Category Archives: Movie News

‘సరిలేరు నీకెవ్వరు` చిత్రాన్ని మహేష్‌గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిపిన ప్రేక్షకులకు ధన్యవాదాలు – ప్రముఖ నిర్మాత అనిల్‌ సుంకర.

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా దిల్ రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జి.ఎం.బి ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనిల్‌రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ప్రొఫెస‌ర్ భార‌తీగా లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించారు. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త‌ రికార్డుల‌ను క్రియేట్ చేస్తూ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా హైదరాబాద్ సంస్థ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..
ఇలాంటి సంక్రాంతిని ఇంత వ‌ర‌కూ చూడలేదు!!
సూపర్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు మాట్లాడుతూ – ”నేను ఇండస్ట్రీకి వచ్చి 22 సంవత్సరాలైంది. ఇలాంటి సంక్రాంతి ఇప్పటివరకూ చూడలేదు. కేవలం ఐదు నెలల్లోనే సూపర్‌స్టార్‌ మహేష్‌, అనిల్‌ రావిపూడి ఈ సినిమా కంప్లీట్‌ చేసి సరిలేరు మాకెవ్వరు అన్పించారు. ప్రేక్షకులు కూడా ఈ సినిమాని బ్లాక్‌ బస్టర్‌ కా బాప్‌ అనే రేంజ్‌లో రెవెన్యూ క్రియేట్‌ చేసి, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నిజమైన సంక్రాంతి అనుకునేలాగా చేశారు. అనిల్‌ ఇప్పటివరకూ అయిదు సినిమాలు చేశారు. అయిదురు హీరోలకి వారి కెరీర్‌ బెస్ట్‌ సక్సెస్‌ ఇచ్చారు. అలాగే ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌కిగానీ, మా బేనర్‌కి గానీ హయ్యస్ట్‌ రెవెన్యూ కలెక్ట్‌ చేసిన సినిమాగా క్రియేట్‌ చేశారు. ఇంకా ఎంత కలెక్ట్‌ చేస్తుంది అనేది ఇప్పుడే చెప్పలేం. అలాగే డిస్ట్రిబ్యూటర్స్‌కి ఎంత ప్రాఫిట్‌ కావాలో అంత ప్రాఫిట్‌ క్రియేట్‌ చేసి ఇచ్చారు. సంక్రాంతికి రావాలనే ఒక్క సంకల్పంతో అంత పెద్ద స్టార్‌ అయి ఉండి కూడా అయిదు నెలల్లోనే షూటింగ్‌ కంప్లీట్‌ చేసిన మహేష్‌బాబుగారికి థాంక్స్‌. ఈ సంక్రాంతికి ఇంత మంచి రెవెన్యూ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు” అన్నారు.
అనిల్‌కి ఒన్‌ ఆఫ్‌ ది బిగ్గెస్ట్‌ అఛీవ్‌మెంట్‌!!
ప్రముఖ నిర్మాత అనిల్‌ సుంకర మాట్లాడుతూ – ”సంక్రాంతి ముగిసింది. పండగ సినిమాలకి ఇంకా సంక్రాంతి నడుస్తూనే ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’ మహేష్‌గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఒక సూపర్‌స్టార్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అంటే సాధారణ విషయం కాదు. దర్శకుడు అనిల్‌ రావిపూడికి ఒన్‌ ఆఫ్‌ ది బిగ్గెస్ట్‌ అఛీవ్‌మెంట్‌. అనిల్‌ కష్టానికి తగ్గ ప్రతిఫలం మా అందరికీ లభించింది. ఈ సినిమాకి దిల్‌రాజుగారి కోపరేషన్‌ మరువలేనిది. మేం ఏదైతే అనుకున్నామో దానికన్నా ఎక్కువ కలెక్షన్స్‌ వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీలోనే ది బెస్ట్‌ సంక్రాంతి అని మా డిస్ట్రిబ్యూటర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సంక్రాంతిలో మా సినిమా ఉండటం నిజంగా మా అదృష్టం” అన్నారు.
ఈ సంక్రాంతికి బాక్సాఫీస్‌ దద్దరిల్లిపోతోంది!!
యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ – ”అందరూ చెప్పినట్లే తెలుగు సినిమా కళకళలాడుతోంది. సంక్రాంతికి బాక్సాఫీస్‌ దద్దరిల్లిపోతోంది. ఐయాం వెరీ హ్యాపీ. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్‌ చేసి మహేష్‌గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిపిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంకా రెండు మూడు వారాలు రన్‌ ఉంది. అలాగే రిపీటెడ్‌గా చూడాలనుకునే ఆడియన్స్‌ కోసం ఒకటిన్నర నిమిషాల నిడివి గల సన్నివేశాన్ని యాడ్‌ చేస్తున్నాం. దాంతో ఇంకొంచెం నవ్వులు బోనస్‌గా లభిస్తాయి. ‘రమణా లోడు ఎత్తాలిరా’ అనే డైలాగ్‌కు మేం ఊహించినదాన్ని కన్నా ఎక్కువ రెస్పాన్స్‌ వచ్చింది.అందుకే మేము కూడా ‘రమణా బాక్సాపీస్ లోడ్ ఎత్తాలిరా’ అంటున్నాం. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ఎంతో గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు” అన్నారు.


Vaishnav Tej’s debut film title confirmed as ‘Uppena’

Megastar Chiranjeevi’s nephew and Sai Dharam Tej’s younger brother Vaishnav Tej is getting introduced as hero and the film is officially titled ‘Uppena.’

Buchi babu Sana who worked as associate to legendary director Sukumar is directing his debut film Uppena for which first look poster is being released tomorrow at 4:05 pm.

Newgirl Krithi Shetty is also making her debut with this film while Tamil star actor Vijay Sethupathi is playing an important role.
Hero, heroine and actor Brahmaji will be taking part in Puri schedule of shooting.
‘Rockstar’ Devi Sri Prasad will be composing music while Shamdat Sainudeen will handle the cinematography.
Mythri Movie Makers is producing ‘Uppena’ in association with Sukumar Writings banner.

Cast: Panja Vaisshnav Tej, Vijay Sethupathi, Kriti Shetty, Sai Chand, Brahmaji

Crew:
Story & Direction: Buchi Babu Sana
Producers: Naveen Yerneni, Y Ravi Shankar
Executive Producer: Anil Y
CEO: Cherry
Banner: Mythri Movie Makers, Sukumar Writings
Cinematography: Shamdat Sainudeen
Music director: Devi Sri Prasad
Editor: Naveen Nooli
Art Director: Mounika Ramakrishna
Pro: Vamsi Shekar, Madhu Maduri


రిపబ్లిక్ డే కానుకగా `22` చిత్రం నుండి హీరోయిన్‌ సలోని మిశ్రా ఫస్ట్‌లుక్ గ్లింప్స్ విడుద‌ల‌!!

షింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్‌ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్‌కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ’22’. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది.ఇటీవ‌ల డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ చేతుల‌మీదుగా విడుద‌లైన హీరో ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్ కు ట్రెమండ‌స్ రెస్పాన్ వచ్చింది. తాజాగా రిపబ్లిక్ డే కానుకగా జ‌న‌వ‌రి 22న ఈ చిత్రం నుండి హీరోయిన్‌ గ్లింప్స్ ని విడుదలచేసింది చిత్ర యూనిట్. సలోని మిశ్రా ఎల‌క్ట్రిఫాయింగ్ పోలీస్ ఆఫీసర్ గా స్టైలిష్ లుక్ లో కనిపిస్తోంది. దర్శకుడు శివకు ఇది మొదటి సినిమా అయినా చాలా స్టైలిష్ గా తెరకెక్కించారని ఈ వీడియో చూస్తే అర్ధం అవుతోంది.

రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా, విక్రమ్‌ జీత్‌ విర్క్‌, దేవిప్రసాద్‌, జయప్రకాష్‌, రవి వర్మ, శశిధర్‌ కోసూరి, ఫిదా శరణ్య, రాజశ్రీనాయర్‌, పూజా రామచంద్రన్‌, కృష్ణ చైతన్య, ఆఫ్ఘనిస్తాన్‌ రామరాజు, బేబి సంస్కృతి, మాస్టర్‌ తరుణ్‌, మాస్టర్‌ దేవాన్ష్‌, బేబి ఓజల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ : బి.వి. రవికిరణ్‌, సంగీతం: సాయికార్తీక్‌, ఎడిటింగ్‌: శ్యామ్‌ వాడవల్లి, కొరియోగ్రఫీ: అనీలామా, ఆర్ట్‌: పెద్దిరాజు అడ్డాల, స్టంట్స్‌: జాషువ, లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, ప్రొడక్షన్‌ మేనేజర్‌: కిరణ్‌ కాసా, పిఆర్ఓ: బి.ఎ రాజు, చీఫ్‌ కో-డైరెక్టర్‌: పుల్లారావు కొప్పినీడి, నిర్మాత: శ్రీమతి సుశీలాదేవి, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: శివకుమార్‌ బి.


అనంతపురంలో ప్రారంభమైన విక్టరీ వెంకటేష్ పవర్ ఫుల్ మూవీ ‘నారప్ప’

అనంతపురంలో ప్రారంభమైన విక్టరీ వెంకటేష్ పవర్ ఫుల్ మూవీ ‘నారప్ప’
‘ఎఫ్‌2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ 74వ చిత్రం ‘నారప్ప’ రెగ్యులర్‌ షూటింగ్‌ బుధవారం అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండలోని పాల్తూరు గ్రామంలో ప్రారంభమైంది. మొద‌టి స‌న్నివేశాన్ని విక్ట‌రీ వెంక‌టేష్ పై చిత్రీక‌రించారు. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ని రివీల్‌ చేస్తూ విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ‘నారప్ప’ గెటప్‌లో విక్టరీ వెంకటేష్‌ లుక్‌ చాలా ఇంటెన్స్‌గా ఉంది. మాస్‌ గెటప్‌లో పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ సర్‌ప్రైజ్‌ చేశారు విక్టరీ వెంకటేష్‌. రాయలసీమలోని అనంతపురం పరిసర ప్రాంతాల్లోని రియలిస్టిక్‌ లొకేషన్లలో కీలక సన్నివేశాలను మొదటి షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు.

విక్టరీ వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్‌.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌, ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌, కథ: వెట్రిమారన్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌, లిరిక్స్‌: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం, ఫైనాన్స్‌ కంట్రోలర్‌: జి.రమేష్‌రెడ్డి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రామబాలాజి డి., ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఏపీ పాల్‌ పండి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ శంకర్‌, కో- ప్రొడ్యూసర్‌: దేవిశ్రీదేవి సతీష్‌, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల


ఫిబ్ర‌వ‌రి 7న గ్రాండ్ రిలీజ్ అవుతున్న శ‌ర్వానంద్‌, స‌మంత `జాను`

`ప్రాణం నా ప్రాణం..నీతో ఇలా….` అనే హార్ట్ ట‌చింగ్ మెలోడీ సాంగ్‌తో ఆక‌ట్టుకుంటున్న `జాను`.. ఫ్రిబ్ర‌వ‌రి 7న సినిమా గ్రాండ్ రిలీజ్

శ‌ర్వానంద్‌, స‌మంత హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం `జాను`. ఈ సినిమాలో తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

“ప్రాణం నా ప్రాణం..నీతో ఇలా
గానం తొలి గానం పాడే వేళ‌
తారా తీరం మ‌న దారిలోకాంతులే కురిసేలా
చాలా దూరం రాబోవు ఉద‌యాల‌నే విసిరేలా…“ అంటూ హార్ట్ ట‌చింగ్ మెలోడీ ప్రేమ‌లోని గాఢ‌త ఈ పాట‌లో తెలియ‌చేస్తుంది.
గోవింద్ వ‌సంత సంగీత సార‌థ్యంలో శ్రీమ‌ణి రాసిన ఈ పాట‌ను చిన్న‌యి, గౌత‌మ్ భ‌ర‌ద్వాజ్ ఆల‌పించారు.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సి.ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల చేస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌ల‌ను విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

న‌టీన‌టులు:
శ‌ర్వానంద్‌, సమంత‌

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: సి.ప్రేమ్‌కుమార్‌
నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్‌
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి అనిత‌
బ్యాన‌ర్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
సంగీతం: గోవింద్ వ‌సంత‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌హేంద్ర‌న్ జ‌య‌రాజ్‌
ఆర్ట్‌: రామాంజ‌నేయులు
మాట‌లు: మిర్చి కిర‌ణ్‌
పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శ్రీమ‌ణి


పూరి జగన్నాధ్ చేతుల మీదుగా అశ్వద్ధామ ట్రైలర్

యూవ హీరో నాగ శౌర్య రాసుకున్న కథ ఆధారంగా తెరకెక్కిన అశ్వద్ధామ మూవీ టీజర్ ను ఇటీవల సమంత విడుదల చేసిన సంగతి తెలిసిందే, టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్ర ట్రైలర్ ను డైరెక్టర్ పూరి జగన్నాధ్ విడుదల చేయబోతున్నాడు.

అశ్వద్ధామ ట్రైలర్ జనవరి 23న సాయంత్రం 5.04 గంటలకు పూరి జగన్నాధ్ చేతుల మీదుగా విడుదల కాబోతొంది. అందరి అంచనాలకు తగ్గటు ట్రైలర్ ఉండబోతొంది.

నాగ శౌర్య సరసన మెహిరిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సమాజంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనకు ఆధారంగా తెరకెక్కింది. అశ్వద్ధామ జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

నటీనటులు: నాగ శౌర్య, మెహరిన్

సాంకేతిక నిపుణులు:
బ్యానర్: ఐరా క్రియేషన్స్
నిర్మాత: ఉషా మూల్పూరి
కథ: నాగ శౌర్య
డైరెక్టర్: రమణ తేజ
కెమెరా: మనోజ్ రెడ్డి
మ్యూజిక్: శ్రీచరన్ పాకాల
ఎడిటర్: గ్యారీ
లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి
డిజిటల్: గౌతమ్
డైలాగ్స్: పరుశురాం శ్రీనివాస్
యాక్షన్ డైరెక్టర్: అన్బరివ్


`ప్రాణం నా ప్రాణం..నీతో ఇలా….` అనే హార్ట్ ట‌చింగ్ మెలోడీ సాంగ్‌తో ఆక‌ట్టుకుంటున్న `జాను`

శ‌ర్వానంద్‌, స‌మంత హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం `జాను`. ఈ సినిమాలో తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

“ప్రాణం నా ప్రాణం..నీతో ఇలా
గానం తొలి గానం పాడే వేళ‌
తారా తీరం మ‌న దారిలోకాంతులే కురిసేలా
చాలా దూరం రాబోవు ఉద‌యాల‌నే విసిరేలా…“ అంటూ హార్ట్ ట‌చింగ్ మెలోడీ ప్రేమ‌లోని గాఢ‌త ఈ పాట‌లో తెలియ‌చేస్తుంది.
గోవింద్ వ‌సంత సంగీత సార‌థ్యంలో శ్రీమ‌ణి రాసిన ఈ పాట‌ను చిన్న‌యి, గౌత‌మ్ భ‌ర‌ద్వాజ్ ఆల‌పించారు.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సి.ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల చేస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌ల‌ను విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

న‌టీన‌టులు:
శ‌ర్వానంద్‌, సమంత‌

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: సి.ప్రేమ్‌కుమార్‌
నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్‌
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి అనిత‌
బ్యాన‌ర్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
సంగీతం: గోవింద్ వ‌సంత‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌హేంద్ర‌న్ జ‌య‌రాజ్‌
ఆర్ట్‌: రామాంజ‌నేయులు
మాట‌లు: మిర్చి కిర‌ణ్‌
పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శ్రీమ‌ణి


200 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించి సంక్రాంతి ఛాంపియ‌న్‌గా నిలిచిన‌ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`

సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తూ స్ట్రాంగ్ క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే 200 కోట్ల రియ‌ల్ గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించి సంక్రాంతి రియ‌ల్ ఛాంపియ‌న్‌గా నిలిచింద‌న్నారు ప్ర‌ముఖ నిర్మాత అనిల్ సుంక‌ర‌. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా దిల్ రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జి.ఎం.బి ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనిల్‌రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ప్రొఫెస‌ర్ భార‌తీగా లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించారు. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది
.
ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ నిర్మాత‌ అనిల్ సుంకర మాట్లాడుతూ- `సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` ప్రేక్ష‌కుల, అభిమానుల‌ అపూర్వ ఆద‌ర‌ణతో బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తూ మ‌హేశ్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ గా నిలిచింది. మా చిత్రాన్నిఇంత గొప్ప‌గా ఆద‌రిస్తున్న‌ ప్రేక్ష‌కుల‌కు, సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌రియు మ‌హేశ్ అభిమానుల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు“ అన్నారు.


“కాక్ టైల్” ప్రారంభం

చిత్రలహరి మూవీ మేకర్స్ పతాకంపై జై దర్శకత్వంలో,అట్లూరి మాదవి నిర్మించనున్న హిలెరియస్ కామెడీ ఎంటర్ టైనర్ “కాక్ టైల్”. ఈచిత్ర ప్రారంభోత్సవం ఇటీవల ఫిల్మ్ నగర్ ధైవసన్నిదానం లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జై మాట్లాడుతూ “యువత భవిత పై సోషల్ మీడియా ప్రభావం”అనే అంశంతో,అన్నికమర్షియల్ హంగులతో రూపుదిద్దుకొనున్న చిత్రమిది.పాత,కొత్త ఆర్టిస్ట్ లతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఫిబ్రవరి 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్,గోవాలలో జరపనున్నాం. అన్నారు.
ఈ చిత్రానికి కధ,మాటలు:శ్రీకుమార్ దాలిపర్తి సంగీతం:భాను.జె. ప్రసాద్,కేమెరా:శ్రీనివాస్ సబ్బి,డాన్స్:శైలజ, రాక్ వేణు ఫైట్స్:నాబా,ఎడిటింగ్:శివ,సమర్పణ:పవన్ కుమార్ వాసికర్ల,పి.ఆర్.ఓ:బి.వీరబాబు,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:ఆనంద్.వి,ప్రొడ్యూసర్:అట్లూరి మాధవి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:జై


షూటింగ్ పూర్తి చేసుకున్న ‘వధుకట్నం ‘

శ్రీహర్ష , ప్రియ, రఘు , కవిత , ఆర్యన్ , రేఖ, కుషాల్, అనోన్య, మణిచందన, నాగలక్ష్మి ఇంజి ప్రధాన పాత్ర ధారులుగా ‘గ్రీన్ క్రాస్ థియోసోఫికల్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ సొసైటీ ‘ సమర్చణలో ‘షబాబు ఫిలిమ్స్’, పతాకం పై, భార్గవ గొట్టిముక్కల దర్శకత్వం లో షేక్ బాబు సాహెబ్ నిర్మిస్తున్న సందేశాత్మక కుటుంబ కథా చిత్రం “వధుకట్నం.. ఇలా జరగొచ్చేమో..” షూటంగ్ పూర్తి చేసుకుంది.

సమాజంలో స్త్రీ కి జరుగుతున్న అన్యాయానికి కారకులైన వారిని ప్రశ్నిస్తూ, పరిష్కారానికి ముందుకు రండి అని మహిళా లోకానికి పిలుపునిచ్చే ఒక మహిళా నాయకురాలిగా- “ఉద్యమం ఇదిరా… ” , అనే పాటలో ప్రముఖ నటి మణిచందన నటించారు. వర్థమాన యువ రచయిత శ్రీరాం తపస్వి రచియించిన ఈ గీతానికీ యువ సంగీత దర్మకుడు ప్రభు ప్రవీణ్ లంక (నాని) ఉద్వేగభరితమైన బాణీని అందించారు.

ఈ పాటకు యువ నృత్య దర్శకుడు వి .యమ్ . కృష్ణ దర్శకత్వం వహించగా, ప్రముఖ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ యస్.డి జాన్ గారి నేతృత్వంలో, వందలాది మంది జూనియర్ ఆర్టిస్ట్ ల సహకారం తో మూడు రోజుల పాటు రాజధాని నగర వీధుల్లో భారీ ఎత్తున చిత్రీకరించడం జరిగింది.

దర్శకుడు భార్గవ గొట్టిముక్కల మాట్లాడుతూ- నిర్మాత నన్ను నమ్మి, పూర్తి స్వేచ్ఛనిస్తూ, ఈ చిత్రానికి దర్శకత్వ భాధ్యతలను నాకివ్వడం నేను చేసుకున్న అదృష్టం. నన్ను నమ్మిన నిర్మాత నమ్మకాన్ని వమ్ము చేయకుండా నటీనటులు, సాంకేతిక నిపుణులందరి సహకారంతో షూటింగ్ పూర్తి చేశామని తెలిపారు.

నిర్మాత షేక్ బాబు సాహెబ్ మాట్లాడుతూ, దర్శకుడికి టెక్నికల్ నాలెడ్జి కన్నా, నేటి సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన ఎక్కువుండాలనుకునేవాన్ని . ఇవన్నీ దర్శకుడు భార్గవ లో పుష్కలంగా ఉన్నాయన్న నమ్మకంతోనే అతన్ని దర్శకుడిగా ఎన్నుకోవడం జరిగింది. నేను ఊహించినట్లే స్త్రీ వివక్ష పైన, నేను రచించిన కథకు అనుగునంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా, మెచ్చేలా చిత్రీకరించి పూర్తి న్యాయం చేశాడని చెబుతూ .. ఇప్పటికే డబ్బింగ్ పూర్తి చేసుకుని , రీ-రికార్డింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అతి త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

నటీనటులు:-
శ్రీ హర్ష, ప్రియ, రఘు, కవిత , ఆర్యన్ , రేఖ, కుషాల్, అనోన్య, మణి చందన, పూజ (ముంబాయి) జ్యోతి, నాగలక్ష్మి ఇంజి , చైతన్య, రాకెట్ రాఘవ (జబర్దస్త్), రాము (జబర్దస్త్), కోటేష్ మానవ్, శ్రీనివాసులు, నిట్టల శ్రీ రామమూర్తి, చలపతిరావు , మల్లాది భాస్కర్, రవిశంకర్, కృష్ణమోహన్ రాజు, జయరాం, శ్రీకాంత్, అర్జున్ రాజు, రజని, సిరి, మాస్టర్ అన్షీ శుక్లా , మాస్టర్ ధీరజ్

సాంకేతిక వర్గం:
డైరెక్టర్‌ అఫ్ ఫోటోగ్రఫీ : యస్ .డి .జాన్ ,
సంగీతం – ప్రభు ప్రవీణ్ లంక (నాని),
ఆర్ట్: విజయకృష్ణ
ఎడిటింగ్: సునీల్ మహారాణా ,
పాటలు:- శ్రీరామ్ తపస్వి, షేక్ బాబు సాహెబ్ (బాబుషా),
మేకప్:- బాలరాజు,
కాస్టూమ్స్ – డి. నాగేశ్వరరావు,
స్టిల్స్ -శ్రీను
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ :- యమ్. రమేష్

డైరెక్షన్ డిపార్ట్మెంట్ :- నరేష్ కూరాకుల , యమ్. కృష్ణ, చిన్నతిమ్మిరాజు.
కో-డైరెక్టర్స్ :- రామారావు శీతిరాల, గోలి వెంకటేశ్వర్లు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :- షేక్ హమీద్ బాబు (బబ్లు)
కథ , నిర్మాత : షేక్ బాబు సాహెబ్ (బాబుషా)
డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భార్గవ గొట్టిముక్కల.