Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
అవతార్.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గురించి తెలియని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. 2009లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం ఈ విజువల్ వండర్‌గా వచ్చి సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. ఈ సినిమా కోసం పత్యేకంగా ఓ గ్రహాన్నే సృష్టించాడు కామెరూన్. దాంతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ఈ సినిమాకి అభిమానులుగా మారిపోయి వేల కోట్లను కట్టబెట్టారు. అంతేకాకుండా.. అప్పట్లో వివిధ విభాగాల్లో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. అలాగే.. ఈ సినిమాకి పలు సీక్వెల్స్ ఉంటాయనే అప్పట్లోనే కామెరూన్ ప్రకటించాడు. దీంతో అప్పటి నుంచే ఈ మూవీ సీక్వెల్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ తరుణంలో అవతార్ సీక్వెల్ అయిన.. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్(Avatar The Way Of Water)’ చిత్రాన్ని గ్రాండ్‌గా డిసెంబర్ 16, 2022న విడుదల చేసేందుకు మూవీ టీం సిద్ధమవుతోంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్ మంచి రెస్సాన్స్‌ని అందుకుంది. ఈ సినిమా మొదటి పార్ట్ కంటే గ్రాండియర్‌గా ఉంటుందనే భావనని ప్రేక్షకుడి మదిలో కలిగించింది. దీంతో అవతార్ 2పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ తరుణంలో అవతార్ 1ని మళ్లీ విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. అది కూడా అవతార్ 2 విడుదలకి దాదాపు మూడు నెలల ముందు అంటే సెప్టెంబర్ 23 విడుదల చేసేందుకు సిద్ధమైంది. అది కూడా లిమిటెడ్ థియేటర్స్‌లో మాత్రమే. దీనికి సంబంధించిన కొత్త ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ పోస్ట్‌పై పలువురు స్పందిస్తూ.. పెద్ద స్ర్కీన్‌లో చూడడం మిస్ అయినా ఎంతోమంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి ఎదురుచూస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.
విశ్లేషణః పూరి జగన్నాథ్ ముందు సినిమా ఇస్మార్ట్ శంకర్ భారీ విజయం సాధించడంతో పూరి మళ్ళీ పామ్‌లోకి వచ్చాడని అందరూ భావించారు. వెంటనే ప్యాన్ ఇండియా సినిమా లైగర్, విజయ్ దేవరకొండతో అనగానే కొంచెం అంచనాలు పెరిగాయి. దానికి తోడు కరణ్ జోహార్ లాంటి హిందీ దర్శకనిర్మాత ఈ సినిమాలో భాగం కావడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. కానీ పూరి ఒక హిట్ వచ్చాక ఈ ప్యాన్ ఇండియా మోజులో పడి మళ్ళీ పాత పద్దతికే అలవాటు పడినట్లున్నాడు. ఇప్పుడు ప్రేక్షకులు కంటెంట్ లేకపోతే సినిమా హాల్‌కి రాలేని రోజులు ఇవి. ఇటువంటి సమయంలో పూరి కథ లేకుండా, సరైన స్ర్కీన్‌ప్లే లేకుండా, ఏదో నలుగురు హిందీ యాక్టర్స్‌ని ఒక అంతర్జాతీయ సెలబ్రిటీ అయినా మైక్ టైసన్‌లాంటి వ్యక్తిని సినిమాలో చూపించి హిట్ అనుకుంటే పొరపాటే!
సినిమా మొదలవడం బాగానే ఉంది. కానీ కొద్ది నిమిషాలకే గాడి తప్పుతుంది. అసలు ఏమి జరుగుతోంది, పూరి ఏమి చెప్పాలనుకున్నాడు, కథలో ఏమి చూపిస్తున్నాడో అర్థం కాకుండా పోయింది. ‘లైగర్’ లక్ష్యం ఛాంపియన్ అవ్వాలని, కానీ పూరి ఆ నేపథ్యంలో ఏమి చూపించకుండా, చాలా సినిమాటిక్‌గా పది మంది రౌడీలను, తర్వాత కోచింగ్ సెంటర్‌లో ఇంకో 20 మందిని కొట్టగానే కోచ్ కి లైగర్ స్కిల్స్ నచ్చేస్తాయి. ఇంకేముంది ఛాంపియన్ అయిపోతాడు. సినిమాలో అన్ని సీన్స్ అందరూ ఊహించినట్లుగా ఉంది. విచిత్రం ఏంటంటే పూరి మార్క్ డైలాగ్స్ కానీ పూరి మార్క్ సీన్స్ కానీ ఎక్కడ కనపడవు. కథ ఏమి అనుకోకుండా తీసిన సినిమా ఇది అనిపిస్తుంది. తెలుగు వాళ్లకి ఇది ఒక డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. పలు సన్నివేశాల్లో ఓవర్ యాక్షన్‌లా అనిపిస్తుంది. ఎక్కడ ఎమోషన్ కనిపించదు. అసలు లైగర్ లక్ష్యం ఏంటి ఎందుకు అమెరికా వెళ్ళాడు అన్న విషయం పక్కన పెట్టి, సిల్లీగా తన ప్రియురాలు కోసం, మైక్ టైసన్‌తో ఒకే యాక్షన్ సీన్ పెట్టి సినిమా పూర్తి చెయ్యటం హాస్యాస్పదం. ఈ సినిమాలో పూరీ జగన్నాథ్ అన్ని విభాగాల్లో విఫలయ్యాడనే చెప్పాలి.
ఇక నటీనటుల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. నత్తిగా మాట్లాడే పాత్రతో మెప్పించాడు. అలాగే తన పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు అన్న సంగతి తెరపై కనిపిస్తోంది. కానీ అతను ఒక్కడే బాగా నటిస్తే సరిపోదు కదా, సరైన కథ, ఆసక్తికర కథనం, ఇవన్నీ చాలా అవసరం. కానీ ఈ చిత్రంలో అవేమీ లేవు. అనన్యా పాండేను కేవలం గ్లామర్ కోసం మాత్రమే తీసుకున్నట్లు అనిపిస్తుంది. రోనిత్ రాయ్ కోచ్‌గా ఓకే అనిపించాడు. విషు విలన్‌గా మెప్పించాడు. చుంకీ పాండే, అలీ లాంటి ఆర్టిస్ట్‌లు ఉన్నా వారి పాత్రలు ఏమాత్రం చెప్పుకొనేలా లేవు. మైక్ టైసన్ చివరలో కనిపిస్తాడు. రమ్య కృష్ణకి పెద్ద పాత్ర వచ్చింది. ఆమెని ఇంకా బాహుబలిలోని శివగామి పాత్ర వదిలినట్టు లేదు. లైగర్‌కు, రమ్యకృష్ణకు మధ్య ఎమోషన్ పండలేదు. ఇంకా సాంకేతిక పరంగా చూస్తే, యాక్షన్ సీన్స్ అన్నీ బాగున్నాయి, బాగా తీశారు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. పాటలు అంత ఆకట్టుకోలేదు. విజయ్ దేవరకొండ డాన్స్ చేస్తుంటే చూడటానికి ఏదోలా వుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చాక గుర్తుండే అంశం ఒక్కటీ లేదు. టోటల్‌గా చెప్పాలంటే లైగర్ విజయ్ దేవరకొండకి ఒక చెంప దెబ్బ లాంటిది. విజయ్ తదుపరి చిత్రం కూడా పూరి దర్శకత్వంలోనే ఉంది. కాబట్టి కథ మీద కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది. లేక ప్యాన్ ఇండియా అంటూ కథలు మార్చి, ఎక్కడెక్కడి నటినటుల్నో తెచ్చి కెమెరా ముందు నిలబెట్టి, విషయం లేకుండా లైగర్‌లా తీస్తే. అభాసుపాలు కావడమే అవుతుంది
‘సీతారామం’లో సీతగా మైమరపించే నటనతో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)కి తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయా..? అంటే అవుననే మాట బలంగా వినిపిస్తోంది. మన తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్‌కి మొదటి సినిమా గనక భారీ హిట్ సాధిస్తే ఇక అందరూ ఆమె వెనకాలే క్యూ కడుతుంటారు. ఈ విషయం ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి హీరోయిన్స్‌గా పరిచయమైన వారిని చూస్తే అర్థమవుతుంది. ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన కృతిశెట్టి (Krithi Shetty) ఆ సినిమా రిలీజ్ కాకుండానే అరడజను సినిమాలలో నటించే అవకాశం అందుకుంది. ఇలా ఇప్పుడు మృణాల్ ఠాకూర్‌కి కూడా పెద్ద హీరోల సరసన నటించే ఛాన్సులు వస్తున్నాయట.
సీతా రామం (Sita Ramam) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మృణాల్.. అందంలో మన హీరోలను, మేకర్స్‌ను బాగా ఆకట్టుకుంది. సీతగా నటించి అందరి మెప్పు పొందింది. దాంతో ఇప్పటికే కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో మొదలబోతున్న సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ పేరును పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదే కాదు ఇప్పుడు మరికొన్ని కొత్త ప్రాజెక్ట్స్ కి కూడా ఆయా చిత్రాల దర్శకనిర్మాతలు మృణాల్ పేరునే పరిశీలిస్తున్నారట. మరి అఫీషియల్‌గా ఎప్పుడు కన్‌ఫర్మేషన్ వస్తుందో గానీ, ఇప్పటికే మూడు ప్రాజెక్ట్స్ కమిటైందని ఇన్‌సైడ్ టాక్. పెళ్లి సందడి సినిమా తర్వాత యంగ్ బ్యూటీ శ్రీలీల, రొమాంటిక్ మూవీతో పరిచయమైన కేతిక శర్మ ఇలాగే బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంటున్నారు. ఈ వరుసలో ఇప్పుడు మృణాల్ కూడా చేరిందని చెప్పుకుంటున్నారు.
శ్రీ కృష్ణుని ఆరాధన కేవలం హిందూమతం, భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు.. విదేశాల్లో శ్రీ కృష్ణుడిని పూజిస్తారు. అంతేకాదు కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు, అంగరంగ వైభవంగా వేడుకలు కూడా నిర్వహిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలో అష్టమి తిథి నాడు శ్రీ కృష్ణుడు జన్మించాడు. కృష్ణాష్టమి రోజున భారతదేశంలోని ప్రముఖ కృష్ణ దేవాలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అయితే శ్రీకృష్ణుని జన్మభూమి అంటే మాత్రం చాలా మధుర, గోకుల బృందావన ఆలయాలనే భావిస్తారు. అయితే దక్షిణ భారతదేశంలో కూడా ప్రముఖ వేణుగోపాల స్వామి ఆలయాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీ కృష్ణుడి, వేణు గోపాల స్వామి దేవాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని చారిత్రక ప్రాధాన్యం ఉండే గుళ్లు ఎన్నో ఉన్నాయి. వీలైతే వీటిని ఓసారి సందర్శిచేయండి.
శ్రీకృష్ణ మఠం, ఉడిపి
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శ్రీ కృష్ణుని ఆలయాల్లో ఉడుపి శ్రీకృష్ణ మఠం ఒకటి. ఇది కర్నాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లా కేంద్రంలో ఉంది. ఈ ఆలయంలో ఉన్న వేణు మాధవుడిని నవ రంధ్రాల కిటికీ నుండి మాత్రమే పూజిస్తారు. భక్తులకు కిటికీ నుండి మాత్రమే చూడటానికి అనుమతిస్తారు. ఈ ఆలయం చెక్క మరియు రాతితో నిర్మించబడిందది. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కొలనులోని నీటిలో గుడి గోపురానికి సంబంధించిన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.
గురువాయుర్ దేవాలయం, కేరళ
దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోనూ అనేక ప్రసిద్ధ శ్రీకృష్ణ దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ఒకటి గురువాయుర్ దేవాలయం. దీన్ని దక్షిణ ద్వారక అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఇది విష్ణువు యొక్క పవిత్ర నివాసంగా భావిస్తారు. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక నగరంలో వరదలు వచ్చినప్పుడు కృష్ణుడి విగ్రహం కొట్టుకుపోయిందని, దాన్ని గురువు రక్షించాడని చాలా మంది నమ్ముతారు. ఈ విగ్రహాన్ని కేరళలో గురు దేవుడు వాయు దేవుని సహాయంతో ప్రతిష్టించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే కేరళలోని శ్రీ కృష్ణ దేవాలయం గురువు, వాయు దేవుని పేరు మీదుగా గురువాయుర్ ఆలయంగా మారిపోయింది.
తిరుపతిలో
కలియుగ ప్రత్యక్షదైవంగా భావించే తిరుపతి తిరుమల వేంకటేశ్వరుని సన్నిధానంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. వేంకటేశ్వరుని సన్నిధిలో ఉన్న వేణుగోపాల స్వామి విగ్రహాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉట్ల ఉత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ అద్భుతమైన వేడుకలను చూసేందుకు లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా తిరుపతికి తరలివస్తారు. అంతేకాదు కృష్ణాష్టమి రోజున కన్నయ్య కోవెలల్లో ఘనంగా జన్మాష్టమి వేడుకలను నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఉట్టి కొట్టడం, గ్రామోత్సవం వంటి సంబురాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
నాంపల్లి ఇస్కాన్ టెంపుల్
భాగ్యనగరం నడిబొడ్డున ప్రముఖ శ్రీ కృష్ణుని దేవాలయం ఉంది. నాంపల్లిలో ఉన్న ఈ దేవాలయం ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అలాగే నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు చేరువలో కూడా కృష్ణుడి పురాతన దేవాలయం ఉంది. ఇది దాదాపు 150 ఏళ్ల క్రితం నిర్మించినది. ఈ గుడితో పాటు భాగ్యనగరంలోని చాలా ప్రాంతాల్లో జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.
మొవ్వ వేణుగోపాల స్వామి ఆలయం
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో హంసలదీవి, మొవ్వలోని వేణుగోపాల స్వామి ఆలయాల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. హంసలదీవిలోని కృష్ణుని గుడికి వేయ్యేళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడు, రుక్మిణీ, సత్యభామలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కూచిపూడి సమీపంలోని మొవ్వ క్షేత్రంలోనూ శ్రీకృష్ణుని విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ కన్నయ్య చేతిలోని వేణువులో గాలి ఊదే రంధ్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాదు స్వామి వారికి సంబంధించిన మకరతోరణంలో దశావతరాలు కనిపిస్తాయి. క్షేత్రయ్య రాసిన పదాలన్నీ శ్రీకృష్ణుడిపైనే. ఈ పుణ్యక్షేత్రం విజయవాడకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పార్థసారథి ఆలయం, చెన్నై
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలోని పార్థసారథి ఆలయంలో విష్ణువుకు సంబంధించిన నాలుగు అవతారాలను పూజిస్తారు. ఇందులో కృష్ణుడు, రాముడు, నరసింహుడు, వరాహావతారాలను ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ ఆలయంలో అనేక మిస్టరీలు ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించినదిగా తెలుస్తోంది.
సమయం : రాత్రి గం.00.00 ని. 8 జీవిత కాలం : 125 సంత్సరాల 8 నెలల 7 రోజులు
నిర్యాణం: క్రీ పూ 18.02.3102(3102 B.C)
శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది 11 కురుక్షేత్రం జరిగిన 36సం. తరువాత నిర్యాణం
కురుక్షేత్రం క్రీ.పూ. 08.12.3139న మృగసిర శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 25.12.3139 న ముగిసినది. క్రీ.పూ 21.12.3139న 3గం. నుంచి 5గం.లవరకు సంభవించిన సూర్య గ్రహణం జయద్రదుని మరణానికి కారణమయ్యెను.
భీష్ముడు క్రీ.పూ. 02.02.3138న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశినాడు ప్రాణము విడిచెను.
శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. మధురలో కన్నయ్య, ఒడిశాలో జగన్నాధ్, మహారాష్ట్ర లో విఠల (విఠోబ), రాజస్తాన్ లో శ్రీనాధుడు, గుజరాత్ లో ద్వారకాదీసుడు & రాంచ్చోడ్, ఉడిపి, కర్ణాటకలో కృష్ణ
శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం. వారు చాణుర – కుస్తీదారు, కంసుడు – మేనమామ, శిశుపాలుడు మరియు దంతవక్ర – అత్త కొడుకులు
శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు.
శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నారని శ్రీ కృష్ణుడిని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది.
కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనానికి మారాల్సి వచ్చింది.
14-16 ఏళ్ల వయసు వరకు బృందావనంలో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.
తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు.
కాలయవన అను సింధురాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.
వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.
శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్నిర్మించారు.
అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్లాడు.
గుజరాత్‌లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్తను కాపాడాు.
తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేశాడు.
పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యాన్ని స్థాపించేందుకు సహాయపడ్డాడు.
ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడాడు.
రాజ్యము నుండి వెళ్లిపోయినప్పడు పాండవులకు తోడుగా నిలిచాడు.
పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో మద్దతు తెలిపి విజయం వరించేటట్లు చేశాడు. 39 ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూశాడు.
అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను.
శ్రీకృష్ణుడు జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతి మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు.
జీవితములో ప్రతి వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి ఎవరికీ అంకితమవ్వలేదు. అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఎప్పుడు వర్తమానములోనే బ్రతికాడు.
హిందూ సంప్రదాయాల ప్రకారం గ్రహణం వేళ దేవాలయాలన్నీ మూసివేస్తారు. కానీ అక్కడ మాత్రం గ్రహణం సమయంలోనూ ఆ గుడి తెరిచే ఉంటుంది. అర్ధరాత్రి అయినా సరే ఆ ఆలయంలో కన్నయ్యకు పూజలు జరుపుతూనే ఉంటారు. అంతేకాదు ఆ గుడిలోని వేణు మాధవుడికి ఎడతెగని ఆకలి ఉంటుదట. రోజుకు కనీసం 10 సార్లు నైవేద్యం సమర్పిస్తే స్వామి వారు సంతృప్తి చెందరని అక్కడి పండితులు చెబుతారు. ఏ ఒక్కరోజు కన్నయ్యకు నైవేద్యం తక్కువైనా స్వామి వారి విగ్రహం సైజు తగ్గిపోతుందట. ఈ ఆలయంలో ఇప్పటికీ కొన్ని అంతుచిక్కని రహస్యాలు అలాగే మిగిలిపోయాయి. కృష్ణాష్టమి సందర్భంగా ఆ ఆలయం ఎక్కడుంది.. గోపాలుని గుడిలో ఇక్కడ ఏమేమీ వింతలు.. విశేషాలున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మన దేశంలో అందరూ కృష్ణాష్టమి వేడుకలను ఉట్టిని పగులగొట్టి.. గ్రామోత్సవాలు, చిన్ని కృష్ణుడిని అందంగా అలంకరించి వేడుకలను జరుపుకుంటారు. కానీ అక్కడ మాత్రం చాలా విభిన్నంగా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తారు. ఈ ఆలయంలో అనేక రహస్యాలు ఉన్నాయి. కన్నయ్య కొలువైన ఉన్న ఈ ఆలయం కేరళలోని కొట్టాయం జిల్లా తిరువరప్పు లేదా తిరువేరపులో ఉంది. కొట్టాయం నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లాలనుకునే వారికి ఆంధ్రా, తెలంగాణ నుంచి రైలు, విమాన, బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ముందుగా కొచ్చి లేదా కొట్టాయానికి చేరుకుంటే ఆలయానికి వెళ్లేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉంటాయి.
ఇక్కడ కొలువైన కన్నయ్యకు ఎడతెగని ఆకలి ఉంటుందట. ఈ గుడిలోని గోపాలుని విగ్రహానికి సుమారు 1500 సంవత్సరాల చరిత్ర ఉందని పండితులు చెబుతున్నారు. ఈ గుడిలోని కన్నయ్య విగ్రహానికి ప్రతిరోజూ కనీసం 10సార్లు నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇక్కడ ఓ పాత్రలో ఉంచిన ప్రసాదం క్రమంగా తగ్గిపోతుందని భక్తులు కూడా చెబుతారు. అందుకే ఇది అనేక రహస్యాలున్న ఆలయంగా పరిగణించబడుతుంది.
గ్రహణం వేళ..
ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత ఏంటంటే.. గ్రహణం సమయంలోనూ ఈ గుడిని తెరిచే ఉంచుతారు. అంతేకాదు స్వామివారికి నైవేద్యం కూడా సమర్పిస్తారు. సాధారణంగా గ్రహణం వేళ అన్ని గుళ్లను మూసివేస్తారు. ఈ గుడిలోని స్వామివారి ప్రసాదం తీసుకున్న వారికి తమ జీవితంలో ఆకలి బాధలనేవి అస్సలు రావని చాలా మంది నమ్ముతారు.
విగ్రహం సైజు తగ్గుదల..
పురాణాల ప్రకారం, కృష్ణుని మేనమామ కంసుడిని వధించిన తర్వాత ఎడతెగని ఆకలితో ఉన్నాడని.. అందుకే ఇక్కడి విగ్రహం ఆకలితో బాధపడుతుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఇక్కడి గుడిలో స్వామివారికి నైవేద్యం సమర్పించడంలో కొంచెం లేటైనా కూడా విగ్రహం సైజు తగ్గిపోవడం ప్రారంభమవుతుందట.
ఈ గుడిలో మరో ప్రత్యేకత ఏంటంటే.. ప్రతిరోజూ కేవలం రెండు నిమిషాల పాటే ఆలయం తలుపులను మూసివేస్తారు. అంటే 11:58 గంటలకు మూసేసి.. సరిగ్గా 12 గంటలకు తెరుస్తారు. ఇక్కడి శ్రీ కృష్ణుని విగ్రహం కేవలం రెండు నిమిషాలు మాత్రమే కునుకు తీస్తుందని చెబుతారు. మరోవైపు గుడికి సంబంధించిన తాళాలతో పాటు గొడ్డలిని కూడా పూజారికి ఇస్తారు. ఎందుకంటే ఒకవేళ తాళాలతో తలుపులు తెరచుకోకపోతే గొడ్డలిని ఉపయోగించి తలుపులను పగులగొట్టి గుడిని తెరవొచ్చు. ఇలా చేయడానికి పూజారికి అనుమతి కూడా ఉంది. ఇక్కడ కొన్ని వందల ఏళ్ల నుండి ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఆలయంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలతో పాటు నైవేద్యం సమర్పిస్తారు.
శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి, హిందూ ఇతిహాసాలలో ఎనిమిదో అవతారం శ్రీకృష్ణుడు. శ్రీ కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని, లేదా జన్మాష్టమి, లేదా గోకులాష్టమి, లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు.. వసుదేవుడి భార్య అయిన దేవకి ఎనిమిదో గర్భంగా, శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదేరోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది.
చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ౹ బంగారు మొలతాడు పట్టుదట్టి౹ సందె తావీదులు సరిమువ్వ గజ్జెలు౹ చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు౹౹
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణమాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ, స్వామికి నైవేద్యం పెడతారు. ఉయ్యాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి, పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అని పిలుస్తారు. శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినమనికూడా వివరించింది.
దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ… అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్ధేశం చేశారు శ్రీ కృష్ణభగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహా భాగవతం కథలను విన్నా… దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం, కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోంది. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. వివిధ రూపాల్లో, సంప్రదాయాలతో భక్తిప్రపత్తులతో కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సంస్కృతి, సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి.
శ్రీ కృష్ణుడు జపించిన ఉత్తమ మంత్రమేమిటో తెలుసా?
జగన్నాటక సూత్రధారిగా కీర్తి చెందిన శ్రీ కృష్ణ భగవానుడు ఓ ఉత్తమ మంత్రాన్ని జపించి తనకు కావలసిన వరాలను పొందినట్లు శివపురాణం చెబుతోంది. పూర్వం శ్రీ కృష్ణ భగవానుడు తనకు కావలసిన కోరికలను సిద్ధింప జేసుకోవడం కోసం ముక్కంటిని తలచి తపస్సు చేయాలనుకున్నాడు. వెంటనే హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న పరమ శివభక్తుడైన ఉపమన్యు మహర్షి దగ్గరకు వెళ్ళి తన మనస్సులోని మాటను చెప్పాడు. అప్పుడు ఆ మహర్షి అధర్వ వేద ఉపనిషత్తులోని “నమశ్శివాయ” అనే పంచాక్షర మంత్రాన్ని ఉపదేశించి, 16నెలల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేయమన్నాడు. ఇలా నమశ్శివాయ మంత్రముతో 16 నెలల పాటు తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరులను కృష్ణుడు ప్రత్యక్షం చేసుకున్నాడు. కృష్ణుడి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరాలు కావాలో? కోరమంటాడు. అప్పుడు కృష్ణుడు 8 వరాలను కోరుకుంటానని చెప్పి వాటిని శివుడి ముందుంచాడు. అచంచలమైన గొప్పకీర్తి, స్థిరమైన శివసన్నిధి లభించాలి. నిత్యం శివధర్మంలో బుద్ధి నిలవాలి. నిత్యం తాను శివభక్తితో ఉండాలి. శత్రువులంతా సంగ్రామంలో నశించాలి. ఎక్కడా శత్రువుల వల్ల తనకు అవమానం కలుగకూడదు. తనకు తొలిగా జన్మించిన కుమారులకు ఒక్కొక్కరికి పదిమంది పుత్రులు కలగాలి. యోగులందరికీ తాను ప్రియుడు కావాలి. ఈ వరాలను తనకిమ్మని కృష్ణుడు కోరగానే ముక్కంటి వాటినన్నింటిని అనుగ్రహిస్తాడు.
ఇదేవిధంగా శ్రీ కృష్ణ పరమాత్మ చేసిన తపస్సుకు పార్వతీదేవి సంతసించి కావలసినన్ని వరాలను కోరమని అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు.. బ్రాహ్మణుల మీద ఎప్పటికీ ప్రజలకు ద్వేషం కలగకూడదు. తన తల్లిదండ్రులు సర్వకాలాలలోను సంతోషంగా ఉండాలి. తానెక్కడ ఉన్నా సర్వ ప్రాణుల మీద తనకు అనురాగం కలగాలి. మంగళకరమైన బ్రాహ్మణ పూజను తాను సర్వదా చేస్తుండాలి. తాను వంద యజ్ఞాలను చేసి ఇంద్రుడు లాంటి దేవతలను సంతోష పెట్టాలి. తన గృహంలో ఎల్లప్పుడూ వేల సంఖ్యలో యతులకు, అతిథులకు శ్రద్ధతో పవిత్రమైన భోజనాన్ని సమర్పించే అవకాశం కలగాలి. అలాగే తాను వేలసంఖ్యలో భార్యలకు ప్రియమైన భర్త కావాలి. తనకు వారంటే ఎప్పటికీ అనురాగం ఉండాలి. వారి తల్లిదండ్రులంతా లోకంలో సత్య వాక్యాలను పలుకుతూనే ఉండాలి. అనే వరాలను కృష్ణుడు శక్తిమాతను అడిగాడు. వాటిని శ్రీ కృష్ణుడికి వెంటనే అనుగ్రహించి ఆ మరుక్షణంలోనే పార్వతీ పరమేశ్వరులిద్దరు అంతర్ధానమయ్యారని శివపురాణం చెబుతోంది.
“నమశ్శివాయ” మంత్రంచే కృష్ణుడు సిద్ధింప చేసుకున్న వరాలలో కొన్ని మాత్రమే ఆయనకు సంబంధించినవి. మిగతా వరాలను పరిశీలిస్తే సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కోరుకున్నవే అవుతాయి. అందుచేత శ్రీ కృష్ణ భగవానుడు కొంతవరకు తమ స్వార్థాన్ని ఆకాంక్షిస్తూ వరాలు కోరినా.. ఎంతో కొంత సామాజిక శ్రేయస్సును కూడా అభిలాషించాలన్న ఓ ఉత్తమ ప్రబోధం ఈ కథలో కనిపిస్తుంది. లోక కళ్యాణార్థం భూమిపై అవతరించిన శ్రీ కృష్ణ భగవానుడిని శ్రీ కృష్ణాష్టమి రోజున నిష్టతో పూజించి ఆయన ఆశీస్సులు పొందుదాం..
గతేడాది నేచురల్ స్టార్ నాని నటించిన పీరియాడికల్ ఫిక్షనల్ డ్రామా ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నానీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. పూర్వజన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నానీ బెంగాలీ యువకుడిగానూ, ఒక ఫిల్మ్ మేకర్ గానూ రెండు పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. కథానాయికగా సాయిపల్లవి అత్యుత్తమ నటనను కనబరిచింది. స్వాతంత్ర్యానికి పూర్వం బెంగాల్ లోని ఒక ప్రాంతంలో జరిగే అనాచారాలపై తిరుగుబాటు చేసే యువకుడిగా నానీ చాలా పవర్ ఫుల్ పాత్రను పోషించారు. కృతిశెట్టి మరో కథానాయికగా నటించగా.. రాహుల్ రవీంద్రన్, మడోనా సెబాస్టియన్, మురళీ శర్మ, జిషు సేన్ గుప్తా, శుభలేఖ సుధాకర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఓటీటీలో కూడా ఈ సినిమా విశేష ప్రజాదరణ పొందింది. అలాంటి ఈ సినిమా మూడు కేటగిరిస్‌లో ఆస్కార్ బరిలో నిలిచింది.
‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాన్ని పిరియాడిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, భారతీయ సాంప్రదాయ క్లాసిక్ విభాగాల జాబితాలో ఆస్కార్ పరిశీలనకు పంపినట్టు సమాచారం. ఈ విషయం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదలై. అక్కడ కూడా మంచి వసూళ్ళను రాబట్టింది.
వాసుదేవ్ ఒక మంచి దర్శకుడు. ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీసి పేరు తెచ్చుకొని ఆ తర్వాత సినిమా దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలనుకుంటాడు. ఆ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల అతడ్ని పూర్వ జన్మ వెంటాడుతుంది. తను క్రిందటి జన్మలో ప్రముఖ బెంగాలి రచయిత శ్యామ్ సింగరాయ్ నని అర్ధమవుతుంది. ఇంతకీ ఎవరా శ్యామ్ సింగరాయ్ ? అతడి కథాకమామిషేంటి? అన్నదే మిగతా కథ. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా.. ఈ సినిమా కథాంశాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్. ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ బరిలోకి దిగడం గొప్ప విషయం.
‘కార్తికేయ 2’ సినిమా విడుదలకు ముందు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కానీ విడుదల తర్వాత విజయదుందుభి మోగిస్తుంది. చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలలో మా సినిమాను కృష్ణుడు నడిపిస్తున్నాడు అని చెబుతూ వస్తున్నారు. ‘మనం ఏదైనా బలంగా కోరుకుంటే.. అది మనకు చేరే వరకు ఈ విశ్వమంతా సహాయపడుతుంది..’ అనేది.. ఈ టీమ్ నమ్మకాన్ని చూస్తుంటే నిజమేనని అనిపిస్తుంది. రోజురోజుకీ ఊహించని విధంగా ఈ చిత్రం కలెక్షన్లను రాబడుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ చిత్రం సత్తా చాటుతోంది. బాలీవుడ్ పరంగా ఈ చిత్రాన్ని నిర్మాత అల్లు అరవింద్వంటివారు ‘పుష్ప’ సినిమాతో పోల్చుతున్నారంటే.. ఏ స్థాయిలో బాలీవుడ్‌లో ఈ చిత్రం సంచలనాలను క్రియేట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఒక్క అల్లు అరవిందే కాదు.. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శ్రీ కృష్ణుని లీలలను సైన్స్‌కి, టెక్నాలజీకి ముడిపెట్టడం ప్రేక్షకులను కదిలించిందంటూ.. అలాగే.. ‘‘మనకు కనిపించడం లేదంటే మన కన్ను చూడలేకపోతుందని అర్ధం, మనకు కన్ను లేదని కాదు. శ్రీకృష్ణుడు చెప్పిన కర్మం మతం కాదు మన జీవితం. గీతతో కోట్ల మందికి దారి చూపించిన శ్రీ కృష్ణుడు కంటే గురువు ఎవరు.?’’ వంటి డైలాగ్స్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయంటూ.. సినీ విశ్లేషకులు సైతం ఈ సినిమాని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. .
తాజాగా జరిగిన సక్సెస్ మీట్‌లో.. ‘‘మాములుగా హిందీలో కేవలం 50 థియేటర్లలో రిలీజైన కార్తికేయ 2 సినిమా, రెండో రోజుకు 200 థియేటర్లు, 3వ రోజుకి 700 థియేటర్లలో ఆడటం.. సంతోషాన్ని కలిగించే విషయం. ఈ సినిమాలో సత్తా ఉంది కాబట్టే ఇది సాధ్యమైంది. ‘పుష్ప’ కూడా ఇలానే బాలీవుడ్‌లో ఘన విజయం సాధించింది. నేను ‘అఖండ’ సినిమా చూసినప్పుడు శైవం మీద, శివతత్వంపై ఎమోషన్స్‌ని పండిస్తూ.. తారా స్థాయికి తీసుకెళ్లారని అనిపించింది. అలాగే.. ఇంకో రెండు మూడు ఏళ్ళల్లో విష్ణువును బేస్‌గా తీసుకుని సినిమా చేస్తారు అని ఉహించి.. చర్చలు కూడా జరిపాను. అటువంటిది ఒక ఏడాది తిరగకముందే విష్ణుతత్వం (కృష్ణతత్వం) మీద సినిమా రావడం, పెద్ద విజయం సాధించడం ఆశ్చర్యపరిచింది. మధ్య మధ్యలో యానిమేషన్‌లో చూపిస్తూ మళ్ళీ పిక్చర్‌లో తీసుకెళ్లడం చాలా బాగుంది. అందుకు దర్శకుడు చందూ మొండేటికి అభినందనలు.
సినిమా అంటే అమ్మాయి, అబ్బాయి మధ్య రొమాన్స్ మాత్రమే కాకుండా.. ఒక అమ్మాయి, అబ్బాయి ఒక కాజ్ కోసం పరిగెడితే చాలు, మనం కూడా వాళ్ళ వెనుక పరిగెడతాం.. అని ప్రేక్షకుల చేత థియేటర్లకి పరుగులు పెట్టిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక అడ్వెంచర్ ఫిల్మ్‌కు పౌరాణిక బేస్ ఇచ్చి.. మళ్ళీ దానిని కలికాలంలోకి తీసుకొచ్చిన విధానం నాకెంతో నచ్చింది’’ అని నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాపై విశ్లేషణ చేశారు.
బాహుబలి తర్వాత ప్రభాస్ నుండీ వచ్చిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె.. వంటి చిత్రాల పై అభిమానులకు పెద్దగా అంచనాలు లేవు. వారి చూపంతా కే.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న సలార్ పైనే ఉన్నాయి. కే.జి.ఎఫ్ రేంజ్‌లో ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తాడు అని అంతా ఆశిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేసుకుంటూ వచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ముందుగా 2022 లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని ప్రకటించినా రిలీజ్ డేట్ వాయిదా వేసుకోక తప్పలేదు.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్మాతలు సలార్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. 2023 సెప్టెంబర్ 28 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ప్రభాస్ రెండు కత్తులు పట్టుకుని శత్రుసంహారం చేస్తున్నట్టు ఈ పోస్టర్ ఉండగా …’ రెబలింగ్.. వరల్డ్ వైడ్ సెప్టెంబర్ 28th 2023′ అంటూ అందులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సెప్టెంబర్ 28 ప్రభాస్ అభిమానులను డిజప్పాయింట్ చేసిన డేట్ అనే చెప్పాలి. అదే డేట్ కు 2012 లో రెబల్ అనే చిత్రం రిలీజ్ అయ్యింది. ప్రభాస్ రెండు హిట్లు కొట్టి ఫాంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనూ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే డేట్‌తో వస్తున్న ‘సలార్’పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.