Category Archives: Movie News

పది వసంతాలు పూర్తి చేసుకున్న ‘వై నాట్’ స్థూడియోస్

* ‘లవ్ ఫెయిల్యూర్’, ‘గురు’, గేమ్ ఓవర్’
తెలుగు నాట ‘వై నాట్’ స్థూడియోస్ విజయ కేతనం
* పది వసంతాలు పూర్తి చేసుకున్న ‘వై నాట్’ స్థూడియోస్
* మీడియా కు కృతఙ్ఞతలు

29 జనవరి 2020: ఒక ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియోగా మేం ఒక దశాబ్దం పూర్తి చేసుకున్నాం. ఒక బ్యానరుగా సాధారణం కంటే భిన్నమైన కంటెంట్ తో స్థిరంగా సినిమాలు నిర్మించడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాం. మా సంస్థను ప్రొడ్యూసర్ ఎస్. శశికాంత్ 2010లో నెలకొల్పారు. ఈ జనవరితో సినీ నిర్మాణంలో పదో సంవత్సరాన్ని గర్వంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పటివరకూ మేం 18 ఫీచర్ ఫిలిమ్స్ నిర్మించాం. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో చిత్రాలు నిర్మించే అతికొద్ది నిర్మాణ సంస్థల్లో ఒకటిగా మా సంస్థ గుర్తింపు పొందింది. ఎ.ఆర్. రెహమాన్, రాజ్ కుమార్ హిరాణీ, ఆనంద్ ఎల్. రాయ్ వంటి గొప్ప ప్రతిభావంతులతో కలిసి ఉన్నతస్థాయి చిత్రాల్ని నిర్మించామని చెప్పుకోవడానికి ఆనందిస్తున్నాం అని తెలిపారు సంస్థ అధినేత శశికాంత్

2010లో తమిళ చిత్రం ‘తమిళ్ పాడం’తో మేం చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించాం. సి.ఎస్. అముదన్ డైరెక్ట్ చేయగా శివ హీరోగా నటించిన ఆ మూవీ భారతదేశపు తొలి పూర్తి స్థాయి స్పూఫ్ ఫిలింగా గుర్తింపు పొందింది. మా బ్యానర్ నుంచి ప్రేక్షకులు ఎలాంటి చిత్రాల్ని ఆశించవచ్చో ఆ సినిమా తెలియజేసింది. అది మూసకు భిన్నమైన ఆసక్తికర, వినోదాత్మక చిత్రం. వినోదాన్నిచ్చే, ఉత్కంఠ కలిగించే ప్రభావవంతమైన కథలతో ‘వై నాట్ స్టూడియోస్’ సినిమాలు నిర్మిస్తుందనే విషయం ఆ మూవీతో ప్రేక్షకులకు తెలిసింది.

మా హిట్ మూవీస్ లో వినూత్న కథనంతో బాలాజీ మోహన్ రూపొందించగా అటు విమర్శకులు, ఇట్లు ప్రేక్షకులు మెచ్చిన ‘లవ్ ఫెయిల్యూర్’ (2013) వంటి ద్విభాషా రొమాంటిక్ కామెడీలు ఉన్నాయి. వసంత బాలన్ దర్శకత్వంలో ఒక చిత్రం నిర్మించాం. 2016లో సుధ కొంగర దర్శకత్వంలో మేం నిర్మించిన స్పోర్ట్స్ డ్రామా ‘గురు’ మూడు భాషల్లో నిర్మాణమైంది. సహ నిర్మాతగా హిందీలో తీసిన కామెడీ డ్రామా ‘శుభ్ మంగళ్ సావధాన్’ (2017), ఆ తర్వాత నిర్మించిన ‘గేమ్ ఓవర్’ (2019) సినిమాలు వాణిజ్యపరంగా విజయాలు సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందాయి.

అన్ని భాషల్లో సినిమాలు నిర్మించి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి 2018లో అనిల్ డి. అంబాని ఆధ్వరంలోని రిలయెన్స్ ఎంటర్‌టైన్మెంట్, ఏపీ ఇంటర్నేషనల్ సంస్థలతో కలిసి జాయింట్-వెంచర్ భాగస్వామ్యాన్ని ఏర్పాటుచేశాం.

2018లో ‘వైనాట్ ఎక్స్ మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్’ అనే లేబుల్ తో మార్కెంటింగ్, డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వెళ్లాం. ‘తమిళ్ పాడం 2’ (2018), ‘సూపర్ డీలక్స్’ (2019), ‘గేమ్ ఓవర్’ (2019), ’83’ (2020) సహా పలు కంటెంట్-డ్రివెన్ మూవీస్ ని డిస్ట్రిబ్యూట్ చేశాం, చేస్తున్నాం. చురుకైన మార్కెటింగ్ విభాగం.. అది ఏర్పాటైన దగ్గర్నుంచి అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల ప్రమోషన్సును నిర్వహిస్తూ వస్తోంది. 2019లో ‘వైనాట్ మ్యూజిక్’ అనే లేబుల్ తో సంగీతం ప్రపంచంలో అడుగుపెట్టాం. సమీప భవిష్యత్తులో ఉత్తేజకరమైన కేటలాగ్ ని విడుదల చేయబోతున్నాం.

మా పదో వార్షికోత్సవం సందర్భంగా, మా సృజనాత్మక అభిరుచిని నమ్మిన, కొంతకాలం కొత్త బృందంతో ప్రయోగాలు చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ మేము థాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇంతదాకా మా జర్నీలో ఒక భాగంగా ఉంటూ వస్తున్న మా భాగస్వాములు, తోటి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ఆడియో సంస్థలు, డైరెక్టర్లు, మ్యుజీషియన్లు, ప్రతిభావంతులు, సాంకేతిక నిపుణులు, సర్వీస్ ప్రొవైడర్స్, పీఆర్వోలు, ప్రెస్ అండ్ మీడియా అందరికీ సిన్సియర్ గా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.

‘న్యూ-వేవ్ సినిమా’ ప్రాజెక్ట్స్ ను రూపొందించే మార్గదర్శిగా, ప్రత్యేకించి ఇండియాలో, గుర్తింపు పొందడాన్ని గర్విస్తున్నాం.

“ఈ తరుణంలో మేము మరింత ఉత్తేజకరమైన సినిమాను రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాం. మా ముందున్న రహదారి ఎప్పటిలాగే ఉత్తేజకరమైనదిగా కనిపిస్తోంది. ఈ జర్నీని మీ అందరితో పంచుకోడానికి మేం ఎక్కువగా ఆశ్చర్యపోవట్లేదు. ఎందుకంటే, మా కృషి, పట్టుదలకు మీరందిస్తున్న ప్రశంసలు మమ్మల్ని భావజాలాలు, కొత్త కాన్సెప్టుల రూపకల్పనకు ప్రేరేపించి, మరింత పెద్ద కలలు కనేందుకు ముందుకు తోస్తున్నాయి. ఈ సంవత్సరం మీరు ‘వైనాట్ స్టూడియోస్’ బ్యానర్ కింద ‘డి40’ (ధనుష్ 40వ చిత్రం), ‘మండేలా’, ‘ఏలే’ సినిమాల్ని ఊహించవచ్చు.” అని తెలిపారు – ఎస్. శశికాంత్ (ఫౌండర్, ‘వైనాట్’ గ్రూప్) ఈ సందర్భంగా మీడియాకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.


శ్రీమాతా క్రియేషన్స్ సుమన్, షియాజి షిండే ముఖ్య పాత్రల్లో వస్తోన్న సత్యం చిత్రం మొదటి షెడ్యూల్ తలకొన అడవుల్లో పూర్తి !!!

శ్రీమాతా క్రియేషన్స్ బ్యానర్ పై కె.మహాంతేష్ నిర్మాతగా అశోక్ కడబ దర్శకత్వంలో సంతోష్ బాలరాజు హీరోగా షియాజి షిండే, సుమన్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం సత్యం. నవంబర్ 2019లో అన్నపూర్ణ స్టూడియోన్స్ లో ప్రారంభం అయిన ఈ మూవీ మొదటి షెడ్యూల్ తలకొన అడవుల్లో పూర్తి అయ్యింది. ఈ షెడ్యూల్ లో షియాజి షిండే, సుమన్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

త్వరలో ఈ చిత్ర కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా కె.మహాంతేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అవినాష్, రంజిని రాఘవన్, వినయ్ ప్రసాద్, శృంగేరి రమణ, ఉమ , బసవ రాజు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. కెజిఎఫ్ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ రవి బన్సురు ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. సినిటెక్ సూరి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ మూవీకి కెవి.రాజు మాటలు రాస్తున్నారు అలాగే ఈ మూవీకి ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఎదురూరి అంజిబాబు వ్యవహరిస్తున్నారు.


విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో నేచుర‌ల్ స్టార్ నాని… `వి` సినిమాలో నాని ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో నేచుర‌ల్ స్టార్ నాని… `వి` సినిమాలో నాని ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

అష్టాచ‌మ్మా, జెంటిల్‌మ‌న్ వంటి వైవిధ్య‌మైన చిత్రాల్లో నేచుర‌ల్‌స్టార్ నానిని స‌రికొత్త‌గా ఆవిష్క‌రించారు డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `వి`. ఈసారి కూడా డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మ‌రో కొత్త పాత్ర‌లో నానిని తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. ఆ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం `వి` సినిమా చూడాల్సిందే. సాంపుల్‌గా నాని లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు నాని పోషించ‌ని స‌రికొత్త పాత్ర‌, లుక్‌లో క‌న‌ప‌డుతున్నారు. గ‌డ్డం, మెలితిప్పిన మీసాలు, చేతిలో క‌త్తెర‌, చేతికి ర‌క్తం, చూపుల్లో నిర్ల‌క్ష్యం ఇవ‌న్నీ చూస్తుంటే నాని పాత్ర‌లోని డెప్త్ అర్థం చేసుకోవ‌చ్చు.

క్లాస్, మాస్ పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకున్న నాని తొలిసారి విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నారు. రాక్ష‌సుడి త‌ర‌హా పాత్ర‌లో నాని క‌న‌ప‌డ‌తార‌ని హీరో సుధీర్‌బాబు ఇది వ‌ర‌కే ట్వీట్ కూడా చేశారు. రాక్ష‌సుడి బారి నుండి కాపాడే సేవియ‌ర్ పాత్రధారి ప‌వ‌ర్‌ఫుల్ ఐపీయ‌స్ ఆఫీస‌ర్‌గా సుధీర్‌బాబు న‌టిస్తున్నారు. నాని, సుధీర్‌బాబు పాత్ర‌ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు పోటాపోటీగా ఉంటాయని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

నేను లోక‌ల్‌, ఎంసీఎ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించిన హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు.. నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం కావ‌డం విశేషం. నానితో ఒక ప‌క్క ద‌ర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి, మ‌రో ప‌క్క నిర్మాత దిల్‌రాజు రూపొందిస్తోన్న హ్యాట్రిక్ చిత్రం `వి` కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. నాని న‌టిస్తోన్న‌ 25వ చిత్ర‌మిది. ఈ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల‌ర్ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమాను ఉగాది సంద‌ర్భంగా మార్చి25న విడుద‌ల చేస్తున్నారు.

న‌టీన‌టులు:
నాని, సుధీర్‌బాబు, నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
మ్యూజిక్‌: అమిత్ త్రివేది
సినిమాటోగ్ర‌ఫీ: పి.జి.విందా
ఎడిటింగ్‌: మార్తాండ్ కె.వెంక‌టేశ్‌
నిర్మాత‌లు: రాజు, శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి


ఏప్రిల్ 28 ఏం జరిగింది?


ఏప్రిల్ 28 ఏం జరిగింది?

సరికొత్త కథాంశంతో జనరంజకమైన అంశాలతో రూపొందే సినిమాలను తెలుగు ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. వైవిధ్యాన్ని ఆదరించే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా మా చిత్రానికి కూడా విజయాన్ని అందిస్తారని నమ్ముతున్నానుఅన్నారు దర్శకుడు వీర గనమాల. రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆయన స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఏప్రిల్ 28 ఏం జరిగింది.టైటిల్‌తోనే ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం ఇటీవల విడుదల చేసిన టీజర్‌తో ప్రేక్షకుల్లోమరింత ఉత్కంఠను రేపింది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. నేటి తరం ప్రేక్షకులు మెచ్చే ఓ వినూత్నమైన కథతో, ఎవరూ అంచనా వేయలేని ట్విస్ట్‌లతో అనుక్షణం ఉత్కంఠగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా కొనసాగే ఈ చిత్రంలో ప్రతి మలుపు ఆసక్తికరంగా థ్రిల్లింగ్‌గా వుంటుంది. త్వరలో బ్యాంకాంక్‌లో జరిగే పాట చిత్రీకరణతో చిత్రం పూర్తవుతుంది. మార్చి నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. అజయ్, రాజీవ్‌కనకాల, తనికెళ్లభరణి, చమ్మక్‌చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సందీప్, కెమెరా: సునీల్‌కుమార్ ఎన్, స్క్రీన్‌ప్లే: హరిప్రసాద్ జక్కా, మాటలు, పాటలు: ధర్మతేజ, రామాంజనేయులు, ఎడిటర్:కె.సంతోష్, కథ-మాటలు-దర్శకత్వం: వీర గనమాల


బగ్గిడి ఆర్ట్స్ మూవీస్ ‘రైట్ రైట్ బగ్గిడి గోపాల్’ బయోపిక్ ఫిబ్రవరి 28న విడుదల

బగ్గిడి ఆర్ట్స్ మూవీస్, మాస్టర్ బగ్గిడి చేతన్ రెడ్డి, మాస్టర్ బగ్గిడి నితిన్ సాయి రెడ్డి సమర్పించు బగ్గిడి గోపాల్. అర్జున్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 28న విడుదల కాబోతొంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం అయ్యారు.

ఈ సందర్బంగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ…
అందరికి నమస్కారం. సుమన్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది, ఆయన నటిస్తోన్న ఈ బగ్గిడి గోపాల్ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్న. చిన్న నిర్మాత చేస్తున్న ఈ సినిమాకు మా అందరి సపోర్ట్ ఉంటుంది. బయోపిక్ లు ఈ మధ్య బాగా ఆడుతున్నాయి, అలాంటి నేపథ్యంలో వస్తోన్న ఒక బయోపిక్ సినిమా ఇది. బగ్గిడి గోపాల్ అనే బయోపిక్ లో ఒక సామాన్య బస్ కండెక్టర్ ఏంఎల్ఏ గా ఎలా ఎదిగాడు అనే అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. సుమన్ గారు ఈ మూవీలో ఒక పోలీసు అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు. చిత్ర యూనిట్ అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. ఫిబ్రవరి 28న విడుదల కాబోతున్న ఈ సినిమా సక్సెస్ కావాలని తెలిపారు.

సుమన్ మాట్లాడుతూ…
ఒక సామ్యన్య బస్ కండెక్టర్ పెద్ద స్థాయికి ఎలా వెళ్ళాడు అనే అంశం ఈ సినిమాలో బాగా చూపించారు డైరెక్టర్ అర్జున్ కుమార్. ఈ సినిమా కథ ఆదర్శంగా ఉంటుంది. నేను ఈ సినిమాలో ఒక పోలీస్ అధికారి రోల్ లో కనిపిస్తాను. కొత్త నిర్మాత అయిన బగ్గిడి గోపాల్ ఈ సినిమాను బాగా తీశాడు, డైరెక్టర్ అర్జున్ కుమార్ సినిమాను అద్భుతంగా ఆవిష్కరించారు. రొటీన్ కు భిన్నంగా ఈ సినిమా ఉండబోతొంది. మా సినిమాను సపోర్ట్ చేస్తున్న అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

బగ్గిడి గోపాల్ మాట్లాడుతూ…
1982 లో మార్చి లో రాజకీయాల్లో జరిగిన కొన్ని కీలక మార్పులు జరిగాయి. అదే రోజు నేను ఎన్టీఆర్ తో పాటు నడవడం జరిగింది. తాను పెట్టిన టిడిపి పార్టీలో నేను చేసిన కృషి , సేవలు ఈ బగ్గిడి గోపాల్ చిత్రంలో చూపించడం జరిగింది. ఫిబ్రవరి 23న ఈ సినిమా విడుదల కాబోతొంది. సెన్సార్ పూర్తి చేసుకున్న మా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా చెయ్యబోతున్నాము. ఈ సినిమాను మా కుటుంబ సభ్యులకు అంకితం చేస్తున్నాను. నా గురించి, నా జీవితంలో జరిగిన కీలక సన్నివేశాలు ఈ మూవీలో చెప్పడం జరిగిందని తెలిపారు.

ఎక్స్ ఎమ్ఎల్ఏ సంజయ్ రావు మాట్లాడుతూ….
బగ్గిడి గోపాల్ గారు ఎమ్ఎల్ఏ అయిన తరువాత జరిగిన అన్ని సంఘటనలు నాకు తెలుసు. ఆయన చేస్తున్న బగ్గిడి గోపాల్ సినిమాలో నిజాలు చూపించారు. ముక్కుసూటి మనిషి అయిన బగ్గిడి గోపాల్ ను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఇలాంటి అనేక అంశాలు ఈ బగ్గిడి బయోపిక్ లో పెట్టడం జరిగింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.

హీరోయిన్ చందన మాట్లాడుతూ…
అందరికి నమస్కారం. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతకు ధన్యవాదాలు. నాకు ఈ మూవీలో ఉన్న అన్ని సాంగ్స్ ఇష్టం, ప్రధానంగా గోపాలన్న సాంగ్ నాకు ఇష్టమని తెలిపారు.

డైరెక్టర్ అర్జున్ కుమార్ మాట్లాడుతూ…
నేను ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యడంతో పాటు ఒక పాత్రలో నటించాను. బగ్గిడి గోపాల్ గారు నిజాయితీ కలిగిన వ్యక్తి, ఆయనతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. 23న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నాము, ఫిబ్రవరి 28న ఈ సినిమాను విడుదల చేస్తున్నాము, మా సినిమాకు మీడియా అందరి సపోర్ట్ కావాలని కోరారు.


బ్యానర్: బగిడి ఆర్ట్ మూవీస్
సినిమా: బగిడి గోపాల్
ఆర్టిస్ట్స్: సుమన్, కవిత, ప్రభావతి, మహేష్, తేజ
హీరో: రమాకాంత్
హీరోయిన్: సిరి చందన
డైరెక్టర్: అర్జున్ కుమార్
ప్రొడ్యూసర్: బగిడి గోపాల్
కెమెరామెన్: ప్రవీణ్ కుమార్
స్టంట్స్ & కోడైరెక్టర్: అవిష్ పూరి
మ్యూజిక్: జయసూర్య బుప్పేం
పిఆర్ఓ: మధు.విఆర్


ఫిబ్రవరి 7న ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా ఫస్ట్ లుక్, ప్రచార చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఫిబ్రవరి 7న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

దర్శకుడు బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ ‘‘వీరి నాయుడుగారి అబ్బాయి శ్రీనివాస్‌, మేం కలిసి ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసి ఈ సినిమా చేశాం. ఫిబ్రవరి 7న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఆల్రెడీ రిలీజైన ట్రైలర్, పోస్టర్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా ప్రేక్షకులు అందరికీ థాంక్స్. మహానగరంలో నివసించే నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. హైదరాబాద్‌లో ఉండే ఈ నలుగురు అమ్మాయిలు ఫ్రెండ్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం గోవా వెళతారు. అక్కడ ఏం జరిగింది? అనేది ఆసక్తికరం. కథ, కథనాలు కొత్త తరహాలో ఉంటాయి. ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. న్యూ ఏజ్ సినిమా ఇది’’ అని అన్నారు.

నటీనటులు:
ధన్యా బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌, రఘుబాబు, హిమజ, రఘు కారుమంచి, సమీర్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు:
అసోసియేట్‌ డైరెక్టర్‌: లక్కీ బెజవాడ, ఎడిటర్‌: తెల్లగుటి మణికాంత్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎల్‌ఎన్‌ వారణాసి, వైజేఆర్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: నేహా మురళి, రఘురామ్‌ ఎరుకొండ, ఆర్ట్‌ డైరెక్టర్‌: గాంధీ నడికుడికర్‌, సినిమాటోగ్రఫీ: శేఖర్‌ గంగమోని, సంగీతం: వికాస్‌ బడిజ, కో–డైరెక్టర్‌, డైలాగ్స్‌: విజయ్‌ కామిశెట్టి, నిర్మాత: హిమ బిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌, రచన, దర్శకత్వం: బాలు అడుసుమిల్లి.


‘బాలికా వధు’ ఫేమ్ షీతల్ ఖండల్

తెలుగులోనూ రాణించాలన్నదే నా కోరిక
‘బాలికా వధు’ ఫేమ్ షీతల్ ఖండల్

దేశవ్యాప్తంగా బుల్లి తెర ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘బాలికా వధు’ సీరియల్ లో ‘గెహనా’గా నటించిన షీతల్ ఖండల్ గురించి తెలియనివారు ఉండరు. ఈ సీరియల్ ‘చిన్నారి పెళ్లికూతురు’ పేరుతొ తెలుగులోనూ ప్రసారమై ఇక్కడి ప్రేక్షకుల హృదయాలు కూడా గెలుచుకొంది. ‘బాలికా వధు’తో వచ్చిన గుర్తింపు షీతల్ ను ఓవర్ నైట్ స్టార్ ని చేసేసింది. లెక్కకు మిక్కిలి అవార్డులు ఆమెను వరించాయి. ‘వారియర్ సావిత్రి’ అనే హిందీ సినిమాలోనూ నటించి మెప్పించిన షీతల్.. తన మాతృ భాష రాజస్తానీలో ప్రముఖ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలకు సైన్ చేసి.. ఒక ఇండో అమెరికన్ సినిమాలోనూ నటిస్తున్న షీతల్.. త్వరలోనే తెలుగులోనూ తెరంగేట్రం చేయాలని తహతహలాడుడుతోంది. సహజసిద్ధమైన అందం, అభినయం, శభాష్ అనిపించే నాట్య కౌశలం కలిగిన ఈ రాజస్థానీ భామకు తెలుగులో ఎవరైనా పిలిచి అవకాశాలు ఇస్తారేమో వేచి చూడాలి!!


ఆసక్తి రేపుతున్న ‘ పలాస 1978’ లోని పాత్రలు

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘‘పలాస 1978’’ . తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. డైరెక్టర్ కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ విడుదలకు ముందే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. జిఎ2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరిలో విడుదలకు సిద్దం అవుతుంది. ఈ సందర్భంగా ‘పలాస 1978 ’ లోని కొన్ని పాత్రలను యానిమేటడ్ బుక్ రూపంలో పరిచయం చేసింది చిత్ర యూనిట్. ఈ బుక్ ని సోషల్ మీడియా లో చిత్ర సమర్పకులు తమ్మారెడ్డి భరద్వాజ లాంచ్ చేసారు. ఈ యానిమేటడ్ బుక్ లో యూనిట్ పరిచయం చేసిన పాత్రలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. అణువణువునా సహాజత్వం నింపుకున్న ఈ పాత్రల మాటలు కూడా అంతే హృద్యంగా ఉన్నాయి. ముఖ్యంగా పలాస ప్రాంతం నుండి పుట్టిన మాటల లోని భావాలు లోతుగా ఉన్నాయి.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ:
‘‘ఈ సినిమాలోని పాత్రలు మాట్లాడే మాటలు రెగ్యులర్ సినిమాలలో ఉండే లా కాకుండా కంటెంట్ బేస్డ్ గా ఉన్నాయి. సినిమా కథ ఎంత సీరియస్ గా సాగుతుందో ఈ మాటలలో అర్ధం అవుతుంది. సినిమా కథ లోతుగా, సీరియస్ గా ఉండబోతుందని అర్ధం అవుతుంది. పాత్రల పేర్లు, వేష బాషలు చాలా సహాజంగా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ఒక ప్రాంతంలో జరిగిన కథ, ఇది వరకూ ఎవరూ చెప్పని కథ అంటూ మొదలైన ఈ యానిమేటడ్ బుక్ మొదటి పేజి నుండి చివరి పేజీ వరకూ ఆసక్తిగా ఉంది. ఇందులోని పాత్రలు ప్రత్యేక ముద్రను వేసాయి. ’’ అన్నారు.

కథ లోని పాత్రలను యానిమేటడ్ బుక్ రూపంలో పరిచయం చేసింది చిత్ర యూనిట్. విడుదలకు ముందే పరిశ్రమలో ‘పలాస 1978’ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను తెచ్చుకుంది. జిఎ2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్న ఈమూవీ తెలుగు అసురన్ అవుతుందని దర్శకుడు మారుతి కితాబిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతం లోని కథ, ఎవరూ చెప్పని కథ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫ్రిబ్రవరి లో విడుదలకు సిద్దం అవుతుంది.

రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : రఘు కుంచె,
పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా,
నిర్మాత : ధ్యాన్ అట్లూరి.
రచన- దర్శకత్వం : కరుణ కుమార్.



‘అల వైకుంఠపురములో’ ఈ స్థాయి కలెక్షన్లు సాధింస్తుందని మొదట చెప్పింది మెగాస్టారే

‘అల వైకుంఠపురములో’ ఈ స్థాయి కలెక్షన్లు సాధింస్తుందని మొదట చెప్పింది మెగాస్టారే
– స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

“ఈ సినిమా ఇంత బాగా చేస్తుందని ఫస్ట్ చెప్పిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన ఒక్కరే ఈ సినిమాని ప్రివ్యూ థియేటర్లో చూశారు. ఈ సినిమా ఈ స్థాయిలో ఉంటుందని ఆ రోజే ఆయన చెప్పేశారు” అని చెప్పారు స్టైల్ష్ స్టార్ అల్లు అర్జున్. సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తూ ‘నాన్ బాహుబలి’ రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో అల్లు అర్జున్, త్రివిక్రమ్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులతో వారి సంభాషణ…

ఇండస్ట్రీ హిట్టయినందుకు ఎలా ఫీలవుతున్నారు?
ఇండస్ట్రీ హిట్ అని ప్రొడ్యూసర్స్ ఎనౌన్స్ చేశారు. ఇది నా విక్టరీ కాదు. ఇది జనం నాకిచ్చిన ఒక అప్రిసియేషన్ టోకెన్. ఇది నేను ఎంత సంపాదించుకున్నాను అనేది కాదు. ఒక సినిమా రికార్డు వచ్చినప్పుడు అది హీరో ర్యాంకు కాదు. జనం ఆ సినిమాకి ఇచ్చిన ర్యాంకు. టాప్ టెన్ రికార్డ్స్ తీసుకుంటే ఆ సినిమాల్లో ఏ హీరో ఉంటే ఆ హీరోకి ఆ ర్యాంక్ అనేది కాదు. జనం ఆ సినిమాని అంతగా ఇష్టపడ్డారు అని అర్థం. జనం ఆ స్థాయిలో ఆ సినిమాను ఇష్టపడినందుకు నాకు అమితమైన ఆనందం అందులోనూ అది నా సినిమా అవటం అయాం వెరీ వెరీ హ్యాపీ.

సినిమా చాలా చోట్ల బాహుబలి రికార్డుని క్రాస్ చేసింది. అయినా కానీ ఇక్కడ నాన్-బాహుబలి రికార్డు అని పెట్టడానికి కారణం ఏంటి?
అల్లు అరవింద్: మీరు చెప్పింది కరెక్ట్. ఇది చాలా చోట్ల ‘బాహుబలి 2’ తర్వాత వచ్చి ఆగింది. బాహుబలి అనేదాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ మాట అని ఉండొచ్చు. కలెక్షన్ల గురించి హీరోకు, డైరెక్టరుకు తెలియకపోవచ్చు. ఎందుకంటే రోజు ఫిగర్లు చూసుకొని ఆనంద పడేది మేము. సినిమా ఎంత బాగా వచ్చింది అని చూసుకొని వాళ్లు ఆగిపోతారు. ఎంత బాగా వసూలు అవుతుందనేది చూసుకునే దగ్గర మేము మొదలవుతాం. యూఎస్ లో టాప్ త్రీలో ఉంది. త్వరలో నెక్స్ట్ బాహుబలికి వెళ్లే అవకాశం ఉంది. అక్కడ ఇంకా కలెక్ట్ చేస్తోంది.

చాలా రోజుల తర్వాత రికార్డ్స్ గురించి మాట్లాడుకునే అవకాశం వచ్చింది. దీని మీద మీరేమంటారు?
అల్లు అర్జున్: ప్రతి హీరోకి ఏదో ఒక టైంలో ఒక రికార్డు ఫిలిం పడుతూ ఉంటుంది. నాకు ఇదివరకు ఒక రికార్డు ఫిలిం పడింది కానీ ఓవరాల్ గా అన్నిచోట్ల పడలేదు. అన్ని జిల్లాల్లో యునానిమస్ గా ఆల్టైమ్ రికార్డు ఎప్పుడూ పడలేదు. నాన్నకు గీతా ఆర్ట్స్ లో దాదాపు 10 ఆల్టైమ్ రికార్డు సినిమాలు పడ్డాయి. చిరంజీవిగారితో చాలా సినిమాలు, గజినీ, మగధీర వంటి సినిమాలు పడ్డాయి. రికార్డ్స్ ఆయనకు కొత్త విషయం కాదు. నాన్న గారితో ఫస్ట్ టైం ఆల్ టైమ్ రికార్డు ఒక కొడుకుగా కొట్టడం సంతోషంగా ఉంది. దట్ ఈజ్ ఆల్వేస్ మెమరబుల్. మళ్ళీ మేము ఇంకోసారి రికార్డు కొట్టొచ్చు కానీ ఇంత ఆనందం రాదు. దిస్ ఈజ్ వెరీ వెరీ వెరీ స్పెషల్. ఐ ఆల్వేస్ చెరిష్ ఇట్. మా ఫాదర్ తో రికార్డు కొట్టాలని ఎప్పటినుంచో కోరిక. దీనికి కారణమైన అందరికీ మరోసారి థాంక్స్. ప్రత్యేకించి త్రివిక్రమ్ గారికి.

త్రివిక్రమ్ ఈ కథ మీకు చెప్పినప్పుడు ఈ స్థాయి రికార్డు కొడుతుండని మీరు ఎక్స్పెక్ట్ చేశారా?
అల్లు అర్జున్: మనం ఎవరికైనా స్థానం ఇవ్వగలం కానీ స్థాయిని ఇవ్వలేమని ఈ సినిమాలో ఆయన ఒక డైలాగ్ రాశారు. అది ఆబ్సొల్యూట్లీ ట్రూ. నిజంగానే ఈ సినిమాతో అంత స్థానం వచ్చింది. ఆ స్థాయికి తగ్గట్టు నేను ఈ ప్రయాణం నడిపించాలని అనుకుంటున్నాను. ఈ సినిమా ఇంత చేస్తుందని నాకు తెలియదు. ఏ సినిమాకీ తెలియదు, ఎవరు చెప్పలేరు. ఈ సినిమాకి మనం బెస్ట్ చేయాలని నేను పని మాత్రం చేశాను. జనాలు దాన్ని అప్రిషియేట్ చేసి దాన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు. ఇందులో నా క్రెడిట్ ఉందంటే మాత్రం అది అబద్ధం. త్రివిక్రమ్ గారు చెప్పిన వెంటనే ఇది గోల్డ్ మైన్ అవుతుందని మాత్రం ఇది నేను చేయలేదు. ఆయన ఒక మంచి కథ చెప్పారు, నాకు నచ్చింది. మేమిద్దరం సరదాగా ఒక హ్యాపీ సినిమా చేయాలనుకున్నాం. మేము మా పని చేశాం. అది జనానికి వచ్చింది.

ఈ సినిమా సక్సెస్ విషయంలో మీ ఫ్యాన్స్ కి ఎంత రేషియో ఇస్తారు? జనరల్ ఆడియన్స్ కి ఎంత రేషియో ఇస్తారు?
అల్లు అర్జున్: హానెస్ట్ గా చెప్పాలంటే దాని విడదీసి చెప్పలేం. చూసిన వాళ్ళలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, జనరల్ ఆడియెన్స్ ఎంతమంది ఉన్నారు అనేది చెప్పలేం. మా కనెక్షన్ లో లేని ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. ఫ్యాన్స్ అంటే గొడవ చేసే వాళ్ళు బ్యానర్లు కట్టే వాళ్ళు కాదు. కామ్ గా, అడ్మైరింగ్ గా ఉండే వాళ్ళు కూడా ఫ్యాన్స్ కిందే లెక్క. ఎంతమంది ఫ్యాన్స్ కి నచ్చింది, ఎంత మంది అడ్మైరర్స్ కి నచ్చింది, ఎంతమంది కామన్ పీపుల్ కి నచ్చింది అనేది విడదీసి చెప్పలేం. ఒకటి మాత్రం ఖాయం. ఫ్యాన్ అయినా నాన్ ఫ్యాన్ అయినా, సినిమా నచ్చితే స్టుపెండస్ సక్సెస్ చేస్తారు. అందరికీ సినిమా నచ్చింది. థాంక్యూ వెరీ మచ్ ఫర్ దట్‌.

ఈ సక్సెస్ క్రెడిట్ మీరు ఎక్కువగా ఎవరికి ఆపాదిస్తారు?
అల్లు అర్జున్: సినిమా అనేది ఎంటైర్ టీం వర్క్. ఒకరి పేరు చెప్పాల్సి వస్తే డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. నిజానికి నేను ‘నా పేరు సూర్య’ చేసిన తర్వాత వక్కంతం వంశీ గారు, నేను, బన్నివాసు కలిసి ఉన్నప్పుడు ఎవరితో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నప్పుడు వక్కంతం వంశీ గారు త్రివిక్రమ్ గారి పేరు సూచించారు. ఆయనతో కలిసి చేస్తే బాగుంటుంది అని ఆయన చెప్పారు. ఆయన మాటల్లో ఒక పల్స్ కనిపించింది. నా మైండ్ లో ఆయనే త్రివిక్రమ్ తో గారితో చేయాలని ఐడియా వేశారు.

ఈ సినిమాతో మీకు పర్ఫార్మర్ గా కూడా ఒక మంచి ఐడెంటిఫికేషన్ వచ్చింది. దానికి ఎలా ఫీలవుతున్నారు?
అల్లు అర్జున్: ఈ సినిమా విడుదలైన మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారని నాకు అసలు తెలియదు. అది 100% త్రివిక్రమ్ గారు నా మీద వేసిన ట్రిక్. ఆయన ఒకటన్నారు.. ‘మీకు తెలియకుండా మీతో బాగా చేయించాలని నేను ఫిక్స్ అయ్యాను’ అని. నా పర్ఫామెన్స్ కి ఇంత అప్రిసియేషన్ వస్తుందని నా రిమోట్ ఇమేజినేషన్ లో కూడా లేదు. నేను త్రివిక్రమ్ గారి తో కూడా అన్నాను, ‘ఏం సార్ నా పర్ఫామెన్స్ గురించి మాట్లాడుతున్నారు, నేను షాక్ లో ఉన్నాను’ అని. నా చేత ఎలా చేయించారనేది ఆయన చెప్తారు. నాతో ఆయన చేయించారు. నేను ఏం చేశాను అని ఆలోచించే లోపే అందరూ అదిరిపోయింది అన్నారు. ఏం మాయ చేసారు సార్ మీరు?
త్రివిక్రమ్: నాకే తెలియదు సార్.
అల్లు అరవింద్: సినిమా చూశాక ‘బన్నీ నీ ఫీలింగ్ ఏంటి?’ అని నేను అడిగాను. ‘ఇది త్రివిక్రమ్ మాయ డాడీ’ అని అన్నాడు.
త్రివిక్రమ్: రుద్దినట్లు కాకుండా చాలా ఈజీగా చెప్పినట్లు ఉండాలని ట్రై చేశాను. కొన్ని సీన్లు ఎలా పెర్ఫార్మెన్స్ చేయాలో కొన్ని పాయింట్లు పెట్టుకున్నాము. తను చేసిన ఇంటర్వెల్ సీను నాకు సంబంధించినంత వరకు ఒక రిఫరెన్స్ పాయింట్. ప్రతి షాట్ ఒక ఫిలిం లాగా ట్రీట్ చేశాం. నేను ఏదైతే ఒక గ్రాఫ్ అనుకున్నానో, ఆ గ్రాఫ్ పట్టుకొని తాను చేసుకుంటూ వెళ్ళాడు.

ఈ గ్రాండ్ సక్సెస్ పై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
త్రివిక్రమ్: నంబర్స్ అనేవి ప్రొడ్యూసర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు అవసరం. అక్షరం మాకు ఎంత అవసరమో అంకెలు వాళ్లకు అంత అవసరం. నాకు కానీ, బన్నీకి కానీ అంకెల బదులు ఎంతమంది ఈ సినిమా చూశారా అనేది ఆనందాన్నిస్తుంది. ఎంతమందికి నచ్చింది అనే విషయం మాకు ఆనందాన్ని ఇస్తుంది. ఏ ఆర్టిస్ట్ అయిన కోరుకునేది తన మాట ఎక్కువమందికి వినిపించాలని, ఎక్కువ దూరం చేరాలని. నేనైతే దాన్ని అలాగే చూస్తాను. ఇది ఏజ్ ఓల్డ్ కాన్సెప్ట్ అని మొదలు పెట్టినప్పుడే తెలుసు. దీన్ని ఎంత కాంటెంపరరీగా తీస్తామనేది అనేది ముందు నుంచి కాన్షియస్ గానే ఉన్న విషయం.
అల్లు అర్జున్: త్రివిక్రమ్ గారు, నేను కలిసి చేస్తే ఉండే పాజిటివ్ ఎనర్జీ జనంలో చూశాను. మళ్లీ మేము కలిసి పనిచేస్తే ఆ ఆసక్తి అనేది ఉంటుందని అనిపించింది. నిజంగా హ్యాట్రిక్ అని అనుకోలేదు. మూడోదానికి రిథం సెట్ అయింది. బాల్ కనెక్ట్ అయి బౌండరీ దాటేసింది. ఇంతమంది చూశారు, ఇంతమంది ఇష్టపడ్డారు అనేది పెద్ద విషయం. ఈ సినిమా ఇంత కలెక్ట్ చేసిందన్నప్పుడు మనం మరింత ఎక్స్పరిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా బెటర్ ఫిలిమ్స్ చేయొచ్చు.

మీరు, ప్రభాస్ ఫ్రెండ్స్ కదా మీ ఇద్దరి మధ్య దీని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా?
అల్లు అర్జున్: బాహుబలి గురించి నేను ఇప్పటివరకు మాట్లాడే అవకాశం రాలేదు. రాజమౌళి గారికి పర్సనల్ గా మాత్రం చెప్పాను. బాహుబలి మూవీతో ప్రభాస్ కు ఎంత పేరు వచ్చినా కూడా అందుకు అతను అర్హుడు. మిర్చి లాంటి సినిమా తర్వాత ఒక ఐదు సంవత్సరాలు ఒక కమర్షియల్ హీరో ఎన్ని కోట్లో సంపాదించుకుని ఉండొచ్చు. అయిదేళ్లలో ఒకటిన్నర సంవత్సరం మాత్రమే వర్కింగ్ డేస్ ఉంటాయి. మిగతా మూడున్నర సంవత్సరాలు ఖాళీగా ఉంటాయి. అంతకాలం ఒక విషయం నమ్మి కూర్చున్నదానికి, అతను శాక్రిఫైజ్ చేసినదానికి ఎంత వచ్చినా కూడా దానికి అతను అర్హుడే. మేడమ్ టుస్సాడ్స్ లో అతని స్టాచ్యూ పెట్టినందుకు నేను చాలా హ్యాపీ ఫీలయ్యాను. ప్రభాస్ కు అంత పెద్ద హిట్ వచ్చినందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ. ఈరోజు మా రెండు సినిమాలు టాప్ టు ఫిలిమ్స్ అయినందుకు చాలా హ్యాపీ. రికార్డ్స్ అనేవి ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఇవాళ మనం కొట్టవచ్చు, ఆర్నెల్ల తర్వాత ఇంకొకరు కొట్టొచ్చు. అయితే ప్రజల మనసుల్లో ఒక సినిమా ఉన్నప్పుడు వచ్చే ఫీలింగ్ ఉంటుంది చూశారా అది ఫరెవర్. దాన్నెవ్వరూ రీప్లేస్ చెయ్యలేరు.

ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారు, రామ్ చరణ్ ఎక్కడ ఏమి మాట్లాడలేదు. మరి మీతో ఏం మాట్లాడారు?
అల్లు అర్జున్: చిరంజీవి గారు చాలా ఆనందపడ్డారు. ఈ సినిమా ఇంత బాగా చేస్తుందని ఫస్ట్ చెప్పిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన ఒక్కరే ఈ సినిమాని ప్రివ్యూ థియేటర్లో చూశారు. ఈ సినిమా ఈ స్థాయిలో ఉంటుందని ఆ రోజే ఆయన చెప్పేశారు. ‘మీకు ఎక్కువగా నచ్చి అలా అంటున్నారేమో’ అని నేను అన్నాను. ‘లేదు లేదు నాకు తెలిసి పోతుంది, ఒక సినిమా ఏ లెవల్లో ఉంటుందనేది’ అని చెప్పారు. అలా చెప్పటం అంత ఈజీ కాదు. తను ఒక్కరే చూసినా ఎంత పీపుల్ పల్సులో ఆయన ఉన్నారో నాకు అర్థమైంది. ఒక సినిమా చూసి ఇది ఎంత చేస్తుంది అని చెప్పడానికి ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి! హి ఈజ్ రియల్లీ గ్రేట్.
త్రివిక్రమ్: మేమిద్దరం అయితే షాక్ తిన్నాం. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఆ మాట అన్నారేమో అనుకున్నాను. రామ్ చరణ్ నాతో మాట్లాడారు.

ఈ రికార్డ్స్ ని పక్కన పెడితే మూడు సినిమాల జర్నీలో త్రివిక్రమ్ గారి నుంచి మీరు నేర్చుకున్న విషయాలు ఏమిటి?
అల్లు అర్జున్: ప్రతి ఫిలింలో ఒక విషయం నేర్చుకున్నాను. ఆయన చాలా ఓపెన్ గా ఉంటారు. మనం చేసే పనిపై ఓపెన్ గా, హానెస్ట్ గా ఉండాలనే విషయం నేర్చుకున్నాను. డిటాచ్ అయ్యి అటాచ్ అవటం నేర్చుకున్నాను. ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి అది కూడా ఒక కీలకమని నమ్ముతున్నాను.

ఇండస్ట్రీ హిట్ వచ్చింది కదా.. మీ అబ్బాయికి ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారు?
త్రివిక్రమ్: దీనిపై అల్లు అరవింద్ గారికి, గీతా ఆర్ట్స్ కు ఒక వినతిపత్రం సమర్పించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా.
అల్లు అరవింద్: తండ్రి కొడుకులుగా ఫ్రెండ్స్ లా ఉంటాము. ప్రొఫెషనల్ గా వచ్చేటప్పటికి కొంచెం టైట్ గా ఉంటాను. చిరంజీవి గారి దగ్గరనుంచి ఇప్పటివరకు నేను పనిచేసిన హీరోలందరికీ వారం రోజుల ముందే వాళ్ళ రెమ్యూనరేషన్ వాళ్ళ ఇంటికి పంపించేస్తూ వచ్చాను. అలాగే బన్నీ కూడా అది తప్పలేదు.
రంగస్థలం,సైరా ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ వరుసగా మెగా హీరోల ఇండస్ట్రీ రికార్డ్స్ టాప్ ఫైవ్ లో ఉండటం ఎలా అనిపిస్తోందన్న ప్రశ్నకు సమాధానంగా అలా జరగటం ఎవరికైనా సంతోషమే కదండీ.. నాకూ ఆనందంగానే ఉంది అంటూ తమ యూనిట్ సంభాషణను ముగించారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.