విజువల్ వండర్‌గా ‘హనుమాన్’ టీజర్
Category : Behind the Scenes Movie News Teasers
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హనుమాన్’ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కెమెరామన్ శివేంద్ర వర్క్ చాలా ఆకట్టుకుంటోంది. మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్‌మెంట్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా వరలక్ష్మీ శరత్ కుమార్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. శ్రీమతి చైతన్య సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కె నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.