Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. లేటెస్ట్ గా ‘పుష్ప’ సినిమాలో ఐటెమ్ సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ ను ఊపేస్తోంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో సైతం సమంత కథానాయికగా నటిస్తూ సత్తా చాటుకుంటోంది. ఇక సామ్ తాజాగా కమిట్ అయిన తెలుగు సినిమా ‘యశోద’. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కథ వినగానే బాగా ఎగ్జైట్ అయిన సమంత ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కూడా కథలో భాగంగా వస్తాయి. అయితే ఇందులో సమంత పోషించే పాత్ర ఏంటనే విషయంలో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం యశోద చిత్రంలో సమంత నర్స్‌గా నటిస్తోందని టాక్. హీరోయిన్ సెంట్రిక్ స్టోరీ కాబట్టి.. ఆమె పాత్రకి సినిమాలో చాలా ప్రధాన్యత ఉంటుందని అర్ధమవుతోంది. ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుందని చెబుతున్నారు. హరి, హరీష్ అనే ఇద్దరు దర్శకులు రూపొందిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఉన్నిముకుందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేశ్, కల్పిక గణేశ్ , సంపత్ రాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సైతం ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది.
‘శ్యామ్ సింగరాయ్’ ఫేమ్ రవితేజ్ హీరోగా, మిస్ మహారాష్ట్ర అనిత షిండే జంటగా సతీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దిల్ తో పాగల్ హై’. ఎస్‌ఎమ్‌ఆర్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్ సమర్పణలో గీతా ఫిలిమ్స్ పతాకంపై ఎస్. సోమరాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ క్లాప్‌నిచ్చారు. జైపాల్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇద్దరు ప్రేమికుల ప్రయాణం నేపథ్యంలో సాగే ఈ కథ వినగానే సినిమా చేయడానికి ముందుకొచ్చారు నిర్మాత. జనవరి 15 తర్వాత చిత్రీకరణ ప్రారంభిస్తాం. మేలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు.
ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు, ఆశ్చర్యకరమైన ప్రదేశాలున్నాయి. కొన్ని చోట్ల జనం కిక్కిరిసిపోయి ఉంటే మరికొన్ని చోట్ల ఒక్క మనిషి కూడా ఉండరు. అయితే 100 సంవత్సరాలుగా ఖాళీగా ఉంటున్న ఒక ఇల్లును ఇటీవలే ఇటలీలో గుర్తించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆశ్చర్యపరుస్తుంది. నిజానికి ఈ ఇల్లు భారీ డోలమైట్ పర్వతాల మధ్యలో నిర్మించారు. దీనిని ‘ప్రపంచంలోని ఒంటరి ఇల్లు’ అని పిలుస్తారు. ఈ ఇల్లు సముద్ర మట్టానికి దాదాపు 9వేల అడుగుల ఎత్తులో నిర్మించడం విశేషం. ఇంత ఎత్తులో ఇల్లు ఎలా నిర్మించారు.. ఎందుకు నిర్మించారు ఇక్కడ ఎవరు ఉండేవారు తదితర విషయాల గురించి తెలుసుకుందాం.
ఈ ఇంటిని మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో నిర్మించారని తెలుస్తోంది. ఆస్ట్రో-హంగేరియన్ సైన్యంతో జరిగిన యుద్ధంలో ఇటాలియన్ సైనికులు విశ్రాంతి తీసుకోవడానికి ఇంత ఎత్తులో నిర్మించారని చరిత్ర కారులు చెప్పారు. అప్పట్లో సైనికులు ఈ ఇంటిని స్టోర్ రూమ్‌గా కూడా ఉపయోగించారు. సైనికుల కోసం తీసుకువచ్చిన వస్తువులు ఇప్పటికీ భద్రంగా ఉండటం విశేషం. ఈ ఇల్లు పూర్తిగా భిన్నమైన రీతిలో నిర్మించారు. దీని నిర్మాణంలో చెక్క, తాడు, కేబుల్ ఉపయోగించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఇల్లు నిర్మించి 100 సంవత్సరాలకు పైగా గడిచినప్పటికీ ఈ ఇల్లు చెక్కుచెదరకుండా అలాగే ఉంది. పర్వతం మధ్యలో ఈ ఇల్లు ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఈ ఇంటి చుట్టూ పర్వతాలు తప్ప ఇంకెమీ కనిపించవు. దీంతో ప్రజలెవరూ ఇక్కడికి రావడం లేదు. ఇక్కడికి చేరుకునే మార్గం కూడా చాలా కష్టంతో కూడుకున్నది. ఒక పాత చెక్క వంతెనను దాటితేనే ఇక్కడికి చేరుకోగలం. గొప్పదనం ఏంటంటే ఈ ఇంటికి వచ్చిన తర్వాత మరో లోకంలోకి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ప్రమాదం కారణంగా ప్రజలు ఇక్కడికి రాకుండా సాధారణంగా నిషేధించినా సాహసాలను ఇష్టపడే వ్యక్తులు ఇక్కడికి వెళ్లాలని అనుకుంటే సొంత పూచీతో అనుమతిస్తున్నారు.
బాహుబలి, బాహుబలి-2, సాహో చిత్రాల పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. దీంతో ఆయన తదుపరి సినిమాలన్నీ తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ తెరకెక్కేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయంటేనే ఆయన స్థాయి ఎక్కడికి వెళ్లిపోయిందో అర్థం చేసుకోవచ్చు. రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్‌తో పాటు.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే, సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు.
తాజాగా డార్లింగ్‌కు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. ప్రభాస్ హైదరాబాద్‌లో మరో కొత్త ఇంటిని కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముంబైలో ప్రభాస్‌కు విలాసవంతమైన బంగ్లా ఉండగా.. తాజాగా హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ సినీ విలేజ్‌లో పెద్ద విల్లాను నిర్మించనున్నాడని టాక్. దీనికోసం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రూ.120 కోట్లతో రెండు ఎకరాలు కొన్నాడని తెలుస్తోంది. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరగా ఉంటుందనీ, ట్రాఫిక్ పెద్దగా వుండని ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. ప్రభాస్ అక్కడ 80 కోట్ల రూపాయలతో విలాసవంతమైన గెస్ట్ హౌస్ లేదా బంగ్లాను నిర్మించాలనుకుంటున్నాడట. మొత్తంగా కొత్త విల్లా కోసం ప్రభాస్ 200 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సోషల్‌మీడియా క్రేజ్ పెరిగాక హీరోయిన్ల అందాల ఆరబోతకు అడ్డే లేకుండా పోతోంది. నెటిజన్ల దృష్టిని ఆకర్షించడం కోసం హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ నయనతార హవా కొనసాగుతోంది. వయసు పైబడుతున్నా ఆమె రేంజ్ పెరుగుతోందో గానీ.. ఎక్కడా తగ్గడం లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటున్న నయనతార గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో కనిపించనుంది. ‘సైరా నరసింహారెడ్డి’ లో చిరుకు భార్యగా నటించిన నయన్.. తాజా సినిమాలో ఆయనకు చెల్లెలిగా నటిస్తుండటం విశేషం.
అయితే ఈ సినిమా కోసం నయనతార ఏకంగా నాలుగు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. నయనతార నటించడం వల్ల ఇతర భాషల్లో కూడా రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిర్మాతలు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం. మలయాళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘లూసిఫర్’ రీమేక్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో హీరో చెల్లెలి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందువల్లే ఈ రోల్‌కి నయనతారను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే ‘గాడ్ ఫాదర్’ సినిమా కోసం నయన్ తీసుకున్న పారితోషికం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా రూ.4కోట్లు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.మునుపెన్నడూ లేనివిధంగా ఆమె పవర్ ఫుల్ లుక్‌లో కనిపించనున్నారట.
‘గాడ్ ఫాదర్’ సినిమా విషయానికి వస్తే కొణిదెల ప్రొడెక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సత్యదేవ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. నయనతార భర్తగా ఆయన కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఈ సినిమాలో నటించనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి ప్రచారం సాగుతోంది.
విష్ణు సహస్రనామాలను భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. కురుక్షేత మహాసంగ్రామం ముగిసిన తర్వాత భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. సుమారు నెల రోజులు గడిచిపోయిన తర్వాత ఒకనాడు పాండవులతో మాట్లాడుతూ శ్రీకృష్ణుడి హఠాత్తుగా మధ్యలో ఆపేశాడు. పాండవులు కంగారుపడి ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు.
దీనికి కృష్ణుడు ‘మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః’కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్ము నన్ను స్మరించుకుంటున్నాడు.. అందుకే నామనస్సు అక్కడికి మళ్లింది. పాండవులారా బయలుదేరండి అక్కడకు మనం వెళ్దాం.. భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు అని చెప్పి వారిని వెంటబెట్టుకుని వెళ్లాడు. ఈ సమయంలోనే శ్రీకృష్ణుని భీష్ముడు స్తుతిస్తూ విష్ణు సహస్రనామాలను ఉపదేశం చేశాడు.
ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని నమ్మకం. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి) లో ఈ శ్లోకం ‘ధర్మార్థులకు ధర్మం, అర్థార్థులకు అర్థం, కామార్థులకు కామం, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును’ అని పేర్కొన్నారు.
దివ్య కేశవ కీర్తనను వినేవారికి, చదివే వారికి ఏవిధమైన అశుభాలు ఉండవు. బ్రాహ్మణులకు వేదవిద్య, గోవులు, క్షత్రియులకు విజయం, వైశ్యులకు ధనం, శూద్రులకు సుఖం లభిస్తుంది. ధర్మం కోరుకువారికి ధర్మం, ధనం కోరుకున్నవారికి ధనం లభిస్తుంది. భక్తితో వాసుదేవుని నామాలను కీర్తించేవారికి కీర్తి, శ్రేయస్సు దక్కి వారి రోగాలను హరిస్తుంది.
నామం అందరూ చెప్పవచ్చు. మంత్రజపం చేసేవారు స్థాణువులాగా ఉండి చేయాలి. కానీ నామం మాత్రం అటూ ఇటూ తిరుగుతూ, నిలబడి, కూర్చొని, పనిచేసుకుంటూ చేయవచ్చు. స్వప్న, సుషుప్తులకు అధిదేవత పరమశివుడు. కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు పదకొండుసార్లు శివనామం స్మరించాలి. జాగృతికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. అందువల్ల ఉదయం లేస్తూనే శ్రీహరీ శ్రీహరీ శ్రీహరీ అంటూ పదకొండుసార్లు స్మరించాలని పండితులు ఉవాచ.
శాస్త్రంలో మంచం మీద పడుకొని ఏది చేయడాన్నీ అంగీకరించదు. విష్ణు సహస్రనామానికి ఆ నిబంధన లేదు. ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదికి రక్షణ కల్పించింది శ్రీమహావిష్ణువు ప్రార్థన. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మంచం మీద ఔషధం కూడా సేవించకూడదు. గజేంద్ర మోక్షం ఉదయం లేవగానే ఎవరు భావన చేస్తారో దుస్స్వప్న ఫలితాలు తొలగిపోతాయి. కానీ మంచంమీద నుంచి లేస్తూనే విష్ణు సహస్రనామం చదవాలని ఉంటే చక్కగా చదువుకోవచ్చు. నిబంధనలు లేవు.
‘దుఃస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనమ్! కాననే నారసింహం చ పావకే జల శాయినమ్!!’ బుధ గ్రహం బలహీనంగా ఉండి నీచ క్షేత్రం ఉంటే సమస్యలు ఎదురైనప్పుడు విష్ణు సహస్రనామాలు పటించడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారని శాస్త్ర వచనం.
అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా.. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బంగార్రాజు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సూపర్ హిట్ చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అందులో ఆత్మగా అలరించిన నాగ్ బంగార్రాజు పాత్రకిది ఎక్స్‌టెన్షన్. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉండగా.. చైతూ సరసన కథానాయికగా నటిస్తోన్న కృతిశెట్టి నాగలక్ష్మి పాత్రకు సంబంధించిన లుక్ ను విడుదల చేశారు. చీరకట్టుతో మెరిసిపోతూ.. మెడలో దండలతో రివీలైన ఆమె మేకోవర్ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ లుక్ వైరల్ అవుతోంది.
అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. శివకేశవులకు ఇష్టమైన మాసం కావడంతో హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. హరిహరులకు ప్రీతికరమైన ఈ నెలలో కార్తీక పౌర్ణమికి ఎంతో ‘ప్రాశస్త్యం’ ఉంది. ఇక కార్తీకపౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలా తోరణాన్ని దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. కార్తీక మాసంలో నెలరోజులు పూజ చేయడం ఒకెత్తయితే.. పౌర్ణమి రోజు వెలిగించే దీపాలు, పూజ ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలాతోరణం విశిష్టమైన అంశం. ఏ ఇతర మాసంలోనూ ఇటువంటి ఆచారం మనకు కనబడదు. పౌర్ణమి రోజు రాత్రి శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకుని చుడతారు. దీనిని యమద్వారం అని అంటారు. అనంతరం..ఈ గడ్డి మీద నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ మూడు సార్లు ఊరేగిస్తారు.
జ్వాలా తోరణము పదం పురాణ ప్రసిద్ధమైంది. అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పడు మొదటగా హాలాహలం ఉద్భవించగా.. దాన్ని మహాశివుడు తీసుకుని ఆ విషాన్ని కంఠ మధ్యలో నిక్షేపించాడు. అప్పుడు పార్వతీ దేవి శివునికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరము అగ్ని జ్వాల క్రింది నుంచి తన భర్తతో సహా దూరి వెడతానని మ్రొక్కుకుందట. ఈ పురాణ కథ నేపథ్యంలోనే ఏటా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు రాత్రి శివాలయంలో ఎండు గడ్డితో చేసిన చేసిన తోరణాన్ని జ్వాలగా వెలుగిస్తుంటారు. ఆ జ్వాల క్రింది నుంచి శివపార్వతుల పల్లకీని మూడు సార్లు తీసుకొని వెడతారు.
మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడుసార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుందని నమ్మకం. జ్వాలా తోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని, ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం.