Category Archives: Movie News

Ram’s Royal look triggers speculation

Category : Movie News Movies

Even while actor Ram Pothineni has been shooting for his forthcoming film, Red, the actor has been in the news once again!

Wait… but it’s for an interesting reason!

The Smart Shankar star has posted a photo of his in a regal look! This photo has not only floored his fans but seeing Ram in this regal look also got a lot of reactions from trade and in the industry asking whether this look is from his forthcoming film

But before everyone jumps the gun, Ram gives a back-story of the episode.

Almost two decades ago, when Ram was 10, photographer Karthik Srinivasan asked the actor to pose for him. However, the actor wasn’t too keen to get clicked. But somehow Karthik managed to convince Ram and capture his moods. Interestingly, that was Ram’s first tryst under the camera!

Cut to present, after 20 years, Ram has again posed for the now renowned celebrity photographer, Karthik. The theme of the Calendar shoot was The Royals 2020. And Ram is seen flaunting a full grown beard and moustache with long locks.

No wonder, the regal look has been making the fans go crazy on social media.

“Ram’s association with Karthik goes back a long way. And both were glad to team up again when there was an opportunity to collaborate recently,” informs a source.


మాస్ మహారాజ రవితేజ డిస్కోరాజ నుండి మూడో పాట రమ్ పమ్ బమ్ విడుదల !!!

మాస్ మహా రాజ ర‌వితేజ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల ఫేం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న డిస్కో రాజా సినిమాని రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఫేమ్‌ నభా నటేశ్, పాయల్‌ రాజ్‌పుత్‌ లు తాన్యా హోప్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలలో నటింస్తున్న ఈ సినిమాకి స్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నా ఈ సినిమాలోని మూడో పాట హైదరాబాద్ లో పాత్రికేయుల సమావేశంలో విడుదల అయ్యింది. ఈ కార్యక్రమంలో వి.ఐ. ఆనంద్, సునీల్, నభ నటేష్, తమన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు విఐ. ఆనంద్ మాట్లాడుతూ….
డిస్కో రాజా అనే సినిమా ఆడియన్స్ కొత్త అనుభూతిని ఇస్తుంది. రవితేజ గారి క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. తమన్ అందించిన సాంగ్స్ ఈ మధ్య పాపులర్ అయ్యాయి, అలాగే మా సినిమా కోసం తమన్ మరో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చాడు. రమ్ పమ్ బమ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది అన్నారు.

తమన్ మాట్లాడుతూ….
రమ్ పమ్ బమ్ సాంగ్ చేస్తున్నప్పుడు ఛాలెంజింగ్ గా తీసుకున్నాను, ఇప్పుడు సాంగ్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, గుడ్ రెస్పాన్స్ లభిస్తోంది, ఇదంతా చూస్తుంటే కష్టం మర్చిపోయాను. డిస్కో రాజా సినిమాకు మంచి పాటలు చేసే అవకాశం లభించింది. ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన ఢిల్లీవాలా, నువ్వు నాతో సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించిందన్నారు.

సునీల్ మాట్లాడుతూ…
రవితేజ గారితో నేను కొంత గ్యాప్ తరువాత చేసిన సినిమా ఇది. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఆనంద్ గారు డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తీశాడు, ఆడియన్స్ కు ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ మూవీలా ఉంటుంది అన్నారు.

నభ నటేష్ మాట్లాడుతూ…
రవితేజ గారితో వర్క్ చెయ్యడం మర్చిపోలేని అనుభూతి, ఈ సినిమాలో నా పాత్ర పేరు నభ, మీ అందరికి నచ్చుతుంది. ఢిల్లీ వాలా సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సాంగ్ లో నా డ్యాన్స్ మూమెంట్స్ బాగుంటాయి. జనవరి 24న విడుదల కానున్న డిస్కో రాజా సినిమాను అందరూ చూసి సపోర్ట్ చెయ్యాలని కోరారు.


నాన్ బాహుబలి 2 రికార్డ్స్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో !!!

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురం లో సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ , డాన్స్ , యాక్షన్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. మరోసారి త్రివిక్రమ్ తన మార్క్ డైలాగ్స్, స్టొరీ, స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడు. విడుదలైన అన్ని చోట్లా పాజిటీవ్ టాక్ తో దూసుకెళుతోంది.

అల వైకుంఠపురంలో సినిమా నైజాం, వైజాగ్ , కృష్ణ , వెస్ట్ , సీడెడ్ , గుంటూరు , నెల్లూరు వంటి ఏరియాల్లో నాన్ బాహబలి 2 రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. 3వ రోజు షేర్ కి 8 ఏరియాలు, 4వ రోజు షేర్ కి
7 ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చెయ్యడం విశేషం. ఓవర్సీస్ లో విడుదలైన చిత్రాల్లో అల వైకుంఠపురంలో నెంబర్ 1 స్థానంలో దూసుకెళుతోంది, ఈ శుక్రవానికి 2 మిలియన్ క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పండక్కి విడుదలైన చిత్రాల్లో టికెట్స్ దొరకడం లేదని పబ్లిక్ అనుకుంటున్నారు. సంక్రాంతి సినిమాల్లో టిక్కెట్లు దొరకనంతగా హౌస్ ఫుల్స్ అవ్వడం అల వైకుంఠపురం చిత్రానికే సాధ్యం అయ్యింది.


షూటింగ్ పూర్తి చేసుకున్న”సముద్రుడు”

కీర్తన ప్రొడక్షన్స్ పతాకం ఫై బదావత్ కిషన్ నిర్మాత గా నగేష్ నారదాసి దర్శకత్వంలో నిర్మిస్తున్న “సముద్రుడు” చిత్రం నిరాటంకంగా 25 రోజులపాటు చీరాల ఓడరేవు సముద్ర తీరంలో రెండవ షెడ్యూల్ ముగించింది.3 పాటలు మినహా పూర్తి షూటింగ్ ముగిసిందని.అతి త్వరలో పాటలు ఫారిన్ లో చిత్రికరణ జరుగుతుందని దర్శకుడు నగేష్ నారదాసి తెలిపారు.చీరాల ప్రజలు చూడటానికి వెల్లువలా తరలివచ్చిన అక్కడి ప్రజలు కానీ పోలీస్ వ్యవస్థ గాని,ex ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ గారు తదితర పెద్దలు సంపూర్ణంగా సహకరించారని.చిత్రం ఆధ్యంతం అనుకున్నదానికంటే అద్భుతంగా వచ్చిందని నిర్మాత తెలిపారు.మత్సకారుల బ్యాక్ డ్రాప్ లో పూర్తి కమర్షియల్ హంగులతో చిత్రికరణ జరిగిందని తెలిపారు.ఈ చిత్రానికి శ్రీ రామోజు జ్ఞానేశ్వర్,సోములు,రామారావు లు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో రమాకాంత్ హీరోగా భాను శ్రీ (బిగ్ బాస్),అవంతిక లు హీరోయిన్లుగా నటిస్తుండగా సుమన్,రామరాజు,సుమన్ శెట్టి,సమ్మెట గాంధీ,(జూనియర్) రాజశేఖర్,చిత్రంశ్రీను, శ్రావణ్,జబర్దస్త్ శేషు,రాజ ప్రేమి,తేజ రెడ్డి,దిల్ రమేష్,డానియెల్,మల్లేష్,ప్రభావతి,గణేష్,కిషోర్,సిరిరాజ్ తదితరులు నటిస్తున్నారు.సంగీతం:సుభాష్ ఆనంద్,కెమెరా:వాసు,ఫైట్స్:సతీష్,నందు,పి.ఆర్.ఓ:బి.వీరబాబు,డాన్స్:అనీష్,ఎడిటింగ్:బుల్ రెడ్డి,నిర్మాత:బదావత్ కిషన్,కధ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం:నగేష్ నారదాసి.


‘క్షీర సాగర మథనం’

‘క్షీర సాగర మథనం’
హీరోయిన్ అక్షత సోనావని
ఫస్ట్ లుక్ విడుదల చేసిన పాయల్

దేవతలు-రాక్షసులు సాగరాన్ని మధించినప్పుడు అమృతంతోపాటు హాలాహలమూ వచ్చింది. మన మనసులు మధించినప్పుడు కూడా మంచి ఆలోచనలతోపాటు, చెడు ఆలోచనలు కూడా ఉద్భవిస్తాయి. ఈ అంశాన్ని ఆధారం చేసుకొని బహుముఖ ప్రతిభాశాలి అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆహ్లాదకర చిత్రం ‘క్షీర సాగర మథనం’. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను అత్యద్భుతంగా తెరకెక్కిస్తూ రూపొందుతున్నఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటిస్తున్నారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు. ప్రముఖ యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఈ చిత్రం టైటిల్ లోగోను విడుదల చేయగా- యువ కథానాయకుడు అడివి శేష్ ‘క్షీరసాగరమథనం’ పోస్టర్ ను లాంచ్ చేశారు. తాజాగా చిత్ర కథానాయకి అక్షత సోనావని ఫస్ట్ లుక్ సంచలన కథానాయకి పాయల్ రాజ్ పుట్ విడుదల చేసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపింది.

శేఖర్ కమ్ముల మొదలుకుని గౌతమ్ తిన్ననూరి వంటి సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ టర్న్ డ్ ఫేమస్ డైరెక్టర్స్ కోవలో సినిమా రంగంలో తనదైన ముద్ర వేయాలనే వజ్ర సంకల్పం కలిగిన ఐ.టి.రంగ నిపుణులు ‘అనిల్ పంగులూరి’ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గుండెల్నిమెలిపెట్టే గాఢమైన అనుభూతుల్ని పంచి.. పలు రకాల భావోద్వేగాలతో మనసుల్ని రంజింపచేసి.. చాలా రోజుల తరువాత మరో మంచి సినిమా చూశామనే సంతృప్తిని మిగిల్చే చిత్రాన్ని అందిస్తున్నామనే నమ్మకం, గర్వం మాకుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
చరిష్మా శ్రీకర్, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న

ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్. వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష్ షనమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, పీఆర్వో: ధీరజ అప్పాజీ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి!!


వ‌రంగ‌ల్‌లో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్

వ‌రంగ‌ల్‌లో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్

సూపర్‌స్టార్‌ మహేశ్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన‌ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటించారు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న సినిమా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తున్న ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ సెల‌బ్రేష‌న్స్‌ను శ‌నివారం సాయంత్ర 5 గంట‌ల‌కు వ‌రంగ‌ల్ హ‌న్మ‌కొండ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రు స్టేడియంలో నిర్వ‌హిస్తున్నారు. ఈ వేడుక‌ల్లో ఎంటైర్ యూనిట్ పాల్గొంటున్నారు.


బొంబాట్‌లో `ఇష్క్ కియా…` సాంగ్‌ను విడుద‌ల చేసిన మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

క‌ళ్ల‌లోన దాచినానులే.. రెప్ప‌దాటి పోలేవులే
కాటుకైన పెట్ట‌నులే.. నీకు అంటుకుంటుంద‌ని
పెద‌వికే తెల‌ప‌ని ప‌లికె నీ పేరునే ప్రియ‌త‌మా.. ఓ ప్రియ‌త‌మా
లోక‌మే ఆన‌దు మైక‌మే వీడ‌దు.. తెలుసునా ఇది ప్రేమేన‌ని
ఎందుకిలా ఓ ఎందుకిలా….. ఇష్క్ కియా అంటూ త‌న ప్రేమ‌ను హీరోయిన్ హీరోకు వ్య‌క్తం చేస్తే ఎలా ఉంటుంది? ఎంతో అందంగా ఉంటుంది. ఆ అందం చూసేయాలంటే `బొంబాట్‌` సినిమా చూసేయాల్సిందే.

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై `ఈన‌గ‌రానికి ఏమైంది` ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్స్‌గా రాఘ‌వేంద్ర వర్మ(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో విశ్వాస్ హ‌నూర్‌క‌ర్ నిర్మిస్తోన్న‌ చిత్రం `బొంబాట్`. జోష్ బి సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెండో లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ విడుద‌ల చేశారు. పాట విన‌డానికి అహ్లాదంగా ఉంద‌ని చిత్ర యూనిట్‌ను త‌మ‌న్ అభినందించారు.

రామాంజ‌నేయులు రాసిన ఈ పాట‌ను సునీతా సార‌థి శ్రావ్యంగా ఆల‌పించారు. హీరో సుశాంత్‌, సిమ్రాన్ మ‌ధ్య సాగే ల‌వ్ మెలోడీ ఇది. లిరిక‌ల్ వీడియోలో చూపించిన కొన్ని విజువ‌ల్స్ క్యూట్‌గా అనిపిస్తున్నాయి. ప్రేయ‌సి త‌న మ‌న‌సులోని ప్రేమ‌ను ప్రేమికుడికి ఎంత అందంగా చెప్పింద‌నే స‌న్నివేశంలో వ‌చ్చే పాట ప్రేక్ష‌కుల‌ను త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు అంటున్నారు.
రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు సినిమాను తీసుకురావ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.


తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుక ఇచ్చిన జీ 5

జనవరి 13,2020 హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వివిధ భాషలలో అధిక వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్న జీ5 . సంక్రాంతి పండుగ సందర్భంగా త్వరలో తెలుగు ప్రజల ముందుకు తీసుకురానున్న నాలుగు వెబ్ సిరీస్ వివరాలను మీడియా మిత్రులతో పంచుకున్నారు.

జీ5 గతంలో విడుదల చేసిన గాడ్,హై ప్రిస్టిస్, కైలాసపురం,Mrs.సుబ్బలక్ష్మి,నర్డ్,హవాలా, బీటెక్,ఎక్కడికి ఈ పరుగు, వాట్సాప్ పనిమనిషి , చిత్ర విచిత్రం ,నాన్న కూచి వంటి వినూత్నమైన వెబ్ సిరీస్ లను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు జీ5 ప్రోగ్రామింగ్ హెడ్ అపర్ణ అచరేకర్ కృతజ్ఞతలు తెలిపారు. తమ వద్దకు ఎవరైనా మంచి కథతో వస్తే తమను తప్పక ఎంకరేజ్ చేస్తామని అన్నారు.2020 ప్రథమ భాగంలో రానున్న తమ వెబ్ సిరీస్ ల గురించి తెలిపారు.

చదరంగం : ఒక పొలిటికల్ డ్రామా. తన ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల లోకి వచ్చిన ఒక నటుడు.తన లక్ష్యం కోసం ఏం చేశాడు అన్నది ఈ చదరంగం కథ. ఈ సిరీస్ కు రాజ్ అనంత దర్శకత్వం వహించారు.ఇందులో శ్రీకాంత్, సునైన,నాగినీడు ముఖ్య పాత్రలలో నటించారు.మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ బ్యానర్ పై దీన్ని నిర్మించారు.చదరంగం ఫిబ్రవరి 20వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానున్నది.

లూసర్ : ఒక స్పోర్ట్స్ డ్రామా.ఇందులో క్రికెటర్,బ్యాడ్మింటన్ ప్లేయర్,రైఫిల్ షూటర్ అవ్వాలి అనుకునే ముగ్గురు వ్యక్తులు ఆటలలో ఉండే రాజకీయాల వల్ల ఎలా ఇబ్బందులు పడ్డారో ఎన్ని కష్టాలను ఎదురుకున్నారో అన్నది ఈ లూసర్ కథ.ఇందులో ప్రియదర్శి, కల్పిక, షియాజి షిండే, శశాంక్ ముఖ్య పాత్రలలో నటించారు. లూసర్ కు అభిలాష్ రెడీ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ వారు దీన్ని నిర్మించారు.లూసర్ మార్చి లో ప్రేక్షకుల ముందుకి రానున్నది.

ఎక్స్పైరీ డేట్ : ఇది తెలుగు,హిందీ బైలింగ్వల్ క్రైమ్ థ్రిల్లర్.తనను మోసం చేసినందుకు భర్త భార్యను ఏం చేశాడో అన్నది ఎక్స్పైరీ డేట్ కథ. స్నేహ ఉల్లాల్, మధు శాలిని, టోనీ లుక్, అలీ రెజ్జ ముఖ్య పాత్రలలో నటించారు.ఎక్స్పైరీ డేట్ కు శంకర్ మార్తాండ దర్శకత్వం వహించారు. శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు.ఎక్స్పైరీ డేట్ జూన్ లో ప్రేక్షకుల ముందుకి రానున్నది.

అమృతం ద్వితీయం : నవ్వుల ఆణిముత్యం మైన అమృతం మరోసారి సీక్వెల్ తో మన ముందుకు వస్తున్నది. గత అమృతం లో భాగమైన హర్షవర్ధన్, శివ నారాయణ ,వాసు ఇంటూరి లతో ఎల్బీ శ్రీరామ్, సత్య కృష్ణ మనల్ని నవ్వించడానికి చేతులు కలిపారు. ఈ ద్వితీయ భాగం కి గంగరాజు కలం పట్టగా, సందీప్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. గంగరాజు , సందీప్ సంయుక్తంగా లైట్ బాక్స్ మీడియా బ్యానర్ లో ఈ ఉగాదికి అంటే 25 మార్చి న నవ్వించడానికి జీ5 ఉన్న వారి ఇంటికి వస్తున్నారు.


హీరో శర్వానంద్ విడుదల చేసిన P3 పటారుపాలెం ప్రేమ కథ థర్డ్ సాంగ్.

జె.ఎస్ ఫిలిమ్స్ పతాకం పై దొరైరాజు వూపాటి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం “పటారుపాళెం ప్రేమ కథ” శ్రీ మానస్, సమ్మోహన హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమాలో “మళ్ళీ మళ్ళీ వచ్చి పోరాదే – ముద్దిచ్చి పోరాదే” అనే పాటను హీరో శర్వానంద్ విడుదల చేసారు. ఈ సంధర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ నాకు మంచి మిత్రుడు, ఆయన నాతో వీధి థ స్ట్రీట్ అనే సినిమా తీసిన దర్శకులు దొరైరాజు గారు, ఆయన దర్శకత్వం లో వస్తున్న సినిమా పాటను నేను విడుదల చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ పాటను నేను విన్నాను పాట చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. పాట వింటుంటే ఎదో తెలియని ఒక అనుభూతి కలిగింది. మ్యూజిక్ లవర్స్ అందరూ ఈ పాటను వినండి,మీకూ నచ్చుతుంది, పెద్ద హిట్టు చేయండి, అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్టు కావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.
దర్శకుడు దొరైరాజు మాట్లాడుతూ ఈ సాంగ్ నా హీరో శర్వానంద్ లాంచ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, నేను దర్శకత్వం వహించిన వీధి థ స్ట్రీట్ అనే సినిమాతో శర్వా హీరోగా కెరియర్ స్టార్ట్ చేసి ఈరోజు సక్సెస్ ఫుల్ స్టార్ గా ఎదగడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా సినిమా పాట విడుదల చేసినందుకు శర్వా కు స్పెషల్ థాంక్స్ చెబుతూ, ఈ పాట చాలా బాగుంటుంది, పాట వినే ప్రతి మ్యూజిక్ లవర్ తన గడిచిన లైఫ్ గురించి ఆలోచిస్తారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలను టిక్ టాక్ అండ్ హలో ఆపిలికేషన్ లో కూడా పెద్ద హిట్టు చేసిన యూత్ కి, ప్రేక్షకులకు థాంక్స్. ఆ రెండు పాటలను మించి మీకు ఈ పాట ఇంకా బాగా నచ్చుతుంది అనే నమ్మకం నాకు ఉంది, ఈ పాటను కూడా విని మీరు పెద్ద హిట్టు చేయాలని కోరుకుంటున్నాను.

హీరో శ్రీ మానస్ మరియ హీరోయిన్ సమ్మోహణ లు మాట్లాడుతూ మేము కొత్తవాళ్ళమైన దర్శకులు దొరైరాజు గారు కథను నమ్మి మాతో సినిమా తీశారు, కథ అంత బాగుంటుంది. మా సినిమాలో థర్డ్ సాంగ్ శర్వానంద్ సార్ చేతులు మీదుగా విడుదల అవ్వడం చాలా సంతోషంగా ఉంది. శర్వా సార్ కి మా ప్రత్యేక ధన్యవాదాలు, ఈ సాంగ్ అందరూ వినండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అని తెలిపారు. అయితే మధ్య కాలంలో ఈ సినిమా సోషల్ మీడియాలో, టిక్ టాక్ లలో సినీ అభిమానులను బాగా అలరిస్తుంది.

ఈ సినిమాకు కెమెరా ఆర్ కె ములింటి. వి లతా రెడ్డి, వి సౌజన్యా దొరై రాజు, బి. ఆర్ బాలు, కె రామకృష్ణ ప్రసాద్ లు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను జె.ఎస్ రెడ్డి సమర్పిస్తున్నారు. కొన్ని యదార్థ సంఘటనలను ఆధారం చేసుకుని, పరువుహత్యాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది, అతి త్వరలో గ్రాండ్ గా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.