Category Archives: Sliders


నాకు తెలుసు.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనేది నా లాస్ట్ లవ్ స్టోరీ!

నాకు తెలుసు.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనేది నా లాస్ట్ లవ్ స్టోరీ!
– ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ

“ఈ ప్రపంచంలో నిస్వార్థమైనది ఏదైనా ఉన్నదంటే అది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమలో కూడా నేను అనే రెండక్షరాలు ఓ సునామీనే రేపగలవు. ఐ వాంటెడ్ టు బి ద వరల్డ్ ఫేమస్ లవర్”
“నా గుండెకు తగిలిన దెబ్బకి ఆ పెయిన్ తెలవకుండా ఉండాలంటే ఫిజికల్ గా ఈ మాత్రం బ్లీడింగ్ ఉండాలి” … ఇవి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్రైలర్‌లో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్స్. గురువారం ఈ ట్రైలర్ రిలీజైంది. అందర్నీ ఈ ట్రైలర్ అలరిస్తోంది.

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎ. వల్లభ నిర్మిస్తున్నారు. విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు – రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లెయితే నటిస్తున్నారు. గోపీ సుందర్ సంగీత దర్శకుడు.
ఈ మూవీ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని ఐటీసీ షెరటాన్ హోటల్లో జరిగింది.

చిత్ర సమర్పకులు కె.ఎస్. రామారావు మాట్లాడుతూ, “ఐ ఫీస్ట్ లా ఉండేలా ఈ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ను క్రాంతిమాధవ్ తీర్చిదిద్దాడు. నలుగురు హీరోయిన్లు సినిమాలో ఉండగా, వారికి ఈక్వల్ గా విజయ్ దేవరకొండ సినిమాలో డామినేట్ చేస్తాడు. డైనమైట్ లా విజయ్ ఎలా చెయ్యగలగుతాడో, నటుడిగా ఆయనలోని మరో డైమెన్షన్ ను ఈ సినిమా చూపిస్తుంది. ఆ క్యారెక్టర్ ను క్రాంతిమాధవ్ చాలా బాగా చిత్రించాడు. విజయ్, రాశీ ఖన్నా ఒకరికొకరు పోటాపోటీగా నటించారు. ఒక ఫ్రస్ట్రేటెడ్ లవర్ గా నలుగురు హీరోయిన్లతో విజయ్ దేవరకొండ నటించిన విధానం నిజంగా ఎక్సలెంట్. హీరోగా నటిస్తూనే డైరెక్టర్ క్రాంతిమాధవ్‌కు విజయ్ దేవరకొండ అసోసియేట్ డైరెక్టర్ తరహాలో సలహాలిస్తూ పనిచేశాడు. ఇది ఆంధ్రా ప్రేక్షకుల సినిమాలా ఉండదు. హాలీవుడ్ సినిమాలా ఉంటుంది, హిందీ సినిమాలా ఉంటుంది. ఒక మంచి సినిమా తీసిన ఒకప్పటి తమిళ్ డైరెక్టర్ తీసిన సినిమాలా ఉంటుంది. ప్రతి సినిమా లవర్ కి ఇది నచ్చుతుంది. రాశీ ఖన్నా ఈ సినిమా కోసం ఎంత కష్టపడిందో నేను చూశాను. అలాగే ఫ్రాన్స్ లో తీసిన సన్నివేశాల్లో విజయ్ తో ఇజాబెల్లా ఎంతో లవ్లీగా కనిపిస్తుంది. నల్లటి బొగ్గుగనిలో తెల్లటి డైమండ్ లా కేథరిన్ మెరిసిపోతుంది. ఐశ్వర్యా రాజేష్ నేచురల్ గా నటించింది. విజయ్ దైతే స్టన్నింగ్ పర్ఫార్మెన్స్. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన క్రాంతిమాధవ్, విజయ్ లకు థాంక్స్” అన్నారు.

డైరెక్టర్ క్రాంతిమాధవ్ మాట్లాడుతూ, “ఫిబ్రవరి 14న సినిమా రిలీజవుతోంది. సినిమాలో అందరూ తమ పాత్రల్లో జీవించారు. ట్రైలర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. విజయ్ దేవరకొండను ఇదివరకు మనం చాలా సినిమాల్లో చూశాం. ఈ సినిమాలో అతన్ని ఒక భిన్న తరహాలో చూపించాను. కంటెంట్ కు తగ్గ విధంగా నలుగురు హీరోయిన్లు, విజయ్ నటించారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదించాను. అదే సమయంలో ఈ సినిమాతో ఎంతో నేర్చుకున్నాను. జయకృష్ణ గుమ్మడి వండర్ఫుల్ సినిమాటోగ్రఫీ అందించాడు. రామజోగయ్య శాస్త్రి, శ్రేష్ఠ, రెహమాన్ చాలా బాగా పాటలకు లిరిక్స్ రాశారు. ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ తర్వాత క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌లో ఇది నా రెండో సినిమా. దానికంటే ఈ సినిమాని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను” అని చెప్పారు.

హీరోయిన్ ఇజాబెల్లా మాట్లాడుతూ ఈ సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉందనీ, విజయ్ గొప్ప సహనటుడనీ అన్నారు.

హీరోయిన్ కేథరిన్ ట్రెసా మాట్లాడుతూ, “ఇలాంటి స్క్రిప్ట్ నా దగ్గరకు తీసుకొచ్చినందుకు డైరెక్టర్ క్రాంతిమాధవ్ కు నా థాంక్స్. ఇది కొత్త తరహా కథ. పాత్రల్ని రిపీట్ చెయ్యకుండా కాన్షియస్ గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నా. ఈ సినిమాలో స్మిత అనే భిన్నమైన పాత్ర చేశా. వేలంటైన్స్ డేకి అందరూ దాన్ని ఎక్స్ పీరియెన్స్ చేస్తారని ఆశిస్తున్నా” అన్నారు.

హీరోయిన్ రాశీ ఖన్నా మాట్లాడుతూ, “ఈ సినిమా టీజర్ రిలీజయ్యాక చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. విజయ్ డబుల్ రోల్ చేస్తున్నాడా, ట్రిపుల్ రోల్ చేస్తున్నాడా అని డౌట్ పడ్డారు. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో, చేసిన పాత్రల్లో ఇందులోని యామిని పాత్ర బెస్ట్ అని చెప్పగలను. యామిని క్యారెక్ట చెయ్యడం నాకొక ఎమోషనల్ జర్నీ. సినిమా చూశాక కచ్చితంగా ప్రేక్షకుల అభిప్రాయం మారుతుంది. నా ఫ్యాన్స్ హ్యాపీగా, బహుశా గర్వంగా ఫీలవుతారు, ఇలాంటి పాత్ర చేసినందుకు. నన్ను నమ్మండి. అందరూ సినిమా చూసి ఆశ్చర్యపోతారు. ఇప్పటివరకూ నేను పనిచేసిన డైరెక్టర్లలో క్రాంతి మోస్ట్ సెన్సిబుల్ అండ్ మోస్ట్ ఎమోషనల్ డైరెక్టర్. స్టోరీయే ఈ సినిమాకి హీరో. ఇంతదాకా ఇలాంటి స్క్రీన్ ప్లేను నేను చూడలేదు. కొత్తదనం కావాలని కోరుకునే ప్రేక్షకులకు ఇది ట్రీట్ లా ఉంటుంది. విజయ్ దేవరకొండ ఫెంటాస్టిగ్గా నటించాడు. నటుడిగా అతడిని ఈ సినిమా ఇంకో స్థాయిలో నిలబెడుతుంది. కె.ఎస్. రామారావు గారు నాకు ఈ సినిమాకే కాకుండా, నా లైఫ్ లో ఒక తండ్రిలా కనిపించారు” అని చెప్పారు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “విజయ్ దేవరకొండ సినిమా అంటే హడావిడి, ఎగ్జైట్‌మెంట్ ఉంటాయి. మళ్లీ వీడు ఏం సినిమా చేశాడని పబ్లిక్ లో ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. ప్రొడ్యూసర్స్ లో ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. వీడితో నలుగురు హీరోయిన్లు ఎందుకు చేస్తున్నారని ఎగ్జిబిటర్స్ లో, డిస్ట్రిబ్యూటర్స్ లో ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. నాలుగు రెట్లు రిటర్న్స్ ఇస్తారనుకుంటూ ఉంటారు. ఈసారి నేనేం చెయ్యలేదు. నేను చేసిన సినిమాలన్నింటిలో ఈ సినిమాలోనే ఎక్కువ కష్టపడ్డా. అందరం చాలా ఎఫర్ట్ పెట్టి చేశాం. ఈ సినిమాకి నేనేం హడావిడు చెయ్యలేదు. ట్రైలర్ లాంచ్ చేశాం. ఫిబ్రవరి 9న ప్రి రిలీజ్ ఈవెంట్ ఉంది. ఇప్పుడు ఈ ట్రైలర్ తో బయట హడావిడి స్టార్ట్ అవుతుంది. నాకు తెలుసు.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనేది నా లాస్ట్ లవ్ స్టోరీ. మనిషిలా కొంచెం మారుతున్నా. టేస్టులు కొంచెం మారుతున్నాయి. బేసికల్ గా లైఫ్ లో కొత్త దశలోకి వెళ్తున్నా. ఇది చేసేప్పుడే నాకు తెలుసు.. ఇదే నా లాస్ట్ లవ్ స్టోరీ అవబోతోందని. నా లాస్ట్ లవ్ స్టోరీలో నలుగురు బ్యూటిఫుల్ విమెన్ తో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. ఇది కల నిజమవడం లాంటిది. నలుగురూ తమ నటనతో చంపేశారు. నా లాస్ట్ లవ్ స్టోరీ కాబట్టి ఈ సినిమాని పూర్తిగా ప్రేమతో నింపేశాం. అన్ని రకాల ప్రేమ నింపి ఈ స్క్రిప్టును నా దగ్గరకు క్రాంతిమాధవ్ తీసుకొచ్చాడు. ఫిబ్రవరి 14న ఈ కంప్లీట్ ప్యాకేజ్ లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మించిన ఈ 47వ చిత్రం బిగ్ సక్సెస్ కావాలని ఆశిస్తున్నా. క్రాంతిమాధవ్ కు ఈ సినిమాతో అతిపెద్ద సక్సెస్ రావాలని ఆశిస్తున్నా” అని చెప్పారు.


కళాతపస్వి కె.విశ్వనాథ్‌ చేతుల మీదుగా ‘ఎస్‌డి కేరాఫ్‌ వెంచపల్లి’ ఫస్ట్‌ సింగిల్‌ లాంచ్‌

SD C/o Venchapalli Movie First Single Launched by Director K Vishwanath Garu

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ చేతుల మీదుగా ‘ఎస్‌డి కేరాఫ్‌ వెంచపల్లి’ ఫస్ట్‌ సింగిల్‌ లాంచ్‌

శ్రీ సాయి అమృత లక్ష్మి క్రియేషన్స్‌, పాలిక్‌ స్టూడియోస్‌, భాను ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై పాలిక్‌ దర్శకత్వంలో గోదారి భానుచందర్‌ నిర్మిస్తోన్న చిత్రం ‘ఎస్‌డి కేరాఫ్‌ వెంచపల్లి’. శ్రీజిత్‌ లవన్‌, జీవా, సుమన్‌ శెట్టి, దివ్య, రాతేష్‌, అభిగ్యాన్‌, లక్కి, ఎస్‌.వింధ్యారెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రఘురామ్‌ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ని కళాతపస్వి కె.విశ్వనాథ్‌ చేతుల మీదుగా లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మాట్లాడుతూ…‘‘తెలంగాణ పోరడు’ అనే పాట వినసొంపుగా ఉంది. నూతన తారాగణంతో దర్శకుడు పాలిక్ చేస్తోన్న ఈ ప్రయత్నం ఫలించాలి. యూనిట్‌ అందరికీ నా శుభాకాంక్షలు’’ అన్నారు.
దర్శకుడు పాలిక్‌ మాట్లాడుతూ…‘‘పట్టణాలు, పల్లెలో, గ్రామాల్లో ఇటీవల మేము విడుదల చేసిన ‘తెలంగాణ పోరడు’ సాంగ్‌ మారుమోగుతోంది. గోదారమ్మ పరవళ్లు తొక్కినట్టుగా రఘురామ్‌ గారు అందమైన బాణీ సమకూర్చగా దానికి సురేష్‌ గంగుల తెలంగాణ మట్టి పరిమళింపులాంటి చక్కటి సాహిత్యాన్ని సమకూర్చారు. ఇంత మంచి పాటని గురువుగారు కళాతపస్వి, గొప్ప దర్శకుడైన కె.విశ్వనాథ్‌ గారి చేతుల మీదుగా లాంచ్‌ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. స్వతహాగా నేను కొరియోగ్రాఫర్‌ని కావడంతో కె.విశ్వనాథ్‌గారి చిత్రాల్లోని పాటల నృత్వాలను ఎంతో మంది పిల్లలకు నేర్పించేవాణ్ని. ఇక నా మొదటి సినిమాలోని మొదటి పాటను వారు ఆవిష్కరించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా’’అన్నారు.
నిర్మాత గోదారి భానుచందర్‌ మాట్లాడుతూ…‘‘నా మిత్రుడు పాలిక్‌ రఘురామ్‌ గారి దగ్గర నుంచి మంచి బాణీని తీసుకొని దానికి సురేష్‌ గంగులతో అర్థవంతమైన సాహిత్యాన్ని రాయించారు. అలాంటి పాటను కె.విశ్వనాథ్‌ గారితో లాంచ్‌ చేయడం శుభ సూచకంగా భావిస్తున్నాం. త్వరలో ఫైనల్‌ షెడ్యూల్‌ని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించనున్నాం. ఎన్నో ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించి దర్శకుడు చిత్రాన్ని పూర్తి చేస్తున్నారు’’ అన్నారు.
కో`ప్రొడ్యూసర్‌ రామ్‌ గడికొప్పుల మాట్లాడుతూ…‘‘తెలంగాణ పోరడు’ అనే పాటకు ఎంత మంచి బాణీ కుదిరిందో అదే విధంగా ప్యూర్‌ తెలంగాణ పదాలతో అంత మంచి సాహిత్యం కుదిరింది. ఇవన్నీ ఒకెత్తైతే మా సినిమాలోని తొలి లిరికల్‌ సాంగ్‌ని కె.విశ్వనాథ్‌ గారు లాంచ్‌ చేయడం మా అదృష్టం. ఇలా ప్రతిది మా సినిమాకు కుదురుతోంది. మా ఫస్ట్‌ సింగిల్‌ సక్సెస్ సాధించి సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలను పెంచింది. ఆ అంచనాలను అందుకునేలా మా దర్శకుడు సినిమాను కూడా తీర్చిదిద్దుతున్నారు’’ అన్నారు.
సంగీత దర్శకుడు రఘురామ్‌ మాట్లాడుతూ…‘‘కళాతపస్వి చేతుల మీదుగా నేను కంపోజ్‌ చేసిన సాంగ్‌ లాంచ్‌ చేయడం చాలా సంతోషం. సురేష్‌ గంగుల చక్కటి సాహిత్యాన్ని సమకూర్చగా అదితి భావరాజు తన గళం తో పాటకు ప్రాణం పోశారు. సోషల్‌ నెట్‌ వర్క్స్‌లో మంచి కామెంట్స్‌తో, వ్యూస్‌తో పాట దూసుకెళ్తోంది’’ అన్నారు.
శ్రీజిత్‌ లవన్‌ మాట్లాడుతూ..‘‘నా ఫస్ట్‌ సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ని కె.విశ్వనాథ్‌గారు లాంచ్‌ చేయడం అదృష్టం. సంగీతం, సాహిత్యం పోటీ పడేలా సాంగ్‌ ఉందంటున్నారు. మేము సినిమా చేస్తున్నాం అన్నాక ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడారు. మా పాట రిలీజై వారందరికీ మంచి సమాధానం చెప్పింది. మిగతా పాటలు కూడా ఇదే స్థాయిలో ఉండబోతున్నాయి. సినిమా కూడా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. మా దర్శక, నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమా చేస్తున్నారు’’ అన్నారు.

ఇటీవల `పేపర్ బాయ్` చిత్రం లోని `బొంబాయి పోతావా రాజా పాటతో పేరు తెచ్చుకున్న సింగర్ రఘురామ్ ఈ చిత్రానికి మ్యూజిక్ చేయగా, ఇదే పాట తో లిరిసిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సురేష్ గంగుల లిరిక్స్ రాయగా , `వెంకీ మామ` చిత్రం లోని `కోకో కోలా పెప్సీ` పాట తో ఫేమస్ అయినా సింగర్ అదితి భావరాజు `తెలంగాణ పోరడు పాట పాడటం విశేషం.
ఈ ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ లాంచ్‌ కార్యక్రమంలో ఇంకా నటులు పంకజ్‌, చంద్రసిద్దార్ధ్‌, ఎస్‌.వింధ్యారెడ్డి పాల్గొన్నారు.
శ్రీజిత్‌ లవన్‌, జీవా, సుమన్‌ శెట్టి, చంద్రసిద్ధార్థ, పంకజ్‌, దివ్య, రాతేష్‌, అభిగ్యాన్‌, లక్కి, ఎస్‌.వింధ్యారెడ్డి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: రఘురామ్‌, పాటలు : సురేష్‌ గంగుల , ఎడిటర్‌: రేణు, ఆర్ట్‌:సత్య నాగేష్‌, కో`ప్రొడ్యూసర్‌:రామ్‌ గడికొప్పుల, సినిమాటోగ్రాఫర్‌:మల్లిఖార్జున్‌, నిర్మాత: గోదారి భానుచందర్‌, రచన`దర్శకత్వం: పాలిక్‌.



వైభ‌వంగా కోడిరామ‌కృష్ణ చిన్న కుమార్తె ప్ర‌వ‌ల్లిక వివాహం.. హాజ‌రైన సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు

వైభ‌వంగా కోడిరామ‌కృష్ణ చిన్న కుమార్తె ప్ర‌వ‌ల్లిక వివాహం..
హాజ‌రైన సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు స్వ‌ర్గీయ కోడిరామ‌కృష్ణ చిన్న కుమార్తె ప్ర‌వ‌ల్లిక వివాహం మ‌హేష్‌తో బుధ‌వారం రాత్రి 9.36 నిమిషాల‌కు హైదరాబాద్ గండిపేట‌లోని క‌న్వెష‌న్స్ అండ్ ఎగ్జిబిష‌న్స్ లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. కోడిరామ‌కృష్ణ స‌తీమ‌ణి కోడి ప‌ద్మ ఆహ్వానం మేర‌కు తెలుగు చ‌ల‌న‌చిత్ర ప్ర‌ముఖులు, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఈ వివాహ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌, మోహ‌న్ బాబు, కె.రాఘ‌వేంద్ర‌రావు, ముర‌ళీ మోహ‌న్‌, గోపీచంద్‌, జ‌య‌ప్ర‌ధ‌, జీవిత‌, కోదండ రామిరెడ్డి, కె.విజ‌య‌భాస్క‌ర్‌, బి.గోపాల్‌, అల్లు అర‌వింద్‌, ద‌ర్శ‌క నిర్మాత ఎం.ఎస్.రాజు, నంద‌మూరి రామ‌కృష్ణ‌, పోకూరి బాబూరావు, ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌, దేవీప్ర‌సాద్‌, వీర‌శంక‌ర్‌, శివాజీరాజా, మారుతి, ముత్యాల సుబ్బ‌య్య‌, హీరో వినోద్‌కుమార్‌, మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్‌, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు, కాశీ విశ్వ‌నాథ్‌, అలీ, హేమ‌, నాగ‌బాబు స‌తీమ‌ణి ప‌ద్మ‌జ‌, కుమార్తె నిహారిక‌, న‌టి శివ‌పార్వ‌తి, రాజ‌శేఖ‌ర్ కుమార్తె శివాని త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.


కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్

పాటల విడుదల సన్నాహాల్లో
‘కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్’
డాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా, హీరోగా, దర్శకుడిగా పలు సంచలన విజయాలు సాధించడం తెలిసిందే. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడిగా అలరారుతున్న ప్రభుదేవా హీరోగా నటిస్తున్న తమిళ చిత్రాన్ని తెలుగులో ‘కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్’ పేరుతో విడుదల చేస్తున్నారు. ప్రభుదేవా తొలిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మాస్ మసాలా ఎంటర్ టైనర్ ను.. పవనపుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై యనమల సుధాకర్ నాయుడు సమర్పణలో.. సీనియర్ ప్రొడ్యూసర్ ఆర్.సీతారామరాజు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 21 న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రభుదేవా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో.. ‘అల వైకుంఠపురములో’ ఫేమ్ నివేదా పేతురాజ్ హీరోయిన్ కాగా.. బాహుబలి ప్రభాకర్, సురేష్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుక ఈనెల 15న నిర్వహిస్తున్నారు. తమిళంతోపాటు తెలుగులో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని.. కొరియోగ్రాఫర్ గా, హీరోగా, దర్శకుడిగా పలు సంచలన విజయాలు సాధించిన ప్రభుదేవా తొలిసారి డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్ గా సంఘ విద్రోహశక్తుల పాలిట సింహస్వప్నంగా నిలిచే పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడని, ఈ నెల 15న ఆడియో విడుదల చేసి, ఫిబ్రవరి 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత ఆర్.సీతారామరాజు తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: రాజేష్, పాటలు: భువనచంద్ర, సంగీతం: డి.ఇమ్మాన్, నిర్వహణ: ఎస్.చంద్రశేఖర్ నాయుడు, సమర్పణ: యనమల సుధాకర్ నాయుడు, నిర్మాత: ఆర్.సీతారామరాజు, దర్శకత్వం: ముఖిల్ చెల్లప్పన్!



మహేష్ బాబు లాంచ్ చెయ్యడం వల్ల ‘నీలి నీలి ఆకాశం’ ప్రపంచంలోని తెలుగువాళ్లందరి దగ్గరకూ వెళ్లింది

మహేష్ బాబు లాంచ్ చెయ్యడం వల్ల ‘నీలి నీలి ఆకాశం’ ప్రపంచంలోని తెలుగువాళ్లందరి దగ్గరకూ వెళ్లింది

– హీరో ప్రదీప్ మాచిరాజు

యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మున్నా దర్శకుడు. అమృతా అయ్యర్ నాయిక్. అనూప్ రూబెన్స్ సంగీత స్వరాలు అందించగా, చంద్రబోస్ సాహిత్యం సమకూర్చిన ఈ చిత్రంలోని పాట ‘నీలి నీలి ఆకాశం’ సెన్సేషనల్ హిట్టయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆ పాట విజయోత్సవాన్ని బుధవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్లో నిర్వహించారు.

నటుడు సమీర్ మాట్లాడుతూ, “చంద్రబోస్ మంచి ప్రేమికుడు కాబట్టే ఇంత బాగా పాటను రాయగలిగారని అనుకుంటున్నా. ఈ సాంగ్ ఆల్రెడీ సెన్సేషనల్ హిట్టయింది. ఒక పాట సినిమాని ఏ హైట్స్ కి తీసుకెళ్తుందో ఇటీవల ఒక సినిమా చూపించింది. అంతే హిట్ ఈ సినిమా కూడా కాబోతోంది. ఇంత మంచి సినిమాలో నాకొక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ మున్నాకు థాంక్స్” అన్నారు.

నటి హేమ మాట్లాడుతూ, “ఈ పాటను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రదీప్ ఫ్యాన్స్ కు థాంక్స్. వాళ్లలో 90 శాతం లేడీ ఫ్యాన్సే. సీన్స్ లో నటించేప్పుడు ఏదో అనుకున్నాను కానీ, డబ్బింగ్ చెప్పేటప్పుడు మాత్రం కళ్లవెంట నీళ్లొచ్చాయి. నా క్యారెక్టర్ చూసి నాకే ముద్దనిపించింది. కామెడీయే కాదు, సెంటిమెంట్ కూడా బాగా పండించగలనని నాక్కూడా తెలిసింది. ఇంత మంచి బ్యానర్లో, మంచి డైరెక్టరుతో పనిచేసినందుకు ఆనందంగా ఉంది” అని చెప్పారు.

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ, “ఈ పాటను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ మూవీకి వర్క్ చెయ్యడం నిజంగా మంచి ఎక్స్ పీరియెన్స్. ఈ కథ మంచి మ్యూజిక్ ను డిమాండ్ చేసింది. స్టోరీ విన్నప్పుడు ఏం ఫీలయ్యానో సినిమా చూశాక కూడా అదే ఫీలయ్యాను. ఇది మంచి విలువలున్న సినిమా. ఈ పాట ఇంత పెద్ద హిట్టవడానికి నా ట్యూన్స్ తో పాటు చంద్రబోస్ గారిచ్చిన వండర్ఫుల్ లిరిక్స్. సిద్ శ్రీరాం, సునీత గారు తమ వాయిస్ లతో పాటకు ప్రాణం పోశారు. స్క్రీన్ మీద ఆ పాటను శివేంద్ర అద్భుతంగా తన విజువల్స్ తో తీసుకొస్తే, హీరో హీరోయిన్లు ప్రదీప్, అమృత గొప్పగా అభినయించారు. మొదట్నుంచీ ప్రొడ్యూసర్ ఎస్వీ బాబు గారిచ్చిన సపోర్ట్ మరవలేనిది” అని చెప్పారు.

గాయని సునీత మాట్లాడుతూ, “అనూప్ సంగీతం అందించిన, చంద్రబోస్ సాహిత్యం అందించిన ఎన్నో అద్భుతమైన పాటలు పాడాను. ‘నీలి నీలి ఆకాశం’ పాట అద్భుతాలు సృష్టించింది. ఈ పాటను పాడే అవకాశం ఇచ్చినందుకు థాంక్స్” అన్నారు.

గేయరచయిత చంద్రబోస్ మాట్లాడుతూ, “ఒక పాటకు సంబంధించి విజయోత్సం జరగడం అన్నది నాకు తెలిసి ఇదే మొదటిసారి. ఇందులో నేను బాగస్వామినే కాకుండా, భావస్వామిని కూడా కావడం నాకు గర్వంగా ఉంది. అనూప్ కీబోర్డ్ ప్లేయర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మారినప్పుడు, నాచేతే మొదటి పాట రాయించుకున్నారు. ‘నీలి నీలి ఆకాశం’ పాటను మెచ్చుకున్నవాళ్లలో దర్శకులు సుకుమార్, హరీష్ శంకర్, సంపత్ నంది, హను రాఘవపూడితో పాటు నా సహ రచయితలెందరో ఉన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ‘మిత్రమా మీ కీర్తి కిరీటంలోని ఎన్నో కలికితురాళ్లలో ఇదొక కలికితురాయి’ అని ఆశీర్వదించారు. స్వచ్ఛత, పవిత్రత ఆ పాటలో ఉన్నాయి కాబట్టే ఇంతమంది మనసుల అభిమానాన్ని చూరగొంది. నాకు ‘రంగస్థలం’లోని ‘ఎంత సక్కగున్నావే’ పాట తర్వాత అన్ని అభినందనలు ఈ పాటకు లభిస్తున్నాయి” అన్నారు.

హీరోయిన్ అమృతా అయ్యర్ మాట్లాడుతూ, “నిర్మాత బాబు గారు నన్ను కూతురిలా చూసుకున్నారు. డైరెక్టర్ మున్నా ఈ సినిమాలో నాకు చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. ఇది నా హృదయానికి బాగా దగ్గరైన మూవీ. కథ విన్నప్పుడే నాకు చాలా నచ్చింది. ఈ పాటను ఫస్ట్ విన్నప్పుడే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అనూప్ రూబెన్స్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. చంద్రబోస్ గారు రాసిన లిరిక్స్ చాలా ఇంటెన్స్ ఉంది. ప్రదీప్ చాలా మంచి సహనటుడు” అన్నారు.

నిర్మాత ఎస్వీ బాబు మాట్లాడుతూ, “నిజంగా ఇంత అద్భుతంగా ఈ సాంగ్ వస్తుందని నేను ఊహించలేదు. లిరిక్స్ విన్నప్పుడు చాలా బాగున్నాయని చెప్పాను. ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ ఈ పాటను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ పాటను అద్భుతంగా చిత్రించిన సినిమాటోగ్రాఫర్ శివేంద్ర, పాటలో చాలా చక్కగా నటించిన హీరో హీరోయిన్లు, ఆ పాటను అలా తీసిన దర్శకుడికి థాంక్స్. కన్నడంలో నాతో పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. వాటిలో చాలా పాటలకు అ వార్డులు కూడా వచ్చాయి. వాటన్నింటినీ మించి ఈ పాట ఉంది. అంత మంచి మ్యూజిక్ ఇచ్చిన అనూప్ రూబెన్స్ కు, అంత మంచి లిరిక్స్ ఇచ్చిన చంద్ర బోస్ గారికి థాంక్స్” అని చెప్పారు.

డైరెక్టర్ మున్నా మాట్లాడుతూ, “నేను సుకుమార్ దగ్గర పనిచేశాను. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను లాంచ్ చేసిన రానా గారికి థాంక్స్. ఇవాళ ‘నీలి నీలి ఆకాశం’ పాటకు ఇంతమంచి రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాటను మొదట చూసిన ప్రేక్షకుడు సూపర్ స్టార్ మహేశ్ గారు. ఇప్పటి ప్రేక్షకుల స్పందన మొత్తాన్ని ఆరోజు ఆయన ముఖంలో చూశాం. ఈ పాటను పల్లెటూళ్ల దగ్గర్నుంచి సోషల్ మీడియా దాకా అందరూ పాడుతున్నారు. ఈ సినిమాని మ్యూజికల్ గా చెప్పాలని అనుకున్నప్పుడు అనూప్ రూబెన్స్ తప్ప నాకు ఇంకో ఆప్షన్ కనిపించలేదు. రీరికార్డింగ్ తో ఈ సినిమా చూసినరోజు నా మనసంతా బరువెక్కిపోయింది. ప్రేక్షకులు రీరికార్డింగ్ ను కూడా పాడుకుంటారు. అంత గొప్ప మ్యూజిక్ ఇచ్చారు అనూప్. చంద్రబోస్ గారు గొప్ప సాహిత్యం ఇచ్చారు. సమవుజ్జీలుగా ఉన్న సంగీత సాహిత్యాలకు తగ్గట్లు సిద్ శ్రీరామ్, సునీత తమ గాత్రాలతో పాటకు ప్రాణం పోశారు. ఆ పాటకు తెరపై ప్రదీప్, అమృత అభినయించిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏది కావాలంటే దాన్ని నిర్మాత ఎస్వీ బాబు సమకూర్చిపెట్టారు. ఆయనకు ఎన్ని థాంక్స్ చెప్పినా తక్కువే” అని చెప్పారు.

హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ, “మా యూనిట్ అందరి ముఖాలపై నవ్వు కనిపిస్తుండటానికి కారణం ఒక మంచి సినిమా చేశామనే నమ్మకం. తెలుగు ప్రేక్షకులెప్పుడూ మంచి సినిమాల్ని ఆదరిస్తారనేది మా నమ్మకం. ఈ సినిమా డైరెక్టర్ మున్నా అసలు పేరు ప్రదీప్. అంటే ఈ సినిమాకి ఇద్దరు ప్రదీప్ లు కలిసి పనిచేశారు. ఒక బేబీలాగా ఆయన ఈ కథను పెంచారు. దాన్ని అద్భుతంగా మన ముందుకు తీసుకు వచ్చారు. ఒక ఇంటిపెద్ద లాగా, ఒక తండ్రిలాగా నిర్మాత ఎస్వీ బాబు గారు మమ్మల్ని ముందుకు నడిపించారు. మనస్ఫూర్తిగా చెబుతున్నా, ప్రొడ్యూసర్ అంటే ఇలా ఉండాలి అనిపిస్తోంది నాకు. ఆయన వండర్ఫుల్ పర్సన్. కథకు తగ్గట్లు ఖర్చుపెట్టి ఈ సినిమా నిర్మించారు. అలాంటి ప్రొడ్యూసర్ దొరకడం మా అదృష్టం. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టరుకూ ఇంపార్టెన్స్ ఉంటుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఇచ్చిన సినిమాల్లో ‘మనం’ నా ఆల్ టైం ఫేవరేట్. అలాగే పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ‘టెంపర్’ సాంగ్స్ కూడా చాలా ఇష్టం. అలాంటి అనూప్ నా ఫస్ట్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కావడం నేను ఊహించలేదు. లెజెండరీ లిరిసిస్ట్ చంద్రబోస్ గారు ‘నీలి నీలి ఆకాశం’ పాటను రాసిన విధానం అద్భుతం. అది ఆయన పెన్నులోని మ్యాజిక్ కాదు, ఆయన మనసులోని మ్యాజిక్. ఆ పాటను సిద్ శ్రీరామ్, సునీత అద్భుతంగా పాడారు. ఇన్స్టాగ్రాంలో, ట్విట్టర్లో, టిక్ టాక్ లో.. ఇలా ప్రతిచోటా ఈ సాంగ్ సెన్సేషనల్ అవడం హ్యాపీ. ఒక్క టిక్ టాక్ లో ఈ పాటపై ఒక లక్ష వీడియోస్ పైగా వచ్చి ట్రెండింగ్ అవుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన రానా అన్నకు థాంక్స్. ఈ సాంగ్ వీడియో చూసి, అద్భుతంగా ఉందని మెచ్చుకొని, తన ట్విట్టర్లో, ఇన్స్టాగ్రాంలో లాంచ్ చేసిన మా సూపర్ స్టార్ మహేశ్ గారికి స్పెషల్ థాంక్స్. ఇంతకంటే బిగ్గెస్ట్ లాంచ్ నా లైఫ్ లో మళ్లీ రాదనుకుంటా. ఆయన లాంచ్ చెయ్యడం వల్ల ప్రపంచంలోని తెలుగువాళ్లందరి దగ్గరకు ఈ సాంగ్ వెళ్లింది. ఎస్వీ బాబు గారి తరపున ఆయన కుమారుడు వినయ్ బాబు మాతో కో-ఆర్డినేట్ చేస్తూ ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటూ వచ్చారు. త్వరలో ఆయన ఎన్నో మంచి సినిమాల్ని నిర్మిస్తాడని ఆశిస్తున్నా. ‘నీలి నీలి ఆకాశం’ పాటను సగం రాజమండ్రిలో, సగం కేరళలో షూట్ చేశాం. అమృతా అయ్యర్ అద్భుతమైన సహనటి. నా మొదటి సినిమాలో ఇంత వండర్ఫుల్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ నటించడం నా అదృష్టం. అతి త్వరలోనే ఈ సినిమాని అందరి ముందుకు తీసుకు వస్తాం” అని చెప్పారు.

ఈ కార్యక్రమలో నటుడు భద్రం, సినిమాటోగ్రాఫర్ దాశరథి శివేంద్ర, ఆర్ట్ డైరెక్టర్ నరేష్ బాబు కూడా మాట్లాడారు


గ్రాండ్ గా “త్రీ మంకీస్” ప్రి రిలీజ్ ఈవెంట్


గ్రాండ్ గా “త్రీ మంకీస్” ప్రి రిలీజ్ ఈవెంట్..
జబర్దస్థ్ షో ద్వారా బుల్లితెరపై ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ వెండి తెర పై ‘త్రీ మంకీస్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. కారుణ్య చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ జి. దర్శకత్వంలో నగేష్ .జి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని దస పల్లా కన్వెన్షన్ హాల్ లో గ్రాండ్ గా నిర్వహించారు. రాఘవేంద్రరావు గారు,
మంచు లక్ష్మి, ఆకాష్ పూరి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. త్రీ మంకీస్
ట్రైలర్ ను, బిగ్ టికెట్ ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు లాంచ్ చేసారు.
రాఘవేంద్రరావు గారు మాట్లాడుతూ..చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ద బెస్ట్.ఫిబ్రవరి 7న జబర్దస్త్ జర్నీ మొదలు పెట్టి.. అదే రోజు ఈ సినిమా విడుదల అవ్వడం యాదృచ్చికం అన్నారు. అలాగే నేను తీసిన దేవత హిందీ రీమేక్ తోఫా సినిమా ఫిబ్రవరి ౩కి 36ఏళ్లు అవుతుంది. అదే రోజు సుధీర్, రామ్ ప్రసాద్, శ్రీను నన్ను కలిశారు. ఇండస్ట్రీ లో ఇంతమంది పెద్ద వాళ్ళుంటే మంచు లక్ష్మిని, అలీని, నన్నే ఎందుకు పిలిచారు. ఇండస్ట్రీ లో ఉన్న త్రీ మంకీస్ మనమే అని మనల్ని పిలిచారు. మేంముగ్గురం చేసే పిచ్చి చేష్టలు ఉహించుకొని మా ముగ్గుర్ని పిలిచినట్టున్నారు. దర్శక నిర్మాతలు అమోఘమైన టైటిల్ పెట్టారు. సరిలేరు నీకెవ్వరూ, శ్రీమంతుడు, ఘరానా బుల్లోడు లాంటి టైటిల్స్ ఏ హీరో కి పెట్టిన మ్యాచ్ అవుతాయి. త్రీ మంకీస్ టైటిల్ మాత్రం వీరికి తప్పితే మరెవరికీ పనికిరాదు. సినిమా చూడలేదు కానీ .. కథ లో డెప్త్ ఉంటుందని ఊహించి చెబుతున్నా. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అనే విధంగా మెసెజ్ ఉంటుంది. జబర్దస్త్ తో అమెరికా వరకు వెళ్లిన ఈ ముగ్గురు ఈ సినిమా తో మరింత గుర్తింపు వస్తుంది. ఈ సినిమాకు కలెక్షన్ లతో పాటు అవార్డులు కూడా వస్తాయి.అన్నారు.
మంచు లక్ష్మి మాట్లాడుతూ..’టీవీ షో తో మొదలు పెట్టి సినిమా తీసినా కొన్ని సంవత్సరాలుగా ఫ్రెండ్ షిప్ కొనసాగించడం మాములు విషయం కాదు. నేను జబర్దస్త్ షో కి వెళ్ళి చూసాను. సినిమా లో నటించడం కంటే జబర్దస్త్ లో చేయడమే కష్టం. ఈ ముగ్గురు మరెన్నో సినిమాలు తీయాలని మరింత గుర్తింపు తెచ్చుకోవాలని .. సినిమా టీం మొత్తానికి ఆల్ ద బెస్ట్’ చెప్పారు.
అలీ మాట్లాడుతూ..’5000 సంవత్సరాల క్రితం మనుషులు కూడా కోతుల్లా ఉండేవాళ్ళం. అప్పట్లో కోతులకు తెలివితేటలు ఉండేవి కాదు అందుకే ఆ రోజులే బాగున్నాయి. ఇప్పుడు మనుషులకు తెలివితేటలు ఎక్కువై ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. త్రీ మంకీస్ టైటిల్ పెట్టాలని ఆలోచన రావడం డైరెక్టర్ గొప్పతనం. పెద్ద హీరోల ఫంక్షన్ లకు వెళ్లి రెండు, మూడు నిముషాలు మాట్లాడే రాఘవేంద్రరావు గారు ఈ సినిమా గురించి, దర్శకుడు గురించి 15 నిముషాలు మాట్లాడారు. ఆయనకు కమెడియన్స్ అంటే చాల ఇష్టం. హిందీ లో త్రీ ఇడియట్స్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుగు లో త్రీ మంకీస్ కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుతున్నా. చిన్న సినిమాలను బతికిస్తే ఇండస్ట్రీ తో పాటు చిన్న దర్శకులు బాగుంటారు”అన్నారు.

ఆకాష్ పూరి మాట్లాడుతూ..’సుధీర్, రామ్ ప్రసాద్, శ్రీను లను నేను కమెడియన్స్ గా చూడలేదు. వాళ్ళని యాక్టర్స్ గానే చూసాను. వీరు మంచి నటులు అని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. చిన్న స్టేజి నుంచి ఇక్కడ వరకు వచ్చారంటే వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ కారణం. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’అన్నారు.

హీరోయిన్ కారుణ్య చౌదరి మాట్లాడుతూ..’మా టీంకి విషెస్ చెప్పడానికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. డైరెక్టర్ అనిల్ ఎప్పుడు కూల్ గా ఉంటారు. డీ.ఓ.పీ సన్నీ మమ్మల్ని చాలా అందంగా చూపించారు;అన్నారు .
నిర్మాత నగేష్ మాట్లాడుతూ..’దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు మా ఈవెంట్ కి రావడంతో మా జన్మ ధన్యం అయినట్టు అనిపిస్తుంది. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. అలాగే మంచు లక్ష్మి, అలీ, ఆకాష్ పూరి కూడా ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా రిలీజ్ కి ముందు నిర్మాతలు కొంచెం టెన్షన్ పడతారు. కానీ నాకు అసలు టెన్షన్ లేదు. డైరెక్టర్ నాకు చిన్నప్పటి నుచి ఫ్రెండ్, అలాగే హీరోలు సుధీర్, రామ్ ప్రసాద్, శ్రీను బాగా సహకరించారు. ఫిబ్రవరి 7 న సినిమా విడుదల అవుతుంది. మీరు పెట్టె టికెట్ ఖరీదుకి హ్యాపీ గా ఫీల్ అవుతారు. సినిమా అందరికి కచ్చితంగా నచ్చుతుంది’అన్నారు.
రామ్ ప్రసాద్ మాట్లాడుతూ..’ఇలాంటి క్యారెక్టర్ చేస్తానని నేను లైఫ్ లో అనుకోలేదు. నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. నేను పంచ్ లు వేయడమే కానీ నవ్వను. డైరెక్టర్ అనిల్ కథ చెప్పినప్పుడు మాత్రం తెగ నవ్వాను. తర్వాత సుధీర్, శ్రీను కి కథ చెప్పారు.

గెటప్ శ్రీను మాట్లాడు..’మమ్మల్ని బ్లేస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్. మేం ముగ్గురం కలిసి చేయడానికి కారణం ముక్కు అవినాష్. రామ్ ప్రసాద్ కి, నాకు, అవినాష్ కి అవకాశం వస్తే సుధీర్ తో కలిపి మీరు ముగ్గురు చేస్తే బాగుంటుందని తనకు వచ్చిన అవకాశం మాకు ఇచ్చాడు. గుర్తిండిపోయే మెమరీ మాకు ఇచ్చాడు. నా లైఫ్ లో నాకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. మా సినిమాను పెద్ద హిట్ చేయాలి’అన్నారు.
సుధీర్ మాట్లాడుతూ..’మా ముగ్గురికి ఇంతకన్నా మంచి ప్రాజెక్ట్ రాదు. మాకు సపోర్ట్ చేసిన వారందరికీ చాలా థాంక్స్. దేవుడిచ్చిన నా ఫ్యాన్స్ కి ధన్యవాదాలు. బుల్లి తెరపై మమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారో, అలాగే వెండి తెరపై కూడా అలాగే ఆదరించాలాని కోరుతున్నా. ఫిబ్రవరి 7 న విడుదల అవుతున్న సినిమాని చూసి నచ్చితే మరో పది మందికి చెప్పండి. ఆ ఆశీర్వాదం మాకు చాలు’అన్నారు.
దర్శకుడు అనిల్ మాట్లాడుతూ..’ఈ సినిమాను ఎంకరేజ్ చేసిన హీరోలు, దర్శకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎందుకు ఎక్కడ కలుస్తారో ఎవరికీ తెలీదు. కానీ ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది అనే లైన్ మీద తీసినా సినిమానే త్రీ మంకీస్. సుధీర్, రామ్ ప్రసాద్, శ్రీను ల కామెడీకి ఫస్ట్ ఆఫ్ అంత సీట్లలో కూర్చోలేరు. అంతలా నవ్విస్తారు. సెకండ్ ఆఫ్ అంత ఎమోషన్ ఉంటుంది. సెట్ మీద మమ్మల్ని కూడా ఏడిపించారు. ఏది నిజం, ఏది అబద్దం అనే తికమకలో సుధీర్ చేసే పెర్ఫార్మెన్స సూపర్బ్ గా ఉంటుంది. రామ్ ప్రసాద్ ఎక్సప్రెషన్స్ తోనే కామెడీ పండించాడు. శ్రీను నటన చూస్తే కమల్ హాసన్ గుర్తుకొస్తారు. పంచతంత్రం లాంటి కామెడీ చేయగలడు. ఈ ప్రపంచంలో అందరు ఊరికే చనిపోవడం లేదు. సాయం అనే మందు లేక చనిపోతున్నారు అనే కంటెంట్ ని గట్టిగ చెప్పాము. ప్రేక్షకుల హృదయాలను తాకే విధంగా సినిమా ఉంటుంది’ అన్నారు.
పూరి జగన్నాథ్, వెంకటేష్, బ్రహ్మనందం, రోజా, సాయి కుమార్ త్రీ మంకీస్ టీం కి వీడియో ద్వారా బెస్ట్ విషెస్ తెలిపారు.
ఈ కార్యక్రమం లో జబర్దస్ నటులు వేణు, చంటి, అభి, భాస్కర్, సుధాకర్, రాఘవ, డైలాగ్ రైటర్ అరుణ్, డీ.ఓ.పీ సన్నీ మాట్లాడారు.
కథ, సంగీతం, దర్శకత్వం: అనిల్ కుమార్. జి,
నిర్మాత: నగేష్. జి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి బాబు వాసిరెడ్డి,
లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ సాయి,
సినిమాటోగ్రఫీ: సన్నీదోమల,
ఎడిటింగ్: ఉదయ్ కుమార్,
సంగీతం: అనిల్ కుమార్ జి.
మాటలు: అరుణ్. వి,
లిరిక్స్: శ్రీమణి,
పిఆర్ఓ: వంశీ – శేఖర్.


కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరో హీరొయిన్లు గా ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం

కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరో హీరొయిన్లు గా ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం !!!

ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రాయచోటి ఎమ్.ఏల్.ఏ శ్రీకాంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మదనపల్లి ఎమ్ఎల్ఏ నవాజ్ బాషా క్లాప్ కొట్టారు. రాజా వారు రాణి గారు సినిమాతో సక్సెస్ సాధించిన హీరో కిరణ్ అబ్బవరం హీరోగా టాక్సివాల హీరోయిన్ ప్రియాంక జవాక్కర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాతో శ్రీధర్ గదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు ఆర్.ఎక్స్ 100 మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఫిబ్రవరి చివరివారం నుండి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

నటీనటులు:
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవల్కర్, డైలాగ్ కింగ్ సాయి కుమార్, తులసి, శ్రీకాంత్, కశ్యప్ శ్రీనివాస్, అరుణ్

సంగీతం: చేతన్ భరద్వాజ్
కెమెరామెన్: విశ్వాస్ డానియల్
దర్శకత్వం: శ్రీధర్ గదె
నిర్మాతలు: ఎలైట్ గ్రూప్