Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
చిరంజీవి – అల్లు అరవింద్ ఒకరికొకరు ఎలా గౌరవంగా మెలుగుతారో సినిమా ఇండస్ట్రీతో పాటు సామాన్య ప్రేక్షకులకు కూడా తెలిసిందే. అయితే మెగా-అల్లు కుటుంబాల మధ్య విభేదాలున్నాయంటూ తరుచూ వార్తలొస్తూనే ఉంటాయి. అయితే ఎప్పటికప్పుడు ఆ వార్తలను వారు ఖండిస్తూనే ఉన్నా పుకార్లు మాత్రం ఆగవు. ఇదే అంశంపై అల్లు అరవింద్ మరోసారి స్పందించారు.
తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరవింద్ మాట్లాడుతూ.. ‘‘సమాజంలో ఇలాంటి మాటలు సహజం. అయితే 80ల కాలం నుంచి మేమిద్దరం ఒకరికొకరు అన్నట్లు స్నేహితులుగా ఉంటూ పైకొచ్చాం. బావబావమరుదులుగా కాకుండా మంచి స్నేహితులుగా ఎదిగాం. మేం ఎదుగుతున్న తరుణంలో మా కుటుంబాలు పెరిగాయి. పిల్లలు వచ్చారు. వారు కూడా ఇదే వృత్తిలో స్థిరపడ్డారు. ఫిల్మ్ సొసైటీలో ఉన్న అవకాశాలను అందరూ పంచుకోవాలి. ఎవరి స్థానాలను వారు కాపాడుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితులు పోటీ అనేది సహజంగా ఉంటుంది. అయితే ఇక్కడ జనాలు ఒకటి గమనించాలి. వీళ్లందరూ ఒక్కటే. ఎవరి మీద ఏ మాట పడినా అందరూ ఒక మాట మీద ఉంటారు అన్నది జనాలకు తెలియడం చాలా ముఖ్యం. ఉదాహరణకు ఇటీవల నాన్నగారి శత జయంతి ఉత్సవాలను మా కుటుంబాలన్నీ కలిసి నిర్వహించాం. సంక్రాంతి పండుగ రోజు మా నాన్నగారికి చేయాల్సిన కార్యక్రమాలు పూర్తి చేసి చిరంజీవిగారి ఇంటికి వెళ్లిపోతాం. దీపావళి రోజున అందరం కలిసి చిరంజీవిగారింట్లో చేరి సరదాగా సెలబ్రేట్ చేసుకుంటాం. కొన్నేళ్లుగా ఇది జరుగుతూనే ఉంది. మేమంతా కలిసి పండగలు సెలబ్రేట్ చేసుకుంటున్నామని వీడియోలు తీసే మీడియా పెడతామా? పెట్టం కదా! ఎవరి కాంపిటీషన్‌తో వాళ్లు పైకి వస్తున్నారు కానీ వీరంతా ఒకటే అని జనాలు తెలుసుకోవాలి’’ అని అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు.
‘ఓ సన్నివేశంలో నటించడం కష్టమై 10 టేకులు తీసుకోవడం వల్ల దర్శకుడు విసుక్కున్నారని నాన్న అమ్మతో చెబుతుంటే విన్నాను. అప్పుడు నాన్న కళ్లల్లో నీళ్లు చూశా. ఆ సంఘటన బలంగా నాటుకుపోయింది. కొన్నాళ్ల తర్వాత బలవంతం మీద చిరంజీవి నటించిన ‘చంటబ్బాయ్’లో ఓ పాత్ర చేశా. దానికి చక్కని ఆదరణ లభించింది. ఆ సినిమా విడుదల తర్వాత ‘నిర్మాతగా ఉంటే డబ్బులు వస్తాయో రావో తెలియదు. అదే నటిస్తే ఆ సమస్య ఉండదు. యాక్టర్ అవ్వచ్చు కదా’’ అని ఓ రోజు నాన్న అడిగారు. మరుసటి రోజు ఆయన దగ్గరకు వెళ్లి ‘నేను ఎప్పుడూ యజమానిగా ఉండాలనుకుంటున్నా.. కానీ, ఉద్యోగి కావాలనుకోలేదు’ అని చెప్పాను. నాన్నకు తెలిసిన మంత్రి ద్వారా స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేశారు. అప్పట్లోనే రూ.900 జీతం. నేను వ్యాపారమే చేస్తాను కానీ ఉద్యోగం జోలికి వెళ్లనని చెప్పేశా’ అని అరవింద్ చెప్పుకొచ్చారు.
టాకీలు మొదలైన కొత్తల్లో… అంటే 1935 నుంచి 1964 వరకు దాదాపు 29 సంవత్సరాలు చలనచిత్ర రంగంలో ఒక వెలుగు వెలిగిన అద్భుత నటీమణి పసుపులేటి కన్నాంబ. కన్నాంబ చిత్రరంగానికి వచ్చిన కొత్తల్లోనే మరొక అందాల నటి కాంచనమాల కూడా సినీరంగ ప్రవేశం చేసింది. కాంచనమాలకు దీటుగా కన్నాంబ సౌందర్యంలో ఆమెతో పోటీపడింది. అయితే రాశిలో కన్నాంబ చిత్రసీమలో వెలుగొందిన కాలం కాంచనమాల కన్నా ఎక్కువ. కాంచనమాల కేవలం పది సినిమాల్లో మాత్రమే నటించగా కన్నాంబ ఏకంగా 170 సినిమాల్లో నటించి రాణించింది. అప్పటి సినీరంగంలో కన్నాంబ అత్యంత ధనవంతురాలని పేరుంది. ఏడువారాల నగలతో ఇంట్లో ఎక్కడ చూసినా బంగారం కనిపిస్తూ వుండేది. నిలువెత్తు విగ్రహంతో, అద్భుతమైన, విస్పష్టమైన వాచకంతో, అంతే అద్భుతమైన నటనా పటిమతో అలరారిన నటీమణి కన్నాంబ. కరుణరసం ఉట్టిపడే పాత్రల్లో గాని, వీరరసం ఉప్పొంగే పాత్రల్లో గాని కన్నాంబ నటన వర్ణనాతీతంగా వుండేది. ఆమె కేవలం తెలుగు చిత్రసీమకు మాత్రమే పరిమితం కాలేదు. తెలుగు వాళ్లు ఎంతగా ఆమెను ఆదరించారో అంతే సమానంగా తమిళ ప్రేక్షకులు కూడా ఆదరించారు.
బాలతారగా నాటక రంగంలో… కన్నాంబ 5 అక్టోబర్ 1911న కడప పట్టణంలో జన్మించింది. ఆమె తండ్రి వెంకట నరసయ్య, తల్లి లోకాంబ. తండ్రి ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పనిచేస్తుండేవారు. వారికి కన్నాంబ ఒక్కటే కూతురు. కన్నాంబ ఎక్కువ కాలం వాళ్ల అమ్మమ్మ గారింట ఏలూరులోనే పెరిగింది. కన్నాంబ తాత నాదముని నాయుడు వైద్యవృత్తిలో వుండేవారు. కన్నాంబ చిన్నతనంలోనే సంగీతం మీద ఆసక్తి కనబరచడంతో తాతగారు ఆమెకు సంగీతంలో శిక్షణ ఇప్పించారు. తన 13వ ఏటనే కన్నాంబ నాటకాల్లో నటించడం ప్రారంభించింది. ఆమెకు పదహారు సంవత్సరాల వయసులో ఒక చిన్న సంఘటన జరిగింది. ఏలూరు పట్టణంలో సత్యహరిశ్చంద్ర నాటకం జరుగుతోంది. ఆ నాటకానికి కన్నాంబ కూడా వెళ్లింది. చంద్రమతి పాత్రధారి శోకరసంతో పాడాల్సిన పద్యాలను పాడలేకపోవడంతో ప్రేక్షకులు గేలి చేయడం మొదలెట్టారు. ప్రేక్షకుల మధ్య నుంచి కన్నాంబ లేచి రంగస్థలం మీదకు వెళ్లి చంద్రమతి పాత్రను తను పోషిస్తానని ప్రకటించి, వేగంగా ముఖానికి రంగుపూసుకొని వచ్చి పద్యాలు పాడుతూ వుంటే, ప్రేక్షకులు నిశ్చేష్టులై చూస్తూ వన్స్ మోర్లు కొట్టడం ఆరంభించారు. దాంతో కన్నాంబ నాటక ప్రస్థానం మొదలైంది. ఇదే నాటక సమాజం వారు కన్నాంబకు సావిత్రి, సత్యభామ, అనసూయ, చంద్రమతి వంటి మంచి మంచి పాత్రలు ఇచ్చి వారి నాటకాలను రక్తికట్టించే ప్రయత్నం చేశారు. కన్నాంబ సత్యవంతుడు, భక్త కబీరు వంటి మగ పాత్రలు పోషించడం కూడా కద్దు. దొమ్మేటి సూర్యనారాయణతో కలిసి ‘రంగూన్ రౌడీ’ అనే నాటకాన్ని ఆమె దేశవ్యాప్తంగా ప్రదర్శించి మన్ననలు పొందింది. ఆ రోజుల్లో ప్రసిద్ధ రంగస్థల నటీనటులచేత రికార్డింగ్ కంపెనీలు నాటక పద్యాలు పాడించి వాటిని రికార్డులుగా విడుదల చేసేవారు. వాటిలో కన్నాంబ పాడిన ‘కృష్ణం భజే రాధా’ అనే ప్రైవేట్ రికార్డు శ్రోతల్ని వుర్రూత లూగించింది.
‘హరిశ్చంద్ర’ సినిమాతో ఎంట్రీ 1935లో దర్శక నిర్మాత పి.పుల్లయ్య మరికొందరు మిత్రులతో కలిసి స్టార్ కంబైన్స్ అనే సంస్థను నెలకొల్పి ‘హరిశ్చంద్ర’ అనే సినిమా నిర్మాణానికి నడుం బిగించారు. పేరుకి ఆ సినిమాకు టి.ఎ.రామన్ దర్శకత్వం వహించారని క్రెడిట్స్‌లో వేసినా ఆ బాధ్యతలు నిర్వహించింది పి.పుల్లయ్య. అందులో అద్దంకి శ్రీరామమూర్తి హరిశ్చంద్రుడుగా నటించగా చంద్రమతి పాత్రకు కన్నాంబకు పిలుపొచ్చింది. అప్పుడు బళ్లారిలో ఆమె హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతిగా నటిస్తుండగా దర్శకుడు పుల్లయ్య కన్నాంబను కలిసి తమ సినిమాలో నటించమని ఆహ్వానించారు. అయితే కన్నాంబ ఒక షరతు మీద నటించేందుకు ఒప్పుకుంది. అప్పటికే వాటి బృందంలో 22 మంది కళాకారులు నాటకాల్లో వివిధపాత్రలు పోషిస్తూ వస్తున్నారు. తను సినిమాల్లోకి వెళ్లిపోతే వారంతా ఆర్ధిక ఇబ్బందులకు గురికావలసి వుంటుంది కనుక వారందరికీ ‘హరిశ్చంద్ర’ సినిమాలో నటించే అవకాశం కలిపిస్తే నటిస్తానని కన్నాంబ చెప్పడంతో అందుకు పుల్లయ్య అంగీకరించారు. అలా భీమారావు, పులిపాటి వెంకటేశ్వర్లు, బందరు నాయుడు, ఆకుల నరసింహారావు వంటి రంగస్థల నటులు సినిమా స్టార్లైపోయారు. ఈ సినిమాని కొల్హాపూరులో నిర్మించారు. ఆ చిత్రం బాగా విజయవంతమైంది. బందరు ‘బాలమిత్ర నాటక సమాజం’లో పనిచేస్తున్నప్పుడు వారు ప్రదర్శించే నాటకాలకు కడారు నాగభూషణం ప్రయోక్తగా వ్యవహరిస్తుండేవారు. అప్పుడే నాగభూషణానికి కన్నాంబతో పరిచయం కలిగింది. వారి పరిచయం పెరిగి ప్రణయంగా మారి ఇద్దరూ దంపతులయ్యారు. కన్నాంబ అతణ్ణి ఇష్టపడి పెళ్లాడింది. అయితే నాగభూషణం అప్పటికే వివాహితుడు కావడంతో ఈ వివాహ వార్తను 1941 వరకు వారిద్దరూ అధికారికంగా ప్రకటించలేదు. అలా వారి వైవాహిక జీవితం కడదాకా సాఫీగా సాగిపోయింది.
కన్నాంబ నటించిన రెండవ సినిమా బెజవాడ సరస్వతి టాకీస్ వారు నిర్మించిన ‘ద్రౌపదీ వస్తాప్రహరణము’ (1936). ఈ చిత్రాన్ని కొల్హాపూర్ మహారాజా వారి కంపెనీలో బ్రిటీష్ ఎకోస్టిక్ ఫొటోఫోన్ యంత్రం మీద చిత్రీకరించారు. మల్లాది అత్యుతరామ శాస్త్రి నాటకాన్ని యధాతధంగా సినిమాగా నిర్మించడం జరిగింది. హెచ్.ఎం.రెడ్డి పర్యవేక్షణలో ఈ చిత్రానికి అతని కుమారుడు హెచ్.వి.బాబు దర్శకత్వం నిర్వహించారు. సి.ఎస్.ఆర్.ఆంజనేయులు శ్రీకృష్ణుడుగా నటించగా, ద్రౌపదిగా కన్నాంబ నటించింది. ఇతర పాత్రల్ని దొమ్మేటి సూర్య నారాయణ, దొమ్మేటి సత్యనారాయణ, కొచ్చెర్లకోట సత్యనారాయణ, యడవల్లి సూర్యనారాయణ, నెల్లూరి నాగరాజరావు, కడారు నాగభూషణం, పి.సూరిబాబు, రామతిలకం, నాగరాజకుమారి మొదలగువారు పోషించారు. అదే సమయంలో ‘ద్రౌపదీ మానసంరక్షణం’ పేరుతో మరొక సినిమా విడుదలైంది. అయితే కన్నాంబ నటించిన చిత్రాన్నే ప్రేక్షకులు ఆదరించారు. ఈ చిత్ర విజయంతో బెజవాడ సరస్వతి టాకీస్ వారు 1937లో ‘కనకతార’ సినిమా నిర్మించారు. అది కన్నాంబ నటించిన మూడవ సినిమా. అందులో కన్నాంబ కమల పాత్ర ధరించింది. దొమ్మేటి, ఆరణి, సూరిబాబు, కడారు నాగభూషణం, కమల కుమారి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. చందాల కేశవదాసు నాటకాన్ని దర్శకుడు హెచ్.వి.బాబు సినిమాగా నిర్మించారు. సముద్రాల రాఘవాచార్య ఈ సినిమా తోనే రచయితగా పరిచయం కాగా, గాలి పెంచల నరసింహారావు సంగీతం అందించారు. ఈ సినిమా కూడా బ్రహ్మాండంగా ఆడడంతో కన్నాంబ పేరు తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైంది.
1938లో హెచ్.ఎం.రెడ్డి ‘గృహలక్ష్మి’ చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రంలో కన్నాంబ పతాక సన్నివేశంలో ‘సత్యం జయిస్తుంది… ధర్మం జయిస్తుంది’ అని అరుస్తూ పిచ్చిదానిలా రోడ్డు వెంబడి పరుగెడుతుంది. ఈ సన్నివేశ చిత్రీకరణ మద్రాసులో జరుగుతున్నప్పుడు కన్నాంబ నిజంగానే పిచ్చిదానిలా ట్రామ్ బండ్లకు అడ్డంగా పరుగెడుతుంటే, నిజమేననుకొని పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు ఉద్యుక్తులయ్యారు. తరువాత అది షూటింగ్ అని తెలిసి తప్పుకున్నారు. కన్నాంబ నటన అంత సహజంగా ఉండేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఈ సినిమాల కన్నా అత్యంత మంచిపేరు కన్నాంబకు తెచ్చిపెట్టిన చిత్రం శ్రీ భవాని పిక్చర్స్ వారు నిర్మించిన ‘చండిక’ (1940). అందులో చండిక పాత్రను కన్నాంబ పోషించగా, వేమూరి గగ్గయ్య, ఆరణి, బళ్ళారి రాఘవ, లలితాదేవి ముఖ్యపాత్రలు పోషించారు. అందులో కన్నాంబ గుర్రపు స్వారి చేయడం, సాహసకృత్యాలు, కత్తి యుద్ధాలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పులిపిల్లలతో నటించే సన్నివేశంలో కూడా కన్నాంబ ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించిందని ఆ రోజుల్లో చెప్పుకున్నారు. అలా తెలుగు వీరవనితగా కన్నాంబను హిందీ హంటర్వాలీ నాడియాతో పోల్చారు.
సొంత నిర్మాణ సంస్థ ఆవిర్భావం… ముందుగా చెప్పుకున్నట్లు బందరు ‘బాలమిత్ర నాటక సమాజం’లో పనిచేస్తున్నప్పుడు కడారు నాగభూషణానికి కన్నాంబతో పరిచయం కలిగింది. ఆ పరిచయం పెరిగి ప్రణయంగా మారి ఇద్దరూ దంపతులయ్యారు. అప్పుడే ‘శ్రీరాజరాజేశ్వరీ నాట్య మండలి’ నెలకొల్పి ‘కనకతార’, ‘హరిశ్చంద్ర’ వంటి పలు నాటకాలను ప్రదర్శించారు. తరువాత మద్రాసు చేరుకొని ‘శ్రీరాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ’ స్థాపించి సినిమా నిర్మాణానికి పూనుకొన్నారు. 1941లో తొలి సినిమా ‘తల్లిప్రేమ’ నిర్మించారు. దానికి జ్యోతిష్ సిన్హా దర్శకత్వం వహించారు. ‘తల్లిప్రేమ’ సినిమా విజయవంతమైంది. దాని తరువాత కడారు నాగభూషణం స్వీయ దర్శకత్వంలో ‘సతీసుమతి’ (1942) చిత్రం నిర్మించి విజయం సాధించారు. ఈ సినిమా తరువాత కన్నాంబ అనారోగ్యం పాలవడంతో రెండేళ్లు సినిమా నటనకు ఆమె దూరం జరిగారు.
తరువాత 1945లో బయటి సంస్థలు నిర్మించిన ‘మాయాలోకం’, ‘మాయా మశ్చీంద్ర’, ‘పాదుకా పట్టాభిషేకం’ అనే మూడు చిత్రాల్లో కన్నాంబ నటించారు. ఆ తరువాత వరసగా హరిశ్చంద్ర’, ‘తులసీజలంధర’, ‘సౌదామిని’, ‘పేదరైతు’, ‘లక్ష్మి’, ‘సతీ సక్కుబాయి’, ‘దక్షయజ్ఞం’ వంటి సినిమాలు స్వంతంగానే నిర్మించి మంచి పేరు సంపాదించారు. కానీ చిత్ర వైఫల్యాలు ఆర్ధిక కష్టాలు తెచ్చిపెట్టాయి. కన్నాంబ ఈ సినిమాలలో నటిస్తూవుంటే, నాగభూషణం దర్శకత్వ బాధ్యతలు చేపట్టేవారు. తరువాత ‘శ్రీవరలక్ష్మీ ఫిలిమ్స్’ అనే అనుబంధ సంస్థను నెలకొల్పి ‘వీరభాస్కరుడు’, ‘సతీసావిత్రి’ వంటి మరికొన్ని సినిమాలను నిర్మించారు. అప్పుడు చిత్తజల్లు పుల్లయ్య తనయుడు సి.యస్.రావు, నాగభూషణం సంస్థలో పనిచేస్తూ వుండేవారు. సి.యస్.రావు పనితనం, కార్యదీక్ష నాగభూషణాన్ని బాగా ఆకట్టుకుంది.
కలకత్తా కాళీ ఫిలిమ్స్ వారి ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమా వచ్చిన ఇరవయ్యేళ్ల తరువాత కడారు నాగభూషణం అదే సినిమాను ‘శ్రీకృష్ణ తులాభారం (1955) పేరుతో మరలా నిర్మించారు. చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. నాగభూషణం స్వయంగా దర్శకుడైవుండి కూడా ఈ సినిమాకు సి.యస్.రావును దర్శకునిగా పరిచయం చేశారు. దర్శకునిగా తెలుగులో రావుకు ఇది తొలి సినిమా. తొలి సినిమాతోనే సి.యస్.రావుకు మంచి పేరొచ్చింది. ఈ చిత్ర విజయం సి.ఎస్.రావుని ఒక ఇంటివాణ్ణి చేసింది. కన్నాంబ-నాగభూషణంల దత్త పుత్రిక రాజేశ్వరిని సి.ఎస్.రావుకు ఇచ్చి పెళ్లి జరిపించారు. అంతకుముందు 1950లో వచ్చిన ‘పల్నాటి యుద్ధం’ సినిమాలో నాయకురాలు నాగమ్మ పాత్రను కన్నాంబ పోషించగా, బ్రహ్మనాయుడిగా డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు నటించారు. కన్నాంబకు ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాను పండిత జవహర్ లాల్ నెహ్రు చూసి మెచ్చుకొని, ఇందిరా గాంధికి చూపించడం కోసం మరలా ప్రదర్శింపచేయించుకున్నారట.
సొంత సినిమాల పరాజయ పర్వం… 1951 తరువాత కన్నాంబ సొంత చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించిన సినిమాలు వరసగా పరాజయం పాలవుతూ వచ్చాయి. ఆ సంవత్సరం కడారు నాగభూషణం దర్శకత్వంలో ‘సౌదామిని’ చిత్రాన్ని నిర్మించారు. అందులో కన్నాంబ, అక్కినేని, సియ్యస్సార్, రేలంగి, సూరిబాబు, ఆరణి, దొరస్వామి, ఎస్.వరలక్ష్మి నటించారు. సముద్రాల రాఘవాచార్య రచన చేసిన ఈ సినిమా ఆడలేదు. 1952లో నాగభూషణం దర్శకత్వంలోనే ‘పేదరైతు’ అనే సాంఘిక చిత్రాన్ని నిర్మించారు. అందులో కన్నాంబ, అంజలీదేవి, శ్రీరామమూర్తి, రేలంగి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకూడా పరాజయంపాలై అప్పులను మిగిల్చింది. ఎ.వి.ఎం సంస్థకు పోటీగా ‘నాగులచవితి’ అనే సినిమాను నిర్మించి వారికి పోటీగా విడుదల చేసి నష్టపోయిన సంఘటనలు వీరి కుటుంబానికి ఎన్నోసార్లు అనుభవమయ్యాయి. సంవత్సరం విరామం తరువాత కన్నాంబ స్వయంగా ‘సతీసక్కుబాయి’(1954) చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు. అయితే అప్పటికే ‘సతీసక్కుబాయి’ కథ హక్కులు దర్శకులు కె.వి.రెడ్డి వద్ద వున్నాయి. ఆ సంగతి కన్నాంబకు తెలియదు. ‘సతీ సక్కుబాయి’ చిత్రాన్ని రాజేశ్వరి ఫిలిం కంపెనీ వాళ్లు తీస్తున్నారని తెలిసి కె.వి.రెడ్డి కన్నాంబను కలిసి విషయం ఆరాతీశారు.
కన్నాంబ కన్నీళ్లు పెట్టుకొని ‘రెడ్డి గారూ ఈ సినిమా హక్కులు మీవద్ద వున్న విషయం నాకు తెలియదు. మేము రెండు సినిమాలు నిర్మించి అప్పులపాలయ్యాం. నాగభూషణం గారు చెబితే వినకుండా పేదరైతు, సౌదామిని సినిమాలు నిర్మించారు. మేము అప్పులబారి నుంచి బయటపడాలంటే వేరే మార్గం లేదు. సక్కుబాయి సినిమాకు జనాదరణ లభిస్తుందనే ధైర్యంతో సినిమా మొదలు పెట్టాము. సహకరించండి’ అంటూ ప్రాధేయపడింది. దాంతో దర్శకుడు కె.వి.రెడ్డి ఆ హక్కులు కన్నాంబకు ఇచ్చివేశారు. ‘సతీ సక్కుబాయి’ సినిమా బాగా ఆడింది. సినిమా నిర్మాణంలో కష్టనష్టాలు వచ్చినా గాని కన్నాంబ కళాకారులకు, సాంకేతిక సిబ్బందికి టంచనుగా నిబద్ధతతో పారితోషికాలు, జీతాలు అందజేసేవారు. కన్నాంబ దాతృత్వం గురించి ఆరోజుల్లో ఎన్నో కథలు చెప్పుకునేవారు. హాస్యనటుడు పద్మనాభం కూడా మద్రాసులో అడుగు పెట్టినప్పుడు భోజనంపెట్టి, వసతి కల్పించిన సాధ్వీమణి కన్నాంబ. వీరి కంపెనీలో భోజనం చెయ్యని కళాకారుడు ఆ రోజుల్లో వున్నారంటే ఎవరూ నమ్మేవారు కాదు. రాజరాజేశ్వరి దేవిని కన్నాంబ నిష్టతో పూజించేవారు. ఆ దేవి పూజ చేయకుండా షూటింగుకు వెళ్లిన దాఖలాలు లేవు.
తమిళంలోనూ అగ్రస్థానమే… కన్నాంబకు తమిళంలో మంచి మార్కెట్ వుండేది. 1940లోనే ఆమె ‘కృష్ణన్ తూట్టు’ సినిమాలో ద్రౌపదిగా నటించింది. ఆమె తమిళ ఉచ్చారణకి స్థానికులే విస్తుపోయేవారు. 1942లో కన్నాంబ నటించిన ‘కణ్ణగి’ చిత్రం సూపర్ డూపర్ హిట్టయింది. ఆ చిత్రంలో కన్నాంబ నటించేనాటికి ఆమెకు 31 సంవత్సరాలు. తొలుత ఆమె సరసన కోవలన్ పాత్ర పోషణకు త్యాగరాయ భాగవతార్‌ను తీసుకుందామని అనుకొని, వీరి జంట మధ్య వయోభేదం ప్రస్పుటంగా కనిపిస్తుందేమోనని ఆ పాత్రకు చిన్నప్పను తీసుకున్నారు. కన్నాంబ నటన ముందు తను తేలిపోతానేమోనని చిన్నప్ప దర్శకుడు మణి వద్ద వాపోతే కన్నాంబే ధైర్యం చెప్పి అతని చేత నటింప జేసింది. ఈ సినిమాను ఆరోజుల్లో కోటి మంది ప్రేక్షకులు చూశారని పత్రికలు రాశాయి. 110 సెంటర్లలో ఈ సినిమా వందరోజులు ఆడి రికార్డు సృష్టించడం ఒక విశేషం. ఈ సినిమా కన్నాంబకు తమిళంలో కేవలం మూడవది మాత్రమే. దాంతోనే తమిళంలో కూడా కన్నాంబకు స్టార్డం లభించింది.
తమిళులు కన్నాంబను కణ్ణగి అనే పిలుస్తుంటారు. ఆమె 1944-63 మధ్య కాలంలో చాలా తమిళంలో సినిమాల్లో నటించారు. ‘మహామాయ’, ‘తులసి జలంధర’, ‘దైవనీతి’, ‘నవజీవనం’, మంగైయర్కరాశి’, ‘సుదర్శన్’, ‘ఎలైవుళవాన్’, ‘మూండ్రు పిళైగళ్’, ‘పెన్నరాశి’, ‘తికుప్పిన్ తరం’, ‘మక్కలైపేట్ర మగరాసి’ సినిమాలు మచ్చుకు కొన్ని మాత్రమే. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే అంజలీ పిక్చర్స్ వారి ‘అనార్కలి’ చిత్రంలో జోదాబాయిగా నటించి మెప్పు ప్పొందింది. ‘వదిన’, ‘చరణదాసి’, ‘ఉమాసుందరి’, ‘తోడికోడళ్ళు’, ‘ఆడపెత్తనం’, ‘శ్రీకృష్ణమాయ’, ‘కార్తవరాయని కథ’, ‘మాంగల్య బలం’, ‘రాజమకుటం’, ‘రేచుక్క-పగటిచుక్క’, ‘అభిమానం’, ‘మాబాబు’, ‘పెళ్లి తాంబూలం’, ‘ఉషాపరిణయం’, ‘లవకుశ’, ‘పరువు-ప్రతిష్ట’ వంటి సినిమాల్లో చక్కటి నటనా పటిమను ప్రదర్శించి ప్రేక్షకుల ఆదరణకు పాత్రురాలయ్యింది. తెలుగులో కన్నాంబ నటించిన ఆఖరి చిత్రం నాగయ్య నిర్మించిన ‘భక్తరామదాసు’. అందులో రామదాసు భార్యగా కన్నాంబ నటించింది. టాకీ సినిమాలు వచ్చిన కొత్తల్లో కన్నాంబ తన పాత్రలకు అవసరమైన పాటలు తనే పాడుకునేవారు. తల్లిప్రేమ చిత్రంలో ‘జోజో నందబాల’, ‘ముగ్గురు మరాఠీలు’ చిత్రంలో ‘స్త్రీ భాగ్యమే భాగ్యము’, ‘పల్నాటి యుద్ధం’ చిత్రంలో ‘తెర తీయగరాద’ వంటి పాటలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. సొంత బ్యానర్ మీద కన్నాంబ 30 సినిమాల దాకా నిర్మించారు. ‘నవజీవనం’ అనే సినిమాకు రాష్ట్ర బహుమతి లభించింది. రెండు భాషల్లో ‘దక్షయజ్ఞం’ చిత్రం నిర్మించి భారీగా నష్టపోయారు. కన్నాంబ 7మే 1964న 52 ఏళ్ల పిన్న వయసులోనే చెన్నైలో కాలధర్మం చెందారు. ఆమె అంతిమయాత్రకు ఎమ్జీఆర్‌తో సహా తెలుగు, తమిళ చిత్రపరిశ్రమలో వున్న ప్రతి ఒక్కరూ హాజరై అంజలి ఘటించడం…ఆ అదృష్టం ఒక్క కన్నాంబకే దక్కడం ఆమె పుణ్యఫలం. అయితే కన్నాంబ భర్త మాత్రం అతి దయనీయమైన స్థితిలో ఒక చిన్న హోటల్ గదిలో ఉంటూ 1976లో చనిపోయారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు దర్శకుడు ఓంరౌత్ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ప్రభాస్ హీరోగా ఆయన తెరకెక్కిస్తోన్న ‘ఆదిపురుష్’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. ఇందులో ప్రభాస్ పొడవాటి జుత్తు, చేతికి రుద్రాక్షలు ధరించి రాముడిగా.. ఆకాశానికి విల్లు ఎక్కుపెట్టి పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు. ‘‘మా ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరూ భాగం కండి. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం.. అయోధ్యలోని సరయు నది ఒడ్డున జరగనున్న ‘ఆదిపురుష్’ టీజర్ లాంచ్‌లో పాల్గొనండి. అక్టోబర్ 2న రాత్రి 7.11 గంటలకు టీజర్ విడుదల చేయనున్నాం’’ అని ఔంరౌత్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.
రామాయణాన్ని ఆధారంగా చేసుకొని రూపుదిద్దుకుంటోన్న ఈసినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా ఆయనకు జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ నటి కృతిసనన్ మెరవనున్నారు. లక్ష్మణుడిగా సన్నీసింగ్ కనిపించనున్నారు. రామాయణంలో ముఖ్యంగా చెప్పుకొనే రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ప్రస్తుతం సినిమాల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే మౌత్ టాక్ సరిగ్గా లేకపోతే మొదటి ఆట తరువాత కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయి. మొదటి ఆట ముగిసే సమయానికి సినిమా జాతకం అంతా బయటకు వచ్చేస్తోంది. సినిమాకు మంచి టాక్ వస్తేనే ఆ తరువాత నిలబడుతోంది. లేదంటే ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమా అయినా ప్లాప్‌ల లిస్టులో చేరిపోతోంది.
టాలీవుడ్ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ టైమ్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షోను ప్రేక్షకులను ఉచితంగా చూపించాలంటే నిర్మాతలకు ఎంత ధైర్యం కావాలి. అలాంటి సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నారు ‘పగ పగ పగ’ చిత్ర నిర్మాతలు. సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తొలిసారిగా విలన్ పాత్రలో కనిపిస్తుండటం విశేషం. వినోదంతో కూడిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని డైరెక్టర్ రవి శ్రీ దుర్గా ప్రసాద్ తెరకెక్కించారు. ప్రొడ్యూసర్ సత్య నారాయణ సుంకర ఖర్చుకు వెనుకాడకుండా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న నటిస్తున్న ఈ చిత్రానికి కోటి సంగీతం అందించారు.
ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్, మూవీ మోషన్ పోస్టర్, కోటి పాత్రకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందన్న నమ్మకంతో నిర్మాతలు టాలీవుడ్ చరిత్రలోనే ఇప్పటివరకు ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘పగ పగ పగ’ చిత్రాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో అందరికీ ఉచితంగా చూపించాలని నిర్ణయించుకున్నారు. ఈ డేరింగ్ స్టెప్‌తో ఇండస్ట్రీలోని వర్గాలు అవాక్కవుతున్నాయి. అయినప్పటికీ సినిమా మీదున్న నమ్మకంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా నవీన్ కుమార్ చల్లా, ఎడిటర్‌గా పాపారావు వ్యవహరించారు. రామ్ సుంకర ఫైట్ మాస్టర్‌గా పని చేశారు. నిర్మాతలు తీసుకున్న ఈ డేరింగ్ డెసిషన్ సక్సెస్ అయి టాలీవుడ్‌కి మరో మంచి హిట్ దక్కాలని కోరుకుందాం..
అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ సమంత రుత్ ప్రభు. ‘ద ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్‌తో ఉత్తరాది వారికి కూడా చేరువైంది. దీంతో బాలీవుడ్ నుంచి కూడా ఆమెకు వరుసగా ఛాన్స్‌లు వస్తున్నాయని సమాచారం. ఇప్పటికే కొన్ని చిత్రాలకు సంతకం చేసిందని వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ మీడియాలో సామ్‌కు సంబంధించిన ఓ వార్త హల్‌చల్ చేస్తుంది.
బాలీవుడ్‌లో ‘హిందీ మీడియం’, ‘లూకా చప్పీ’, ‘స్త్రీ’ వంటి సినిమాలను నిర్మించిన ప్రతిష్ఠాత్మక సంస్థ మ్యాడ్ డాక్ ఫిలిమ్స్. తాజాగా ఓ హార్రర్ కామెడీని నిర్మించనుంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, సమంత హీరో, హీరోయిన్స్‌గా నటించనున్నారట. ఈ సినిమాలో సామ్ మహారాణి పాత్రలో కనిపించనుందని సమాచారం. ఆయుష్మాన్ రక్త పిశాచి రోల్‌ను పోషించనున్నాడని తెలుస్తోంది. అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. నీరెన్ బట్ స్క్రిఫ్ట్‌ను అందించనున్నాడు.
సామ్ చేతిలో ప్రస్తుతం అనేక ప్రాజెక్టున్నాయి. ‘యశోద’ షూటింగ్‌ను పూర్తి చేసింది. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్‌గా రూపొందింది. ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉన్నాయని తెలుస్తోంది. అందువల్ల పోస్ట్ ప్రొడక్షన్ కోసం మేకర్స్ అధికంగా సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఈ మధ్యనే విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘శాకుంతలం’ లోను హీరోయిన్‌గా నటిస్తుంది. త్వరలోనే ‘శాకుంతలం’ ప్రమోషన్స్ ను మొదలుపెడతామని గుణ శేఖర్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. విజయ్ దేవర కొండతో ‘ఖుషి’ (Kushi) చేస్తుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. రుస్సో బ్రదర్స్ నిర్మిస్తున్న ‘సిటాడెల్’ (Citadel) లోను నటిస్తుంది.
అన్ని పరిశ్రమల్లోనూ ప్రస్తుతం సీక్వెల్ చిత్రాలు విరివిరిగా తెరకెక్కుతున్నాయి. దాంతో, ఏదైనా చిత్రం మంచి విజయం అందుకుందంటే చాలు దాని కొనసాగింపుపై సినీ అభిమానుల నుంచి ప్రముఖుల వరకూ అంతా దృష్టి పెడుతున్నారు. ఇటీవల విడుదలై, హిట్ కొట్టిన ‘సీతారామం’ (Sita Ramam) విషయంలోనూ కొనసాగింపు ఉంటే బాగుండని చాలా మంది అనుకున్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్ (హిందీ)లో ఓ విలేకరి ఇదే ప్రశ్నను హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ముందు ఉంచగా ఆయన స్పందించారు. ‘‘ఏదైనా సినిమాకు విశేష ప్రేక్షకాదరణ లభించి, క్లాసిక్‌గా నిలిస్తే దాన్ని మళ్లీ టచ్ చేయకూడదనే విషయాన్ని నేను నటుడినికాకముందే తెలుసుకున్నా. మేం ఈ కథను బాగా నమ్మాం. ‘సీతారామం’ క్లాసిక్‌గా నిలుస్తుందని భావించాం. అనుకున్నట్టుగానే మీరంతా ఈ చిత్రాన్ని మీ హృదయాల్లో దాచుకున్నారు. అందుకే ఈ సినిమాకు కొనసాగింపు ఉండదనుకుంటున్నా. రీమేక్ విషయంలోనూ అంతే’’ అని దుల్కర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ అందమైన ప్రేమకథలో రామ్‌గా దుల్కర్, సీతామహాలక్ష్మిగా మృణాల్ ఠాకూర్ ఒదిగిపోయారు. రష్మిక, తరుణ్‌భాస్కర్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ రాకుమారి(సీత), లెఫ్టినెంట్(రామ్)ల లవ్‌స్టోరీ దక్షిణాది ప్రేక్షకులతోపాటు ఉత్తరాది వారినీ విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ (తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో) అవుతోంది.
బ్యూటీఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్లి, పిల్లలు కనడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తను నటించిన ‘సీతా రామం’ మూవీ ఇటీవల హిందీలో విడుదలవగా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న ఆమె తాజాగా ప్రముఖ యూట్యూబ్ చానెల్ ‘డేటింగ్ దిస్ నైట్స్’ ఎపిసోడ్‌లో మాట్లాడుతూ.. 30ఏళ్ల వయసులో ఉన్న స్త్రీలు డేటింగ్ చేయడం, ప్రేమలో పడటం, బిడ్డను కనడం వల్ల కలిగే ఒత్తిడి తాను ఎదుర్కొలేనని చెప్పింది. అలాగే పాత సిద్ధాంతాలను బద్దలు కొట్టి ప్రేమలో పడకుండానే బిడ్డను కనాలని ఉందన్న బ్యూటీ.. ఈ తరం అమ్మాయిలు కాలం చెల్లిన ఆలోచనలనుంచి బయటపడాలని సూచించింది.
ఈ మేరకు ‘నేను ఎక్కడి నుంచి వస్తున్నానో.. నా మనసులో ఏముందో గమనించి, చేస్తున్న వృత్తిని అర్థం చేసుకునే భాగస్వామి కావాలి. ప్రస్తుతం మన చుట్టు చాలా అభద్రతాభావం ఉంది. కాబట్టి నాకు కావల్సిందల్లా ప్రొటెక్టెడ్ పర్సన్. ఇలాంటి వ్యక్తులు దొరకడం చాలా అరుదు. అలాగే నేను బిడ్డను కనాలని భావించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, అది సెక్స్ ద్వారా కాదు. ఒంటరి తల్లిగా ఉండాలనుకున్నా. దానికి మా అమ్మ సరే అని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉంది. నిజంగా అలా ఉండటం అద్భుతమైనది’ అని ముగించింది మృణాల్.
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ . మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను రామ్ చరణ్, ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఇందులో ఓ కీలక పాత్రలో నటించటం విశేషం. చిరంజీవి – సల్మాన్ ఖాన్ కలిసి చేసిన ‘థార్ మార్..’ అనే సాంగ్‌ను సెప్టెంబర్ 15న రిలీజ్ చేయబోతున్నారు. ఆ సాంగ్ ప్రోమోను మంగళవారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రోమో చూస్తుంటే చిరు, సల్మాన్ మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారని క్లియర్‌గా అర్థమవుతోంది. అక్టోబర్ 5న సినిమా థియేటర్స్‌లో సందడి చేయనుంది.
సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. కృతి సనన్ , సైఫ్‌అలీ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందుతుంది.
చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ కూడా ఇప్పటి వరకు విడుదల కాలేదు. అభిమానులందరూ అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు తెర పడినట్టే కనిపిస్తుంది. ‘ఆదిపురుష్’ ప్రమోషన్స్ అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నాయని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.
‘ఆదిపురుష్’ టీజర్‌ను అక్టోబర్ 3న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. రాముని జన్మస్థలం అయోధ్యలో టీజర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారని సమాచారం. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. ఈ మైదానంలో అక్టోబర్ 5న జరిగే రావణ దహన కార్యక్రమానికి ప్రభాస్‌ను ముఖ్య అతిథిగా నిర్వహకులు ఆహ్వానించారని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. రావణుడ్ని దహనం చేయాలని నిర్వహకులు కోరారట.
ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించడనుండటంతోనే ఈ కార్యక్రమానికి పిలిచారని తెలుస్తోంది. గతంలో రావణ దహన కార్యక్రమానికి అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, జాన్ అబ్రహాం హాజరయ్యారు. కాగా, ‘ఆదిపురుష్’ ను భూషణ్ కుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ మూవీలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ‘ఆదిపురుష్’ ఫస్ట్‌లుక్ సెప్టెంబర్ 26న విడుదలయ్యే అవకాశం ఉంది.
బాలీవుడ్ ఆశలు అడియాశలు అయ్యాయి. ఇండస్ట్రీకి పూర్వ వైభవం అన్నమాటే ఇప్పుడు ఉత్తి మాటగా మారిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న బీ టౌన్ ఎట్ ప్రపజెంట్ దిక్కులు చూస్తూ కూర్చింది. ఏం చేయాలో అర్థం కాక.. ఎలాంటి సినిమాలు తీయాలో తెలియక తల్లడిల్లుతోంది. సౌత్ ముందు చిన్నబోవడం పై మదన పడుతోంది.పాన్ ఇండియన్ సినిమాలంటూ నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాయి సౌత్ సినిమాలు.! అందులోనూ ప్రత్యేకించి టాలీవుడ్ సినిమాలు! ఇక వీటికి ఎదుర్కొనేందుకు.. మునుపటి బాలీవుడ్ను ఆవిష్కరించేందుకు ఓ రేంజ్లో నడుంబింగారు బాలీవుడ్ మేకర్స్. పాన్ ఇండియా సినిమా కాన్సెప్ట్ ను ఎత్తుకుని మరీ.. భారీ బడ్జెట్ తో రాజమౌళి రేంజ్లో బ్రహ్మాస్త్ర సినిమాను తెరకెక్కించారు. టాలీవుడ్ స్టార్ హీరో నాగ్‌ను కూడా ఈ సినిమాలో నటింపజేసి సౌత్‌లో ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు. మన పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళితో ఈ సినిమాను ప్రజెంట్ చేపించే ప్లాన్ చేశారు. ఆయన్ను ఈ సినిమా ప్రమోషన్లకు హెడ్ గా మార్చేశారు. సినిమా పై ఎన్నో అంచనాలు పెంచారు.
బాలీవుడ్ ను మునుపటి ట్రాక్ పై ఎక్కించేందుకు బ్రహ్మాస్త్ర నే సరైనా సినిమాని అందరూ అనుకునేలా చేశారు.కాని కట్ చేస్తే.. సెప్టెంబర్ 9న రిలీజైన ఈ సినిమా పెద్దగా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంలో ఫెయిల్ అయింది. దాదాపు 65 పర్సెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ తో సినిమా రిలీజ్ ముందు చిన్న వైబ్రేషన్ క్రియటే చేసినా.. రిలీజ్ తరువాత మాత్రం ఆ వైబ్రేషన్ను కంటిన్యూ చేయలేక పోయింది బ్రహ్మాస్త్ర. దీంతో ఈ సినిమా కూడా బాలీవుడ్ ఫేట్ మార్చేలా కనిపించడం లేదంటూ.. కామెంట్స్ చేస్తున్నారు ఫిల్మీ అనలిటిక్స్. రణ్‌బీర్ వల్ల కాలేదు మరే హీరో వల్ల అవుతుందో చూడాలని అంటున్నారు.