని బాడీ మీద కానీ వయసు ఛాయలు కనిపించకుండా ఉండటానికి రకరకాల క్రీములు వాడుతూ వుంటారు. ఆలా వాడే వాళ్ళకి వాటితో ఏ మాత్రం అవసరం లేకుండా రోజూ అధిక ఏరోబిక్‌ వ్యాయామాలు చేస్తే సరిపోతుందని మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యాయామాలు కండరాలు సాగిపోకుండా నియంత్రించడమే కాకుండా కణాల పనితీరుపై కూడా ప్రభావం చూపుతాయని అన్నారు. అమెరికాలోని మయో క్లినిక్‌కు చెందిన శాస్త్రవేత్తల అధ్యయనంలో ఈ విషయం బయటకొచ్చింది.


వ్యాయామం చేస్తున్నారా.. అయితే వీటిని తినకండి !

Category : Health new Sliders

వ్యాయమాలకు ముందు ఆహార పదార్థాలను తినటం అంటే శక్తి ఉత్పత్తికి ఒత్తిడి పెంచుతున్నారని అర్థం. శరీరంలోపల క్రియలు సక్రమముగా జరుగుతాయి ఎందుకంటే వాటిని మనం ఆపలేము. కావున వ్యాయామాలకు ముందు అనారోగ్యకర ఆహార పదార్దాలను తినటం వలన మీ పొట్ట మరియు వ్యాయామసమయంలో మీ ప్రదర్శనను ఆటంకం కలుగ చేస్తాయి. వ్యాయామానికి ముందు తినకూడని ఆహార పదార్దాలు

గ్రీన్ జ్యూస్ తీసుకునే సమయం, మోతాదులను బట్టి మీవ్యాయామానికి భంగాన్నికలుగచేస్తాయి. వ్యాయమాలకు ముందు జ్యూస్ లతో పాటు స్నాక్స్ తినటం సరైనదే కానీ ఎక్కువగా తినటం వలన ఇవి జీర్ణం అవటానికి ఎక్కువ సమయం తీసుకుంటవి. అధిక ఫైబర్ ఉండటం వలన పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. కావున వ్యాయామాలకు ముందు అధిక మొత్తంలో వీటిని తీసుకోరాదు.

చాలా మంది ప్రోటీన్ బార్ లు తినటానికి మక్కువ చూపిస్తారు. కానీ ప్రోటీన్ బార్ గురించి 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లను కలిగి ఉండవు మరియు వ్యాయమాలకు చేయుటకు సరిపోయే శక్తిని కూడా ఇవ్వలేవు. చక్కెరలు అధికంగా ఉండే వీటి వలన ఆరోగ్యానికి ప్రమాదం పొంచివుంటుంది. ఒక ప్రోటీన్ బార్ లో కనీసం 18 గ్రాముల హోల్ గ్రైన్స్ కలిగిఉంటుంది. కనుక వ్యాయామానికి ముందు వీటిని అసలు తీసుకోకూడదు.

ఫ్రెంచ్ ఫ్రై మరియు నూడిల్స్ నుండి పొందిన కేలోరీలను కరిగించుకోడానికి జిమ్ కి వెళ్ళేముందు అవకాడోను కూడా తీసుకెళతారు, కానీ తీసుకువెళ్లరాదు. ఎందుకంటే అవకాడో కొవ్వు పదార్థాలను అధికంగాఉంటాయి. అందువలన జీర్ణం అవటానికి ఎక్కువ సమయం పడుతుంది మరియు రక్త సరఫరా జరగటానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. దీనిలో ఎక్కువగా కొవ్వు పదార్దాలు ఉంటాయి.

కార్బోనేటేడ్ డ్రింక్స్ లు కడుపులో కలతలను కలుగచేస్తాయి. వీటిలో చక్కెర అధికంగా ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. కాండీ బార్స్ కూడా అధికంగా చక్కెరకను కలిగి ఉంటాయి కనుక వీటిని కూడా వ్యాయామానికి మునుపు తీసుకోరాదు.


హోమియోపతి ట్రీట్మెంట్ ఫర్ డయాబెటిస్ !

Category : Health new Sliders

హోమియోపతి విధానాలను అవలంబించటం ద్వారా డయాబెటిస్ ని అదుపులోకి తీసుకురావచ్చు. ఇప్పటివరకూ డయాబెటిస్ వ్యాధికి శాశ్వత చికిత్స లేదు. కానీ ఈ వ్యాధిని పెరగకుండా అదుపులోకి తీసుకురావచ్చు. హోమియోపతి ఆయిల్స్ వాడటం ద్వారా ఈ వ్యాధిని అదుపు చేయవచ్చు.

మిరియాల నూనే ఈ వ్యాధికి మంచి నిరోధిగా పనిచేస్తుంది. ఈ నూనెను కొబ్బరినూనెలో కానీ ఆలివ్ ఆయిల్లో కానీ వేసుకుని మసాజ్ చేయటం వలన ఈ వ్యాధి లక్షణాలు కుదుట పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నూనె రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

సైప్రస్ ఎస్సెన్షియల్ ఆయిల్ వాడటం వలన రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది. అంతేకాకుండా నరాల సంబంధిత ఇబ్బందులను దూరం చేస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉండే ప్లేసులో సైప్రస్ ఆయిల్, కొబ్బరి నూనె సమానంగా తీసుకుని రాసుకోవాలి.

నిమ్మగడ్డ నూనెను ఇంకా ఏదయినా నూనెతో కలిపి నొప్పి కలిగిన ప్లేసులో రాసుకోడం ద్వారా ఆ నొప్పి తగ్గిస్తుంది. లావెండర్ ఆయిల్ మంచి సువాసనను కలిగి ఉంటుంది. ఈ ఆయిల్ దెబ్బతిన్న నరాలను సవరించటంలో సహాయపడుతుంది.


సిద్ధి వినాయక దేవాలయం !

Category : Sliders Spiritual

సిద్ధి వినాయక దేవాలయం మహారాష్ట్ర లోని ముంబయి లోని ప్రభావతి ప్రాంతంలో ఉంది. దీనికి రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. పిలిస్తే ప‌లికే స్వామిగా భ‌క్తుల‌తో కొలువ‌బ‌డుచున్న‌ది. ఈ దేవాలయంలో ప్రధాన దైవం వినాయకుడు. ఈ దేవాలయం నవంబరు 19,1801 లో లక్ష్మణ్ వితు అంరియు దూబాయ్ పాటిల్ చే నిర్మించబడింది. ఇది ముంబైలోని అతి ఐశ్వర్యవంతమైన, అత్యంత ఖ‌రీదైన దేవాలయంగా గుర్తింప‌బ‌డింది.ఈ ఆలయానికి పర్వదినాలలో భక్తుల తాకిడి చాలా ఎక్కువగానే ఉంటుంది.

మంగళ వారం నాడు సుమారు ల‌క్ష‌మందికి పైగా, భక్తులు, కోరిక‌లు నెర‌వెరేందుకు మొక్కుకున్న‌భ‌క్తులు భ‌క్తిపూర్వ‌కంగా స్వామిని ద‌ర్శింప‌ వస్తుంటారు. ఈ ఆలయానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూపంలో నూట యాబై కోట్ల రూపాయలు వ‌ర‌కు ఉన్నాయి. ప్రతి ఏటా కానుకల రూపంలో పది కోట్లకు పైగా వస్తుంటుంది. ఈ ఆలయ సంపద విలువ మూడు వందల యాబై కోట్ల రూపాయలు పైగానే ఉంది. 1801 సంవత్సరంలో చిన్న ఆలయంగా ప్రారంభమైన ఈ గుడి కాల క్రమంలో ఆరు అంతస్తులతో ఉంది. ఆలయ శిఖర గోపురానికి బంగారు తాపడం చేయించారు. ఆగ్రిసమాజ్ కు చెందిన దూబె పాటిల్ అనే శ్రీమంతురాలు ఈ ఆలయాన్ని కట్టించింది.

పిల్లలు కలగని మహిళలు ఈ స్వామి వారిని దర్శిస్తే పిల్లలు కలుగుతారని భక్తుల విశ్వాసము. ఈ ఆలయంలో వినాయకుని ఎత్తు 2.6 అడుగులు. వినాయకుని తొండం కుడివైపుకు తిరిగి వుండడము ఈ ఆలయం ప్రత్యేకత. ఒకచేతిలో కమలం, ఒక చేతిలో గొడ్డలి, ఒక చేతిలో తావళం, ఒక చేతిలో కుడుములు ఉన్న పాత్ర ఉన్నాయి. ప్రముఖ వ్వాపార వేత్తలు, సినీ ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శిస్తుండటంతో ఈ ఆలయానికి అత్యంత ప్రాధాన్యత వచ్చింది. ఈ దేవాలయం గోపురం లోపలి భాగంలోని పైకప్పు కూడా బంగారంతో తాపడం చేయడం జరిగింది.

చరిత్ర

ఈ దేవాలయం నబంబరు 19 1801 న నిర్మించబడింది. దీని వాస్తవ నిర్మాణం చాలా చిన్నదిగా 3.6మీ x 3.6 మీ కొలతలుగా ఉన్న చతురస్రాకార స్థలంలో శిఖరాన్ని కలిగి యుండే నిర్మాణంగా యుండెడిది. ఈ దేవాలయం లక్ష్మణ్ వితుల్ పాటిల్ అనే కాంట్రాక్టరుచే నిర్మించబడింది. ఈ దేవాలయానికి నిధులను ధనవంతురాలైన అగ్రి మహిళ అయిన దెబాయ్ పాటిల్ చే సమకూర్చబడినవి. ఆమెకు సంతానం లేరు.సంతానం కోస‌మే ఆమె ఈగుడి నిర్మాణానికి పూనుకున్నార‌నే క‌థ‌నాలు వినిపిస్తాయి . ముంబాయ్ వెళ్లిన వారిలో హిందువులు
త‌ప్ప‌క ఈ ఆల‌యం ద‌ర్శించాల‌ని త‌పిస్తారు. అయితే అక్క‌డ‌కి వెళ్లాక ఎంతో ఆహ్లాదాన్ని పొందుతారు.


మంత్రాలయం రాఘవేంద్ర స్వామి!

Category : Sliders Spiritual

మధ్వాచార్యుల పరంపరలో ధృవనక్షత్ర సమానమైన రాఘవేంద్రస్వామివారి పుణ్యక్షేత్రం మంత్రాలయం
తుంగభద్రా నదీతీరంలో ఉంది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం.ఇది కర్నూలు నుండి
100కి.మీ దూరంలో ఉంది. ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం ఉంది. ఇక్కడ ప్రతిరోజు
ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వివిథ కులస్తులతో నిర్మిత‌మైన ఉచిత సత్రములు ఉన్నాయి.
ఇక్కడ గురువారం ఒక ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంటుంది. ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు భ‌క్త‌కోటిని
దీవిస్తూ ఒక‌ర‌క‌మైన ఆహ్లాద‌క‌రంగా సందడి చేస్తుంది.

అక్టోబరు 2, 2009న తుంగభద్ర నదికి వ‌ర‌ద‌లు రావ‌డం న‌దీజలాలు ఉప్పొంగి మంత్రాల‌యాన్ని చుట్టు
ముట్ట‌డంతో మంత్రాలయం దేవస్థానంతో పాటు పట్టణంలోని 80% జనావాసాలు నీటమునిగాయి. వేలాదిమంది
ప్రజలతో బాటు ఎక్క‌డెక్క‌డి నుంచో రాఘ‌వేంద్రుని ద‌ర్శించ‌డానికి వ‌చ్చిన భ‌క్తులు కూడా వరదనీటిలో చిక్కు
కు పోయి నానాయాత‌న‌లు ప‌డ్డారు. అయితే, ఎలాంటి ప్రాణ‌న‌ష్టాలు జ‌ర‌గలేదు.

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671), హిందూ మతములో ఓ ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో
జీవించాడు. ఇతను వైష్ణవాన్ని అనునయించాడు, మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు.
ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ
ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తుడు. ఇతను పంచముఖిలో ఘోర‌తపస్సు
చేసాడు, ఇచ్చటనే హనుమంతుణ్ణి దర్శించాడు.

మంత్రాలయంలో తన మ‌హిమాన్విత‌మైన పీఠాన్ని స్థాపించాడు.ఇచ్చ‌ట‌నే సమాధి అయ్యాడు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు.అయితే, రాఘ‌వేంధ్ర‌ స్వామి మ‌హిమ‌లు ఇన్ని అన్నీ కాకుండా ప్ర‌చారంలో ఉన్నాయి. కోరిన కోరిక‌లు తీర్చేస్వామిగా ఆయ‌న భ‌క్తుల‌తో కొల‌వ‌బ‌డుతున్నాడు.


ఏడుపాయ‌ల దుర్గ‌మ్మ గుడి!

Category : Sliders Spiritual

ఏడుపాయలు ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం మెదక్ జిల్లా, పాపన్నపేట మండలంలోని నాగ్‌సాన్‌పల్లి వద్ద అడవిలో ఉంది. మెదక్ జిల్లా నుండి 14కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ దుర్గాదేవి అమ్మవారు మహశక్తి అవతారంగా దర్శనం యిస్తారు.ఏడుపాయల దుర్గా భవానీ గుడి – ఈ ఆలయ దర్శనానికి తెలంగాణా, కర్ణాటక మరియు మహారాష్ట్ర సమీప ప్రజలు లక్షల సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ ఉన్న ఏడుపాయలు అనే ప్రదేశంలో మంజీరా నది ఏడుపాయలుగా విడిపోయి ప్రవహిస్తున్న కారణంగా ఈ ప్రదేశానికీ పేరు వచ్చింది.

ఈ ప్రదేశ వర్ణన మహాభారతంలో ఉంది. అర్జునుడి మునిమనుమడైన జనమేజయుడు తన తండ్రి పరీక్షిత్తు శాపానికి ప్రతీకారంగా ఇక్కడ సర్పయాగం చేసినట్లు విశ్వసించబడుతుంది. మంజీరా నది మైదానంలో ఇప్పటికీ బూడిద కనిపిస్తుంది. ఏడు పాయల వద్ద నిర్వహించబడే జాతరకు లక్షలాది మంది తరలి వస్తారు.సర్ప జాతులన్నీ సర్పయాగానికి ఆహుతి అవుతుండటంతో, వాటికి పుణ్యలోకాలు కల్పించడం కోసం గరుత్మంతుడు గంగను ఇక్కడికి తీసుకు వచ్చాడని అంటారు. ఈ కారణంగానే ఇక్కడి మంజీరాను ‘గరుడ గంగ’ అని పిలుస్తుంటారు. ఈ గంగలో భక్తులు స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబళ్లు చెల్లిస్తూ వుంటారు.

దుర్గా అమ్మ‌వారు ఇక్క‌డ భ‌క్తుల‌తో పూజ‌లు అందుకుంటున్నారు. ఇక్క‌డ ఈ అమ్మ‌వారి చారిత్ర‌క నేప‌ధ్యం జ‌నాల‌లో చెప్పుకునేది ఒకేలా ఉంటుంది. త‌ప్పితే , పాత‌కాలంనాటి ఆధారాలు ప్ర‌స్థావ‌న తక్కువ‌గానే ఉంది. మ‌హాభార‌తంలో ఈ ప్రాంతం గురించి ప్ర‌స్థావ‌న ఉన్నంత‌లో నాటి స్థానికులు మ‌రింత‌గా మ‌హిమ‌లు, దుర్గ‌మ్మ గురించి వివ‌రించే గాథ‌లు త‌క్కువే. అనేకానేక పౌరాణిక గాధ‌ల‌కు పుట్టినిల్లు కావ‌ల్సి ఉండ‌గా అలాంటి చ‌రిత్ర‌ల‌ను నాటి స్థానిక క‌వులు, ర‌చ‌యిత‌లు ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌క‌పోవ‌డ‌మే అందుకు కార‌ణం అయ్యింది.


గొప్ప శైవ క్షేత్రం తిరువ‌ణ్ణామ‌లై!

Category : Sliders Spiritual

తిరువణ్ణామ‌లై భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం లో ఉన్న తిరువన్నమలై జిల్లాలో వెల‌సిన ఒక దివ్య‌మైన పుణ్య‌ క్షేత్రము . అన్నామలై కొండ దిగువ ప్రాంతంలో ఉన్న అన్నామలైయర్ గుడి తిరువణ్ణా మలై లోనే ఉంది. ఈ గుడి తమిళనాడులోని శైవ క్షేత్రాలలో ఒక గొప్ప క్షేత్రంగా రాణిస్తోంది. భ‌క్త‌కోటితో ఆరాదింప‌బ‌డుతోంది. తిరువణ్ణామ‌లై తో చాలా యోగులకు, సిద్ధులకు,దైవ‌భక్తిప‌రాయ‌ణుల‌కు సంబంధం ఉంది. 20వ శతాబ్దపు గురువులలో ఒకరైన రమణ మహర్షి కూడా అరుణాచల శిఖరం మీద ఉండేవారు. అందుచేత, తిరువన్నమలై ఇప్పుడు ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది.

పుణ్య క్షేత్రం

తిరువణ్ణామ‌లై పంచ భూత క్షేత్రాలలో ఒకటి. ఇది అగ్నిని సూచిస్తుంది. మిగిలిన పంచ భూత క్షేత్రాలు చిదంబరం, శ్రీ కాళహస్తి, తిరువనైకోవిల్ మరియు కంచి వరుసగా ఆకాశము, గాలి, నీరు మరియు భూమిని సూచిస్తాయి.ఈ క్షేత్రంలో ఏడాదికి నాలుగు సార్లు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. తమిళ నెల కార్తీకంలో (నవంబరు/డిసెంబరు) జరిగే బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధి చెందాయి. పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కార్తీక దీపం వెలిగించే రోజుతో ముగుస్తాయి. ఆ రోజు సాయంత్రం, అన్నామలై కొండ మీద మూడు టన్నుల నెయ్యి వేసి ఓ పెద్ద జ్యోతి వెలిగిస్తారు

ప్రతి పౌర్ణమి నాటి రాత్రి, వేలకొలది భక్తులు అరుణాచల కొండ చుట్టూ పాద‌ర‌క్ష‌లు లేకుండానే ప్రదక్షిణాలు చేసి శివుని ఆరాధిస్తారు. ఈ ప్రదక్షిణ 14 కి.మీ. ఉంటుంది ప్రతి ఏడాది, తమిళ పంచాంగం ప్రకారం వచ్చే చైత్ర పౌర్ణమి రాత్రి ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ఈ పుణ్యక్షేత్రం దర్శిస్తారు.అద్వైత వేదాంత గురువు రమణ మహర్షి తిరువణ్ణామ‌లై లో 53 సంవత్సరాలు నివసించి 1950లో పరమపదించారు. అయన ఆశ్రమం అయిన శ్రీ రమణాశ్రమము అరుణాచల కొండ దిగువన, ఈ నగరానికి పశ్చిమాన ఉంది. శేషాద్రి స్వామి మరియు యోగి రామ్ సూరత్ కుమార్ ఈ నగరానికి చెందిన ఇతర గురువులకు ఉదాహరణలు.

తిరువణ్ణామ‌లై చెన్నైకి 185 కి.మీ. దూరంలోను, బెంగళూరుకి 210 కి.మీ. దూరంలోను ఉంది. తెన్పెన్నై నది మీద ఉన్న సాతనూర్ ఆనకట్ట తిరువణ్ణామ‌లై దగ్గరలోని పర్యాటక ప్రదేశం. అరుణాచల కొండ ఎత్తు దాదాపు 1,600 అడుగులు.2001 నాటికిభారత జనాభా లెక్కల ప్రకారం తిరువన్నమలై జనాభా 130,301.

అరుణాచలేశ్వర గుడి గోపురాలు

అరుణాచల క్షేత్రం ఈ శివుని గుడి తమిళ సామ్రాజ్యాన్ని పాలించిన చోళ రాజులచే 9వ మరియు 10వ శతాబ్దాల మధ్యలో నిర్మింపబడింది. ఈ క్షేత్రం చాలా పెద్ద గోపురాల వల్ల ప్రసిద్ధి చెందింది. క్రి. శ. 9వ శతాబ్ద కాలంలో రాజ్యమేలిన చోళ రాజుల శిలాశాసనాల వల్ల ఈ విషయం తెలుస్తున్నది. 11 అంతస్తుల తూర్పు రాజ గోపురం 217 అడుగుల ఎత్తు ఉంది. కోట ప్రకారంలా ఉండే బలిష్టమైన గోడల నుండి చొచ్చుకు వచ్చే నాలుగు గోపురాలు, ఈ మందిర సముదాయానికి భీకర ఆకారాన్ని ఇస్తాయి. పై గోపురము, తిరుమంజన గోపురము మరియు అన్ని అమ్మాళ్ గోపురము ఈ ప్రాకారానికి ఉన్న మిగిలిన గోపురాలు.

విజయ నగరాన్ని పాలించిన శ్రీ కృష్ణ దేవరాయలు వేయి స్తంభాల శాలను, కోనేరును నిర్మించాడు. ప్రతి ప్రకారము ఒక పెద్ద నందిని, వల్లల మహారాజ గోపురము, కిల్లి గోపురము వంటి చాలా గోపురాలను కలిగి ఉంటుంది. పంచ భూతాలను సూచించే పంచభూత స్థలాలలో ఇది ఒకటి. పంచ భూత స్థలాలో ఇది తేజో క్షేత్రం – అగ్నిని సూచిస్తుంది. మిగిలినవి – తిరివన్నై కోవిల్ (ఆపః స్థలం – నీరు) కంచి (పృథ్వీ స్థలం – భూమి) శ్రీ కాళహస్తి (వాయు స్థలం – గాలి) చిదంబరం (ఆకాశ స్థలం – ఆకాశం).

వెళ్లే మార్గం

రహదారులతో తమిళనాడు, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ లలో ఉన్న పట్టణాలు, నగరాల నుండి తిరువణ్ణామ‌లై చేరుకోవచ్చు. ఈ నగరం పుదుచేరి – బెంగళూరు జాతీయ రహదారి (NH 66) చిత్తూరు – కడలూరు రాజ్య రహదారుల కూడలిలో ఉంది. తమిళనాడులోని ఇతర నగరాలు చెన్నై, వేలూరు, సేలం, విల్లుపురం, తిరుచి, మదురై, కోయంబత్తూరు, ఈరొద్, తిరుప్పురు, ఇంకా కన్యాకుమారి, మరియు ఇతర ప్రాంతాలైన తిరుపతి, బెంగళూరు, పుదుచేరి వంటి నగరాలకి తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ తిరువన్నమలై నుండి బస్సులను నడుపుతుంది.

రైలు రవాణా

వెల్లూరు నుండి విల్లుపురం వెళ్ళే రైలు మార్గంలో తిరువణ్ణామ‌లై ఉంది. ప్యాసింజరు రైలులో ప్రయాణికులు వెల్లూరు లేదా విల్లుపురం వెళ్ళవచ్చు. (గేజు మార్పిడి పనుల కోసం ఈ మార్గంలో రైలు రాక పోకలను ప్రస్తుతం నిలిపి వేసారు.) దగ్గరలో ఉన్న పెద్ద రైల్వేస్టేషన్ 60 కి.మీ. దూరంగా ఉన్న విల్లుపురంలో ఉంది. తిరువణ్ణామ‌లై నుండి దిండివనం మీదుగా చెన్నై వరకు కొత్త రైలు మార్గం నిర్మాణంలో ఉంది.


ముక్తి నిచ్చే మూకాంబిక ఆల‌యం !

Category : Sliders Spiritual

కొల్లూరు లో మూకాంబిక దేవి ఆలయం భారత దేశములోని కర్నాటక మరియు కేరళ రాష్ట్ర ప్రజలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయాలలో ఒకటి. మంగళూరుకు 147 కిమీ దూరములో సౌపర్ణిక నది ఒడ్డున మరియు పచ్చని కుడ‌జాద్రి కొండలలో ఉన్న ఈ ఆలయం ఏటా లక్షలాది యాత్రికులను ఆకర్షిస్తుంది. హిందువులు గౌరవించే ఋషి మరియు వేద పండితుడైన జ‌గ‌ద్గురువు అది శంకరుల‌తో ఈ ఆలయానికి అనుబందం ఉంది. సుమారు 1200 సంవత్సరాల క్రితం కొల్లూరులో మూకాంబిక దేవి ఆలయం ఒకటి నిర్మిచాలని అది శంకరులు అనుకునేలేదు. ఆదేవి క‌రుణ‌తో ఆయ‌నే ఈ్ర‌పాంతంలో నిర్మించాల్సి వ‌చ్చింది లేకుంటే కేర‌ళ‌లో నిర్మిత‌మ‌య్యేది .అలా చెప్పుకునే క‌థ‌నం ఒక‌టి ఆదిశంక‌రులు జీవిత చ‌రిత్ర‌లో ఉంది.

ఆయ‌నే అమ్మ‌వారి విగ్రహాన్ని తనే స్వయంగా ప్రతిష్ఠించారట. మూకాంబిక దేవిని శక్తి, సరస్వతి మరియు మహాలక్ష్మి. స్వరూపముగా భావించడంతో, భక్తులకు మూకాంబిక దేవి పై అపార విశ్వాసం పెరిగింది. కర్నాటక లోని ‘ఏడు ముక్తి స్థల’ యాత్రికా స్థలాలైన కొల్లూర్, ఉడుపి, సుబ్రహ్మణ్య, కుంబాషి, కోటేశ్వర, శంకరనారాయణ మరియు గోకర్ణంలలో మూకాంబిక దేవి ఆలయం ఒకటిగా చెబుతారు.

మూకాంబికా దేవి ఆలయం కుడ‌జాద్రి శిఖరం క్రింద ఉంటుంది. ఆ దేవత జ్యోతిర్-లింగ రూపంలో శివ మరియు శక్తి ఇద్దరినీ కలుపుకుని ఉంటుంది. శ్రీ చక్ర మీద ఉన్న ఆ దేవత యొక్క పంచలోహ మూర్తిని (ఐదు లోహాల మిశ్రమము) ఆది శంకరాచార్యులు ఆ ప్రాంతాన్ని ఆచ‌ల్ల‌ని త‌ల్లిని త‌నతో తీసుకు వ‌స్తూ అక్క‌డ‌ ప్రతిష్ఠించాల్సి వ‌చ్చినందున ప్ర‌తిష్టించారు. దేవత యొక్క మొట్టమొదటి స్థానం కుడ‌జాద్రి శిఖరం మీద ఉండేదని, స‌ర్వ‌జ‌నులు కొండ ఎక్కి వెళ్ళటం చాలా కష్టమవడంతో, శంకరాచార్యులు ఆ దేవాలయాన్ని కోలూర్ లో తిరిగి స్థాపించారని ప్రజలు ప్ర‌గాఢంగా న‌మ్ముతారు. ఇక్కడి పంచముఖ గణేశ యొక్క శిల్ప నిర్మాణం విశిష్టంగా ఉంటుంది.

కొల్లూర్ శ్రీ మూకాంబికా దేవాలయములోని ఇతర దేవతలు శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీ పార్థేశ్వర, శ్రీ పంచముఖ గణపతి, శ్రీ చంద్రమౌళీశ్వర, శ్రీ ప్రాణలింగేశ్వర, శ్రీ నంజుండేశ్వర, శ్రీ ఆంజనేయ, శ్రీ వెంకటరమణ, శ్రీ తులసి గోపాలకృష్ణలు.నవంబరులో జరిగే నవరాత్రి ఉత్సవాలలో, ఆ దేవాలయం భక్తులతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ జన్మాష్టమి లేదా కృష్ణ జయంతి కూడా ఒక ప్రముఖ పండుగే. స్వయం భూలింగ ఈ రోజునే కనిపించిందని నమ్ముతారు.

నవరాత్రి పండుగలో ఆఖరి రోజున సరస్వతీ మంటపంలో విద్యారంభ లేక చిన్న పిల్లలకు వారి మాతృభాషలో అక్షరాలు నేర్పడం ప్రారంభించడం జరుగుతుంది. అయినా కూడా దేవాలయంలో, మరేదైనా వీలుపడిన రోజున కూడా విద్యారంభ జరుపుకోవచ్చు. భక్తులకు ప్రతి రోజు మధ్యాహ్నము మరియు సాయంత్రము ఉచితంగా అన్నదానం చేయడం జరుగుతుంది.

ఆల‌యానికి మార్గం

కొల్లూర్ మూకాంబిక మెటల్ రోడ్డు ద్వారా చేరుకునే వీలు కలిగి ఉండి, మంగుళూరు, ఉడుపి, మరియు కుందాపూర్ నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. కొంకణ్ రైల్వే దారిలోని కుండాపూర్ లేక మూకాంబికా రోడ్డు ( బైన్డూర్) లు అత్యంత చేరువలో ఉన్న రైల్వే స్టేషన్లు.

నివాస వసతులు

కొల్లోర్ లో అనేక లాడ్జింగ్లు ఉన్నాయి. దేవాలయ దేవస్వాం సౌపర్ణిక అనే ఒక వసతిగృహాన్ని నిర్వహిస్తుంది. శ్రీ లలితాంబికా వసతిగృహం, మాతా ఛత్రం వసతి గృహం, గోయంకా వసతి గృహం మొదలగునవి కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తం మీద ఈ సదుపాయాలతో దాదాపుగా 400 గదులు ఉన్నాయి. గది అద్దెలు సామాన్య భక్తులకు అందుబాటులోనే ఉంటాయి. ఒంటరి సందర్శకులకు బస్సు స్టాండు సముదాయము యొక్క ఆవరణలోనే ఒక డార్మిటరీ ఉంది. మరొక సదుపాయం అయిన అతిథి మందిర రామకృష్ణ యోగాశ్రమంచే నిర్వహించబడుతుంది.

పురాణా చ‌రిత్ర‌

పురాణాల ప్రకారం, కోల మహర్షి ఇక్కడ తపస్సు చేస్తుండగా, శివ భగవానుని మెప్పించి, వరం పొందడానికి తపస్సు చేసుకునే ఒక రాక్షసుడి వలన ఆయన మనోవిచలితులయ్యాడు. ఆ రాక్షసుడు తన దుష్ట కోరిక నేరవేర్చుకోకుండా ఉండడానికి, ఆది శక్తి అతనిని మూగవానిగా (మూక) చేయగా, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అతడు ఏమీ అడగలేకపోయాడు. దానితో అతను కోపధారి అయి, కోల మహర్షిని వేధించగా, ఆయన ఆది శక్తిని రక్షించమని వేడుకున్నారు. మూకాసురుని సంహరించిన ఆది శక్తిని దేవతలదరూ మూకాంబికగా స్తుతించారు. కోల మహర్షి యొక్క పూజ వద్ద దైవ మాత మిగిలిన అందరు దేవతలతో సహా ఉండిపోయి, భక్తులతో పూజింపబడుతుంది.

శ్రీ ఆది శంకరాచార్యకు శ్రీ మూకాంబికా దేవి కలలో కనిపించగా, ఆయన ఈ దేవత విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని నమ్ముతారు.ఆ కథ ఇలా నడుస్తుంది. ఆది శంకర కుడజాద్రి కొండలలో ధ్యానం చేస్తున్నపుడు, దేవి ఆయన ఎదుట ప్రత్యక్షమై నీ కోరిక ఎరింగింపుము అని దేవి అడిగింది. ఆయన దేవిని కేరళలోని ఒక ప్రాంతంలో తాను పూజ చేసుకునేందుకు వీలుగా ప్రతిష్ఠించాలనే తన కోరికను తెలిపారు.దేవి దానికి అంగీకరించి, ఆది శంక‌రునితో బ‌య‌ల్దేర‌డానికి సిద్ద‌ప‌డింది. అయితే వెనుక‌నే వ‌స్తాను. గమ్యం చేరే వరకు వెన‌క్కి తిరిగి చూడరాదని తెలిపింది. అందుకు శంక‌రుడు అంగీక‌రించాడు. అలా వెడుతుండ‌గా దేవి యొక్క కాలి గజ్జల శబ్దం వినబడకపోవడంతో, శంకరులు హఠాత్తుగా తిరిగి చూశాడు. వెంటనే దేవి విగ్ర‌హంగా మారిపోయింది. తన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమని ఇక్క‌డే ఆప‌ని నిర్విగ్నంగా చేయ‌మ‌ని ఆదేశించింది. అలానే శంక‌రులు విగ్ర‌హ‌ప్ర‌తిష్ట‌చేసారు.

దేవాలయ పూజా క్రమం

ఉదయం 5 గంటలకు దేవాలయ నడ తెరుచుకుంటుంది. నిర్మాల్యదర్శన
ఉదయం 6 గంటలకు ఉషా పూజ
ఉదయం 7 గంటల ముప్పై నిముషాలకు మంగళ ఆరతి
ఉదయం 8 గంటల ముప్పై నిముషాలకు బలి
ఉదయం 11 గంటల ముప్పై నిముషాలకు ఉచ్చ పూజ
ఉదయం 12 గంటలకు మహా నైవేద్య
మధ్యాహ్నం 12 గంటల ముప్పై నిముషాలకు మహా మంగళ ఆరతి
మధ్యాహ్నం 1 గంటకు బలి
మధ్యాహ్నం 1 గంట ముప్పై నిముషాలకు నడ మూసుకుంటుంది
మధ్యాహ్నం 3 గంటలకు నడ తెరుచుకుంటుంది
సాయంత్రం 6 గంటలకు ప్రదోష పూజ
సాయంత్రం 7 గంటలకు సలాం మంగళ ఆరతి మరియు నైవేద్యం
సాయంత్రం 7 గంటల ముప్పై నిముషాలకు మంగళ ఆరతి
సాయంత్రం 8 గంటలకు బలి మంగళ ఆరతి
సాయంత్రం 8 గంటల ముప్పై నిముషాలకు బలి ఉత్సవ. సరస్వతి మండపంలో అష్టావధాన పూజ
సాయంత్రం 9 గంటలకు కషాయ మంగళ ఆరతి దేవాలయం నడ మూసుకుంటుంది.

శ్రీ దేవీ మూకాంబిక యొక్క అలంకృత ఆభరణాలు

ఆ దేవాలయంలో ఒక పెద్ద ఆభరణాల నిధి ఉంది. అవి దేవి యొక్క దీవతలతో తమ కలలు, కోరికలు తీరిన గుర్తుగా భక్త సమాజం ఇచ్చిన కానుకలు. దేవికి ఉన్న అనేక నగలలో, మరకతం ఉన్న నగ ఎంతో విలువైనది. మరకతము జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ దేవాలయానికి, బహిరంగ ప్రదర్శనకు గానూ రెండు బంగారు దేవతా విగ్రహాలు ఉన్నాయి. అసలు విగ్రహము పోవడంతో, రాణీ చెన్నమ్మ దానికి బదులుగా బహుకరించిన విగ్రహం ఒకటి ఉంది.

తరువాత ఆ పోయిన విగ్రహం దొరకడంతో, ఇప్పుడు రెండు విగ్రహాలు ఉన్నాయి. గతంలో తమిళనాడు యొక్క ముఖ్యమంత్రి అయిన శ్రీ ఎం.జీ.ఆర్. ఒక కిలో బరువు మరియు రెండున్నర అడుగుల పొడవు ఉన్న ఒక బంగారు కత్తిని బహుకరించారు. గతంలో కర్ణాటక ముఖ్యమంత్రి అయిన శ్రీ గుండూ రావు అదే రకంలో వెండితో చేసిన కత్తిని బహుకరించారు. మూకాంబికా దేవత యొక్క ముఖ తొడుగు పూర్తి బంగారంతో తయారు చేయబడి, విజయనగర సామ్రాజ్యం వారిచే బహుమతిగా ఇవ్వబడింది. జ్యోతిర్లింగ యొక్క బంగారు ముఖ తొడుగు మరొక ప్రత్యేక ఆభరణము


వందల ఏళ్లపాటు మూతపడ్డ జలకంఠేశ్వరాలయం!

Category : Sliders Spiritual

రాయవేలూరు కోటలో ఉన్న జలకంఠేశ్వరాలయం అతి పురాతనమైనది మరియు స‌ర్వాంగ సుంద‌ర‌మైన‌ది.. అందులో చెప్పుకోదగ్గది ఈ ఆలయ ఆవరణలో ఉన్న చూస్తే చూడ‌ల‌నిపించే కళ్యాణ మండపం. చూపరులను మంత్ర ముగ్ధులను చేయగల శ‌క్తి విజయనగర శిల్పకళలో నిక్షిప్త‌మై ఉంది. దక్షిణ భారత దేశంలో విజయనగర శిల్పకళ లేని ఆలయం లేదు. ఫలాన గుడిని ఎవరు కట్టించారనగానే వెంటనే వచ్చే సమాధానం శ్రీ కృష్ణ దేవరాయలు అని పండితుల‌నుంచి పామ‌రుల‌వ‌ర‌కు చెబుతారు. ఎందుకంటే ఆయ‌న కట్టిన ఆలయాలు అన్నీ ఇన్నీ కావు. వాటిలోని శిల్పకళ కూడా అంత విశిష్టంగా ఉంటుంది. ఆ ఆలయాలలోని కళ్యాణ మంటపాలలోని శిల్పకళ మరీ అద్భుతంగా ఉంటుంది అలాంటి కళ్యాణ మండపాలలో ముఖ్యంగా, ప్రత్యేకంగా కొన్నింటిని చెప్పుకోవాలి.

అవి, హంపి లోని విఠలాలయంలో కళ్యాణ మండపం, మధురై లోని వేయి స్తంభాల మండపం, తిరునల్వేలి లోని మండపం., కోయంబత్తూరు దగ్గర ఉన్న పేరూరు మండపం., రాయ వెల్లూరులోని జలకంఠేశ్వరాలయంలోని కళ్యాణ మండపం. ఇవి దక్షిణ భారత దేశంలోనే అత్యంత అందమైన మండపాలు. వీటిలో జలకంఠేశ్వరాలయంలోని కళ్యాణ మండపం చిన్నదైనా, శిల్పకళా కౌశలం రీత్యా చాల అద్భుతమైనది. ఇది విజయనగరాధీశుడు సదాశివరాయల కాలంలో కట్టబడినదిగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రధాన ఆలయం రాయవేలూరు కోటలోనే ఉన్నందున, కాల గమనంలో కోటతో బాటు ఈ ఆలయం కూడా బ్రిటిష్ వారి అధీనంలోకి వెళ్లిపోయింది. ఈకళ్యాణ మండపంలోని శిల్పకళా రీతులకు ముగ్ధులైన బ్రిటిషు వారు దానిని ఏమాత్రం పాడ‌వకుండా శిల్పుల‌తోనే విడదీయించి ప‌డ‌వ‌ల‌కెక్కించి సముద్రాలు దాటించి లండనులో తిరిగి పునఃప్రతిష్టించాలని భావించారు.

దానికి తగిన ఏర్పాట్లన్ని చేసుకున్నారు. దీని కొరకు లండను నుండి ఒక స్టీమరు కూడా బయలు దేరింది. కాని వారి దురదృష్టమో, భారతీయుల అదృష్టమో గాని ఆ స్టీమరు మార్గ మధ్యలో బుడుంగుమ‌ని మునిగి పోయింది. ఆ సందర్భంలోనే జరిగిన అనేక రాజకీయ కారణాల వల్ల కళ్యాణ మండపాన్ని తరలించే కార్యక్రమం క్ర‌మంగా ఆ తెల్ల‌వాళ్ల మ‌స్తిష్కంలోంచి చెరిగిపోయింది. ఆ విధంగా ఆ శిల్పకళా కౌశలాన్ని మనమీనాడు కండ్లార‌ చూడగలుగుతున్నాము. ఈ కళ్యాణ మండపం ఆలయ ప్రధాన గోపురానికి ప్రక్కనే ఒక మూలన ఉంది. ఇది మూడు భాగాలుగా ఉంది. ఇందులో అన్నీ కలిపి నలబై ఆరు శిల్ప కళా శోభితమైన స్తంభాలు ఉన్నాయి.

చరిత్ర

రాయ వెల్లూరు కోటలోనే ఉన్న జల కంఠేశ్వరాలయము, కోటతో బాటు పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాధినేత సదాశివరాయల కాలంలో కట్టబడింది. విజయనగర పతనానంతరము ఈ కోట, అందులో భాగమైన ఈ ఆలయము ముస్లింల పాలకులైన ఆర్కాడు నవాబుల పాలన లోనికి వెళ్లింది. అలా చాలకాలము ఉంది. ఆ సమయంలో ఈ ఆలయం లోని దేవతా మూర్తులను, శివ లింగాలను ధ్వంసం చేయడమో, లేదా పెకలించి కోట అగడ్తలో పడవేయడమో జరిగింది. వాటిని అగడ్తలో పడవేసి ఉంటారనడానికి నిదర్శనంగా అడప దడపా అగడ్తలో దొరికిన శిల్ప ఖండాలే ఆనవాలు. శతాబ్దాలు గడిచి నందున ఆ విగ్రహాలు అగడ్తలోని బురదలో కూరుకు పోయి ఉంటాయని భావించబడుతున్నది.

అగడ్తలో త్రవ్వకాలు జరిపితే అవి బయట పడవచ్చును. ముస్లిం పాలకుల తర్వాత ఈ కోట బ్రిటిషు వారి వశమై, అలా చాలాకాలము ఉంది. ఆ సందర్భంలో బ్రిటిషు వారు కోటను వారి సైనిక కేంద్రంగా మార్చారు. ఇందులోని ఆలయ సముదాయాన్ని, వారి మందు గుండు సామాగ్రికి గోదాముగా వాడుకున్నారు. బ్రిటిషు వారి కాలంలోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం 1921 వ సంవత్సరంలో రాయ వెల్లూరు కోటను, అందులోనే ఉన్న మసీదును, జలకంఠేశ్వరాలయాన్ని జాతీయ సంపదగా గుర్తించి, దాని పరిరక్షణకు దానిని పురావస్తు శాఖకు అప్పగించింది. ఆ విధంగా ఈ జలకంఠేశ్వరాలయం కొన్ని శతాబ్దాల పాటు నిత్య ధూప, దీప, నైవేద్యాలకు నోచుకోక, మూసి ఉన్న కోట గోడల మధ్య ఉండి పోయింది.

జలకంటేశ్వరాలయంలో పూజలు

భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ప్రజలు, పుర ప్రముఖులు, ఆలయాన్ని తమ స్వాధీనం చేసుకోడాకి చేయని ప్రయత్నం లేదు. మతాచార్యులు అనేక ఉద్యమాలు, ఒత్తిడులు చేసినా ఫలితం కనబడలేదు. ఇది మత సంబంధమైన సున్నిత విషయమని, శాంతి భద్రతల సమస్యలు ఏర్పడవచ్చునని భావించి, భారత దేశ అధ్యక్షులు గాని, భారత ప్రధాని గాని, ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దలు గాని ఈ విషయంలో ఏమీ చేయలేక పోయారు. చివరకు 1981వ సంవత్సరంలో జిల్లా కలెక్టరు వ్వక్తిగత మద్దతుతో, మైలారు గురూజీ సుందర స్వామి, మరియు తంజావూరు రామనందేద్ర సరస్వతి స్వామి వారి మద్దతుతో వెల్లూరు పట్టణ ప్రముఖులు రహస్యంగా బయట ఒక గుడిలో ఉన్న శివ లింగాన్ని తెచ్చి, జలకంఠేశ్వరాలయంలో ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని రహస్య పథకాన్ని రచించారు.

ఆ పధకంలో భాగంగా 16 మార్చి, 1981 వ సంవత్సరంలో వేరే గుడిలో ఉన్న శివ లింగాన్ని మూసి ఉంచిన ఒక లారీలో తెచ్చి సిద్ధంగా ఉంచు కున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ఉన్నట్టుండి ఒక్కసారిగా సుమారు రెండు వేలమంది పుర ప్రముఖులు అక్కడ గుమిగూడి లారీలో నుండి శివ లింగాన్ని దించి కోటలోని ఆలయంలోనికి ప్రవేశించి లింగాన్ని ప్రతిష్ఠించి, పూజా కార్యక్రమాలు చేసేశారు. ఉన్నట్టుండి జరిగిన ఈ వ్యవహారాన్ని పోలీసులు గాని, భారత స్వాతంత్ర్యానంతరము రాయ వెల్లూరు ప్రజలు, ఇతర మత పెద్దలు, ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠకు, నిత్య ధూప, దీప, నైవేద్యాలు చేయడాన్నిజిల్లా కలెక్టరు గాని అడ్డుకోలేక పోయారు. పురావస్తు శాఖ వారు ఈ సంఘటనను పోలీసులకు, జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయడం తప్ప ఏమీ చేయ లేక పోయారు.

ఆ తర్వాత కూడా ఇది సున్నితమైన మత సంబంధిత విషయమైనందున, దానితో ఏదైన శాంతి భద్రతల సమస్యలు పుట్టుకొస్తాయనే భయంతో అధికారులు ఎవరు ఎటువంటి చర్యలకు పాల్పడలేదు. ఆ తర్వాత, మతాచార్యుల మద్దతుతో ఆలయ ప్రాంగణంలో అన్ని గర్భగుడులలో విగ్రహాలను ప్రతిష్ఠించి, శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ విధంగా వేలూరు పుర ప్రజలు తమ అనేక ఉద్యమాల ఫలితంగా శతాబ్దాల తరబడి మూసి ఉన్న చీకటి కోటలో మగ్గిన ఈ చారిత్రక జలకంఠేశ్వరాలయాన్ని భక్తులకు ప్రజలకు అందుబాటు లోనికి తెచ్చారు. ఎన్నో చారిత్రక సంఘటనలకు ఆలవాలమైన ఈ రాయవెల్లూరు కోట, అందులోని ఈ ఆలయము నకు సంబంధించిన ఈ పునః ప్రతిష్ఠ సంఘటన కూడా దాని చరిత్రలో ఒక భాగమై పోయింది.