Category Archives: Movies

రామ్‌తో ‘జగడం’ రీమేక్ చేయాలనుంది: సుకుమార్

పదిహేడేళ్ల కుర్రాడు… కొత్తగా గ్యాంగ్‌లో జాయిన్ అయ్యాడు. కొట్లాటకు గ్యాంగ్ సభ్యులతో కలిసి వెళ్ళాడు. ఎదురుగా పెద్ద గ్యాంగ్ ఉంది. వాళ్ళను చూసి కుర్రాడి గ్యాంగ్ లీడర్ భయపడి వెనకడుగు వేశాడు. కానీ కుర్రాడు వేయలేదు. చురకత్తుల్లాంటి చూపులతో తనకంటే బలవంతుడిని ఢీ కొట్టి ధైర్యంగా నిలబడ్డాడు. ఆ సీన్‌కి రాజమౌళి కూడా ఫ్యాన్ అయిపోయాడు. గ్యాంగ్‌కి కుర్రాడు కొత్త. కాని సినిమా ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు కాదు. అప్పటికే ‘దేవదాసు’తో అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ సీన్‌తో మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. యాక్షన్ హీరోకి కావాల్సిన లక్షణాలు ఇతడిలో ఉన్నాయని నిరూపించుకున్నాడు. ఇవన్నీ చెబుతుంటే ‘జగడం’లో సీన్ అని గుర్తొచ్చే ఉంటుంది. ఆ ఎనర్జిటిక్ హీరోయే రామ్ పోతినేని.

హీరోగా రామ్‌కి, దర్శకుడిగా సుకుమార్‌కీ ‘జగడం’ ఎంతో పేరు తెచ్చింది. రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా పైన చెప్పిన సీన్ గురించి ప్రస్తావించారంటేనే అందులో స్ట్రెంగ్త్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ‘జగడం (వయలెన్స్) ఈజ్ ఫ్యాషన్’, ‘5 ఫీట్ 8 ఇంచెస్ కింగు లాంటి శీనుగాడు’ పాటలు యూత్ ప్లే లిస్టులో ఉంటున్నాయి. ఓవర్ ద ఇయర్స్ ప్రేక్షకులలో అభిమానులను పెంచుకుంటూ వస్తున్న ‘జగడం’ విడుదలై మార్చి 16కి 14 వసంతాలు పూర్తి చేసుకుని 15వ ఏట ప్రవేశిస్తోంది.ఈ సందర్భంగా సినిమా విశేషాలను, అప్పటి సంగతులను దర్శకుడు సుకుమార్ మరోసారి గుర్తు చేసుకున్నారు.

ఆ ఆలోచన నుంచి… ‘జగడం’

చిన్నప్పటి నుంచి ఒక విషయం నాకు ఇన్స్పిరేషన్ గా ఉండేది. ఎక్కడైనా గొడవ జరుగుతుంటే… నేను వెళ్ళేసరికి ఆగిపోతుండేది. కొట్టుకుంటారేమో, కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలని ఉండేది. నేను ఎదుగుతున్న క్రమంలోనూ ఆ ఆలోచన పోలేదు. ఎక్కడైనా కొట్లాటలో వాళ్ళు కొట్టుకోలేదంటే డిజప్పాయింట్ అయ్యేవాడిని. నా స్నేహితులైనా అరుచుకుంటుంటే బాధ అనిపించేది. వీళ్ళు కొట్టుకోవడం లేదేంటి? అని! ఎక్కడో మనలో వయలెన్స్ ఉంది. వయలెన్స్ చూడాలని తపన ఉంది. ఉదాహరణకు, అడవిని తీసుకుంటే అందులో ప్రతిదీ వయలెంట్ గా ఉంటుంది. పులి-జింక తరహాలో ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి. ఎక్కడ చూసినా బ్లడ్ ఉంటుంది. ‘ఆహారాన్ని సాధించే దారి అంతా వయలెన్స్‌తో ఉంటుంది. అలాగే సెక్స్‌ను సాధించే దారి ప్రేమతో ఉంటుంది. ఇలా ఎన్నో ఆలోచనల నుంచి మొదలైనదే జగడం. మన చుట్టుపక్కల చూస్తే చిన్నపిల్లలు ఎవరైనా పడిపోతే, దెబ్బ తగిలితే… ‘నిన్ను కొట్టింది ఇదే నాన్నా’ అని రెండుసార్లు కొట్టి చూపిస్తాం. ఇటువంటి విషయాలు నాలో కనెక్ట్ అయ్యి ఓ సినిమా సినిమా చేద్దామని అనుకున్నా.

‘ఆర్య’ కంటే ముందే…
నిజాయతీగా చెప్పాలంటే… ‘ఆర్య’ కంటే ముందు ‘జగడం’ చేద్దామనుకున్నా. నా దగ్గర చాలా ప్రేమకథలు ఉన్నాయి. ‘ఆర్య’ తర్వాత వాటిలో ఏదైనా చేయవచ్చు. వయలెన్స్ నేపథ్యంలో కొత్తగా ఏదైనా చేద్దామని అనుకున్నా. అప్పటికి నాలో ఆలోచనలు రకరకాలుగా మారి ‘జగడం’ కథ రూపొందింది.

రామ్… చాలా షార్ప్!

‘జగడం’ కథ పూర్తయిన సమయానికి ‘దేవదాసు’ విడుదలై ఏడు రోజులు అయినట్టు ఉంది. నేను సినిమా చూశా. రామ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. హుషారుగా చేస్తున్నాడు. ఎఫ‌ర్ట్‌లెస్‌గా పెర్ఫార్మన్స్ చేస్తున్నాడని అనిపించింది. రామ్‌తో ‘జగడం’ చేయాలని ‘స్రవంతి’ రవికిశోర్ గారిని అప్రోచ్ అయ్యాం. ఆయన సరే అన్నారు. అలా ‘జగడం’ మొదలైంది. అప్పుడు రామ్‌కి పదిహేడేళ్లు అనుకుంట. ఆ టైమ్‌లో ఏం చెప్పినా చేసేసేవాడు. ‘నాకు రాదు. రాలేదు. చేయలేను’ అనే మాటలు ఉండేవి కావు. చేత్తో కాయిన్ తిప్పమని అడిగితే… పక్కకి వెళ్లి పది నిమిషాల్లో ప్రాక్టీస్ చేసి వచ్చి చేసేవాడు. అంత షార్ప్. నాకు తెలిసి… ఇప్పటికీ రామ్‌ని ఆ బ్రిలియన్స్ కాపాడుతుంది. దానివల్లే తను సక్సెస్ అవుతున్నాడు.

రామ్ మంచి స్థాయికి వస్తాడని అప్పుడే అనుకున్నా

నేను ప్రతిక్షణం రామ్‌ను చూసి షాక్ అవుతూ ఉండేవాడిని. అంటే… చిన్న వయసులో ప్రతిదీ ఈజీగా చేయగలుగుతున్నాడు. వెంటనే పట్టుకుని పెర్ఫార్మన్స్ చేయగలుగుతున్నాడు. ఈ సన్నివేశంలో ఇలా కాకుండా వేరేలా చేస్తే బావుంటుందని అడిగితే… మనం కోరుకున్న దానికి తగ్గట్టు ఎక్స్‌ప్రెష‌న్స్‌ వెంటనే మార్చి చేసేవాడు. అన్ని రియాక్షన్స్ ఉండాలంటే ఎక్కువ లైఫ్ ఎక్స్‌పీరియ‌న్స్‌లు ఉండాలి. అప్పటికి తనకు ఎటువంటి లైఫ్ ఎక్స్‌పీరియ‌న్స్‌లు ఉన్నాయో తెలియదు కానీ… ఎటువంటి రియాక్షన్ అడిగినా చేసి చూపించేవాడు. ‘జగడం’ చేసే సమయానికి రామ్‌ను చూస్తే వండర్ బాయ్ అనిపించాడు. ఇండస్ట్రీలో రామ్ మంచి స్థాయికి వస్తాడని అప్పుడే అనుకున్నాను. ఇప్పుడు అదే ప్రూవ్ అయ్యింది.

 

ప్రతి పాట హిట్టే

‘ఆర్య’తో దేవిశ్రీ ప్రసాద్‌తో నాకు అనుబంధం ఉంది. ‘జగడం’ చిత్రానికీ తనను సంగీత దర్శకుడిగా తీసుకున్నాను. ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ కాకుండా రెండు వస్తువుల మధ్య ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది? – ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చిందే ‘5 ఫీట్ 8 ఇంచెస్’ సాంగ్. చంద్రబోస్ గారికి నేను ఈ కథ అనుకున్నాని చెబితే వెంటనే పాట రాసిచ్చారు. దానికి దేవి ట్యూన్ చేశారు. అదే ‘వయలెన్స్ ఈజ్ ప్యాషన్’. సినిమాలో ప్రతి పాట హిట్టే. అప్పట్లో ‘జగడం’ ఆల్బమ్ సెన్సేషన్. సినిమాకి తగ్గట్టు దేవి మౌల్డ్ అవుతాడు. మంచి నేపథ్య సంగీతం ఇస్తాడు. ‘జగడం’ పతాక సన్నివేశాల్లో నేపథ్య సంగీతాన్ని నేను ఇప్పటికీ హమ్ చేస్తూ ఉంటాను.

‘వయలెన్స్’ ఎందుకు ‘జగడం’గా మారిందంటే?

వయలెన్స్ ను ఎక్కువ ఎగ్జాగరేట్ చేస్తున్నారని, గ్లామరస్ గా చూపిస్తున్నారని సెన్సార్ సభ్యులు అభ్యంతరం చెప్పారు. అందువల్ల ‘వయలెన్స్ ఈజ్ ప్యాషన్’ పాటలో వయలెన్స్ బదులు ‘జగడం’ అని పెట్టాల్సి వచ్చింది. అప్పట్లో సెన్సార్‌లో చాలా పోయాయి. సినిమా కథనమే మిస్ అయింది. అప్పట్లో నాకు సెన్సార్ ప్రాసెస్ గురించి పూర్తిగా తేలికపోవడం వల్ల చాలా కట్స్ వచ్చాయి. కట్స్ లేకుండా సినిమా ఉంటే ఇంకా బావుండేది. సినిమాకు సరైన అప్రిసియేష‌న్‌ రాలేదేమో అని నాలో చిన్న బాధ ఇప్పటికీ ఉంది.

స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌… సూపర్35… సినిమాటోగ్రఫీ!

సినిమాటోగ్రాఫర్ రత్నవేలుగారు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ది బెస్ట్ ‘జగడం’ అని చెప్పొచ్చు. ఎందుకంటే… అప్పుడే chooke s4 లెన్స్ వచ్చాయి. అప్పట్లో స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌ తన సినిమాలకు ఏ కెమెరా ఎక్విప్‌మెంట్ ఉపయోగించారో, మేమూ అదే ఎక్విప్‌మెంట్ ఉపయోగించాం. సూపర్ 35 ఫార్మాట్ లో షూట్ చేశాం. అప్పటివరకు మన దగ్గర ఎవరూ ఆ ఫార్మాట్ లో ఎవరూ చేయలేదు. కెమెరా యాంగిల్, లైటింగ్ మూడ్… రత్నవేలు ప్రతిదీ డిస్కస్ చేసి చేసేవారు. ప్రతిదీ పర్ఫెక్ట్ షాట్ అని చెప్పొచ్చు. ఇండియాలో సినిమాటోగ్రఫీ పరంగా చూస్తుంటే… వన్నాఫ్ ది బెస్ట్ ‘జగడం’ అని చెప్పొచ్చు. ఆ క్రెడిట్ మొత్తం రత్నవేలుగారిదే. సినిమాటోగ్రఫీనీ అప్రిషియేట్ చేయలేదు. ఆ సినిమా ఫొటోగ్రఫీ నాకు ఎంతో ఇష్టం.

ముంబైలో దర్శకుల దగ్గర… లైబ్రరీల్లో ‘జగడం’

ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ చేశారు. సినిమా విడుదలైన కొన్నాళ్లకు ఒకసారి మేమిద్దరం ఫ్లైట్‌లో కలిశాం. మాటల మధ్యలో ‘జగడం’ గురించి వచ్చింది. ‘ప్లాప్ సినిమా కదా. మాట్లాడుకోవడం ఎందుకు అండీ’ అన్నాను. అందుకు ‘అలా అనుకోవద్దు. నేను ముంబై నుంచి వస్తున్నాను. చాలామంది దర్శకుల దగ్గర, వాళ్ళ లైబ్రరీల్లో జగడం సినిమా ఉంది. నీకు అంతకన్నా ఏం కావాలి? చాలామంది నీకు ఫోనులు చేయలేకపోవచ్చు. నిన్ను కలవడం వాళ్ళకు కుదరకపోవచ్చు. కానీ, చాలా అప్రిసియేషన్ పొందిన సినిమా ఇది. టెక్నీషియన్స్ దానిని రిఫరెన్స్‌గా పెట్టుకున్నారు’ అని శ్రీకర్ ప్రసాద్ గారు చెప్పారు.

నిర్మాత గురించి…

చిత్రనిర్మాణంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ జేడీ సోంపల్లిగారు ఎంతో మద్దతుగా నిలిచారు. వాళ్ళ అబ్బాయి ఆదిత్యబాబు తరపున ఆయన సినిమా నిర్మించారు. ఆదిత్య ఇప్పటికీ నాతో టచ్ లో ఉంటాడు. నా ఫంక్షన్లకు తనను కూడా పిలుస్తాను.

ఆరు నెలలు ఆడిషన్స్ చేశాం!

అప్పట్లో ఆర్టిస్టులు చాలా తక్కువ మంది. ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ వస్తున్నాయి. వెబ్ సిరీస్ లు వచ్చాయి. చాలామంది ఆర్టిస్టులు దొరుకుతున్నారు. అప్పుడు అలా కాదు కాబట్టి ఎక్కువ ఆడిషన్స్ చేశాం. సుమారు ఆరు నెలలు ‘జగడం’ ఆడిషన్స్ జరిగి ఉంటాయి. తాగుబోతు రమేష్, వేణు, ధనరాజ్… ఇలా ఆ సినిమా నుంచి చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. ఇప్పటికి వాళ్ళు అదే గౌరవం, ప్రేమతో చూస్తారు.

త్వరలో రామ్‌తో సినిమా చేస్తా!

రామ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. త్వరలో మళ్ళీ తప్పకుండా చేస్తా. మరో మంచి సినిమా చేయాలి. యాక్చువల్లీ… ఇప్పటి రామ్‌తో మళ్ళీ ‘జగడం’ రీమేక్ చేయాలని ఉంది. మళ్ళీ ఇప్పటి రామ్‌తో మళ్ళీ జగడం చూసుకోవాలని ఉంది.


దుమ్ము రేపుతున్న ‘సారంగ దరియా’ సాంగ్.. టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డు

దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ప్రేమ కావ్యం ‘లవ్ స్టోరీ’. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ‘లవ్ స్టోరీ’ ఒక్కో పాట ఆణి ముత్యాల్లా తయారై శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. రెండు వారాల కిందట రిలీజ్ చేసిన ‘సారంగ దరియా’ పాట ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ క్లబ్ లో చేరింది. ఫిబ్రవరి 28న సమంత చేతుల మీదుగా విడుదలైన సారంగ దరియా పాట కేవలం 14 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ మార్క్ చేరుకుంది. ‘మారి-2’లో సాయి పల్లవి చేసిన రౌడీ బేబీ పాట 8 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ సాధించి అగ్రస్థానంలో నిలవగా.. ‘సారంగ దరియా’ సెకండ్ ప్లేస్‌‌ కొట్టేసింది. రెండు పాటల్లోనూ సాయిపల్లవి డ్యాన్సులతో ఇరగదీయడం గమనార్హం.

సూపర్ హిట్ సాంగ్స్ బుట్ట బొమ్మ, రాములో రాములా పాటలను సైతం సారంగ దరియా దాటేయడం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. బుట్ట బొమ్మ పాట 50 మిలియన్ వ్యూస్ సాధించేదుకు 18 రోజులు పట్టగా.. రాములో రాములా పాటకు 27 రోజులు పట్టింది. సుద్దాల అశోక్ తేజ సాహిత్యాన్ని అందించిన సారంగ దరియా పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. పవన్ సీహెచ్ సంగీతం ఈ తెలంగాణ జానపద గీతానికి అద్భుతంగా కుదిరింది. మంగ్లీ తన అద్భుతమైన గానంతో పాటను మరోస్థాయికి తీసుకెళ్లింది. ఇన్ని ప్రత్యేకతలతో ఏప్రిల్ 16న ‘లవ్ స్టోరి’’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.’

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ”లవ్ స్టోరి” చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు
సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్
ఎడిటర్ : మార్తాండ్ కె.వెంకటేష్
మ్యూజిక్ : పవన్ సి.హెచ్,
సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి,
పీఆర్వో: జి.ఎస్.కె. మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వరరావు
నిర్మాతలు: నారాయణ్ దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్ రావు,
రచన, దర్శకత్వం: శేఖర్ కమ్ముల



ఆ విషయంలో హద్దులేమీ పెట్టుకోలేదు: ‘శశి’ హీరోయిన్ సుర‌భి

ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘రఘువరన్ బీటెక్’ సినిమాలో నటించి, ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల నటి సురభి.. బీరువా, ఎక్స్‌ప్రెస్‌ రాజా, ఎటాక్, జెంటిల్‌మెన్‌, ఒక్కక్షణం, ఓటర్‌ సినిమాల‌తో మెప్పించింది. ఆది సాయికుమార్ హీరోగా, శ్రీనివాస్ నాయుడు నందికట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శశి’లో హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. మార్చి 19న ‘శశి’ విడుద‌ల‌వుతున్న సంద‌ర్భంగా హీరోయిన్ సుర‌భితో ఇంట‌ర్వ్యూ విశేషాలు..

నిర్మాత‌లు నాకు ఫోన్ చేసి డైరెక్టర్‌తో మూడున్నర‌ గంట‌లు క‌థ నేరేట్ చేయించారు. స్టోరీ విన‌గానే చాలా థ్రిల్‌గా ఫీలై వెంటనే సైన్ చేశాను. ఈ సినిమా రెగ్యుల‌ర్ ల‌వ్‌స్టోరీ కాదు. ఎమోష‌న్స్‌, ఇంటెన్సిటీతో కూడిన ర‌గ్‌డ్ ల‌వ్‌స్టొరీ. అందుకే ఈ సినిమాలో ఆది లుక్ అంత ర‌గ్‌డ్‌గా ఉంది. చాలా అంశాల‌తో కూడిన ఒక కంప్లీట్ ప్యాకేజ్. ఈ సినిమాలో న‌ట‌న‌కు మంచి స్కోప్ ఉన్న పాత్ర నాది. ఆడియ‌న్స్‌కి తప్పకుండా ఒక ఇంపాక్ట్ అయితే చూపుతుంది. ఈ మూవీలో రాజీవ్ క‌న‌కాల నాకు తండ్రిగా నటించారు. ఒక్క కూతురునే కాబ‌ట్టి చాలా గారాబంగా పెంచుతాడు. నిజ జీవితంలోనూ నేను మా పేరెంట్స్‌కి ఏకైక కూతురిని. అందుకే ఈ సినిమాలో నా పాత్రతో వెంట‌నే క‌నెక్ట్ అయ్యాను.

కాలేజ్‌లో నా బ్యాచ్‌తో క‌లిసి ర్యాగింగ్ చేసే స‌న్నివేశాలు చాలా ఫ‌న్నీగా ఉంటాయి. నాది ఒక డామినేటింగ్ ప‌ర్సనాలిటీ. అయితే ఈ సినిమాలో నా క్యారెక్టర్లో మ‌రో షేడ్ ఉంటుంది. అదేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంటుంది. నాతోపాటు ఈ సినిమాలో ప్రతి పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది.

ఈ సినిమాలో ఆదికి మ్యూజిక‌ల్ బ్యాండ్ ఉంటుంది. గిటార్ ప్లే చేస్తాడు. ఒక మంచి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌నుకునే క్యారెక్టర్ నాది. నేను ఎందుకు అలా చేసుకోవాలి అనుకుంటాను అనే రీజ‌న్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆదితో ఫ‌స్ట్‌టైమ్ స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఆయన చాలా హంబుల్ పర్సన్‌. వెరీ వెరీ డౌన్ టు ఎర్త్‌. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వ‌చ్చినా అస‌లు ఆ ఫీలింగ్ ఉండ‌దు. చాలా మంచి డ్యాన్సర్ కూడా. కొన్ని స‌న్నివేశాల్లో నాకు చాలా స‌పోర్ట్ చేశారు. అలాగే నిర్మాత వ‌ర్మగారు మోస్ట్ నైస్ ప‌ర్సన్‌. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఫుల్ స‌పోర్ట్ చేసి ఈ చిత్రాన్ని నిర్మించారు. రోజూ సెట్‌కి వ‌చ్చి మంచి ఇన్‌పుట్స్ ఇచ్చేవారు.

‘శశి’ పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తున్నందుకు హ్యాపీగా ఉంది. ‘ఒకే ఒక లోకం’ పాట 50 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసింది. ఆ క్రెడిట్ మొత్తం మ్యాజిక్ డైరెక్టర్ అరుణ్‌కే చెందుతుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌, వైవా హర్ష పాత్రలు హిలేరియ‌స్‌గా ఉంటాయి. ‘శశి’ ట్రైల‌ర్‌, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారు ట్రైల‌ర్ చూసి చాలా బాగుంది అన్నారు. టీమ్ అంద‌రూ చాలా క‌ష్టప‌డి సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, దాని ద్వారా నాకు మరిన్ని ఛాన్సులు రావాలని కోరుకుంటున్నాను. ఇప్పటివ‌ర‌కూ 13 సినిమాలు చేశాను. అందులో తమిళమే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు తెలుగులోనూ మంచి ఛాన్సులు వ‌స్తున్నాయి.

గ్లామ‌ర‌స్ రోల్స్ చేయ‌డానికి ఎప్పుడు సిద్దంగానే ఉంటాను. ఇండ‌స్ట్రీలోని గ్రేట్ పీపుల్స్ అంద‌రితో వ‌ర్క్ చేయాల‌న్నది నా కోరిక. అలాగే మైథాలాజిక‌ల్ మూవీస్‌లో న‌టించ‌డం ఇష్టం. వెబ్‌ సిరీస్‌ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాను. కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ యాక్టింగ్‌కు స్కోప్‌ ఉన్న స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌‌నే చేయాలనుకుంటున్నాను. అలాంటివి వస్తే వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తాను.


Ala Vaikunthapurramloo Box Office Collection

Ala Vaikunthapurramloo Box Office Collection: Allu Arjun’s starrer crosses Rs 180 crore mark and his film is riding high on the success of his latest release, Ala Vaikunthapurramloo. The film released on 12th January and it is opened to a Postive response from the audience as well as the critics. This film is one of the most awaited one which is released during Sankranthi. Allu Arjun who is returning after several months will be seen on big screens. Ala Vaikunthapurramuloo performed well on its 9 days at the box office and earned roughly ₹ 139.00 Cr India net. Here is Ala Vaikunthapurramloo 9th day box office collection and Occupancy.Telugu film Ala Vaikunthapurramuloo – Overseas – Total till 19 Jan 2020.
USA: Crosses $ 2.7 million [₹ 19.18 cr+]
Australia: A$ 455,600 [₹ 2.23 cr]
UK: £ 110,160 [₹ 1.02 cr]
NewZealand: NZ$ 16,568 [₹ 7.79 lakhs] – opened on Thursday

Ala Vaikunthapurramloo Box Office Collection Day 9As Allu Arjun’s last outing Naa Peru Surya has collected 16.28 CRS share in Telugu states and now the trade is expecting that Ala Vaikuntapuramloo may collect 19 CRS on day one. Directed by Trivikram Srinivas, the film has Pooja Hedge and Nivetha Pethuraj as the leading ladies in it. Geetha Arts and Haarikaa & Haasinee Creations are jointly bankrolling the movie. The film features soundtrack composed by Thaman S., while cinematography and editing were handled by P. S. Vinod and Navin Nooli respectively. directed by Trivikram and co-produced by Allu Aravind and S. Radha Krishna under their banners Geetha Arts and Haarika & Hassine Creations, the film stars Allu Arjun and Pooja Hegde in the lead roles while Tabu, Jayaram, Nivetha Pethuraj, Samuthirakani, Sushanth, and Rajendra Prasad play supporting roles.
9 Days India Net Collection ₹ 146.00 Cr
9 Days Worldwide Collection ₹ 196.00 Cr
9 Days Overseas Collection ₹ 26.00 Cr
9 Days India Gross Collection ₹ 170.00 Cr
9 Days Worldwide Share ₹ 124.00 Cr * may earn

Ala Vaokunthapurramloo Box Office Collection Day Wise

Day 1 ₹ 37.00 Cr
Day 2 ₹ 14.50 Cr
Day 3 ₹ 15.80 Cr
Day 4 ₹ 16.90 Cr
Day 5 ₹ 16.50 Cr
Day 6 ₹ 13.80 Cr
Day 7 ₹ 12.50 Cr
Day 8 ₹ 12.00 Cr * rough data
Day 9 ₹ 5.00 Cr * rough data
Total ₹ 146.00 Cr

Ala Vaikunthapurramuloo latest box office collection report

Allu Arjun Ala Vaikunthapuramulo Movie First Look ULTRA HD Posters WallPapers | Pooja Hegde

Stylish Star Allu Arjun and Pooja Hegde played the lead roles in the film Ala Vaikunthapurramuloo. The movie released during Sankranthi and it has got a lot of attention from the audiences.

According to the trade buzz, Allu Arjun’s Ala Vaikunthapurramuloo is performing well at the box-office in the USA. The movie is exceptionally doing well in the 3 rd weekend too in the USA. As of now, the movie made around $61k on Friday and crossed 50k on Saturday by 10 am PST. Apparently, the total has come around almost $3.28 M. Now, we the makers are expecting it to reach $3.5 M very soon!

Directed by Trivikram Srinivas, the film is produced jointly by S Radha Krishna and Allu Aravind. The film unit is happy with the movie’s performance at the box-office in the Telugu states as well.


‘మిస్టర్ అండ్ మిస్’ఫస్ట్ లుక్ పోస్టర్

తెలుగు కథ, కథనాలు రేయాలిస్టిక్ కథల వైపు పరుగులు పెడుతున్నాయి. యూత్ ని ఎట్రాక్ట్ చేసే అంశాలలో సహజత్వం ముందు ఉంటుంది. అలాంటి కథే “మిస్టర్ అండ్ మిస్” డేటింగ్ లు, వీడియో చాటింగ్ లు ప్రేమ లో భాగం అయిన ఈ జన రేషన్ ప్రేమ కథ గా “మిస్టర్ అండ్ మిస్” రూపొందింది.

తెలుగు ప్రేక్షకుల టేస్ట్ లో మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు తగ్గట్టుగానే
కొత్తగా వస్తోన్న మేకర్స్ సరికొత్త కాన్సెప్ట్స్ తో వస్తున్నారు. అలా
ఇప్పుడు మిస్టర్ అండ్ మిసెస్ అంటూ ఓ సినిమా రాబోతోంది. క్రౌడ్ ఫండెడ్
సినిమాగా వస్తోన్న ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో
తెరకెక్కించబోతున్నాడు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడతూ:

” ఇది ఈ జనరేషన్ ప్రేమ కథ, ఒక ఇండిపెండెంట్ అమ్మాయి కథ, హీరో క్యారెక్టర్ తో నేటి యువతరం బాగా రిలెట్ అవుతుంది. ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు, ముంబైకి చెందిన మోడ్రన్ యువతి లివింగ్ రిలేషన్ లో ఉంటారు. ఈ కథ లో ఈ జంట లో ఒకరి మైబైల్ మిస్ అవుతుంది.. ఆ మొబైల్ లో ఏముంది.. మిస్ అయిన మొబైల్ వీరి జీవితాలలో ఎలాంటి మార్పులను తెచ్చింది..? యూత్ రిలేట్ అయ్యే కంటెంట్ తో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ మూవీ లుక్ ఈ రోజు విడుదల చేసింది చిత్ర యూనిట్.

“మిస్టర్ అండ్ మిస్” టీం రిలీజ్ చేసిన ఈ లుక్ కి మంచి స్పందన వస్తుంది. .
ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర పనులలో ఉన్న
ఈ చిత్రంలో జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా నటిస్తున్నారు.
పూర్తిగా క్రౌడ్ ఫండెడ్ మూవీగా వస్తోన్న ఈ చిత్రానికి ఎడిటర్ : కార్తిక్
కట్స్, పాటలు: పవన్ రాచేపల్లి,కాస్ట్యూమ్ డిజైనర్ : సహస్ర రెడ్డి, ఆర్ట్
డైరెక్టర్ : కరీష్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్ : ప్రవీణ్ సాగి,
సినిమాటోగ్రఫీ : సిద్ధం మనోహర్, సంగీతం : యశ్వంత్ నాగ్, పి.ఆర్.ఓ :
జి.ఎస్.కె మీడియా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : సుధీర్ వర్మ పెరిచర్ల,
నిర్మాణం : క్రౌడ్ ఫండెడ్, కథ, దర్శకత్వం : అశోక్ రెడ్డి.


Ram’s Royal look triggers speculation

Category : Movie News Movies

Even while actor Ram Pothineni has been shooting for his forthcoming film, Red, the actor has been in the news once again!

Wait… but it’s for an interesting reason!

The Smart Shankar star has posted a photo of his in a regal look! This photo has not only floored his fans but seeing Ram in this regal look also got a lot of reactions from trade and in the industry asking whether this look is from his forthcoming film

But before everyone jumps the gun, Ram gives a back-story of the episode.

Almost two decades ago, when Ram was 10, photographer Karthik Srinivasan asked the actor to pose for him. However, the actor wasn’t too keen to get clicked. But somehow Karthik managed to convince Ram and capture his moods. Interestingly, that was Ram’s first tryst under the camera!

Cut to present, after 20 years, Ram has again posed for the now renowned celebrity photographer, Karthik. The theme of the Calendar shoot was The Royals 2020. And Ram is seen flaunting a full grown beard and moustache with long locks.

No wonder, the regal look has been making the fans go crazy on social media.

“Ram’s association with Karthik goes back a long way. And both were glad to team up again when there was an opportunity to collaborate recently,” informs a source.


‘క్షీర సాగర మథనం’

‘క్షీర సాగర మథనం’
హీరోయిన్ అక్షత సోనావని
ఫస్ట్ లుక్ విడుదల చేసిన పాయల్

దేవతలు-రాక్షసులు సాగరాన్ని మధించినప్పుడు అమృతంతోపాటు హాలాహలమూ వచ్చింది. మన మనసులు మధించినప్పుడు కూడా మంచి ఆలోచనలతోపాటు, చెడు ఆలోచనలు కూడా ఉద్భవిస్తాయి. ఈ అంశాన్ని ఆధారం చేసుకొని బహుముఖ ప్రతిభాశాలి అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆహ్లాదకర చిత్రం ‘క్షీర సాగర మథనం’. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను అత్యద్భుతంగా తెరకెక్కిస్తూ రూపొందుతున్నఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటిస్తున్నారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు. ప్రముఖ యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఈ చిత్రం టైటిల్ లోగోను విడుదల చేయగా- యువ కథానాయకుడు అడివి శేష్ ‘క్షీరసాగరమథనం’ పోస్టర్ ను లాంచ్ చేశారు. తాజాగా చిత్ర కథానాయకి అక్షత సోనావని ఫస్ట్ లుక్ సంచలన కథానాయకి పాయల్ రాజ్ పుట్ విడుదల చేసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపింది.

శేఖర్ కమ్ముల మొదలుకుని గౌతమ్ తిన్ననూరి వంటి సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ టర్న్ డ్ ఫేమస్ డైరెక్టర్స్ కోవలో సినిమా రంగంలో తనదైన ముద్ర వేయాలనే వజ్ర సంకల్పం కలిగిన ఐ.టి.రంగ నిపుణులు ‘అనిల్ పంగులూరి’ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గుండెల్నిమెలిపెట్టే గాఢమైన అనుభూతుల్ని పంచి.. పలు రకాల భావోద్వేగాలతో మనసుల్ని రంజింపచేసి.. చాలా రోజుల తరువాత మరో మంచి సినిమా చూశామనే సంతృప్తిని మిగిల్చే చిత్రాన్ని అందిస్తున్నామనే నమ్మకం, గర్వం మాకుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
చరిష్మా శ్రీకర్, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న

ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్. వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష్ షనమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, పీఆర్వో: ధీరజ అప్పాజీ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి!!


బొంబాట్‌లో `ఇష్క్ కియా…` సాంగ్‌ను విడుద‌ల చేసిన మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

క‌ళ్ల‌లోన దాచినానులే.. రెప్ప‌దాటి పోలేవులే
కాటుకైన పెట్ట‌నులే.. నీకు అంటుకుంటుంద‌ని
పెద‌వికే తెల‌ప‌ని ప‌లికె నీ పేరునే ప్రియ‌త‌మా.. ఓ ప్రియ‌త‌మా
లోక‌మే ఆన‌దు మైక‌మే వీడ‌దు.. తెలుసునా ఇది ప్రేమేన‌ని
ఎందుకిలా ఓ ఎందుకిలా….. ఇష్క్ కియా అంటూ త‌న ప్రేమ‌ను హీరోయిన్ హీరోకు వ్య‌క్తం చేస్తే ఎలా ఉంటుంది? ఎంతో అందంగా ఉంటుంది. ఆ అందం చూసేయాలంటే `బొంబాట్‌` సినిమా చూసేయాల్సిందే.

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై `ఈన‌గ‌రానికి ఏమైంది` ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్స్‌గా రాఘ‌వేంద్ర వర్మ(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో విశ్వాస్ హ‌నూర్‌క‌ర్ నిర్మిస్తోన్న‌ చిత్రం `బొంబాట్`. జోష్ బి సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెండో లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ విడుద‌ల చేశారు. పాట విన‌డానికి అహ్లాదంగా ఉంద‌ని చిత్ర యూనిట్‌ను త‌మ‌న్ అభినందించారు.

రామాంజ‌నేయులు రాసిన ఈ పాట‌ను సునీతా సార‌థి శ్రావ్యంగా ఆల‌పించారు. హీరో సుశాంత్‌, సిమ్రాన్ మ‌ధ్య సాగే ల‌వ్ మెలోడీ ఇది. లిరిక‌ల్ వీడియోలో చూపించిన కొన్ని విజువ‌ల్స్ క్యూట్‌గా అనిపిస్తున్నాయి. ప్రేయ‌సి త‌న మ‌న‌సులోని ప్రేమ‌ను ప్రేమికుడికి ఎంత అందంగా చెప్పింద‌నే స‌న్నివేశంలో వ‌చ్చే పాట ప్రేక్ష‌కుల‌ను త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు అంటున్నారు.
రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు సినిమాను తీసుకురావ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.