Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
ఆహా ఓటీటీలో ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న అన్‌స్టాపబుల్ 2కు రంగం సిద్ధమైపోయింది. టాలీవుడ్ అగ్ర హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గెస్ట్ రానున్నారు. ఈ షోకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా… మంగళవారం సాయంత్రం ఆహా యాజమాన్యం ప్రోమోను విడుదల చేసింది.
5.31 నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రోమోలో బాలయ్య చాలా క్లిష్టమైన ప్రశ్నలు సంధించగా… చంద్రబాబు ఏమాత్రం తగ్గకుండా అదిరిపోయే సమాధానాలు చెప్పారు. సరదా ప్రశ్నలతో పాటు సీరియస్ ప్రశ్నలను కూడా బాలయ్య సంధించారు. 1995లో టీడీపీ చీలికపైనా ప్రశ్న రాగా చంద్రబాబు ఏమాత్రం తడుముకోకుండానే సమాధానం ఇచ్చారు. నాడు తాను చేసిన పని తప్పంటారా?అంటూ బాలయ్యను ఎదురు ప్రశ్నించారు.
ఈ షో నారా లోకేష్ ఎంట్రీ ఇచ్చారు. బాలయ్య అడిగిన ప్రశ్నలకు ఎలాంటి బేషజాలకు పోకుండా సమాధానాలు చెప్పి ఆకట్టుకున్నారు. మంగళగిరిలో ఓటమిపైనా హుందాగా స్పందించారు. కాసేపు హోస్ట్ సీటులో కూర్చున్న లోకేశ్ తండ్రితో పాటు మామయ్యకు కూడా ప్రశ్నలు వేసిన తీరు ఆకట్టుకుంది. ఈ షో ఈ నెల 14న ఆహాలో టెలికాస్ట్ కానుంది.
నవరస నటనా సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు నందమూరి బాలకృష్ణ. బడా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చినా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుని సుదీర్ఘ కాలంగా హీరోగా కొనసాగుతున్నారు. తన పని అయిపోయిందంటూ విమర్శలు వచ్చిన ప్రతిసారి బ్లాక్‌బస్టర్ హిట్లతో క్రిటిక్స్ నోళ్లు మూయించడం బాలయ్యకు వెన్నతో పెట్టిన విద్య. అయితే కేవలం సినిమాలే కాకుండా ఆహాలో ప్రసారమైన ‘అన్‌స్టాపబుల్’ షోతో తనలో మరో యాంగిల్ ఉందని నిరూపించారు. బాలకృష్ణ హోస్ట్ చేసిన ఈ షో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలవడం విశేషం. ఆ ఉత్సాహంతోనే ‘అన్‌స్టాపబుల్’ రెండో సీజన్‌కు రెడీ అయ్యారు. త్వరలోనే మొదలుకానున్న ఈ షోకు సంబంధించి అఫిషియల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో ‘దెబ్బకి థింకింగ్ మారిపోవాలి’ అంటూ పవర్‌ఫుల్ డైలాగ్‌తో బాలయ్య అలరించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ట్రైలర్‌ని మీరూ ఓ లుక్కేయండి…
నటసింహం నందమూరి బాలకృష్ణ ఓవైపు హీరోగా నటిస్తునే మరో వైపు హోస్ట్ గాను అదరగొడుతున్నారు. రీసెంట్ గా ‘అఖండ’గా గర్జించిన బాలయ్య…. అల్లు ఫ్యామిలీకి చెందిన ప్రముఖ ఓటీటీ సంస్థ aha కోసం హోస్ట్‌గా మారి ‘అన్ స్టాపబుల్’ షోతో ఆకట్టుకుంటున్నారు. మొదటిసారి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో కావడంతో ఈ షో భారీ రేటింగ్ తో దూసుకుపోతుంది. గెస్ట్‌లుగా వచ్చిన స్టార్స్‌తో బాలయ్య తనదైన స్టైల్‌లో సందడి చేస్తున్నారు. ఇప్పటి వరకు 8 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ షో నాన్‌స్టాప్‌గా దూసుకుపోతోంది.
ఫస్ట్ ఎపిసోడ్‌కు గెస్ట్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, విష్ణు, లక్ష్మీప్రసన్న హాజరుకాగా.. ఆ తర్వాత నాని, బ్రహ్మానందం-అనిల్ రావిపూడి, సుకుమార్- రష్మిక మందన్న- అల్లు అర్జున్, రవితేజ- గోపీచంద్ మలినేని, రానా, మహేష్ బాబు ఇలా చాలా మంది స్టార్స్ ఈ షోకు హాజరై ఆకట్టుకున్నారు.
అసలు విషయానికొస్తే ‘అన్ స్టాపబుల్’ షో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలిచింది. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) ఇండియా టాక్ షోలపై నిర్వహించిన సర్వేలో బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో 9.7 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో కపిల్ శర్మ నిర్వహిస్తున్న ‘ది కపిల్ శర్మ షో’ 7.8 పాయింట్లతో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ నిర్వహిస్తున్న ‘అమెజాన్ ఫ్యాషన్ అప్’ షో 4.9 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. మొత్తానికి 2021లో ‘అఖండ’తో బాక్సాఫీస్ దుమ్ము దులిపిన నందమూరి నటసింహం.. ఓటీటీలో తన సత్తా చాటాడు.
తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ ప్రేక్షకులకు వినోదాల విందు అందించడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నెలలో ఆడియన్స్‌కు మరిచిపోలేని వినోదాలను పంచనుంది. ఇందులో భాగంగా సినిమాలతో పాటు ఆహాకు మాత్రమే ప్రత్యేకమైన కొన్ని వెబ్‌సిరీస్‌లను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఆహాకు మాత్రమే ప్రత్యేకంగా నిలిచే టాక్ షోలు, చెఫ్ షోలతో ఆకట్టుకుంటోన్న ఈ ఓటీటీ యాప్ తాజాగా కొత్త చిత్రాలతో రానుంది. డిసెంబర్‌లో ఆహా ఓటీటీ వేదికగా విడుదల కానున్న సినిమాలు ఏంటంటే..
మంచి రోజులు వచ్చాయి ‘ఏక్ మినీ కథ’తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంతోష్ శోభన్ హీరోగా, మెహరీన్ హీరోయిన్‌గా తెరెక్కిన ‘మంచి రోజులు వచ్చాయి’ థియేటర్లలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 3న ఆహా యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది. మారుతి ఈ సినిమాకు దర్శకుడు.
పుష్పక విమానం.. డిసెంబర్‌లో ఆహాలో సందడి చేయనున్న మరో చిత్రం ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘పుష్ఫక విమానం’. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరించడంతో ఈ సినిమాకు ఎక్కడలేని పబ్లిసిటీ వచ్చేసింది. అంతేకాకుండా ఆనంద్ దేవరకొండ అద్భుత నటన, వినూత్నమైన కథాంశం, కామెడితో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది. ఇక ఈ సినిమా ఆహాలో డిసెంబర్ 10 నంచి స్ట్రీమింగ్ కానుంది.
అనుభవించు రాజా.. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌లో ఆహాలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా నవంబర్ 26న విడుదలైన విషయం తెలిసిందే. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ.. ఆహా ఒరిజినల్ ఫిలిమ్ అయిన ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు. ప్రిన్స్, నేహా క్రిష్ణ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రానుంది. అమెరికా వెళ్లాలని కలలు కనే ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు అమెరికాలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు… అనుకోకుండా ఓ మర్డర్ కేసులో ఇరుక్కోవడంతో ఎలాంటి పరిణామాలకు దారి తీసిందన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
సేనాపతి.. రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న ఈ ఒరిజినల్‌ను ఆహా వేదికగా డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నారు. థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా ఉండనున్నట్లు సమాచారం. వీటితో పాటు చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్రిస్మస్ తాతా అనే సినిమాను కూడా ఆహా వేదికగా విడుదల చేయనున్నారు. క్రిస్మస్ కానుకగా దీనిని విడుదల చేయనున్నారు. మొత్తానికి డిసెంబర్‌లో ఆహా ప్రేక్షకులను మరింత ఆహ్లాదాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత పరిస్థితులు కాస్త కుదుటపడిన నేపథ్యంలో చాలా సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు క్యూ కడుతున్నాయి. అయితే కరోనాపై జనాల్లో ఇంకా భయం ఉండటంతో థియేటర్లకు వచ్చేందుకు జంకుతున్నారు. ఈ ప్రభావం కలెక్షన్లపై బాగా పడుతోంది. కొన్ని సినిమాలు ధైర్యంగా థియేటర్‌కు వచ్చేందుకు మొగ్గు చూపుతుంటే, మరికొన్ని ఇప్పటికీ ఓటీటీ బాట పడుతున్నాయి. అయితే గత నెల రోజులతో పోలిస్తే ఈ వారం అటు థియేటర్‌తో ఓటీటీలోనూ సందడి రెట్టింపు కానుంది. వినాయకచవితిని పురస్కరించుకుని ఓటీటీ ద్వారా రీజల్ అవుతున్న సినిమాల వివరాలు మీకోసం..
10న నాని ‘టక్ జగదీష్’ నాని కథానాయకుడిగా రూపొందిన యాక్షన్, కుటుంబ కథా చిత్రం ‘టక్ జగదీష్’. శివ నిర్వాణ దర్శకుడు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలు. వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ‘నిన్నుకోరి’ తర్వాత శివ నిర్వాణ-నాని కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. థియేటర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం అనూహ్య పరిణామాల కారణంగా ఓటీటీ బాటపట్టింది. భూ కక్షలు లేని భూదేవిపురం కోసం ‘టక్ జగదీష్’ యువకుడు ఏం చేశాడన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నాజర్, జగపతిబాబు, నరేశ్, రావురమేశ్, రోహిణి కీలకపాత్రలు పోషించారు.
ఆ ‘నెట్’లో పడితే ఇక అంతేనా?
రాహుల్ రామకృష్ణ, అవికా గోర్‌తో కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నెట్’. భార్గవ్ మాచర్ల దర్శకుడు. సస్పెన్స్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా సెప్టెంబరు 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో లక్ష్మణ్ అనే పాత్రలో రాహుల్ రామకృష్ణ కనిపించనున్నారు. అవికాగోర్.. ప్రియ అనే అమ్మాయి పాత్ర షోషించారు. అశ్లీల చిత్రాలు వీక్షించే రాహుల్ చివరికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సీక్రెట్ కెమెరాల ద్వారా ప్రియ ప్రైవేట్ లైఫ్‌ని వీక్షించిన రాహుల్ చిక్కుల్లో పడటానికి కారణమేమిటి? ప్రియ జీవితాన్ని సీక్రెట్ కెమెరాలతో చిత్రీకరించింది ఎవరు? తెలియాలంటే ‘నెట్’ చూడాల్సిందే.
మెడికల్ థ్రిల్లర్ ముంబై డైరీస్ 26/11 అమెజాన్ ప్రైమ్ వేదికగా మరో కొత్త సిరీస్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘ముంబై డైరీస్ 26/11’ పేరుతో తెరకెక్కిన ఈ మెడికల్ థ్రిల్లర్ సెప్టెంబరు 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మోహిత్ రైనా, కొంకణ సేన్ శర్మ, శ్రేయా ధన్వంతరిలు కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ను నిఖిల్ అడ్వాణీ, నిఖిల్ గోన్సల్వేస్‌లు తెరకెక్కించారు. మొత్తం ఎనిమిది భాగాల్లో ఈ సిరీస్ ప్రసారం కానుంది. 26/11 ముంబయి దాడుల సమయంలో వైద్యులు, విలేకరులు, పోలీస్ ఫోర్స్ ఏవిధంగా పనిచేసిందన్న ఆసక్తికర అంశాలను థ్రిల్ కలిగించేలా సిరీస్‌ను తీర్చిదిద్దారు.
నెట్‌ఫ్లిక్స్‌లో ‘తుగ్లక్ దర్బార్’
సెప్టెంబరు 9న ‘లాభం’ చిత్రంతో థియేటర్‌లో సందడి చేయనున్న విజయ్ సేతుపతి ఆ మరుసటి రోజే వినాయకచవితి సందర్భంగా సెప్టెంబరు 10న టెలివిజన్‌లో అలరించనున్నారు. ఆయన కీలక పాత్రలో తెరకెక్కిన తమిళ పొలిటికల్ మూవీ ‘తుగ్లక్ దర్బార్’. రాశీ ఖన్నా, మంజిమా మోహన్ కథానాయికలు. దిల్లీ ప్రసాద్ దీనదయాళన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సెప్టెంబరు 10న సన్ టీవీ నేరుగా ప్రసారం చేయనుంది. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబరు 11 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఓ రాజకీయ నాయకుడ్ని అమితంగా ఇష్టపడే సింగారవేలన్ (విజయ్ సేతుపతి) అనే యువకుడి పాత్రలో విజయ్ సేతుపతి అలరించనున్నారు.
ఓటీటీలో అలరించే మరికొన్ని చిత్రాలు
Amazon Prime Video
లూలా రిచ్ (సెప్టెంబర్ 10)
Aha
ద బేకర్ అండ్ ద బ్యూటీ ( సెప్టెంబర్ 10)
మహాగణేశా ( సెప్టెంబర్ 10)
Disney Plus Hotstar
అమెరికన్ క్రైమ్‌స్టోరీ (సెప్టెంబర్ 08)
Netflix
అన్‌టోల్డ్: బ్రేకింగ్ పాయింట్ (సెప్టెంబర్ 07)
ఇన్ టు ది నైట్ (సెప్టెంబర్ 08)
బ్లడ్ బ్రదర్స్ (సెప్టెంబర్ 09)
మెటల్ షాప్ మాస్టర్స్ (సెప్టెంబర్ 10)
లూసిఫర్ (సెప్టెంబర్ 10)
కేట్ (సెప్టెంబర్ 10)
ZEE 5
డిక్కీ లూనా (సెప్టెంబర్ 10)
క్యా మేరీ సోనమ్ గుప్తా బెవాఫా హై (సెప్టెంబర్ 10)