Category Archives: Movie News
- January 12, 2020
-
-
-
-
జనవరి 24న ‘చీమ – ప్రేమ మధ్యలో భామ’ విడుదలకు రెడీ
Category : Latest Events Latest Reviews Movie News Movies Sliders
జనవరి 24న ‘చీమ – ప్రేమ మధ్యలో భామ’ విడుదలకు రెడీ
* సంక్రాంతి తరువాత ‘చీమ – ప్రేమ మధ్యలో భామ’ సందడి షురూ
* నందమూరి బాలకృష్ణగారి అభిమానులకు ఓ నజరానా
మాగ్నమ్ ఓపస్ (Magnum Opus ) ఫిలిమ్స్ పతాకంపై శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు దర్శకత్వంలో ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘చీమ – ప్రేమ మధ్యలో భామ!’. అమిత్, ఇందు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరి 24న విడుదలయ్యేందుకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు మాట్లాడుతూ.. ‘‘చెప్పకూడని రహస్యం – హీరో నందమూరి బాలకృష్ణగారి అభిమానులు మా సినిమా చూస్తే, థియేటర్లో చప్పట్లు, ఈలలు గ్యారంటీ! ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం ఈ జనవరి 24న తెలుస్తుంది. సినిమా అంతా చాలా బాగా వచ్చింది.. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు.
నిర్మాత ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ‘‘ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా సినిమా ‘చీమ – ప్రేమ మధ్యలో భామ!’ను దర్శకుడు విలక్షణమైన శైలిలో తెరకెక్కించారు. పసందైన పాటలతో, అద్భుతమైన కథనంతో సాగుతూ పెద్ద సినిమాలకు ధీటుగా అందరినీ అలరిస్తుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్‌తో పాటు మంచి ప్రశంసలు అందాయి. జనవరి 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను..’’ అన్నారు.
హీరోయిన్ ఇందు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్ – ఎందుకంటే ఇది నా తొలి సినిమా! యువ ప్రేమికుల భావావేశాలతో సాగే సృజనాత్మకమైన కథ అందంగా ఉండి అందరికీ కనెక్ట్ అవుతుంది. చీమ హీరో కావడం ఇంకా స్పెషల్! తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
అమిత్, ఇందు, సుమన్, హరిత, పురంధర్, వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్, కిషోర్ రెడ్డి, వెంకటేశ్, సురేష్ పెరుగు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రవి వర్మ, సింగర్స్: ఎస్.పి. బాలసుబ్రమణ్యం, గీతా మాధురి; సినిమాటోగ్రఫీ: ఆరిఫ్ లలాని, ఎడిటర్: హరి శంకర్, నిర్మాత : ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ; కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు.
-
-
‘భీష్మ’ టీజర్ విడుదల
Category : Latest Events Latest Reviews Movie News Movies Sliders
‘భీష్మ’ టీజర్ విడుదల
‘భీష్మ’
నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రం టీజర్ ఈరోజు ఉదయం విడుదల అయింది
చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ …ఈ చిత్రం టీజర్ ను ఈరోజు విడుదల చేయటం జరిగింది. పూర్తి స్థాయి వినోద ప్రధానంగా ఈ చిత్రం ‘భీష్మ’ఉంటుంది అనటానికి ఈ టీజర్ ఒక శాంపిల్ మాత్రమే. దానికి తగినట్లుగానే చిత్రం కధ,కధనాలు,సన్నివేశాలు,సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల. ఈ ఏడాది ఫిబ్రవరి లో చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
నటీ,నటులు :
నితిన్,రష్మిక మండన,నరేష్,సంపత్,రఘుబాబు,బ్రహ్మాజీ,నర్రా శ్రీనివాస్,వెన్నెల కిషోర్,అనంత నాగ్,శుభలేఖ సుధాకర్,జస్సెన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్,రాజశ్రీ నాయర్,ప్రవీణ తదితరులు నటిస్తున్నారు.
మ్యూజిక్ : మహతి స్వర సాగర్ ,డి .ఓ .పి : సాయి శ్రీరామ్ , ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్, ఎడిటర్ : నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం(వెంకట్ ),
సమర్పణ : పి.డి .వి. ప్రసాద్ ,
ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగ వంశి ,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : వెంకీ కుడుముల.
- January 11, 2020
-
-
Sarileru Neekevvaru Review: Witness Never Before…. Ever After Mahesh Babu on Big Screen
Category : Latest Reviews Movie News Movie Reviews Sliders
Sarileru Neekevvaru Review: Witness Never Before…. Ever After Mahesh Babu on Big Screen
Cast: Mahesh Babu, Rashmika, Prakash Raj, Rajendra Prasad, Vijayashanti, etc
Director: Anil Ravipudi
Producer: Anil Sunkara, Dil Raju, Mahesh Babu
Music: DSP
Mahesh Babu and Anil Ravipudi teamed up together for the first time for Sarileru Neekevvaru. Right from the announcement, the film has successfully gained momentum with respect to the glory and image due to its casting and eventually the trailer. Now let us see how entertaining and engaging is Sarileru Neekevvaru.
Story:
Ajay (Mahesh Babu) is a sincere military officer. His colleague (Satyadev) gets hurt in a military operation and lands in hospital. Knowing that his sister’s marriage is on cards, Ajay comes to Kurnool to support colleague’s family. He happens to meet Ajay’s mother Bharati (Vijayashanthi) there and finds she is in trouble from a local politician (Prakash Raj).
The rest of the movie is how he saves Bharathi and what are the incidents he faces during his stay in Kurnool. The film also depicts Mahesh’s journey from Kashmir to Kurnool during which he meets his love Samskruthi (Rashmika). This is the main plot where all the other characters stand as peripherals.
Performances:
Mahesh Babu, who is known for his hilarious dialogue delivery, has portrayed something new this time. Vijayashanti is good in her dignified character role. Needless to say about Prakash Raj. Rashmika brings some laughs.
Technical Aspects:
Music by DSP leaves the audience in whistles especially for Mind Block and Dang Dang. But Cinematography is good. Production values are too good.
Plus Points:
· Mahesh Babu’s never before acting & dance moves
· Interval bang
· Casting
· Simple Story
· Music & BGM
Minus Points:
· Unnatural comedy during train scene
· Weak climax
Conclusion:
On the whole, Sarileru Neekevvaru is a celebration of the Mahesh Babu from the past. Take a bow Mahesh Garu and Anil Ravipudi Garu.
- January 10, 2020
-
-
‘పంగా’లో తల్లి పాత్ర చెయ్యడం గొప్పగా అనిపించింది – కంగనా రనౌత్
Category : Latest Events Latest Reviews Movie News Sliders
సూపర్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా అశ్వినీ అయ్యర్ తివారీ డైరెక్ట్ చేసిన సినిమా ‘పంగా’. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జస్సీ గిల్, రిచా చద్దా కీలక పాత్రలు పోషించారు. జనవరి 24న విడుదలవుతున్న సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో కంగన, అశ్విని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వాళ్లు జవాబిచ్చారు.
కంగనా రనౌత్
‘పంగా’లో మీ పాతేమిటి?
ఒక మిడిల్ క్లాస్ విమన్గా, అందులోనూ బిడ్డల తల్లిగా నటించా. తల్లి పాత్ర పోషించడం చాలా గొప్పగా అనిపించింది. మహిళ సాధికారత కోసం చాలా సినిమాల్లో నటించాను.. కానీ ‘మణికర్ణిక’ తరువాత ఈ సినిమాలో నేను ఓ తల్లిగా జీవించాను.
డైరెక్టర్ అశ్వినితో పనిచెయ్యడం ఎలా అనిపించింది?
అశ్విని మంచి డైరెక్టర్. నా గురించి తనకు చాలా మంది అనేక విషయాలు చెప్పినా వాటిని అశ్విని ఎప్పుడు పట్టించుకోలేదు. వర్క్పై మంచి ఫోకస్, క్లారిటీ ఉన్న డైరెక్టర్. నేను చాలా మందితో వరుసగా సినిమాలు చేశాను. కంగనాతో పని చేయడం కష్టం అని మాట్లాడిన వారికి అశ్విని లాంటి వారే సమాధానం చెప్తున్నారు.
ఈ కథలో మీకు నచ్చిన విషయమేమిటి?
ఇందులో నాది నేషనల్ లెవల్ కబడ్డీ క్రీడాకారిణి పాత్ర. ఆ ఆటకూ, కుటుంబ బాధ్యతలకూ మధ్య నలిగే పాత్ర. అశ్విని స్క్రిప్ట్ చెప్పినప్పుడు, ఆ క్యారెక్టరైజేషన్, అందులోని కాన్ఫ్లిక్ట్ బాగా నచ్చాయి. జనరల్గా సెట్ కి వెళ్లే ముందే నేను సీన్ గురించి తెలుసుకుంటాను. కానీ ‘పంగా’ సమయం లో నా పరిస్థితులను అర్ధం చేసుకుని.. నాకు ప్రతి విషయాన్ని అశ్విని వివరంగా చెప్పేవారు.
ఇప్పుడు జయలలిత బయోపిక్ చేస్తున్నారు కదా.. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై మీ అభిప్రాయమేమిటి?
అంతకుముందు ‘మణికర్ణిక’, ఇప్పుడు జయలలిత బయోపిక్ ‘తలైవి’ సినిమా చేస్తూ, హైదరాబాద్, చెన్నై తిరుగుతూ నేను పూర్తి సౌత్ ఇండియన్గా మారిపోయా. సౌత్ ఇండియాలో గొప్ప గొప్ప సినిమాలు వస్తున్నాయి. ఇక్కడి సినిమా కల్చర్ నాకు బాగా నచ్చింది.
అశ్విని అయ్యర్
సమాజంలో మహిళా సాధికారికత ఎలా ఉందని అనుకుంటున్నారు?
మన సమాజంలో మహిళ సాధికారత గురించి చర్చిస్తున్నాం కానీ వాటి అమలు అంతగా లేదు.
ఇంట్లో భర్త రోల్ ఎలా ఉండాలంటారు?
ఈ సినిమాలో కంగన పేరు జయా నిగం. ప్రతి ఇంట్లో ఒక జయ వుంది. మగవాళ్లకు గర్ల్ ఫ్రెండ్ లో ప్రతి విషయం నచ్చుతుంది. ఒకసారి పెళ్లై పిల్లలు పుట్టాక మాత్రం మహిళకు సంబంధించిన ప్రతి విషయం మారి పోతుంది. కానీ ఇవాళ్టి రోజున పరిస్థితి అది కాదు.. పిల్లల పెంపకం ఇద్దరి బాధ్యత. భర్తే భార్యకి సపోర్ట్ చేయకపోతే ఇంక ఎవరు చేస్తారు!
ఈ సినిమాతో ఆ సందేశం ఇద్దామనుకున్నారా?
కంగనా వంటి సూపర్ స్టార్ ద్వారా మార్పు రావాల్సిన అవసరాన్ని చెప్పించడం బావుంటుంది. ఈ సినిమా ద్వారా కొంతమందైనా ఆలోచిస్తే, దీన్ని తీసిన ప్రయోజనం నెరవేరినట్లే. ఎందుకంటే దాదాపు 40 శాతం మహిళలు పిల్లలు పుట్టాక జాబ్ మానేస్తున్నారని గణాకాలు చెబుతున్నాయి.
కంగననే ఈ పాత్రకు ఎందుకు ఎంచుకున్నారు?
కంగన ఎలాంటి నటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంగనా లాంటి నటి మాత్రమే ఇలాంటి ఒక స్క్రిప్ట్ కి న్యాయం చేస్తారు అనిపించింది. ఆమెకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు వెంటనే ఒప్పుకున్నారు. కబడ్డీ అనేది కామన్మ్యాన్ ఆట. అందుకే మేము కండల గురించి చెప్పలేదు. తల్లిగా, క్రీడాకారిణిగా జీవించే వాళ్లు కావాలని ఇందులో చెప్పాం.
ఆమెతో పనిచేయడం ఎలాంటి అనుభూతినిచ్చింది?
ఈ సినిమా కోసం దాదాపు 2 ఏళ్ళు పనిచేసాము. ఇప్పుడు మేము ఒక కుటుంబంలా మారిపోయాం. సెట్స్పై తను పూర్తి ప్రొఫెషనల్. బయట మేం స్నేహితులమై పోయాం. నేను తనతో జీవిత కాలం సరిపోయే ఎమోషనల్ అగ్రిమెంట్ చేసుకున్నాను. యాక్టర్, డైరెక్టర్ మధ్య మంచి సంబంధాలు ఉండాలి. ఒక కుటుంబంలో ఎప్పుడు, ఎవరు కోప్పడకుండా ఉంటారా! ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి
-
-
‘అల వైకుంఠపురములో’ థియేటర్స్ నుంచి జనం ఒక పరిపూర్ణమైన అనుభూతితో,ఆనందంతో బయటకు వస్తారు! – మాటల మాయాంత్రికుడు, దర్శకుడు ‘త్రివిక్రమ్’
Category : Latest Events Latest Reviews Movie News Sliders
‘అల వైకుంఠపురములో’ థియేటర్స్ నుంచి జనం ఒక కంప్లీట్ ఫీలింగ్తో, ఆనందంతో బయటకు వస్తా రని చెప్పారు త్రివిక్రమ్. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి ఆయన దర్శకుడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్,,పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించిన ఆ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఆ సినిమా గురించి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు…
* ఎవరికైనా కెరీర్ స్టార్ట్ అయ్యేటప్పుడు తనలో ఉన్న ఆలోచనలన్నీ అందరికీ చెప్పెయ్యాలనీ, వాళ్లందరి ప్రశంసలూ పొందాలనీ, తన ఆలోచనలతో వాళ్లందరూ ఏకీభవించాలని ఉంటుంది. కొన్ని సంవత్సరాలు గడిచాక.. ప్రశంస తగ్గిపోతుంది, అంచనాలు పెరిగిపోతాయి. ఎప్రిసియేషన్ తగ్గిపోవడం మూలంగా, క్రియేట్ చేసేవాళ్లకు మన పనిలో ఏమైనా లోపముందా అనిపించే ఛాన్స్ ఉంది. దాంతో దారి మార్చుకొని ఎందుకూ పనికిరాకుండా పోయే ప్రమాదమూ ఉంది. లేదంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడం మూలంగా ఆ బరువుకు కుంగిపోయి, చెప్పాలనుకున్నది చెప్పలేక కుంగిపోయి, ఒక నార్మల్ లేదా సేఫ్ రూట్లోకి ఎస్కేప్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. ప్రతిసారీ ఈ రెంటినీ గెలవడానికి ఎవరైనా ప్రయత్నించాల్సిందే. ‘అరవింద సమేత’ నుంచి నా భయాలతో ఫైట్ చేస్తూ వస్తున్నా. ‘అజ్ఞాతవాసి’ ఫ్లాపైన తర్వాత అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే.. ఆయనకు అలవాటైన హ్యూమర్లోకి, ఎంటర్టైన్మెంట్లోకి వెళ్లిపోతే బాగుంటుంది కదా.. అనిపిస్తుంది. నా చుట్టూ ఉన్నవాళ్లు కూడా ముందు దానివైపే తోస్తారు. నేనది చెయ్యలేదు. అది కావాలని తీసుకున్న డెసిషన్. ఎంత పరాజయం చూసినా కానీ కొత్తగా భయపెట్టేది ఏముంటుంది! ఈ భయాన్ని గెలవాలంటే ఇదే సమయం, ఇదే స్టెప్. అందుకని సీరియస్ గా ఉండే సబ్జెక్ట్ ట్రై చేశా. అందులో కమర్షియల్ గా ఉండే సాగ్స్ కానీ, హ్యూమర్ కానీ, ట్రాక్ కానీ.. అలాంటివేవీ మైండ్లోకి కూడా రానివ్వలేదు. దాన్ని నేను బిగ్గెస్ట్ టేకెవేగా ఫీలవుతా. ‘అరవింద తర్వాత’ మళ్లీ అలాంటి కథే చెప్పకూడదు కదా.. దాన్నుంచి బ్రేక్ కావాలి కదా.. ప్రతిసారీ మనం మారడానికి ప్రయత్నించడమే. అందుకే ‘అల వైకుంఠపురములో’ సినిమా తీశా.
*సినిమాలు చూశాక ‘సరిలేరు నీకెవ్వరు’ జానర్, ‘అల వైకుంఠపురములో’ జానర్ వేర్వేరుగా ఉన్నాయని ప్రేక్షకులు ఫీలవుతారని నేననుకుంటున్నా. ట్రైలర్ లను బట్టే అవి భిన్న తరహా కథలని తెలిసిపోతుంది.
*ఈ సినిమా ప్రధానంగా ఏ పాయింట్ మీద నడుస్తుంది? కొత్తగా ఏం చెప్పారు?
మనం ఎవరికైనా స్థానం ఇవ్వగలం కానీ, స్థాయి ఇవ్వలేం. స్థాయి అనేది ఎవరికి వాళ్లు తెచ్చుకోవాల్సింది. ఇదే థాట్ ఆఫ్ ద ఫిల్మ్. దానికి ఇల్లు ఆధారం. మనం ఏ కథ చెప్పినా రామాయణ భారతాలు దాటి చెప్పలేమనేది ఈ ప్రపంచంలో అందరూ ఒప్పుకొనే మాట. వాటిని దాటైతే మనం కొత్త కథ చెప్పలేం. అందువల్ల వాటికి సంబంధించిన ఏదో ఒక ఛాయ కథలో కనిపిస్తూ ఉండవచ్చు.
*మీ బలం హ్యూమర్. ‘అరవింద సమేత’ను అందుకు భిన్నంగా తీశారేం?
కొత్త కథ ఎత్తుకోవడంలో తప్పు లేదు. అర్జునుడు బాణాలు బాగా వేస్తాడు. అవసరమనుకున్నప్పుడు, అప్పుడప్పుడు కత్తి తీయడంలో తప్పులేదు. శత్రువు మనకు బాగా సమీపానికి వచ్చినప్పుడు బాణం తీసి, ఎక్కుపెట్టి వేసే సమయం ఉండదు. అప్పుడు కత్తితీసి నెగ్గితే తప్పేమీ లేదు కదా. ఒక్కోసారి మన బలాలు లేకుండా కూడా ఫైట్ చెయ్యాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల కొత్త కథలు సమకూర్చుకోవడంలో తప్పులేదనుకుంటాను. జనంలోని ఇష్టం, అభిమానం కూడా మనల్ని బందీని చేస్తుంది. భయాన్ని గెలవడమనేది గేం ఆఫ్ లైఫ్ అంటాను.
*’అల వైకుంఠపురములో’ పేరు పెట్టడానికి ఇన్స్పిరేషన్ ఏమిటి?
పోతన గారి పద్యమే స్ఫూర్తి.
*మిమ్మల్ని ప్రేక్షకులు ఇంతగా అభిమానించడం చూస్తుంటే మీకేమనిపిస్తుంది?
*ప్రేక్షకులు అభిమానించేది మనం ఇచ్చే వర్కుని, మనల్ని కాదు. దాన్ని డిటాచ్డ్ గా చూస్తేనే, వాటినుంచి మనం విడిపోయి మనకు నచ్చిన పని చేసుకోగలం, లేకపోతే మరీ సీరియస్ అయిపోయి, స్తబ్దతకు గురవుతాం. కాబట్టి ఆ సినిమావరకు మనం ప్రజల ఇష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలి. చేసిన ఏ సినిమా కూడా నచ్చలేదని చెప్పారంటే, అప్పటిదాకా నేను చేసిన పని నేను చేసినట్లు కాదు, తర్వాత చేసేపని కూడా నేను చేసేది కాదు. ఆ క్షణానికి వాళ్లకు నచ్చదు. ప్రేక్షకులనేవాళ్లు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు. అందుకే వాళ్లను ప్రేక్షక దేవుళ్లు అంటుంటాం. థియేటర్లో లైట్లు ఆర్పిన తర్వాత కులం, మతం, జాతి.. వీటన్నిటికీ అతీతంగా తమ ముందున్న సినిమాని చూస్తారు. వాళ్లను ఏదీ ఆ టైంలో ఎఫెక్ట్ చెయ్యదు. నవ్వొస్తే నవ్వుతారు, ఆనందం వస్తే ఆనందిస్తారు. కళ్లల్లో నీళ్లొస్తే ఏడుస్తారు. ప్రేక్షక దేవుడంటే మనం తెలుసుకోవాల్సింది.. పొజిషన్ కాదు, కండిషన్. అదొక స్థితి. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఒక అమ్మాయిమీద యాసిడ్ పోస్తే వాడు దేవుడెలా అవుతాడు!
* పాటల వెనుక మీ మ్యూజిక్ టేస్ట్ ఉందా? ముఖ్యంగా ‘సామజవరగమన’ పాటలో మీ ఇన్పుట్స్ ఉన్నాయంటారు?
నాకు సంగీతం చెయ్యడం రాదు, పాడ్డం రాదు. నాలో ఎన్నో కోరికలు.. గిటారు వాయించాలని, అమ్మాయిలు నావైపు ఆరాధనగా చూడాలని.. ఉండేవి. కానీ నాకు ఏవీ రావు. నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు. ఒక్క సిద్ శ్రీరాం వాయిస్ తప్ప, లైవ్ గా ఎగ్జాక్టుగా మీరు ఏ పాటైతే ఇప్పుడు వింటున్నారో దాన్ని తమన్ నాకు వినిపించేశాడు. అప్పుడు ‘సామజవరగమన’ అనేది పెడితే బాగుంటుందని నేను సజెస్ట్ చేశానంతే. శాస్త్రి గారికి చెబితే, 45 నిమిషాల్లో పాట రాసేశారు. ఈ పాటను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని చెప్పింది బన్నీ. అప్పుడు ఆలోచించి, తమన్, సిద్ శ్రీరాం లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లు షూట్ చేసి రిలీజ్ చేశాం. కాకినాడలో షూటింగ్ జరిగేటప్పుడు బన్నీ, నేను, తమన్.. ముగ్గురం కూర్చొని.. ‘సామజవరగమన’, ‘రాములో రాములా’, ‘ఓమైగాడ్ డాడీ’ పాటల్ని ఎలా జనంలోకి తీసుకెళ్లాలని మూడు పేజీలు రాసుకున్నాం. అప్పటికి ఆ మూడు పాటలూ ట్యూన్స్ పూర్తయి ఉన్నాయి.
*’అల వైకుంఠపురములో’ సినిమా ఎలా ఉంటుందనుకోవచ్చు?
జనం థియేటర్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక కంప్లీట్ ఫీలింగ్తో, ఆనందంతో బయటకు వస్తారు. చీర నేసినవాడికి దాని అందం తెలీదు. ఒక అనుభూతితో నేసుకుంటూ వెళ్లిపోతాడు. నేనూ అంతే. నా సినిమా ఎలా ఉందో ప్రేక్షకులే చెప్పాలి. ఒక సినిమాతో నేనింత ఎత్తుకు ఎదగాలని ఏ దర్శకుడూ అనుకొని చెయ్యడు. కథ రాసేంతవరకే రచయిత దానికి రాజు. తర్వాత ఆ కథకు అతను బానిస.
* డైలాగ్స్ అలా రాయాలని ఆలోచించి రాస్తారా? ఎక్కడ కూర్చొని రాస్తుంటారు?
డైలాగ్స్ గురించి నిజంగా నేను ఆలోచించను. స్పాంటేనియస్ రచయితగా నన్ను నేను చూసుకుంటా. నేనెక్కడికో వెళ్లి రాస్తుంటానని అనుకుంటారు. నేను మా ఇంట్లోనే రాసేసుకుంటూ ఉంటాను. నేను చాలా తేలిగ్గా, ప్రశాంతంగా పనిచేయడానికి ఇష్టపడతా.
* ఈ మధ్య మీ సినిమాల్లో స్త్రీలపై గౌరవాన్ని పెంచే పాత్రలు కనిపిస్తున్నాయి. కాన్షియస్ గానే వాటికి ప్రాముఖ్యం కల్పిస్తున్నారా?
1950ల నుంచి 1970 దాకా కూడా ఇంట్లో స్త్రీలే ఇంటి బాధ్యతలు చూసుకునేవాళ్లు. అంటే పైకి చెప్పని ఒక మాతృస్వామ్య విధానం ఉండేది. ఇంటికి సంబంధించిన అన్ని పనులూ వాళ్ల ద్వారానే నడిచేవి. ’70ల తర్వాత ప్రయాణాలు పెరిగి, ఉన్న చోటు నుంచి వేరే చోట్లకు వెళ్లి ఉద్యోగాలు, వ్యాపారాలు చేయాల్సి రావడం వల్ల ఇళ్లల్లో వాళ్ల భాగస్వామ్యం తగ్గింది. తెలీకుండా మనం కూడా వేరే సంస్కృతికి ప్రభావితమవడం, మన మూలాల్ని మనం వదిలేయడం, దాంతో వాళ్లను అగౌరవపరిచేవిధంగా చూడటం, అలా మనం మగవాళ్లమే చూడ్డం వల్ల, లేని ఒక యాక్సెప్టెన్స్ రావడం, వాళ్లు మౌనంగా ఉండటాన్ని కూడా మనం యాక్సెప్టెన్స్ కింద చూడ్డం వంటివి 35 ఏళ్లు నడిచాయి. నాకు తెలిసి ఇప్పుడవి మారిపోయాయి. ‘అత్తారింటికి దారేది’ అలా రాయడానికి కారణం.. నాకు మా అత్తంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పట్నుంచీ విన్న నానుడి.. తల్లి తర్వాత పిన్ని, తండ్రి తర్వాత మేనత్త అని. అలాంటి అత్తని మనం ఎందుకు తక్కువచేసి చూపిస్తాం? అత్తతో అల్లుడు వేళాకోళమాడ్డం బేసిగ్గా మన సంస్కృతిలో లేదు. దాన్ని కొత్తగా తీసుకొచ్చి పెట్టారు. పెళ్లిలో అల్లుడ్ని విష్ణువుగా చూస్తాం. అందుకే కాళ్లు కడుగుతాం. అంటే అల్లుడి బాధ్యతను పెంచడం కోసం అతని కాళ్లు కడుగుతాం. అలాంటివాడు అత్తతోటి ఎలా వేళాకోళమాడతాడు? అతను దేవుడిలాగే బిహేవ్ చెయ్యాలి. అందర్నీ బాగా చూసుకోవాలి, మంచి సమాజాన్ని నిర్మించాలి. ఇవన్నీ తెలీకుండానే నా సినిమాలో ప్రతిఫలించి ఉండొచ్చు. కాన్షియస్గా నేను వాటిని చెప్పాననట్లేదు.
* ఇటీవల మీ సినిమాల్లో కథ ఒక ఇంటిచుట్టూ నడవడం కనిపిస్తుంది. ఎందుకలా?
మనం ప్రపంచం అంతా తిరగొచ్చు. కానీ ఇంటికొచ్చాక ఒక సుఖం వస్తుంది. ఆ ఇంటికొచ్చిన ఫీలింగే వేరు. అందుకే ‘హోం కమింగ్’ అంటాం. మనకు తెలీకుండానే ఇల్లు మన సంస్కృతిలో ఒక భాగం. అది చిన్నదే కావచ్చు. ఇంట్లో ఉంటే ఆ ఆనందమే వేరు. బహుశా నేను ఆ ఇంట్లో ఆనందాన్ని వెతుక్కొనే ప్రయత్నం చేస్తానేమో. అందుకే నా సినిమాల్లో కథకి ఇల్లు కేంద్రంగా ఉంటూ ఉండొచ్చు. ‘అల.. వైకుంఠపురములో’ మూవీలో ‘వైకుంఠపురం’ అనే ఇంటికి ఉన్న విలువను అలా సింబలైజ్ చేశాను. ఆ ఇంటికి హీరో వెళ్లడం ఎందుకు ముఖ్యమైన విషయమయ్యింది? అందుకే ఆ ఇంటికి ఆ పేరుపెట్టి, అదే సినిమాకి టైటిల్ గా పెట్టా.
* మీ డైలాగ్స్ వల్లే సినిమాలు హిట్టయ్యాయనే పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు వస్తున్న రైటర్స్ కొంతమంది మిమ్మల్ని అనుకరిస్తున్నారు కూడా. వాళ్ల సినిమాలు చూసినప్పుడు మీరెలా ఫీలవుతారు?
నేను ఏ సినిమానైనా ఏ నెగటివ్ లేకుండా చూస్తా. చాలా సార్లు ఆశ్చర్యానికి గురవుతా. ఆడియెన్స్ ఎలా ఫీలవుతారో నేనూ అలాగే ‘అరె.. భలే రాశాడే’ అని ఫీలవుతా. తక్కువ బడ్జెట్తోటే వీళ్లు ఈ సినిమా భలే చేశారే, మనం చెయ్యలేకపోయామే అని కచ్చితంగా అనిపిస్తుంది. కొన్ని సినిమాలు చూస్తే, ఈ ఐడియా మనకెందుకు రాలేదననే జెలసీ కూడా వస్తుంది. వీడు నాలా రాస్తున్నాడే అని ఎప్పుడూ నాకనిపించలేదు. నిజాయితీగా చెప్తున్నా. ఇందులో హ్యూమిలిటీ ఏమీ లేదు. డైలాగ్స్ వల్ల సినిమా ఆడుతుందనే దాన్ని నేను ఏకీభవించను. ఎందుకంటే.. కథ, పాత్రలు, సన్నివేశాలు.. తర్వాతే మాటలు. మాట అనేది వాటికి బలమవ్వాలే తప్ప, మాట వల్ల ఇవన్నీ రావు. నా డైలాగ్స్ కి పేరు రావడానికి కారణం నేననుకొనేదేమంటే.. ఆ సన్నివేశాన్ని మరింత సూటిగా, బలంగా చెప్పడానికి నేను మాటల్ని వాడానని..
* ‘జులాయి’ నాటికీ, ఇప్పటికీ అల్లు అర్జున్లో మీకు కనిపించిన మార్పు ఏమిటిది?
‘జులాయి’ నాటికీ, ఇప్పటికీ పోల్చుకుంటే అల్లు అర్జున్ పని మీద మరింత ఫోకస్డ్ గా ఉన్నాడనే విషయం తెలిసింది. వేరే ధోరణే తనకు లేదు. ఎంతసేపూ సినిమాపైనే అతని దృష్టి.
* మీరు పాన్-ఇండియా సినిమాలు ఎందుకు తియ్యట్లేదు?
నేను పాన్-ఇండియాకు వెళ్లకపోవడానికి నాకు కరెక్ట్ కథ తగలకపోవడం, నేనింకా అలాంటి కథ రాయలేకపోవడం.
* ఈమధ్య ఎక్కువగా మీ సినిమాలకు ‘ఆతో మొదలయ్యే టైటిల్స్ పెడుతున్నారు. అది సెంటిమెంటా?
నాకు సెంటిమెంట్లున్నాయి కానీ, ‘ఆ అక్షరంతో టైటిల్ మొదలుపెట్టాలనే సెంటిమెంటైతే లేదు.
* తర్వాత ఎవరితో సినిమా చెయ్యబోతున్నారు?
తర్వాతి సినిమా ఏమిటనేది ఇంకా డిసైడ్ అవలేదు. కథ అల్లుకొని, దానికి ఎవరు సరిపోతారనుకుంటే వాళ్లతో చేస్తా.
-
-
‘సరిలేరు నీకెవ్వరు` ప్రతి సాంగ్‌కి ఎక్స్‌ట్రార్డినరి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది – రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్.
Category : Latest Events Latest Reviews Movie News Sliders
టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ మ్యూజికల్ హిట్స్ ను అందించి అందరి అభిమానుల మన్ననలు పొందుతూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. చిత్రానికి స్వరాలను అందించారు. ఇప్పటికే విడుదలైన అన్ని పాటలకు దేశవ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న సినిమా విడుదలవుతున్న సందర్భంగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇంటర్వ్యూ..
ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు కదా ఇంకా ఏం చేయగలం అని ఎప్పుడైనా అనిపించిందా?
లక్కీ గా ఎప్పుడూ అలా అనిపించింది లేదు. ఎందుకంటే 2020 లో విడుదలయ్యే నా మొదటి సినిమా `సరిలేరు నీకెవ్వరు`. నిజంగా ఇది నాకు ఫస్ట్ సినిమాలానే అనిపిస్తుంది. ప్రతి సినిమా కి ఆ భయం అయితే ఉంటుంది. ‘అది ఉన్నంతకాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆ భయం మనలో ఉంటే ప్రతి సినిమా ఒక ఛాలెంజ్ లా తీసుకొని చేస్తాము. ఈ విషయం ‘మన్మధ బాణం’ సినిమా చేస్తున్నప్పుడు కమల్ హాసన్ గారు చెప్పారు. అలాగే మా టీమ్ అందరి ఎఫర్ట్ కూడా ఒక కారణం. మనచుట్టూ ఉన్నవాళ్ళని భయపడకుండా వాళ్ళ ఒపీనియన్ మనకు చెప్పే ఫ్రీడమ్ ఇవ్వడం కూడా మన సక్సెస్ లో ఒక పార్ట్ అని నా భావన.
ఈ సినిమా ఓపెనింగ్ రోజు మహేష్ బాబు ఫ్యాన్స్ కి మాస్ సాంగ్, లవ్, పార్టీ సాంగ్ ఇస్తానని మాట ఇచ్చారు కదా?
– ఈ సినిమా ఓపెనింగ్ రోజు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ నచ్చేలా ఒక మాస్ సాంగ్ ఇస్తానని చెప్పాను. అలాగే `మైండ్ బ్లాక్`,`డాంగ్ డాంగ్` సాంగ్ కి సోషల్ మీడియా లో టెర్రిఫిక్ రెస్పాన్స్ వస్తోంది. అందరి హీరోలకి మాస్ సాంగ్స్ చేశాను. ఇప్పుడు మహేష్ గారికి మాస్ సాంగ్ చేయాలన్నకోరిక ఈ సినిమాతో తీరింది. అందుకు కారణమైన అనిల్ రావిపూడి గారికి ఈ సందర్భంగా థాంక్స్ తెలియజేస్తున్నా అలాగే డిసెంబర్ లో మాస్ `ఎస్ఎస్‌ఎంబి మండేస్` అని ప్రతి సోమవారం ఒక సాంగ్ ని విడుదల చేశాం. ఇది నాకు, మా టీమ్ అందరికీ ఒక పరీక్ష లాంటిది. అయితే విడుదల చేసిన ప్రతి సాంగ్ కి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. అన్ని పాటలను ఆదరించిన ప్రేక్షకులకి, మీడియా వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
మహేష్ బాబుతో మీ జర్నీ గురించి?
– మహేష్ గారితో ఇది నా ఐదవ సినిమా. ఆయనతో జర్నీ చేయడం ఎప్పుడూ గొప్పగా ఉంటుంది. నేను ఎప్పుడూ చెప్తుంటాను `మహేష్ గారు కేవలం సూపర్ స్టార్ మాత్రమే కాదు ఒక సూపర్ స్టార్ కి కావాల్సిన మంచి మనసు ఉంది’అని. ఎందుకంటే ఇప్పటివరకు ఆయనతో పనిచేసిన డైరెక్టర్స్ అందరితో నేను వర్క్ చేశాను. అందరూ కూడా ఒకే మాట అంటారు ఏంటంటే `మహేష్ తో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలనుంది` అని. ఒక సారి కథ విని ఓకే అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఆయన టెక్నీషియన్స్ కి సపోర్ట్ చేస్తారు. కంప్లీట్ గా డైరెక్టర్స్ యాక్టర్ ఆయన. అంత పెద్ద స్టార్ మనమీద నమ్మకం పెట్టినప్పుడు మనకు తెలియకుండానే పని మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. అందుకే అన్నీ బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవ్వగలిగాను.
దర్శకుడు అనిల్ రావిపూడితో వర్క్ ఎక్స్‌పీరియన్స్?
– అనిల్ రావిపూడి గారితో నేను `ఎఫ్ 2` మూవీ చేశాను. ఈ సినిమాను చాలా ఎక్స్ట్రార్డినరీ గా హ్యాండిల్ చేశారు. అనిల్ అనగానే మనకు ఎంటర్టైన్మెంట్ గుర్తొస్తుంది. కానీ మహేష్ బాబు గారి సినిమాల్లో ఉండే సందేశం మిస్ కాకుండా, మహేష్ ఫ్యాన్స్ ఆయన్ని ఎంత ఎనర్జీ గా చూడాలనుకుంటున్నారో ఈ రెండు పర్ఫెక్ట్ మిక్స్ గా ఈ సినిమా వచ్చింది. మహేష్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. నేను ఆర్.ఆర్ చేస్తున్నప్పుడే రిపీటెడ్ గా చూశాను. ఈ సినిమాలో ఆయన డాన్సులు ఆడియన్స్ కి బోనస్.
సరిలేరు నీకెవ్వరు ఆంథమ్ సాంగ్ గురించి?
– నాకు ఆర్మీ అంటే చాలా గౌరవం. ఇప్పటివరకు ఆ జోనర్ లో సినిమా చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు ఒక సూపర్ స్టార్ తో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సినిమా అనగానే చాలా హ్యాపీ గా ఫీలయ్యాను. అనిల్ గారు ఫస్ట్ చెప్పడమే సరిలేరు నీకెవ్వరు అనేది ఆర్మీ వారికి ఒక ట్రిబ్యూట్ అని చెప్పారు. ఆ ఇన్స్పిరేషన్ తోనే ఆంథమ్ సాంగ్ `భగ భగ భగ భగ మండే నిప్పులవర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకే వాడే సైనికుడు`.. నేనే రాశాను. ఆ లిరిక్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే యూరప్ లో మేసెడోనియన్ సింఫనీ ఆర్కస్ట్రా తో రికార్డ్ చేశాం. వారు కూడా చాలా ఎగ్జైట్ గా ఫీలయ్యారు. మహేష్ గారు కూడా ఆ పాట విని డైరెక్టర్ ఒక కథ రెండున్నర గంటల కథ చెప్తే దేవి ఒక పాటలో వినిపించాడు. దేవి మామూలోడు కాదు అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది.
మైండ్ బ్లాక్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది కదా! దాని గురించి చెప్పండి?
– నా దృష్టిలో ఒక పెద్ద హీరో నుండి మాస్ సాంగ్ వచ్చినపుడు ఆ పాట ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి అదేవిధంగా ఆ సాంగ్ కి హీరోకి లింక్ కూడా ఉండాలి అనేది నా కోరిక. అందులోనూ కథ చెప్పటప్పుడే మహేష్ గారిని పక్కా మాస్ గా చూపించబోతున్నాము అని చెప్పారు. నాకు చాలాఎగ్జైట్ మెంట్ వచ్చింది. అందుకే ఎపుడు ప్యాంటేసే వాడు ఇపుడు లుంగీ తొడిగాడు,.అని రాశాం. ఆ పాటని మహేష్ గారు విన్నప్పుడు పడి పడి నవ్వారు. ఏంటి ఇప్పుడు ఇవన్నీ నాతో చేయిస్తారా? అని అడిగారు. అందుకే కదా సర్ లిరిక్స్ లో రాశాం అని చెప్పాము. మీరు ముందునుండి ప్రిపేర్ అయి ఉన్నారు అన్నట్టుగా చూశారు. రేపు థియేటర్ లో ఆ సాంగ్ వేరే రేంజ్ లో ఉంటుంది.
తొమ్మిది ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు కదా ! రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతారా?
– తప్పకుండా అండీ, నేను అవార్డ్స్ ని రెండు కోణాలలో చూస్తాను. ఒకటి మన వర్క్ నచ్చి ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేశారో దాన్ని మించిన అవార్డ్ లేదు. ఇక అవార్డ్ అనేది వారు మనకు ఇచ్చే గొప్ప గౌరవం. అది నాకు రెస్పాన్సిబుల్ ని పెంచుతుంది.
నిర్మాత అనిల్ సుంకర గురించి?
– మా నిర్మాత అనిల్ సుంకర గారు చాలా స్వీట్ పర్సన్. చాలా ఎంకరేజింగ్ గా ఉంటారు. ఒక సాంగ్ యూరప్ వెళ్లి కంపోజ్ చేద్దాం అన్నప్పుడు తప్పకుండా చెప్పడం అని సపోర్ట్ చేశారు. ఒక ప్యూర్ సినిమా లవర్. మాస్ సాంగ్ చేయబోతున్నాం అనగానే తప్పకుండా చేద్దాం. మహేష్ గారిని అలా చూపించాలి. చాలా బాగుంటుంది. అని చాలా ఎగ్జైట్ అయ్యారు.
మీరు హీరోగా సినిమా చేస్తున్నారనే వార్త చాలా సంవత్సరాలుగా వినిపిస్తోంది. ఆ సినిమా ఎంతవరకూ వచ్చింది ?
– సినిమా చేయమని అడుగుతున్నారు గాని, నాకు మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రస్ట్ వల్లనేమో యాక్టింగ్ చేయాలనే ఆసక్తి రావడం లేదు. అయితే నాకు తమిళంలో ఎక్కువమంది కథలు చెబుతున్నారు. సంగీతం ప్రధానంగా సాగే కొత్త కథ ఉంటే ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తాను.
మీ తదుపరి సినిమాల గురించి ?
– సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లోఒక సినిమా చేస్తున్నాను. మా కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఉంటుంది. అలాగే ‘ఉప్పెన’ సినిమా చేస్తున్నాను. నితిన్, కీర్తి సురేష్ ల ప్యూర్ లవ్ స్టోరీ ‘రంగ్ దే’ చేస్తున్నాను. అలాగే కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ సినిమా కూడా చేస్తున్నాను. అలాగే హిందీలో ఒక సినిమా చేయబోతున్నాను దాని వివరాలు త్వరలో తెలియజేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.
-
-
-
-
“విట్టల్ వాడి” రిలీజ్ కి ముందే హిందీ రీమేక్ రైట్స్ కోసం ఉత్సాహం చూపిస్తున్న గురుదేవ్ పిక్చర్స్
Category : Latest Events Latest Reviews Movie News Sliders
ఎన్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రోహిత్,సుధా రావత్,నటీనటులుగా నాగేందర్.టి.దర్శకత్వంలో జి.నరేష్ రెడ్డి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా
నిర్మిస్తున్న చిత్రం “విట్ఠల్ వాడి” ఈ కొత్త మూవీ రిలీజ్ కి రెడి అయిన సందర్భంగా చిత్ర యూనిట్ సినీ ప్రముఖుల కు సినిమా ప్రివ్యూ చూయించారు. సినిమా ప్రివ్యూ చూసిన కొంతమంది ప్రముఖులు సినిమా బాగా చిత్రీకరించారని సాంగ్స్ సినిమా కి హైలెట్ అని రోషన్ కోటి మ్యూజిక్ చాలా బావుందని కొత్తవాళ్ళైన హీరో రోహిత్ ని హీరోయిన్ ని మెచ్చుకున్నారు. గొప్ప కథ ని ప్రేక్షకులకు అందించబోతున్న డైరెక్టర్ టి నాగేందర్, ప్రొడ్యూసర్ నరేష్ గారిని అభినందించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జి.నరేష్ రెడ్డి మాట్లాడుతూ: -ఇందులో రొమాంటిక్ సీన్స్ బాగా వచ్చాయి.హీరో రోహిత్ బాగా యాక్ట్ చేసాడు,సెంటిమెంట్స్ సీన్స్ కూడా బాగా వచ్చాయి.ఈ యాక్షన్, సెంటిమెంట్స్ సీన్స్ కు అందరూ కనెక్ట్ అయ్యారు.సినిమా చూసిన గురుదేవ్ పిక్చర్స్ అధినేత ప్రమోద్ కుమార్ సినిమా బాగుందని హిందీ లో ఒక ప్రముఖ నటుడి కొడుకుని లాంచ్ చెయ్యడానికి హిందీ రీమేక్ రైట్స్ కోసం ఆసక్తి చూపుతున్నారని ప్రొడ్యూసర్ నరేష్ హర్షం వ్యక్తం చేశారు..సినిమా ఫస్ట్ లుక్ తో పాటు ట్రైలర్ పై మంచి రేస్పాన్స్ రావడం తో మేమంతా చాలా సంతోశంగా ఉన్నాము.త్వరలో గ్రాండ్ గా ప్రి రేలీజ్ ఈవెంట్ జరిపి,భారీ ఎత్తున
“విట్టల్ వాడి” సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
నటీనటులు
రోహిత్ రెడ్డి
కైషా రావత్
అమిత్
రోల్ రిడా
అప్పాజీ అంబరీష్ దర్బా
చమ్మక్ చంద్ర
సాంకేతిక నిపుణులు
కెమెరా మెన్ – సతీష్ అడపా
మ్యూజిక్ – రోషన్ కోటి
ఎడిటింగ్ – శ్రీనివాస్ మోపర్తి
పి ఆర్ ఓ – మధు వి ఆర్
ఫైట్స్ – శంకర్
ప్రొడ్యూసర్ – జి నరేష్ రెడ్డి
డైరెక్టర్ – నాగేందర్ టి
-
-
అన్నయ్య నందమూరి కల్యాణ్ రామ్ ఓ మంచి కుటుంబ కథా చిత్రంలో నటిస్తే చూడాలని కోరిక.. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన `ఎంత మంచివాడవురా`తో తీరింది – యంగ్ టైగర్ ఎన్టీఆర్
Category : Latest Reviews Movie News Sliders
అన్నయ్య నందమూరి కల్యాణ్ రామ్ ఓ మంచి కుటుంబ కథా చిత్రంలో నటిస్తే చూడాలని కోరిక.. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన `ఎంత మంచివాడవురా`తో తీరింది – యంగ్ టైగర్ ఎన్టీఆర్
నందమూరి కల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `ఎంత మంచివాడవురా`. ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యు సర్టిఫికేట్‌ను పొందింది. సంక్రాంతి సందర్భంగా సినిమాను జనవరి 15న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో థియేట్రికల్ ట్రైలర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు.
ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు మాట్లాడుతూ – “`ఎంత మంచివాడవురా` మంచి కుటుంబ కథా చిత్రం. ఈ సంక్రాంతికి అందరికీ బావుండాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
టి.ఎన్.ఆర్ మాట్లాడుతూ – “తొలిసారి నాకు పూర్తినెగిటివ్ రోల్ ఇచ్చిన డైరెక్టర్ సతీశ్ వేగేశ్న గారికి థ్యాంక్స్“ అన్నారు.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ – “డైరెక్టర్ సతీశ్ వేగేశ్నగారు నన్ను కొత్త కోణంలో చూపించబోతున్నారు. ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి చేస్తోన్న తొలి చిత్రమిది. కల్యాణ్‌రామ్‌గారికి కూడా థ్యాంక్స్. సినిమాలో గొప్ప నటీనటులు ఉన్నారు. అందరూ అద్భుతంగా నటించారు. వీరితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ నెల 15న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
నటాషా దోషి మాట్లాడుతూ – “జైసింహలో బాలకృష్ణగారితో నటించాను. ఇప్పుడు కల్యాణ్‌రామ్‌గారితో ఈ సినిమాలో చేయడం హ్యాపీగా ఉంది. సంక్రాంతికి విడుదలవుతోన్న ఈసినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
శరత్ బాబు మాట్లాడుతూ – “ఎంతమంచివాడవురా` సినిమా సంక్రాంతికి వచ్చి షడ్రసోపేతమైన విందును అందించబోతుంది. ప్రేక్షకులు ఈ సినిమా పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ – “ప్రేక్షకుల కేరింతలు ఈ పండగకి నాలుగింతలు కావాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
ఆదిత్య మ్యూజిక్ అధినేతలు, నిర్మాతలు ఉమేష్ గుప్త,సుభాష్ గుప్త మాట్లాడుతూ – “మా బ్యానర్‌లో చేస్తోన్న తొలి సినిమాను నందమూరి కల్యాణ్‌గారితో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. గోపీసుందర్‌గారు, డైరెక్టర్ సతీశ్‌గారు సహా ఎంటైర్ టీమ్ చాలా డేడికేషన్‌తో పనిచేశారు. సినిమా బాగా వచ్చింది. హార్ట్ టచింగ్, ఫీల్ గుడ్ మూవీ. తప్పకుండా ఈ నెల 15న విడుదలవుతున్న ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఎంటైర్ యూనిట్‌కి థ్యాంక్స్“ అన్నారు.
ఆదిత్య మాట్లాడుతూ – “మా కుటుంబం ప్రొడ్యూస్ చేస్తున్న తొలి చిత్రం. ప్రేక్షకులు ఇంతకు ముందు మమ్మల్ని ఆదరించినట్లుగానే ఇప్పుడు కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను“ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ మాట్లాడుతూ – “ఆదిత్య నిర్మాణ సంస్థతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. పాటలన్నీ చక్కగా కుదిరాయి. ప్రేక్షకులు ఆదరించారు. రేపు సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. కుటుంబ కథా చిత్రం. సపోర్ట్ చేసిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్“ అన్నారు.
చిత్ర సమర్పకులు శ్రీదేవి మూవీస్ అధినేత శివ లెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ – “నందమూరి హీరోలు క్రమశిక్షణకు పెట్టింది. బాలకృష్ణగారితో నేను నాలుగు సినిమాలు చేశాను. అంతే పట్టుదలతో ఉంటారు. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌గారికి సినిమాలంటే ఎంతో ప్యాషన్. ఎంత మంచివాడవురా పండగ సినిమా. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు“ అన్నారు.
చిత్ర దర్శకుడు సతీశ్ వేగేశ్న మాట్లాడుతూ – “నా తల్లిదండ్రులకు, నన్ను రైటర్‌ని చేసిన ముప్పలనేని శివగారికి, నన్ను డైరెక్టర్‌ని చేసిన ఈవీవీగారికి, అల్లరి నరేశ్‌గారికి, నాకు శతమానం భవతితో పునర్జన్మను ఇచ్చిన దిల్‌రాజుగారికి థ్యాంక్స్. 1963లో సీనియర్ ఎన్టీఆర్‌కి మా నాన్నగారు పెద్ద అభిమాని, అఖిల భారత ఎన్టీఆర్ సంఘానికి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఒక మనిషికి ఆనందం, బాధ ఒకేసారి రాదు. చాలా అరుదు. నేను అభిమానించే తారక్, నాతో సినిమా చేసిన కల్యాణ్‌రామ్‌ను చూసి ఆనందపడాలో.. మా నాన్నగారు ఈరోజు లేరని బాధపడాలో తెలియడం లేదు. `ఎంత మంచివాడవురా` సినిమా ఎన్టీఆర్ మాస్ చేస్తే సింహాద్రి.. క్లాస్ చేస్తే బృందావనం.. క్లాస్, మాస్ మిక్స్ చేస్తే ఒక అరవింద సమేత, ఒక జనతాగ్యారేజ్. అలాగే నందమూరి కల్యాణ్‌రామ్‌గారు మాస్ చేస్తే అతనొక్కడే, క్లాస్ చేస్తే 118, క్లాసు, మాసు కలిపి చేస్తే `ఎంతమంచివాడవురా`. సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థ్యాంక్స్. ఈ సినిమాను 72 రోజుల్లో పూర్తి చేయడానికి కారణమైన నా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్. ప్రతి ఒక్కరూ రక్తం చిందించి(జలగల మధ్య) సినిమాను పూర్తి చేశాం. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాం“ అన్నారు.
మెహరీన్ మాట్లాడుతూ – “నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన కల్యాణ్‌రామ్‌గారికి, దర్శకుడు సతీశ్‌గారికి, నిర్మాతలు ఉమేష్‌గుప్త, సుభాష్ గుప్త, కృష్ణ ప్రసాద్‌గారికి థ్యాంక్స్. టైటిల్ మాత్రమే కాదు.. మా ఎంటైర్ యూనిట్ అందరూ మంచివాళ్లే. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది“ అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ – “సంక్రాంతి సినిమాల పోటీలో నందమూరి సినిమా కూడా నిలబడింది. ఉమేష్ గుప్తా నాకు 20 ఏళ్లుగా మిత్రుడు. ఆయనకు ఈ సినిమాకు పెద్దగా హిట్ కావాలి. కల్యాణ్‌రామ్‌గారి పటాస్, 118 తర్వాత ఈ సినిమా మా ఆధ్వరంలో వస్తోంది. పెద్ద హిట్ కావాలి“ అని అన్నారు.
ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల చేశారు. అనంతరం
కల్యాణ్ రామ్ మాట్లాడుతూ – “ఆదిత్య మ్యూజిక్ వారికి మొదటి సారి ప్రొడక్షన్‌కి వచ్చినందుకు ఆహ్వానం పలుకుతున్నాం. జనవరి 15న మన సినిమా వస్తోంది. చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నా. సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. 9న దర్బార్, 11న మా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు వస్తోంది. థాంక్స్ బన్నీ అండ్ త్రివిక్రమ్‌గారూ… వాళ్ల సినిమా 12న వస్తోంది. మా సినిమా 15న వస్తోంది. చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా“ అని చెప్పారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ – “బ్రదర్స్ సైలెంట్‌గా ఉంటే మాట్లాడతా. లేకుంటే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను. ఇక్కడికి అభిమానులు, శ్రేయోభిలాషులు వచ్చారు. వారందరితో పాటు నేను కూడా వచ్చినందుకు ఆనందంగా ఉంది. కల్యాణ్ అన్న ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేశారు. థ్రిల్లర్లు చేశారు. కమర్షియల్ మాస్ పంథా సినిమాలు చేశారు. అయితే ఆయన పట్ల నాకు ఒక వెలితి ఉండేది. కల్యాణ్ అన్న మంచి కుటుంబ సినిమా చేస్తే చూడాలని ఉండేది. ఈ సినిమాతో మా దర్శకుడు సతీష్ వేగేశ్న దాన్ని పూర్తి చేశారు. నిర్మాత కృష్ణప్రసాద్‌గారు మా కుటుంబానికి శ్రేయోభిలాషి. మా కుటుంబసభ్యుడు. బాబాయ్‌తో ఎన్నో సినిమాలు చేశారాయన. అతిపెద్ద మ్యూజిక్ సంస్థ ఆదిత్య ఉమేష్ గుప్తాగారు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. వారిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమా చాలా పెద్దగా ఆడాలి. గోపీసుందర్‌గారు మ్యూజిక్ ఇచ్చారు. వీరందరి కాంబినేషన్‌లో ఎంత మంచివాడవురా జనవరి 15న అందరి ముందుకు రానుంది. మంచి మనసుతో, మంచి చిత్రాన్ని ఆదరించే గొప్ప గుణం అందరిలో ఉంది. తెలుగు ప్రేక్షకదేవుళ్లలో ఉంది. ఎంత మంచి వాడవురా టీమ్‌కి అందరూ సహాయసహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను. అభిమానుల అందరి ప్రాణం తల్లిదండ్రులకు, అన్నచెల్లెళ్లకు, ఆ తర్వాత నాకు, కల్యాణ్ అన్నకి, మా కుటుంబానికి ఎంతో అవసరం. అభిమానుల ఇంటిల్లిపాదీ ఆనందంగా ఉండాలి. అందరికీ నూతన్య సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండగ వాతావరణంలో విడుదలవుతున్న దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురం, ఎంత మంచి వాడవురా… పెద్ద హిట్ కావాలి. ఈ చిత్రాల విజయం తెలుగు చిత్ర సీమ ముందుకు వెళ్లేలా దోహదపడాలని కోరుకుంటున్నా“ అని అన్నారు.
Search
Latest Updates
- శ్రీకృష్ణుడు ఏకలవ్యుడిని ఎందుకు చంపాడో తెలుసా?
- రూ.16వేల కోట్లు చాలవు… ‘అవతార్ 2’ హిట్ కావాలంటే
- నా వారసుడు వచ్చేస్తున్నాడు.. నందమూరి బాలకృష్ట
- విశాఖ కనకమహాలక్ష్మి.. ఇక్కడ భక్తులే పూజలు చేయొచ్చు
- ప్రభాస్ ఫ్యాన్‌కి బ్యాడ్‌న్యూస్… ‘ఆదిపురుష్’ మళ్లీ వాయిదా?
- ‘కాంతార’ సర్ప్రైజ్.. ఈ అర్ధరాత్రి నుంచే ఓటీటీ స్ట్రీమింగ్
© Copyright 2020. All Rights Reserved