Category Archives: Movie News

‘వకీల్ సాబ్’లో ఆలోచింపజేసే పవర్‌ఫుల్ డైలాగ్స్

దేశంలో అడుక్కునే వాడికి అన్నం దొరుకుతుంది. కష్టపడే వాడికి నీడ దొరుకుతుంది. కానీ పేదవాడికి మాత్రం న్యాయం దొరకడం లేదు

★ ఆశకి, భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్లవి. వాళ్లు నన్ను పట్టించుకోకపోయినా నేను వాళ్లను పట్టించుకుంటాను.

★ ఓటమి అంటే అవమానం కాదు. మనల్ని మనం గెలుచుకునే అవకాశం.

★ నాకు కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు.

★ రాముడు అయోధ్యలో ఉన్నా అడవిలో ఉన్నా సంతోషంగానే ఉంటాడు. కానీ భక్తులే బాధపడతారు.

★ న్యాయం కోసం పోరాడేటప్పుడు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది.

★ ఒక అమ్మాయి వ్యక్తిత్వాన్ని ఆమె వేసుకునే దుస్తుల్లో, చేసే పనుల్లో, ఆమె ప్రవర్తన బట్టి అంచనా వేయడం తప్పు. వాళ్లకు నచ్చినట్లు వాళ్లు ఉండటం ప్రాథమిక హక్కు.

★ ఆడది అంటే బ్రాతూమ్‌లో ఉండే బొమ్మ కాదు. నిన్ను కనిపెంచిన అమ్మ కూడా. చీడ పురుగులు మగవాళ్ల తలలో పెట్టుకుని మందు ఆడవాళ్ల మీద కొడితే ఎలా?

★ ఆశతో ఉన్నవాడే గెలుపు, ఓటములు గురించి ఆలోచిస్తాడు. ఆశయంతో ముందుకు వెళ్లే వాడికి కేవలం ప్రయాణం గురించి మాత్రమే ఆలోచన ఉంటుంది.

★ నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా.. కానీ దాని బలం ముందు ఎవ్వరైనా తతలొగ్గాల్సిందే.. నువ్వు గెలుపు కోసం వచ్చావ్.. నేను న్యాయం కోసం వచ్చా.

★ మన ఇంట్లో ఉండే గడియారంలో చిన్న ముల్లు కూడా అమ్మాయి క్యారెక్టర్‌ని డిసైడ్ చేస్తుంది. రాత్రిపూట ఓ అమ్మాయి ఒంటరిగా వెళ్తే.. బైకులు, కార్లు, ఆటోలు అన్నీ స్లో డౌన్ అవుతాయి. సైడ్ మిర్రర్లు కిందికి దిగుతాయి. జిరాఫీల్లా తలలు పొడుచుకొస్తాయి. చూపులు సూదులవుతాయి. అబ్బాయిలు బయటికొస్తే సరదా.. అమ్మాయిలు బయటికొస్తే మాత్రం తేడా

★ మద్యం తాగడం హానికరం… ఆడవాళ్లకైనా, మగవాళ్లకైనా. ఆడవాళ్లు తాగితే పడుకుంటారు అనుకోవద్దు. అయినా ఒక మనిషికి ఉన్న అలవాట్లను బట్టి క్యారెక్టర్‌ని ఎలా డిసైడ్ చేస్తాం?

★ అమ్మాయి జీన్స్ వేసుకోకూడదు. స్కర్ట్ వేసుకోకూడదు. వాళ్లకి నచ్చిన బట్టలు వేసుకోకూడదు. ఎందుకంటే అలాంటి బట్టల వల్ల అమ్మాయిలకు ప్రమాదకంర కాదు. అబ్బాయిలకి ప్రమాదం. పాపం ఎందుకంటే.. అబ్బాయిలు టెంప్ట్ అయిపోతారు. అందుకే ఇలాంటి అమాయకులైన అబ్బాయిలను మనం కాపాడుకుందాం..

★ ఆడవాళ్లు మనకు ఆనందాన్ని మాత్రమే ఇవ్వాలి. హక్కుల గురించి అడిగితే… ఇలా బోనులో నిలబెట్టి వేశ్య అని ముద్ర వేసేస్తాం.


‘వకీల్‌ సాబ్’కు బ్లాక్‌బస్టర్ టాక్.. యూనిట్ సంబరాలు


‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ తొలి షోతోనే సెన్సేషనల్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని సెంటర్స్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ రావడంతో యూనిట్‌ సంబరాల్లో మునిగిపోయింది. యూనానమస్ సూపర్ హిట్ రెస్పాన్స్ నేపథ్యంలో “వకీల్ సాబ్” చిత్ర బృందం హైదరాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీసులో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా… నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ….నిర్మాతగా మారి 18 ఏళ్లవుతోంది. లైఫ్‌లో ఎన్నో సక్సెస్ లు చూశాను. డిస్ట్రిబ్యూటర్‌గా అంతకుముందు నుంచే విజయాలు చూశాను. అయితే ‘వకీల్ సాబ్’ సక్సెస్ ఎందుకో కొత్తగా అనిపిస్తోంది. ఉదయం 4.30 కూకట్ పల్లిలో ప్రీమియర్ షోస్ చూశాను. ఆ ఫ్యాన్స్ మధ్యలో సినిమా చూస్తుంటే నన్ను నేను మర్చిపోయాను. నిర్మాతనని మర్చిపోయి ఫ్యాన్స్‌లాగే పేపర్స్ విసిరేశాను. పది నిమిషాల తర్వాత రియలైజ్ అయ్యాను. వకీల్ సాబ్ మీద మాసివ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమాను ఒక్కో స్టేజీలో చూస్తుంటే ఇలాంటి ఘన విజయాన్ని అంచనా వేశాం. ప్రేక్షకులు, అభిమానుల మధ్యలో సినిమా చూస్తుంటే ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. అప్పటికే అమెరికా, దుబాయ్ షోస్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. విదేశాల నుంచి సినిమా సూపర్ హిట్ అనే టాక్ వచ్చింది. వకీల్ సాబ్ విజయం నాకు కొత్తగా అనిపించడానికి కారణం, నేను కళ్యాణ్ గారితో సినిమా చేయాలనే కోరిక కావొచ్చు, ఇలాంటి సబ్జెక్ట్ కావొచ్చు. పవన్ గారితో పాటు ఈ సినిమా సక్సెస్ ఘనత దర్శకుడు శ్రీరామ్ వేణుకి ఇస్తాను. ఒక హీరోను ఇలా చూడాలి అనే ఆలోచనతో తను రాసుకున్న సీన్స్ కానీ, ప్రెజంటేషన్ గానీ సూపర్బ్. ప్రతి సీన్‌కు, ప్రతి డైలాగుకు ఆడియెన్స్ రియాక్ట్ అవుతున్నారు. గంటా పదిహేను నిమిషాల సెకండాఫ్ అయితే విజిల్స్, చప్పట్లు కొడుతున్నారు.

సినిమా అయ్యాక దర్శకుడు వేణుకు కాల్ చేశాను. ఇద్దరం కలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్లాం. ఆయనకు ముందుగా చెప్పలేదు, ఆ సంతోషంలో ఆయన ఇంటికి వెళ్లి పవన్ గారిని కలిసి సినిమా సక్సెస్ గురించి చెప్పాం. ఆయన కూడా చాలా సంతోషంగా ఫీలయ్యారు. కళ్యాణ్ గారు చాలా సక్సెస్‌లు చూశారు కానీ వకీల్ సాబ్‌లో అమ్మాయిలు, మహిళల గొప్పదనం తెలిపే కంటెంట్ ప్రేక్షకులకు రీచ్ అయితే ఆ సంతృప్తి వేరుగా ఉంటుంది. వేణు, పవన్ గారు ప్రతి సీన్ ఎలా చేయాలో డిస్కషన్ చేసుకుని షూట్ చేశారు. ఆ సీన్స్ ఇప్పుడు థియేటర్లో బాగా ఆకట్టుకుంటున్నాయి. దాదాపు గంట సేపు పవన్ గారితో మాట్లాడాం. నేను ప్రసాద్ ఐమాక్స్, సుదర్శన్ థియేటర్లకు వెళ్లి అక్కడ ఆడియెన్స్ రెస్పాన్స్ గమనించాను. టెర్రఫిక్ రెస్పాన్స్ ఉంది. ఏదో తెలియని అనుభూతికి లోనవుతున్నాను. ఇంతలో చాలా మంది మీడియా పర్సన్స్ ఫోన్ చేసి సినిమాను ప్రశంసిస్తూ మాట్లాడారు. మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. ఇదొక అద్భుతమైన ఎక్సీపిరియన్స్. బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్, కళ్యాణ్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటూ చెబుతున్నారు. ఈ సినిమా ఎంత సునామీ సృష్టిస్తుందో ఇప్పుడో చెప్పలేం. ఇప్పటిదాకా వచ్చిన రిపోర్ట్ మాత్రం ట్రెమండస్‌గా ఉన్నాయి. ఏ సినిమా ఎంత డబ్బు తెస్తుందనేది నేనెప్పుడూ ఆలోచించలేదు. మంచి సినిమా చేశాక డబ్బు ఆటోమేటిక్‌గా వస్తుంది. 18 ఇయర్స్ నుంచి మా సంస్థలో ఉన్న వేణు, నా డ్రీమ్ ప్రాజెక్ట్‌కు ఇంత విజయాన్ని ఇచ్చాడు. అందుకు అతన్ని సత్కరిస్తున్నాం’ అని అన్నారు.

దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ….ఓవర్సీస్‌తో పాటు అన్ని చోట్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూత్ మాస్ మహిళలు.. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆస్వాదిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అని చెబుతున్నారు. ఇవాళ టికెట్స్ దొరకని వారు రేపు బుక్ చేసుకుని వెళ్లండి. సినిమాను ఎంజాయ్ చేయండి. టాక్ బాగా స్ప్రెడ్ చేస్తున్న మీడియా వాళ్లకు థాంక్స్. రాజు గారు మార్నింగ్ షో సినిమా చూసి దర్శకుడిని పిలిచి మాట్లాడుతారు. ఇలాగే ఇవాళ నన్ను మాట్లాడేందుకు పిలిచారు. ఇద్దరం కలిసి పవన్ గారి దగ్గరకు వెళ్లాం. అభిమాన హీరోతో హిట్ సినిమా చేసి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారో తిరిగి ఆయనతో చర్చించుకోవడం మాటల్లో చెప్పలేని అనుభూతినిచ్చింది. లైఫ్ లాంగ్ ఈ మూవ్‌మెంట్స్ గుర్తుపెట్టుకుంటాను.

పవన్ గారి వ్యక్తిత్వం ఒక అభిమానిగా నాకు తెలుసు. అందుకే ఆయన పాత్రకు సత్యదేవ్ అని పేరు పెట్టి, ఆయన సమాజాన్ని చూసే కోణంలోనే డైలాగ్స్ రాశాను. సత్యదేవ్ క్యారెక్టర్ ప్రజల కోస పోరాడతాడు. ఆ కోణంలోనే మాటలు రాశాం. ఇవి జనసేన పార్టీ రిలేటెడ్‌గా కుదిరాయని ఎవరైనా అంటే సంతోషమే కదా. వకీల్ సాబ్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన రాజు గారికి, కళ్యాణ్ గారికి, త్రివిక్రమ్ గారికి థాంక్స్. ఈ విజయం ఆర్టిస్టుల సహా కంప్లీట్ టీమ్ వర్క్. అంతా తమ బెస్ట్ వర్క్ చేశారు. మా చిత్ర బృందం అందరికీ థాంక్స్’ అంటూ ఆయన ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీరామ్ ‌వేణుకు నిర్మాత దిల్ రాజు శాలువా కప్పి, పుష్పగుచ్చంతో సత్కరించారు. అనంతరం యూనిట్ బాణాసంచా కాలుస్తూ వకీల్ సాబ్ సక్సెస్ సంబరాలు జరుపుకున్నారు.


అక్కడ పవన్ ఆటిట్యూడ్ నచ్చింది: రేణుదేశాయ్

మూడేళ్లు వెండితెరకు దూరమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ‘వకీల్ సాబ్’గా తిరిగి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలయ్యే ఏప్రిల్ 9వ తేదీ కోసం ఆయన అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ చేస్తున్న ప్రమోషన్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే వకీల్ సాబ్ ట్రైలర్ విడుదలై ఒక్క రోజులోనే రికార్డులు కొల్లగొట్టింది. తాజాగా ఈ ట్రైలర్ పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన మనసులో మాట బయటపెట్టారు.

వకీల్ సాబ్ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ చాలా ఫ్రెష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇప్పటివరకూ చూడని పవర్ స్టార్‌ స్క్రీన్‌పై కనిపిస్తున్నారు. ట్రైలర్‌లో పవన్ ఆటిట్యూడ్ నచ్చింది. అమ్మాయి తరపున వాళ్ళ కోసం పోరాడే లాయర్ పాత్రలో ఆయన అదరగొట్టేశారు పేర్కొంది. ముఖ్యంగా మీరు వర్జినా అంటూ చివర్లో అబ్బాయిని పవన్ ప్రశ్నించడం బాగుంది. మొదటి నుంచి చివరి వరకు ‘వకీల్ సాబ్’ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది’ అంటూ రేణుదేశాయ్ కితాబిచ్చింది. ఆమె స్పందన చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ తెలుగు రీమేక్‌గా ఈ ‘వకీల్ సాబ్’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శృతి హాసన్ నటించారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సినిమా మొత్తం ఈ ముగ్గురు అమ్మాయిల చుట్టూనే తిరుగుతుందని ట్రైలర్ చూస్తూనే తెలుస్తోంది. బోనీ కపూర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 9వ తేదీన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.


‘సారంగ దరియా’ సెన్సేషనల్ రికార్డ్.. ఎవరికీ సాధ్యం కాదిది


“లవ్ స్టోరి” చిత్రంలోని ‘సారంగ దరియా’ పాట యూట్యూబ్ వ్యూస్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 32 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించింది. సౌతిండియాలో మరే లిరికల్ సాంగ్ ఇంత తక్కువ టైమ్‌లో వంద మిలియన్ మార్క్ చేరుకోలేదు. ‘రౌడీ బేబీ’, ‘బుట్ట బొమ్మ’ వంటి సంచలన పాటలు కూడా లిరికల్ సాంగ్ వ్యూస్ లో ‘సారంగ దరియా’ వెనకబడిపోవడం గమనార్హం. ఫిబ్రవరి 28న ఆదిత్య మ్యూజిక్ ఛానెల్‌లో అప్ లోడ్ అయిన ‘సారంగ దరియా’ పాట తొలి రోజు నుంచే శ్రోతలను ఆకట్టుకుంటూ మిలియన్ల కొద్దీ వ్యూస్ అందుకుంటూ వచ్చింది. ‘సారంగ దరియా’కు సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ ఇచ్చిన క్యాచీ ట్యూన్, సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం, ఉత్సాహంగా మంగ్లీ పాడిన తీరు సామాన్యుడి నుంచి విశిష్ట వ్యక్తుల దాకా అందరినీ ఆకట్టుకుందది.

ఈ పాటలో శేఖర్ మాస్టర్ స్టెప్పులను నాయిక సాయి పల్లవి తనదైన స్టైల్‌లో మెరుపు తీగలా చేసింది. సాయి పల్లవి టైమింగ్, ఎనర్జీ, ఎక్స్ ప్రెషన్స్, ఇన్‌వాల్వ్ మెంట్ ‘సారంగ దరియా’ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. “లవ్ స్టోరి” చిత్రంలో ‘సారంగ దరియా’ పాటను తీసుకోవాలి అని దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన ఆలోచన 100 శాతం సక్సెస్ అయింది. ఈ సినిమాకు ‘సారంగ దరియా’ డ్రైవింగ్ ఫోర్స్ అయ్యిందనే చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల.


మెగాస్టార్ ‘ఆచార్య’ ఫస్ట్ సాంగ్ అదుర్స్‌

మెగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చిందిన ‘ఆచార్య’ టీమ్. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చరణ్ ఈ సినిమాను సిద్ధ అనే కీలక పాత్రలో కనిపించనున్నాడు. చిరంజీవి 152వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’లోని మొదటి లిరికల్‌ సాంగ్‌ను బుధవారం విడుదల చేసింది చిత్ర బృందం.

‘లాహే లాహే’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఇందులో సీనియర్‌ నటి సంగీత ప్రత్యేక ఆకర్షణగా నిలవగా చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఆమెతో కలిసి కాలు కదిపింది. గుడి సమీపంలో సాగే ఈ పాటకు మధ్యలో చిరు తనదైన శైలిలో స్టెప్పులేశాడు. దీనికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం‌ అందించగా.. మణిశర్మ స్వరాలు సమకుర్చారు. సింగర్స్‌ హరిక నారాయణ్‌, సాహితి చాగంటిలు ఆలపించిన ఈ పాటకు దినేష్‌ కొరియోగ్రఫీ అందించాడు.


పవన్‌ కళ్యాణ్ అభిమానిగా ఆ మాట చెబుతున్నా..: డైరెక్టర్ వేణు శ్రీరామ్

‘ఓ మై ఫ్రెండ్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు శ్రీరామ్ వేణు. నాని హీరోగా ‘ఎంసీఏ’ చిత్రాన్ని రూపొందించి మంచి విజయం అందుకున్నారు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ అభిమాని అయిన శ్రీరామ్ వేణు…ఒక అభిమానిగానే ఈ సినిమా తీశానని చెబుతున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమాకు దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.

క్వారెంటైన్ వల్ల అందరం ఇళ్లలోనే ఉన్నాం. ఇన్నాళ్లూ థియేటర్ సెలబ్రేషన్స్‌కు ఆడియెన్స్ దూరంగా ఉన్నారు. మొన్న థియేటర్లో వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఓ పావు గంట లోపలికి వెళ్లేందుకు మరో పావుగంట బయటకు వచ్చేందుకు పట్టింది. అంత పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చారు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి. పవన్ గారి సినిమా కోసం వాళ్లు ఎంత వేచి చూస్తున్నారో అప్పుడు అర్థమైంది.

అభిమాన హీరోను డెరెక్ట్ చేయడం కంటే కావాల్సింది ఏముంటుంది. ఈ ప్రాజెక్ట్ ను ఎంతో సంతోషంగా తీసుకున్నాను. మేకింగ్ టైమ్‌లో ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదు. దర్శకుడిగా చెబుతున్నా.. వకీల్ సాబ్ సినిమా బాగుంటుందనే పూర్తి నమ్మకం ఉంది. మనకు నచ్చిన పని చేసినప్పుడు వచ్చే సంతృప్తిని సంతోషాన్ని ఇప్పుడు పొందుతున్నా. కష్ట సుఖాలు ప్రతి పనిలో ఉంటాయి. ఒత్తిడి, కష్టం ప్రతి సినిమాకు, ప్రతి దర్శకుడికి ఉంటాయి. ఎంసీఏ టైమ్ లోనూ ఒత్తిడిది. వకీల్ సాబ్ సినిమా చేసేప్పుడు ప్రతి రోజూ ఎంజాయ్ చేశాను. పవన్ గారిని చూడగానే సంతోషం కలుగుతుంది. హ్యాపీగా ఫీలవుతాను.

ఈ ప్రాజెక్ట్ సెట్ అయినప్పుడు పవన్ గారిని వెళ్లి కలిశాను. ఆయన నాతో మాట్లాడుతూ… పింక్ రీమేక్ సినిమాను ఎలా చేద్దామనుకుంటున్నారు, మీ ఆలోచనలు ఏంటి అని అడిగారు. కళ్యాణ్ గారితో రెండు మూడు సార్లు మీటింగ్ జరిగింది. వకీల్ సాబ్ కథ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్ గురించి నేను అనుకునే విషయాలు ఆయనతో చెప్పాను.ఆయన కూడా కొన్ని ఇన్ ఫుట్స్ ఇచ్చారు. దాన్ని బట్టి ముందుకు వెళ్ళాం. కళ్యాణ్ గారికి రకరకాల ఫ్యాన్స్ ఉంటారు. ఏ,బీ,సీ అనే కేటగిరీలు ఉంటాయి. వాళ్లందరికీ చేరేలా సినిమాను రూపొందించాను. పింక్ ఒరిజినల్ అలా ఉండదు. కథ రాస్తున్నప్పుడు, స్క్రీన్ ప్లే విషయంలో, మాటల విషయంలో పవన్ గారి ఇమేజ్ గుర్తు చేసుకుంటూ వచ్చాను.

సబ్జెక్ట్, నేను రాసుకున్న స్క్రీన్ ప్లేకు తగినట్లే పవన్, నాయికల క్యారెక్టర్స్ ఉంటాయి. ట్రైలర్‌లోనే కథ చెప్పేశాను. ట్రైలర్ చూశాక మీకు అది అర్థమయి ఉంటుంది. వుమెన్ ఎంపవర్ మెంట్ గురించి ఇప్పటికే రెండు భాషల్లో ఇదే సినిమా చేశారు. వకీల్ సాబ్‌లోనూ ఆ మెయిన్ పాయింట్ ఉంటుంది. అది వదిలేసి కోర్ పాయింట్ తప్పించుకుని వేరే విధంగా సినిమాను రూపొందించలేదు.

నా మొదటి సినిమా ఓ మై ఫ్రెండ్ సరిగ్గా ఆడలేదు. ఆరేడేళ్లు టైమ్ తీసుకుని ఎంసీఏ చిత్రాన్ని చేశాను. ఫ్రెండ్స్ కథతో ఓ మై ఫ్రెండ్, వదిన మరిది కాన్సెప్ట్ తో చేసిన ఎంసీఏ ఈ రెండు సినిమాలు వకీల్ సాబ్ సినిమా చేసేందుకు ఉపయోగపడ్డాయి. నా ఫస్ట్ సినిమా రిలీజై ఈ నవంబర్ కు సరిగ్గా పదేళ్లు పూర్తవుతున్నాయి. నాకు సినిమాలంటే ఇష్టం. హిట్స్ ఫ్లాప్స్ ఏది వచ్చినా ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాను. పవన్ గారితో పనిచేయాలి అనేది నా డ్రీమ్. నా జీవితంలో ఏడేళ్లు సినిమాకు దూరంగా ఉన్నాను. అదే నా జీవితంలో అది పెద్ద కష్టం. ఇక అంతకంటే కష్టమేదీ ఉండదు.

పవన్ గారితో పనిచేస్తున్నప్పుడు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. నా పని ఏంటో నాకు తెలుసు కాబట్టి ఇబ్బంది అనిపించలేదు. కోర్ట్ రూమ్ డ్రామా కాబట్టి దాన్ని మార్చలేదు. కోర్ ఐడియా అలాగే ఉంటుంది. ఒక స్టార్ హీరో సినిమా చేస్తున్నప్పుడు ఒక వ్యాపారం, ట్రేడ్ దాని చుట్టూ అల్లుకుని ఉంటాయి. దానికి తగినట్లే వకీల్ సాబ్ సినిమా తెరకెక్కించాను. టీజర్‌లో చూసినట్లు ఎక్కువ సేపు కోర్ట్ రూమ్ డ్రామానే చూపించాను. వకీల్ సాబ్ సినిమా విషయంలో ఎలాంటి గొప్ప స్పందన వస్తుందో చూడాలి.

ఫెయిల్యూర్ వచ్చినా, సక్సెస్ వచ్చినా తెల్లవారి పెన్ పేపర్ పట్టుకుని నా పని నేను చేయాల్సిందే. నేను మనసునే నమ్ముతాను. జయాపజయాలు ఏది వచ్చినా మన పని మనం చేయాల్సిందే. ప్రతి వంద కిలోమీటర్లకు భారతదేశంలో ప్రతిదీ మారిపోతుంటుంది. హిందీ పింక్ ఒకలా ఉంటుంది. తమిళ పింక్ మరోలా ఉంటుంది. పవన్ గారు అంటే ఏంటో, ఒక అభిమానిగా, దర్శకుడిగా నాకు తెలుసు. కాబట్టి ఆయనకు సరిపోయేలా సబ్జెక్ట్‌లో మార్పులు చేశాను. ఎవరి ఊహలకు తగినట్లు సినిమా చేయలేను. బద్రి సినిమాను గుర్తు చేయడానికే ప్రకాష్ రాజ్ గారి పాత్రకు నందా అని పెట్టాను. అందులో సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారితో ఓ స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ ఉంటుంది. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పలేము. అది సంగీత దర్శకుడు థమన్ గారు రివీల్ చేస్తారు.

పవన్ కళ్యాణ్ గారితో ప్రతి ఒక్క దర్శకుడు సినిమా చేయాలని కోరుకుంటారు. పవన్ గారికున్న స్టేచర్‌కు ఉమెన్ ఎంపవర్‌మెంట్ కంటే మంచి కాన్సెప్ట్ ఉండదు. ఆయనకు ప్రస్తుతం బాధ్యత గల సినిమాలే సరైనవి. నేనో కథ రాశాను, ఓ పాత్రను డిజైన్ చేశాను. అందులో ఎలాంటి పొలిటికల్ వ్యూస్ ఉన్నాయో లేదో అనేది చెప్పలేను. మీరు సినిమా చూసి చెప్పాలి. పింక్ కథలో మార్పులు చెప్పినప్పుడు పవన్ గారు బాగున్నాయని అన్నారు. పవన్ గారితో ప్రతి రోజూ బెస్ట్ మూవ్ మెంట్ అనుకోవచ్చు. మిగిలిన పుటేజ్ చూసుకున్నప్పుడు కూడా నాకు ఎగ్జైటింగ్ గానే ఉంది.

వకీల్ సాబ్ సినిమా విషయంలో నేను ఒత్తిడికి లోనయ్యే టైమ్ కూడా లేదు. కథ కుదిరింది, ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. సినిమా చేసుకుంటూ వెళ్లాం. నెక్ట్ సినిమా గురించి ఇంకా స్పష్టత లేదు.త్వరలో డీటెయిల్స్ చెప్తాను. వకీల్ సాబ్ తీసుకొచ్చే ఎలాంటి రికార్డ్స్ గురించి ఆలోచించడం లేదు. మొన్న ఫ్యాన్స్ తో మీటింగ్ జరిగింది. మనకు సినిమా రికార్డ్స్ తో గుర్తుండదు. ఒక సినిమా అంకెలతో గుర్తుండదు. మనం ఎమోషన్ తో కనెక్ట్ అయితే ఆ సినిమా ఎప్పటకీ గుర్తుంటుంది. బొమ్మరిల్లు సినిమాను మనం అంకెలతో గుర్తుపెట్టకోలేదు కదా.

వకీల్ సాబ్‌లోని ఒక స్టిల్ లీక్ చేశారు ఫ్యాన్స్. అది బాగుందని చూసి. ఆ స్టిల్‌నే పోస్టర్ లో పెట్టాను. లాయర్ సాబ్, మగువా లోకానికి తెలుసా నీ విలువజజ లాంటి కొన్ని టైటిల్స్ అనుకున్నాం. కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేయకుండా వకీల్ సాబ్ అని పెట్టుకున్నాం. మగువా మగువా అని పదాలు పెట్టాలని నేనే సూచించాను. అమ్మాయిల్లో ఓ క్యారెక్టర్ అమాయకంగా ఉండాలి. ఆ క్యారెక్టర్ కు అనన్య నాగ‌ళ్లను తీసుకున్నాను. కాన్ఫిడెన్స్ ఉన్న మరో అమ్మాయి పాత్రకు అంజలిని తీసుకున్నాం. మోడ్రన్ గర్ల్ క్యారెక్టర్‌కు నివేదాను సెలెక్ట్ చేశాం. ఈ ముగ్గురూ తమ క్యారెక్టర్స్ అద్భుతంగా చేశారు.


మే 21న వస్తున్న ‘తిమ్మరుసు’

‘బ్లఫ్ మాస్టర్‌, ఉమామ‌హేశ్వరాయ ఉగ్రరూప‌స్య’ వంటి చిత్రాలతో విలక్షణ హీరోగా మెప్పించిన‌ సత్యదేవ్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి’  ట్యాగ్‌లైన్. ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జ‌వాల్కర్ హీరోయిన్‌.  ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే 21న విడుద‌ల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.
 
ఈ సంద‌ర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘తిమ్మరుసు’ సినిమా చిత్రీకరణంతా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. సత్యదేవ్‌ పవర్‌ఫుల్ లాయర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఆయన లుక్‌, క్యారెక్టర్‌ డిజైనింగ్‌ చాలా కొత్తగా ఉంటుంది. డైరెక్టర్‌ శరణ్‌ కొపిశెట్టి, పక్కా ప్లానింగ్‌తో సినిమాను శరవేగంగా పూర్తి చేశారు. ఈ సినిమా టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి సందేశం కూడా ఉంటుంది’’ అన్నారు.

నటీనటులు:
సత్యదేవ్‌,  ప్రియాంక జ‌వాల్కర్‌, బ్రహ్మాజీ, అజయ్‌, రవిబాబు, అంకిత్, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌ తదితరులు

సాంకేతిక వర్గం:
దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి
నిర్మాతలు: మహేశ్‌ కోనేరు, సృజన్‌
సంగీతం:  శ్రీచరణ్‌ పాకాల
సినిమాటోగ్రఫీ:  అప్పూ ప్రభాకర్‌
ఆర్ట్‌:  కిరణ్‌ కుమార్‌ మన్నె
యాక్షన్‌: వెంకట్ మాస్టర్,  రియల్‌ సతీశ్‌
పి.ఆర్‌.ఒ:  వంశీ కాక



నితిన్‌ ‘మాస్ట్రో’ మూవీ ఫస్ట్‌ గ్లింప్స్‌‌

నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘మాస్ట్రో’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ ‘అంధాధూన్’కిది రీమేక్. మార్చి 30న(మంగళవారం) నితిన్‌ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌లో కళ్లకు నల్లటి గాగుల్స్‌ పెట్టుకొని, చేత్తో ఓ స్టిక్‌ పట్టుకొని నడుస్తూ అంధునిగా కనిపిస్తున్నాడు నితిన్‌. పోస్టర్‌లో పియానోపై రక్తపు మరకలు కథపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.

ఇక తాజాగా విడుదలైన గ్లింప్స్‌.. సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్‌ చేస్తోంది. ఈ గ్లింప్స్‌ చూసిన ప్రతి ఒక్కరూ.. రాజా ది గ్రేట్‌ లా.. నితిన్‌ ది గ్రేట్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహతిసాగర్‌ సంగీతం సినిమాపై క్రేజ్‌ని పెంచేలా ఉంది. శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్‌ హీరోయిన్‌. తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. నితిన్‌ 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూన్‌ 11న విడుదల చేస్తామని కూడా చిత్రయూనిట్ ప్రకటించింది


‘త్వరలో వెంకీ పింకీ జంప్’కి క్లాప్ కొట్టిన మంత్రి హరీశ్‌రావు


‘ప్రేమ పిలుస్తోంది’ సినిమాతో ద‌ర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అజ‌య్ నాత‌రి, శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వర ఫిలింస్ కాంబినేషన్లో శ్రీమ‌తి ల‌క్ష్మీరేసు స‌మ‌ర్పణ‌లో వెంక‌ట్ ఆర్ నిర్మిస్తోన్న చిత్రం ‘త్వర‌లో వెంకీ పింకీ జంప్‌’. విక్రమ్, దేవ‌కి ర‌మ్య, హ‌ర్సిత హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవ‌ల ఘనంగా జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు తొలి స‌న్నివేశానికి క్లాప్ కొట్టగా, మెద‌క్ ఎంపీ కొత్త ప్రభాక‌ర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. మున్పిప‌ల్ ఛైర్మన్ రాజ‌న‌ర్సు‌, క‌ళాంజ‌లి రాజేష్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అనంత‌రం మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ…‘పూర్తిగా తెలంగాణ యాస‌, భాష‌ల‌తో తెలంగాణ క‌ళాకారుల‌తో ఈ చిత్రం రూపొందుతోంది . సిద్దిపేట‌లోనే షూటింగ్ మొత్తం జ‌రుపుకోనుంది. టైటిల్ ఆస‌క్తిక‌రంగా ఉంది. నిర్మాత వెంక‌ట్‌కు, ద‌ర్శకుడు అజ‌య్‌కి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాల‌ని కోరుకుంటున్నా’ అని అన్నారు.

నిర్మాత వెంక‌ట్ ఆర్ మాట్లాడుతూ…‘ప్రేమ పిలుస్తోంది’ చిత్రంతో ద‌ర్శకుడుగా పేరు తెచ్చుకున్న అజ‌య్ డైరెక్షన్లో రెండో సినిమాగా ఈ చిత్రాన్ని ప్రారంభించామని తెలిపారు. ల‌వ్ అండ్ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నామని, రెండు నెల‌ల పాటు సింగిల్ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని సిద్దిపేట ప‌రిస‌ర ప్రాంతాల్లో పూర్తి చేస్తామని దర్శకుడు తెలిపారు.