Category Archives: Sliders

‘జాను’ …మనతో పాటు ఇంటికి తీసుకెళ్లే సినిమా : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నేచుర‌ల్ స్టార్ నాని ‘జాను’ చూసిన త‌ర్వాత ఆ హ్యోంగోవ‌ర్‌లో ఉండిపోతాం: దిల్‌రాజు

‘జాను’ …మనతో పాటు ఇంటికి తీసుకెళ్లే సినిమా : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నేచుర‌ల్ స్టార్ నాని

‘జాను’ చూసిన త‌ర్వాత ఆ హ్యోంగోవ‌ర్‌లో ఉండిపోతాం: దిల్‌రాజు

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ ‘జాను’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో బిగ్ సీడీని ఆవిష్క‌రించారు. నేచుర‌ల్ స్టార్ నాని, వంశీ పైడిప‌ల్లి ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా …

17 ఏళ్ల‌లో తొలి రీమేక్‌: దిల్‌రాజు
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – ‘‘మా బ్యాన‌ర్ స్టార్ట్ అయ్యి 17 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్ల‌లో మేం ఎప్పుడూ రీమేక్ చేయ‌నేలేదు. మా బ్యాన‌ర్‌లో వ‌స్తోన్న తొలి రీమేక్ ఇది. రీమేక్ చేయాలంటే నాకు భ‌యం. ఎందుకంటే ఒరిజిల్ ఫీల్‌ను మిస్ కాకుండా తెర‌పైకి తీసుకురావ‌డం చాలా క‌ష్టం. త‌మిళంలో ‘96’ సినిమాను రిలీజ్ కంటే ఒక నెల ముందు చూశాను. చూసిన త‌ర్వాత ప్రివ్యూ థియేట‌ర్ నుండి బ‌య‌ట‌కు రాగానే ఈ సినిమాను నేను తెలుగులో రీమేక్ చేస్తానంటూ.. ప్రొడ్యూస‌ర్‌కి చెక్ ఇచ్చేశాను. అందుకు కార‌ణం సినిమా చూసే స‌మ‌యంలో ఎమోష‌న్స్‌తో గుండె బ‌రువెక్కింది. అప్పుడు మా ‘ఎంసీఏ’ షూటింగ్ జ‌రుగుతుంది. ‘96’ చిత్రాన్ని రీమేక్ చేయాల‌నుకుంటున్నాన‌ని నానితో చెప్పాను. త‌ను కూడా చెన్నై వెళుతున్నాన‌ని చెప్పాడు. అప్పుడు త‌న కోసం ఓ షో ఏర్పాటు చేస్తే.. త‌ను సినిమా చూసి సినిమా ‘క్లాసిక్ సినిమా సార్‌! చాలా బావుంది’అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. త‌మిళంలో సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత మళ్లీ ఆడియెన్స్‌తో క‌లిసి సినిమా చూశాను. నాకు తమిళంలో పూర్తిగా రాకపోయినప్పటికీ ప్రేక్ష‌కుల నుండి వ‌చ్చిన రెస్పాన్స్ చూసి ఎవ‌రు ఏమ‌నుకున్నా..ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాల‌ని డిసైడ్ అయ్యాను. జానుగా స‌మంత‌ను ఈ సినిమాలో యాక్ట్ చేయించాల‌ని అనుకున్నాను. త‌నని త‌ప్ప‌.. ఆ పాత్ర‌లో మరొక‌రిని ఆ పాత్ర‌లో ఊహించుకోలేక‌పోయాను. ఈ మ‌ధ్య త‌ను చేస్తున్న సినిమాలన్నీ సూప‌ర్బ్‌గా సెల‌క్ట్ చేసుకుంటుంది. త‌న‌తో మాట్లాడి సినిమాకు ఒప్పించాను. ఇక నా బ్ర‌ద‌ర్ శ‌ర్వాకి ఫోన్ చేసి సినిమా చూడ‌మంటే సినిమా చూసి సూప‌ర్బ్‌గా ఉంద‌ని ఫోన్ చేశాడు. అలా శ‌ర్వా, స‌మంత ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. మా ఆర్య సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా ప‌నిచేసిన ప్రేమ్‌కుమార్ ‘96’ సినిమాకు డైరెక్ట‌ర్‌గా మారాడు. త‌మిళంలో సినిమా చేసిన త‌న‌తో మాట్లాడి తెలుగులోనూ డైరెక్ట్ చేయ‌మ‌ని చెప్పాను. త‌మిళంలో చేసిన టెక్నీషియ‌న్సే ఈ సినిమాకు ప‌నిచేశాను. సినిమా స్టార్ట్ చేసిన త‌ర్వాత కెన్యాలో శ‌ర్వా న‌డుపుతున్న జీపు బోల్తా పడింది.. దేవుడి దయవల్ల త‌న‌కు ఏమీ కాలేదు. త‌ర్వాత మ‌రో డిస్ట్ర‌బెన్స్ వచ్చింది. ఏంటి? ఇంత మంచి సినిమాకు ఇన్ని అడ్డంకులు? అని అనుకున్నాను. అయితే అన్నింటినీ ఒక్కొక్క‌టిగా దాటుకుంటూ వ‌చ్చి సినిమాను పూర్తి చేశాం. ఈ సినిమాను చేస్తున్న‌ప్పుడు ‘దిల్‌రాజుకేమైనా మెంటలా? డ‌బ్బింగ్ చేయొచ్చు క‌దా?’ అని చాలా కామెంట్స్ విన్నాను. ఆ ఫీల్‌ను తెలుగులో అలాగే క్యారీ చేశాం. అదే ఫ్లేవ‌ర్‌ను డైరెక్ట‌ర్ ప్రేమ్ తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ఫిబ్ర‌వ‌రి 7న మా ‘జాను’ సినిమాను చూసిన తెలుగు ప్రేక్ష‌కులు వావ్ అంటారు. చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. ఈ సినిమా హ్యాంగోవ‌ర్‌లో ఉండిపోతాం. జాను సినిమా చూసిన త‌ర్వాత మ‌న లైఫ్‌లోని మెమొరీస్‌ను ఇంటికి తీసుకెళ్తాం. ఫిబ్ర‌వ‌రి 7న నేను చెప్పిన‌వ‌న్నీ నిజాలు అవుతాయి’’ అన్నారు.

మర్యాద ఉన్న సినిమా
వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ – ‘‘రాజుగారు ఈ రీమేక్ చేస్తున్నామ‌ని అనుకున్న‌ప్పుడు వ‌ద్ద‌ని వారించిన వారిలో నేనూ ఒక‌డ్ని. కానీ ట్రైల‌ర్‌ను చూసి షాక‌య్యాను. ప్రేమ్ అదే మూమెంట్స్‌ను తెలుగులో రీ క్రియేట్ చేశాడు. అందుకు కారణం ఈ సినిమా త‌న మ‌న‌సులో నుండి వ‌చ్చిన ఆలోచ‌న. అందుక‌నే అద్భుతంగా ఈ సినిమాను మ‌లిచాడు. ఇక తమిళంలో త్రిష‌..తెలుగులో స‌మంతగా న‌టించిన గౌరికి నేను పెద్ద ఫ్యాన్‌ని. భవిష్యత్తులో తెలుగు సినిమా గురించి రాసేట‌ప్పుడు స‌మంత గురించి కూడా కొన్ని పేజీలు రాసేంత స్థాయికి ఎదిగింది. అయినా స‌మంత విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమా ఫెయిలైతే నా కెరీర్ ఏంటి? అని ఇప్ప‌టికీ ఆలోచిస్తుంటుంది. ఆ భ‌యం, ప్యాష‌న్‌తోనే ఇప్పటికీ సినిమాలు చేస్తుంది. నేను డైరెక్ట‌ర్‌గా మారే క్ర‌మం నుండి శ‌ర్వానంద్ తెలుసు. త‌ను అప్ప‌టికీ యాక్ట‌ర్ కాలేదు. ఇప్పుడు సినిమాలు చేసుకుంటూ ఈ స్థాయికి చేరాడు. ‘జాను’ క‌మ‌ర్షియ‌ల్ సినిమా కాదు.. మ‌ర్యాద ఉన్న సినిమా. అదే గౌర‌వం, మ‌ర్యాదతో రాజుగారు సినిమా చేశారు. ఆయ‌న డ‌బ్బు క‌న్నా గౌర‌వం సంపాదించాల‌నుకుంటారు. 96 సినిమా తమిళంలో ఎంత పెద్ద విజ‌యాన్ని సాధించిందో తెలుగులోనూ అలాగే నిల‌బ‌డుతుంద‌ని న‌మ్ముతున్నాను’’ అన్నారు.

గర్వంగా ఫీలవుతారు
సమంత అక్కినేని మాట్లాడుతూ – ‘‘అభిమానుల‌ను డిస‌ప్పాయింట్ చేయ‌కూడ‌ద‌నే నేను ప్ర‌తీ సినిమాకు భ‌య‌ప‌డుతుంటాను. ప్ర‌తి సినిమాను.. షూటింగ్‌కి వెళ్లే ప్ర‌తిరోజుని నా మొద‌టి సినిమాకు మొద‌టి రోజు వెళ్లేలాగానే ఫీల్ అవుతాను. ప్రేక్ష‌కులు అందిస్తున్న స‌పోర్ట్‌కు థ్యాంక్స్‌. క్లాసిక్ సినిమా రీమేక్ ఇది. దీని గురించి ఇప్పుడు ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది. ఫిబ్ర‌వ‌రి 7 త‌ర్వాత త‌ప్ప‌కుండా మాట్లాడుతాను. ప్ర‌తిరోజూ ఈ సినిమా షూటింగ్‌లో ఏదో ఒక మేజిక్ జ‌రుగుతూనే ఉండింది. దిల్‌రాజుగారు అడ‌గ్గానే నేను పారిపోయాను. అయినా కూడా ఆయ‌న రెండోసారి అడిగి గొప్ప అవ‌కాశాన్ని ఇచ్చారు. నా రామ్‌లాగా న‌టించిన శ‌ర్వాకు థ్యాంక్స్‌. నా పెర్ఫామెన్స్‌కు ఏదైనా క్రెడిట్ ద‌క్కితే అది శ‌ర్వా వ‌ల్ల‌నే కుదిరింది. ప్రేమ్‌కుమార్‌గారికి థ్యాంక్స్‌. ఆయ‌న మేజిషియ‌న్‌లా మ‌రోసారి మేజిక్‌ని క్రియేట్ చేశాడు. నేను మీ అందరినీ గ‌ర్వంగా ఫీల‌య్యేలా చేస్తాన‌నే అనుకుంటున్నాను’’ అన్నారు.

తొంబై ఏళ్ల వరకు కనెక్ట్ అయ్యే సినిమా
హీరో శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘కొంత మంది హీరోయిన్స్‌తో ప‌నిచేయాలంటే కాస్త ఆలోచించుకుంటాం. నిత్యామీన‌న్‌, సాయిప‌ల్ల‌వి..స‌మంత వంటి వాళ్లు సీన్స్‌ను తినేస్తారు. వీళ్ల‌తో సినిమా అన‌గానే కొంచెం మ‌నం అల‌ర్ట్‌గా ఉండాలి. స‌మంత‌తో తొలిసారి ప‌నిచేశాను. ప్ర‌తి సీన్‌ను వంద శాతం చెక్ చేసుకునే న‌టిస్తుంది. అందుకే త‌ను సూప‌ర్‌స్టార్ అయ్యింది. స‌మంత జానుగా చేయ‌కుంటే ఈ సినిమా లేదు. నాకు ఏదైనా క్రెడిట్ అంటూ వ‌స్తే.. దానికి కార‌ణం స‌మంతే. ఆరు నుండి 90 ఏళ్ల వ‌ర‌కు అంద‌రికీ ఈ సినిమా క‌నెక్ట్ అవుతుంది. ఫ‌స్ట్ ల‌వ్‌ను ఎవ‌రూ మార్చ‌లేరు. చాలా స్వీట్ మెమురీస్ ఉన్నాయి. ర‌మేశ్‌, కిషోర్ క్యారెక్ట‌ర్స్ మ‌న‌కు క‌న‌ప‌డ‌తాయి. నా టీమ్ అంద‌రికీ థ్యాంక్స్‌. ఇలాంటి అద్భుత‌మైన సినిమాను ఇచ్చిన శిరీషన్న‌, రాజన్న‌, హ‌ర్షిత్‌ల‌కు థ్యాంక్స్‌. నేను ఈ సినిమాను చూసి ‘క్లాసిక్ మూవీ క‌దా! మ‌నం చేయాలా?’ అన్నాను. ‘నువ్వు న‌న్ను న‌మ్ము’ అని దిల్‌రాజు అన్నారు. ఆయ‌న‌పై న‌మ్మకంతో సినిమా చేశాను. సార‌థి స్టూడియోలో నానితో ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ అయ్యింది. నేను, న‌రేశ్‌, నాని క‌లిసి చాలా ట్రిప్స్‌కు వెళ్లాం. త‌న‌కు థ్యాంక్స్‌’’ అన్నారు.

మనతో పాటు ఇంటికి తీసుకెళ్లే సినిమా
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ – ‘‘రాజుగారితో పాటు నాకు ఈ సినిమాను చూడ‌మ‌న్నప్పుడు.. ‘ఇంత మంచి సినిమా, ఎంతో బాగా చేశారు. దీన్ని ట‌చ్ చేయ‌కండి’ అని నా ఒపీనియ‌న్ చెప్పాను. తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నార‌ని నా ద‌గ్గ‌ర ప్ర‌స్తావ‌న వ‌చ్చిన ప్ర‌తిసారీ తెలుగులో ఈ సినిమాను తీయ‌కూడ‌ద‌ని నేను చెప్పేవాడిని. కానీ.. ఈ సినిమాలో శ‌ర్వానంద్‌, స‌మంత చేస్తున్నార‌ని అనౌన్స్ చేయ‌గానే ఈ సినిమాను తెలుగులో ఎప్పుడు చూస్తామా? అనిపించింది. ట్రైల‌ర్ చూసిన‌ప్పుడు ఆ న‌మ్మ‌కం నిజ‌మైంది. త‌మిళంలో నేను ఏదైతే చూశానో అదంతా పోయింది. ఇప్పుడు రామ్, జాను అంటే శ‌ర్వా, సామ్‌లే గుర్త‌కొస్తున్నారు. త‌మిళంలో సినిమాను డైరెక్ట్ చేసిన ప్రేమ్‌కుమారే ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. కాబ‌ట్టి ఫీల్ ఎక్క‌డా మిస్ అయ్యుండ‌దు. శ‌ర్వా.. నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చినప్పుడు నా తొలి ఫ్రెండ్. శ‌ర్వా, సామ్ ఇద్ద‌రూ మంచి పెర్ఫామెర్స్‌. పోటీ ప‌డి న‌టించారు. శ‌ర్వా ఏ సినిమా చేసినా స‌రే! వాడికి మాత్రం చాలా మంచి పేరు వ‌స్తుంటుంది. ఈ సినిమాకు మంచి పెర్ఫామర్ అవ‌స‌రం. అందుక‌నే త‌మిళంలో విజ‌య్‌సేతుప‌తిని, తెలుగులో శ‌ర్వానంద్‌ని తీసుకున్నారు. ఇక సామ్ గురించి చెప్పాలంటే.. త‌న‌ను చూసి.. త‌ను ఎంచుకుంటున్న సినిమాల‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను. ప్ర‌తి సంవత్స‌రం ప‌ది మంచి సినిమాలున్నాయంటే అందులో రెండు, మూడు స‌మంత సినిమాలుంటున్నాయి. ఇప్పుడు త‌న లిస్టులో మ‌రొక‌టి జాయిన్ అవుతుంది. రాజుగారి కౌంటింగ్ సంక్రాంతి నుండి స్టార్ట్ అయ్యింది. మ‌ళ్లీ ఫిబ్రవ‌రి 7 నుండి మళ్లీ స్టార్ట్ అయ్యి మార్చి 25వ‌ర‌కు కంటిన్యూ అవుతుంది. అక్క‌డి నుండి నేను చూసుకుంటా. అలాగే శిరీష్‌గారికి కంగ్రాట్స్‌. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌రే కాదు.. రాజుగారికి ఎప్ప‌టికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. కొన్ని సినిమాల‌ను చూసి ఎంజాయ్ చేస్తాం. కొన్నింటిని ఎంజాయ్ చేయ‌డ‌మే కాదు.. ఇంటికి కూడా తీసుకెళ‌తాం. అలా ఇంటికి తీసుకెళ్లే సినిమాల్లో ‘జాను’ ఒక‌టి. ఎంటైర్ యూనిట్‌కి కంగ్రాట్స్‌’’ అన్నారు.
జూనియర్ శర్వానంద్‌గా(రామ్ పాత్రలో) నటించిన సాయికిర‌ణ్ మాట్లాడుతూ – ‘‘నాకు అవ‌కాశం ఇచ్చిన దిల్‌రాజు, శిరీష్‌గారికి థ్యాంక్స్‌. ప్రేమ్‌కుమార్‌గారు మేజిషియ‌న్‌. నాకు ఎంతో స‌పోర్ట్ అందించారు. యంగ్ రామ్ పాత్ర‌లో న‌టించినందుకు హ్యాపీగా ఉంది. కిర‌ణ్‌గారు చాలా మంచి డైలాగ్స్ రాశారు. స‌మంత‌గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఆమెతో క‌లిసి సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది’’ అన్నారు.
జూనియర్ సమంతగా(జాను చిన్నప్పటి పాత్రలో) నటించిన గౌరి మాట్లాడుతూ – ‘‘96’ సినిమాను నా డెబ్యూ మూవీగా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. జాను సినిమాతో అదే పాత్రను చేయడం మరింత అదృష్టంగా భావిస్తున్నాను. ప్రేమ్‌కుమార్‌గారు నా పాత్ర‌ను అద్భుతంగా మ‌లిచారు. స‌మంత‌గారి చిన్న‌ప్ప‌టి పాత్ర‌లో న‌టించ‌డం గౌర‌వంగా ఉంది. మేం మేజిక్‌ను రీ క్రియేట్ చేశాం. ప్రేక్ష‌కుల అభిమానాలు, ఆశీస్సులు ఉంటాయ‌ని భావిస్తున్నాను’’ అన్నారు.


ఇంకా ఈ సినిమాలో ఎంటైర్ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.


శర్వానంద్ ‘శ్రీకారం’ ఏప్రిల్ 24 విడుదల

యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘శ్రీకారం’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం దీని షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
ఇటీవల చిత్ర బృందం ఆవిష్కరించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు చాలా మంచి స్పందన వచ్చింది. తాజాగా నిర్మాతలు సినిమా విడుదల తేదీ ప్రకటించారు. ఏప్రిల్ 24న ‘శ్రీకారం’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

సినిమాల విడుదలకు సమ్మర్ అతి పెద్ద సీజన్ అనే విషయం తెలిసిందే. ‘శ్రీకారం’తో సమ్మర్ హాలిడేస్ ను క్యాష్ చేసుకోవడానికి శర్వానంద్ రెడీ అవుతున్నారు. కిషోర్ బి. డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో శర్వానంద్ జోడీగా ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది.

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ మూవీని నిర్మిస్తున్నారు. ‘గద్దలకొండ గణేష్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వాళ్లకు ఇది రెండో చిత్రం.
‘గద్దలకొండ గణేష్’ మూవీతో మాస్ ట్యూన్స్ కూడా ఇస్తానని నిరూపించుకొని మంచి ఫామ్ లో ఉన్న మిక్కీ జె మేయర్ ‘శ్రీకారం’కు వినసొంపైన బాణీలు అందిస్తున్నారు. పేరుపొందిన రైటర్ సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తుండగా, జె. యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

తారాగణం:
శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్, రావు రమేష్, ఆమని, సీనియర్ నరేష్, సాయికుమార్, మురళీ శర్మ, సత్యా, సప్తగిరి

సాంకేతిక వర్గం:
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
డైరెక్టర్: కిషోర్ బి.
మ్యూజిక్: మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
ఆర్ట్: అవినాష్ కొల్లా
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా


పిబ్ర‌వ‌రి 7న విడుదలవుతున్నయూత్ ఫుల్ ఎంటర్‌టైన‌ర్ ‘త్రీ మంకీస్

పిబ్ర‌వ‌రి 7న విడుదలవుతున్నయూత్ ఫుల్ ఎంటర్‌టైన‌ర్ ‘త్రీ మంకీస్’.

జబర్దస్థ్ షో ద్వారా బుల్లితెరపై ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ బిగ్ స్క్రీన్‌పై ‘త్రీ మంకీస్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. కారుణ్య చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ జి. దర్శకత్వంలో నగేష్ జి. ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం పిబ్ర‌వ‌రి 7న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో,.

దర్శకుడు అనిల్ మాట్లాడుతూ – ‘త్రీ మంకీస్’ ఇప్పటి వరకు నేను భరించాను. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వదులుతున్నా జబర్దస్త్ ని మించి ఈ సినిమా ఉంటుంది. కామెడీ తోపాటు అన్ని అంశాలుంటాయి. ప‌క్కా పైసా వసూల్ చిత్రమిది. ఈ సినిమాలో సుధీర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, గెటప్ శ్రీను అప్ కమింగ్ డైరెక్టర్‌గా, రాంప్రసాద్ సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్ గా క‌నిపిస్తారు. ఇక హీరోయిన్ కారుణ్య సన్నీలియోన్ గా మిమ్మ‌ల్ని అలరిస్తుంది. రేపు థియేటర్ లో సినిమా చూసి తప్పకుండా ఎమోషన్ అవుతారు“అన్నారు.

చిత్ర నిర్మాత నగేష్ – “ సినిమా పూర్తయి చాలా రోజులైంది మంచి టైమ్ కోసం వెయిట్ చేశాం ఫిబ్రవరి 7న
మంచి టైమ్ గా భావిస్తున్నాం ‘త్రీ మంకీస్’ టైటిల్ కి సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్ర‌సాద్ యాప్ట్ అనేలా పెర్‌ఫామ్ చేశారు. నాకు మా బేన‌ర్‌కి మంచి పేరు చిత్రమవుతుంది“ అన్నారు.

సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ – “శ్రీను, రాంప్రసాద్ ఈ ఇద్ద‌రే నా బలం. మేము ముగ్గురం కలిసి సరదాగా నటించాం.
కామెడీతోపాటు సెంటిమెంట్, ఎమోషన్స్ ఉంటాయి. ఈ సినిమా విజ‌య‌వంతం చేసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం“ అన్నారు.

గెటప్ శ్రీను మాట్లాడుతూ – ‘సినిమా విడుదల కోసం నేను మా టీమ్అంద‌రం చాలా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నాం ముగ్గురం
కలిసి నటించిన తొలి చిత్రమిది, ఫ్యామిలీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఉంటుంది“అన్నారు.

ఆటో రామ్ ప్ర‌సాద్ మాట్లాడుతూ – “జబర్దస్త్ లో మొదటి స్కిట్ చేసినప్పుడు ఎంత టెన్షన్ పడ్డామో, ఈ సినిమా కోసం అంతే టెన్షన్ గా వెయిట్ చేస్తున్నాం. అందులో సక్సెస్ అయ్యాం. సినిమా విషయంలో కూడా త‌ప్ప‌కుండా సక్సెస్ అవుతామని నమ్ముతున్నాను. మంచి సినిమాలను ఆడియెన్స్ ఆదరిస్తారు. మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా“ అన్నారు.

హీరోయిన్ కారుణ్య మాట్లాడుతూ – “ఇందులో డిఫరెంట్ రోల్ చేస్తున్నాను. నేను గతంలో ఎప్పుడూ ఇలాంటి పాత్ర చేయలేదు. ఈ పాత్ర‌ని నా కంటే దర్శకుడే ఎక్కువగా నమ్మారు ‘త్రీ మంకీస్’ తో క‌లిసి నటించడం హ్యాపీగా ఉంది“ అన్నారు

సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్ర‌సాద్, కారుణ్య త‌దిత‌రులు న‌టిస్తున్న ఆ చిత్రానికి
కథ, సంగీతం, దర్శకత్వం: అనిల్ కుమార్. జి,
నిర్మాత: నగేష్. జి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి బాబు వాసిరెడ్డి,
లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ సాయి,
సినిమాటోగ్రఫీ: సన్నీదోమల,
ఎడిటింగ్: ఉదయ్ కుమార్,
సంగీతం: అనిల్ కుమార్ జి.
మాటలు: అరుణ్. వి,
లిరిక్స్: శ్రీమణి,
పిఆర్ఓ: వంశీ – శేఖర్.


‘‘పలాస 1978’’ మూవీ నుండి నక్కిలీసు గొలుసు అనే సాంగ్ ను రిలీజ్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్

రక్షిత్ నటన నన్ను ఆశ్చర్య పరిచింది- ‘‘పలాస 1978’’ మూవీ నుండి నక్కిలీసు గొలుసు అనే సాంగ్ ను రిలీజ్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘‘పలాస 1978’’ . తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో
రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. డైరెక్టర్ కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ విడుదలకు ముందే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. జిఎ2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్న ఈ
మూవీ త్వరలో విడుదలకు సిద్దం అవుతుంది. ‘పలాస 1978’ సినిమా చూసి, టీం ని అభినందించి ‘పక్కన పడ్డాది చూడరో పిల్లా నాది నక్కిలీసు గొలుసు’ అనే పాటను టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ గారు లాంఛ్ చేసారు..

ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ గారు మాట్లాడుతూ:
‘దర్శకుడు కరుణ్ కుమార్ గారు రైటర్ గా ఉన్నప్పుటి నుండి నాకు తెలుసు, ఆయన కథలు కొన్ని నేను చదివాను చాలా బాగుంటాయి. దర్శకుడిగా తన తొలి ప్రయత్నంలోనే వాస్తవ సంఘటనల ఆధారంగా కథను రెడీ చేసుకొని ‘పలాస 1978’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు రక్షిత్ నటన నన్ను ఆశ్చర్యపరిచింది. కొత్త కుర్రాడు ఎలా చేస్తాడు అనుకున్నాను కానీ చాలా బాగా చేసాడు. పల్లెటూరి కుండే సంస్కృతిని తెరమీద ఆవిష్కరించే దర్శకులు తెలుగులో తక్కువ మంది ఉన్నారు. వారి కంటే దర్శకుడు కరుణాకుమార్ ముందడుగు వేసాడు. మిగతా వారు ఆయన్ను ఫాలో అవ్వాలి. ఇందులో పాటలు కూడా చాలా బాగున్నాయి. ఉత్తరాంధ్ర జానపదం చాలా ఫేమస్ మా కాలేజ్ రోజుల్లో కూడా ఆపాటలే పాడుకునే వాళ్ళం. అలాంటి ఉత్తరాంధ్ర జానపదం నుండి వచ్చిన ‘ పక్కన పడ్డాది చూడరో పిల్లా నాది నక్కిలీసు గొలుసు’ పాట చాలా బాగుంది. ఈ సినిమాకు మ్యూజిక్ ని అందించడమే కాకుండా ముఖ్య పాత్రను పోషించిన రఘ కుంచె ను అభినందిస్తున్నాను. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని
కోరుకుంటున్నాను’ అన్నారు.

రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్
సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్దం అవుతున్న ఈ చిత్రానికి పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం :
రఘు కుంచె,
పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా,
నిర్మాత : ధ్యాన్ అట్లూరి.
రచన- దర్శకత్వం : కరుణ కుమార్.



స్టార్ కమిడియన్ సంతానం హీరోగా సర్వర్ సుందరం ఫిబ్రవరి 14న విడుదల

స్టార్ కమిడియన్ సంతానం హీరోగా సర్వర్ సుందరం ఫిబ్రవరి 14న విడుదల !!

స్టార్ కమెడియన్ సంతానం హీరో గా తెరకెక్కిన సర్వర్ సుందరం తమిళ, తెలుగు భాషల్లో ఈ ప్రేమికులు రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదలకి సిద్ధం అయ్యింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన కమిడియన్ సంతానం ఈ కమర్షియల్ కామెడీ ఎంటెర్టైనెర్ లో హీరో గా ఆడియన్స్ ని ఫుల్ గా అలరించబోతున్నారు. అలానే ఈ సినిమాలో హీరోయిన్ వైభవి సంతానంకు జోడిగా నటించింది. ప్రముఖ నటుడు రాధా రవి ఈ మూవీలో కీలక పాత్రలో నటించడం జరిగింది.

కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు మాస్ ఆడియన్స్ కు కావాల్సిన యాక్షన్ సన్నివేశాలు ఈ మూవీలో ఉండడం విశేషం. బల్కి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను ఉదయ్ హర్ష వడ్డెల, డి.వెంకటేష్ నిర్మాతలు. ఫిబ్రవరి 14న తెలుగులో భారీ రేంజ్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి అని నిర్మాతలు తెలిపారు.

నటీనటులు:
సంతానం, వైభవి, రాధా రవి
దర్శకత్వం: బల్కి
నిర్మాతలు: ఉదయ్ హర్ష వడ్డెల, డి.వెంకటేష్
సంగీతం: శీలంబరసం
కెమెరామెన్: అభినందన్ రామనుజం
ఎడిటింగ్: అంథోని


‘అల.. వైకుంఠపురములో’ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు

* ‘అల.. వైకుంఠపురములో’ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు!
* తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను
– స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

“రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇదొక దాటుకుంటూ వెళ్ళిపోయే దశ. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో రికార్డ్ కొడతారు. ఈ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు. తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను” అన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మాటల మాంత్రికుడుగా పేరుపొందిన సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్,గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (నాన్-బాహుబలి) సాధించిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన థాంక్స్ మీట్ లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను షీల్డులతో సత్కరించారు.

ఈ వేడుకలో నటుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ, “ప్రేక్షకులందరికీ హత్తుకొన్నట్లే ఈ సినిమాలోని డైలాగ్స్ నాకు హత్తుకున్నాయి. పండగ పూట ఈ సినిమా రిలీజ్ చేశారు అని అనుకున్నాను కానీ, నా జీవితంలో ఈ సినిమాతో పండగ స్టార్ట్ అవుతుంది అని నాకు తెలియదు. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే నాకు రెండు పెద్ద సినిమాలు వచ్చాయి. చాలా థాంక్స్” అన్నారు.
నటుడు మురళీ శర్మ మాట్లాడుతూ, “మా నాన్నగారు పోయి ఇంకా ఒక సంవత్సరం కాలేదు. అప్పటినుంచి చూసుకుంటే ఈ సినిమాతో నాకు, నా ఫ్యామిలీకి ఎంత ఆనందం ఇచ్చారో మాటల్లో చెప్పలేను. త్రివిక్రమ్ గారూ.. థాంక్యూ సో మచ్. ఈ సినిమాతో చాలా కలలు నావి నిజమయ్యాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తండ్రిగా చేయడం ఒక పెద్ద కల. అది నెరవేరింది. గీతాఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్లలో పెద్ద క్యారెక్టర్ చేసి పేరు తెచ్చుకోవాలి అన్నది ఇంకో కల. అది కూడా నిజమైంది. త్రివిక్రమ్ ను మాటల మాంత్రికుడు అంటారు. కానీ ఆయన నా జీవితానికి ప్రేమ. ‘అల వైకుంఠపురంలో’ అనే కథ రాసినందుకు, అందులో వాల్మీకి అనే పాత్రను సృష్టించి దానికి నన్ను తీసుకున్నందుకు థాంక్స్. నాకు నిజంగా మాటల్లేవు. తమన్ రాక్ స్టార్. బన్నీ ఐ లవ్ యు. నేను సెట్లో బన్నీని చూడలేదు, బంటూని మాత్రమే చూశాను. అద్భుతమైన సహనటుడు. సినిమాకు ఈ రకమైన స్పందన ఇచ్చినందుకు ప్రేక్షకులకు థాంక్స్” అన్నారు.

నటుడు సుశాంత్ మాట్లాడుతూ, “ఎవరిమైనా సినిమా బాగా ఆడాలని కోరుకుంటాం. అయితే ఇంత హిట్టవుతుందని నాకు తెలియదు. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి అందరూ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నేను చూశాను. ఫలితం ఇలా వచ్చినందుకు చాలా హ్యాపీ. టీం మొత్తానికి నా అభినందనలు. ప్రేక్షకులు ఈ సినిమాని ఈ స్థాయి హిట్ చేసినందుకు థాంక్స్. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్.. నాన్ బాహుబలి రికార్డ్స్ ఈ చిత్రం సొంతం. బన్నీ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది డాన్స్. ఇందులో గొప్పగా నటించాడు. త్రివిక్రమ్ గారితో పని చేసేటప్పుడు చాలా నేర్చుకున్నాను. నా తర్వాతి సినిమాకి వాటిని అమలుచేయడానికి ప్రయత్నం చేస్తాను. అల్లు అరవింద్ గారు, చినబాబు గారు చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. తమన్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ‘రాములో రాములా’ వంటి మంచి పాటలో నేను కూడా డ్యాన్స్ చేసినందుకు సంతోషంగా ఉంది” అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నుంచి షీల్డ్ అందుకున్న ఆదిత్య మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య మాట్లాడుతూ, “తమన్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఇవి మేము గర్వపడే క్షణాలు. సంగీత పరంగా ఈ సినిమా ఆల్ టైం హిట్ అయింది. సినిమా కూడా అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

తమన్ మాట్లాడుతూ, “క్రికెట్లో హ్యాట్రిక్ అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఇక్కడ కూడా హ్యాట్రిక్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. త్రివిక్రమ్ కు, బన్నీకి హ్యాట్రిక్. నాకు, బన్నీకి ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’ తర్వాత ఇది హ్యాట్రిక్. అందుకే మొత్తం ఎనర్జీ ఈ సినిమాకి పని చేసింది. మా టెక్నీషియన్స్ అందరూ 100 శాతం బెస్ట్ వర్క్ ఇచ్చారు. కలెక్షన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చాయి. ఇండస్ట్రీ హిట్ కావటం వెరీ వెరీ హ్యాపీ. ఇది చాలా అరుదుగా జరిగే విషయం. ఇండస్ట్రీకి, సినిమాకి చాలా మంచిది. ‘అల వైకుంఠపురములో’ ఈ రికార్డ్స్ క్రియేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక ఆల్బమ్ హిట్టయితే మ్యూజిషియన్స్ కు చాలా హెల్ప్ అవుతుంది. కచేరీల్లో పాటలు పాడుకోవచ్చు. సీతారామశాస్త్రి గారు, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ చాలా బాగా పాటలు రాశారు. ఇప్పటిదాకా నేను పనిచేసిన టీమ్స్ లో ఇది బెస్ట్ టీం. కొంతమంది హీరోలు పాటల్ని ఇంకో స్థాయికి తీసుకెళ్తారు. బన్నీ అలాంటి హీరో. త్రివిక్రమ్ గారితో పని చేయటం ఒక మ్యాజిక్. నా జీవితంలో అలాంటి వ్యక్తిని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా హృదయంలో నా మనసులో ఆయన చాలా మార్పులు తీసుకువచ్చారు. నాలో ఒక కొత్త నరం వేశారు. అల్లు అరవింద్ గారు, రాధాకృష్ణ గారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా మంచి సినిమా ఇచ్చారు. ఈ సక్సెస్ నా జీవితంలో ధైర్యాన్ని ఇచ్చింది. ఇంకా కొంచెం ప్రయోగాలు చేయొచ్చు అనే శక్తినిచ్చింది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ముందు ముందు మరింత కష్టపడి మరింత మంచి మ్యూజిక్ ఇవ్వడానికి కృషి చేస్తాను” అని చెప్పారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, “మేము తీశాము, మీరు చూశారు. మేము తీయటానికి మీరు చూడటానికి మధ్య డిస్ట్రిబ్యూటర్లు అనే వారధులు ఉన్నారు. సినిమాని మీకు (ప్రేక్షకులకు) చూపించడానికి మాకు డబ్బులు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ ని, ఎగ్జిబిటర్స్ ని గౌరవించుకోవడం మా విధి. నేను ‘విజేత’ సినిమా నుంచి పదుల సంఖ్యలో చిరంజీవి గారి సినిమాలకు పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసి, షీల్డులు ఇస్తూ వచ్చాను. ఇప్పుడు సినిమా ఆడే రోజులు తగ్గిపోయి, లెక్కలు కలెక్షన్ల కింద, రెవెన్యూ కింద మారిపోయాక ఈ ఫంక్షన్ లు లేకుండా పోయాయి. కానీ మళ్లీ ఈ రోజుకి ఇంత ఆల్ టైం రికార్డు కొట్టడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు.

దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ, “ఇంత ప్రేమగా మమ్మల్ని దగ్గరకు తీసుకొని పాటల దగ్గర్నుంచి ఇక్కడిదాకా నడిపించి ఆశీర్వదించిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా మా అందరి తరపున కృతజ్ఞతలు, నా పాదాభివందనం” అన్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ, “గీతా ఆర్ట్స్ లో ప్రొడక్షన్ కంపెనీయే కాకుండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఉంది. ఎప్పుడైనా ఆఫీసు వైపు వెళ్ళినప్పుడు ‘ఏవండీ ఎప్పుడూ సెలబ్రేషన్ మీరేనా చేసుకునేది, మమ్మల్ని జనం దగ్గరికి తీసుకెళ్ళరా, మమ్మల్ని పట్టించుకోరా, మాకు షీల్డ్స్ ఇచ్చి సత్కరించరా?’ అని అడిగేవాళ్లు. ‘అంత సినిమా వచ్చినప్పుడు కచ్చితంగా చేస్తాను’ అని చెప్పేవాడిని. నిజంగా అలాంటి సినిమా ఇప్పుడు వచ్చింది. మాకు ఆ అవకాశం ఇచ్చింది ప్రేక్షకులు. మా టీం కలిసి చేసింది 50 శాతం అయితే ప్రేక్షకుల దగ్గరకు సినిమాని తీసుకువచ్చింది 50 శాతం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు. వాళ్లందరికీ చాలా కృతజ్ఞతలు. నాతో పని చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరి తరఫున ప్రేక్షకులకు థాంక్స్ చెబ్తున్నా. నిర్మాతలు రాధాకృష్ణ గారికి, అల్లు అరవింద్ గారికి నా ధన్యవాదాలు. మా నాన్నను ఎలా సంబోధించాలా అని ఒక్కోసారి నాకు కన్ఫ్యూజన్ వస్తుంటుంది. మా నాన్న నన్ను పరిచయం చేస్తూ ‘గంగోత్రి’, తర్వాత ‘బన్నీ’, ఇంకా ఎన్నో హిట్లిచ్చారు. రాధాకృష్ణ గారితో మొదటిసారి ‘జులాయి’ చేశాను. అది సక్సెస్ ఫుల్ ఫిలిం. తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చేశాను. వీళ్ళిద్దరూ నాకు బెస్ట్ ప్రొడ్యూసర్లు. ఇద్దరితో సూపర్ హిట్స్ కొట్టాను కానీ ఇద్దరూ కలిస్తే ఆల్ టైం రికార్డ్ హిట్ వచ్చింది. ఇద్దరికీ చాలా థ్యాంక్స్. నేను ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది.. బన్నివాసు, వక్కంతం వంశీకి. ఎప్పటి నుంచో నేను త్రివిక్రమ్ తో సినిమా చేయాలనుకుంటున్నా కానీ ఆయనతో చేస్తే బాగుంటుంది అని నాకు బూస్ట్ ఇచ్చింది, త్రివిక్రమ్ గారిని తీసుకొచ్చింది వాళ్ళిద్దరు. వాళ్లకి థాంక్స్. అలాగే నేను ఎక్కువగా గడిపే నా పర్సనల్ స్టాఫ్ కు థాంక్స్. ఇంత పెద్ద హిట్ వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తో సెలబ్రేషన్స్ చేసుకోవడం మా బాధ్యత. ఇక రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇదొక దాటుకుంటూ వెళ్ళిపోయే దశ. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో రికార్డ్ కొడతారు. ఈ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు. తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం.. ‘సిత్తరాల సిరపడు’ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. అందులో నేను సిగరెట్ తాగుతాను. అది సినిమాలో ఆ క్యారెక్టర్ ని బట్టి చేసింది. నిజజీవితంలో అది మంచిది కాదు. పిల్లలు స్మోక్ చేయవద్దు. పిల్లలే కాదు పెద్దలు కూడా స్మోక్ చెయ్యొద్దని కోరుకుంటున్నాను. అది ఆరోగ్యానికి హానికరం. దయచేసి పొగ తాగకండి. మరోసారి నా అభిమానులకు, నా ఆర్మీకి థాంక్స్ చెప్పుకుంటున్నాను. కేవలం మీ ప్రేమ వల్లే ఇంత దూరం వచ్చాను. ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించిన తెలుగు ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్” అని చెప్పారు.
ఈ ఈవెంట్ లో డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు అల్లు అర్జున్, సుశాంత్, త్రివిక్రమ్ షీల్డులను బహూకరించారు. అలాగే చిత్ర నటీ,నటులకు, సాంకేతిక నిపుణులకు షీల్డ్స్ బహుకరించారు. ఈ చిత్రం నైజాం, వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, సీడెడ్ ఏరియాల్లో ‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్ (నాన్-బాహుబలి) అయిందని డిస్త్రి బ్యూటర్స్ తెలిపారు. సుమతో పాటు నటుడు బ్రహ్మాజీ కూడా ఈ ఈవెంట్ కు యాంకర్ గా వ్యవహరించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.


మాదాపూర్ లో గర్ల్ ఫ్రెండ్ అరేబియన్ మండి రెస్టారెంట్‌ ని సినీనటి పాయల్ రాజపుట్, అచ్చం పేట MLA బాలరాజు మరియు బిగ్ బాస్ ఫేమ్ భాను శ్రీ కలసి ప్రారంభించారు.

Category : News Sliders


అద్భుతమైన థీమ్‌ తో గర్ల్ ఫ్రెండ్ రెస్టారెంట్‌ మాదాపూర్ లో కొలువుదీరింది. ఈ రెస్టారెంట్‌కి ఎన్నో వినూత్న, విశేషాలు ఉన్నాయి. యువతను ఆకట్టుకునే విభిన్న రకాల అంశాలు, పరిసరాలు దీనికి కొత్త శోభను ఇస్తున్నాయి. రెస్టారెంట్‌ ప్రాంగణంలో పరచుకున్న పచ్చదనం ఆహ్లాదకరమైన అనుభూతిని అతిధులకు అందిస్తుంది. అత్యంత ఆనందదాయకమైన, హృదయాన్ని స్పర్శించే రుచుల ఆస్వాదనను అందిస్తామని నిర్వాహకులు తమ అతిధులకు హామీ ఇస్తున్నారు.

రుచులెన్నో…
థీమ్, యాంబియన్స్‌లో మాత్రమే కాకుండా గర్ల్ ఫ్రెండ్ రెస్టారెంట్‌ విభిన్న రకాల రుచులను వడ్డించడంలోనూ అతిధుల అభి‘రుచుల’కు పెద్ద పీట వేస్తోంది.

గర్ల్ ఫ్రెండ్ అరేబియన్ మండి రెస్టారెంట్ ప్రారంభ సందర్భంగా సినీ నటి పాయల్ రాజపుట్ మాట్లాడుతూ ‘‘ గర్ల్ ఫ్రెండ్ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఈ రెస్టారెంట్‌ పేరు కూడా చాలా కొత్తగా ఉంది మరియు థీమ్, అందమైన పరిసరాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. తమ కస్టమర్ల మనస్సులను గర్ల్ ఫ్రెండ్ రెస్టారెంట్ తప్పకుండా ఆకట్టుకుంటుందని, నాణ్యమైన, రుచికరమైన ఫుడ్‌తో ఆదరణ పొందుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ రెస్టారెంట్‌ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అన్నారు.

ఈ సందర్భంగా నిర్వహకులు నంద్ధిని మాట్లాడుతూ మా రెస్టారెంట్‌కి వచ్చిన కస్టమర్లు అందరికీ ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తామని మేం హామీ ఇస్తున్నాం. మాదాపూర్ సిటీ వాసులకు ఈ థీమ్‌ బాగా నచ్చుతుందని మా నమ్మకం. ప్రతి టేబుల్‌ మీదా వారికి నచ్చే వంటకాలను అందించగలమని నమ్ముతున్నాం’’అని అన్నారు


హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నవంబర్ 27న ‘మైదాన్`.


ప్రపంచంలో అత్యధిక మంది ఆదరించే ఫుట్ బాల్ ఆట నేపథ్యంలో యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం `మైదాన్`. భారత దేశాన్ని ఫుట్ బాల్ రంగంలో ప్రపంచ పటంలో నిలిపిన ఒక కోచ్ నిజ జీవిత కథ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. జీవితంలో అయినా, ఆటలో నైనా ఆత్మ విశ్వాసం, కష్టపడే తత్వంతో పాటు ఎన్నో త్యాగాలు చేస్తేనే విజయం వరిస్తుంది. క్రీడా నేపథ్యంలో స్ఫూర్తిమంతమైన కథగా మైదాన్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేశారు. `బధాయి హో` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కోల్ కత్తా, లక్నో, ముంబై నగరాల్లో 50 రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఏప్రిల్ కి చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది.

నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి, `బధాయి హో` ఫేమ్ గజరాజ్ రావు, పాపులర్ బెంగాలీ యాక్టర్ రుద్రనిల్ ఘోష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న`మైదాన్` చిత్రాన్ని జీ స్టూడియోస్, బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ను సైవిన్ కాద్రస్, రితేష్ షా అందిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మైదాన్ నవంబర్ 27, 2020న విడుదల అవుతోంది.


యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్‌ ఇలా అన్ని అంశాలు ఉన్న ‘అశ్వథ్థామ` త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంది – దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు

యంగ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై రమణ తేజ దర్శకత్వంలో ఉష ముల్పూరి నిర్మించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘అశ్వథ్థామ`. మెహ‌రీన్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నసందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో. నిర్మాతలు శంకర్‌ ప్రసాద్, ఉషా ముల్పూరి, లైన్‌ ప్రొడ్యూసర్‌ బుజ్జి పాల్గొన్నారు.

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ – “నేను చిన్న సినిమాలు చూస్తుంటాను. కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న దర్శకులు, సాంకేతిక నిపుణులు మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. నటుడిగా నాగశౌర్య ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలడు. గడ్డం తీస్తే క్లాస్‌గా కనిపిస్తాడు. గడ్డం ఉంటే ఫైటర్‌గా ఉంటాడు. కీరిటం పెడితే కృష్ణుడిలా, క్యాప్‌పెడితే కౌబాయ్‌లా ఉంటాడు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘ఛలో’ వంటి సినిమాలు సక్సెస్ సమయంలో నా కన్ను నాగశౌర్యపై పడింది. దేవి కటాక్షం కోసం చూస్తున్నాం నేను ‘అశ్వథ్థామ’ చిత్రం చూడలేదు. కానీ ఈ చిత్రం నా ఊహకు ఓ కమర్షియల్‌ కుంటుంబ కథా చిత్రంగా అనిపిస్తుంది. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్‌ ఇలా అన్ని అంశాలు ఉన్న ఈ చిత్రం హిట్ సాధిస్తుంది. ‘అశ్వథ్థామ’ చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌. నాగశౌర్య తన కెరీర్‌లో ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలి’’ అన్నారు.

యంగ్‌ హీరో నాగశౌర్య మాట్లాడుతూ – “రాఘవేంద్రరావుగారి ఆశీస్సులతో ఈ సినిమా మొదలైంది. ఆయన చేయి చాలామంచిదని అంటుంటారు. మా సినిమా ప్రొడక్ట్‌ బాగా వచ్చింది. దాదాపు నెలరోజుల నుంచి ఈ సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నాను. శుక్రవారం మా సినిమా విడుదల అవుతుంది. అప్పుడు ప్రేక్షకుల అభిప్రాయాలను నా చెవులతో వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ చిత్రం నాకొక మంచి ఎమోషన్ జర్నీ అని చెప్పగలను. ఇందులో కొత్త శౌర్యను చూస్తారు. నేను కన్న ఈ సినిమా దీని కోసం మా టీమ్‌ అంత చాలా కష్టపడ్డారు. నాకు కథ చెప్పి దర్శకుడు అవుదామని వచ్చిన ఫణి నా మాట విని ఈ సినిమాకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చరణ్‌తేజ్‌ అందించిన సంగీతం శ్రోతలకు కనెక్ట్ అయింది. జిబ్రాన్‌ మంచి నేపథ్యసంగీతం సమకూర్చారు. ఇంకా ఎడిటర్‌ గ్యారీ, కెమెరామన్‌ మనోజ్‌ డైలాగ్‌ రైటర్స్‌ సురేష్,భాస్కర్‌ ఇలా అందరు బాగా కష్టపడ్డారు. కష్టపడి సినిమాను నిజాయితీగా తీశాం. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు

చిత్ర ద‌ర్శ‌కుడు రమణతేజ మాట్లాడుతూ – “ఇక్క‌డికి వచ్చిన రాఘవేంద్రరావుగారికి ధన్యవాదాలు. మూవీ ఓపెనింగ్‌ రోజు ఆయన వచ్చారు. ఇప్పుడు రిలీజ్‌ సందర్భంగా మళ్లీ మాకు సపోర్ట్‌గా వచ్చారు. ఈ సినిమాను రమణతేజ బాగా తీశాడని చెప్పుకుంటున్నారు. కానీ నాగశౌర్య మంచి కథను అందించారు. నాగశౌర్య సపోర్ట్‌ మరవలేనిది. ఇక ఈ సినిమా రిజల్ట్‌
గురించి పక్కన పెడితే..ఓ మంచి కారణంతో తీశాం. ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు

ఐరా క్రియేషన్స్‌ డిజిటల్‌ డైరెక్టర్‌ గౌతమ్ మాట్లాడుతూ – “మా తమ్ముడు ఇప్పటివరకు 17 సినిమాలు చేశాడు. ఇది 18వ
సినిమా. ప్రతి సినిమాకు నేను ఎదొఒక కంప్లైట్‌ చేసేవాడిని. ఈ సినిమాకు అలా ఏం లేదు. తనలోని యాక్టర్‌కిపోటీ పడేలా రైటర్, తన లోని రైటర్‌కు పోటీగా యాక్టర్‌ అంటూ చేశాడు శౌర్య. రమణతేజ ఈ సినిమాను బాగా తీశారు. డిజిటల్‌ పబ్లిసిటీ క్రెడిట్‌ నా ఒక్కడిదే కాదు. టీమ్‌ అందరిదీ. సహకరిస్తున్న మీడియాకు ధన్యవాదాలు’’ అన్నారు .

న‌టుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ – ‘‘సమాజంలోమహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను ఎదిరించే వ్యక్తిత్వం ఉన్నావాడు ‘అశ్వథ్థామ’. ఈ చిత్రం ఐరా క్రియేషన్స్‌లో మంచి చిత్రంగా నిలుస్తుంది. ఒకప్పుడు భాగ్యరాజ్, రాజేంద్రన్‌ వంటివారు వారే
కథ రాసుకుని హీరోగా రాసేవారు. ఈ సినిమాకు నాగశౌర్య అలా చేశారు’’ అన్నారు

ఈ కార్యక్రమంలో కెమెరామన్‌ మనోజ్, ఎడిటర్‌ గ్యారీ, డైలాగ్‌ రైటర్‌ పరశురామ్,కో డైరెక్టర్‌ అంకిత్, శ్రీనివాసరెడ్డి ప్ర‌సంగించి సినిమా విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు.

నాగశౌర్య, మెహరీన్‌ హీరోహీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్‌ రెడ్డి, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: జిబ్రాన్‌, ఎడిటింగ్‌: గ్యారీ బి.హెచ్‌, డిజిటల్‌: ఎం.ఎస్‌.ఎస్‌. గౌతమ్‌, డైలాగ్స్‌: పరుశురాం శ్రీనివాస్‌, యాక్షన్‌: అన్బరివు, కొరియోగ్రఫీ: విశ్వ రఘు, లైన్‌ ప్రొడ్యూసర్‌: బుజ్జి, నిర్మాత: ఉషా ముల్పూరి, కథ: నాగశౌర్య, కో డైరెక్టర్‌ అంకిత్, శ్రీనివాసరెడ్డి, దర్శకత్వం: రమణ తేజ.