Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రేంజ్ స్టార్ క్రేజ్ ఉన్న హీరోయిన్లలో నయనతార ఒకరు. తెలుగు, తమిళ బాషల్లో స్టార్ హీరోలందరితో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నయన్.. అతి తక్కువ కాలంలో అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది. కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ని ఏర్పాటు చేసుకుంది. ఇటీవల దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్న నయనతారు.. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తానని చెప్పింది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరో తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’లో కీ రోల్ పోషిస్తోంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచినా ‘లూసిఫర్’ సినిమాకి ఇది రీమేక్. దీంతో పాటుగా హిందీలో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన జవాన్ హీరోయిన్ గా నటించింది..ఈ చిత్రానికి ప్రముఖ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు. అయితే నయనతారకు సంబంధించి ఓ కీలక సమాచారం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
సాధారణంగా ఏ హీరోయిన్‌కైనా పెళ్లి తర్వాత క్రేజ్‌తో పాటుగా సినిమా అవకాశాలు తగ్గిపోతాయి. అయితే ఇందుకు భిన్నంగా నయనతారకి ఇసుమంత కూడా డిమాండ్ తగ్గలేదు. కెరీర్ ప్రారంభం నుంచి గ్లామర్ షో మాత్రమే కాకుండా నటనకి ప్రాధాన్యమున్న పాత్రలు పోషించడం నయనతార స్పెషాలిటీ. అందుకే అందరు డైరెక్టర్లు ఆమెతో పని చెయ్యడానికి ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. తనకున్న డిమాండ్‌ని బట్టి నయనతార పెళ్లయిన తర్వాత పారితోషికం బాగా పెంచేసినట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటివరకు రూ.4-6కోట్ల పారితోషికం తీసుకునే ఈ బ్యూటీ ఇప్పుడు రూ.10కోట్లు డిమాండ్ చేస్తోందట. అయితే ఆమెకున్న క్రేజ్‌ని బట్టి ఎంత అడిగినా ఇచ్చేందుకు నిర్మాతలు కూడా వెనకడుగు వేయడం లేదట.
కేవలం నయనతార కోసమే సినిమాలు చూసే ప్రేక్షకులు తెలుగు, తమిళ భాషల్లో కోట్ల సంఖ్యలో ఉన్నారు. నయనతార ఒక సినిమా ఒప్పుకుందంటే కచ్చితంగా ఏదో విశేషం ఉంటుందని బలంగా నమ్ముతుంటారు. అందుకే ఆమె తన బ్రాండ్ కి తగ్గ పారితోషికాన్ని డిమాండ్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నయనతారకి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. ఈ సంస్థ ద్వారా తన అభిరుచికి తగ్గ సినిమాలు నిర్మిస్తూ కొత్తవాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఇస్తోంది నయనతార.
తిరుమల వేంకటేశ్వర స్వామి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. టీటీడీ (TTD) చరిత్రలో శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. భక్తులు స్వామివారికి కాసుల వర్షం కురిపించారు. ఈనెల రూ. 100 కోట్ల ఆదాయం దాటింది. కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు వస్తున్నారు. శ్రీవారిని దర్శించుకుని విరివిగా కానుకలు సమర్పించుకుంటున్నారు. కరోనా ప్రభావం తగ్గడంతో తిరుమల కొండ నిత్యం రద్దీతో కళకళలాడుతోంది. మొక్కులున్న భక్తులతో పాటు, ముడుపులనూ భారీగా సమర్పిస్తున్న క్రమంలో హుండీ ఆదాయం పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
అలిపిరి నుంచి స్వామి కొండకు వేలాదిమంది భక్తులు కాలినడకన తిరుమల చేరుకుంటున్నారు. వాహనాల సంఖ్య కూడా పెరిగింది. శ్రీవారి ఆలయం, క్యూకాంప్లెక్స్‌లు, మాడవీధులు, అన్నప్రసాద భవనం, అఖిలాండం, బస్టాండు, రోడ్లు, దుకాణ సముదాయాలు, కల్యాణకట్ట, లడ్డూల జారీ కేంద్రం, ఇతర సందర్శనీయ ప్రదేశాలు భక్తులతో రద్దీగా మారాయి. తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న హుండీ తిరుమల హుండీగా సుప్రసిద్ధం. వడ్డీకాసుల వాడు, ఆపదమొక్కుల వాడు అని పేరొందిన తిరుమల వేంకటేశ్వరున్ని దర్శించుకునే భక్తులు.. కానుకలు హుండీలో వేయడం పరిపాటి. ప్రపంచవ్యాప్తంగా వాటికన్ సిటీ తర్వాత అంతటి ఆదాయం కలిగిన ప్రార్థనా స్థలంగా తిరుమల ప్రసిద్ధి చెందింది. ఆపదలు వచ్చినప్పుడు మొక్కులు మొక్కుకుంటే ఆయన తీరుస్తాడని భక్తుల నమ్మకం. ఒంటిపై వేసుకుని వచ్చిన బంగారం, సొమ్ముతో సహా మొత్తం హుండీలో వేయడాన్ని నిలువు దోపిడీ అని వ్యవహరిస్తారు. తిరుపతిలో నిలువు దోపిడీ చెల్లించుకుంటానని మొక్కుకుని, మొక్కు తీర్చుకుంటూంటారు
హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా విలక్షణ పాత్రలు పోషిస్తూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నాడు కోలీవుడ్ స్టార్ సూర్య. ఓ వైపు పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలు పోషిస్తూనే.. మరోవైపు పోలీసులు చేసే తప్పులు ఎత్తి చూపించే పాత్రలు(జైభీమ్) పోషిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నాడు. అందుకే సూర్యను తమిళ ప్రేక్షకులతో సమానంగా తెలుగు వారు సైతం ఆరాధిస్తుంటారు. పాత్ర నచ్చితే హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించేందుకు సైతం అంటూ ఇటీవల ‘విక్రమ్’ మూవీ రోలెక్స్ పాత్రలో మెరిశాడు. తాజాగా వెలువడిన 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘సూరారై పోట్రు(ఆకాశం నీ హద్దురా)’ కు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. జులై 23న 47వ పుట్టిన రోజును జరుపుకుంటున్న సూర్య ఆస్తుల గురించి నెట్టింట తెగ వెతికేస్తున్నారు. దీంతో ఆయనకు ఎన్ని ఆస్తులున్నాయో ఓ లుక్కేద్దామా..
ప్రముఖ తమిళ నటుడు శివకుమార్ పెద్ద కుమారుడైన సూర్య(Suriya) చెన్నైలో పుట్టి పెరిగాడు. కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని సంపాదించాడు. లయోలా కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 1997లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ‘నందా’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోయిన్ జ్యోతికను 2006లో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సూర్య సోదరుడు కార్తి కూడా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు
ఫోర్బ్స్ లెక్కల ప్రకారం సూర్య ఆస్తి, పాస్తుల విలువ రూ. 186కోట్లు. దక్షిణాదిలోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో ఆయనొకరు. ఒక్కో సినిమాలో నటించేందుకు రూ. 20కోట్ల నుంచి రూ. 25కోట్ల వరకు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటాడని సమాచారం. బ్రాండ్‌కు ప్రచారం చేయడానికి రూ.2కోట్లను పారితోషికంగా అందుకుంటాడట. ప్రమోషన్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, టీవీ కమర్షియల్స్ వంటి వివిధ మార్గాల్లో ఏడాదికి రూ. 30కోట్ల వరకు సంపాదిస్తాడని టాక్. సూర్యకు కార్లంటే అంటే చాలా ఇష్టం. అందుకే తన గ్యారేజీలో అనేక విలాసవంతమైన కార్లకు చోటిచ్చాడు. బీఎమ్ డబ్ల్యూ-7 సిరీస్, ఆడి-క్యూ 7, మెర్సిడెస్ బెంజ్ ఎమ్ క్లాస్, జాగ్వార్ ఎక్స్‌జేఎల్ వంటి కార్లను సొంతం చేసుకున్నాడు.
హరిహరులు ఒకేచోట కొలువైన పుణ్యక్షేత్రం పుష్పగిరి. దక్షిణకాశీగా పిలిచే ఈ ఆలయాన్ని శైవ, వైష్ణవ భక్తులందరూ దర్శించుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏకైక అద్వైతపీఠంగా గుర్తింపుపొందిన ఈ ఆలయం పినాకిని నదికి ఎదురుగా పచ్చని ప్రకృతి మధ్య కనిపిస్తూ… శిల్పకళావైభవానికి ప్రతీకగా నిలుస్తూ… భక్తులను ఆకట్టుకుంటుంది పుష్పగిరి చెన్నకేశవస్వామి ఆలయం. ఇక్కడ విష్ణుమూర్తి చెన్నకేశవస్వామిగా, పరమేశ్వరుడు చంద్రమౌళీశ్వరుడిగా పూజలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విలసిల్లుతున్నారు. ఏడో శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని పల్లవులు, చోళులు, చాళుక్యులు, విజయనగర రాజులు దర్శించుకున్నారని చెబుతారు. నిత్యపూజలతో కళకళలాడే ఈ ఆలయం కడపలోని పుష్పగిరిలో ఉంది.
స్థల పురాణం
కశ్యప మహర్షి ఓసారి భార్యలైన కద్రువ, వినత కలిసి ఆడుకుంటూ.. పందెంలో ఓడిపోయినవారు గెలిచినవారికి దాసిలా పని చేయాలని షరతు పెట్టుకున్నారట. ఆ పందెంలో వినత ఓడిపోవడంతో కద్రువకు దాసిలా పని చేసేదట. వినతకు జన్మించిన గరుత్మంతుడు తన తల్లికి ఆ బానిసత్వం నుంచి విముక్తి కలిగించమని కద్రువను కోరాడట. అప్పుడు కద్రువ తనకు అమృతాన్ని తెచ్చిస్తే వినతకు స్వేచ్ఛను ఇస్తానని చెప్పిందట. దేవేంద్రుడి దగ్గరున్న ఆ అమృతాన్ని గరుత్మంతుడు తెచ్చే క్రమంలో జరిగిన పోరులో రెండు అమృతం చుక్కలు ఈ ప్రాంతంలోని పినాకిని నదిలో పడటంతో ఇందులో స్నానాలు చేసిన వారందరూ మరణం లేకుండా, యుక్తవయస్కుల్లా మారిపోయారట. అది చూసి దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని సంప్రదించారు. విష్ణుమూర్తి ఆ నీటిలో పెద్ద పర్వతం ముక్కను వేసినా అమృతం ప్రభావం వల్ల ఆ నీటిలో రాయి మునగకుండా పుష్పం ఆకారంలో పైకి తేలిందట. దాంతో శివకేశవులు తమ పాదాలతో ఆ రాయిని నీటిలోనే ఉండిపోయేలా తొక్కేశారనీ ఆ తరవాతే హరిహరులు ఇక్కడ వెలిశారనీ… అలా ఈ ప్రాంతానికి పుష్పగిరి అనే పేరు వచ్చిందనీ అంటారు. ఈ ఆలయాన్ని విద్యారణ్యస్వామి నెలకొల్పినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక్కడున్న పంచనదీ సంగమంగా గుర్తింపు పొందిన పినాకిని నది… ఉత్తరం నుంచి దక్షిణం దిశగా కాశీశ్వరాలయం వైపు పయనించడం వల్లే పుష్పగిరిని దక్షిణకాశీగా పిలుస్తారు.
నిత్య పూజలు…
ఈ ఆలయానికి చెన్నకేశవస్వామే క్షేత్రపాలకుడు. ఇక్కడున్న స్వామి నిలువెత్తు విగ్రహం తిరుమలలోని శ్రీవారి విగ్రహం కంటే ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ ఏడాది మొత్తం జరిగే పూజలు కాకుండా ధనుర్మాసంలో, కార్తికంలో విశేష అభిషేకాలూ, ఉత్సవాలూ జరిపిస్తారు. కొండ మీద ఒకే ఆవరణలో ఉన్న చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం దర్శించుకున్నాక రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ ఉపాలయాలనూ చూడొచ్చు.
ఎలా చేరుకోవాలంటే
పుష్పగిరి క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునే వారు కడప వరకూ బస్సు లేదా రైల్లో చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సు లేదా ప్రైవేటు వాహనాల్లో కర్నూలుకు వెళ్లే రహదారి మార్గంలో ఉప్పరపల్లె మీదుగా 16 కి.మీ. ప్రయాణిస్తే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.
కోదండరామ దేవాలయం, కడప జిల్లా. 7.సూర్యనారాయణ దేవాలయం జోగుళాంబ అలంపూరు గద్వాల జిల్లా
నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు
మహానంది
జంబుకేశ్వర్
బుగ్గరామలింగేశ్వర్
కర్ణాటక కమండల గణపతి.
హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
బెంగళూర్ మల్లేశ్వర్
రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం
సిద్ధగంగా
అలంపురం
నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.
అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.
నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్
మంజునాథ్.
శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్
సముద్రమే వెనక్కి వెళ్లే
గుజరాత్ నిష్కళంక మహాదేవ్,
40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం. స్త్రీ వలె నెలసరి అయ్యే
అస్సాం కామాఖ్యా అమ్మవారు,
కేరళ దుర్గామాత.
రంగులు మారే ఆలయం
ఉత్తరాయణం, దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.
పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం. పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.
నిరంతరం పెరుగుతోన్న విగ్రహాలు
కాణిపాకం,
యాగంటి బసవన్న,
కాశీ తిలభండేశ్వర్,
బెంగుళూరు బసవేశ్వర్
స్వయంభువుగా సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్‌నాథ్ మంచులింగ
ఆరునెలలకు ఒకసారి తెరిచేఆరునెలలకు ఒకసారి తెరిచే
బదరీనాథ్,
కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)
గుహ్యకాళీమందిరం.
సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు
హాసంబా దేవాలయం, హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.
12 ఏళ్లకు ఒకసారి పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.
స్వయంగా ప్రసాదం తినేస్వయంగా ప్రసాదం తినే
కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.
బృందావనం రాధాకృష్ణ శయనమందిరం
ఒంటి స్తంభంతో
యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేధారేశ్వర్, ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.
రూపాలు మారే ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.
నీటితో దీపం వెలిగించే ఘడియ ఘాట్ మాతాజీ మందిర్, మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది, ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.
మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు
హేమాచల నరసింహ స్వామి.
శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి
మనిషి వలె గుటకలు వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.
అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.
ఛాయా విశేషం
ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.
హంపి విరూపాక్షేశ్వర్, గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.
బృహదీశ్వరాలయం
నీటిలో తేలే విష్ణువు (వేల టన్నుల బరువు), నేపాల్
పూరీ
పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే పూరి ప్రసాదం.
ఇవి మనకు తెలిసిన కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమే. ఇటువంటివి దేశంలో కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి.
సాధారణంగా హిందూ దేవాలయాలు కొండల్లో, పర్వత ప్రాంతాల్లో, గుహల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో, జలపాతాలు, నదులకు సమీపంలో అందమైన ప్రకృతి మధ్య ఎంతో గొప్పగా కనిపిస్తాయి. కానీ గుజరాత్‌లోని నిష్కలంక మహదేవ్ ఆలయం వీటన్నింటికీ ఎంతో భిన్నం. భీకరమైన అలల ప్రవాహం మధ్య తీరానికి సముద్రం మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. నిష్కలంక్ అంటే పాపాలు దూరం చేసేది అని అర్ధం. మహాభారత యుద్ధం తరువాత పాండవులు తమ దోషాలను, కళంకాలను ఇక్కడే రూపుమాపుకున్నారని పురాణ కధనం. అందుకే ఇక్కడి శివుణ్ణి నిష్కలంక్ మహదేవ్ గా పూజిస్తారు. గుజరాత్ లోని భావనగర్‌కు తూర్పున 23 కిలోమీటర్ల దూరంలో కొలియాక్ సముద్ర తీర ప్రాంతంలో నిష్కలంక్ మహాదేవ్ ఆలయం ఉంది. భారతీయ క్యాలెండర్ ప్రకారం భదర్వ అమావాస్య రాత్రి పాండవులు ఇక్కడ నిష్కలంక్ మహదేవ్ ను స్థాపించారని చెబుతారు.
వెనక్కి వెళ్లే సముద్రం
కొలియాక్ సముద్ర తీరానికి ఉదయం పూట వచ్చే టూరిస్టులకు ఇక్కడ ఎటువంటి ఆలయం ఉన్నట్లు కనిపించదు. ఎందుకంటే ఆ సమయంలో ఆలయం పూర్తిగా నీటమునిగి ఉంటుంది. సముద్రం మధ్యలో ఆలయం ఉందనడానికి సూచికగా ఆలయ ధ్వజస్తంభంపై ఉండే జెండా మాత్రమే రెపరెపలాడుతూ కనిపిస్తుంది. మధ్యాహ్నం 11 గంటలు దాటిన తరువాత నుంచి సముద్రం మెల్లగా వెనక్కి వెళ్లడం ప్రారంభిస్తుంది. దీంతో భక్తులు ఆలయానికి చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్య రోజుల్లో భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో దర్శనానికి వచ్చి అలలు ఎప్పుడు మాయమౌతాయా అని ఎదురుచూస్తుంటారు. ఏటా మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. సముద్రం మధ్యలో ఈ ఆలయం నిర్మాణం ఎలా చేశారనేది నేటి తరం ఇంజినీర్లకు, సాంకేతిక నిపుణులకు అంతుచిక్కని పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఈ ఆలయానికి వీక్షించిన వారు ప్రాచీన భారతీయుల పనితనాన్ని, నైపుణ్యాన్ని కొనియాడకుండా ఉండలేరు.
ప్రతిరోజూ మధ్యాహ్నం 1 గంట సమయానికి సముద్రం పూర్తిగా వెనక్కి వెళ్లడంతో పూలు, పండ్లు, పూజా సామగ్రి అమ్మే వర్తకులు తమ సామాగ్రిని తోపుడు బండ్లపై వేసుకుని సముద్రంలో నడుచుకుంటూ ఆలయానికి చేరుకుంటారు. ఆ తరువాత ఆలయానికి వెళ్లే భక్తుల తాకిడి కూడా పెరుగుతుంది. రాత్రి 7 గంటల వరకూ భక్తులు ఈ ఆలయం వద్ద సమయం గడపవచ్చు. ఆ సమయం దాటిన తరువాత సముద్రం మళ్లీ ముందుకు రావడం ప్రారంభిస్తుంది. అర్ధరాత్రి దాటే సమయానికి ఆలయం పూర్తిగా సముద్రగర్భంలో మునిగిపోతుంది.
ఆలయం వెనుక ఆసక్తికరమైన కధ
మహాభారతం యుద్ధం సమయంలో పాండవులు కౌరవులపై యుద్ధాన్ని గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ యుద్ధంలో సొంత బంధువులను చంపిన పాపాలను వారు మూటగట్టుకుంటారు. ఆ పాపాల నుంచి విముక్తి పొందడానికి పాండవులు శ్రీకృష్ణున్ని ఆశ్రయిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక నల్లని ఆవుకు నల్లని జెండాను కట్టి అవి ఎంత దూరం వెళితే అంత దూరం వాటి వెంట వెళ్లమంటాడు. ఎప్పుడైతే ఆ ఆవు, జెండా తెల్లగా మారతాయో అప్పుడు ఆ పాపాల నుంచి విముక్తి దొరుకుతుందని సెలవిస్తాడు. కృష్ణుడి సూచన మేరకు పాండవులు రోజుల తరబడి వాటి వెంటే నడిచేవారు. ఎంత దూరం నడిచినా వాటి రంగులో మార్పు రాలేదు. ఎప్పుడైతే చివరిగా ఆవు, జెండా కొలియాక్ సముద్ర తీరానికి చేరుకున్నాయో అప్పుడు ఉన్నట్టుండి అవి తెల్లగా మారతాయి. అప్పుడు ఐదుగురు అన్నదమ్ములు ఆ ప్రదేశంలోనే కూర్చుని పరమశివుని కోసం ఘోర తపస్సు చేస్తారు. వారి భక్తికి మెచ్చిన శివుడు ఒక్కొక్కరి ఎదుట ఒక్కో స్వయంభువు శివలింగంగా అవతరిస్తాడు. దీంతో పాండవులు అమితానందపడి ఆ ఐదు శివలింగాలకు పూజలు నిర్వహించినట్లు పురాణ కధనం. పాండవుల పాపాలను కడిగిన ఈ పరమ పవిత్ర ప్రదేశం అప్పటి నుంచి నిష్కలంక్ / నిష్కలంక్ మహదేవ్ గా ప్రసిద్ధి పొందింది.
భదర్వి మాసంలో అమావాస్య రోజున పాండవులు ఈ దేవాలయాన్ని ఇక్కడ స్థాపించడంతో ప్రతి ఏటా శర్వణ్ మాసం (ఆగస్టు)లో అమావాస్య రోజున ‘భైదర్వి’ అనే పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఆలయాన్ని సందర్శించే భక్తులకు ప్రతి శివలింగం ఎదుట ఒక్కో నంది కనిపిస్తుంది. భక్తులు ముందుగా పాండవ కొలను అని పిలవబడే నీటి గుంట వద్ద తమ కాళ్లను శుభ్రపరచుకుని పూలు, పాలు, పండ్లతో శివలింగాలకు స్వయంగా అభిషేకిస్తుంటారు. ఇక్కడ ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కెరటాలు చాలా ఉధృతంగా వస్తుంటాయి. భక్తులు తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకుని కెరటాలు శాంతించే వరకూ ఎదురుచూస్తుంటారు. మనకు బాగా కావాల్సిన వారు ఎవరైనా మరణిస్తే వారి ఆస్తికలను ఇక్కడి నీటిలో కలపడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరి ముక్తి లభిస్తుందని బలంగా నమ్ముతారు. ఆలయం గోపురంపై సూచికగా ఎగిరే జెండాను సంవత్సరానికి ఒక్క సారి మాత్రమే మారుస్తారు. ఇప్పటివరకూ తుఫాన్ల వలన కానీ, అలల వలన కానీ ఈ జెండా దెబ్బతిన్న దాఖలాలు లేవు.
దేవుడిపై భక్తి, పర్యటనల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఈ ప్రదేశం తప్పకుండా ఓ మరపురాని అనుభూతిని ఇస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. భగవంతుడి అద్భుత సృష్టికి ఇంతకంటే వేరే నిదర్శనం మరొకటి లేదని ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు చెబుతుంటారు. ఈ ఆలయ విశేషాలు తెలుసుకున్న ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా ఈ సాహసభరిత యాత్ర చేయాలని కోరుకుంటారు. మార్చి నుంచి జూలై మాసాల మధ్య ఈ ఆలయాన్ని సందర్శించేందుకు మంచి సమయం.
ఎలా వెళ్లాలంటే
విమాన మార్గం ద్వారా వచ్చే వారు అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగి 196 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రదేశానికి చేరుకోవాల్సి ఉంటుంది. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుంచి భావనగర్‌కు రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు. భావనగర్ ఎక్స్‌ప్రెస్, మహువ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఈ మార్గంలో ప్రయాణిస్తాయి. సుమారు 5 గంటల ప్రయాణం ఉంటుంది. భావనగర్ నుంచి కొలియాక్ గ్రామానికి 22 కిలోమీటర్ల దూరం. రైల్వే స్టేషన్ నుంచి ట్యాక్సీ, ఆటో రిక్షా లేదా బస్సుల ద్వారా అక్కడికి చేరుకోవచ్చు.
మజిలీ, వెంకీ మామ, లవ్‌స్టోరి, బంగార్రాజు ఇలా వరుస విజయాలతో సక్సెస్ ఊపు మీదున్న అక్కినేని హీరో నాగ చైతన్య. ఆయన కెరీర్‌లో మనం ఓ మెమొరబుల్ మూవీ. ఆ సినిమాను డైరెక్ట్ చేసింది విక్రమ్ కె.కుమార్. తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కలేదు. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ హిట్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘థాంక్యూ’. చైతన్య సక్సెస్ ట్రాక్.. విక్రమ్ కుమార్ వంటి సెన్సిబుల్ డైరెక్టర్‌కి తోడుగా దిల్ రాజు, శిరీష్ వంటి అభిరుచి గల నిర్మాతలు తోడయ్యారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. టీజర్, ట్రైలర్‌తో ఈ ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగాయి. మరి వాటిని సినిమా ఏ మేరకు అందుకుందనేది తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం…
కథేంటంటే అభిరామ్ (నాగచైతన్య) పేదింటి కుర్రాడు. చిన్ననాటి నుంచే తనకంటూ కొన్ని ఆశయాలుంటాయి. తన జీవితంలో ఒకొక్క మజిలీ తర్వాత అమెరికా చేరుకుంటాడు. అక్కడ తన తెలివితేటలతో కార్పొరేట్ సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. అతడి మనసుని చూసి ప్రియ (రాశీఖన్నా) ప్రేమిస్తుంది. ఇద్దరూ సహజీవనం చేస్తారు. జీవితంలో ఎదుగుతున్న కొద్దీ అభి ఆలోచనలు మారిపోతాయి. జీవితంలో ఎన్నో వదులుకుని ఇక్కడిదాకా వచ్చా.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఎవ్వరినీ లెక్క చేయడు. నేను, నా ఎదుగుదల అన్నట్టుగానే వ్యవహరిస్తుంటాడు. ఎదుటివాళ్ల మనోభావాల్ని అస్సలు పట్టించుకోడు. దీంతో ప్రియ అతడికి దూరంగా వెళ్లిపోతుంది. అభి అలా సెల్ఫ్ సెంట్రిక్‌గా మారడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? ప్రియ దూరమయ్యాకైనా అతడి ఆలోచనలు మారాయా? ఆ తర్వాత ఇండియాకి వచ్చిన అభి ఏం చేశాడన్నదే మిగతా కథ.
వ్యక్తి జీవితంలో సాధించిన విజయాల వెనుక ఎంతో మంది ప్రోత్సాహం, తోడ్పాటు ఉంటుంది. అలాంటి వారిని కలుసుకునే వ్యక్తి భావోద్వేగ ప్రయాణమే ‘థాంక్యూ’ సినిమా. నాగ చైతన్య చుట్టూనే ‘థాంక్యూ’ సినిమా నడిచింది. ఓ రకంగా భారీ యాక్షన్ సన్నివేశాలు, సెట్స్, కమర్షియల్ అంశాలు లేకుండా.. ఎమోషన్స్‌ను ప్రధానంగా చేసుకుని నడిచే సినిమా ఇది. ఇలాంటి సినిమాను యాక్సెప్ట్ చేయటమే గొప్ప విషయం అనాలి. 30ఏళ్ల వ్యక్తి జీవితంలో జరిగే మూడు ముఖ్య దశలను ఈ సినిమా రూపంలో మలిచారు. వాటిలో ఒదిగిపోవటానికి నాగ చైతన్య చాలానే కష్టపడ్డారు. ముఖ్యంగా గ్రామంలో పద్దెనిమిదేళ్ల కుర్రాడుగా కనిపించటానికి తన బరువు తగ్గటం.. మళ్లీ తర్వాత కనిపించే పాత్రలో రగ్డ్‌గా కనిపించటం అనేది చాలా కష్టమైన విషయం. ఆ రెంటిని చైతన్య తనదైన నటనతో చక్కగా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. నిజంగా తన ప్రయత్నాన్ని కచ్చితంగా అభినందించాలి. తన ఓజ్‌ను దాటి ఓ కొత్త ఎక్స్‌పెరిమెంట్ చేశాడు చైతన్య.
అభిరామ్ ప్రయాణమే ఈ సినిమా. జీవితంలో అప్పటిదాకా దాటుకుంటూ వచ్చిన ఒక్కొక్క దశని ఆవిష్కరిస్తూ భావోద్వేగాల్ని పంచడమనే కాన్సెప్ట్ మన సినిమాకి కొత్తేమీ కాదు. నాగచైతన్య ‘ప్రేమమ్’ కూడా అలాంటి ప్రయత్నమే. కాకపోతే ఈ కథలో ప్రేమకంటే కూడా జీవితంపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు. తెలిసో తెలియకో ఒక్కొక్కరూ మన జీవితాన్ని ఒక్కో మలుపు తిప్పుతుంటారు. మనం ఎదిగాక కృతజ్ఞతగా వాళ్లని గుర్తు చేసుకోవాల్సిందే అని చెప్పే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. కథేదైనా కథనంతో దానికి కొత్త హంగులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇందులోని కథ అందరికీ తెలిసిందే. కథనం విషయంలోనూ పెద్దగా కసరత్తులు చేయలేదు. దాంతో ఏ దశలోనూ సినిమా ఆసక్తిని రేకెత్తించదు. ఆరంభ సన్నివేశాలు ఆహ్లాదాన్ని పంచుతాయి. ప్రియ, అభిరామ్ కలవడం.. వాళ్ల మధ్య ప్రేమ చిగురించడం.. ఆ తర్వాత అభిరామ్ ఎదుగుదల నేపథ్యంలో సన్నివేశాలు ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తాయి.
కానీ ఈ కథాగమనం ఏమిటో ప్రేక్షకుడి ఊహకు అందేలా సాగుతుంది. మనస్సాక్షి ఎపిసోడ్ తర్వాత కథలో ఉపకథలు మొదలవుతాయి. నాగచైతన్య – మాళవిక నాయర్ (పార్వతి) మధ్య సాగే తొలికథ కొత్తగా అనిపించకపోయినా అందంగానే ఉంటుంది. ద్వితీయార్ధం తర్వాత మొదలయ్యే రెండో కథ విషయంలోనే సమస్యంతా. సుదీర్ఘంగా సాగడం, అందులో కొత్తదనమేదీ లేకపోవడంతో సినిమా రొటీన్‌గా మారిపోయింది. కటౌట్లు, హాకీ అంటూ చాలా హంగామానే ఉంటుంది కానీ, ఆ సన్నివేశాలన్నీ కూడా సాగదీతగానే అనిపిస్తాయి. పార్వతి, శర్వాని కలిశాక పతాక సన్నివేశాలు మొదలవుతాయి. అవి భావోద్వేగాలతో మనసుల్ని హత్తుకునేలా ఉన్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయినట్టు అనిపిస్తుంది.
భావోద్వేగంగా సినిమా ప్రేక్షకులను మెప్పించాలని యూనిట్ చేసిన ప్రయత్నం ఓకే. అయితే సినిమా బావునట్లే ఉంటుంది కానీ.. ఎమోషనల్‌గా ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు.. మనం వంటి ఎమోషనల్ మూవీని అద్భుతంగా తెరకెక్కించి దర్శకుడు విక్రమ్ కుమారేనా ఈ సినిమాను డైరెక్ట్ చేసిందనే డౌట్ రాక మానదు. ఇక ఇలాంటి ఫీల్ గుడ్ మూవీలో ఎమోషన్ కనెక్ట్ కావాలంటే సంగీతం ప్రధాన పాత్రను పోషించాల్సి ఉంటుంది. తమన్ సంగీతం పాటలు సిట్యువేషన్స్‌కు తగ్గట్టు వెళ్లాయే తప్ప.. గొప్పగా లేవు. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. ఇక పి.సి.శ్రీరామ్‌గారి సినిమాటోగ్రఫీకి మనం వంకలు పెట్టలేం. విజువల్స్‌గా సినిమా చాలా ఎఫెక్టివ్‌గా అనిపిస్తుందనడంలో సందేహం లేదు. అక్కినేని అభిమానులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ కామన్ ఆడియెన్స్‌కు మాత్రం సినిమా అంత ఎమోషనల్‌గా కనెక్టింగ్‌గా అనిపించదు.
పిల్లలు తరచుగా జ్ఞాపక శక్తి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులే గమనిస్తూ ఉండాలి. వ్యాధి తీవ్రత పెరిగితే చాలా దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా మతిమరుపు అనేది వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మారిన జీవనశైలి కారణంగా ఇప్పుడు పిల్లల్లో కూడా సర్వసాధారణమైపోయింది. అయితే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే కచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాలి. దాంతోపాటు తల్లిదండ్రులు తమ పిల్లలని ఈ సమస్య నుంచి బయటపడేసేలా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
పచ్చని ఆకుకూరలు
ఆకుకూరలలో జ్ఞాపకశక్తిని పెంచే అనేక విటమిన్లు ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి కోల్పోకుండా నివారించవచ్చు. మెదడుకు పదును పెట్టడానికి వాల్‌నట్ వినియోగం కూడా ఉత్తమమైనది. ఇది ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది మెదడుకు చాలా ముఖ్యమైనది. ఇందులో ఉండే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ గుండె, మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది.
చేపలు
మంచి కొవ్వు కలిగిన చేపలని ఆహారంగా తీసుకుంటే అందులో కొవ్వు కారణంగా మెదడు పనితీరు మెరుగవుతుంది. అందులో ఉండే పోషకాలు మెదడు కణాలకి చురుకుదనం ఇచ్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫిష్ ఆయిల్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మెదడు అభివృద్ధికి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కణాల నిర్మాణానికి చాలా అవసరం. సాల్మన్, మాకేరెల్, తాజా జీవరాశి, సార్డినెస్, హెర్రింగ్ వంటి చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.
రేగు పండ్లు
రేగు పండ్లలో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వయస్సుతో వచ్చే మతిమరుపుని నిరోధించవచ్చు. అంతే కాదు ఇందులో ఉండే విటమిన్ ఈ మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజుకు 8 – 10 రేగుపండ్లు తీసుకోవడం ఉత్తమం.
పాలు పెరుగు
పాలు, పెరుగు, జున్నులో ప్రోటీన్, B విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణజాలం, న్యూరోట్రాన్స్మిటర్లు, ఎంజైమ్‌ల అభివృద్ధికి అవసరం. ఇవన్నీ మెదడులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీటిలో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది.
గుమ్మడి గింజలు
గుమ్మడిని అహారంగా తీసుకోవడం చాలా తక్కువే. ఎప్పుడో ఏదో ఒక పండక్కి తప్ప వీటిని ఆహారంగా తీసుకోరు. గుమ్మడి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల శరీరం ఉత్తేజంగా ఉండడంతో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
గుడ్లు
గుడ్డులో ఉండే విటమిన్ బీ6 వంటివి జ్ఞాపక శక్తిని పెంచుతాయి. అంతే కాదు గుడ్డులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వారి డైట్ లో గుడ్డుని ఆహారంగా తీసుకోవచ్చు.
నారింజ
నారింజలో ఉండే విటమిన్ సి, మెదడుని చురుగ్గా ఉంచుతుంది. ఆరోగ్యవంతమైన మెదడు దానిలోకి అన్నింటినీ సరిగ్గా చేర్చుకుంటుంది. మెదడులో కణాఅలు ఉత్తేజితమై జ్ఞాపకసక్తి పెరుగుతుంది.
బ్లూ బెర్రీ
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా గల బ్లూ బెర్రీలని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
బాదం, జీడిపప్పు
బాదం, కాజు వంటి వాటిని ఆహారంగా తీసుకోవడం చాలా ఉత్తమం. రోజూ పొద్దున్నపూట బాదం గింజలని ఆహారంగా తీసుకోవాలి. ఐతే వీటిని రాత్రి నానబెట్టి, ఉదయం లేవగానే పొట్టు తీసేసి ఆహారంగా తీసుకోవాలి. దీనివల్ల మెదడు చురుగ్గా తయారవుతుంది.
వైష్ణవులు జ్ఞాన ప్రదాతగా శ్రీ హయగ్రీవుడిని ఆరాధిస్తారు. శైవులు జ్ఞాన ప్రదాతగా శ్రీ దక్షిణామూర్తిని ఉపాసిస్తారు. శివకేశవులు వేరు కారని భావించే వారు ఇద్దరినీ ఆరాధిస్తారు. దక్షిణామూర్తి అనబడేది అతి ప్రాచీనమైన ఈశ్వర తత్త్వం. సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మ యొక్క నాలుగు ముఖాలనుంచి వ్యక్తమైన రూపాలే సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతులు. వీరు వ్యక్తం కాగానే బ్రహ్మ వారిని మిగిలిన సృష్టిని కొనసాగించమని ఆజ్ఞాపించాడు. అందుకు వారు అంగీకరించక తమకు జ్ఞానం కావాలని అక్కడినుంచి వెళ్లిపోయారు. జ్ఞానం కావాలని కోరుకోవటం కూడా ఒక రకమైన అజ్ఞానమే. మనకు నియంత్రించిన విధి, కర్తవ్యాలను నిర్వర్తించక మోక్షం కోసం అడవులకు పోయే వారందరూ నిజానికి అహంభావులు,అజ్ఞానులు. శివుడు ఇది గమనించే వారి అజ్ఞానాన్ని తొలగించాలనే తలంపుతో దక్షిణామూర్తి రూపంలో వారికి ప్రత్యక్షమవుతాడు. ఆ విధంగా శ్రీ దక్షిణామూర్తి ప్రధమ శిష్యులు వారే. అజ్ఞానం నశించటమే జ్ఞానం. అజ్ఞానం, అహంకారాలు నశించిన తర్వాత మనిషి తేజోవంతుడైన ఋషి అవుతాడు. దక్షిణామూర్తి పాదాల కింద ఉన్నది తమో గుణ రూపానికి ప్రతీక. వాటిని శివుడు తన కాలితో అదిమిపడుతాడు. అది కూడా అదృష్టమే. అజ్ఞానాన్ని అదుపు చేసేవాడే దక్షిణామూర్తి. ఈ తత్వమే ఆదిగురుతత్త్వం. దక్షిణామూర్తి ఆది గురువు, ఆది యోగి అన్న మాట. ఆయన సమస్త జ్ఞానానికి మూలం. ఈ తత్వాన్నితెలుసుకోవటమంటే జ్ఞానం, ఎరుక అనే అవగాహన కలిగివుండటమే.
సంగీత, సాహిత్యాల, యోగ, తాంత్రిక విద్యల కలయికే దక్షిణామూర్తి రూపం. సకల శాస్త్రాల సారాన్ని తెలిసి ,అర్హులైన మహర్షులకు ఉపదేశం చేసినవాడే దక్షిణామూర్తి. సద్గురువు లభించని ఉత్తములు ఈయన్ని గురువుగా భావించి, జ్ఞానం, మోక్షాన్ని పొందవచ్చు. దక్షిణామూర్తి అంటే దక్షిణ దిక్కు వైపు కూర్చున్న మూర్తి అనే అర్ధం వాడుకలో ఉంది. అయితే దక్షిణ దిశ మృత్యుదేవత మార్గం. అంటే కొత్తదనానికి దారి. ప్రతి శివాలయంలో కూడా ఈయన విగ్రహం దక్షిణ దిక్కు వైపే ఉంటుంది. దక్షిణ దిశగా ఉండే దేవతా విగ్రహం దక్షిణామూర్తి ఒక్కడిదే. దక్షిణామూర్తి దక్షిణం వైపు ఉన్న మర్రి చెట్టు కింద ధ్యాన ముద్రలో ఉంటాడు. అలా ఉండే దక్షిణామూర్తి అర్హులైన ఋషులకు తత్వ బోధ చేస్తుంటాడు. విశేషం ఏమంటే ఆయన బోధించేది అంతా నిశ్శబ్దంగానే ఉంటుంది. దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు. దక్షిణామూర్తి తన మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందినట్లు చేస్తారు.
దక్షిణామూర్తి జింక చర్మాన్ని ధరిస్తాడు. ఆయన శుభప్రదుడు. దక్షిణామూర్తికి కుడి వైపున జమదగ్ని, భృగు, వసిష్ఠ, నారద మహర్షులు ఉంటారు. భరద్వాజ, సౌనక, అగస్త్య, భార్గవ లాంటి వారు ఆయనకు ఎడమవైపున ఉంటారు. స్వామికి మీసాలు, గడ్డం ఉండవు. దీని అర్ధం ఆయన నిత్య యవ్వనుడు. జనన మరణాలకు అతీతుడు. స్వామి కూర్చున్న మర్రి చెట్టు హిమవత్పర్వత ప్రాంతంలో ఉంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయినిలోని మహాకాళేశ్వరంలో శివుని విగ్రహం దక్షిణం వైపు ఉంటుంది. అంటే అక్కడి శివుడినే దక్షిణామూర్తి స్వరూపంగా భావిస్తారు. ఆది శంకరుడు ఆయన గురించి చేసిన స్తోత్రం అద్వైత సిద్ధాంతంతో కూడి ఉంటుంది. దక్షిణామూర్తిని ఆరాధించేవారు ముముక్షువులు మోక్షాన్ని పొందగలరు.
గురు గ్రహదోషాలు ఉన్నవారు క్రమం తప్పకుండా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం వల్ల గురు గ్రహబలం కలుగుతుంది. దుఖాలకు మూలమైన అజ్ఞానం అటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చే స్వామియే దక్షిణామూర్తి.
దక్షిణామూర్తి స్త్రోత్ర పారాయణం వల్ల అద్భుత ఫలితాలు
దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వల్ల అపమృత్యువు దరిచేరదు.
కష్టాలకు ప్రధాన కారణం గురు గ్రహ భలం లేకపోవడం. నిత్యం పారాయణం చేయడం వల్ల గురు గ్రహం బలం పెరిగి కష్టాలు, భాధాలూ తొలగడంతో పాటు జీవితంలో తెలిసీ తెలియకుండా చేసిన పాపాలను నసింపజేస్తుంది.
విద్యా బుద్దులు చేకూరాలనుకునేవారు తప్పనిసరిగా దక్షిణామూర్తి ఆరాధన చేయాలి.
జ్ఞానం కోరుకునే వారికి జ్ఞానాన్ని ప్రసాదించి మళ్ళీ జన్మ లేకుండా మోక్షాన్ని సైతం ప్రసాదించే స్వామి దక్షిణామూర్తి.
దక్షిణామూర్తిని ఆరాధించే వారికి సంపదకు కొదవ ఉండదు.
హిందూమతంలో హయగ్రీవ స్వామిని విష్ణు అవతారంగా భావిస్తారు. హయగ్రీవున్ని జ్ఞానం, వివేకం, వాక్కు, బుద్ధి, అన్ని విద్యలకు అధిపతిగా భావిస్తారు. హయగ్రీవ స్వామిని చదువుల యొక్క దేవుడుగా పూజిస్తారు. హయగ్రీవుడిని హయశీర్షగా కూడా పిలుస్తుంటారు. హయము అనగా గుర్రము. హయశీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు. తెల్లని తెలుపు మానవ శరీరం, గుర్రం యొక్క తల, నాలుగు చేతులు. శంఖము, చక్రము పై రెండు చేతులలో కలిగిఉంటాడు. కుడి వ్రేళ్ళు జ్ఞాన ముద్రలో అక్షరమాలను కలిగి ఉంటాయి. ఎడమ చేతిలో పుస్తకం ఉంటుంది. ఉన్నత చదువు, లౌకిక విషయాలను అధ్యయనం ప్రారంభించినప్పుడు హయగ్రీవ స్వామిని తప్పక పూజించాలి. విద్యార్థులు హయగ్రీవ స్వామిని ప్రతి రోజు ధ్యానిస్తే మంచి చదువు, ఉన్నతస్థితి కలుగుతుందని ప్రసిద్ధి. స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి. ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య, విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
హయగ్రీవుడికి ఆ ఆకారం ఉండటానికి వెనుక కూడా ఓ కథ ఉంది. వేదాపహారియైన రాక్షసుని సంహరించి వేదాలను ఉద్ధరించినవాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో 10 అవతారాలు దశావతారాలుగా ప్రసిద్ధికెక్కినప్పటికీ, మహాభాగవతంలో 20కి పైగా అవతారాలున్నాయి. ఆ అవతారాల్లో ‘హయగ్రీవావతారం’ విశిష్టమైనది. అశ్వ ముఖంతో మానవ శరీరంతో వామాంకమున శ్రీ లక్ష్మీదేవితో తెల్లని శరీర ఛాయతో, చతుర్భుజాలతో, శంఖ, చక్ర చిన్ముద్ర పుస్తకాలను దాల్చిన శ్రీమన్నారాయణుడి గురురూపమే హయగ్రీవ స్వరూపం.
రాక్షసులు దొంగిలించిన వేదాలను హయగ్రీవుడే తిరిగి తెచ్చినట్టు విష్ణు ధర్మోత్తరం చెబుతోంది. శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవుని విశేషంగా పూజించాలి. ఈ స్వామిని పూజించడంవల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి. భూ వివాదాలు పరిష్కరించబడతాయి. న్యాయ పోరాటాలలో విజయం లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు హయగ్రీవుని పూజించడంవల్ల చదువు బాగా వస్తుంది. శత్రు వినాశనం కూడా జరుగుతుంది. ప్రతిరోజు హయగ్రీవుని స్తుతి చేస్తే లక్ష్మీనారాయణుల శుభాశీస్సులతోపాటు సకల దేవతలు సంపూర్ణ శుభాశీస్సులు కూడా సంప్రాప్తమవుతాయి. ఈ క్రింది స్తోత్రాన్ని హయగ్రీవ జయంతి రోజున ఎన్నిసార్లు వీలయితే అన్నిసార్లు పఠించడం వల్ల శుభాలు కలుగుతాయి.