Category Archives: Movie News

“ఆయుష్మాన్ భవ” టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్

Category : Movie News Sliders

చ‌ర‌ణ్ తేజ్ హీరోగా స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో…. నేను లోక‌ల్ చిత్ర ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన స్టోరి, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న చిత్రం ఆయ‌ష్మాన్‌భ‌వ‌. ఈ చిత్రానికి సి టి.ఎఫ్ నిర్మాణ‌ భాద్య‌త‌లు నిర్వ‌హిస్తోంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌లు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ‌నం తో రూపోందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ లో బేబి డాళ్‌, హ్యాంగ్ ఓవ‌ర్‌, హై హీల్స్ లాంటి సూప‌ర్బ్ సాంగ్స్ కంపోజ్ చేసిన మీట్ బ్రోస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం లో ప్ర‌ముఖ హీరో్యిన్ స్నేహ ఉల్లాల్ చ‌ర‌ణ్ తేజ్ స‌ర‌స‌న న‌టిస్తోంది. ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వర రావు బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఆయుష్మాన్ భవ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. టేకింగ్ పరంగా అద్భుతంగా ఉందనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఇంటెన్స్ ఉన్న స్టోరీ కావడంతో ఆయుష్మాన్ భవ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందన్న ధీమాతో ఉన్నారు చిత్ర బృందం. స‌మాజం ప్రేమ‌ని చూసే ప‌ద్ద‌లి మారాలి అనే క‌మ‌ర్షియ‌ల్ పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. నవంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా కథానాయకుడు చ‌ర‌ణ్ తేజ్ మాట్లాడుతూ.. ముందుగా ఈ చిత్రానికి ఇంత మంచి క‌థ ని అందించట‌మే కాకుండా ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్న సూప‌ర్‌ సక్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన గారికి, స్క్రీన్‌ప్లే అందించిన ప్ర‌ముఖ ర‌చ‌యిత‌లు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ కి నా హ్రుద‌య‌పూర్వ‌క ధన్య‌వాదాలు. అలాగే క్రేజి ద‌ర్శ‌కుడు మారుతి గారు మా చిత్రానికి స‌హ‌నిర్మాత‌గా బాధ్యత‌లు స్వీక‌రించినందుకు వారికి నా ధన్య‌వాదాలు. మేము అడిగిన వెంట‌నే మా క‌థ న‌చ్చి మా చిత్రం లో హీరోయిన్ గా చేస్తున్న స్నేహ ఉల్లాల్ కి థ్యాంక్స్‌. స్నేహ ఉల్లాల్ పాత్ర ఈ సినిమాకు హైలైట్ గా ఉంటుంది. బాలీవుడ్ సూప‌ర్ మ్యూజిక్ ద‌ర్శ‌కుడు మీట్ బ్రోస్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయుష్మాన్ భవ టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అటు ప్రేక్షకులతో పాటు ఇటు ఇండస్ట్రీ నుంచి కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ప్రేమించిన అమ్మాయి కులం, మ‌తం వేరైతే.. మ‌ర్చిపోవాలా.. పారిపోవాలా.. చ‌చ్చిపోవాలా.. ప్ర‌పంచం ఏమైతే నాకేంటి స‌మాజం ప్రేమ‌ని చూసే విధానం మారాలి లేక‌పోతే చంపేస్తా .. అనుకునే హీరో క్యార‌క్ట‌రైజేష‌న్ తో ఈ చిత్రం తెర‌కెక్కింది. నవంబర్ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఆయుష్మాన్ భవ త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంద‌ని న‌మ్ముతున్నాము.. అని అన్నారు..

న‌టీన‌టులు.. చ‌ర‌ణ్‌తేజ్‌, స్నేహ ఉల్లాల్‌, హుజ‌న్‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ రావు, రంగ‌రాజ‌న్‌, అశ్విన్‌, నిఖిత త‌దిత‌రులు ..

టైటిల్‌.. ఆయుష్మాన్ భ‌వ‌
ప్రోడ‌క్ష‌న్ హౌస్ అండ్ ప్రోడ్యూస‌ర్‌.. సి.టి.ఎఫ్‌
స‌హ‌-నిర్మాత‌.. మారుతి
అసోసియెట్ ప్రొడ్యూస‌ర్‌.. బి.ఏ.శ్రీనివాస‌రావు , హేమ రత్న‌
క‌థ‌-ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌.. త్రినాథ్ రావు న‌క్కిన‌
క‌థ‌నం.. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌
సంగీతం.. మీట్ బ్రోస్‌
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌.. బీమ్స్ సిసిరోలియో(bheems ceciroleo)
పి.ఆర్‌.ఓ- ఏలూరు శ్రీను
కెమెరా.. దాస‌ర‌ధి శివేంద్ర‌
ఆర్ట్‌- పి.ఎస్‌.వ‌ర్మ‌
కాస్ట్యూమ్స్‌- పొట్ట హ‌రిక‌
సి.టి.ఎఫ్ టీమ్‌- రెడ్డి రాఘ‌వేంద్రావు, రొయ్య‌ల న‌వీన్ కుమార్‌, తాళ్ళ సుబ్బారెడ్డి.
ద‌ర్శ‌కత్వం- చ‌ర‌ణ్ తేజ్‌


‘ఇది నా బయోపిక్’ ప్రారంభం!

Category : Movie News Sliders

విశ్వ కథానాయకుడిగా పరిచయం అవుతోన్న సినిమా ‘ఇది నా బయోపిక్’. నిఖిత పవర్ కథానాయిక. శివ గణేష్ దర్శకత్వంలో యువన్ టూరింగ్ టాకీస్ పతాకంపై రవిచంద్ర ఈమండి, శ్రీనివాస్ జివిరెడ్డి, నాగేంద్ర వర్మ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు జీవా క్లాప్ ఇవ్వగా, టీఆర్ఎస్‌ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీ నాయకులు మెట్ట సూర్యప్రకాష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో

దర్శకుడు శివగణేష్ మాట్లాడుతూ “ఇదొక క్రైమ్ థ్రిల్లర్. కథ, కథనాలు సరికొత్తగా ఉంటాయి. క్రైమ్ థ్రిల్ల‌ర్‌కి ‘ఇది నా బయోపిక్’ అనే టైటిల్ ఎందుకు పెట్టామనేది ఆసక్తికరం. దర్శకుడిగా నా మూడో చిత్రమిది. నా తొలి సినిమా ’33 ప్రేమకథలు’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. రెండో సినిమా ‘సకల కలవల్లభుడు’ చిత్రీకరణ పూర్తయింది. ఆ సినిమా త్వరలో విడుదలవుతుంది” అన్నారు.

నటుడు జీవా మాట్లాడుతూ “చిన్న చిత్రాలను ప్రోత్సహిస్తేనే చిత్ర పరిశ్రమ సుభిక్షంగా ఉంటుంది. ఇక, ఈ సినిమా విషయానికి వస్తే… ఇందులో ముఖ్యమైన పాత్ర చేస్తున్నా. దర్శకుడు శివగణేష్ చాలా పట్టుదల కల వ్యక్తి. అనుకున్నది సాధించేవరకూ వదిలిపెట్టడు. అతని దర్శకత్వంలో రూపొందిన ‘సకల కళావల్లభుడు’లో నటించా. అతడితో మరో సినిమా చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది” అన్నారు.

హీరో విశ్వ మాట్లాడుతూ “హీరోగా నా మొదటి సినిమా ఇది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి నా మిత్రుడు. చక్కటి టీమ్. ప్రేక్షకుల ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నా” అన్నారు.

నిర్మాతలలో ఒకరైన రవిచంద్ర ఈమండి మాట్లాడుతూ “దర్శకుడు శివగణేష్ నా మిత్రుడు, శ్రేయోభిలాషి. అతను కథ చెబుతున్నంత సేపూ తర్వాత ఏం జరుగుతుందోననే ఉత్కంఠ కలిగింది. అంత ఆసక్తికరమైన కథ. వచే నెల (జూలై) 26వ తారీఖు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ షెడ్యూల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. టోటల్ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.

సంగీత దర్శకుడు అజయ్ పట్నాయక్ మాట్లాడుతూ “శివగణేష్‌తో మూడో చిత్రమిది. సంగీత దర్శకుడిగా ఐదో సినిమా. ఈ సినిమాలో పాటలకు చక్కటి సందర్భాలు కుదిరాయి” అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు ‘జబర్దస్త్’ మురళి, కథానాయిక నిఖిత పవర్ తదితరులు పాల్గొన్నారు.

30 ఇయర్స్ పృథ్వీ, జీవా, అపూర్వ, ‘జబర్దస్త్’ మురళి, పప్పు ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ఆర్ట్: సుమిత్ పటేల్, యాక్షన్: నందు, సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి, మ్యూజిక్: అజయ్ పట్నాయక్.


శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వెంక‌టేశ్, వ‌రుణ్‌తేజ్‌

Category : Movie News Sliders


శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వెంక‌టేశ్, వ‌రుణ్‌తేజ్‌, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన `ఎఫ్‌2`

వైవిధ్య‌భ‌రిత‌మైన సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తిని చూపే అగ్ర క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేశ్‌తో `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు` వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత‌…. మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ తో `ఫిదా` వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత.. యంగ్ అండ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్‌` వంటి సూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత … స్టార్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సార‌థ్యంలో రూందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎఫ్‌2` ప్రారంభోత్సం శుక్ర‌వారం హైదరాబాద్ దిల్‌రాజు కార్యాల‌యంలో జరిగింది. దేవుడి ప‌టాల‌పై చిత్రీక‌రించిన తొలి స‌న్నివేశానికి హీరోలు వెంక‌టేశ్, వ‌రుణ్‌తేజ్‌ల‌పై ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ క్లాప్ కొట్టారు. అల్లు అరవింద్‌, దిల్‌రాజు, వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ స్క్రిప్ట్‌ను డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడికి అందించారు.

`ఎఫ్‌2`… `ఫ‌న్ అండ్ ఫ‌స్ట్రేష‌న్ ఉప‌శీర్షిక‌తో తెర‌కెక్క‌బోయే ఈ సినిమా జూలై 5 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. క‌మ‌ర్షియ‌ల్ వేల్యూస్‌తో కామెడీ ఎంట‌ర్ టైన‌ర్స్‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను ఆద్యంతం ఫ‌న్ రైడ‌ర్‌గా తెర‌కెక్కిస్తారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నాం“ అని యూనిట్ స‌భ్యులు తెలిపారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో దిల్‌రాజు, శిరీశ్‌, ల‌క్ష్మ‌ణ్ త‌దిత‌రులు కూడా పాల్గొని యూనిట్‌కి శుభాకాంక్ష‌ల‌ను అందించారు.


టిక్ టిక్ టిక్ కు ఆడియెన్స్ మౌత్ పబ్లిసిటి బాగుంది.

Category : Movie News Sliders

ఇండియన్ సినిమా చరిత్రలొనె తొలి స్పెస్ మూవీగా హాలీవుడ్ చిత్రాల క్వాలీటి కి ఏమాత్రం తగ్గకుండా టిక్ టిక్ టిక్ ను రూపొందించాం. మా ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు సక్సెస్ చెశారు. ఇలాగే మరిన్ని వైవిధ్యమైన, కథాబలమున్న సినిమాలను మీ ముందుకు తీసుకువస్తామన్నారు.

నిర్మాత లక్ష్మణ్ చదలవాడ మాట్లాడుతూ.. బిచ్చగాడు, డి 16, ఇప్పుడు టిక్ టిక్ టిక్. హ్యాట్రిక్ విజయాలు మా బ్యానర్ కు తెలుగు
ప్రేక్షకులు అందించారు. మా చిత్రాలకు ఆడియెన్స్ మౌత్ పబ్లిసిటీ నే బలం. అందుకే నేరుగా ప్రేక్షకుల కు దన్యవాదాలు తెలిపెందుకు మీ ముందుకు వచ్చామన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.. మంచి సినిమాలకు ఎల్లప్పుడు ఆదరణ ఉంటుందని మరొసారి ఆడియెన్స్ నిరూపించినందుకు ఆనందంగా ఉందన్నారు.


GA2 పిక్చ‌ర్స్ “గీతగోవిందం” మెద‌టి లుక్‌

Category : Movie News Sliders

అర్జున్ రెడ్డి చిత్రం లో స్టార్‌డ‌మ్ ని సంపాయించట‌మే కాకుండా కొట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న విజ‌య్ దేవ‌ర కొండ హ‌రోగా, చ‌లో చిత్రంతో క్రేజి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట‌ర‌య్యిన ర‌ష్మిక మందాన్న హీరోయిన్ గా శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ తో ఎంట‌ర్‌టైన్ చేసిన ప‌రుశురాం(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం” గీత గోవిందం”. యంగ్ టాలెంటెడ్ ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో ఎస్ ప్రోడ్యూస‌ర్ శ్రీ అల్లు అర‌వింద్ గారు స‌మ‌ర్ప‌ణ‌లో GA2 PICTURES బ్యాన‌ర్ లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. “గీత గోవిందం” మెద‌టి లుక్ ని ఈ రోజు విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్న ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల‌కి సిధ్ధ‌మ‌వుతుంది.

చిత్ర స‌మ‌ర్ప‌కులు శ్రీఅల్లు అర‌వింద్ గారు మాట్లాడూతూ.. పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాల‌తో త‌న యాక్టింగ్ స్కిల్స్ తో స్టార్‌డ‌మ్ ని సంపాయించారు. గీతగోవిందం చిత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్లో మ‌రో బెస్ట్ చిత్రం గా నిలుస్తుంది. ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ప‌రుశురాం చాలా బాగా రాసుకున్నాడు. హీరోయిన్ ర‌ష్మిక పాత్ర మ‌న ప‌క్కింటి అమ్మాయిలా వుంటుంది. విజ‌య్‌, ర‌ష్మిక ల మ‌ద్య వ‌చ్చే సీన్స్ బాగా రాసుకున్నాడు. ప‌ర‌శురాం మా బ్యాన‌ర్ లో రెండ‌వ చిత్రం చేస్తున్నాడు. క‌మిట్‌మెంట్ వున్న ద‌ర్శ‌కుడు. గోపిసుంద‌ర్ సంగీతం బాగుంది. ఆయ‌న కూడా మా బ్యాన‌ర్ లో రెండ‌వ చిత్రం చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ని మా నిర్మాత బన్ని వాసు ఎనౌన్స్ చేస్తాడు. అని అన్నారు.

ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌ (బుజ్జి) మాట్లాడుతూ.. గీతాఆర్ట్స్ లో శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రం చేశాను. చాలా మంచి విజ‌యాన్ని ప్రేక్ష‌కులు అందించారు. అలాగే ఇప్ప‌డు గీతగోవిందం లాంటి రోమాంటిక్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్నాను. అల్లు అరవింద్ గారి బ్లెస్సింగ్స్ తో బ‌న్ని వాసు స‌పోర్ట్ తో ఈ చిత్రం చాలా బాగా వ‌చ్చింది. ఇప్ప‌డు టాలీవుడ్ లెటెస్ట్ స‌న్సెష‌న్ స్టార్ విజ‌య్ దేవ‌ర కొండ గోవిందం అనే పాత్ర‌లో అల‌రించ‌బోతున్నారు. అర్జున్ రెడ్డి త‌రువాత విజ‌య్ ఎలాంటి పాత్ర‌లో క‌నిపిస్తాడు అనే క్యూరియాసిటి అంద‌రితో పాటు నాకు వుంది. అందుకే చాలా జ‌గ్ర‌త్త‌గా త‌న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ పాత్ర‌ని డిజైన్ చేశాను. మా గోవిందం త‌న యాటిట్యూడ్ ని ఎక్క‌డా త‌గ్గ‌నివ్వ‌కుండా చ‌క్క‌టి ఫ్యామిలి ఎమెష‌న్స్ తో అంద‌ర్ని అల‌రిస్తాడు. అలాగే మా గీత అదే ర‌ష్మిక త‌న పాత్ర లో ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేసింది అని చెప్ప‌ను..ఎందుకంటే గీత పాత్ర ఎలా వుంటుందో .. ర‌ష్మిక ఆఫ్ లైన్ అలానే వుంటుంది. మీరు రియ‌ల్ లైఫ్ ర‌ష్మిక ని స్క్రీన్ మీద చూస్తారు. ఇక మా గీతాగోవిందం చేసే అల్ల‌రి అంతా ఇంతా కాదు. మా మెద‌టి లుక్ చూస్తే వీరిద్ద‌రి మ‌ద్య లొ వున్న కెమిస్ట్రి అర్ద‌మ‌య్యే వుంటుంది.. త్వ‌ర‌లో మా నిర్మాత బ‌న్నివాసు గారు వీరిద్ద‌రి అల్ల‌రికి ఓ డేట్ ఫిక్స్ చేసి మ‌న‌కి చెప్తారు.. అని అన్నారు.

నిర్మాత బ‌న్ని వాసు మాట్లాడుతూ.. టాలెంట్ వుంటే చాలు అదే నీకు కేరాఫ్ అంటూ మమ్మ‌ల్ని ఎంక‌రేజ్ చేసిన‌ మా గీతాఆర్ట్స్ అథినేత శ్రీ అల్లు అర‌వింద్ గారికి నా ప్ర‌త్యేఖ ద‌న్య‌వ‌దాలు. యూత్ , ఫ్యామిలి ఎం కొరుకుంటే అలాంటి చిత్రాలే ప్రేక్ష‌కుల‌కి ఇవ్వాలి.. 100 టికెట్ తో ధియెట‌ర్ కి వ‌చ్చే ప్రేక్ష‌కుడు నిరుత్సాహ ప‌డ‌కూడదు అనే కాన్సెప్ట్ లో మమ్మ‌ల్ని ప‌నిచేయుస్తున్న అర‌వింద్ గారు చిత్ర స‌మ‌ర్ప‌కులు గా వుండ‌టం చాలా ఆనందంగా వుంది. ఇక మా గోవిందం అలియాస్ విజ‌య్ దేవ‌రకొండ క్రేజ్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. మా గీత గోవిందం చిత్రాన్ని ఆయ‌న స‌పోర్ట్ మా యూనిట్ అంతా మ‌ర్చిపోలేము. విజ‌య్ హ‌ర్ట్ ఎంత గోప్ప‌దో మా చిత్రం కూడా అంత గొప్ప‌ద‌ని నా అభిప్రాయం. ప‌రుశురాం కి ఫ్యామిలి ఎమెష‌న్స్ ని తెర‌కెక్కించ‌టం వెన్న‌తో పెట్టిన విధ్య. విజ‌య్ దేవ‌ర‌కొండ మా హీరోయిన్ ర‌ష్మిక మద్య మంచి రోమాంటిక్ కామెడి సీన్స్ చాలా బాగా తెర‌కెక్కించాడు. గోపిసుంద‌ర్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. గీత గోవిందం చేసే అల్ల‌రి యూత్ ని ఆక‌ట్టుకుంటాయి. త్వ‌ర‌లోనే విడుద‌ల తేది ని ఎనౌన్స్ చేస్తాం.. అని అన్నారు

న‌టీన‌టులు..

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మందాన్న, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, గిరిబాబు, అన్న‌పూర్ణ‌మ్మ‌, మౌర్యాని, సుభాష్‌, అభ‌య్‌, స్వ‌ప్న‌క‌, స‌త్యం రాజేష్‌, దువ్వాసి మెహ‌న్‌, గుండు సుద‌ర్శ‌న్‌, గౌతంరాజు, అనీష‌, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, సంధ్య జ‌న‌క్ త‌దిత‌రులు…

సాంకేతిక నిపుణులు..
స‌మ‌ర్ప‌కులు.. అల్ల అర‌వింద్‌
నిర్మాత‌.. బ‌న్నివాసు
క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం… ప‌రుశురామ్‌
సంగీతం.. గోపిసుంద‌ర్‌
సినిమాటోగ్రాఫ‌ర్‌.. మ‌ణికంద‌న్‌
ఎడిట‌ర్‌.. మార్తాండ్‌.కె.వెంక‌టేష్
ఆర్ట్‌.. ర‌మ‌ణ వంక‌
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.. స‌త్య గ‌మిడి
స్క్రిప్ట్ కొ-ఆర్డినేట‌ర్‌.. సీతారామ్‌
లిరిక్స్‌.. అనంత్ శ్రీరామ్‌, శ్రీమ‌ణి,
కొరియోగ్రాఫి… ర‌ఘు, జాని
ప‌బ్లిషిటి డిజైన‌ర్‌.. అనిల్ భాను
పి ఆర్ ఓ.. ఏలూరు శ్రీను


CHANDRA SIDHARTHA STAGES A STRONG COMEBACK By NARENDRA BABU

Chandra Sidhartha the talented and renowned director of Telugu Film Industry is back in Action after a gap of 4 years and is coming up with a fresh new bilingual Genre titled AATAGADHARA SHIVA under the banner of Rockline Entertainment Films, the film is made in Telugu and Kannada. The trailers already creating sensation among the viewers assuming the film to be a great hit .

#AATAGADHARA SHIVA has new cast, new concept and fresh music that can keep the audiences glued to their seats. The film will also remind the Producers to believe in Talent and take Telugu film Industry to high esteem and not depend on Business Trend by deceiving the hard earned money of the filmy viewers by producing stereo type concepts.

Who can forget Chandra Sidhartha a diligent in chalking out a philosophical enigma “Aa Naluguru” which made a hallmark in Telugu film Industry receiving the Prestigious Nandi award and many acclaims and accolades from different Film Fraternities .

Mind you this brilliant directors magic wand did produce magic in most of his films be it Andharu Bandhuvayya & Madhumasam. Even though Chandra Sidhartha showered with ample opportunities he with his hardest effort churned those in to Awards and Critic Acclaims thus showering sparks of his brilliance on Telugu film Industry.

Chandra Sidhartha needs no mention of his master piece films, after garnering three state Nandi awards for his brilliant work in Aa Naluguru and Andhari Bandhuvayya he took up a mantle of producing Nirantharam in 1995 under Film and Television Institute of India and did received accolades at Cairo and Locarno International Film Festival.

Chandra Sidhartha also claims the honor of being the first Telugu director to make debut as a director in 2001 released English movie “The Inscrutable Americans” based on Anurag Mathur’s best selling novel of the same name.

The Inscrutable Americans was also premiered at Milan, Newyork, Atlanta, London and Kerala International film festivals.

Chandra Sidhartha’s presence went unnoticed even after serving as a Jury member for AP State Nandi awards from 2013-2015, Film fare Jury 6 times and South Indian Cinematographers Association awards as Jury Head, but that didn’t matter for the Confident Genius who always made a successful comeback with his swashbuckling presence.

In this Competitive era Talent is abundantly found but to remain with that tag for long is a daunting task, but legends are born with talent to remain and be remembered for ever, Ace Director Chandra Sidhartha belongs to the legendary clan.

Our best wishes to Chandra Sidhartha on his bilingual film “Aatagadhura Shiva” and may his comeback stint be a memorable and successful one .


MAHESH BABU-Enduring Enigma


Mahesh Babu the tall handsome hero who conquered Telugu Film Industry and Fans hearts with his versatile style is the buzz of tinsel town.
Even with Stardom Tag received Courtesy : Father Dr.Krishna, created his own brand to elevate his form to reach the peak.

Mahesh babus richest asset his elegant style ranked him twelfth on Times 50 Most desirable Men in India for 2010, and ascended the ladder to be on top most position for the year, beating the Bollywood Big Stars in Hrithik Roshan, Salman Khan, and Sharukh khan and taking Telugu Industry to soaring heights.

It was not easy for Mahesh Babu to keep the Stardom intact , with every failure he strongly staged a comeback to hit the bulls eye at box office collections.

Even with Child hood roles in his early stint with Telugu Cinema, that only quenched Mahesh Babus thirst for passion and not profession.
When he made his debut under Legendary director K. Raghavendra Rao’s Rajakumaradu opposite Bollywood Queen Preety Zinta, people only recognized him to be a chocolate hero promoted by Telugu Doyen Krishna
.
Rajakumarudu earned Mahesh Babu success but not recognition , followed by string of flops in his Kitty be it Yuvaraju, Takkari Donga, Vamsy and Bobby not until Krishna Vamsi boosted him with a Successful Murari that was the turning point for him to stage a comeback.

But with Gunashekhars Block buster hit Okadu he rose to touch the Portrait of Stardom, but followed Flop Charts striking his blurry vision of choosing scripts and fans slowly started to term “End to an Illustrious Career ”


The year 2004-2010 saw Mahesh Babu recover from his Scars, Courtesy his Lady Luck in the form of wife Namrata Shirodkar with Trivikram Srinivas Athadu and Puri Jagannaths Pokii hitting the bulls eye raking huge profits for Producers ad Distributors and staying as biggest Hits in Mahesh Babus Career. Fans still believed him and Mahesh babu Justified their belief.
But Once again Destiny hit Mahesh Babu with unsuccessful films in Khaleja and Sainukudu that demotivated him and discouraged his fans.

2011-2014 Saw Mahesh Babu rise from the Slump of failure, any one in his place would have surrendered and replaced their career, but with Sreenu Vaitlas Dookudu, Puri Jagannaths BusinessMan , Srikkanth Adalas Seethamma Vakitlo Sirimalu Chettu rose him to be on peak of his career and top the List of Superstars in Tollywood. All these films reaped Profits, Awards and Accolades and Fans Trust in their Super Star.

Mahesh Babu gained the honor of being the Second after Super Star Rajanikanth to be paid highest remuneration for his work.

But that was not the end Once again Mahesh Babu films flipped and flopped at the Box with Aagadu, Nenokkadene inviting losses to Producers and distributors even with tag of renowned directors to the films.

2015 till date had Mahesh Babu stay in a safe Zone with Koratala Shivas Srimanthudu giving him a Successful break with film receiving many awards and inspired many to adopt villages in serving the poor . But once again Brahmotsavam and Spyder deceived him and his folly in selecting the right scripts after success blindfolded him.

Koratala Shiva lifted Mahesh Babu from danger zone by giving him a career hit Bharat Ane Nenu an inspirational Movie which also caught the attention of Telanganas Governance and that’s not the end. Mahesh Babu has decided to concentrate on Scripts before signing up any new venture to keep his Stardom and his fans belief in him intact.

Awards and Accomplishments: Mahesh Babu received 5 Film Fare Awards from 2004-2016 for his films for Okadu, Pokiri, Dookudu, Seethammavakitlo Sirimali Chettu, Businessman, Srimanthudu.

Nandi Awards: Dookudu (2011), Srimanthudu (2016)

South Indian International Movie Awards: Dookudu (2012), Sitamma Vakitlo Sirimalli Chetu (2014).

Media and Advertisements endorsed by Mahesh Babu
Mahesh Babu is chosen as Ambassador for numerous South Indian Brands, Thums up being his lucrative endorsement.
Mahesh Babu stands 37th among the top 100 Celebrity List ranked by Forbes-100 and a Pride for Telugu Film Industry .


Dil Raju’s ‘Lover’ Audio Release Date

Category : Movie News Sliders

Raj Tharun & Riddhi Kumar’s ‘Lover’ audio will be out on June 24, 2018.

Producer: Harshith Reddy

Director: Annish Krishna

Music: Ankit Tiwari, Sai Karthik, Tanishk Bagchi, Arko, Rishi Rich

Banner: Sri Venkateswara Creations



జూన్‌ 21న ‘తేజ్‌ ఐ లవ్‌ యు’ సాంగ్‌ ప్రోమో విడుదల

Category : Movie News Sliders

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం ‘తేజ్‌’. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. ఇటీవల విడుదలై ఈ చిత్రం ఆడియోకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. గోపీసుందర్‌ ఈ చిత్రంలోని అన్ని పాటలకు సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ అందించారు. కాగా, జూన్‌ 21 సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రంలోని ‘నచ్చుతున్నాదే..’ సాంగ్‌ ప్రోమోను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 
సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, ప థ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి లిరిక్స్‌: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్‌, గోశాల రాంబాబు, స్టంట్స్‌: వెంకట్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సతీశ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, చీఫ్‌ కో డైరెక్టర్‌: చలసాని రామారావు, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్‌: సాహి సురేశ్‌, సంగీతం: గోపీ సుందర్‌, సినిమాటోగ్రఫీ: అండ్రూ.ఐ, మాటలు: డార్లింగ్‌ స్వామి, సహ నిర్మాత: వల్లభ, నిర్మాత: కె.ఎస్‌.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌.