Category Archives: Movie News

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌, మాస్ డైరెక్ట‌ర్ సంపత్‌నంది కాంబినేషన్ లో రూపొందుతోన్న‌ భారీ చిత్రం` సీటీమార్‌`. ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌!!

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మాత‌గా హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న‌ భారీ చిత్రం` సీటీమార్‌`. ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. తరుణ్ అరోర ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను ఈ రోజు ఉద‌యం 8.47నిమిషాల‌కి విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ సందర్భంగా ..

చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ – “ఇటీవ‌ల హైద‌రాబాద్, రాజ‌మండ్రిలో బిగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఈరోజు నుండి ఆర్‌.ఎఫ్‌.సిలో కొత్త షెడ్యూల్ ప్రారంభించాం. నాన్ స్టాప్‌గా షెడ్యూల్ జ‌రిపి స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. గోపిచంద్ కెరీర్ లోనే ఇది హై బడ్జెట్ ఫిలిం. హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో ప్రెస్టీజియస్‌ మూవీగా రూపొందుతోంది. హీరో గోపిచంద్ కి భారీ క‌మ‌ర్షియ‌ల్ మూవీ“ అన్నారు.

మ్యాచో స్టార్‌ గోపీచంద్‌, మిల్కీబ్యూటి తమన్నా, దిగంగన సూర్యవంశి, తరుణ్ అరోర, భూమిక, పోసాని కృష్ణమురళి, రావురమేష్, అన్నపూర్ణమ్మ, ప్రగతి
తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: సౌందర్‌ రాజన్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: డి.వై.సత్యనారాయణ, సమర్పణ: పవన్‌ కుమార్‌, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: సంపత్‌ నంది.


`83` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌


భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో 1983 సంవ‌త్స‌రం భార‌త క్రికెట్ జ‌ట్టు విశ్వ విజేత‌గా ఆవిర్భ‌వించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ విజ‌యం అంత సుల‌భంగా ద‌క్క‌లేదు. ఎన్నో ఉత్కంఠ‌మైన మ‌లుపుల‌తో ద‌క్కిన గెలుపు అది. అలాంటి ఆసాధార‌ణ ప్ర‌యాణాన్ని వెండితెర‌పై `83` సినిమాగా ఆవిష్క‌రిస్తున్నారు డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్‌. అన్న‌పూర్ణ స్టూడియోస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో క‌బీర్‌ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో దీపికా ప‌దుకొనె, సాజిద్ న‌డియ‌ద్‌వాలా, క‌బీర్ ఖాన్‌, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంట‌మ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మిస్తున్నారు. `83` చిత్రాన్నిఏప్రిల్ 10న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు అన్న‌పూర్ణ స్టూడియోస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ తెలుగులో `83` చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. శ‌నివారం ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను చెన్నై స‌త్యం థియేట‌ర్‌లో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మాని మాజీ ఇండియ‌న్ క్రికెట్ కెప్టెన్ క‌పిల్ దేవ్‌, మాజీ క్రికెట‌ర్ శ్రీకాంత్, యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్‌హాస‌న్‌, బాలీవుడ్ స్టార్ ర‌ణ్వీర్ సింగ్‌, డైరెక్ట‌ర్ క‌బీర్ సింగ్‌, హీరో జీవా, వై నాట్ స్టూడియోస్ శ‌శికాంత్ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. హీరో ర‌ణ్వీర్ సింగ్ సత్యం థియేట‌ర్ ఆవ‌ర‌ణ‌లో 40 అడుగుల బ్యాన‌ర్‌పై సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్రమానికి ర‌ణ్వీర్ కాసేపు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించి త‌న‌తో పాటు ఇండియ‌న్ టీమ్ స‌భ్యులుగా న‌టించిన ఇత‌ర న‌టుల‌ను వేదిక‌పైకి ఆహ్వానించడ‌మే కాదు.. స్టేజ్‌పై కూడా డాన్స్ చేసి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు.

ర‌ణ్వీర్ సింగ్ మాట్లాడుతూ – “నేను చెన్నై రావ‌డం ఇదే తొలిసారి. క‌మ‌ల్‌హాస‌న్‌గారిని క‌లిసే అవ‌కాశం ద‌క్కినందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి గొప్ప సినిమాలో భాగ‌మైనందుకు గౌర‌వంగా భావిస్తున్నాను. ఇలాంటి టీమ్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం మ‌ర‌చిపోలేను. మా జీవితంలోని ఈ సినిమాకు ప‌నిచేయ‌డం మ‌ర‌చిపోలేని అనుభ‌వం. 83 వ‌రల్డ్ క‌ప్ అంటే మ‌న భార‌తీయుల‌కు క్రికెట్ కంటే ఎక్కువ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ. అప్ప‌టి విజ‌యం చాలా మందిలో కాన్ఫిడెన్స్‌ను నింపింది. క‌పిల్‌దేవ్‌గారి గురించి చెప్పాలంటే..ఆయ‌నొక ఐకాన్‌.. ఎంటైర్ కెరీర్‌లో ఒక నోబాల్ కూడా వేయ‌లేదంటూ ఆయ‌న గొప్ప‌త‌న‌మేంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఆయ‌న పాత్ర‌ను పోషించ‌డం నాకు పెద్ద ఛాలెంజ్‌. ఆయ‌న బౌలింగ్ యాక్ష‌న్‌ను నేర్చుకోవ‌డానికి చాలా ప్రాక్టీస్ చేశాను. అంత సుల‌భంగా ఆయ‌న‌లా చేయ‌లేక‌పోయాను. చాలా క‌ష్ట‌ప‌డ్డాను. డైరెక్ట‌ర్ క‌బీర్ సింగ్ స‌ల‌హాల‌తో మేనేజ్ చేసుకుంటూ వ‌చ్చాను. ఈ సినిమాలో ఇత‌ర న‌టీన‌టుల‌తో క‌లిసి న‌టించ‌డం వ‌ల్ల మా అంద‌రిలో ఓ సోద‌ర‌భావం నెల‌కొంది“ అన్నారు.

కృష్ణ‌మాచారి శ్రీకాంత్ పాత్ర‌లో న‌టించిన హీరో జీవా మాట్లాడుతూ – “విష్ణు ఇందూరిగారి వ‌ల్ల ఈ సినిమాలో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. శ్రీకాంత్ సార్‌లా న‌టించాల‌ని చెప్పగానే షాక‌య్యాను. ధ‌ర్మ‌శాల‌లో మేం వ‌ర్క్‌షాప్‌లో ఉన్న‌ప్పుడు క‌పిల్‌దేవ్‌గారిని కలిశాం. ఆయ‌న శ్రీకాంత్‌గారి గురించి చాలా విష‌యాలు చెప్పారు. ఆయ‌న‌లా చెప్ప‌డంతో నాలో ఇంకా ఒత్తిడిపెరిగింది. దాంతో స్కాట్లాండ్‌లో తొలిరోజు షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇబ్బందిగా కూడా ఫీల‌య్యాను. శ్రీకాంత్‌గారిలా న‌టించ‌డానికి బాగా ప్రాక్టీస్ చేశాను. ర‌ణ్వీర్ అద్భుతంగా ఎఫ్ట‌ర్‌తో న‌టించాడు. ఈ సినిమాలో న‌టించ‌డం వ‌ల్ల మ‌న ఇండియాలో ఇత‌ర భాష‌ల‌కు చెందిన న‌టుల‌తో మంచి స్నేహం ఏర్ప‌డింది“ అన్నారు.

డైరెక్ట‌ర్ క‌బీర్ సింగ్ మాట్లాడుతూ – “నేను చిన్న‌పిల్లాడిగా ఉన్నప్పుడు 83 క్రికెట్ వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ర్నీ యావ‌త్ దేశాన్ని ఎలా ఇన్‌స్పైర్ చేసిందో చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. నేను ఈ సినిమా కోసం రీసెర్చ్ చేస్తున్న‌ప్పుడు క‌పిల్‌గారు, శ్రీకాంత్‌గారు ఇలా దాదాపు టీమ్‌లో అంద‌రూ దాదాపు 20 ఏళ్ల ప్రాయంవారేన‌ని తెలిసి చాలా స్ఫూర్తి పొందాను. మా సినిమాకు స‌హ‌కారం అందిస్తోన్న క‌మ‌ల్‌హాస‌న్‌గారికి థ్యాంక్స్‌“ అన్నారు.
కృష్ణ‌మాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ “1983లో ఇండియా క్రికెట్ విశ్వ‌విజేత‌గా నిలుస్తుంద‌ని మొద‌ట‌గా న‌మ్మిన ఏకైక వ్య‌క్తి క‌పిల్ దేవ్ మాత్ర‌మే. ఈ సినిమాను అనౌన్స్ చేయ‌గానే అస‌లు క‌పిల్ దేవ్‌లా ఎవ‌రు చేస్తారా? అనే ఆస‌క్తి నాలో ఏర్ప‌డింది. త‌ర్వాత ర‌ణ్వ‌ర్ సింగ్ క‌పిల్‌లా చేస్తాడ‌ని తెలిసింది. త‌ను అద్భుతంగా ఆ పాత్ర‌లో ఒదిగిపోయాడు. నేను కాలేజ్ చ‌దివే రోజుల నుండి క‌మ‌ల్‌హాస‌న్‌గారికి పెద్ద అభిమానిని. ఆయ‌న ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఆయ‌న‌కు థ్యాంక్స్‌. డైరెక్ట‌ర్ క‌బీర్ చూడ‌టానికి సింపుల్‌గానే క‌న‌ప‌డ‌తున్నా.. 83 చిత్రాన్ని అంద‌రికీ గుర్తుండిపోయేలా తెర‌కెక్కించాడు“ అన్నారు.
క‌పిల్ దేవ్ మాట్లాడుతూ – “1983లో క్రికెట్ వ‌రల్డ్‌క‌ప్ విజేతలుగా నిలిచిన మా పాత్ర‌ల‌ను పోషించిన ప్ర‌తి ఒక్కరికీ థ్యాంక్స్‌. వారు మాకు పున‌ర్జ‌నిచ్చారు. నేను చెన్నైకు ప‌లుసార్లు వ‌చ్చాను. కానీ నేను త‌మిళంను అర్థం చేసుకోలేక‌పోతున్నాన‌ని తొలిసారిగా బాధ‌ప‌డుతున్నాను. ఐ ల‌వ్ చెన్నై. అప్ప‌ట్లో శ్రీకాంత్ మా అంద‌రికీ స్ట్రెస్‌బ‌స్ట‌ర్‌గా ఉండేవాడు“ అన్నారు. ఆ స‌మ‌యంలో దివంగ‌త ప్ర‌ధాని ఇందిరాగాంధీని క‌లుసుకున్న‌ప్పుడు జ‌రిగిన శ్రీకాంత్‌తో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌ను కపిల్ గుర్తుకు తెచ్చుకున్నారు.

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ మాట్లాడుతూ – “83 సినిమా గురించి డైరెక్ట‌ర్ క‌బీర్ సింగ్ చెప్పిన కొన్ని స‌న్నివేశాల‌ను విన‌గానే క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి. అప్ప‌ట్లో ఇండియా టీమ్‌కు లాండ్రీ బ‌డ్జెట్ త‌క్కువ‌గా ఉండేది. ప‌రిమిత‌మైన బ‌డ్జెట్‌లోనే స‌భ్యులు ఇంగ్లాండ్‌లో ప‌ర్య‌టించారు. క‌పిల్ దేవ్ త‌న బ‌ట్ట‌ల‌ను త‌నే ఊతుక్కునేవాడు. ఇలాంటి చాలా స‌మ‌స్య‌ల‌ను టీమ్ స‌భ్యులు అధిగ‌మించారు. అప్ప‌ట్లో కపిల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. కానీ.. అప్పుడు బీబీసీ మీడియా ఆ ఘ‌న‌త‌ను రికార్డ్ చేయ‌లేదు. కానీ ఆ ఘ‌న‌త‌ను ఇప్ప‌టి 83 సినిమా టీమ్ రికార్డ్ చేశారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్‌కి క్రికెట్ అంటే నాకంటే చాలా పిచ్చి. శ్రీకాంత్‌గారిలా న‌టించ‌డం అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. అలాంటి పాత్ర‌లో న‌టించినందుకు జీవాను అభినందిస్తున్నాను“ అన్నారు.


భ‌వ్య క్రియేష‌న్స్ నిర్మించిన‌`ఓ పిట్టక‌థ‌` టైటిల్ పోస్ట‌ర్ ఆవిష్క‌రించిన త్రివిక్ర‌మ్‌

కొన్ని క‌థ‌లు చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటాయి. అతి త‌క్కువ నిడివితో పెద్ద పెద్ద విష‌యాల‌ను చెబుతుంటాయి. అందుకేనేమో అలాంటి వాటిని పిట్టక‌థ‌లు అంటుంటారు. అలాంటి ఓ ఇంట్ర‌స్టింగ్ పిట్టక‌థ‌ను సెల్యులాయిడ్ మీద చూపించ‌బోతోంది భ‌వ్య క్రియేష‌న్స్. భారీ క‌మ‌ర్షియ‌ల్ మూవీస్ కి కేరాఫ్‌గా నిలిచే భ‌వ్య క్రియేష‌న్స్ తాజాగా తెర‌కెక్కించిన క్యూట్ క‌థకు `ఓ పిట్టక‌థ‌` అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం టైటిల్ పోస్ట‌ర్ ని మాట‌ల మాంత్రికుడు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ విడుద‌ల చేశారు. చెందు ముద్దు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. వి.ఆనంద‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
`ఓ పిట్టక‌థ‌` గురించి త్రివిక్ర‌మ్ మాట్లాడుతూ “ఈ సినిమాతో నాకు ఒక లింకు ఉంది. అదేంటంటే నాకు ఈ క‌థ తెలియ‌డ‌మే. క‌థ విన్న‌ప్పుడు చాలా ఇంట్ర‌స్టింగ్‌గా అనిపించింది. దీనికి ఎలాంటి టైటిల్ ఉంటే బావుంటుంద‌నే డిస్క‌ష‌న్ వ‌చ్చిన‌ప్పుడు, ద‌ర్శ‌కుడు చందు రెండు, మూడు టైటిల్స్ చెప్పారు. అందులో `ఓ పిట్టక‌థ‌` నాకు చాలా బాగా న‌చ్చింది ఈ టైటిల్‌. `ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ` అనే క్యాప్ష‌న్ పెట్ట‌మ‌ని స‌ల‌హా ఇచ్చాను. అంత‌వ‌ర‌కే నా కంట్రిబ్యూష‌న్‌. క‌థ న‌చ్చింది. టైటిల్ బావుంది. ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుంద‌నే న‌మ్మ‌కంతో ఈ టైటిల్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేయ‌డానికి ఒప్పుకున్నాను“ అని చెప్పారు.

చిత్ర నిర్మాత వి.ఆనంద‌ప్ర‌సాద్ మాట్లాడుతూ “మా సంస్థ‌లో అగ్ర హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌తో `పైసా వ‌సూల్‌`, అంత‌కు ముందు టాప్ హీరో గోపీచంద్‌తో `శౌర్యం`, `లౌక్యం`,`సౌఖ్యం` త‌ర‌హా క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు చేశాం. ఓ వైపు భారీ బ‌డ్జెట్‌తో ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు చేస్తూనే, తేజ‌తో `నీకు నాకు డాష్ డాష్‌` అని ఓ సినిమా చేసి కొత్త‌వారిని ప్రోత్స‌హించాం. అలా మ‌రోసారి కొత్త‌వాళ్ల‌తో సినిమా చేద్దామ‌నుకున్న‌ప్పుడు చెందు ముద్దు చెప్పిన ఓ చిన్న క‌థ ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది. అందుకే వెంట‌నే సెట్స్ మీద‌కు తీసుకెళ్లాం. ఆ క‌థే మేం తెర‌కెక్కించిన `ఓ పిట్ట‌క‌థ‌. మా `ఓ పిట్టక‌థ‌` చిత్రం పోస్ట‌ర్ రిలీజ్ చేసిన మాట‌ల మాంత్రికుడు, స‌క్సెస్‌ఫుల్ డైర‌క్ట‌ర్‌ త్రివిక్ర‌మ్‌గారికి ధ‌న్య‌వాదాలు“ అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే ర‌వి మాట్లాడుతూ “ ఓ వైపు కామెడీ, మ‌రోవైపు థ్రిల్లింగ్ అంశాల‌తో, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో క‌చ్చితంగా ఆక‌ట్టుకుంటుంది మా `ఓ పిట్ట క‌థ‌`. షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. మార్చిలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అని చెప్పారు.
ద‌ర్శ‌కుడు చెందు ముద్దు మాట్లాడుతూ “ఒక విలేజ్‌లో జ‌రిగే స్టోరీ ఇది. ప్ర‌తి స‌న్నివేశం స్వ‌చ్ఛంగా సాగుతుంది. ఓ వైపు క‌డుపుబ్బ న‌వ్విస్తూ ఉంటుంది. మ‌రోవైపు ఏం జ‌రుగుతోంద‌నే ఉత్కంఠ‌ను రేకెత్తిస్తుంది. ప‌తాక స‌న్నివేశాల వ‌ర‌కూ ఆ థ్రిల్లింగ్ అలాగే స‌స్టైన్ అవుతుంది. ట్విస్టులు మ‌రింత థ్రిల్ క‌లిగిస్తుంటాయి. స్క్రీన్ ప్లే ప్ర‌ధానంగా తెర‌కెక్కించాం. మా క‌థ‌, టైటిల్ న‌చ్చింద‌ని చెప్పి, క్యాప్ష‌న్ పెట్టిన గురూజీ త్రివిక్ర‌మ్‌గారికి ధ‌న్య‌వాదాలు“ అని అన్నారు.

న‌టీన‌టులు
విశ్వంత్ దుద్దుంపూడి, సంజ‌య్‌రావు, నిత్యాశెట్టి, బ్ర‌హ్మాజీ, బాల‌రాజు, శ్రీనివాస్ భోగిరెడ్డి, భ‌ద్రాజీ, ర‌మ‌ణ చ‌ల్క‌ప‌ల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు
ఈ చిత్రానికి పాట‌లు: శ‌్రీజో, ఆర్ట్ష్ట్: వివేక్ అన్నామ‌లై, ఎడిట‌ర్‌: డి.వెంక‌ట‌ప్ర‌భు, కెమెరా: సునీల్ కుమార్ య‌న్‌., సంగీతం: ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: అన్నే ర‌వి, నిర్మాత‌: వి.ఆనంద ప్ర‌సాద్‌. క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: చెందు ముద్దు.


సెన్సార్ కోసం ఎదురు చూస్తున్న శివ 143

సంక్రాంతి కి విడుదల చేయడానికి అన్ని సిద్ధం చేసాం కానీ సెన్సార్ వారు చూడని కారణము గా సంక్రాంతి కి విడుదల చేయలేక పోయాం.

డిస్ట్రిబ్యూటర్స్ లేక థియేటర్స్.లేక ఫైనాన్స్ ప్రోబ్లేమ్స్ వల్ల సినిమలు పోస్ట్ పోన్ అవుతాయి.కానీ సెన్సార్ వల్ల పోస్ట్ పోన్ ఐన సినిమా శివ 143.

శైలేష్,ఏఇషా ఆదరహ హీరో హీరోయిన్లు గా భీమవరం టాకీస్ బ్యానర్ లో రామసత్యనారాయణ నిర్మించిన 98 వ చిత్రం “శివ 143″(ది జర్నీ ఆఫ్ టూ హార్స్) చిత్రాన్ని ఫిబ్రవరిలోవిడుదల చేస్తున్న సందర్బంగా ప్రముఖ ఎంపీ. టీజీ వెంకటేష్ “శివ 143” మూవీ రిలీజ్ పోస్టర్ ను చిత్ర యూనిట్ సమక్షంలో విడుదల చేశారు.అనంతరం..

టీజీ వెంకటేష్ మాట్లాడుతూ…భీమవరం టాకీస్ నిర్మించిన శివ143 మూవీ తో రామసత్యనారాయణ సెంచరీ దాటడానికి దగ్గరలో ఉన్నందున చాలా సంతోషంగా ఉంది..సెంచరీ తో ఆపకుండా రామసత్యనారాయణ మరెన్నో చిత్రాలు నిర్మించాలని అన్నారు..

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ…ఇది 98 వ చిత్రం 100 చిత్రాలకు చేరువలో ఉంది.మా రోశయ్య గారి తరువాత మాకు పెద్ద దిక్కు టి.జి.వెంకటేష్ గారు చిన్న వాళ్ళైనా, పెద్ద వాళ్ళైనా పిలిస్తే పలికే దైవం మా టి.జి.వెంకటేష్ గారు.ఈ మధ్యనే ఆయన గారి తో పోలీస్ పటాస్ సినిమా ట్రైలర్ లాంచ్ చేయించి సక్సెస్ ఫుల్ గా రిలీజ్ చేయడం జరిగింది.అలాగే ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నాము. మాకు బ్లెస్సింగ్ ఇచ్చిన టి.జి.వెంకటేష్ గారికి,అలాగే వెంకీ మామ నిర్మాతకు మా చిత్ర యూనిట్ తరుపున వారికి ఆబినందలు తెలుపుచున్నాము అని అన్నారు..

నటీనటులు:*
సాగర్ శైలేష్, ఎఇషా ఆదరహ, హృతిక సింగ్, డి.ఎస్.రావ్, ప్రియ పాలువాయి,.

సాంకేతిక నిపుణులు:
మ్యూజిక్: మనోజ్ కుమార్ చేవూరి
ఎడిటర్: శివ వై ప్రసాద్..
కెమెరామెన్: సుధాకర్ అక్కినపల్లి.
ట్రైలర్ కట్ & సిజీ: నరేన్.
పీఆర్ఓ: మధు వి.ఆర్.
నిర్మాత: రామసత్యనారాయణ.
కథ, స్క్రీన్ ప్లే, స్టట్స్, డాన్స్, కొరియోగ్రఫి, డైరెక్షన్: శైలేష్ సాగర్


‘వాళ్లిద్దరి మధ్య’ తొలి తలుపులోనే…

తొలి చూపు… తొలి వలపు- ఈ రెండింటికీ ఉన్న అవినాభావ సంబంధం మూమూలుదికాదు. ఆ రెండిటికీ మధ్య ఓ తలుపు

కూడా ఉంటే దాని వెనుక కూడా పెద్ద కథే ఉంటుంది… అది ఓ బ్లాక్ బస్టర్ హిట్ కు కూడా నాంది పలుకవచ్చు. విషయంలోకి

వస్తే ‘బాబి’ సినిమాలోకి వెళదాం. ఇది హిందీ ‘బాబి’ సుమా. రాజ్ కపూర్ కుమారుడు రిషికపూర్, డింపుల్ కపాడియా

జంటగా తెరకెక్కిన ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ అప్పటికే హిందీలో వచ్చిన ప్రేమ కథల రికార్డులను తిరగరాసింది. ఇందులో హీరో

రిషికపూర్ , హీరోయిన్ డింపుల్ కపాడియా ఇంటికి రాగానే ఆమె సున్నిపిండి రాసుకుంటూ వచ్చి తలుపు తీస్తుంది. నిజానికి

ఇది రాజ్ కపూర్ స్వీయ అనుభవమే. ఆయన నిజజీవితంలో నర్గిస్ ను అలాగే కలుసుకున్నారట. దాన్ని సినిమాలో

చూపించాలని ఎంతో తహతహలాడినా కథలు సహకరించలేదు. ఆ కోరికను ‘బాబి’ తీర్చింది. ఆ సినిమాలో హీరోయిన్ తొలి

సన్నివేశం కూడా అదే.

దర్శకుడు వి.ఎన్. ఆదిత్య ఈ సినిమాను చిన్నపుడు చూసి థ్రిల్ అయిపోయారు . దర్శకుడయ్యాక ఇలాంటి షాట్ తీయాలని అనుకున్నా కుదరలేదట. ఆ కోరికను ‘వాళ్లిద్దరి మధ్య’ సినిమా తీర్చింది అంటారు ఆదిత్య. ‘వాళ్లిద్దరి మధ్య’ సినిమా ద్వారా పరిచయమవుతున్న

హీరోయిన్ నేహాకృష్ణ పై ఇలాంటి సన్నివేశాన్నే ఆదిత్య చిత్రీకరించారు. వినాయకుడు బొమ్మ చెక్కి ఉన్న తలుపును హీరో విరాజ్

అశ్విన్ తట్టగానే , హీరోయిన్ నేహాకృష్ణ తలుపు తీస్తుంది . ఇది ఆమె కెరీర్ లో మొదటిరోజు మొదటి షాట్. ఈ వినాయకుడి

తలుపు వాళ్లిద్ధిరి ప్రేమకు ఎలాంటి విఘ్నాన్ని అయినా కలిగించవచ్చనే సందేహాన్నిప్రేక్షకులకు కలిగించే ఉద్ధేశంతోనే ఈ

సింబాలిక్ షాట్ ను ఆదిత్య తెరకెక్కించినట్టు కనిపిస్తోంది.

ఈ విషయంపై వి.ఎన్. ఆదిత్యను ప్రశ్నిస్తే ‘బాబిలోని సన్నివేశం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది . ఒక రియల్ లైఫ్ లో అంకురించిన ప్రేమ , ఒక బ్లాక్ బస్టర్ సినిమా లవ్స్టోరీ కి ఒక షాట్ అయింది. డింపుల్ కపాడియాపైన షూటింగ్ చేసిన మొదటి షాట్ కూడా అదే. ఆ దృశ్యం చిన్నప్పటినుంచీ నాతో ట్రావెల్ అవుతూనే ఉంది. ఇలాంటి సన్నివేశాన్ని తెరపై చూపించే అవకాశం నాకు ఇన్నాళ్లకు దక్కింది. అయితే ఆ కథ వేరు… ఈ కథ వేరు. అందులో సున్నిపిండి ఉంది.. ఇందులో లేదు.. అంతే తేడా ’ అని వివరించారు. తెలుగుసినిమా పరిశ్రమలోకి హీరోయిన్ నేహాకృష్ణ ప్రవేశాన్ని ఇలా విఘ్నేశ్వరుడి తలుపు ద్వారా స్వా గతించాలనే ఉద్దెశంతో కూడా ఈ సన్నివేశాన్ని తెరకెక్కించినట్టు ఆయన చెప్పారు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి నిర్మాత అర్జున్ దాస్యన్.

నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ ” షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది . సినిమా చాలా బాగా వచ్చింది. అతి త్వరలోనే విడుదల తేదీ ని ప్రకటిస్తాము ” అని తెలిపారు.

తారాగణం :

విరాజ్ అశ్విన్ , నేహా కృష్ణ, వెంకట్ సిద్ధారెడ్డి, బిందు చంద్రమౌళి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, జయశ్రీ రాచకొండ, శ్రీకాంత్ అయ్యంగార్ , నీహారికా రెడ్డి, ప్రశాంత్ సిద్ది , సుప్రజ, కృష్ణ కాంత్, అలీ ,భార్గవ్, రామకృష్ణ తదితరులు .

సాంకేతిక బృందం :
స్క్రీన్ ప్లే : సత్యానంద్, మాటలు: వెంకట్ డి.పతి , సంగీతం: మధు స్రవంతి, పాటలు: సిరాశ్రీ , కెమెరా: ఆర్.ఆర్.కోలంచి , ఆర్ట్: జెకేమూర్తి,
ఎడిటర్:ధర్మేంద్ర కాకరాల, లైన్ ప్రొడ్యూసర్: శ్రావణ్ నిడమానూరి , ఎగ్జిక్యూటివ్ నిర్మాత : సూరపనేని కిషోర్,
నిర్మాత: అర్జున్ దాస్యన్ , కథ – దర్శకత్వం : వి.ఎన్.ఆదిత్య .


మిథున్‌ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి హీరోగా మాధవ్‌ కోదాడ దర్శకత్వం లో రమణారావు బసవరాజు నిర్మిస్తున్న థ్రిల్లర్‌ చిత్రం

బాలీవుడ్‌లో ‘డిస్కోడాన్సర్‌’తో అప్పట్లో యువతను ఉర్రూతలూరించిన కథానాయకుడు మిథున్‌ చక్రవర్తి. ఆయన కుమారుడు మిమో చక్రవర్తి ఇప్పుడు తెలుగులో పరిచయం కాబోతున్నాడు. భోషో సమర్పణలో శ్రీకళా చిత్ర బేనర్‌పై రమణారావు బసవరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాధవ్‌ కోదాడ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ బాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ చిత్రంలోని ఓ పాటను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. జర్నలిజం, పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. మిమో చక్రవర్తి సరసన ‘ఎయిర్‌టెల్‌’ మోడల్‌ సశాఛెత్రి నాయికగా నటిస్తోంది. ఇప్పటికే దాదాపు 90శాతం చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రంలోని పబ్‌ సాంగ్‌ను గురువారంనాడు హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో చిత్రిస్తున్నారు.

చిత్రం గురించి చిత్ర దర్శకుడు మాధవ్‌ కోదాడ మాట్లాడుతూ.. ఇందులో కథరీత్యా భారీతారాగణం నటిస్తున్నారు. మహేష్‌ మంజ్రేకర్‌, మురళీశర్మ, బ్రహ్మానందం, అభిమన్యుసింగ్‌, షిండే, రవికాలే వంటి ప్రముఖులు నటిస్తున్నారు. ఈరోజు తామనుకున్న సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తూ చేసుకునే పార్టీ నేపథ్యంగా ఈ సాంగ్‌ వుంటుంది. శేఖర్‌ చంద్ర అందించిన బాణీలకు ప్రేమ్‌ రక్షిత్‌ చక్కటి నృత్యరీతులు సమకూర్చారు. బెల్లీడాన్స్‌గా చిత్రిస్తున్న ఈ సాంగ్‌లో రష్యన్‌ డాన్సర్లు నర్తించడం విశేషం. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని’ అన్నారు.

నిర్మాత రమణారావు బసవరాజు తెలియజేస్తూ… ‘’థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. దర్శకుడు మాధవ్‌ మల్టీమీడియాలో గోల్డ్‌మెడల్‌ పొందిన వ్యక్తి. తన ఆలోచనలు వినూత్నంగా వున్నాయి. కథ చాలా బాగా వచ్చింది. ఇప్పటికి దాదాపు 95శాతం చిత్రీకరణ పూర్తయింది. ఓ పాట, ఫైట్‌ చిత్రీకరిస్తే మొత్తం పూర్తవుతుంది. ఫిబ్రవరిలో ఫస్ట్‌లుక్‌, చిత్ర టైటిల్‌ను ప్రకటిస్తాం. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ’’ని తెలిపారు.

”తెలుగు చిత్రసీమలో ప్రవేశించడం చాలా ఆనందంగానూ గౌరవంగా భావిస్తున్నాననీ, స్క్రిప్ట్‌ చాలా ఆసక్తిదాయకంగా వుంటుందనీ, తర్వాత ఏమిటనే ఆసక్తితో ప్రేక్షకుడ్ని ఉత్కంఠరేకెతిస్తుందని” కథానాయకుడు మిమో చక్రవర్తి వెల్లడించారు. ”ఈ చిత్రం చూసే ప్రేక్షకుడికి ఆసక్తికల్గిస్తుందనీ, తెలుగులో పరిచయం కావడం చాలా ఆనందంగా వుందనీ, చిత్రయూనిట్‌ డెడికేషన్‌ తనకెంతో స్పూర్తినిచ్చిందని” నాయిక సశాఛెత్రి పేర్కొన్నారు. మహేష్‌ మంజ్రేకర్‌ తెలుపుతూ.. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం వినూత్నంగా వుంటుంది. మిథున్‌ చక్రవర్తి మంచి స్నేహితుడు. ఆయన కుమారుడు హీరోగా నటిస్తున్న చిత్రంలో నేను ఓ కీలక పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జయపాల్‌ నిమ్మల, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, సంగీతం: శేఖర్‌ చంద్ర, ఫైట్స్‌: శంకర్‌, సహ నిర్మాత: మారుతీ శ్యాంప్రసాద్‌రెడ్డి


వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ ఫస్ట్ లుక్ విడుదల, ఏప్రిల్ 2 సినిమా విడుదల

సాయిధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు విడుదలయింది. ఆ పోస్టర్లో కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ ధరించి ఉన్న వైష్ణవ్ తేజ్ సముద్రం వైపు చేతులు చాపి బిగ్గరగా కేక వేస్తూ కనిపిస్తున్నాడు.
తొలి సినిమా కోసమే తన శరీరాకృతిని మార్చుకున్న అతను చాలా చురుగ్గా కనిపిస్తున్నాడు. పోస్టర్లో అతని బాడీ లాంగ్వేజ్ లోని టెంపరమెంట్, సముద్రం.. సినిమా టైటిల్ కు యాప్ట్ అనిపిస్తున్నాయి.
వచ్చే వేసవిలో ఏప్రిల్ 2న మూవీని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.
లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసోసియేట్ గా పనిచేసిన బుచ్చిబాబు సాన ‘ఉప్పెన’తో దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాతో కృతి శెట్టి నాయికగా టాలీవుడ్ లో అడుగుపెడుతుండగా, తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఒక ప్రధాన పాత్ర చేస్తున్నారు.
‘రాక్ స్టార్’ దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ‘ఉప్పెన’ను నిర్మిస్తోంది.

తారాగణం: పంజా విష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి, సాయిచంద్, బ్రహ్మాజీ

సాంకేతిక వర్గం:
కథ, దర్శకత్వం: బుచ్చిబాబు సాన
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనిల్ వై.
సీఈవో: చెర్రీ
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
సినిమాటోగ్రఫీ: శాందత్ సైనుద్దీన్
మ్యూజిక్ డైరెక్టర్: దేవి శ్రీప్రసాద్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: మౌనిక రామకృష్ణ
పీఆర్వో: వంశీ-శేఖర్, మధు మడూరి


భార‌త‌జ‌ట్టు విశ్వ‌విజేత‌గా ఆవివ‌ర్భంచిన అసాధారణ 1983 ప్ర‌పంచ‌క‌ప్‌ క్రికెట్ ప్ర‌యాణం ఆధారంగా రూపొందిన `83` చిత్రాన్నిరిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌తో క‌లిసి అన్న‌పూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తోన్న అక్కినేని నాగార్జున

భార‌త‌జ‌ట్టు విశ్వ‌విజేత‌గా ఆవివ‌ర్భంచిన అసాధారణ 1983 ప్ర‌పంచ‌క‌ప్‌ క్రికెట్ ప్ర‌యాణం ఆధారంగా రూపొందిన `83` చిత్రాన్నిరిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌తో క‌లిసి అన్న‌పూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తోన్న అక్కినేని నాగార్జున

భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో 1983 సంవత్స‌రాన్ని సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించాలి. ఆ ఏడాది క‌పిల్ దేవ్ నాయ‌కత్వంలో భార‌త క్రికెట్ జ‌ట్టు విశ్వ విజేత‌గా ఆవిర్భ‌వించింది. ఈ ఆసాధార‌ణ ప్ర‌యాణాన్ని వెండితెర‌పై `83` సినిమాగా ఆవిష్క‌రిస్తున్నారు డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్‌. అన్న‌పూర్ణ స్టూడియోస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో క‌బీర్‌ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో దీపికా ప‌దుకొనె, సాజిద్ న‌డియ‌ద్‌వాలా, క‌బీర్ ఖాన్‌, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంట‌మ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మిస్తున్నారు. `83` చిత్రాన్నిఏప్రిల్ 10న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు అన్న‌పూర్ణ స్టూడియోస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ తెలుగులో `83` చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.
ఈ సంద‌ర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ “క్రికెట్ జ‌గ‌త్తులో 1983లో మ‌న దేశం గొప్ప విజ‌యాన్ని సాధించింది. ఈ విజయంతో మ‌న దేశంలో క్రికెట్ ఓ మతం అనేంత గొప్ప‌గా మ‌మేక‌మైంది. ఈ ప్ర‌యాణం గురించి చెప్పే చిత్ర‌మే `83`. ఈ జ‌ర్నీ గురించి తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. క్రికెట్ ప్ర‌పంచంలో విశ్వ‌విజేత ఉన్న వెస్టిండీస్ జ‌ట్టును ఓడించి భార‌తదేశం తొలిసారి క్రికెట్ ప్ర‌పంచ క‌ప్‌ను గెలుచుకుంది. ఈ సినిమాను తెలుగులో మా సంస్థ ద్వారా విడుద‌ల చేస్తున్నందుకు గ‌ర్వంగా ఉంది“ అన్నారు.
ద‌ర్శ‌కుడు క‌బీర్‌ఖాన్ మాట్లాడుతూ – “ఓ ఫిలిం మేక‌ర్‌గా నాగార్జున‌గారంటే నాకు ఎంతో గౌర‌వం. మా సినిమాను అంత గొప్ప వ్య‌క్తి స‌హాకారంతో తెలుగులో విడుద‌ల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. `83` చిత్రం త‌ప్ప‌కుండా తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది“ అన్నారు.
రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీఇఓ షిభాసిస్ సర్కార్ మాట్లాడుతూ “83 సినిమాను అన్న‌పూర్ణ స్టూడియో సంస్థ‌తో క‌లిసి విడుద‌ల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. అక్కినేని నాగార్జున‌గారితో క‌లిసి ఈ సినిమాను విడుద‌ల చేయ‌డం హ్యాపీ. ఆయ‌న స‌పోర్ట్‌తో ఈ సినిమా రీచ్ బాగా ఉంటుంద‌న‌డంలో సందేహ‌మే లేదు. `83` మూవీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఈ సినిమా ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. పాన్ ఇండియా లెవ‌ల్లో సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.

గ్లోబ‌ల్ సినిమా ఈ సినిమాను నైజాం ఏరియాలో విడుద‌ల చేస్తున్నారు.

ఈ చిత్రంలో క‌పిల్‌దేవ్‌లా ర‌ణ‌వీర్ సింగ్, సునీల్ గ‌వాస్క‌ర్‌లా తాహిర్ రాజ్ బాసిన్, మ‌ద‌న్‌లాల్‌గా హార్డీ సంధు, మ‌హీంద‌ర్ అమ‌ర్‌నాథ్‌గా ష‌కీబ్ స‌లీమ్‌, బ‌ల్వీంద‌ర్ సింగ్ సంధుగా అమ్మీ విర్క్‌, కృష్ణ‌మాచారి శ్రీకాంత్‌గా జీవా, సందీప్ పాటిల్‌గా చిరాగ్ పాటిల్‌, స‌య్య‌ద్ కిర్మాణిగా సాహిల్‌ క‌త్తార్‌, దిలీప్ వెంగ్‌స‌ర్కార్‌గా అదినాథ్ కొతారి, ర‌విశాస్త్రి ధైర్య కార్వా, కృతి ఆజాద్‌గా దినేక‌ర్ శ‌ర్మ‌, య‌శ్‌పాల్ శ‌ర్మ‌గా జ‌తిన్ శ‌ర్నా, రోజ‌ర్ బ‌న్నిగా నిశాంత్ ద‌హియా, సునీల్ వాల్సన్‌గా ఆర్‌.బద్రి, ఫ‌రూక్ ఇంజ‌నీర్‌గా బోమ‌న్ ఇరాని, పి.ఆర్‌.మ‌న్‌సింగ్‌గా పంక‌జ్ త్రిపాఠిగా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో క‌పిల్‌దేవ్ భార్య రోమీ పాత్ర‌లో దీపికా ప‌దుకొనె న‌టిస్తున్నారు.

ప‌దశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల గ్ర‌హీత దివంగ‌త న‌ట దిగ్గ‌జం అక్కినేని నాగేశ్వ‌ర‌రావు 1975లో హైద‌రాబాద్ న‌డిబొడ్డున 22 ఎక‌రాల్లో అన్న‌పూర్ణ స్టూడియోస్‌ను స్థాపించారు. ఈ సంస్థ‌లో 38 సినిమాల‌ను నిర్మించారు. 23 సినిమాలు అవార్డుల‌ను కూడా అందుకున్నాయి. 2658 సినిమాల నిర్మాణంలో అన్న‌పూర్ణ స్టూడియోస్ త‌న వంతు పాత్ర‌ను పోషించింది.


నందు హీరోగా నటిస్తోన్న ‘సవారి’

‘సవారి’ కంటెంట్ ఉన్న సినిమా: హీరో సుధీర్ బాబు
‘సవారి’ రిలీజ్ తర్వాత పెద్ద సినిమా అవుతుంది: హీరో శ్రీవిష్ణు

నందు హీరోగా నటిస్తోన్న ‘సవారి’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటరులో జరిగింది. సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుడితి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదలవుతోంది. హీరోలు సుధీర్ బాబు, శ్రీవిష్ణు సంయుక్తంగా ట్రైలరును ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ, “ఇందులో ఒక పాట విపరీతంగా నచ్చి పది, పదిహేనురోజుల పాటు అదేపనిగా వింటూ వచ్చాను. మిగతా పాటలు కూడా బాగున్నాయి. ఇదివరకు రిలీజ్ చేసిన టీజర్, ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ బాగా నచ్చాయి. నందు ఈ సినిమాకు పడ్డ కష్టం ఎక్కడికీ పోదు. అందరికీ ఈ సినిమా గుర్తింపు తెస్తుంది. ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఫిబ్రవరి 7న సినిమా చూస్తా. జెన్యూన్ టీం పనిచేసిన ఈ సినిమా రిలీజ్ తర్వాత పెద్ద సినిమా అవ్వాలని కోరుకుంటున్నా” అని చెప్పారు.
సుధీర్ బాబు మాట్లాడుతూ, “నందుతో ‘సమ్మోహనం’ సినిమాలో కలిసి నటించాను. మొదట అతని పాత్రకు వేరొకర్ని తీసుకుందామని డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణను అడిగాను. కానీ ఆయన నందునే కోరుకున్నారు. ఆ క్యారెక్టరులో తను చాలా బాగా చేశాడు. ఇద్దరం దాదాపు ఒకే టైంలో ఇండస్ట్రీకి వచ్చాం. అతనిలో పోరాట తత్వం ఉంది. క్యారెక్టరకు సరెండర్ అయ్యే నటుడు. ఈ చిత్ర దర్శకుడు సాహిత్ గతంలో నాకో కథ చెప్పాడు. అతను నాకు గుర్తు లేకపోయినా అతను చెప్పిన కథ నాకింకా గుర్తుంది. ఆ కథ నాకు నచ్చింది కానీ చెయ్యలేకపోయా. ‘సవారి’ కంటెంట్ ఉన్న సినిమాగా కనిపిస్తోంది. భవిష్యత్తులో సాహిత్ పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్.. అన్నీ నాకు బాగా నచ్చాయి” అన్నారు.

హీరో నందు మాట్లాడుతూ, “పోస్టర్ రిలీజ్ నుంచే ఈ సినిమాకు బజ్ రావడం హ్యాపీ. టీజరుకు చాలా వ్యూస్ వచ్చాయి. ఫస్ట్ రిలీజ్ చేసిన ‘నీ కన్నులు’ పాటకు అనూహ్యమైన స్పందన లభించింది. సోషల్ మీడియాలో ఆ సాంగ్ వైరల్ అయ్యింది. డబ్బుల కోసం నేను చాలా సినిమాలు చేశాను. అవి నాకు యాక్టరుగా మంచి అనుభవాన్నిచ్చాయి. ‘100% లవ్’, ‘పెళ్ళిచూపులు’, ‘జయ జానకి నాయక’, ‘సమ్మోహనం’ సినిమాల్లో మంచి రోల్స్ చేశాను. ‘సమ్మోహనం’ తర్వాత మళ్లీ మంచి సినిమా చెయ్యాలనే ఉద్దేశంతో ఏడాది పాటు గ్యాప్ తీసుకుని నేను చేసిన సినిమా ‘సవారి’. సాహిత్ చాలా బాగా సినిమా తీశాడు. తొలికాపీ చూసుకుని సెలబ్రేట్ చేసుకున్నాం. యు.ఎస్.లో ఉండే నిర్మాతలు అక్కడ ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. అక్కడ ఈ సినిమాకు ప్రీమియర్స్ వేస్తుండటం గొప్ప విషయం. ఇకనుంచీ మంచి సినిమాలే చేస్తాను” అని చెప్పారు.
హీరోయిన్ ప్రియాంకా శర్మ మాట్లాడుతూ, “నన్ను నమ్మి ఇందులో హీరోయిన్ పాత్రను ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమాకు పనిచెయ్యడం గొప్ప అనుభవం. మూవీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా” అన్నారు.
డైరెక్టర్ సాహిత్ మోత్కూరి మాట్లాడుతూ, “ట్రైలర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈ సినిమాని మా అన్నయ్య, నా ఫ్రెండ్ కలిసి నిర్మిస్తున్నారు. నటులందరూ బాగా చేశారు. అందరం ఈ సినిమా కోసం చాలా శ్రమించాం. ఇందులోని రెండు పాటలు కలిసి 10 మిలియన్ వ్యూస్ సాధించడం చిన్న విషయం కాదు” అని చెప్పారు.

ఈ ఈవెంట్‌లో నటులు శివ, జీవన్, మ్యాడీ, శ్రీకాంత్ రెడ్డి, బల్వీందర్, గేయరచయిత పూర్ణాచారి, గాయకుడు కరీముల్లా, ఎడిటర్ సంతోష్ మేనం మాట్లాడారు.
ఈ చిత్రానికి పాటలు: రామాంజనేయులు, శేఖర్ చంద్ర, పూర్ణాచారి, కాసర్ల శ్యాం, శ్రీరాం, సంగీతం: శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతిరాజు, ఎడిటింగ్: సంతోష్ మేనం, ప్రొడక్షన్ డిజైనర్: అభిజీత్ గుముదవెల్లి, నిర్మాతలు: సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుడితి, రచన-దర్శకత్వం: సాహిత్ మోత్కూరి.


రాంగోపాల్ వర్మ మెచ్చిన పాత్ బ్రేకింగ్ “సూసైడ్ క్లబ్” ట్రైలర్

3 i ఫిలిమ్స్ సమర్పణలో మజిలీ సినిమా ఫేమ్ శివ రామాచద్రవరపు లీడ్ రోల్ లో ప్రవీణ్ యండమూరి,సాకేత్,వెంకట కృష్ణ,చందన ముఖ్య పాత్రలుగా పోషిస్తున్న చిత్రం “సూసైడ్ క్లబ్”. శ్రీనివాస్ బొగడపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ ప్రభు వెంకటేశం మరియు 3 i ఫిలిమ్స్ నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం కు సంబందించిన ట్రైలర్ ను సెన్సషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ లాంచ్ చేసారు.ఈ సందర్భంగా సెన్సషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ. “సూసైడ్ క్లబ్” ట్రైలర్ ను ఇప్పుడే చూడటం జరిగింది.మేకింగ్,సినిమాటోగ్రఫీ,కటింగ్ చాల స్టైయిలిష్ గా ఉన్నాయి.నాకు చాల ఆనందంగా ఉంది ఈ కొత్త జనరేషన్ ఇలాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు తీస్తున్నందుకు.డైరెక్టర్ శ్రీనివాస్ చాలా బాగా తీసాడు.డైరెక్టర్ శ్రీనివాస్ కు మరియు టీం అందరికి అల్ ది బెస్ట్ అని.అన్నారు.డైరెక్టర్ శ్రీనివాస్ బొగడపాటి మాట్లాడుతూ.లెజెండరి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గారు మా సినిమా ట్రైలర్ ను లాంచ్ చేసినందుకు మాకు చాల ఆనందంగా ఉంది.ఆయన చాల బిజి గా ఉన్న ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మేము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నం.అన్నారు.

శివ రామాచద్రవరపు,ప్రవీణ్ యండమూరి,చందన, సందీప్ రెడ్డి,వెంకట కృష్ణ,సాకేత్ సింగ్ నటించిన ఈ చిత్రానికి రైటర్ మరియు డైరెక్టర్: శ్రీనివాస్ బొగడపాటి,ప్రొడ్యూసర్: 3 i ఫిలిమ్స్ అండ్ ప్రవీణ్ ప్రభు వెంకటేశం,మ్యూజిక్: కున్ని గుడిపాటి,ఎడిటర్: డే సెల్వ,ఆర్ట్: శాన్ నవార్,విజువల్స్: పవన్ కుమార్ తడక,కుమార్ నిర్మల సృజన్,పి.ఆర్.ఓ:బి.వీరబాబు,సౌండ్: రాఘవ చరణ్.