Category Archives: Movie News

సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టిన “టిక్ టిక్ టిక్”

Category : Movie News Sliders

సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టిన “టిక్ టిక్ టిక్”

జయంరవి కథానాయకుడిగా శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండియాస్ ఫస్ట్ స్పేస్ థ్రిల్లర్ “టిక్ టిక్ టిక్”. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చదలవాడ పద్మావతి నిర్మాణ సారథ్యంలో తెలుగులో అనువాదరూపంలో విడుదల చేసారు. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు విశేషమైన రీతిలో ఆదరించారు. తమిళనాట జయంరవి కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన “టిక్ టిక్ టిక్” తెలుగులోనూ మంచి వసూళ్లు రాబడుతోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చదలవాడ లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేసారు. పెద్దలతోపాటు పిల్లలు కూడా మా చిత్రాన్ని ఆదరిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. మేం ఉహించినదానికంటే భారీ స్థాయిలో కలెక్షన్స్ ఉన్నాయి. ఇదే తరహాలో వైవిధ్యమైన చిత్రాలు మా సంస్థ నుంచి వస్తూనే ఉంటాయి. ప్రేక్షకులకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే చూడాలని కోరుకొంటున్నాము.


శర్వానంద్, సాయి పల్లవి విడుదల చేసిన ‘పరిచయం’ సెకండ్ సాంగ్!

Category : Movie News Sliders

అసిన్ మూవీ క్రియేషన్స్ పతాకం పై రియాజ్ నిర్మాతగా లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందిన చిత్రం “పరిచయం”. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలోని రెండోపాట ‘రావాఇలా’ ను హీరో శర్వానంద్, హీరోయిన్ సాయి పల్లవి విడుదల చేసారు.

విరాట్ కొండూరు హీరోగా పరిచయం అవుతున్న ఈ మూవీలో సిమ్రత్ కౌర్ హీరోయిన్. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా జూలై 20న విడుదల కాబోతోంది. ఇటీవల రిలీజ్ అయిన ‘ఏమైందో మనసా’ పాటకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లబించింది. ఈ చిత్ర నైజాం రైట్స్ ను ఏషియన్ సంస్థ సొంతం చేసుకుంది.

నటీనటులు:
విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ తదితరులు.

సాంకేతిక నిపుణులు
రచన దర్సకత్వం: లక్ష్మీకాంత్ చెన్నా
నిర్మాత: రియాజ్
మ్యూజిక్: శేఖర్ చంద్ర
లిరిక్స్: భాస్కరభట్ల,వనమాలి,శ్రీమణీ
డైలాగ్స్: సాగర్
సినిమాటోగ్రఫీ: నరేష్ రానా
కోరియోగ్రఫీ: విజయ్ ప్రకాష్, హరికిరణ్
ఫైట్స్: రామకృష్ణ
చీఫ్ కో డైరెక్టర్: సత్యం కల్వకోలు
ఆర్ట్: రాజకుమార్ గిబ్సన్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
పి ఆర్ ఓ:వంశీ శేఖర్
ఆర్ట్: రాజకుమార్ గిబ్సన్


జులై 7న “సాక్ష్యం” ఆడియో విడుదల!

Category : Movie News Sliders

హీరో బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘సాక్ష్యం’ సినిమా ఆడియో వేడుక జూలై 7న జరగబోతోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ప్రకృతే సాక్షంగా ఈ సినిమా రూపొందించబడుతోంది.

శ్రీవాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. ఆర్తు ఏ విల్సన్ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ సాక్ష్యం సినిమాకు ప్రధానబలం కానున్నాయి. ‘బాహుబలి’ చిత్రానికి సిజి వర్క్ చేసిన టీం ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘సాక్షం’ చిత్రంలోని రెండు పాటలకు మంచి రెస్పాన్స్ అభించింది. ‘టైమ్స్ మ్యూజిక్ సౌత్’ సంస్థ సాక్షం చిత్ర ఆడియో హక్కులను సొంతం చేసుకుంది.
భారి తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు, శరత్ కుమార్, రావ్ రమేష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్, మరియు నటి మీనా ఈ చిత్రంలో నటించారు.

నటీనటులు:
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రానా, మధు గురు స్వామి, జయ ప్రకాష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్.

సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: శ్రీవాసు
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్
నిర్మాత: అబిషేక్ నమ
మ్యూజిక్ డైరెక్టర్ : హర్షవర్ధన్ రామేశ్వరన్
కెమెరామెన్: ఆర్థర్ ఏ విల్సన్
ఆర్ట్ : ఏఎస్. ప్రకాష్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావ్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
యాక్షన్: పీటర్ హెయిన్
పి.ఆర్.ఓ: వంశీ – శేఖర్
లిరిక్స్: అనంత శ్రీరామ్
ఆడియో: జంగ్లీ మ్యూజిక్


నాచుర‌ల్ స్టార్ నాని చేతుల మీదుగా యాక్ష‌న్ కింగ్ అర్జున్ 150వ సినిమా “కురుక్షేత్రం” ట్రైల‌ర్ విడుద‌ల‌

Category : Movie News Sliders

యాక్షన్ హీరో అన‌గానే ట‌క్కున గుర్తుకు వ‌చ్చే పేరు అర్జున్. అందుకే యాక్ష‌న్ కింగ్ అని అభిమానులు ఇష్టంగా పిలుచుకుంటారు. యాక్ష‌న్ హీరోగానే కాదు విభిన్న‌మైన పాత్ర‌ల‌తో మోస్ట్ స్టైలిష్ యాక్ట‌ర్ గా సౌత్ లో త‌న ఇమేజ్ కు కొత్త గ్లామ‌ర్ తెచ్చుకున్నాడు అర్జున్. రీసెంట్ గా “నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా”, “అభిమ‌న్యుడు” సినిమాల‌తో ఈ జ‌న‌రేష‌న్ ఆడియ‌న్స్ కి బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. హీరోగా కెరియ‌ర్ మొద‌లు పెట్టిన అతి కొద్దిమందికి మాత్ర‌మే సాధ్య‌మ‌య్యే 150 మూవీ మైలు రాయిని చేరుకున్నాడు . కురుక్షేత్రం అర్జున్ 150వ మూవీ గా తెలుగులో త్వ‌ర‌లో విడుద‌ల‌కు కాబోతుంది. అర్జున్
అన‌గానే గుర్తుకు వ‌చ్చే యాక్ష‌న్ కి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి మ‌రోసారి ప్రేక్ష‌కుల‌కు మెస్మ‌రైజ్ చేయ‌బోతున్నాడు. . త‌మిళంలో “నిబున‌న్” గా విడుద‌లై మంచి సక్సెస్ సాధించిన ఈ మూవీ తెలుగులో “కురుక్షేత్రం” గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

బిగ్ బాస్ సీజ‌న్ 2 లో త‌న‌దైన స్టైల్లో దూసుకుపోతున్న నాచుర‌ల్ స్టార్ నాని ఈ మూవీ ట్రైల‌ర్ ని త‌న ట్విట‌ర్ ద్వారా విడుద‌ల చేసారు. హాలీవుడ్ థ్రిల‌ర్ ని త‌ల‌పిస్తున్న కురుక్షేత్రం త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌కు కొత్త ఎక్స్ పీరియ‌న్స్ గా మార‌బోతుంద‌ని అన్నారు. అర్జున్ ఇప్ప‌టి వ‌ర‌కూ పోలీస్ పాత్ర‌లు చాలా చేసినా ఒక భిన్న‌మైన పోలీస్అధికారిగా ఇందులో క‌నిపించ‌బోతున్నారు. మ‌ళ‌యాళంలో మోహ‌న్ లాల్ వంటి స్టార్స్ ని డైరెక్ట్ చేసిన అరుణ్ వైద్య‌నాథ‌న్ కురుక్షేత్రం ను అద్యంత ఆస‌క్తిగా మ‌లిచారు. ఊహించ‌ని మ‌లుపులు, ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నాల‌తో ప్రేక్ష‌కుల ఆలోచ‌న‌ల‌కు అంద‌ని థ్రిల్ల‌ర్ గా కురుక్షేత్రం అల‌రించ‌బోతుంది.

అర్జున్ కెరియ‌ర్ లో భిన్న‌మైన చిత్రం గా మారిన “కురుక్షేత్రం” మోస్ట్ మెమ‌ర‌బుల్ మూవీ కాబోతుంది. త్వ‌ర‌లో విడుద‌ల కాబోతున్న ఈ మూవీ లో యాక్ష‌న్ కింగ్ అర్జున్ తో పాటు ప్ర‌స‌న్న‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్, సుమ‌న్, సుహాసిని, వైభ‌వ్, శ్రుతి హారి హార‌న్ ముఖ్య పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు.

సాంకేతిక నిపుణులుః
సమర్పణ- ప్యాషన్ స్టూడియోస్
సంగీతంః ఎస్. న‌వీన్,
మాటలు- శశాంక్ వెన్నెలకంటి సినిమాటోగ్ర‌ఫీః అర‌వింద్ కృష్ణ‌, ఎడిటింగ్ః స‌తీష్ సూర్య‌, పీఆర్వో- జి.ఎస్.కె మీడియా,
కో-ప్రొడ్యూసర్-పి.ఎల్ అరుల్ రాజ్
నిర్మాత‌లుః ఉమేష్, సుద‌న్ సుంద‌రం,జయరాం,అరుణ్ వైద్యనాథన్.
స్క్రీన్ ప్లే – ఆనంద్ రాఘవ్ ,అరుణ్ వైద్య నాథ‌న్
క‌థ‌,ద‌ర్శ‌క‌త్వం – అరుణ్ వైద్య నాథ‌న్


WHERE IS DIRECTOR SV.KRISHNA REDDY.?

S.V.KrishnaReddy the renowned director who entertained the audience with his family entertainment films leading as a captain in all departments, be it direction, Screenwriting, Music Composer, and Producer. and a brief stint as an Actor is at present only seen in Audio Releases and award Functions totally distancing away from films.

90’s was a successful era, with SV Krishna Reddy’s films being the buzz of the town, his entertainment elements, Human Emotions, his Love story integrated to Indian embedded atmosphere created a milestone in his career films like Rajendrudu Gajendrudu,(1993), SubhaLagnam (1994), , Ghatothkachudu (1995), Maavichiguru (1996), Vinodam (1996), Egire Paavurama (1997), Ahvanam (1997) , Pelli Peetalu (1998), Premaku Velayara (1999), Sakutumba Saparivaara Sametham (2000), Premaku Swagatham(2002), Pellam Oorelithe (2003),

Our Heartful Gratitude to S.V. KrishnaReddy the ace director who tuned the careers of Present Stars in Rajendra Prasad, Ali, Srikanth, Jagapathi Babu to be a refined prodigies of Telugu Film Industry, Its is very sad our Telugu Film Industry ignoring such a stalwart who is deprived of another chance, due to the advent of talented young directors well equipped with the latest technology, and taste of the present era, but his sculpting of roles can’t be aped or shown even at present without his Midas touch.

SV Krishnareddy received Nandi Awards for his films Subhalagnam (1994), Ahvanam (1997), SahakutumbaSahaparivara Sametham (2001), and Film Fare Best Director Award for Subhalagnam (1994)

But from 2002 SV. KrishnaReddy fame slowly started to decline due to stereotyped stories and unable to adapt to the taste of the Present Audience and his films faded away as his presence in Telugu films and an end to the era of Family Oriented Subjects.
Even Producers who followed a beeline to get the nod of a Successful busy director started distancing him due to present trend.
If Producers once again come forward with a good concept to rope in the talented director, he would definitely do justice in giving us a good output.

S.V.Krishna Reddy also served as Member at Telugu Film Directors Association, Directors Guild of America.


JAGAPATHI BABU (A GRUMPY VOICE’S SECOND INNINGS)

Jagapathi Babu the handsome dashing hero of the 90’s, son of Legendary Producer V.B.Rajendra Prasad never dreamt acting would be his passion and career, But the Aromatic Cinema flavor spread all over his genes had to announce his debut.

Jagapathi Babu Played a Safe and Mediocre First Innings that gave him a tag of Family Audience Hero, His Major Successful stint as an Angry young man in Ram Gopal Verma’s Gayam reached the audience who applauded his presence and performance, even though his 1992 film Peddarikam won him the solace to his debut.

From 1994 -2000 Destiny favored Jagapathi Babu where real Stardom elevated his status and his fame spread all over Indian Cinema Industry for his back to back swashbuckling hits in S.V.KrishnaReddys Subha Lagnam in 1994 and Mavachigaru in 1996 which earned him Nandi Awards for his amazing Performance and the industry terming him as family audience hero.
Jagapathi Babu adjusted his Roles as Script Demanded but retained his Family Audience Tag safely with Subhakankshalu and Pelli Pandiri faring well at the box office.
From 2000-2014 many other roles in films like Kabbadi Kabbadi, Athade Oka Sainyam, Pedababu and Anukokunda Oka Roju, Dongata, Anthapuram fared well but not the fame he deserved, he even set his foot in Tamil and Kannada film Industry, but that never earned the expected Laurels for the handsome hero.

Films started to fall out of Jagapathi Babu’s hands, destiny started to frustrated the hero, added to it the demise of his Support and his father VB Rajendra Prasad passed away, the properties seized due to nonpayment of Loans.
Added to his frustration his daughter getting married to a foreigner initially depressed him but later compromised.

Even Filmy fans felt their heroes innings ending abruptly as age also catching up with the talented star.

It is from 2014 Jagpathi babu made his second appearance with a Negative Grumpy Voice and shabby grey beard that took film industry by storm. Jagapathi Babu steadied his second innings with negative roles that earned him fame and acclaims from the entire film fraternities of South Indian Cinema and offers started pouring with lucrative assignments.

Jagapathis Babus Characters in Legend, Nanaku Prematho, Rangasthalam, Nella Ticket in Telugu, Rajinikanth’s Linga in Tamil, Mohanlal’s Pullimurugan in Malayalam and Manyam Puli in Telugu and Successful Supporting Character roles in Mahesh babus Srimanthudu and Nagchaitanyas Rarandao Vedika Chudam left him rest in a safe zone earning him fame, Wealth and Status that he lost in the middle and has no time to look back . As Jagapathi Babu’s journey is tuned for a long and cherished innings

Big Directors and Renowned Producers geared up to get the actors nod for their respective ventures proved the Fighter in Jagapathi Babu Rise from an Ordinary Hero, His Emotional Struggle, and Rising Demand for his Stature.

Japathi babu in the span of Three decades and more than 130 films in his kitty that won him 3 Filmfare Awards for Lakshyam, Legend, and Nanaku Prematho, 7 Nandi Awards, 3 SIIMA Awards, 2 IIFA Utsavam, 1 Asianet Film Awards.


ఈనెల 29న `శంభో శంక‌ర‌`

Category : Movie News Sliders

ఈనెల 29న `శంభో శంక‌ర‌`, సెన్సార్ యుఎ
సెన్సార్ ప్ర‌శంస‌ల‌తో యుఎ సాధించిన `శంభో శంక‌ర‌`

క‌మెడియ‌న్ ట‌ర్న్‌డ్ హీరోలుగా రాణిస్తున్న ఈ టైమ్‌లో ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా అదృష్టం ప‌రీక్షించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ న‌టించిన‌ `శంభో శంక‌ర‌` ట్రైల‌ర్‌, పోస్ట‌ర్ల‌కు అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ష‌క‌ల‌క శంక‌ర్‌ని హీరోగా, శ్రీధ‌ర్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా సెన్సార్ పూర్త‌యింది. సెన్సార్ బృందం యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది. ఈ సినిమా కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్రమిద‌ని సెన్సార్ స‌భ్యులు ప్ర‌శంసించారు. ఈ సీజ‌న్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్ట‌డం ఖాయం అని ప్ర‌శంసించారు.

పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ విన్న త‌ర‌వాత నిర్మాత ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ-“ఇప్ప‌టికే టీజర్, పాటలకు అద్భుత‌ స్పందన లభించింది. దిల్‌రాజు వంటి అగ్ర‌నిర్మాత కం పంపిణీదారుడు ఈ సినిమా టీజ‌ర్‌ని ప్ర‌శంసించ‌డం అదృష్టం. ఇప్పుడు సెన్సార్ బృందం అంతే గొప్ప‌గా ప్ర‌శంసించింది. సెన్సార్ యుఎ స‌ర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది. ప‌రిశ్ర‌మ‌లో పాజిటివ్ టాక్ వినిపించ‌డం ఉత్సాహం నింపుతోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 29న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజ్ చేస్తున్నాం“ అని అన్నారు.

మ‌రో నిర్మాత‌ సురేష్ కొండేటి మాట్లాడుతూ -“ష‌క‌ల‌క శంక‌ర్ క‌థానాయ‌కుడిగానూ నిరూపించుకునే ప్ర‌య‌త్న‌మిది. తొలి ప్ర‌య‌త్న‌మే పెద్ద స‌క్సెస్ అవుతాడ‌న్న ధీమా ఉంది. టీజ‌ర్‌కి వ‌చ్చిన హైప్ దృష్ట్యా ఈ చిత్రాన్ని అత్యంత ఘ‌నంగా రిలీజ్ చేస్తున్నాం. సెన్సార్ యుఎ స‌ర్టిఫికెట్ ఇచ్చి ప్ర‌శంసించింది. గ్రూప్‌లో ఒక స‌భ్యుడు ఈ సీజ‌న్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఇద‌ని ప్ర‌శంసించారు. శంక‌ర్ కెరీర్‌కి ఉప‌క‌రించే చిత్ర‌మిది. త‌న‌తో పాటు… న‌టీన‌టులంతా అద్భుతంగా లీన‌మై న‌టించారు. ఈ సినిమాలో న‌టించిన అంద‌రికీ కీల‌క‌మ‌లుపునిచ్చే సినిమా అవుతుంది“ అన్నారు.

షకలక శంక‌ర్, కారుణ్య నాగినీడు, అజ‌య్ ఘోష్, ర‌వి ప్రకాష్, ప్ర‌భు, ఏడిద శ్రీరామ్ త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ‌శేఖ‌ర్, సంగీతం: సాయి కార్తిక్, ఎడిటింగ్: ఛోటా.కె. ప్ర‌సాద్, నిర్మ‌తలు: వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి, క‌థ‌, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీధ‌ర్. ఎన్.


Pre Release Event of #ShamboShankara Today

Category : Movie News Sliders


Pre Release Event of #ShamboShankara Today
#Shankar #Karunya
RR Pictures
SK Pictures Presents
Directed by Sreedhar.N
Produced by Y. Ramana Reddy(YCRR) & Suresh Kondeti
Music by Sai Kartheek Editor Chota K Prasad
Dop Rajasekhar.S
#SHAMBHOSHANKARA



Chinna Babu Audio Launch

Category : Movie News Sliders

కార్తీ, సయేషా హీరో హీరోయిన్ గా పాండిరాజ్ దర్శకత్వం వహించిన “చినబాబు” చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీలో యాక్షన్ తో పాటు కామెడీ ఉండబోతోంది. కార్తీ ఈ మూవీలో రైతు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను హీరో సూర్య తో పాటు నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి “2డి ఎంటర్టైన్మెంట్స్” బ్యానర్ మరియు “ద్వారకా క్రియేషన్స్” బ్యానర్ లో నిర్మించడం జరిగింది. ఈరోజు వైజాగ్ లో చినబాబు సినిమా ఆడియో విడుదల ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కు సూర్య తో పాటు కార్తీ, చిత్ర యూనిట్ సభ్యులు అందరు పాల్గొన్నారు.


ఈ సందర్బంగా భానుప్రియ మాట్లాడుతూ…
“చినబాబు సినిమా ద్వారా మీ అందరిని కలవడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ పాండిరాజ్ ఈ సినిమా కోసం అందరి దగ్గరనుండి మంచి నటనను రాబట్టుకున్నారు. కార్తీ బాగా నటించారు” అన్నారు.

సత్యరాజ్ మాట్లాడుతూ…

అందరికి నమస్కారం. నాకు తెలుగు మాట్లాడడం రాదు కావున పేపర్ పై నా స్పీచ్ రాసుకొని వచ్చాను. 1986 లో నేను హీరోగా చేసిన సినిమా షూటింగ్ అధికభాగం వైజాగ్ లో జరిగింది. ఇప్పుడు నేను నటించిన సినిమా ఆడియో వైజాగ్ లో జరగడం సంతోషంగా ఉంది. సూర్య, కార్తీ మంచి నటులు ఈ సినిమాతో సూర్య సక్సెస్ ఫుల్ నిర్మాత కాబోతున్నారు. డైరెక్టర్ పాండిరాజ్ ఈ సినిమాలో అందరికి మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఇచ్చారు. సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను” అన్నారు.

డైరెక్టర్ పాండిరాజ్ మాట్లాడుతూ…

చినబాబు సినిమాపై తమిళ్ లో ఎంతటి అంచనాలు ఉన్నాయో తెలుగులో అంతే అంచనాలు ఉన్నాయి. సూర్య, కార్తీ ఈ స్క్రిప్ట్ ఓకే చెయ్యడంతోనే ఈ సినిమా సగం సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో యాక్షన్, ఫ్యామిలీ, లవ్ ఉన్నాయి. అందరికి నచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతోంది.

రచయిత శశాంక్ వెన్నెలకంటి మాట్లాడుతూ…

“చినబాబు సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. సాంగ్స్ బాగున్నాయి. ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న మిరియాల రవీందర్ రెడ్డి గారికి మంచి లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్న” అన్నారు.

నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ…

“వైజాగ్ ప్రజలకు నమస్కారం. ఇక్కడ ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులకు స్పెషల్ థాంక్స్. నేను మీలాగే ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. వ్యవసాయం చెయ్యాలని తండ్రి చెబితే కొడుకు తన తండ్రి కోసం రైతుగా విజయం సాధిస్తాడు ఈ సినిమాలో. రైతు పాత్రలో కార్తీ అద్భుతంగా నటించారు. డైరెక్టర్ ఈ సినిమాను చక్కగా తీశారు. సినిమా సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను” అన్నారు.

హీరో కార్తీ మాట్లాడుతూ…

“నన్ను అన్నయ్యను సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కృతజ్ఞతలు. రైతును మర్చిపోతున్న సమయంలో రైతును గుర్తుచేసుకొనే విధంగా సినిమా చెయ్యడం గర్వంగా ఉంది. అన్నయ్య సూర్య ఈ సినిమా చూసి మెచ్చుకోవడం జరిగింది. జులై లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరు కలిసి ఉండాలని చెప్పే సినిమా ఇది. ఈ సినిమా చూసాక మీరు మీ అన్నా, తమ్ముడు, అక్కా, చెల్లికి ఫోన్ చేసి మాట్లాడుతారు” అన్నారు.

హీరో సూర్య మాట్లాడుతూ…

“తెలుగువారందరికి నమస్తే. రైతుల గురించి చినబాబు సినిమాను నిర్మించడం జరిగింది. అందరికి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ప్యాషన్ తో నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. తమ్ముడితో సినిమా చెయ్యడం కల నిజం అయినట్లు ఉంది. సింగం3 సినిమా షూటింగ్ సమయంలో వైజాగ్ వచ్చాను అప్పుడు మీరు చూపించిన ప్రేమ మర్చిపోలేను. నా కంటే కార్తీ పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్న. కలలు కనండి వాటిని సాధించండి. పాజిటివ్ గా ఉంటె అన్నీ సాధ్యం అవుతాయి. చినబాబు అందరికి నచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది” అన్నారు.

నటీనటులు:
కార్తీ, సయేష, ప్రియా భవాని శంకర్, సత్య రాజ్, భానుప్రియ, సూరి, శంకర్, ఆర్థన బిను

సాంకేతిక నిపుణులు:
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : పాండిరాజ్
నిర్మాతలు: సూర్య, మిరియాల రవీందర్ రెడ్డి
బ్యానర్స్: 2డి ఎంటర్టైన్మెంట్స్, ద్వారకా క్రియేషన్స్
సహా నిర్మాతలు: సి.హెచ్. సాయి కుమార్ రెడ్డి, రాజశేఖర్ కర్పూర, సుందర పాండియాన్.
సంగీతం: డి.ఇమాన్
కెమెరామెన్: వేల్ రాజ్
ఎడిటింగ్: రుబన్