Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
మంగళ వారం కొన్ని పనులు చేయాలి, మరికొన్ని చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు ధరత్రీ పుత్రుడు, భూమిపై నివసించేవారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు ప్రమాదాలకు, కలహాలకు, నష్టాలకు కారకుడు. అందుకనే సాధారణంగా కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలు తలపెట్టరు.
మంగళవారం చెయకూడని పనులు
➤ మంగళవారం గోళ్ళు కత్తిరించడం, క్షవరం లాంటివి చేయకూడదు. ➤ మంగళవారం అప్పు ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ రావడం చాలా కష్టం. ➤ అప్పు తీసుకుంటే అది అనేక బాధలకు, అనవసరమైన పనులకు ఖర్చు అయిపోయి, తీరకపోయే ప్రమాదం ఉంది. ➤ మంగళవారం కొత్త బట్టలు వేసుకోకూడదు. ➤ అత్యవసరం అయితే తప్ప మంగళవారం ప్రయాణాలు పెట్టుకోకూడదు. ➤ మంగళవారం ఉపవాసం చేసిన వారు రాత్రి ఉప్పు వేసిన పదార్ధాలు తినకూడదు. ➤ దైవకార్యాలకు, విద్యా వైద్య రుణాలు ఎప్పుడైనా ఇవ్వవచ్చు.
మంగళవారం చేయవలసిన పనులు
➤ మంగళవారం ఆంజనేయుడిని ధ్యానించడం వలన ధైర్యం చేకూరి, అన్ని పనులు పూర్తవుతాయి. ➤ సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయడం వలన కుజగ్రహ ప్రభావం వలన కలిగే ప్రమాదాలను నివారించవచ్చు. ➤ మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వలన శత్రువులపై జయం కలుగుతుంది. ➤ మంగళవారం ఎరుపు రంగు దుస్తులను ధరించడం, ఎరుపు రంగు పువ్వులతో ఇష్టదైవాన్ని ప్రార్ధిస్తే మంచి ఫలితం ఉంటుంది. ➤ జాతకంలో కుజగ్రహం వక్ర దృష్టితో చూస్తే ఎరుపు రంగు దుస్తులను ధరించరాదు. ➤ మంగళవారం అప్పు తీరిస్తే మళ్లీ కొత్త అప్పులు తీసుకునే అవసరం తగ్గుతుంది. ➤ మంగళవారం నాడు బ్యాంకు అకౌంట్ లో ఎంతో కొంత డబ్బు వేస్తే వృద్ది అవుతూ ఉంటుంది. ➤ మంగళవారం రాహుకాలంలో..( మధ్యాహ్నం 3 నుంచి 4.30 వరకు) దుర్గాదేవి దర్శనం.. దుర్గా స్తోత్రాలు పారాయణము చేయడం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ➤ హనుమంతుడికి సింధూరంతో పూజించడం వలన, సుబ్రమణ్యస్వామికి పదకొండు ప్రదక్షణలు చేయడం వలన దోష ప్రభావం తగ్గుతుంది.
నేటితో శ్రావణమాసం ప్రారంభమైంది. తొలిరోజే శుక్రవారం రావడాన్ని హిందువులు ఎంతో ప్రాశస్త్యంగా భావిస్తున్నారు. దీంతో లక్ష్మీదేవి ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే కష్టాలు తొలిగి సుఖశాంతులతో వర్ధిల్లుతారని పురాణాలు చెబుతున్నాయి.
శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మీని పూజించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. ముఖ్యంగా శ్రావణ రెండో శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుష్యు బాగుంటుందని మహిళల విశ్వాసం. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు, గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూళం, శెనగలు ఇస్తారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగా తలిచి గౌరవిస్తారు.
శ్రావణ మాసంలో గోవులు, తామరపుష్పాలు, పాడిపంటలు, ఏనుగులు, అద్దాలు, శంఖనాదం, ఘంటారావం, హరిహరార్చన, పూజామందిరం, సర్వదేవతలనూ అర్చించే వారి స్వరం, తులసి ఉన్న ప్రదేశం, పువ్వులు, పండ్లతోటలు, మంగళకరమైన వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, కర్పూర హారతి, చెట్లలోని హరిత వర్ణం, స్నేహం, ఆరోగ్యం, ధర్మబుద్ధి, న్యాయస్థానాలు, శుచి, శుభ్రత, సదాచార పరాయణత, సౌమ్యగుణం, స్త్రీలు ఎటువంటి చీకూచింతా లేకుండా హాయిగా ఉండే ఇళ్లు, బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలు, పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు, వేదఘోష, సత్వగుణ సంపదలు, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలనలోనూ మహాలక్ష్మీ దేవి నివసిస్తుంది.
అందుచేత శ్రావణ శుక్రవారం పూట తులసీపూజ, ఆలయాల్లో పాలు, తేనెతో అభిషేకాలు చేయించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శ్రావణ శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగది శుభ్రం చేసుకోవాలి. గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. అనంతరం అమ్మవారి ప్రతిమ లేదా పటానికి కర్పూర హారతులు సమర్పించి, చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. పూజా సమయంలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, దుర్గాష్టకం లేదా అమ్మవారి శ్లోకములతో స్తుతించాలి. ఇంకా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఉపవాసముండి, అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘసుమంగళి ప్రాప్తంతో పాటు సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మీ లేదా అమ్మవారిని ఆలయాల్లో దర్శించుకునే వారికి పుణ్యఫలితాలు చేకూరుతాయని విశ్వాసం. అంతేగాకుండా.. మల్లెపువ్వులు, కస్తూరి, జాజిపువ్వులను అమ్మవారికి సమర్పించి నేతితో దీపం వెలిగించే వారికి ఈతిబాధలు తొలగిపోయి, అనుకున్న కార్యాలు నెరవేరుతాయి.
ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్ (Monkey pox) మన దేశాన్ని కూడా కలవరపరుస్తోంది. దేశంలో మొదటి కేసు కేరళలో నమోదుకాగా.. తాజాగా బాధితుల సంఖ్య నాలుగుకి చేరింది. మంకీపాక్స్ కేసులు ఎక్కువగా యూరప్, ఆఫ్రికాలోనే నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)వెల్లడించింది. ఈ నేపథ్యంలో మంకీ పాక్స్ ఎలా వ్యాపిస్తుంది, దాని లక్షణాలేంటి? చికిత్స ఎలా? తీసుకోవలసి జాగ్రత్తల గురించి తెలుసుకోవడం చాలా అవసరం.
మంకీ పాక్స్ అంటే ఏమిటి..?
మంకీపాక్స్ అనేది వైరల్ డిసీజ్. మంకీపాక్స్ స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందినదే. ఇది జూనోటిక్ వ్యాధి. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే అవకాశం కూడా ఉంది. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 – 21 రోజుల సమయం కూడా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్‌ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970ల్లో తొలిసారిగా మనుషుల్లో ఇది బయటపడింది. సాధారణంగా ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.
ఎలా వ్యాపిస్తుంది..
వ్యాధి సోకిన జంతువు గాయాన్ని తాకినా, సంపర్కరం, కాటు కారణంగా సోకే అవకాశం ఉంది. ప్రస్తుతం నమోదయ్యే కేసులు ఎక్కువ మనుషుల నుంచి మనుషులకు సంక్రమిస్తున్నవే. లైంగిక సంపర్కం ద్వారా మంకీపాక్స్ వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
లక్షణాలు ఏంటి
జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటివి మంకీ పాక్స్ లక్షణాలు. స్మాల్‌పాక్స్ మాదిరిగానే మొహం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ లక్షణాలు 2 – 3 వారాల్లో బయటపడతాయి. మైల్డ్ కేసుల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు. ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల వ్యవధిలోనే కోలుకుంటారు. అయితే 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది.
చికిత్స ఎలా
మంకీపాక్స్ నివారణకు కచ్చితంగా చికిత్స లేనప్పటికీ దీన్ని నియంత్రించడానికి వైద్యులు యాంటీవైరల్ మందులను ఇస్తున్నారు. స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్ మంకీపాక్స్ చికిత్సలో 85% సమర్థవంతగా పనిచేస్తుందని నిర్ధారించారు. కోవిడ్ ఇన్‌ఫెక్షన్ సమయంలో మనం అనుసరించిన జాగ్రత్తల మాదిరిగానే, నిపుణులు సామాజిక దూరం, మాస్కింగ్, మెరుగైన వెంటిలేషన్ మరియు అనారోగ్యంతో ఉంటే ఇంట్లోనే ఉండడం వంటి కొన్ని సిఫార్సు పద్ధతులను అనుసరించాలని సూచిస్తున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
మంకీపాక్స్ ధ్రువీకరించిన వ్యక్తులకు, అనుమానిత వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. రద్దీగా ఉండే ప్రాంతాలకు, కార్యక్రమాలకు వెళ్లడం మంచిది కాదు. పరిశుభ్రత పాటించండి. మాస్క్ ధరించండి.
గమనిక: ఈ వివరాలు, సూచనలు ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం అందించబడ్డాయి. ఈ స్టోరీ కేవలం పాఠకుల అవగాహన కోసమే మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే మంచి పద్ధతి.
తిరుమల వేంకటేశ్వర స్వామి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. టీటీడీ (TTD) చరిత్రలో శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. భక్తులు స్వామివారికి కాసుల వర్షం కురిపించారు. ఈనెల రూ. 100 కోట్ల ఆదాయం దాటింది. కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు వస్తున్నారు. శ్రీవారిని దర్శించుకుని విరివిగా కానుకలు సమర్పించుకుంటున్నారు. కరోనా ప్రభావం తగ్గడంతో తిరుమల కొండ నిత్యం రద్దీతో కళకళలాడుతోంది. మొక్కులున్న భక్తులతో పాటు, ముడుపులనూ భారీగా సమర్పిస్తున్న క్రమంలో హుండీ ఆదాయం పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
అలిపిరి నుంచి స్వామి కొండకు వేలాదిమంది భక్తులు కాలినడకన తిరుమల చేరుకుంటున్నారు. వాహనాల సంఖ్య కూడా పెరిగింది. శ్రీవారి ఆలయం, క్యూకాంప్లెక్స్‌లు, మాడవీధులు, అన్నప్రసాద భవనం, అఖిలాండం, బస్టాండు, రోడ్లు, దుకాణ సముదాయాలు, కల్యాణకట్ట, లడ్డూల జారీ కేంద్రం, ఇతర సందర్శనీయ ప్రదేశాలు భక్తులతో రద్దీగా మారాయి. తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న హుండీ తిరుమల హుండీగా సుప్రసిద్ధం. వడ్డీకాసుల వాడు, ఆపదమొక్కుల వాడు అని పేరొందిన తిరుమల వేంకటేశ్వరున్ని దర్శించుకునే భక్తులు.. కానుకలు హుండీలో వేయడం పరిపాటి. ప్రపంచవ్యాప్తంగా వాటికన్ సిటీ తర్వాత అంతటి ఆదాయం కలిగిన ప్రార్థనా స్థలంగా తిరుమల ప్రసిద్ధి చెందింది. ఆపదలు వచ్చినప్పుడు మొక్కులు మొక్కుకుంటే ఆయన తీరుస్తాడని భక్తుల నమ్మకం. ఒంటిపై వేసుకుని వచ్చిన బంగారం, సొమ్ముతో సహా మొత్తం హుండీలో వేయడాన్ని నిలువు దోపిడీ అని వ్యవహరిస్తారు. తిరుపతిలో నిలువు దోపిడీ చెల్లించుకుంటానని మొక్కుకుని, మొక్కు తీర్చుకుంటూంటారు
హరిహరులు ఒకేచోట కొలువైన పుణ్యక్షేత్రం పుష్పగిరి. దక్షిణకాశీగా పిలిచే ఈ ఆలయాన్ని శైవ, వైష్ణవ భక్తులందరూ దర్శించుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏకైక అద్వైతపీఠంగా గుర్తింపుపొందిన ఈ ఆలయం పినాకిని నదికి ఎదురుగా పచ్చని ప్రకృతి మధ్య కనిపిస్తూ… శిల్పకళావైభవానికి ప్రతీకగా నిలుస్తూ… భక్తులను ఆకట్టుకుంటుంది పుష్పగిరి చెన్నకేశవస్వామి ఆలయం. ఇక్కడ విష్ణుమూర్తి చెన్నకేశవస్వామిగా, పరమేశ్వరుడు చంద్రమౌళీశ్వరుడిగా పూజలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విలసిల్లుతున్నారు. ఏడో శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని పల్లవులు, చోళులు, చాళుక్యులు, విజయనగర రాజులు దర్శించుకున్నారని చెబుతారు. నిత్యపూజలతో కళకళలాడే ఈ ఆలయం కడపలోని పుష్పగిరిలో ఉంది.
స్థల పురాణం
కశ్యప మహర్షి ఓసారి భార్యలైన కద్రువ, వినత కలిసి ఆడుకుంటూ.. పందెంలో ఓడిపోయినవారు గెలిచినవారికి దాసిలా పని చేయాలని షరతు పెట్టుకున్నారట. ఆ పందెంలో వినత ఓడిపోవడంతో కద్రువకు దాసిలా పని చేసేదట. వినతకు జన్మించిన గరుత్మంతుడు తన తల్లికి ఆ బానిసత్వం నుంచి విముక్తి కలిగించమని కద్రువను కోరాడట. అప్పుడు కద్రువ తనకు అమృతాన్ని తెచ్చిస్తే వినతకు స్వేచ్ఛను ఇస్తానని చెప్పిందట. దేవేంద్రుడి దగ్గరున్న ఆ అమృతాన్ని గరుత్మంతుడు తెచ్చే క్రమంలో జరిగిన పోరులో రెండు అమృతం చుక్కలు ఈ ప్రాంతంలోని పినాకిని నదిలో పడటంతో ఇందులో స్నానాలు చేసిన వారందరూ మరణం లేకుండా, యుక్తవయస్కుల్లా మారిపోయారట. అది చూసి దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని సంప్రదించారు. విష్ణుమూర్తి ఆ నీటిలో పెద్ద పర్వతం ముక్కను వేసినా అమృతం ప్రభావం వల్ల ఆ నీటిలో రాయి మునగకుండా పుష్పం ఆకారంలో పైకి తేలిందట. దాంతో శివకేశవులు తమ పాదాలతో ఆ రాయిని నీటిలోనే ఉండిపోయేలా తొక్కేశారనీ ఆ తరవాతే హరిహరులు ఇక్కడ వెలిశారనీ… అలా ఈ ప్రాంతానికి పుష్పగిరి అనే పేరు వచ్చిందనీ అంటారు. ఈ ఆలయాన్ని విద్యారణ్యస్వామి నెలకొల్పినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక్కడున్న పంచనదీ సంగమంగా గుర్తింపు పొందిన పినాకిని నది… ఉత్తరం నుంచి దక్షిణం దిశగా కాశీశ్వరాలయం వైపు పయనించడం వల్లే పుష్పగిరిని దక్షిణకాశీగా పిలుస్తారు.
నిత్య పూజలు…
ఈ ఆలయానికి చెన్నకేశవస్వామే క్షేత్రపాలకుడు. ఇక్కడున్న స్వామి నిలువెత్తు విగ్రహం తిరుమలలోని శ్రీవారి విగ్రహం కంటే ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ ఏడాది మొత్తం జరిగే పూజలు కాకుండా ధనుర్మాసంలో, కార్తికంలో విశేష అభిషేకాలూ, ఉత్సవాలూ జరిపిస్తారు. కొండ మీద ఒకే ఆవరణలో ఉన్న చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం దర్శించుకున్నాక రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ ఉపాలయాలనూ చూడొచ్చు.
ఎలా చేరుకోవాలంటే
పుష్పగిరి క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునే వారు కడప వరకూ బస్సు లేదా రైల్లో చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సు లేదా ప్రైవేటు వాహనాల్లో కర్నూలుకు వెళ్లే రహదారి మార్గంలో ఉప్పరపల్లె మీదుగా 16 కి.మీ. ప్రయాణిస్తే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.
కోదండరామ దేవాలయం, కడప జిల్లా. 7.సూర్యనారాయణ దేవాలయం జోగుళాంబ అలంపూరు గద్వాల జిల్లా
నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు
మహానంది
జంబుకేశ్వర్
బుగ్గరామలింగేశ్వర్
కర్ణాటక కమండల గణపతి.
హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
బెంగళూర్ మల్లేశ్వర్
రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం
సిద్ధగంగా
అలంపురం
నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.
అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.
నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్
మంజునాథ్.
శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్
సముద్రమే వెనక్కి వెళ్లే
గుజరాత్ నిష్కళంక మహాదేవ్,
40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం. స్త్రీ వలె నెలసరి అయ్యే
అస్సాం కామాఖ్యా అమ్మవారు,
కేరళ దుర్గామాత.
రంగులు మారే ఆలయం
ఉత్తరాయణం, దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.
పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం. పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.
నిరంతరం పెరుగుతోన్న విగ్రహాలు
కాణిపాకం,
యాగంటి బసవన్న,
కాశీ తిలభండేశ్వర్,
బెంగుళూరు బసవేశ్వర్
స్వయంభువుగా సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్‌నాథ్ మంచులింగ
ఆరునెలలకు ఒకసారి తెరిచేఆరునెలలకు ఒకసారి తెరిచే
బదరీనాథ్,
కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)
గుహ్యకాళీమందిరం.
సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు
హాసంబా దేవాలయం, హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.
12 ఏళ్లకు ఒకసారి పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.
స్వయంగా ప్రసాదం తినేస్వయంగా ప్రసాదం తినే
కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.
బృందావనం రాధాకృష్ణ శయనమందిరం
ఒంటి స్తంభంతో
యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేధారేశ్వర్, ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.
రూపాలు మారే ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.
నీటితో దీపం వెలిగించే ఘడియ ఘాట్ మాతాజీ మందిర్, మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది, ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.
మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు
హేమాచల నరసింహ స్వామి.
శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి
మనిషి వలె గుటకలు వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.
అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.
ఛాయా విశేషం
ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.
హంపి విరూపాక్షేశ్వర్, గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.
బృహదీశ్వరాలయం
నీటిలో తేలే విష్ణువు (వేల టన్నుల బరువు), నేపాల్
పూరీ
పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే పూరి ప్రసాదం.
ఇవి మనకు తెలిసిన కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమే. ఇటువంటివి దేశంలో కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి.
సాధారణంగా హిందూ దేవాలయాలు కొండల్లో, పర్వత ప్రాంతాల్లో, గుహల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో, జలపాతాలు, నదులకు సమీపంలో అందమైన ప్రకృతి మధ్య ఎంతో గొప్పగా కనిపిస్తాయి. కానీ గుజరాత్‌లోని నిష్కలంక మహదేవ్ ఆలయం వీటన్నింటికీ ఎంతో భిన్నం. భీకరమైన అలల ప్రవాహం మధ్య తీరానికి సముద్రం మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. నిష్కలంక్ అంటే పాపాలు దూరం చేసేది అని అర్ధం. మహాభారత యుద్ధం తరువాత పాండవులు తమ దోషాలను, కళంకాలను ఇక్కడే రూపుమాపుకున్నారని పురాణ కధనం. అందుకే ఇక్కడి శివుణ్ణి నిష్కలంక్ మహదేవ్ గా పూజిస్తారు. గుజరాత్ లోని భావనగర్‌కు తూర్పున 23 కిలోమీటర్ల దూరంలో కొలియాక్ సముద్ర తీర ప్రాంతంలో నిష్కలంక్ మహాదేవ్ ఆలయం ఉంది. భారతీయ క్యాలెండర్ ప్రకారం భదర్వ అమావాస్య రాత్రి పాండవులు ఇక్కడ నిష్కలంక్ మహదేవ్ ను స్థాపించారని చెబుతారు.
వెనక్కి వెళ్లే సముద్రం
కొలియాక్ సముద్ర తీరానికి ఉదయం పూట వచ్చే టూరిస్టులకు ఇక్కడ ఎటువంటి ఆలయం ఉన్నట్లు కనిపించదు. ఎందుకంటే ఆ సమయంలో ఆలయం పూర్తిగా నీటమునిగి ఉంటుంది. సముద్రం మధ్యలో ఆలయం ఉందనడానికి సూచికగా ఆలయ ధ్వజస్తంభంపై ఉండే జెండా మాత్రమే రెపరెపలాడుతూ కనిపిస్తుంది. మధ్యాహ్నం 11 గంటలు దాటిన తరువాత నుంచి సముద్రం మెల్లగా వెనక్కి వెళ్లడం ప్రారంభిస్తుంది. దీంతో భక్తులు ఆలయానికి చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్య రోజుల్లో భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో దర్శనానికి వచ్చి అలలు ఎప్పుడు మాయమౌతాయా అని ఎదురుచూస్తుంటారు. ఏటా మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. సముద్రం మధ్యలో ఈ ఆలయం నిర్మాణం ఎలా చేశారనేది నేటి తరం ఇంజినీర్లకు, సాంకేతిక నిపుణులకు అంతుచిక్కని పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఈ ఆలయానికి వీక్షించిన వారు ప్రాచీన భారతీయుల పనితనాన్ని, నైపుణ్యాన్ని కొనియాడకుండా ఉండలేరు.
ప్రతిరోజూ మధ్యాహ్నం 1 గంట సమయానికి సముద్రం పూర్తిగా వెనక్కి వెళ్లడంతో పూలు, పండ్లు, పూజా సామగ్రి అమ్మే వర్తకులు తమ సామాగ్రిని తోపుడు బండ్లపై వేసుకుని సముద్రంలో నడుచుకుంటూ ఆలయానికి చేరుకుంటారు. ఆ తరువాత ఆలయానికి వెళ్లే భక్తుల తాకిడి కూడా పెరుగుతుంది. రాత్రి 7 గంటల వరకూ భక్తులు ఈ ఆలయం వద్ద సమయం గడపవచ్చు. ఆ సమయం దాటిన తరువాత సముద్రం మళ్లీ ముందుకు రావడం ప్రారంభిస్తుంది. అర్ధరాత్రి దాటే సమయానికి ఆలయం పూర్తిగా సముద్రగర్భంలో మునిగిపోతుంది.
ఆలయం వెనుక ఆసక్తికరమైన కధ
మహాభారతం యుద్ధం సమయంలో పాండవులు కౌరవులపై యుద్ధాన్ని గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ యుద్ధంలో సొంత బంధువులను చంపిన పాపాలను వారు మూటగట్టుకుంటారు. ఆ పాపాల నుంచి విముక్తి పొందడానికి పాండవులు శ్రీకృష్ణున్ని ఆశ్రయిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక నల్లని ఆవుకు నల్లని జెండాను కట్టి అవి ఎంత దూరం వెళితే అంత దూరం వాటి వెంట వెళ్లమంటాడు. ఎప్పుడైతే ఆ ఆవు, జెండా తెల్లగా మారతాయో అప్పుడు ఆ పాపాల నుంచి విముక్తి దొరుకుతుందని సెలవిస్తాడు. కృష్ణుడి సూచన మేరకు పాండవులు రోజుల తరబడి వాటి వెంటే నడిచేవారు. ఎంత దూరం నడిచినా వాటి రంగులో మార్పు రాలేదు. ఎప్పుడైతే చివరిగా ఆవు, జెండా కొలియాక్ సముద్ర తీరానికి చేరుకున్నాయో అప్పుడు ఉన్నట్టుండి అవి తెల్లగా మారతాయి. అప్పుడు ఐదుగురు అన్నదమ్ములు ఆ ప్రదేశంలోనే కూర్చుని పరమశివుని కోసం ఘోర తపస్సు చేస్తారు. వారి భక్తికి మెచ్చిన శివుడు ఒక్కొక్కరి ఎదుట ఒక్కో స్వయంభువు శివలింగంగా అవతరిస్తాడు. దీంతో పాండవులు అమితానందపడి ఆ ఐదు శివలింగాలకు పూజలు నిర్వహించినట్లు పురాణ కధనం. పాండవుల పాపాలను కడిగిన ఈ పరమ పవిత్ర ప్రదేశం అప్పటి నుంచి నిష్కలంక్ / నిష్కలంక్ మహదేవ్ గా ప్రసిద్ధి పొందింది.
భదర్వి మాసంలో అమావాస్య రోజున పాండవులు ఈ దేవాలయాన్ని ఇక్కడ స్థాపించడంతో ప్రతి ఏటా శర్వణ్ మాసం (ఆగస్టు)లో అమావాస్య రోజున ‘భైదర్వి’ అనే పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఆలయాన్ని సందర్శించే భక్తులకు ప్రతి శివలింగం ఎదుట ఒక్కో నంది కనిపిస్తుంది. భక్తులు ముందుగా పాండవ కొలను అని పిలవబడే నీటి గుంట వద్ద తమ కాళ్లను శుభ్రపరచుకుని పూలు, పాలు, పండ్లతో శివలింగాలకు స్వయంగా అభిషేకిస్తుంటారు. ఇక్కడ ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కెరటాలు చాలా ఉధృతంగా వస్తుంటాయి. భక్తులు తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకుని కెరటాలు శాంతించే వరకూ ఎదురుచూస్తుంటారు. మనకు బాగా కావాల్సిన వారు ఎవరైనా మరణిస్తే వారి ఆస్తికలను ఇక్కడి నీటిలో కలపడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరి ముక్తి లభిస్తుందని బలంగా నమ్ముతారు. ఆలయం గోపురంపై సూచికగా ఎగిరే జెండాను సంవత్సరానికి ఒక్క సారి మాత్రమే మారుస్తారు. ఇప్పటివరకూ తుఫాన్ల వలన కానీ, అలల వలన కానీ ఈ జెండా దెబ్బతిన్న దాఖలాలు లేవు.
దేవుడిపై భక్తి, పర్యటనల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఈ ప్రదేశం తప్పకుండా ఓ మరపురాని అనుభూతిని ఇస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. భగవంతుడి అద్భుత సృష్టికి ఇంతకంటే వేరే నిదర్శనం మరొకటి లేదని ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు చెబుతుంటారు. ఈ ఆలయ విశేషాలు తెలుసుకున్న ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా ఈ సాహసభరిత యాత్ర చేయాలని కోరుకుంటారు. మార్చి నుంచి జూలై మాసాల మధ్య ఈ ఆలయాన్ని సందర్శించేందుకు మంచి సమయం.
ఎలా వెళ్లాలంటే
విమాన మార్గం ద్వారా వచ్చే వారు అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగి 196 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రదేశానికి చేరుకోవాల్సి ఉంటుంది. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుంచి భావనగర్‌కు రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు. భావనగర్ ఎక్స్‌ప్రెస్, మహువ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఈ మార్గంలో ప్రయాణిస్తాయి. సుమారు 5 గంటల ప్రయాణం ఉంటుంది. భావనగర్ నుంచి కొలియాక్ గ్రామానికి 22 కిలోమీటర్ల దూరం. రైల్వే స్టేషన్ నుంచి ట్యాక్సీ, ఆటో రిక్షా లేదా బస్సుల ద్వారా అక్కడికి చేరుకోవచ్చు.
పిల్లలు తరచుగా జ్ఞాపక శక్తి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులే గమనిస్తూ ఉండాలి. వ్యాధి తీవ్రత పెరిగితే చాలా దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా మతిమరుపు అనేది వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మారిన జీవనశైలి కారణంగా ఇప్పుడు పిల్లల్లో కూడా సర్వసాధారణమైపోయింది. అయితే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే కచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాలి. దాంతోపాటు తల్లిదండ్రులు తమ పిల్లలని ఈ సమస్య నుంచి బయటపడేసేలా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
పచ్చని ఆకుకూరలు
ఆకుకూరలలో జ్ఞాపకశక్తిని పెంచే అనేక విటమిన్లు ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి కోల్పోకుండా నివారించవచ్చు. మెదడుకు పదును పెట్టడానికి వాల్‌నట్ వినియోగం కూడా ఉత్తమమైనది. ఇది ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది మెదడుకు చాలా ముఖ్యమైనది. ఇందులో ఉండే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ గుండె, మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది.
చేపలు
మంచి కొవ్వు కలిగిన చేపలని ఆహారంగా తీసుకుంటే అందులో కొవ్వు కారణంగా మెదడు పనితీరు మెరుగవుతుంది. అందులో ఉండే పోషకాలు మెదడు కణాలకి చురుకుదనం ఇచ్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫిష్ ఆయిల్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మెదడు అభివృద్ధికి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కణాల నిర్మాణానికి చాలా అవసరం. సాల్మన్, మాకేరెల్, తాజా జీవరాశి, సార్డినెస్, హెర్రింగ్ వంటి చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.
రేగు పండ్లు
రేగు పండ్లలో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వయస్సుతో వచ్చే మతిమరుపుని నిరోధించవచ్చు. అంతే కాదు ఇందులో ఉండే విటమిన్ ఈ మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజుకు 8 – 10 రేగుపండ్లు తీసుకోవడం ఉత్తమం.
పాలు పెరుగు
పాలు, పెరుగు, జున్నులో ప్రోటీన్, B విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణజాలం, న్యూరోట్రాన్స్మిటర్లు, ఎంజైమ్‌ల అభివృద్ధికి అవసరం. ఇవన్నీ మెదడులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీటిలో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది.
గుమ్మడి గింజలు
గుమ్మడిని అహారంగా తీసుకోవడం చాలా తక్కువే. ఎప్పుడో ఏదో ఒక పండక్కి తప్ప వీటిని ఆహారంగా తీసుకోరు. గుమ్మడి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల శరీరం ఉత్తేజంగా ఉండడంతో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
గుడ్లు
గుడ్డులో ఉండే విటమిన్ బీ6 వంటివి జ్ఞాపక శక్తిని పెంచుతాయి. అంతే కాదు గుడ్డులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వారి డైట్ లో గుడ్డుని ఆహారంగా తీసుకోవచ్చు.
నారింజ
నారింజలో ఉండే విటమిన్ సి, మెదడుని చురుగ్గా ఉంచుతుంది. ఆరోగ్యవంతమైన మెదడు దానిలోకి అన్నింటినీ సరిగ్గా చేర్చుకుంటుంది. మెదడులో కణాఅలు ఉత్తేజితమై జ్ఞాపకసక్తి పెరుగుతుంది.
బ్లూ బెర్రీ
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా గల బ్లూ బెర్రీలని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
బాదం, జీడిపప్పు
బాదం, కాజు వంటి వాటిని ఆహారంగా తీసుకోవడం చాలా ఉత్తమం. రోజూ పొద్దున్నపూట బాదం గింజలని ఆహారంగా తీసుకోవాలి. ఐతే వీటిని రాత్రి నానబెట్టి, ఉదయం లేవగానే పొట్టు తీసేసి ఆహారంగా తీసుకోవాలి. దీనివల్ల మెదడు చురుగ్గా తయారవుతుంది.
వైష్ణవులు జ్ఞాన ప్రదాతగా శ్రీ హయగ్రీవుడిని ఆరాధిస్తారు. శైవులు జ్ఞాన ప్రదాతగా శ్రీ దక్షిణామూర్తిని ఉపాసిస్తారు. శివకేశవులు వేరు కారని భావించే వారు ఇద్దరినీ ఆరాధిస్తారు. దక్షిణామూర్తి అనబడేది అతి ప్రాచీనమైన ఈశ్వర తత్త్వం. సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మ యొక్క నాలుగు ముఖాలనుంచి వ్యక్తమైన రూపాలే సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతులు. వీరు వ్యక్తం కాగానే బ్రహ్మ వారిని మిగిలిన సృష్టిని కొనసాగించమని ఆజ్ఞాపించాడు. అందుకు వారు అంగీకరించక తమకు జ్ఞానం కావాలని అక్కడినుంచి వెళ్లిపోయారు. జ్ఞానం కావాలని కోరుకోవటం కూడా ఒక రకమైన అజ్ఞానమే. మనకు నియంత్రించిన విధి, కర్తవ్యాలను నిర్వర్తించక మోక్షం కోసం అడవులకు పోయే వారందరూ నిజానికి అహంభావులు,అజ్ఞానులు. శివుడు ఇది గమనించే వారి అజ్ఞానాన్ని తొలగించాలనే తలంపుతో దక్షిణామూర్తి రూపంలో వారికి ప్రత్యక్షమవుతాడు. ఆ విధంగా శ్రీ దక్షిణామూర్తి ప్రధమ శిష్యులు వారే. అజ్ఞానం నశించటమే జ్ఞానం. అజ్ఞానం, అహంకారాలు నశించిన తర్వాత మనిషి తేజోవంతుడైన ఋషి అవుతాడు. దక్షిణామూర్తి పాదాల కింద ఉన్నది తమో గుణ రూపానికి ప్రతీక. వాటిని శివుడు తన కాలితో అదిమిపడుతాడు. అది కూడా అదృష్టమే. అజ్ఞానాన్ని అదుపు చేసేవాడే దక్షిణామూర్తి. ఈ తత్వమే ఆదిగురుతత్త్వం. దక్షిణామూర్తి ఆది గురువు, ఆది యోగి అన్న మాట. ఆయన సమస్త జ్ఞానానికి మూలం. ఈ తత్వాన్నితెలుసుకోవటమంటే జ్ఞానం, ఎరుక అనే అవగాహన కలిగివుండటమే.
సంగీత, సాహిత్యాల, యోగ, తాంత్రిక విద్యల కలయికే దక్షిణామూర్తి రూపం. సకల శాస్త్రాల సారాన్ని తెలిసి ,అర్హులైన మహర్షులకు ఉపదేశం చేసినవాడే దక్షిణామూర్తి. సద్గురువు లభించని ఉత్తములు ఈయన్ని గురువుగా భావించి, జ్ఞానం, మోక్షాన్ని పొందవచ్చు. దక్షిణామూర్తి అంటే దక్షిణ దిక్కు వైపు కూర్చున్న మూర్తి అనే అర్ధం వాడుకలో ఉంది. అయితే దక్షిణ దిశ మృత్యుదేవత మార్గం. అంటే కొత్తదనానికి దారి. ప్రతి శివాలయంలో కూడా ఈయన విగ్రహం దక్షిణ దిక్కు వైపే ఉంటుంది. దక్షిణ దిశగా ఉండే దేవతా విగ్రహం దక్షిణామూర్తి ఒక్కడిదే. దక్షిణామూర్తి దక్షిణం వైపు ఉన్న మర్రి చెట్టు కింద ధ్యాన ముద్రలో ఉంటాడు. అలా ఉండే దక్షిణామూర్తి అర్హులైన ఋషులకు తత్వ బోధ చేస్తుంటాడు. విశేషం ఏమంటే ఆయన బోధించేది అంతా నిశ్శబ్దంగానే ఉంటుంది. దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు. దక్షిణామూర్తి తన మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందినట్లు చేస్తారు.
దక్షిణామూర్తి జింక చర్మాన్ని ధరిస్తాడు. ఆయన శుభప్రదుడు. దక్షిణామూర్తికి కుడి వైపున జమదగ్ని, భృగు, వసిష్ఠ, నారద మహర్షులు ఉంటారు. భరద్వాజ, సౌనక, అగస్త్య, భార్గవ లాంటి వారు ఆయనకు ఎడమవైపున ఉంటారు. స్వామికి మీసాలు, గడ్డం ఉండవు. దీని అర్ధం ఆయన నిత్య యవ్వనుడు. జనన మరణాలకు అతీతుడు. స్వామి కూర్చున్న మర్రి చెట్టు హిమవత్పర్వత ప్రాంతంలో ఉంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయినిలోని మహాకాళేశ్వరంలో శివుని విగ్రహం దక్షిణం వైపు ఉంటుంది. అంటే అక్కడి శివుడినే దక్షిణామూర్తి స్వరూపంగా భావిస్తారు. ఆది శంకరుడు ఆయన గురించి చేసిన స్తోత్రం అద్వైత సిద్ధాంతంతో కూడి ఉంటుంది. దక్షిణామూర్తిని ఆరాధించేవారు ముముక్షువులు మోక్షాన్ని పొందగలరు.
గురు గ్రహదోషాలు ఉన్నవారు క్రమం తప్పకుండా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం వల్ల గురు గ్రహబలం కలుగుతుంది. దుఖాలకు మూలమైన అజ్ఞానం అటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చే స్వామియే దక్షిణామూర్తి.
దక్షిణామూర్తి స్త్రోత్ర పారాయణం వల్ల అద్భుత ఫలితాలు
దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వల్ల అపమృత్యువు దరిచేరదు.
కష్టాలకు ప్రధాన కారణం గురు గ్రహ భలం లేకపోవడం. నిత్యం పారాయణం చేయడం వల్ల గురు గ్రహం బలం పెరిగి కష్టాలు, భాధాలూ తొలగడంతో పాటు జీవితంలో తెలిసీ తెలియకుండా చేసిన పాపాలను నసింపజేస్తుంది.
విద్యా బుద్దులు చేకూరాలనుకునేవారు తప్పనిసరిగా దక్షిణామూర్తి ఆరాధన చేయాలి.
జ్ఞానం కోరుకునే వారికి జ్ఞానాన్ని ప్రసాదించి మళ్ళీ జన్మ లేకుండా మోక్షాన్ని సైతం ప్రసాదించే స్వామి దక్షిణామూర్తి.
దక్షిణామూర్తిని ఆరాధించే వారికి సంపదకు కొదవ ఉండదు.
హిందూమతంలో హయగ్రీవ స్వామిని విష్ణు అవతారంగా భావిస్తారు. హయగ్రీవున్ని జ్ఞానం, వివేకం, వాక్కు, బుద్ధి, అన్ని విద్యలకు అధిపతిగా భావిస్తారు. హయగ్రీవ స్వామిని చదువుల యొక్క దేవుడుగా పూజిస్తారు. హయగ్రీవుడిని హయశీర్షగా కూడా పిలుస్తుంటారు. హయము అనగా గుర్రము. హయశీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు. తెల్లని తెలుపు మానవ శరీరం, గుర్రం యొక్క తల, నాలుగు చేతులు. శంఖము, చక్రము పై రెండు చేతులలో కలిగిఉంటాడు. కుడి వ్రేళ్ళు జ్ఞాన ముద్రలో అక్షరమాలను కలిగి ఉంటాయి. ఎడమ చేతిలో పుస్తకం ఉంటుంది. ఉన్నత చదువు, లౌకిక విషయాలను అధ్యయనం ప్రారంభించినప్పుడు హయగ్రీవ స్వామిని తప్పక పూజించాలి. విద్యార్థులు హయగ్రీవ స్వామిని ప్రతి రోజు ధ్యానిస్తే మంచి చదువు, ఉన్నతస్థితి కలుగుతుందని ప్రసిద్ధి. స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి. ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య, విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
హయగ్రీవుడికి ఆ ఆకారం ఉండటానికి వెనుక కూడా ఓ కథ ఉంది. వేదాపహారియైన రాక్షసుని సంహరించి వేదాలను ఉద్ధరించినవాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో 10 అవతారాలు దశావతారాలుగా ప్రసిద్ధికెక్కినప్పటికీ, మహాభాగవతంలో 20కి పైగా అవతారాలున్నాయి. ఆ అవతారాల్లో ‘హయగ్రీవావతారం’ విశిష్టమైనది. అశ్వ ముఖంతో మానవ శరీరంతో వామాంకమున శ్రీ లక్ష్మీదేవితో తెల్లని శరీర ఛాయతో, చతుర్భుజాలతో, శంఖ, చక్ర చిన్ముద్ర పుస్తకాలను దాల్చిన శ్రీమన్నారాయణుడి గురురూపమే హయగ్రీవ స్వరూపం.
రాక్షసులు దొంగిలించిన వేదాలను హయగ్రీవుడే తిరిగి తెచ్చినట్టు విష్ణు ధర్మోత్తరం చెబుతోంది. శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవుని విశేషంగా పూజించాలి. ఈ స్వామిని పూజించడంవల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి. భూ వివాదాలు పరిష్కరించబడతాయి. న్యాయ పోరాటాలలో విజయం లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు హయగ్రీవుని పూజించడంవల్ల చదువు బాగా వస్తుంది. శత్రు వినాశనం కూడా జరుగుతుంది. ప్రతిరోజు హయగ్రీవుని స్తుతి చేస్తే లక్ష్మీనారాయణుల శుభాశీస్సులతోపాటు సకల దేవతలు సంపూర్ణ శుభాశీస్సులు కూడా సంప్రాప్తమవుతాయి. ఈ క్రింది స్తోత్రాన్ని హయగ్రీవ జయంతి రోజున ఎన్నిసార్లు వీలయితే అన్నిసార్లు పఠించడం వల్ల శుభాలు కలుగుతాయి.