Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
ప్రస్తుతం సినిమాల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే మౌత్ టాక్ సరిగ్గా లేకపోతే మొదటి ఆట తరువాత కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయి. మొదటి ఆట ముగిసే సమయానికి సినిమా జాతకం అంతా బయటకు వచ్చేస్తోంది. సినిమాకు మంచి టాక్ వస్తేనే ఆ తరువాత నిలబడుతోంది. లేదంటే ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమా అయినా ప్లాప్‌ల లిస్టులో చేరిపోతోంది.
టాలీవుడ్ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ టైమ్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షోను ప్రేక్షకులను ఉచితంగా చూపించాలంటే నిర్మాతలకు ఎంత ధైర్యం కావాలి. అలాంటి సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నారు ‘పగ పగ పగ’ చిత్ర నిర్మాతలు. సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తొలిసారిగా విలన్ పాత్రలో కనిపిస్తుండటం విశేషం. వినోదంతో కూడిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని డైరెక్టర్ రవి శ్రీ దుర్గా ప్రసాద్ తెరకెక్కించారు. ప్రొడ్యూసర్ సత్య నారాయణ సుంకర ఖర్చుకు వెనుకాడకుండా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న నటిస్తున్న ఈ చిత్రానికి కోటి సంగీతం అందించారు.
ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్, మూవీ మోషన్ పోస్టర్, కోటి పాత్రకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందన్న నమ్మకంతో నిర్మాతలు టాలీవుడ్ చరిత్రలోనే ఇప్పటివరకు ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘పగ పగ పగ’ చిత్రాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో అందరికీ ఉచితంగా చూపించాలని నిర్ణయించుకున్నారు. ఈ డేరింగ్ స్టెప్‌తో ఇండస్ట్రీలోని వర్గాలు అవాక్కవుతున్నాయి. అయినప్పటికీ సినిమా మీదున్న నమ్మకంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా నవీన్ కుమార్ చల్లా, ఎడిటర్‌గా పాపారావు వ్యవహరించారు. రామ్ సుంకర ఫైట్ మాస్టర్‌గా పని చేశారు. నిర్మాతలు తీసుకున్న ఈ డేరింగ్ డెసిషన్ సక్సెస్ అయి టాలీవుడ్‌కి మరో మంచి హిట్ దక్కాలని కోరుకుందాం..
భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ విజయవంతం కావడంతో హైదరాబాద్ సంస్థానంపై ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పట్టు చేజారిపోయింది. 1948, సెప్టెంబర్ 17న తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత ప్రభుత్వం ఆయన్ని రాజ్‌ప్రముఖ్‌గా గుర్తించింది. ఇక్కడివరకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ తర్వాత ఏడో నిజాం ఏం చేశారు?.. ఎక్కడున్నారు?.. ఎలా చనిపోయారు?.. చివరి రోజుల ఎలా గడిపారు?.. అన్న సమాచారం చాలాకొద్ది మందికే తెలుసు.. స్వతంత్య్ర భారతదేశంలో ఆయన జీవితం ఎలా కొనసాగిందో ఈ కథనంలో తెలుసుకుందాం..
1948, సెప్టెంబర్ 17న నిజాం రాజు భారత ప్రభుత్వానికి లొంగిపోయినా 1950, జనవరి 25 వరకు సాంకేతికంగా ఆయనే హైదరాబాద్ పరిపాలకుడిగా ఉన్నారు. ఆ సమయంలో ఫర్మానాలన్నీ ఆయన పేరుమీదే జారీ అయ్యేవి. 1950 జనవరి 26న భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించడంతో హైదరాబాద్ అందులో ఓ రాష్ట్రమైంది . నిజాం హైదరాబాద్ రాష్ట్ర రాజ్ ప్రముఖ్ (గవర్నర్) గా ప్రమాణ స్వీకారం చేశారు . 1956 నవంబరు 1 న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం వరకు ఆయన రాజ్‌ప్రముఖ్ పదవిలో కొనసాగారు
1952 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. 1952 మార్చి 8న నిజాం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు . అయితే తన రాచరికం ముగిసి పోయిందని, తన ఫర్మానాలేవీ చెల్లవనే విషయం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తెలుసుకోలేకపోయారు. రాజ్ ప్రముఖ్ పదవిని కూడా కోల్పోయిన తర్వాత తర్వాత నిజాం… మాసాబ్ ట్యాంకుకు మూడు కిలో మీటర్ల దూరంలోని కింగ్‌కోఠిలో ఉన్న తన నివాసానికే పరిమితమయ్యారు తన భార్యలు , పిల్లలు , మనవలు , మునిమనవలు , సేవకులతో ఆ భవనంలోనే కాలం గడిపేవారు. తనను ఇంకా రాజుగానే భావిస్తూ ఫర్నానాలు జారీ చేస్తుండేవారు. కానీ వాటిని ఎవరూ పట్టించుకునేవారు కాదు. కింగ్ కోఠీలో ఉండేవారి స్థాయికి తగినట్టుగా వారి భోజనంలో ఉండాల్సిన పదార్థాల జాబితా తయారుచేయడం, ఎవరికైనా రోగం వస్తే వారికి తన పరిజ్ఞానాన్నంతా ఉప యోగించి యునానీ వైద్యం చేయడం… ఇవే ఆయన వ్యాపకాలు. అయితే మందులు తీసుకున్నవారంతా వాటిని వేసుకోకుండా అల్లోపతి మందులే వాడేవారు. రోగం నయం కాగానే నిజాం దగ్గరికి వచ్చి ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తేవారు.
ఆస్తి కరిగిపోతుంటే .. కూర్చుని తింంటే కొండైనా కరుగుతుందన్న సామెత నిజాం ఆస్తుల విషయంలో నిజమైంది. నిజాం రాజులు కూడబెట్టిన ఆస్తులన్నీ మీర్ ఉస్మాన్ అలీఖాన్ వారసుల హయాం వచ్చే సరికి వేగంగా కరిగిపోవడం మొదలైంది. దీంతో ఆయన కొడుకులను గట్టిగా హెచ్చరించినా వారిలో మార్పు రాలేదు. దీంతో తన ఆర్థిక సలహాదారుల సలహా మేరకు వివిధ ట్రస్టులు ఏర్పాటు చేసి కుటుంబసభ్యుల ఖర్చులకు ట్రస్టుల ద్వారానే డబ్బు ఇచ్చే ఏర్పాటు చేశారు. ఇలా మొత్తం 47 ట్రస్టులు ఆయన ఏర్పాటు చేశారు. నిజాం కుటుంబంలో ఆడపిల్లకు పెళ్లయితే వారికి ఓ ఇల్లు, జీవితాంతం నెలకు రూ .4 వేల చొప్పున నజరానా వచ్చేలా ఓ ట్రస్టుు ద్వారా ఏర్పాటు చేశారు. ఆయన పాకెట్ మనీకోసం ఓ ట్రస్టు, కొడుకుల ఖర్చులకు మరో ట్రస్టు ఏర్పాటుచేశారు.
1967 ఫిబ్రవరిలో నిజాం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఆయన అల్లోపతి వైద్యం చేయించుకునేందుకు నిరాకరించడంతో యునానీ వైద్యం అందించేవారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కీర్తిపొందిన నిజాం రాజు తన జీవితంలో ఎప్పుడూ అల్లోపతి వైద్యం చేయించుకోకపోవడం గమనార్హం. ఫిబ్రవరి 18న ఆయన పరిస్థితి మరింత దిగజారడంతో అల్లోపతీ వైద్యులు పరీక్షించేందుకు రాగా ఆయన కుమార్తె షహజాదీ పాషా వారిని అనుమతించలేదు. అదేరోజు మధ్యాహ్నం.. నిజాం భార్యల్లో ముగ్గురు హజ్ యాత్రకు బయల్దేరి వెళ్లారు. ‘ఇదే చివరిచూపు. మీరు వచ్చేసరికి నేను బతికుండను’ అని నిజాం వారితో చెప్పడంతో ఉద్విగ్న వాతావరణం చోటుచేసుకుంది.
20వ తేదీ నాటికి ఆయన స్పృహలో లేని పరిస్థితుల్లో నిజాం వైద్య సలహాదారు డాక్టర్ వాఘ్రే.. బంకత్ చందర్, జీపీ రామయ్య, సయ్యద్ అలీ అనే ముగ్గురు అల్లోపతి వైద్యులను రప్పించారు. డాక్టర్ రామయ్య నిజాం నాడి పట్టి చూశారు. ఆయనకు జ్వరంగా ఉందని ఇంజెక్షన్ చేయాలని చెప్పగా షహజాదీ పాషా మళ్లీ నిరాకరించారు. ఆయనకు కనీసం రక్తపరీక్ష చేయడానికి కూడా ఆమె ఒప్పుకోలేదు. ఆయన పరిస్థితి విషమించిందని డాక్టర్లు చెప్పడంతో లండన్‌లో ఉంటున్న మనవలు ముకరం జా, ముఫకం జాకు కబురు పంపారు.
1967 ఫిబ్రవరి 24న మధ్యాహ్నం వేళ నిజాం కన్నుమూశారు. డాక్టర్ రామయ్య స్టెతస్కో్‌ప్‌తో ఆయన గుండెను పరీక్షించి నిజాం మరణించినట్లుగా ప్రకటించారు. నిజాం రాజు ఒంటిని తాకిన మొట్టమొదటి ఆధునిక వైద్య పరికరం అది. నిజాం కార్డియాక్ ఫెయిల్యూర్‌తో మరణించినట్లు రామయ్య తెలిపారు. అయితే ఆయన మరణాన్ని బయటి ప్రపంచానికి వెంటనే తెలియజేయడానికి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. తమ ఆనవాయితీ ప్రకారం రాజు మరణించిన మూడు రోజుల తర్వాతే భీష్మించుకోగా అధికారులు వారికి నచ్చజెప్పారు. అప్పట్లో వారసులు ఎవరో తేల్చుకునే సమయం కోసమే అలా చేసేవారని.. ఇప్పుడా సమస్య లేదు కాబట్టి వెంటనే ప్రకటించాలని చెప్పి ఒప్పించారు.
ఫిబ్రవరి 25న ఉదయాన్నే నిజాం అంతిమసంస్కారాలు ప్రారంభించారు. నిజాం పార్థివదేహాన్ని హైదరాబాద్ నగరంలో ఊరేగింపుగా తీసుకెళ్తుంటే సుమారు 2 లక్షల మంది అక్కడికి చేరుకుని ఆయనకు నివాళులు అర్పించారు. గతంలో భాగ్యనగరం ఎన్నడూ అలాంటి జనసంద్రాని చూసింది లేదు. భారీ ఊరేగింపు అనంతరం ఉదయం 11 గంటల సమయంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ భౌతికకాయాన్ని ఖననం చేశారు. వేలాది ఎకరాల ఆస్తి, వందలాది మంది సైన్యంతో ఓ వెలుగు వెలిగిన నిజాం రాజును అలా చూసేసరికి చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన మరణంతో తెలంగాణలో చరిత్రలో ఓ శకం ముగిసినట్లయింది.
కొన్ని రోగాలు మందులు వాడితే తగ్గిపోతాయి. మరికొన్ని రోగాలైతే ఎన్ని మందులు వాడినా.. ఎంతకాలం గడిచినా మనిషిని పిప్పిపీల్చి చేస్తుంటాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో చాలామంది ఇలా దీర్ఘకాలిక రోగాల బారిన పడి కాలం వెళ్లదీస్తుంటారు. అయితే ప్రతిరోజు ధన్వంతరి మంత్రాన్ని పాటించడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఈ మంత్రం పాటించడం వల్ల తొందరగా ఈ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
శ్రీ ధన్వంతరీ మహామంత్రం ధ్యానం | అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణాఽమృత రోగాన్మే నాశయాఽశేషానాశు ధన్వన్తరే హరే | ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం స్వభక్తేభ్యోఽనుగృహ్ణన్తం వందే ధన్వన్తరిం హరిమ్ || ధన్వన్తరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠన్తి యే | అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవన్తి తే చిరమ్ ||
ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వభయవినాశాయ సర్వరోగనివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్యనిధయే శ్రీమహావిష్ణుస్వరూప శ్రీధన్వంతరీస్వరూప శ్రీ శ్రీ శ్రీ ఔషధచక్ర నారాయణాయ స్వాహా |
అర్థం: ‘‘సుదర్శన వాసుదేవ ధన్వంతరిగా ప్రసిద్ధుడైన దేవదేవునికి నమస్సులు. చేతిలో అమృత కలశాన్ని ధరించినవాడూ, అన్ని భయాలనూ పోగొట్టి, సర్వ రోగాలనూ నివారించేవాడూ, ముల్లోకాలకూ పతి, ముల్లోకాలకూ శ్రేయస్సు చేకూర్చేవాడూ, మహా విష్ణువుకు మారురూపమూ అయిన ధన్వంతరి కృప అందరినీ ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. ఆ ఆయుర్వేద పురుషుడికి నమస్సులు’’ అని భావం.
ఆకస్మిక, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకూ, వ్యాధుల వ్యాప్తి కారణంగా కలిగే భయాలన్నీ పోవడానికీ ధన్వంతరిని నిత్యం ప్రార్థించాలి. ‘‘వ్యాధి తొలగిపోవాలి. నేను సంపూర్ణ ఆరోగ్య వంతుణ్ణి కావాలి’’ అని మనసులో గాఢంగా సంకల్పించుకొని, ఈ ధన్వంతరీ మహా మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించినా, మననం చేసుకున్నా అపమృత్యు భయం తొలగిపోతుందనీ, ఆరోగ్యం సిద్ధిస్తుందనీ పెద్దల మాట.
అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ సమంత రుత్ ప్రభు. ‘ద ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్‌తో ఉత్తరాది వారికి కూడా చేరువైంది. దీంతో బాలీవుడ్ నుంచి కూడా ఆమెకు వరుసగా ఛాన్స్‌లు వస్తున్నాయని సమాచారం. ఇప్పటికే కొన్ని చిత్రాలకు సంతకం చేసిందని వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ మీడియాలో సామ్‌కు సంబంధించిన ఓ వార్త హల్‌చల్ చేస్తుంది.
బాలీవుడ్‌లో ‘హిందీ మీడియం’, ‘లూకా చప్పీ’, ‘స్త్రీ’ వంటి సినిమాలను నిర్మించిన ప్రతిష్ఠాత్మక సంస్థ మ్యాడ్ డాక్ ఫిలిమ్స్. తాజాగా ఓ హార్రర్ కామెడీని నిర్మించనుంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, సమంత హీరో, హీరోయిన్స్‌గా నటించనున్నారట. ఈ సినిమాలో సామ్ మహారాణి పాత్రలో కనిపించనుందని సమాచారం. ఆయుష్మాన్ రక్త పిశాచి రోల్‌ను పోషించనున్నాడని తెలుస్తోంది. అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. నీరెన్ బట్ స్క్రిఫ్ట్‌ను అందించనున్నాడు.
సామ్ చేతిలో ప్రస్తుతం అనేక ప్రాజెక్టున్నాయి. ‘యశోద’ షూటింగ్‌ను పూర్తి చేసింది. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్‌గా రూపొందింది. ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉన్నాయని తెలుస్తోంది. అందువల్ల పోస్ట్ ప్రొడక్షన్ కోసం మేకర్స్ అధికంగా సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఈ మధ్యనే విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘శాకుంతలం’ లోను హీరోయిన్‌గా నటిస్తుంది. త్వరలోనే ‘శాకుంతలం’ ప్రమోషన్స్ ను మొదలుపెడతామని గుణ శేఖర్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. విజయ్ దేవర కొండతో ‘ఖుషి’ (Kushi) చేస్తుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. రుస్సో బ్రదర్స్ నిర్మిస్తున్న ‘సిటాడెల్’ (Citadel) లోను నటిస్తుంది.
అన్ని పరిశ్రమల్లోనూ ప్రస్తుతం సీక్వెల్ చిత్రాలు విరివిరిగా తెరకెక్కుతున్నాయి. దాంతో, ఏదైనా చిత్రం మంచి విజయం అందుకుందంటే చాలు దాని కొనసాగింపుపై సినీ అభిమానుల నుంచి ప్రముఖుల వరకూ అంతా దృష్టి పెడుతున్నారు. ఇటీవల విడుదలై, హిట్ కొట్టిన ‘సీతారామం’ (Sita Ramam) విషయంలోనూ కొనసాగింపు ఉంటే బాగుండని చాలా మంది అనుకున్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్ (హిందీ)లో ఓ విలేకరి ఇదే ప్రశ్నను హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ముందు ఉంచగా ఆయన స్పందించారు. ‘‘ఏదైనా సినిమాకు విశేష ప్రేక్షకాదరణ లభించి, క్లాసిక్‌గా నిలిస్తే దాన్ని మళ్లీ టచ్ చేయకూడదనే విషయాన్ని నేను నటుడినికాకముందే తెలుసుకున్నా. మేం ఈ కథను బాగా నమ్మాం. ‘సీతారామం’ క్లాసిక్‌గా నిలుస్తుందని భావించాం. అనుకున్నట్టుగానే మీరంతా ఈ చిత్రాన్ని మీ హృదయాల్లో దాచుకున్నారు. అందుకే ఈ సినిమాకు కొనసాగింపు ఉండదనుకుంటున్నా. రీమేక్ విషయంలోనూ అంతే’’ అని దుల్కర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ అందమైన ప్రేమకథలో రామ్‌గా దుల్కర్, సీతామహాలక్ష్మిగా మృణాల్ ఠాకూర్ ఒదిగిపోయారు. రష్మిక, తరుణ్‌భాస్కర్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ రాకుమారి(సీత), లెఫ్టినెంట్(రామ్)ల లవ్‌స్టోరీ దక్షిణాది ప్రేక్షకులతోపాటు ఉత్తరాది వారినీ విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ (తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో) అవుతోంది.
Saakini Daakini Review: సురేష్ ప్రొడక్షన్ లాంటి పెద్ద సంస్థ ఈసారి సునీత తాటితో చేతులు కలిపి కొరియన్ సినిమా ‘మిడ్ నైట్ రన్నర్స్’ను తెలుగులో ‘శాకినీ డాకినీ’గా రీమేక్ చేశారు. రెజీనా, నివేదా థామస్ కీలక పాత్రలు పోషించారు. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా. ఇందులో హీరో లేరు. ఈ సినిమా ప్రమోషన్స్ కొంచెం ఎక్కువ చెయ్యడంతో ఈ సినిమా మీద ఆసక్తి కలిగింది. సుధీర్ వర్మ ఈ సినిమాకి దర్శకుడు, కానీ తను ఎక్కడా ఏ సినిమా గురించి మాట్లాడకపోవడం మీద వివాదం వచ్చింది. చివర్లో ఏవో చిన్న చిన్న సీన్స్ మిగిలిపోతే ఆనంద్ రంగా చేశాడని అని అంటారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
దామిని (రెజీనా కాసాండ్రా ), షాలిని (నివేదా థామస్)లను పోలీస్ ట్రైనింగ్ కోసం అకాడమీలో జాయిన్ అవుతారు. మొదట్లో ఈ ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే. ఇద్దరూ ఒకే రూమ్‌లో ఉంటూ ఒకరి మీద ఒకరు ఎప్పుడూ ఫిర్యాదులు చేసుకుంటూ ఒకరు తప్పు చేసి దొరికేటట్లు ఇద్దరూ ప్రయత్నం చేస్తుంటారు. ఇంత వివాదాలున్న ఈ ఇద్దరు ట్రైనింగ్ సెషన్‌లో ఒకరికి ఒకరు సాయపడి ఆ తరువాత మంచి ేస్నహితులుగా మారిపోతారు. అలాంటి సమయంలో వారిద్దరు ఒక అర్థరాత్రి సమయంలో సరదాగా బార్‌కి వెళ్లి ఆ తరువాత క్యాంపు కి తిరిగి వస్తున్న సమయంలో ఒక అమ్మాయి కిడ్నాప్ అవటం గమనిస్తారు. వెంటనే పోలీసులకు తెలియజేసినా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ అకాడమీ బాస్ కి చెప్పిన అతనూ పట్టించుకోడు. ఇంకా ఆ అమ్మాయిని రక్షించే ప్రయత్నం ఈ ఇద్దరు ట్రైనీ పోలీసులు తమ భుజాన వేసుకుంటారు. వాళ్ళు విచారణ మొదలు పెట్టాక తేలింది ఏంటి అంటే ఆ అమ్మాయి కిడ్నాప్ వెనకాల ఒక భయంకర ముఠా ఉందని, ఆ అమ్మాయే కాదు.. అలా చాలామంది వున్నారని తెలుసుకుంటారు. ఆ ఇద్దరు ఎలా అందరిని ఆ ముఠా నుండి విడిపిస్తారు వీరిద్దరూ ఎలా బయట పడతారు తరువాత ఏం జరుగుతుంది అన్నదే మిగతా కథ.
దీనికి దర్శకుడుగా సుధీర్‌వర్మ పేరు వెయ్యడంతో అంతే దర్శకత్వం చేశాడని అనుకుందాం. ఈ సినిమా ఒక సున్నితమైన కథాంశంతో ముడిపడి ఉంది. అనాధలుగా వున్నా అమ్మాయిలను కిడ్నాప్ చేసి వాళ్ళకి సంబందించినవి అన్నీ కూడా మెడికల్‌గా అమ్మి డబ్బులు చేసుకునే ఒక మాఫియా ముఠా వుంది. ఇద్దరు ట్రైనీ ఆడ పోలీసులు ఈ ముఠాని పట్టుకోవడానికి బయలుదేరారు. ఇది మంచి కథే. అయితే దర్శకుడు ఇక్కడ కొంచెం లాజిక్స్‌ని మిస్ అయిపోయాడు. అలాగే చాలా సన్నివేశాలు మామూలుగా వున్నాయి, అంటే సినిమాటిక్ గా పెట్టేశారు. కథ మీద ఇంకాస్త వర్క్ చేసి ఉంటే మంచి యాక్షన్ సినిమా అయ్యేది. అక్కడక్కడా కొన్ని మంచి సీన్స్ తప్పితే సినిమా మొత్తం సాదాసీదాగా నడుస్తుంది.
ఆ ఇద్దరు అమ్మాయిలు పోలీస్ అకాడమీ ఎందుకు ఎలా చేరారు అన్నది చెప్పలేదు. వాళ్ళిద్దరిని డైరెక్ట్‌గా అకాడమీలో చేర్చేశారు. అలాగే చాలా సీన్స్ లో నేచురాలిటీ కి తగ్గట్టుగా లేవు. కథ మీద ఇంకా బాగా దృష్టి పెడితే బాగా వచ్చేది. సుధీర్ వర్మ కొంచెం, మిగతాది ఆనంద్ రంగా అనే దర్శకుడు తీశాడు అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలీదు. కానీ ఆ ప్రభావం సినిమా మీద పడిందేమో అన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే సినిమాలో ఎమోషనల్ కంటెంట్ లేదు. ఇంకా నటీనటుల విషయానికి వస్తే.. రెజీనా, నివేదా ఇద్దరూ బాగా చేశారు. వాళ్లిద్దరే సినిమాని తమ భుజస్కంధాలనూ వేసుకుని ముందుకు తీసుకెళ్లారు అనిపిస్తుంది. పోరాట సన్నివేశాల్లో కూడా ఇద్దరూ బాగా నిరూపించుకున్నారు. నివేత తెలంగాణ భాష బాగా మాట్లాడింది. ఈ సినిమాకి ఈ ఇద్దరే హీరోస్. భానుచందర్ అకాడమీ డైరెక్టర్‌గా బాగా సూట్ అయ్యాడు. అలాగే రఘు బాబు, పృథ్వీ కామెడీ బాగుంది. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. మ్యూజిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. డైలాగ్స్ కూడా అక్కడక్క పరవాలేదు.
ఈ శాకినీ డాకినీ అనే సినిమా ఒక సున్నితమయిన కథాంశం. కానీ ఇందులో ఎమోషనల్ సన్నివేశాలు లేవు, అలాగే లాజిక్స్ కూడా మిస్. దీన్ని ఇంకా బాగా తీయొచ్చు. అలాగే సినిమా క్వాలిటీ కూడా అంత పెద్దగా అనిపించదు. కానీ రెజినా, నివేదా ఇద్దరూ బాగా చేస?రు, వాళ్ళ కోసం, అక్కడక్కడ ఉన్న కామెడీ కోసం ఈ సినిమాని చూడొచ్చు. ఇది ఒక టైం పాస్ మూవీ. ఓటీటీ కోసం తీసిన సినిమాలా అనిపిస్తుంది.
చిత్రం: నేను మీకు బాగా కావాల్సిన వాడిని; నటీనటులు: కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సోనూ ఠాకూర్, సిద్ధార్థ్ మీనన్, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్కర్, సమీర్, సంగీత, నిహారిక, ప్రమోదిని, భరత్ రొంగలి తదితరులు; సంగీతం: మణిశర్మ; కూర్పు: ప్రవీణ్ పూడి; ఛాయాగ్రహణం: రాజ్ నల్లి; స్క్రీన్‌ప్లే, మాటలు: కిరణ్ అబ్బవరం; దర్శకత్వం: శ్రీధర్ గాదె; నిర్మాత: కోడి దివ్య దీప్తి; విడుదల తేదీ: 16-09-2022
‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులను పలకరించిన యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. తర్వాత వచ్చిన ‘SR కళ్యాణ మండపం’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు. యూత్‌లో కాస్త క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో ఆయనకు వరుస సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. కమర్షియల్ అంశాలతో పాటు వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమా రిలీజైంది. మరి ఆ సినిమా ఎలా ఉందనేది తెలుసుకోవాలంటే ముందు కథ గురించి తెలుసుకుందాం…
కథేంటంటే: తేజు (సంజనా ఆనంద్) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. ఓ కుర్రాడిని ప్రేమించి మోసపోతుంది. ఇంట్లో వాళ్లకు ముఖం చూపించుకోలేక భారంగా జీవితాన్ని గడిపేస్తుంటుంది. ఈ క్రమంలోనే మద్యానికి బానిసవుతుంది. అలాంటి ఆమె జీవితంలోకి క్యాబ్ డ్రైవర్ వివేక్ (కిరణ్ అబ్బవరం) ఎంట్రీ ఇస్తాడు. తేజు తాగి పడిపోయిన ప్రతిసారీ ఆమెను తన రూంలో డ్రాప్ చేసేది అతనే. ఓసారి ఆమెను ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేయబోతే కాపాడతాడు. దీంతో ఆమెకు వివేక్‌పై మంచి అభిప్రాయం ఏర్పడి.. తన విషాద గాథను అతనితో పంచుకుంటుంది. అదే సమయంలో వివేక్ కూడా తన విఫల ప్రేమకథను ఆమెతో పంచుకుంటాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఇద్దరి ప్రేమకథలకు ఉన్న లింకేంటి? ఒకరి కథ మరొకరు తెలుసుకున్నాక ఇద్దరూ కలిసి ఏం చేశారు? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
హీరోయిన్ ప్రేమలో మోసపోతుంది. దాంతో అబ్బాయిలంటేనే ద్వేషం పెంచుకుంటుంది. ఫ్రస్టేషన్‌తో ఉంటుంది. అలాంటి అమ్మాయికి ఓ క్యాబ్ డ్రైవర్ అయిన హీరో పరిచయం అవుతాడు. ఆమె మనసు మారుస్తాడు. కానీ హీరోకి, హీరోయిన్‌కి ఓ రిలేషన్ ఉంటుంది. అదేంటనేదే కథ. దాని చుట్టూనే కథంతా నడుస్తుంది. కిరణ్ అబ్బవరం మన పక్కింటి కుర్రాడిలాంటి పాత్రలో నటించి మరోసారి మెప్పించాడు. తనే స్క్రీన్ ప్లే.. మాటలు రాసుకున్నాడు. అలాగే సినిమాలో తన పాత్రకు కావాల్సిన హీరోయిజం ఎలివేషన్ సీన్స్, ఫైట్స్ కూడా ఇన్‌క్లూడ్ చేసుకున్నాడు.
తన పాత్ర పరంగా తన నటన ఓకే. ఇక హీరోయిన్ సంజనా ఆనంద్ పాత్ర చుట్టూనే సినిమా అంతా రన్ అవుతుంది. ఆమె నటన పరంగా ఓకే అనించిందే తప్ప.. ఆ పాత్రలోని ఎమోషన్స్‌ను ఇంకా బాగా చేసుండవచ్చు అనే భావన కలిగింది. ఇక బాబా భాస్కర్ పాత్రలో కాస్తో కూస్తో కామెడీ కనిపించింది. అది తప్ప సినిమాలో ఎంటర్‌టైనింగ్ పార్ట్ వెతికినా కనపడదు. సిద్ధార్థ్ మీనన్ చుట్టూనే ఫస్టాఫ్ అంతా నడుస్తుంది. నిజానికి ఫస్టాఫ్‌లో అతనే హీరో అనిపిస్తాడు. ఇక సినిమాలోని ఇతర తారాగణంగా నటించిన ఎస్.వి.కృష్ణారెడ్డి, సమీర్ తదితరులు వారి వారి పాత్రల పరిధి మేరకు నటించారు.
ఎవరెలా చేశారంటే: వివేక్ పాత్రలో కిరణ్ అబ్బవరం నటన బాగుంది. నిజానికి ఈ చిత్రంలో ఆయన తన నటనపైన కంటే మాస్ ఎలివేషన్లపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే కథను పక్కకు నెట్టి మరీ బలవంతంగా యాక్షన్ ఎపిసోడ్స్ ఇరికించేశారు. వాటిని డిజైన్ చేసిన విధానం బాగున్నా.. అవి కిరణ్ ఇమేజ్‌కు మించిన స్థాయిలో ఉన్నాయి. ఐటెం పాటలో.. నచ్చావబ్బాయ్ గీతంలో కిరణ్ వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటాయి. తేజు పాత్రలో సంజనా ఆనంద్ ఫర్వాలేదనిపించింది. వాస్తవానికి కథలోనే సరైన బలం లేకపోవడం వల్ల తెరపై ప్రతి పాత్రా తేలిపోయింది. సోనూ ఠాకూర్, బాబా భాస్కర్, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. శ్రీధర్ గాదె రాసుకున్న కథలో ఏమాత్రం కొత్తదనం లేదు. కిరణ్ అబ్బవరం అందించిన స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందుకు తగినట్లుగానే ఉన్నాయి. సినిమా మొత్తంలో కాస్త కాలక్షేపాన్నిచ్చింది మణిశర్మ సంగీతం మాత్రమే. అదే చిత్రానికి ప్రధాన ఆకర్షణ. నిర్మాణ విలువలు బాగున్నాయి.
బ్యూటీఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్లి, పిల్లలు కనడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తను నటించిన ‘సీతా రామం’ మూవీ ఇటీవల హిందీలో విడుదలవగా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న ఆమె తాజాగా ప్రముఖ యూట్యూబ్ చానెల్ ‘డేటింగ్ దిస్ నైట్స్’ ఎపిసోడ్‌లో మాట్లాడుతూ.. 30ఏళ్ల వయసులో ఉన్న స్త్రీలు డేటింగ్ చేయడం, ప్రేమలో పడటం, బిడ్డను కనడం వల్ల కలిగే ఒత్తిడి తాను ఎదుర్కొలేనని చెప్పింది. అలాగే పాత సిద్ధాంతాలను బద్దలు కొట్టి ప్రేమలో పడకుండానే బిడ్డను కనాలని ఉందన్న బ్యూటీ.. ఈ తరం అమ్మాయిలు కాలం చెల్లిన ఆలోచనలనుంచి బయటపడాలని సూచించింది.
ఈ మేరకు ‘నేను ఎక్కడి నుంచి వస్తున్నానో.. నా మనసులో ఏముందో గమనించి, చేస్తున్న వృత్తిని అర్థం చేసుకునే భాగస్వామి కావాలి. ప్రస్తుతం మన చుట్టు చాలా అభద్రతాభావం ఉంది. కాబట్టి నాకు కావల్సిందల్లా ప్రొటెక్టెడ్ పర్సన్. ఇలాంటి వ్యక్తులు దొరకడం చాలా అరుదు. అలాగే నేను బిడ్డను కనాలని భావించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, అది సెక్స్ ద్వారా కాదు. ఒంటరి తల్లిగా ఉండాలనుకున్నా. దానికి మా అమ్మ సరే అని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉంది. నిజంగా అలా ఉండటం అద్భుతమైనది’ అని ముగించింది మృణాల్.
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ . మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను రామ్ చరణ్, ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఇందులో ఓ కీలక పాత్రలో నటించటం విశేషం. చిరంజీవి – సల్మాన్ ఖాన్ కలిసి చేసిన ‘థార్ మార్..’ అనే సాంగ్‌ను సెప్టెంబర్ 15న రిలీజ్ చేయబోతున్నారు. ఆ సాంగ్ ప్రోమోను మంగళవారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రోమో చూస్తుంటే చిరు, సల్మాన్ మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారని క్లియర్‌గా అర్థమవుతోంది. అక్టోబర్ 5న సినిమా థియేటర్స్‌లో సందడి చేయనుంది.