Category Archives: Movie News

‘‘పలాస 1978’’ మూవీ నుండి నక్కిలీసు గొలుసు అనే సాంగ్ ను రిలీజ్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్

రక్షిత్ నటన నన్ను ఆశ్చర్య పరిచింది- ‘‘పలాస 1978’’ మూవీ నుండి నక్కిలీసు గొలుసు అనే సాంగ్ ను రిలీజ్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘‘పలాస 1978’’ . తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో
రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. డైరెక్టర్ కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ విడుదలకు ముందే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. జిఎ2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్న ఈ
మూవీ త్వరలో విడుదలకు సిద్దం అవుతుంది. ‘పలాస 1978’ సినిమా చూసి, టీం ని అభినందించి ‘పక్కన పడ్డాది చూడరో పిల్లా నాది నక్కిలీసు గొలుసు’ అనే పాటను టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ గారు లాంఛ్ చేసారు..

ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ గారు మాట్లాడుతూ:
‘దర్శకుడు కరుణ్ కుమార్ గారు రైటర్ గా ఉన్నప్పుటి నుండి నాకు తెలుసు, ఆయన కథలు కొన్ని నేను చదివాను చాలా బాగుంటాయి. దర్శకుడిగా తన తొలి ప్రయత్నంలోనే వాస్తవ సంఘటనల ఆధారంగా కథను రెడీ చేసుకొని ‘పలాస 1978’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు రక్షిత్ నటన నన్ను ఆశ్చర్యపరిచింది. కొత్త కుర్రాడు ఎలా చేస్తాడు అనుకున్నాను కానీ చాలా బాగా చేసాడు. పల్లెటూరి కుండే సంస్కృతిని తెరమీద ఆవిష్కరించే దర్శకులు తెలుగులో తక్కువ మంది ఉన్నారు. వారి కంటే దర్శకుడు కరుణాకుమార్ ముందడుగు వేసాడు. మిగతా వారు ఆయన్ను ఫాలో అవ్వాలి. ఇందులో పాటలు కూడా చాలా బాగున్నాయి. ఉత్తరాంధ్ర జానపదం చాలా ఫేమస్ మా కాలేజ్ రోజుల్లో కూడా ఆపాటలే పాడుకునే వాళ్ళం. అలాంటి ఉత్తరాంధ్ర జానపదం నుండి వచ్చిన ‘ పక్కన పడ్డాది చూడరో పిల్లా నాది నక్కిలీసు గొలుసు’ పాట చాలా బాగుంది. ఈ సినిమాకు మ్యూజిక్ ని అందించడమే కాకుండా ముఖ్య పాత్రను పోషించిన రఘ కుంచె ను అభినందిస్తున్నాను. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని
కోరుకుంటున్నాను’ అన్నారు.

రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్
సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్దం అవుతున్న ఈ చిత్రానికి పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం :
రఘు కుంచె,
పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా,
నిర్మాత : ధ్యాన్ అట్లూరి.
రచన- దర్శకత్వం : కరుణ కుమార్.


స్టార్ కమిడియన్ సంతానం హీరోగా సర్వర్ సుందరం ఫిబ్రవరి 14న విడుదల

స్టార్ కమిడియన్ సంతానం హీరోగా సర్వర్ సుందరం ఫిబ్రవరి 14న విడుదల !!

స్టార్ కమెడియన్ సంతానం హీరో గా తెరకెక్కిన సర్వర్ సుందరం తమిళ, తెలుగు భాషల్లో ఈ ప్రేమికులు రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదలకి సిద్ధం అయ్యింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన కమిడియన్ సంతానం ఈ కమర్షియల్ కామెడీ ఎంటెర్టైనెర్ లో హీరో గా ఆడియన్స్ ని ఫుల్ గా అలరించబోతున్నారు. అలానే ఈ సినిమాలో హీరోయిన్ వైభవి సంతానంకు జోడిగా నటించింది. ప్రముఖ నటుడు రాధా రవి ఈ మూవీలో కీలక పాత్రలో నటించడం జరిగింది.

కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు మాస్ ఆడియన్స్ కు కావాల్సిన యాక్షన్ సన్నివేశాలు ఈ మూవీలో ఉండడం విశేషం. బల్కి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను ఉదయ్ హర్ష వడ్డెల, డి.వెంకటేష్ నిర్మాతలు. ఫిబ్రవరి 14న తెలుగులో భారీ రేంజ్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి అని నిర్మాతలు తెలిపారు.

నటీనటులు:
సంతానం, వైభవి, రాధా రవి
దర్శకత్వం: బల్కి
నిర్మాతలు: ఉదయ్ హర్ష వడ్డెల, డి.వెంకటేష్
సంగీతం: శీలంబరసం
కెమెరామెన్: అభినందన్ రామనుజం
ఎడిటింగ్: అంథోని


కళాత్మక దృశ్యకావ్యం ‘శంకరాభరణం’ – ఫిబ్రవరి 2కు నాలుగు దశాబ్దాలు పూర్తి

కళాత్మక దృశ్యకావ్యం ‘శంకరాభరణం’

– ఫిబ్రవరి 2కు నాలుగు దశాబ్దాలు పూర్తి
తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం ‘శంకరాభరణం’. ఈ సినిమా విడుదలై ఫిబ్రవరి 2వ తేదీకి 40 సంవత్సరాలు
పూర్తవుతుంది. ఫిబ్రవరి 2 , 1980లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఈ కళాఖండం విడుదలైంది. కళా తపస్వి కె.విశ్వనాధ్ దర్శకత్వంలో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్
పతాకం పై ఏడిద నాగేశ్వరరావు – ఆకాశం శ్రీరాములు దీన్ని నిర్మించారు . శంకరశాస్త్రి, తులసి మధ్య అలవికాని అనుబంధం చక్కగా ఆవిష్కరించిన సినిమా ఇది. ఇది ఒక్క
తెలుగులోనే కాదు పక్క రాష్ట్రాలైన తమిళనాడు , కర్ణాటక, కేరళ లలో కూడా అఖండ విజయం సాధించింది . అమెరికా లో రెగ్యులర్ థియేటర్స్ లో విడుదలైన మొట్ట మొదటి
చిత్రం ఇదే. అలాగే ప్రపంచ నలు మూలల్లో ఎన్నో దేశాల్లో విడుదలై తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది . అప్పట్లో ఎవరి నోట విన్నా ‘శంకరాభరణం’ గురించే ప్రస్తావన .
శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన రోజుల్లో ఈ సినిమా విడుదల తరువాత ఎంతో మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టారు . ప్రతి తెలుగు వాడు ఇది మా
సినిమా అని గర్వంగా చెప్పుకొనేవారు.

ఇక అవార్డుల విషయానికి వస్తే , జాతీయ అవార్డుల్లో కళాత్మక విలువలు , వినోదాత్మకం తో కూడిన జనరంజక చిత్రంగా స్వర్ణ కమలం
అందుకుంది. తెలుగులో స్వర్ణ కమలం అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. అలాగే గాయకులు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కు ఉత్తమ నేపధ్య గాయకుడిగా తొలి సారి
జాతీయ అవార్డు , శ్రీమతి వాణి జయరాం కు ఉత్తమ గాయకురాలి గా , కె.వి.మహదేవన్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు లభించిన సినిమా ఇది . అలాగే
మన ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డులతోపాటు, దేశంలోని అనేక సాంస్కృతిక సంస్థలు ఈ చిత్ర బృందాన్ని అవార్డులు, సన్మానాలతో ముంచెత్తాయి .

కథేమిటి?
శంకరశాస్త్రి (జె. వి. సోమయాజులు) గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన సంగీతమంటే చెవి కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వేశ్య కూతురు, గొప్ప నర్తకి అయిన తులసి (మంజు భార్గవి) ఆ వృత్తిని అసహ్యించుకుంటుంది. కళలను ఆరాధించే తులసి, శంకరశాస్త్రిని గురుభావంతో ఆరాధిస్తుంది. ఆమె తల్లి మాత్రం ఆ వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. ఆమెను బలాత్కరించి శంకర శాస్త్రిని తులనాడిన విటుణ్ణి విధిలేని పరిస్థితులలో హతమారుస్తుంది తులసి. ఈ కేసు నుంచి ఆమెను బయటకు తీసుకురావడానికి శంకర శాస్ర్తి అండగా నిలుస్తాడు. లాయర్ అయిన తన స్నేహితుడి సాయంతో తులసిని విడిపిస్తాడు. వేశ్యకు ఆశ్రయం ఇచ్చారని శంకరశాస్త్రిని అందరూ చిన్న చూపు చూస్తారు. తన వల్ల శంకరశాస్త్రి నిందలు పడవలసి రావడం తట్టుకోలేని తులసి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. కాలక్రమంలో పాశ్చాత్య సంగీతపు ఒరవడిలో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరవై శంకరశాస్ర్తి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనపై జరిగిన అత్యాచార ఫలితంగా తులసి ఒక పుత్రుడికి తల్లి అవుతుంది. శంకరశాస్త్రి దగ్గర నేర్చుకోవడానికి అతన్ని నియమిస్తుంది. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది. చివరకు తన కొడుకును ఆయన సంగీతానికి వారసుడిగా నియమిస్తుంది. కన్ను మూసిన శంకరశాస్త్రి పాదాల దగ్గరే ప్రాణాలు ఆమె కూడా ప్రాణాలువిడుస్తుంది. సంగీతమే ప్రాణం ఈ సినిమాకి కె.వి. మహదేవన్ సంగీతం ప్రాణంగా నిలిచింది. జంధ్యాల మాటలు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణీజయరాం పాటలు, జేవీ సోమయాజులు, మంజుభార్గవి, బేబీ తులసి, అల్లు రామలింగయ్యల నటన… వెరసి ‘శంకరాభరణం’ అనే కళాఖండం. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు చాగంటి కోటేశ్వర రావు ఈ సినిమాపైనే మూడు రోజులు ప్రవచనాలు చేశారంటే ఈ సినిమా విశిష్టత ఎలాంటిదో అర్థంచేసుకోవచ్చు. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేక గౌరవాన్ని తీసుకు వచ్చిందీ చిత్రం. ఈ సినిమా పాటలు ఇప్పటికీ జనం నోళ్లలో నానుతూనే ఉన్నాయి. కాలం మారినా ఇది మాత్రం కలకాలం నిలిచి ఉండే సినిమా అని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.

నటీ నటులు
జె.వి .సోమయాజులు
మంజు భార్గవి
అల్లు రామలింగయ్య
చంద్ర మోహన్
రాజ్యలక్ష్మి
తులసి

నేపధ్య గానం
ఎస్ .పి.బాలసుబ్రహ్మణ్యం
ఎస్. జానకి
వాణి జయరాం


‘అల.. వైకుంఠపురములో’ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు

* ‘అల.. వైకుంఠపురములో’ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు!
* తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను
– స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

“రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇదొక దాటుకుంటూ వెళ్ళిపోయే దశ. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో రికార్డ్ కొడతారు. ఈ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు. తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను” అన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మాటల మాంత్రికుడుగా పేరుపొందిన సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్,గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (నాన్-బాహుబలి) సాధించిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన థాంక్స్ మీట్ లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను షీల్డులతో సత్కరించారు.

ఈ వేడుకలో నటుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ, “ప్రేక్షకులందరికీ హత్తుకొన్నట్లే ఈ సినిమాలోని డైలాగ్స్ నాకు హత్తుకున్నాయి. పండగ పూట ఈ సినిమా రిలీజ్ చేశారు అని అనుకున్నాను కానీ, నా జీవితంలో ఈ సినిమాతో పండగ స్టార్ట్ అవుతుంది అని నాకు తెలియదు. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే నాకు రెండు పెద్ద సినిమాలు వచ్చాయి. చాలా థాంక్స్” అన్నారు.
నటుడు మురళీ శర్మ మాట్లాడుతూ, “మా నాన్నగారు పోయి ఇంకా ఒక సంవత్సరం కాలేదు. అప్పటినుంచి చూసుకుంటే ఈ సినిమాతో నాకు, నా ఫ్యామిలీకి ఎంత ఆనందం ఇచ్చారో మాటల్లో చెప్పలేను. త్రివిక్రమ్ గారూ.. థాంక్యూ సో మచ్. ఈ సినిమాతో చాలా కలలు నావి నిజమయ్యాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తండ్రిగా చేయడం ఒక పెద్ద కల. అది నెరవేరింది. గీతాఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్లలో పెద్ద క్యారెక్టర్ చేసి పేరు తెచ్చుకోవాలి అన్నది ఇంకో కల. అది కూడా నిజమైంది. త్రివిక్రమ్ ను మాటల మాంత్రికుడు అంటారు. కానీ ఆయన నా జీవితానికి ప్రేమ. ‘అల వైకుంఠపురంలో’ అనే కథ రాసినందుకు, అందులో వాల్మీకి అనే పాత్రను సృష్టించి దానికి నన్ను తీసుకున్నందుకు థాంక్స్. నాకు నిజంగా మాటల్లేవు. తమన్ రాక్ స్టార్. బన్నీ ఐ లవ్ యు. నేను సెట్లో బన్నీని చూడలేదు, బంటూని మాత్రమే చూశాను. అద్భుతమైన సహనటుడు. సినిమాకు ఈ రకమైన స్పందన ఇచ్చినందుకు ప్రేక్షకులకు థాంక్స్” అన్నారు.

నటుడు సుశాంత్ మాట్లాడుతూ, “ఎవరిమైనా సినిమా బాగా ఆడాలని కోరుకుంటాం. అయితే ఇంత హిట్టవుతుందని నాకు తెలియదు. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి అందరూ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నేను చూశాను. ఫలితం ఇలా వచ్చినందుకు చాలా హ్యాపీ. టీం మొత్తానికి నా అభినందనలు. ప్రేక్షకులు ఈ సినిమాని ఈ స్థాయి హిట్ చేసినందుకు థాంక్స్. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్.. నాన్ బాహుబలి రికార్డ్స్ ఈ చిత్రం సొంతం. బన్నీ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది డాన్స్. ఇందులో గొప్పగా నటించాడు. త్రివిక్రమ్ గారితో పని చేసేటప్పుడు చాలా నేర్చుకున్నాను. నా తర్వాతి సినిమాకి వాటిని అమలుచేయడానికి ప్రయత్నం చేస్తాను. అల్లు అరవింద్ గారు, చినబాబు గారు చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. తమన్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ‘రాములో రాములా’ వంటి మంచి పాటలో నేను కూడా డ్యాన్స్ చేసినందుకు సంతోషంగా ఉంది” అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నుంచి షీల్డ్ అందుకున్న ఆదిత్య మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య మాట్లాడుతూ, “తమన్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఇవి మేము గర్వపడే క్షణాలు. సంగీత పరంగా ఈ సినిమా ఆల్ టైం హిట్ అయింది. సినిమా కూడా అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

తమన్ మాట్లాడుతూ, “క్రికెట్లో హ్యాట్రిక్ అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఇక్కడ కూడా హ్యాట్రిక్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. త్రివిక్రమ్ కు, బన్నీకి హ్యాట్రిక్. నాకు, బన్నీకి ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’ తర్వాత ఇది హ్యాట్రిక్. అందుకే మొత్తం ఎనర్జీ ఈ సినిమాకి పని చేసింది. మా టెక్నీషియన్స్ అందరూ 100 శాతం బెస్ట్ వర్క్ ఇచ్చారు. కలెక్షన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చాయి. ఇండస్ట్రీ హిట్ కావటం వెరీ వెరీ హ్యాపీ. ఇది చాలా అరుదుగా జరిగే విషయం. ఇండస్ట్రీకి, సినిమాకి చాలా మంచిది. ‘అల వైకుంఠపురములో’ ఈ రికార్డ్స్ క్రియేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక ఆల్బమ్ హిట్టయితే మ్యూజిషియన్స్ కు చాలా హెల్ప్ అవుతుంది. కచేరీల్లో పాటలు పాడుకోవచ్చు. సీతారామశాస్త్రి గారు, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ చాలా బాగా పాటలు రాశారు. ఇప్పటిదాకా నేను పనిచేసిన టీమ్స్ లో ఇది బెస్ట్ టీం. కొంతమంది హీరోలు పాటల్ని ఇంకో స్థాయికి తీసుకెళ్తారు. బన్నీ అలాంటి హీరో. త్రివిక్రమ్ గారితో పని చేయటం ఒక మ్యాజిక్. నా జీవితంలో అలాంటి వ్యక్తిని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా హృదయంలో నా మనసులో ఆయన చాలా మార్పులు తీసుకువచ్చారు. నాలో ఒక కొత్త నరం వేశారు. అల్లు అరవింద్ గారు, రాధాకృష్ణ గారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా మంచి సినిమా ఇచ్చారు. ఈ సక్సెస్ నా జీవితంలో ధైర్యాన్ని ఇచ్చింది. ఇంకా కొంచెం ప్రయోగాలు చేయొచ్చు అనే శక్తినిచ్చింది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ముందు ముందు మరింత కష్టపడి మరింత మంచి మ్యూజిక్ ఇవ్వడానికి కృషి చేస్తాను” అని చెప్పారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, “మేము తీశాము, మీరు చూశారు. మేము తీయటానికి మీరు చూడటానికి మధ్య డిస్ట్రిబ్యూటర్లు అనే వారధులు ఉన్నారు. సినిమాని మీకు (ప్రేక్షకులకు) చూపించడానికి మాకు డబ్బులు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ ని, ఎగ్జిబిటర్స్ ని గౌరవించుకోవడం మా విధి. నేను ‘విజేత’ సినిమా నుంచి పదుల సంఖ్యలో చిరంజీవి గారి సినిమాలకు పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసి, షీల్డులు ఇస్తూ వచ్చాను. ఇప్పుడు సినిమా ఆడే రోజులు తగ్గిపోయి, లెక్కలు కలెక్షన్ల కింద, రెవెన్యూ కింద మారిపోయాక ఈ ఫంక్షన్ లు లేకుండా పోయాయి. కానీ మళ్లీ ఈ రోజుకి ఇంత ఆల్ టైం రికార్డు కొట్టడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు.

దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ, “ఇంత ప్రేమగా మమ్మల్ని దగ్గరకు తీసుకొని పాటల దగ్గర్నుంచి ఇక్కడిదాకా నడిపించి ఆశీర్వదించిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా మా అందరి తరపున కృతజ్ఞతలు, నా పాదాభివందనం” అన్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ, “గీతా ఆర్ట్స్ లో ప్రొడక్షన్ కంపెనీయే కాకుండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఉంది. ఎప్పుడైనా ఆఫీసు వైపు వెళ్ళినప్పుడు ‘ఏవండీ ఎప్పుడూ సెలబ్రేషన్ మీరేనా చేసుకునేది, మమ్మల్ని జనం దగ్గరికి తీసుకెళ్ళరా, మమ్మల్ని పట్టించుకోరా, మాకు షీల్డ్స్ ఇచ్చి సత్కరించరా?’ అని అడిగేవాళ్లు. ‘అంత సినిమా వచ్చినప్పుడు కచ్చితంగా చేస్తాను’ అని చెప్పేవాడిని. నిజంగా అలాంటి సినిమా ఇప్పుడు వచ్చింది. మాకు ఆ అవకాశం ఇచ్చింది ప్రేక్షకులు. మా టీం కలిసి చేసింది 50 శాతం అయితే ప్రేక్షకుల దగ్గరకు సినిమాని తీసుకువచ్చింది 50 శాతం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు. వాళ్లందరికీ చాలా కృతజ్ఞతలు. నాతో పని చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరి తరఫున ప్రేక్షకులకు థాంక్స్ చెబ్తున్నా. నిర్మాతలు రాధాకృష్ణ గారికి, అల్లు అరవింద్ గారికి నా ధన్యవాదాలు. మా నాన్నను ఎలా సంబోధించాలా అని ఒక్కోసారి నాకు కన్ఫ్యూజన్ వస్తుంటుంది. మా నాన్న నన్ను పరిచయం చేస్తూ ‘గంగోత్రి’, తర్వాత ‘బన్నీ’, ఇంకా ఎన్నో హిట్లిచ్చారు. రాధాకృష్ణ గారితో మొదటిసారి ‘జులాయి’ చేశాను. అది సక్సెస్ ఫుల్ ఫిలిం. తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చేశాను. వీళ్ళిద్దరూ నాకు బెస్ట్ ప్రొడ్యూసర్లు. ఇద్దరితో సూపర్ హిట్స్ కొట్టాను కానీ ఇద్దరూ కలిస్తే ఆల్ టైం రికార్డ్ హిట్ వచ్చింది. ఇద్దరికీ చాలా థ్యాంక్స్. నేను ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది.. బన్నివాసు, వక్కంతం వంశీకి. ఎప్పటి నుంచో నేను త్రివిక్రమ్ తో సినిమా చేయాలనుకుంటున్నా కానీ ఆయనతో చేస్తే బాగుంటుంది అని నాకు బూస్ట్ ఇచ్చింది, త్రివిక్రమ్ గారిని తీసుకొచ్చింది వాళ్ళిద్దరు. వాళ్లకి థాంక్స్. అలాగే నేను ఎక్కువగా గడిపే నా పర్సనల్ స్టాఫ్ కు థాంక్స్. ఇంత పెద్ద హిట్ వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తో సెలబ్రేషన్స్ చేసుకోవడం మా బాధ్యత. ఇక రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇదొక దాటుకుంటూ వెళ్ళిపోయే దశ. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో రికార్డ్ కొడతారు. ఈ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు. తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం.. ‘సిత్తరాల సిరపడు’ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. అందులో నేను సిగరెట్ తాగుతాను. అది సినిమాలో ఆ క్యారెక్టర్ ని బట్టి చేసింది. నిజజీవితంలో అది మంచిది కాదు. పిల్లలు స్మోక్ చేయవద్దు. పిల్లలే కాదు పెద్దలు కూడా స్మోక్ చెయ్యొద్దని కోరుకుంటున్నాను. అది ఆరోగ్యానికి హానికరం. దయచేసి పొగ తాగకండి. మరోసారి నా అభిమానులకు, నా ఆర్మీకి థాంక్స్ చెప్పుకుంటున్నాను. కేవలం మీ ప్రేమ వల్లే ఇంత దూరం వచ్చాను. ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించిన తెలుగు ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్” అని చెప్పారు.
ఈ ఈవెంట్ లో డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు అల్లు అర్జున్, సుశాంత్, త్రివిక్రమ్ షీల్డులను బహూకరించారు. అలాగే చిత్ర నటీ,నటులకు, సాంకేతిక నిపుణులకు షీల్డ్స్ బహుకరించారు. ఈ చిత్రం నైజాం, వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, సీడెడ్ ఏరియాల్లో ‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్ (నాన్-బాహుబలి) అయిందని డిస్త్రి బ్యూటర్స్ తెలిపారు. సుమతో పాటు నటుడు బ్రహ్మాజీ కూడా ఈ ఈవెంట్ కు యాంకర్ గా వ్యవహరించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.


యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్‌ ఇలా అన్ని అంశాలు ఉన్న ‘అశ్వథ్థామ` త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంది – దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు

యంగ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై రమణ తేజ దర్శకత్వంలో ఉష ముల్పూరి నిర్మించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘అశ్వథ్థామ`. మెహ‌రీన్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నసందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో. నిర్మాతలు శంకర్‌ ప్రసాద్, ఉషా ముల్పూరి, లైన్‌ ప్రొడ్యూసర్‌ బుజ్జి పాల్గొన్నారు.

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ – “నేను చిన్న సినిమాలు చూస్తుంటాను. కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న దర్శకులు, సాంకేతిక నిపుణులు మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. నటుడిగా నాగశౌర్య ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలడు. గడ్డం తీస్తే క్లాస్‌గా కనిపిస్తాడు. గడ్డం ఉంటే ఫైటర్‌గా ఉంటాడు. కీరిటం పెడితే కృష్ణుడిలా, క్యాప్‌పెడితే కౌబాయ్‌లా ఉంటాడు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘ఛలో’ వంటి సినిమాలు సక్సెస్ సమయంలో నా కన్ను నాగశౌర్యపై పడింది. దేవి కటాక్షం కోసం చూస్తున్నాం నేను ‘అశ్వథ్థామ’ చిత్రం చూడలేదు. కానీ ఈ చిత్రం నా ఊహకు ఓ కమర్షియల్‌ కుంటుంబ కథా చిత్రంగా అనిపిస్తుంది. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్‌ ఇలా అన్ని అంశాలు ఉన్న ఈ చిత్రం హిట్ సాధిస్తుంది. ‘అశ్వథ్థామ’ చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌. నాగశౌర్య తన కెరీర్‌లో ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలి’’ అన్నారు.

యంగ్‌ హీరో నాగశౌర్య మాట్లాడుతూ – “రాఘవేంద్రరావుగారి ఆశీస్సులతో ఈ సినిమా మొదలైంది. ఆయన చేయి చాలామంచిదని అంటుంటారు. మా సినిమా ప్రొడక్ట్‌ బాగా వచ్చింది. దాదాపు నెలరోజుల నుంచి ఈ సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నాను. శుక్రవారం మా సినిమా విడుదల అవుతుంది. అప్పుడు ప్రేక్షకుల అభిప్రాయాలను నా చెవులతో వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ చిత్రం నాకొక మంచి ఎమోషన్ జర్నీ అని చెప్పగలను. ఇందులో కొత్త శౌర్యను చూస్తారు. నేను కన్న ఈ సినిమా దీని కోసం మా టీమ్‌ అంత చాలా కష్టపడ్డారు. నాకు కథ చెప్పి దర్శకుడు అవుదామని వచ్చిన ఫణి నా మాట విని ఈ సినిమాకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చరణ్‌తేజ్‌ అందించిన సంగీతం శ్రోతలకు కనెక్ట్ అయింది. జిబ్రాన్‌ మంచి నేపథ్యసంగీతం సమకూర్చారు. ఇంకా ఎడిటర్‌ గ్యారీ, కెమెరామన్‌ మనోజ్‌ డైలాగ్‌ రైటర్స్‌ సురేష్,భాస్కర్‌ ఇలా అందరు బాగా కష్టపడ్డారు. కష్టపడి సినిమాను నిజాయితీగా తీశాం. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు

చిత్ర ద‌ర్శ‌కుడు రమణతేజ మాట్లాడుతూ – “ఇక్క‌డికి వచ్చిన రాఘవేంద్రరావుగారికి ధన్యవాదాలు. మూవీ ఓపెనింగ్‌ రోజు ఆయన వచ్చారు. ఇప్పుడు రిలీజ్‌ సందర్భంగా మళ్లీ మాకు సపోర్ట్‌గా వచ్చారు. ఈ సినిమాను రమణతేజ బాగా తీశాడని చెప్పుకుంటున్నారు. కానీ నాగశౌర్య మంచి కథను అందించారు. నాగశౌర్య సపోర్ట్‌ మరవలేనిది. ఇక ఈ సినిమా రిజల్ట్‌
గురించి పక్కన పెడితే..ఓ మంచి కారణంతో తీశాం. ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు

ఐరా క్రియేషన్స్‌ డిజిటల్‌ డైరెక్టర్‌ గౌతమ్ మాట్లాడుతూ – “మా తమ్ముడు ఇప్పటివరకు 17 సినిమాలు చేశాడు. ఇది 18వ
సినిమా. ప్రతి సినిమాకు నేను ఎదొఒక కంప్లైట్‌ చేసేవాడిని. ఈ సినిమాకు అలా ఏం లేదు. తనలోని యాక్టర్‌కిపోటీ పడేలా రైటర్, తన లోని రైటర్‌కు పోటీగా యాక్టర్‌ అంటూ చేశాడు శౌర్య. రమణతేజ ఈ సినిమాను బాగా తీశారు. డిజిటల్‌ పబ్లిసిటీ క్రెడిట్‌ నా ఒక్కడిదే కాదు. టీమ్‌ అందరిదీ. సహకరిస్తున్న మీడియాకు ధన్యవాదాలు’’ అన్నారు .

న‌టుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ – ‘‘సమాజంలోమహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను ఎదిరించే వ్యక్తిత్వం ఉన్నావాడు ‘అశ్వథ్థామ’. ఈ చిత్రం ఐరా క్రియేషన్స్‌లో మంచి చిత్రంగా నిలుస్తుంది. ఒకప్పుడు భాగ్యరాజ్, రాజేంద్రన్‌ వంటివారు వారే
కథ రాసుకుని హీరోగా రాసేవారు. ఈ సినిమాకు నాగశౌర్య అలా చేశారు’’ అన్నారు

ఈ కార్యక్రమంలో కెమెరామన్‌ మనోజ్, ఎడిటర్‌ గ్యారీ, డైలాగ్‌ రైటర్‌ పరశురామ్,కో డైరెక్టర్‌ అంకిత్, శ్రీనివాసరెడ్డి ప్ర‌సంగించి సినిమా విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు.

నాగశౌర్య, మెహరీన్‌ హీరోహీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్‌ రెడ్డి, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: జిబ్రాన్‌, ఎడిటింగ్‌: గ్యారీ బి.హెచ్‌, డిజిటల్‌: ఎం.ఎస్‌.ఎస్‌. గౌతమ్‌, డైలాగ్స్‌: పరుశురాం శ్రీనివాస్‌, యాక్షన్‌: అన్బరివు, కొరియోగ్రఫీ: విశ్వ రఘు, లైన్‌ ప్రొడ్యూసర్‌: బుజ్జి, నిర్మాత: ఉషా ముల్పూరి, కథ: నాగశౌర్య, కో డైరెక్టర్‌ అంకిత్, శ్రీనివాసరెడ్డి, దర్శకత్వం: రమణ తేజ.


Ala Vaikunthapurramuloo latest box office collection report

Allu Arjun Ala Vaikunthapuramulo Movie First Look ULTRA HD Posters WallPapers | Pooja Hegde

Stylish Star Allu Arjun and Pooja Hegde played the lead roles in the film Ala Vaikunthapurramuloo. The movie released during Sankranthi and it has got a lot of attention from the audiences.

According to the trade buzz, Allu Arjun’s Ala Vaikunthapurramuloo is performing well at the box-office in the USA. The movie is exceptionally doing well in the 3 rd weekend too in the USA. As of now, the movie made around $61k on Friday and crossed 50k on Saturday by 10 am PST. Apparently, the total has come around almost $3.28 M. Now, we the makers are expecting it to reach $3.5 M very soon!

Directed by Trivikram Srinivas, the film is produced jointly by S Radha Krishna and Allu Aravind. The film unit is happy with the movie’s performance at the box-office in the Telugu states as well.



నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ‘టక్ జగదీష్’ ప్రారంభం

నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ‘టక్ జగదీష్’ ప్రారంభం

టాలీవుడ్ లోని మినిమం గ్యారంటీ హీరోల్లో ఒకరైన నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నారు. ‘నిన్నుకోరి’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఆ ఇద్దరి కాంబినేషనులో తయారవుతున్న సినిమా ఇది.

షైన్ స్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది నానికి 26వ చిత్రం.

గురువారం ఉదయం పూజా కార్యక్రమాలతో ‘టక్ జగదీష్’ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. ముందుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శక నిర్మాతలకు స్క్రిప్టును అందజేశారు. ఆ తర్వాత చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ కొట్టగా, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని కెమెరా స్విచ్చాన్ చేశారు.

నానితో ఇదివరకు ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నటించిన రీతు వర్మ, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ఫేమ్ ఐశ్వర్యా రాజేష్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్నారు.

‘టక్ జగదీష్’ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ఔట్ డోర్ లొకేషన్లలో జరుగుతుంది.

తారాగణం:
నాని, రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్, జగపతిబాబు, నాజర్, రావు రమేష్, నరేష్, మురళీశర్మ

సాంకేతిక వర్గం:
సంగీతం: ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: సాహి సురేష్
ఫైట్స్: వెంకట్
పీఆర్వో: వంశీ-శేఖర్
కాస్ట్యూం డిజైనర్: నీరజ కోన
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్)
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
రచన-దర్శకత్వం: శివ నిర్వాణ.
బ్యానర్: షైన్ స్క్రీన్స్



`జాను` ట్రైల‌ర్ విడుద‌ల‌

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ ‘జాను’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా…

హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – ”నా పదిహేడేళ్ల కెరీర్‌లో తొలి రీమేక్‌ ‘జాను’. తమిళ చిత్రం ’96’కు ఇది రీమేక్‌. ఎప్పుడైనా రీమేక్‌ చేయాలంటే ఏముంటుందిలే అనుకునేవాడిని. అలా అంతకు ముందు రెండు సినిమాలు రీమేక్‌ చేద్దామనుకుని మిస్‌ అయ్యాను. ’96’ సినిమాను తమిళంలో రిలీజ్‌ కంటే ఓ నెల ముందే చూశాను. ప్రివ్యూ థియేటర్‌ నుండి బయటకు రాగానే సినిమాను తెలుగులో రీమేక్‌ చేయాలని ఫిక్స్‌ అయ్యాను. ఈ సినిమాకు శర్వానంద్‌, సమంత ఫైనల్‌ కాకముందు చాలా చాలా అనుకున్నాను. ఆ సమయంలో చాలా కామెంట్స్‌ వినిపించాయి. వీళ్లకేమైనా పిచ్చా? అదొక క్లాసిక్‌ మూవీ. దిల్‌రాజుకేమైనా మెంటలా? ఎందుకు రీమేక్‌ చేస్తున్నాడు? అని చాలా కామెంట్స్‌ వచ్చాయి. నాకు అర్థం కాలేదు. ఒక ఆడియన్‌గా నేను సినిమా చూశాను. తమిళం నాకు పూర్తిగా రాదు. అయినా కూడా పాత్రలతో నేను ట్రావెల్‌ అయ్యి.. సినిమాకు ఎక్కువగా కనెక్ట్‌ అయ్యాను. నేను ఏదైనా ఆరోజు నమ్మానో..ఈరోజు కూడా అదే నమ్ముతున్నాను. సామ్‌ సినిమా చూసి ఓరిజినల్‌ డైరెక్టర్‌ అయితేనే సినిమా చేస్తానని అంది. చివరకు నేను ఓరిజినల్‌ డైరెక్టర్‌నే తెచ్చాను. సమంత నన్ను కలిసినప్పుడు నాపై నమ్మకంతో సినిమా చేయమని చెప్పాను. తను ఓకే అంది. రెండు రోజుల తర్వాత తనే ఫోన్‌ చేసి నాకు థ్యాంక్స్‌ చెప్పడమే కాదు.. మేజిక్‌ను ప్రతిరోజూ ఎంజాయ్‌ చేస్తున్నానని చెప్పింది. శర్వానంద్‌ కూడా సినిమా చూసి బ్యూటీఫుల్‌ మూవీ చేస్తానని నాకు ఫోన్‌ చేశాడు. అలా శర్వా, సామ్‌ ఈ సినిమాలోకి వచ్చారు. తమిళ సినిమాను డైరెక్ట్‌ చేసిన ప్రేమ్‌కుమార్‌, టెక్నీషియన్స్‌ అందరూ ఈ సినిమాకు వర్క్‌ చేశారు. ఫిబ్రవరి 7న తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నాం. నేను ఏదైతే ఫీలింగ్‌తో ఉన్నానో.. రేపు సినిమా చూసి ప్రేక్షకులు అదే ఫీలింగ్‌ నిజమని నమ్ముతారు. అమ్మాయిలైతే శర్వాతో ప్రేమలో పడితే.. అబ్బాయిలు సామ్‌తో లవ్‌లో పడతారు. అలాంటి సోల్‌ ఫుల్‌ లవ్‌స్టోరీ. అహా! అలాంటి లవర్‌ మనకుంటే బాగుండు అనే ఈర్ష్యతోనే లవ్‌లో పడతాం” అన్నారు.
అక్కినేని సమంత మాట్లాడుతూ – ” ఈ సినిమా క ఓసం దిల్‌రాజుగారు మా మేనేజర్‌కి ఫోన్‌ చేసి నన్ను కలవాలని అనగానే నేను భయపడ్డాను. ఎందుకంటే ఓ క్లాసిక్‌ సినిమాను రీమేక్‌ చేయాలి. విజయ్‌సేతుపతి, త్రిష అద్భుతంగా పెర్ఫామ్‌ చేశారు. దాంతో నేను నిజంగానే భయపడ్డాను. ఒకవేళ దిల్‌రాజుగారిని కలిస్తే ఓకే చెప్పేస్తాను. కాబట్టి దాదాపు వద్దనే చెబుతూ వచ్చాను. చివరికి ఆయన్ని కలిసి ఒక నిమషంలోనే నేను సినిమా చేస్తానని చెప్పాను. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌తో ఉన్న అనుబంధం కారణంగా.. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. తొలిరోజు షూటింగ్‌ పూర్తి కాగానే దిల్‌రాజుగారికి ఫోన్‌ చేసి థ్యాంక్స్‌ చెప్పాను. శర్వానంద్‌కి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్‌. ప్రతిరోజూ ప్రతి సీన్‌ వందశాతం పెర్ఫామెన్స్‌ ఇవ్వాలి. మేజిక్‌ జరగాలి. అలాంటిది చాలా కష్టం. దాన్ని కూడా క్రాస్‌ చేశానంటే ఏకైక కారణం శర్వానంద్‌ మాత్రమే. రేపు నాకేదైనా క్రెడిట్‌ దక్కినా మా ఇద్దరికీ దక్కుతుంది. ప్రతిసీన్‌ను ఇద్దరం డిస్కస్‌ చేసుకుని చేశాం. ఇద్దరం వందశాతం ఎఫర్ట్‌ పెట్టాం. మేం మేజిక్‌ క్రియేట్‌ చేశామని అర్థమవుతుంది. ఆ మేజిక్‌ను మీరు ఫిబ్రవరి 7న వెండితెరపై చూస్తారు” అన్నారు.
హీరో శర్వానంద్‌ మాట్లాడుతూ – ”దిల్‌రాజుగారు ఫోన్‌ చేసి సినిమా చూడమంటే చూశాను. ‘అన్నా ఇది క్లాసిక్‌ చేద్దామా?’ అన్నాను. దానికి దిల్‌రాజు ‘నన్ను నమ్ము’ అన్నారు. ఆయన జడ్జ్‌మెంట్‌పై బాగా నమ్మకం ఉంది. శతమానం భవతి అప్పుడు కూడా నన్ను నమ్ము అన్నారు. నేను నమ్మాను. నాకు పెద్ద హిట్‌ ఇచ్చారు. ఈసారి ఆయన ఆ సినిమాను కూడా దాటిస్తారని అనుకుంటున్నాను. సినిమా విషయానికి వస్తే.. సమంతగారు లేకుంటే నేను అంతగా చేయలేపోయేవాడినేమో. ప్రతిరోజూ సన్నివేశాల్లోని మేజిక్‌ను ఎంజాయ్‌ చేసేవాళ్లం. అది అన్ని సినిమాలకు కుదరదు. రేపు నాకేదైనా పేరొస్తే ఆ క్రెడిట్‌ సమంతకే దక్కుతుంది. ఈ మేజిక్‌ ప్రతి సీన్‌లో ప్రతి మూమెంట్‌లో కనపడుతుంది. చాలా మందికి లవ్‌ ఫెయిల్యూర్‌ అనేది జరుగుతుంటుంది. అయితే అందరికీ ఫస్ట్‌ లవ్‌ అనేది గుర్తుండిపోతుంది. నాకు తెలిసి ఈ మధ్య నాలుగైదేళ్లలో అంతకంటే ఎక్కువగా.. అంటే పదేళ్లపైగానే ఇలాంటి లవ్‌స్టోరీ రాలేదనే చెప్పాలి. చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్‌ చేస్తున్నాను. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చి తప్పకుండా ఏదో మేజిక్‌ అయితే జరుగుతుందని అనుకుంటున్నాను. డైరెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ సహా ఎంటైర్‌ టీమ్‌కు థ్యాంక్స్‌. ఫిబ్రవరి 7 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు.

న‌టీన‌టులు:
శ‌ర్వానంద్‌, సమంత‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, వెన్నెల కిషోర్‌, ర‌ఘుబాబు, తాగుబోతు ర‌మేశ్‌, శ‌ర‌ణ్య‌, గౌరి, సాయికిర‌ణ్‌, హాసిని త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: సి.ప్రేమ్‌కుమార్‌
నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్‌
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి అనిత‌
బ్యాన‌ర్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
సంగీతం: గోవింద్ వ‌సంత‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌హేంద్ర‌న్ జ‌య‌రాజ్‌
ఆర్ట్‌: రామాంజ‌నేయులు
మాట‌లు: మిర్చి కిర‌ణ్‌
పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శ్రీమ‌ణి