Category Archives: Sliders

‘కళ్యాణ్ దేవ్’ హీరోగా ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ ‘జిఏ 2 పిక్చర్స్’ సమర్పణలో ‘పీపుల్ మీడియా ఫాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ చిత్రం

* ‘కళ్యాణ్ దేవ్’ హీరోగా ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ ‘జిఏ 2 పిక్చర్స్’ సమర్పణలో ‘పీపుల్ మీడియా ఫాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ చిత్రం.

* దర్శకునిగా ‘శ్రీధర్ సీపాన’ పరిచయం.

మంచి కధాబలం కలిగిన చిత్రాలను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించటం అన్నది ఇటీవల కాలంలో ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను సంతరించుకుంటున్న వైనం గమనార్హం. ఇదే కోవలో మూడు ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థలు ఓ చిత్ర నిర్మాణానికి నడుం బిగించాయి.

భలే భలే మగాడి ఓయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే వంటి విజయవంతమైన చిత్రాలను ప్రస్తుతం ‘ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ చిత్రాన్ని నిర్మిస్తున్న
‘జిఏ 2 పిక్చర్స్’ సమర్పణలో ఇటీవలే ‘వెంకీ మామ’ వంటి ఘనవిజయం సాధించిన చిత్రాన్ని నిర్మించిన ‘పీపుల్ మీడియా ఫాక్టరీ‘, మరో చిత్ర నిర్మాణ సంస్థ ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‘ తో కలసి ఈ చిత్ర నిర్మాణానికి సమాయత్తమవుతున్నాయి. నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘విజేత’ వంటి ఓ మంచి కథాబలం కలిగిన చిత్రంతో వెండితెరకు కథానాయకునిగా పరిచయమయిన మెగాస్టార్ చిరంజీవి అల్లుడు ‘కళ్యాణ్ దేవ్‘ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది.
విక్టరీ వెంకటేష్ ‘నమో వెంకటేశ’, మహేష్ బాబు ‘దూకుడు’ వంటి చిత్రాలకు రచనా సహకారం అందించటం తో పాటు, అహ నా పెళ్ళంట, పూలరంగడు, భీమవరం బుల్లోడు, లౌక్యం,సౌఖ్యం, డిక్టేటర్ వంటి పలు చిత్రాలకు కథ, మాటలు అందించిన రచయిత ‘శ్రీధర్ సీపాన’ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు.

ఈ సందర్భంగా ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్న ‘శ్రీధర్ సీపాన‘మాట్లాడుతూ…’ రచయితగా నాకున్న అనుభవంతో ఓ మంచి కథను దర్శకునిగా పరిచయం కావటానికి సిద్ధం చేసుకున్నాను. ఈ కధకు హీరో ‘కళ్యాణ్ దేవ్‘ సరైన నాయకుడని అనిపించింది. ప్రేమ తో కూడిన వినోద భరిత కుటుంబ కధా చిత్రం గా దీనికి రూపకల్పన చేయటం జరిగింది. హీరో పాత్ర ఎంతో ఉన్నతంగా ఉంటుంది. దర్శకునిగా నన్ను పరిచయం చేస్తున్న నిర్మాతలకు సర్వదా కృతజ్ఞుడను. వారి గౌరవాన్ని పెంచే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తానని నమ్మకంగా చెప్పగలనన్నారు ‘శ్రీధర్ సీపాన‘.

ఈ ఏడాది మార్చి నెలలో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం లోని ఇతర నటీ నట, సాంకేతిక వర్గం వివరాలు త్వరలో ప్రకటిస్తామని సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల తెలిపారు.

సమర్పణ: ‘జిఏ 2 పిక్చర్స్’
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్
కథ,మాటలు,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీధర్ సీపాన


లాస్ ఏంజెల్స్‌లో ‘మోసగాళ్లు’ కీలక సన్నివేశాలు మొదలుపెట్టిన విష్ణు

హాలీవుడ్-ఇండియన్ ప్రొడక్షన్ అయిన ‘మోసగాళ్లు’ సినిమా కోసం తనకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్రారంభించారు హీరో మంచు విష్ణు. ప్రపంచపు ఎంటర్టైన్మెంట్ రాజధానిగా ప్రసిద్ధిపొందిన లాస్ ఏంజెల్స్ (యు.ఎస్.)లో తీస్తున్న ఇంపార్టెంట్ సీన్లలో ఆయన పాల్గొంటున్నారు. నియాన్ లైట్లతో వెలిగిపోయే లాస్ ఏంజెల్స్ నగరం ‘మోసగాళ్లు’కు సరిగ్గా సరిపోయే నేపథ్యాన్ని అందిస్తోందని చెప్పవచ్చు. చరిత్రలో అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఈ సినిమా ఛేదిస్తుంది. ఈ లాస్ ఏంజెల్స్ షెడ్యూల్ 10 రోజుల పాటు జరుగుతుంది.

ఇండస్ట్రీ వర్గాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తోన్న ఈ మూవీలో విష్ణుతో పాటు అందాల తార కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి మరో రెండు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. కొద్ది నెలలుగా జరుగుతూ వస్తోన్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటోంది. సినిమాలో విష్ణు పోషిస్తున్న క్యారెక్టర్ చాలా ఇన్టెన్స్ గా ఉంటుందని మేకర్స్ తెలిపారు.

టెర్రిఫిక్ స్టోరీ, క్యారెక్టరైజేషన్, యాక్షన్ మేళవిపుంతో తయారవుతున్న ‘మోసగాళ్లు’ చిత్రాన్ని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలో తన లుక్ ఆవిష్కరణ సందర్భంగా “నేను మంచివాడినా, చెడ్డవాడినా? జడ్జి మీరే” అని తన అభిమానుల్ని అడిగారు విష్ణు.

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర వంటి పేరుపొందిన యాక్టర్లు నటిస్తోన్న ‘మోసగాళ్లు’ 2020 సమ్మర్ లో విడుదలకు సిద్ధమవుతోంది.


సాయి ధన్సిక ప్రధాన పాత్రలో సినిమా ప్రారంభం

శ్రీ సాయి లక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్ పై పి.యస్.ఆర్ కుమార్ ( వైజాగ్ బాబ్జి) నిర్మాతగా, హరి కొలగాని దర్శకుడిగా పరిచయం చేస్తున్న చిత్రం
ఈ రోజు లాంఛనంగా ప్రారంభం అయ్యింది. కబాలి ఫేమ్ సాయి దన్సిక ప్రధాన పాత్రలో రూపొందబోయే ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కి తొలి
క్లాప్ దర్శకుడు వి వి వినాయక్ ఇవ్వగా, ప్రముఖ నిర్మాత బి.వి.యస్. ఎన్ ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేసారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు
తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ రోజు ముహుర్తం జరుపుకున్న ఈ చిత్ర షూటింగ్ రేపటి నుండి ఇరవై రోజుల పాటు
రామోజీ ఫిల్మ్ సిటి లో ఫస్ట్ షెడ్యూల్ జరగనుంది.

ఈ సందర్భంగా
నిర్మాత పి.ఎస్.ఆర్ కుమార్ (వైజాగ్ బాబ్జి) మాట్లాడుతూ: ‘ డిస్ట్రిబ్యూటర్ గా తెలుగు సినిమా పరిశ్రమతో నాకు చాలా అనుబంధం ఉంది. ఒక
మంచి కథ తో నిర్మాతగా మారడం చాలా ఆనందంగా ఉంది. నేను నిర్మతగా మారడంలో బెక్కం వేణుగోపాల్ ప్రొత్సాహం ఉంది. మా బ్యానర్ లో
మొదటి సినిమా ప్రేక్షకులను అలరించే విదంగా ఉంటుందని నమ్ముతున్నాను’ అన్నారు.

దర్శకుడు హరి కొలగాని మాట్లాడుతూ: ‘ నేను శబ్దాలయా, అన్నపూర్ణ సంస్థలలో డైరెకక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసాను. నేను రాసుకున్న
కథ సినిమా గా మారడానికి కారణం బెక్కం వేణుగోపాల్. ఈ సినిమా వెనక ఆయన ప్రొత్సాహాం చాలా ఉంది. రేపటి నుండి మెదటి షెడ్యూల్ ఆర్
ఎఫ్ సి లో మొదలవుతుంది. దన్సిక పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ’ అన్నారు.

హీరోయిన్ సాయి ధన్సిక మాట్లాడుతూ: ‘తెలుగు సినిమా పరిశ్రమ అంటే నాకు చాలా స్పెషల్. ఇక్కడ సినిమా పరిశ్రమలో చాలా మంచి
వాతావరణం ఉంటుంది. హారి గారు నాకు కథ చెప్పగానే ఓకే అనడానికి ఎక్కవ టైం తీసుకోలేదు. ఈ టీం అంతా కొత్తదే అయినా మంచి ప్లానింగ్
తో ఉంది. నేను ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాను’ అన్నారు..

ఈ చిత్రానికి
సమర్ఫణ: శ్రీమతి వాగేశ్వరి (పద్మ)
బ్యానర్: శ్రీ సాయి లక్ష్మీ క్రియేషన్స్
ప్రొడ్యూసర్: పి.యస్.ఆర్. కుమార్ ( బాబ్జి, వైజాగ్)
డి.ఓ.పి: వాస్లి శ్యాం ప్రసాద్
పి.ఆర్.ఓ: జియస్ కె మీడియా
మ్యూజిక్ డైరెక్టర్: శేఖర్ చంద్ర
డైలాగ్స్: కరుణ్ వెంకట్
కో ప్రొడ్యూసర్: పవన్, సుమన్
ఎడిటింగ్: వెంకట్ బాబు
లిరిక్స్ : కిట్టు విస్సా ప్రగడ
ఆర్ట్ డైరెక్టర్: షర్మిల యెలిశెట్టి
కో డైరెక్టర్: సురేష్ నిది కొప్పుల
కోరియోగ్రఫీ: సుభాష్
స్టంట్స్: రాబిన్ సుబ్బు
లైన్ ప్రొడ్యూసర్ : వెంకట యస్ కె కులపాక
దర్శకుడు : హరి కొలగాని

నటీ నటులు:
సాయి ధన్సిక, కిషోర్ , తేజ్ కూరపాటి (హుషారు ఫేమ్)
అభినవ్ (హుషారు ఫేమ్)
ధీరజ్
నవకాంత్
చమ్మక్ చంద్ర


ఇది పిట్టకథే కానీ చాలా పెద్ద కథ అని నమ్ముతున్నాను: ప్రముఖ దర్శకుడు కొరటాల శివ

ఇది పిట్టకథే కానీ చాలా పెద్ద కథ అని నమ్ముతున్నాను: ప్రముఖ దర్శకుడు కొరటాల శివ

వినడానికి ఓ పిట్టకథగా అనిపించినా ఇది చాలా పెద్దకథే అని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సూత్రీకరించారు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రానికి ‘ఓ పిట్టకథ’ అనే టైటిల్‌ పెట్టిన

విషయం తెలిసిందే. చెందు ముద్దు దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ పోస్టర్‌ని ఇటీవలే మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ విడుదల చేశారు. ఈ సినిమా క్యారెక్టర్స్‌ పోస్టర్‌ను బుధవారం హైదరాబాద్ లో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు .

అనంతరం కొరటాల శివ మాట్లాడుతూ.. ”అద్భుతమైన టైటిల్‌ ఇది. మొన్నటికిమొన్న పోస్టర్‌ రిలీజ్‌ చేసినప్పుడు క్యారెక్టర్స్‌కు సంబంధించిన విషయాలు అందులో చూపించా రు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఈమధ్య పిట్టకథ గురించే చర్చజరుగుతుంది. ఇది పిట్టకథే కానీ చాలా పెద్ద కథ అని నమ్ముతున్నాను. అప్పట్లో పెద్దవంశీగారి సినిమాలు ఇలా చూసేవాళ్ళం. పోస్ట్‌ర్స్‌గానీ, టీజర్స్‌కానీ చూసి అంత ఫీలయ్యేవాళ్ళం. దర్శకుడు చందు అద్భుతంగా తీశాడనిపిస్తుంది. ప్రతి విజువల్‌ ముద్దుగా వున్నాయి.

ఖచ్చితంగా ‘ఓ పిట్టకథ’ ఈ సమ్మర్‌లో ప్రేక్షకులకు గ్రేట్‌ రిలీఫ్‌ ఇస్తుంది. కూల్‌ సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నాను. ఎంటైర్‌ టీమ్‌కు ఆల్‌ది బెస్ట్‌” అని తెలిపారు.

నిర్మాత వి.ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ .. ” చెందు ముద్దు చెప్పిన ‘ఓ పిట్ట కథ’ చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించి,

వెంటనే సెట్స్‌ మీదకు తీసుకెళ్లాం. సినిమా చాలా బాగా వచ్చింది” అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత అన్నే రవి మాట్లాడుతూ.. ”ఓ వైపు కామెడీ, మరోవైపు థ్రిల్లింగ్‌అంశాలతో, గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా

కచ్చితంగా ఆకట్టుకుంటుంది . చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని చెప్పారు.

దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. ”ఒక విలేజ్‌లో జరిగే స్టోరీ ఇది. ప్రతి సన్నివేశం స్వచ్ఛంగా సాగుతుంది. ఓ వైపు కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. మరోవైపు ఏంజరుగుతోందనే ఉత్కంఠను రేకెత్తిస్తుంది . పతాక సన్నివేశాల వరకూ ఆ థ్రిల్లింగ్‌ అలాగే సస్టైన్‌ అవుతుంది. ట్విస్టులు మరింత థ్రిల్‌ కలిగిస్తుంటాయి. స్క్రీన్‌ ప్లే ప్రధానంగా తెరకెక్కించాం” అని అన్నారు.

నటీనటులు:

విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు

సాంకేతిక నిపుణులు:

పాటలు: శ్రీజో , ఆర్ట్ష్ట్‌: వివేక్‌ అన్నామలై, ఎడిటర్‌: డి.వెంకటప్రభు, కెమెరా: సునీల్‌ కుమార్‌ యన్‌., సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అన్నే రవి, నిర్మాత: వి.ఆనంద ప్రసాద్‌. కథ, స్క్రీన్‌ప్లే , మాటలు, దర్శకత్వం : చెందుముద్దు.


అద్భుతమైన కావ్యంలా రూపొందిన `జాను` చిత్రంతో ప్రతి ఒక్క‌రూ క‌నెక్ట్ అవుతారు : దిల్‌రాజు

అద్భుతమైన కావ్యంలా రూపొందిన `జాను` చిత్రంతో ప్రతి ఒక్క‌రూ క‌నెక్ట్ అవుతారు : దిల్‌రాజు

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ ‘జాను’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈసంద‌ర్భంగా మంగ‌ళ‌వారం వైజాగ్‌లో జ‌రిగిన గ్రాండ్ ప్రీరిలీజ్ కార్య‌క్ర‌మంలో…

హీరో శ‌ర్వానంద్ మాట్లాడుతూ – ‘‘ప్రేక్ష‌కులు ఇస్తున్న ప్రేమ‌ను ఎలా తీర్చుకుంటానో తెలియ‌దు కానీ.. జాను సినిమాతో ఆ ప్రేమ‌ను తిరిగి ఇస్తాను. ఈ టైటిల్ మాకు ఇచ్చినందుకు ప్ర‌భాస్ అన్న‌కు థ్యాంక్స్‌. నా కెరీర్‌లో `జాను` గొప్ప సినిమాగా నిలిచిపోతుంది. నాకే కాదు ప్రేక్ష‌కుల‌కు కూడా జాను గుర్తుండిపోతుంది. దానికి కార‌ణం దిల్‌రాజుగారు. ఎందుకంటే మా అంద‌రికీ ఆయ‌నే న‌మ్మ‌కాన్ని క‌లిగించారు. న‌న్ను న‌మ్ము అని చెప్పి సినిమా చేయించారు. ఆయ‌న‌పై న‌మ్మ‌కంతో చేసిన సినిమా ఇది. ఓ సాంగ్‌ను చాలా క‌ష్ట‌ప‌డి 20 రోజుల పాటు చిత్రీక‌రించాం. ఈ సినిమా చేసే స‌మ‌యంలో నాకు యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి. నేను మ‌ర‌చిపోలేని సినిమా. నేను ఈ సినిమాలో బాగా యాక్ట్ చేశానంటే కార‌ణం స‌మంత‌. ఆమెతో యాక్ట్ చేయాలంటే ఒళ్లు జాగ్ర‌త్త‌గా పెట్టుకుని యాక్ట్ చేయాలి. సీన్‌ను తినేస్తుంది. కాబ‌ట్టి చాలా జాగ్ర‌త్త‌గా చేశాను. సమంతతో ఓ సినిమా కూడా చేయ‌లేక‌పోయానే అని అనుకునేవాడిని. ఈ సినిమాలో త‌న‌తో క‌లిసి గొప్ప సినిమాలో న‌టించాను. అలాగే నేను, స‌మంత బాగా న‌టించ‌డానికి కార‌ణం డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్‌. ప్ర‌తి ఒక్క‌రికీ ఫ‌స్ట్ ల‌వ్ ఉంటుంది. ఈ సినిమా చూసిన‌ప్పుడు అందరూ క‌నెక్ట్ అవుతారు. బ్యూటీఫుల్ మూమెంట్స్ క్రియేట్ అయ్యాయి. అందుకు కార‌ణ‌మైన స‌మంత‌కు థ్యాంక్స్‌. ఫిబ్ర‌వ‌రి 7న థియేట‌ర్స్‌లో సినిమాను ఎంజాయ్ చేయండి’’ అన్నారు.
సమంత అక్కినేని మాట్లాడుతూ – ‘‘చాలా మంది ఇక్క‌డ 96 సినిమాను చూసే ఉంటారు. అదే క‌థ‌లో ఓ మేజిక్‌తో జాను సినిమాను చేశాం. సినిమా సైన్ చేయ‌క ముందు బాగా భ‌య‌ప‌డ్డాను. క్లాసిక్ రీమేక్ చేస్తునాం క‌దా! అని భ‌య‌ప‌డిన మాట వాస్త‌వ‌మే. వ‌ద్దులే అని అనుకున్నాను. కానీ ఫ‌స్ట్ డే షూటింగ్ నుండి నాకు పూర్తిగా సినిమాపై న‌మ్మ‌కం వ‌చ్చింది. అదే మేజిక్ కాస్త డిఫ‌రెంట్‌గా ఉంటుంది. నా కెరీర్‌లో ప్ర‌తి సంవత్స‌రం ఓ స్పెషల్ మూవీ వ‌స్తుంటుంది. అది నా గుండెల్లో నిలిచి పోతుంది. అలా కల‌కాలం నా గుండెల్లో గుర్తుండిపోయే సినిమాగా జాను నిలిచిపోతుంది. ఈ సినిమాలో ఎమోష‌న‌ల్ సీన్స్‌లో న‌టించేట‌ప్పుడు క‌న్నీళ్లు పెట్టుకున్నాను. గ్లిజ‌రిన్ కూడా వాడ‌లేదు. అందుకు కార‌ణం.. ప‌వ‌ర్ ఆఫ్ ది స్క్రిప్ట్‌, డైలాగ్స్‌, ల‌వ్‌. దిల్‌రాజుగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను నో చెప్పినా కూడా ఆయ‌న ఒప్పించారు. ఆ కార‌ణంతో ఇప్పుడు నా కెరీర్‌లోని టాప్ త్రీ ప్లేస్‌ల్లో జాను నిలిచింది. తెలుగు ఇండ‌స్ట్రీలోకి బృందావ‌నంతో సినిమాతో ఎంట్రీ ఇచ్చారు దిల్‌రాజుగారు. ఇప్పుడు మ‌రో మంచి అవ‌కాశం ఇచ్చారు. జాను సినిమానే మా ఇద్ద‌రికీ బెస్ట్ మూవీ అని చెప్ప‌గల‌ను. శ‌ర్వాతో క‌లిసి ప‌నిచేయ‌డాన్ని ఎంజాయ్ చేస్తాను. త‌న‌కు థ్యాంక్స్‌. అలాగే డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్‌గారికి థ్యాంక్స్‌. ప్రేమ్‌గారు జీనియ‌స్‌.. మేజిక్ క్రియేట్ చేశారు. అదే ఫీల్‌ను, మేజిక్‌ను క్రియేట్ చేయ‌డం చాలా క‌ష్టం. కానీ ఆయ‌న క్రియేట్ చేశారు’’ అన్నారు.
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – ‘‘ముందుగా రెబల్‌స్టార్ ప్ర‌భాస్‌కు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకు జాను అనే టైటిల్ మిన‌హా మ‌రో టైటిల్ పెట్ట‌లేం. అప్ప‌టికే ప్ర‌భాస్ సినిమాకు జాన్ అనే టైటిల్ ఉన్నా కూడా.. నేను అడ‌గ్గానే జాను అనే టైటిల్‌ను ఇచ్చిన ప్ర‌భాస్‌, వంశీ, ప్ర‌మోద్‌కి థాంక్స్ . త‌మిళంలో ఈ సినిమాను చూసిన‌వాళ్లు.. అంద‌మైన కావ్యం త‌ర‌హా చిత్ర‌మిది. మా బ్యాన‌ర్‌లో చాలా సినిమాలను నిర్మించాం. 96 త‌మిళ సినిమాను నేను చూసిన‌ప్పుడు నాకు అద్భుత‌మైన సినిమాగా అనిపించింది. అప్పుడే రీమేక్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఆరోజు నుండి నేటి వ‌ర‌కు ఈసినిమాతో జ‌ర్నీ చేస్తూనే ఉన్నాను. స‌మంత‌, శ‌ర్వాను ఒప్పించి ఈ సినిమా చేయించాను. ఈ సినిమాలో న‌టించాలంటే అద్భుత‌మైన పెర్ఫామెన్స్ చేయ‌గ‌లిగే హీరో హీరోయిన్స్ కావాలి. శ‌ర్వా, స‌మంత ఈ సినిమాలో న‌టించినందుకు అక్క‌డే .. నేను 50 శాతం స‌క్సెస్ అయ్యాను. మా బ్యాన‌ర్‌లో శ‌ర్వాతో శ‌త‌మానం భ‌వ‌తి సినిమా చేశాను. అలాగే స‌మంత‌ బృందావ‌నం, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు సినిమాలు చేసింది. ఈ సినిమా చూసిన కొంత మంది ఇలాంటి క్లాసిక్‌ను ఎందుకు చేస్తున్నార‌ని అన్నారు. కానీ 96 సినిమాను చూసిన వారు కూడా ఈ సినిమాను కూడా చూస్తారు. శ‌ర్వా, సామ్ అద్భుతంగా న‌టించారు. డైరెక్ట‌ర్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ టీమ్ అదే కావ‌డం వ‌ల్ల అద్భుత‌మైన కావ్యాన్ని మ‌ళ్లీ క్రియేట్ చేశారు. ఈ సినిమాలో ఎన్నో అద్భుత‌మైన మూమెంట్స్ ఉంటాయి. ఈ ఫిబ్ర‌వ‌రి 7న తెలుగు ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన అనుభూతికి లోన‌వుతారు. అదే ఫీలింగ్స్‌తో ఇంటికి వెళ‌తారు. యూత్‌తో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అవుతారు’’ అన్నారు.


లవ్ స్టొరీ లొకేషన్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల బర్త్ డే సెలబ్రేషన్స్

*లవ్ స్టొరీ లొకేషన్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల బర్త్ డే సెలబ్రేషన్స్*

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల బర్త్ డే సెలబ్రేషన్స్”లవ్ స్టొరీ” లొకేషన్ లో యూనిట్ సభ్యుల సమక్షంలో జరిగాయి. హీరో నాగ చైతన్య, హీరోయిన్
సాయి పల్లవి , నిర్మాత సునీల్ నారంగ్ లతో పాటు భరత నారంగ్,డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా తదితరులు దర్శకుడు శేఖర్ కమ్ముల కు
శుభాకాంక్షలు తెలిపారు.ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో ‘ లవ్ స్టొరీ’ షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ ల్లో ఉన్న ఈ మ్యూజికల్
లవ్ స్టొరీ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి కి విడుదల చేసిన ‘లవ్ స్టొరీ’ ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్
వచ్చింది.శేఖర్ కమ్ముల , చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ క్రేజ్ కి ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ ప్రేమకథ సమ్మర్ కి స్సెషల్ ఎట్రాక్షన్ గా మారబోతుంది.

ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఆర్ట్:రాజీవ్ నాయర్
సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్,
సహా నిర్మాత : భాస్కర్ కటకంశెట్టి, పి.ఆర్.వో -జి.ఎస్.కె మీడియా,
డిజిటల్ మార్కెటింగ్: నీహారిక గాజుల
మ్యూజిక్ : పవన్
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు
రచన- దర్శకత్వం : శేఖర్ కమ్ముల



ఎం.ఎస్ రాజు “డర్టీ హరి” రీ-రికార్డింగ్ పనులు మొదలు!!

ఎం.ఎస్ రాజు “డర్టీ హరి” రీ-రికార్డింగ్ పనులు మొదలు!!

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న “డర్టీ హరి” చిత్ర రీ-రికార్డింగ్ పనులు మొదలయినట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు.

రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో ‘హరి’ గా హైదెరాబాదీ కుర్రాడు శ్రవణ్ రెడ్డి పరిచయం అవుతుండగా, జాక్వెలిన్, వసుధ పాత్రల్లో హీరోయిన్లుగా సిమ్రత్ కౌర్ మరియు రుహాణి శర్మ కనిపించనున్నారు.

ఇప్పటికే విడుదలైన ‘డర్టీ హరి’ ఫస్ట్ లుక్స్ ఈ చిత్రం ఎంత బోల్డ్ గా ఉండబోతుందో చెబుతుండగా, ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన పేరున్న ప్రొడ్యూసర్/డైరెక్టర్ కి ఇది కంబ్యాక్ చిత్రం అవ్వడంతో భారీ అంచనాల మొదలయ్యాయి.

ఈ సందర్భంగా ఇటీవల జరుగుతున్న రీ-రికార్డింగ్ పనుల్లో భాగంగా తన పాత జ్ఞాపకాల గురించి ఎం.ఎస్ రాజు మాట్లాడుతూ, 1987 లో తన మొదటి సినిమాకి పని చేసిన కే.వి. మహదేవన్, ఆ తరువాత కలిసి ప్రయాణించిన రాజ్ కోటి, కొత్త తరం సంగీత దర్శకులు దేవి శ్రీ ప్రసాద్, మణిశర్మ, చక్రి, కార్తీక్ రాజు మరియు ఇప్పుడు పని చేస్తున్న మార్క్ కే రాబిన్ లని గుర్తుచేసుకుంటూ తన సుదీర్ఘ ప్రయాణాన్ని నెమరువేసుకున్నారు.

అలాగే ఎస్.పి.జె క్రియేషన్స్ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తున్న గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో బోల్డ్నెస్ తో పాటు సున్నితమైన భావోద్వేగభరితమైన సన్నివేశాలు కూడా ఉంటాయని. దర్శకుడు రొమాన్స్ ని చాలా పొయెటిక్ గా చూపిస్తున్నారని అన్నారు. అదే సమయంలో నిర్మాణాంతర కార్యక్రమాలని వేగపరుస్తూ, త్వరలోనే చిత్ర టీజర్ ని మరియు రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని తెలిపారు.



జిఏ 2 పిక్చర్స్ , అల్లు అరవింద్ , బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” గా రాబోతున్న అఖిల్ అక్కినేని

జిఏ 2 పిక్చర్స్ , అల్లు అరవింద్ , బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” గా రాబోతున్న అఖిల్ అక్కినేని

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ప్రోడ‌క్ష‌న్ నెం 5 కి టైటిల్ కంఫర్మ్ అయ్యింది. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో నిర్మాత‌లు బ‌న్నీవాసు , వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” గా టైటిల్ ఖరారు చేసినట్టు చిత్రం యూనిట్ తెలిపింది. అలానే ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ వంటి యూత్ ఫుల్ టైటిల్ కి తగినట్లుగానే ఈ సినిమా యూత్ ని అలరించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే రీతిన రెడీ అవుతుంది అని దర్శక నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు.

అక్కినేని నాగేశ్వ‌రావు గారి, అక్కినేని నాగార్జున గారి న‌ట వార‌సుడుగా ప‌రిచ‌య‌మైన అఖిల్ అక్కినేని తన సినిమాల ద్వారా ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. త‌ను చేసిన హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్జూ లాంటి ల‌వ్ కమ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్స్ తో అక్కినేని అభిమానుల‌నే కాకుండా ఫ్యామిలి అండ్ గ‌ర్ల్స్ సెక్టార్ లో అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

బొమ్మ‌రిల్లు చిత్రం ఇప్ప‌టికి ట్రెండ్ సెట్ట‌ర్ ఇన్ ల‌వ్ అండ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా నిలిచిపోయిందంటే అది కేవ‌లం ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ విజ‌న్ అండ్ వాల్యూస్ అని చెప్పాలి. ఆ త‌రువాత వ‌చ్చిన ప‌రుగు చిత్రం ప్ర‌తి ఓక్క‌రిని ఆలోచింప‌చేసేలా అద్బుతంగా తీర్చిదిద్దాడు. ఫ్యామిలీ ఆడియ‌న్స్ లో భాస్క‌ర్ ది సెప‌రేటు ఇమేజ్ వుంది. ఇప్ప‌డు వీర‌ద్దిరి కాంబినేష‌న్ లో చిత్రం అన‌గానే ఈ క్రేజ్ మ‌రింత పెరిగింది.

గ‌తం లో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో మెగా హీరోలు కాకుండా చేసిన చిత్రం 100% ల‌వ్‌.. ఈ చిత్రం లో అక్కినేని న‌ట వార‌సుడు నాగ చైత‌న్య హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం లో బ‌న్ని వాసు నిర్మించాడు. ఆ చిత్రం చాలా మంచి విజ‌యాన్ని సాధించ‌టం విశేషం.. మ‌ళ్ళి ఇప్పుడు అక్కినేని వారి మ‌రో న‌ట వార‌సుడు అఖిల్ అక్కినేని హీరోగా, నిర్మాత‌లు బ‌న్ని వాసు, వాసు వ‌ర్మ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని బొమ్మ‌రిల్లు, ప‌రుగు లాంటి ట్రెండ్ సెట్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నారు.

అల్లు అర‌వింద్ గారు-జిఏ2 పిక్చ‌ర్స్‌- బ‌న్నివాసు-వాసువ‌ర్మ కాంబినేష‌న్‌

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్స‌ణలో బ‌న్ని వాసు ప్రొడ్యూస‌ర్ గా 100% ల‌వ్ నుండి పిల్లా నువ్వులేని జీవితం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, గీతా గోవిందం, ప‌త్రిరోజు పండుగే వ‌ర‌కూ వ‌ర‌స బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాలు సొంతం చేసుకున్నారు. అల్లు అర‌వింద్ గారి సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా ఇప్ప‌డు మ‌రో యంగ్ ద‌ర్శ‌కుడు వాసు వ‌ర్మ తో కలసి “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో నిర్మిస్తున్నారు..

న‌టీ న‌టులు

అఖిల్ అక్కినేని
పూజా హెగ్ఢే
ఆమ‌ని
ముర‌ళి శ‌ర్మ‌
జ‌య ప్ర‌కాశ్
ప్ర‌గ‌తి
సుడిగాలి సుధీర్
గెటెప్ శ్రీను
అభ‌య్
అమిత్

టెక్నీష‌య‌న్స్

డైరెక్ట‌ర్ : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్
మ్యూజిక్ : గోపీ సుంద‌ర్
సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ
ఎడిట‌ర్ : మార్తండ కే వెంక‌టేశ్
ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా
నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌
స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్
బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్