Category Archives: Latest Reviews
-
-
-
-
తమిళనాడు లోని కురుమలై లో విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ యాక్షన్ సీక్వెన్సెస్
Category : Latest Events Latest Reviews Movie News Sliders
తమిళనాడు లోని కురుమలై లో విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ యాక్షన్ సీక్వెన్సెస్
‘ఎఫ్2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్ 74వ చిత్రం ‘నారప్ప’ షూటింగ్ అనంతపురం జిల్లా ఉరవకొండలోని పాల్తూరు గ్రామంలో ప్రారంభమైంది. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్’ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం తమిళ నాడు లోని కురుమలై లో ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ‘నారప్ప’ కి సంబంధించి కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యాక విక్టరీ వెంకటేష్, చిత్ర బృందం అనంతపురం లో షెడ్యూల్ కంటిన్యూ చేస్తారు. సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేశారు.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: గాంధీ నడికుడికర్, కథ: వెట్రిమారన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, విజయ్, లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంతశ్రీరామ్, కృష్ణకాంత్, కాసర్ల శ్యాం, ఫైనాన్స్ కంట్రోలర్: జి.రమేష్‌రెడ్డి, ప్రొడక్షన్ కంట్రోలర్: రామబాలాజి డి., ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఏపీ పాల్ పండి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ శంకర్, కో- ప్రొడ్యూసర్: దేవిశ్రీదేవి సతీష్, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
Related Images:
-
-
రూపేష్, శివల క్రైమ్ థ్రిల్లర్ `22` టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా డెఫినెట్‌గా పెద్ద హిట్ అవుతుంది – కింగ్ నాగార్జున.
Category : Latest Events Latest Reviews Sliders
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ’22’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతులమీదుగా విడుదలైన హీరో ఫస్ట్‌లుక్ గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం టీజర్ ను 2ఫిబ్రవరి2020న ఉదయం 8:59 నిమిషాలకు కింగ్ నాగార్జున విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి ముఖ్య అతిథిగా పాల్గొని `22` మూవీ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత కొండా కృష్ణం రాజు పాల్గొన్నారు.
కింగ్ నాగార్జున మాట్లాడుతూ – “అందరికి ఎంతో ఇష్టమైన బి.ఎ.రాజు గారి, జయగారి అబ్బాయి శివ. జయగారు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి చాలా ఇష్టం. వాళ్ళిద్దరితో నేను బాగా క్లోజ్ గా ఉంటాను. జయగారు ఇప్పుడు మన మధ్య లేరు కానీ వాళ్ళ అబ్బాయి డైరెక్టర్ అవుతున్నాడు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆమె అందరికి బాగా తెలిసిన మహిళా దర్శకురాలు. శివ దర్శకుడిగా జయగారి పేరు నిలబెట్టాలి. అలాగే బి.ఎ.రాజు గారిది కూడా. రూపేష్ వెల్ కమ్ టు ఫిలిం ఇండస్ట్రీ. బయట ఎన్నో సక్సెస్ ఫుల్ బిజినెస్ లు ఉన్నా సినిమా అంటే ఫ్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చాడు. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. ఇప్పుడే టీజర్ చూశాను. ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టైటిల్ 22. టీజర్ విడుదలయింది 2-2-2020. అన్ని రెండులే ఉన్నాయి. న్యూమరాలజి ప్రకారం నాది కూడా రెండు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్” అన్నారు.
శివ దర్శకుడిగా తప్పక సక్సెస్ అవుతాడు!!
సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – శివ దర్శకుడు కావడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ కాపీ కూడా వారం రోజుల్లో రెడీ అవుతుందని చెప్పాడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా వద్దకు వచ్చి ఓ సినిమా ప్రొస్ట్ ప్రొడక్షన్ అంతా హ్యాండిల్ చేశాడు. రాజుగారు ఎలా ఒక సినిమా సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకొని కష్టపడి ప్రమోషన్ చేస్తారో… అలా శివ కూడా చాలా కష్టపడతాడు. దర్శకుడుగా సక్సెస్ కావడానికి ఈ సినిమాతో ఒక మంచి ప్రయత్నం చేశాడు. కొత్తగా దర్శకులు కావాలనుకునేవారు తొలుత ప్రేమకథను తీయాలనుకుంటారు. కానీ శివ విభిన్నంగా ఆలోచించి ఓ క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌ను తీసుకుని ఇంత బాగా తీశాడంటే అతని మెచ్యూరిటీ లెవల్ ఏంటో తెలుస్తోంది. ఈ కథను నమ్మి, రూపేష్ హీరోగా నటించాడు. రూపేష్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడనిపిస్తోంది. సలోనితో పాటు టీమ్ అందరు బాగా చేశారు. టీమ్ అందరికీ ఆల్‌దిబెస్ట్.అలాగే నాగార్జునగారు కొత్తవారిని ప్రొత్సహించడంలో ఎప్పుడూ ముందుఉంటారు. టీజర్ చూసి ఆయన అంత మాట్లాడారు అంటే…రాజుగారిపై అభిమానం ఉన్నప్పటికీ టీజర్ ఆయనతో మాట్లాడేలా చేసింది. నేను శివ చేసిన ఓ వెబ్‌సిరీస్ చూసి షాక్ అయ్యాను. టెక్నికల్‌గా బాగా చేశాడు. ఒక కథ రాసుకుని, ఇంత తక్కువ సమయంలో దాన్ని స్క్రీన్‌మీదకు తీసుకురావడం అంత సులువు కాదు. వి.వి.వినాయక్‌గారు, నేను ఈ సినిమా లాంచ్ చేశాం. అప్పుడే ఈ సినిమా టీజర్ లాంచ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి దర్శకుడు ఇండస్ట్రీకి చాలా అవసరం. శివ దర్శకుడిగా తప్పక సక్సెస్ అవుతాడు. కో-డైరెక్టర్ పుల్లారావుగారు ఉంటే ఆ ప్రొడక్ట్ బాగా వస్తుంది. ఆయన సినిమాను సినిమాలాగే చూస్తారు చాలా సిన్సియర్‌గా వర్క్ చేస్తారు. ఇలాంటి సీనియర్ దర్శకులతో పని చేసే అవకాశం శివకు వచ్చింది. ఈ సినిమాను ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాలనుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్‌దిబెస్ట్“ అన్నారు.
ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు మాట్లాడుతూ – “నాగార్జునగారు, పూరీ జగన్నాథ్‌గారు, మారుతిలాంటి ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈ సినిమాకు ముందుకొచ్చి శివమీద వారికి ఉన్నప్రేమను, నమ్మకాన్ని తెలియజేస్తుంటే శివ చాలా అదృష్టవంతుడనిపిస్తోంది. ఇంతమంది పెద్దల అశీస్సులతో శివకు, రూపేష్ గారికి ఈ సినిమా పెద్ద బ్రేక్ అవ్వాలని, ఎంటైర్ యూనిట్‌కి ఈ ఇదొక పెద్ద సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.
ఆదిత్యమ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ – “రాజుగారు, జయగారు మొదటి సినిమా నుంచి మమ్మల్ని ఆదరించి, వారి సినిమాల ఆడియో హక్కులను మాకే ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఆ పరంపరని అలాగే కొనసాగిస్తూ ఇప్పుడు వారి అబ్బాయి శివగారు డైరెక్టర్‌గా రూపొందించిన ఈ సినిమా ఆడియో హక్కులను కూడా మాకు ఇవ్వడం చాలా సంతోషం. శివగారికి జయగారితో సహ మా అందరి ఆశీస్సులు ఉన్నాయి. అలాగే బి.ఎ.రాజుగారు తోడుగా ఉన్నారు. భవిష్యత్‌లో ఇంకా మంచి సినిమాలు చేయాలి. వీరి పరంపర ఇలాగే మాతోనే కొనసాగలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి మాకు సాధ్యమైనంత సహాయం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను“ అన్నారు.
కో డైరెక్టర్ పుల్లారావు కొప్పినీడి మాట్లాడుతూ – “శివ ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఎంత గొప్పగా ఫీలయ్యామో, సినిమాను కూడా అంతే గొప్పగా తీశాడు. సినిమా చాలా బాగా వచ్చింది. టీజర్ అద్భుతంగా ఉంది. హీరోహీరోయిన్లు చాలా బాగా చేశారు. ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను.
హీరో రూపేష్‌కుమార్ చౌదరి మాట్లాడుతూ – ` మా అయి ఈ ప్రొడక్షన్ బ్యానర్ లొగొ లాంచ్ కార్యక్రమానికి మారుతిగారు వచ్చి వారి ఆశీస్సులు అందించారు. మళ్లీ ఈ సినిమా క్యాలెండర్ లాంచ్ చేసినందుకు మారుతిగారికి థ్యాంక్స్. నాగార్జునగారిచేతుల మీదుగా మా సినిమా టీజర్ లాంచ్ అవడం నెక్ట్స్ లెవల్ ఆనందంగా ఉంది“ అన్నారు.
చిత్ర దర్శకుడు శివకుమార్ బి.మాట్లాడుతూ – “నాగార్జున టీజర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. కొత్త దర్శకులను ప్రొత్సహించే నాగార్జునగారి చేతుల మీదుగా మా టీజర్ లాంచ్ కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎంటైర్ 22టీమ్ తరఫున నాగార్జునగారికి థ్యాంక్స్. మారుతిగారు ఇటీవల ప్రతిరోజూపండగే సినిమాతో పెద్ద సక్సెస్ అందుకున్నారు. ఆ పండగను ఈ పండగకి తీసుకువచ్చారు. మా 22లో ఆ పండగ జరుగుతుంది. ఈ సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులు అందరికీ థ్యాంక్స్. కొండాకృష్ణంరాజుగారికి, మారుతిగారికి స్పెషల్ థ్యాంక్స్. ఆడియో విషయంలో ఆదిత్యమ్యూజిక్ మాధవ్‌గారు, నిరంజన్‌గారు చాలా సపోర్ట్ చేశారు. కమర్షియల్‌గాకూడా ప్రొత్సహిస్తున్నారు. ఇప్పుడు ఈ టీజర్‌లాంచ్‌కి కూడా వారి సహకారం అందించారు. కథ ప్రకారమే 22 అనే టైటిల్ పెట్టాం. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్“ అన్నారు.
హీరోయిన్ సలోని మిశ్రా మాట్లాడుతూ – ఇక్కడికి వచ్చిన మారుతిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాలో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నాకు కంఫర్ట్‌జోన్‌కు విభిన్నమైన మంచి పాత్ర ఇచ్చిన శివగారికి థ్యాంక్స్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. రూపేష్‌గారు బాగా నటించారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది“ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ రవికిరణ్ మాట్లాడుతూ -“ టీజర్ విడుదలచేసిన నాగార్జునగారికి, ఇక్కడికి వచ్చిన మారుతిగారికి థ్యాంక్స్. మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. టీమ్ అందరికీ ధన్యవాదాలు“ అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ పెద్దిరాజు మాట్లాడుతూ – “సినిమా బాగా వచ్చింది. మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు“ అన్నారు.
నటుడు కృష్ణచైతన్య మాట్లాడుతూ – “టైటిల్ మాదిరిగానే సినిమా కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాలో శివ నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారు. ఈ ఏడాదిలోనే నా కెరీర్‌లో ఇదొక బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పగలను“ అన్నారు.
నిర్మాత బి.ఎ. రాజు మాట్లాడుతూ – “ఎంతోమంది కొత్త దర్శకులను ప్రొత్సహించి, వారు ఈ రోజు మంచి స్థాయిలో ఉండటానికి కారణమైన నాగార్జున చేతులు మీదుగా టీజర్‌ను లాంచ్ చేయించాలని వారిని కలిశాను. మా అబ్బాయి..శివ ఓ సినిమాను
డైరెక్ట్ చేశాడు..అని చెబుతుండగానే నాగార్జునగారు తప్పక లాంచ్ చేస్తానని ప్రోత్సహించి టీజర్ రిలీజ్ చేసి ఆశీస్సులు అందించారు. అలాగే నాగచైతన్యగారు ఆల్‌ది బెస్ట్ చెప్పారు. డైరెక్టర్ మారుతి గారి దగ్గర శివ వర్క్ చేశాడు, శివ మీద అభిమానంతో మారుతి గారు విచ్చేసి క్యాలెండర్ లాంచ్ చేసినందుకు థాంక్స్. అలాగే మా ఆత్మీయులు కొండా కృష్ణంరాజుగారు రావడం ఎంతో ఆనందం. శివ కు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన రూపేష్ గారికి స్పెషల్ థాంక్స్. ఇండస్ట్రీ ప్రముఖుల సపోర్ట్‌తో ఈ సినిమా ముందుకు వెళుతోంది.టీజర్ చూసినవారు శివ పెద్ద దర్శకుడు అవుతాడని అంటున్నారు. అది తప్పక జరగాలని కోరుకుంటున్నాను. శివకు జయ ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయి.“ అన్నారు.
రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా, విక్రమ్ జీత్ విర్క్, దేవిప్రసాద్, జయప్రకాష్, రవి వర్మ, శశిధర్ కోసూరి, ఫిదా శరణ్య, రాజశ్రీనాయర్, పూజా రామచంద్రన్, కృష్ణ చైతన్య, ఆఫ్ఘనిస్తాన్ రామరాజు, బేబి సంస్కృతి, మాస్టర్ తరుణ్, మాస్టర్ దేవాన్ష్, బేబి ఓజల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ : బి.వి. రవికిరణ్, సంగీతం: సాయికార్తీక్, ఎడిటింగ్: శ్యామ్ వాడవల్లి, కొరియోగ్రఫీ: అనీలామా, ఆర్ట్: పెద్దిరాజు అడ్డాల, స్టంట్స్: జాషువ, లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, ప్రొడక్షన్ మేనేజర్: కిరణ్ కాసా, పిఆర్ఓ: బి.ఎ రాజు, చీఫ్ కో-డైరెక్టర్: పుల్లారావు కొప్పినీడి, నిర్మాత: శ్రీమతి సుశీలాదేవి, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: శివకుమార్ బి.
Related Images:
-
-
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి
Category : Latest Reviews Movie News Sliders
ఫిబ్రవరిలో విడుదల కానున్న ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’
బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, పూర్వీ పిక్చర్స్ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా ఫస్ట్ లుక్, ప్రచార చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
దర్శకుడు బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ ‘‘ఆల్రెడీ రిలీజైన ట్రైలర్, పోస్టర్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా ప్రేక్షకులు అందరికీ థాంక్స్. మొదట మా సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేయాలనుకున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కాస్త ఆలస్యం కావడం, ఇతర టెక్నికల్ సమస్యల వలన సినిమాను వాయిదా వేస్తున్నాం. ఫిబ్రవరి నెలలోనే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. అతి త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం” అని అన్నారు. సినిమా గురించి బాలు మాట్లాడుతూ “మహానగరంలో నివసించే నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. హైదరాబాద్‌లో ఉండే ఈ నలుగురు అమ్మాయిలు ఫ్రెండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం గోవా వెళతారు. అక్కడ ఏం జరిగింది? అనేది ఆసక్తికరం. కథ, కథనాలు కొత్త తరహాలో ఉంటాయి. ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. న్యూ ఏజ్ సినిమా ఇది’’ అని అన్నారు.
నటీనటులు:
ధన్యా బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్, రఘుబాబు, హిమజ, రఘు కారుమంచి, సమీర్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
అసోసియేట్ డైరెక్టర్: లక్కీ బెజవాడ, ఎడిటర్: తెల్లగుటి మణికాంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎల్ఎన్ వారణాసి, వైజేఆర్,
కో – ప్రొడ్యూసర్స్: నేహా మురళీకృష్ణ, రఘురామ్ యరుకుండ,
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్, సినిమాటోగ్రఫీ: శేఖర్ గంగమోని, సంగీతం: వికాస్ బాడిస,
కో–డైరెక్టర్, డైలాగ్స్: విజయ్ కామిశెట్టి, నిర్మాత: హిమ బిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్,
రచన, దర్శకత్వం: బాలు అడుసుమిల్లి.
Related Images:
-
-
-
-
‘జాను’ …మనతో పాటు ఇంటికి తీసుకెళ్లే సినిమా : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నేచురల్ స్టార్ నాని ‘జాను’ చూసిన తర్వాత ఆ హ్యోంగోవర్‌లో ఉండిపోతాం: దిల్‌రాజు
Category : Latest Events Latest Reviews Movie News Sliders
‘జాను’ …మనతో పాటు ఇంటికి తీసుకెళ్లే సినిమా : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నేచురల్ స్టార్ నాని
‘జాను’ చూసిన తర్వాత ఆ హ్యోంగోవర్‌లో ఉండిపోతాం: దిల్‌రాజు
శర్వానంద్, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీ ‘జాను’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో బిగ్ సీడీని ఆవిష్కరించారు. నేచురల్ స్టార్ నాని, వంశీ పైడిపల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా …
17 ఏళ్లలో తొలి రీమేక్: దిల్‌రాజు
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – ‘‘మా బ్యానర్ స్టార్ట్ అయ్యి 17 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్లలో మేం ఎప్పుడూ రీమేక్ చేయనేలేదు. మా బ్యానర్‌లో వస్తోన్న తొలి రీమేక్ ఇది. రీమేక్ చేయాలంటే నాకు భయం. ఎందుకంటే ఒరిజిల్ ఫీల్‌ను మిస్ కాకుండా తెరపైకి తీసుకురావడం చాలా కష్టం. తమిళంలో ‘96’ సినిమాను రిలీజ్ కంటే ఒక నెల ముందు చూశాను. చూసిన తర్వాత ప్రివ్యూ థియేటర్ నుండి బయటకు రాగానే ఈ సినిమాను నేను తెలుగులో రీమేక్ చేస్తానంటూ.. ప్రొడ్యూసర్‌కి చెక్ ఇచ్చేశాను. అందుకు కారణం సినిమా చూసే సమయంలో ఎమోషన్స్‌తో గుండె బరువెక్కింది. అప్పుడు మా ‘ఎంసీఏ’ షూటింగ్ జరుగుతుంది. ‘96’ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకుంటున్నానని నానితో చెప్పాను. తను కూడా చెన్నై వెళుతున్నానని చెప్పాడు. అప్పుడు తన కోసం ఓ షో ఏర్పాటు చేస్తే.. తను సినిమా చూసి సినిమా ‘క్లాసిక్ సినిమా సార్! చాలా బావుంది’అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. తమిళంలో సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్లీ ఆడియెన్స్‌తో కలిసి సినిమా చూశాను. నాకు తమిళంలో పూర్తిగా రాకపోయినప్పటికీ ప్రేక్షకుల నుండి వచ్చిన రెస్పాన్స్ చూసి ఎవరు ఏమనుకున్నా..ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాను. జానుగా సమంతను ఈ సినిమాలో యాక్ట్ చేయించాలని అనుకున్నాను. తనని తప్ప.. ఆ పాత్రలో మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోలేకపోయాను. ఈ మధ్య తను చేస్తున్న సినిమాలన్నీ సూపర్బ్‌గా సెలక్ట్ చేసుకుంటుంది. తనతో మాట్లాడి సినిమాకు ఒప్పించాను. ఇక నా బ్రదర్ శర్వాకి ఫోన్ చేసి సినిమా చూడమంటే సినిమా చూసి సూపర్బ్‌గా ఉందని ఫోన్ చేశాడు. అలా శర్వా, సమంత ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. మా ఆర్య సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా పనిచేసిన ప్రేమ్‌కుమార్ ‘96’ సినిమాకు డైరెక్టర్‌గా మారాడు. తమిళంలో సినిమా చేసిన తనతో మాట్లాడి తెలుగులోనూ డైరెక్ట్ చేయమని చెప్పాను. తమిళంలో చేసిన టెక్నీషియన్సే ఈ సినిమాకు పనిచేశాను. సినిమా స్టార్ట్ చేసిన తర్వాత కెన్యాలో శర్వా నడుపుతున్న జీపు బోల్తా పడింది.. దేవుడి దయవల్ల తనకు ఏమీ కాలేదు. తర్వాత మరో డిస్ట్రబెన్స్ వచ్చింది. ఏంటి? ఇంత మంచి సినిమాకు ఇన్ని అడ్డంకులు? అని అనుకున్నాను. అయితే అన్నింటినీ ఒక్కొక్కటిగా దాటుకుంటూ వచ్చి సినిమాను పూర్తి చేశాం. ఈ సినిమాను చేస్తున్నప్పుడు ‘దిల్‌రాజుకేమైనా మెంటలా? డబ్బింగ్ చేయొచ్చు కదా?’ అని చాలా కామెంట్స్ విన్నాను. ఆ ఫీల్‌ను తెలుగులో అలాగే క్యారీ చేశాం. అదే ఫ్లేవర్‌ను డైరెక్టర్ ప్రేమ్ తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ఫిబ్రవరి 7న మా ‘జాను’ సినిమాను చూసిన తెలుగు ప్రేక్షకులు వావ్ అంటారు. చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. ఈ సినిమా హ్యాంగోవర్‌లో ఉండిపోతాం. జాను సినిమా చూసిన తర్వాత మన లైఫ్‌లోని మెమొరీస్‌ను ఇంటికి తీసుకెళ్తాం. ఫిబ్రవరి 7న నేను చెప్పినవన్నీ నిజాలు అవుతాయి’’ అన్నారు.
మర్యాద ఉన్న సినిమా
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – ‘‘రాజుగారు ఈ రీమేక్ చేస్తున్నామని అనుకున్నప్పుడు వద్దని వారించిన వారిలో నేనూ ఒకడ్ని. కానీ ట్రైలర్‌ను చూసి షాకయ్యాను. ప్రేమ్ అదే మూమెంట్స్‌ను తెలుగులో రీ క్రియేట్ చేశాడు. అందుకు కారణం ఈ సినిమా తన మనసులో నుండి వచ్చిన ఆలోచన. అందుకనే అద్భుతంగా ఈ సినిమాను మలిచాడు. ఇక తమిళంలో త్రిష..తెలుగులో సమంతగా నటించిన గౌరికి నేను పెద్ద ఫ్యాన్‌ని. భవిష్యత్తులో తెలుగు సినిమా గురించి రాసేటప్పుడు సమంత గురించి కూడా కొన్ని పేజీలు రాసేంత స్థాయికి ఎదిగింది. అయినా సమంత విషయానికి వస్తే.. ఈ సినిమా ఫెయిలైతే నా కెరీర్ ఏంటి? అని ఇప్పటికీ ఆలోచిస్తుంటుంది. ఆ భయం, ప్యాషన్‌తోనే ఇప్పటికీ సినిమాలు చేస్తుంది. నేను డైరెక్టర్‌గా మారే క్రమం నుండి శర్వానంద్ తెలుసు. తను అప్పటికీ యాక్టర్ కాలేదు. ఇప్పుడు సినిమాలు చేసుకుంటూ ఈ స్థాయికి చేరాడు. ‘జాను’ కమర్షియల్ సినిమా కాదు.. మర్యాద ఉన్న సినిమా. అదే గౌరవం, మర్యాదతో రాజుగారు సినిమా చేశారు. ఆయన డబ్బు కన్నా గౌరవం సంపాదించాలనుకుంటారు. 96 సినిమా తమిళంలో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో తెలుగులోనూ అలాగే నిలబడుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు.
గర్వంగా ఫీలవుతారు
సమంత అక్కినేని మాట్లాడుతూ – ‘‘అభిమానులను డిసప్పాయింట్ చేయకూడదనే నేను ప్రతీ సినిమాకు భయపడుతుంటాను. ప్రతి సినిమాను.. షూటింగ్‌కి వెళ్లే ప్రతిరోజుని నా మొదటి సినిమాకు మొదటి రోజు వెళ్లేలాగానే ఫీల్ అవుతాను. ప్రేక్షకులు అందిస్తున్న సపోర్ట్‌కు థ్యాంక్స్. క్లాసిక్ సినిమా రీమేక్ ఇది. దీని గురించి ఇప్పుడు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఫిబ్రవరి 7 తర్వాత తప్పకుండా మాట్లాడుతాను. ప్రతిరోజూ ఈ సినిమా షూటింగ్‌లో ఏదో ఒక మేజిక్ జరుగుతూనే ఉండింది. దిల్‌రాజుగారు అడగ్గానే నేను పారిపోయాను. అయినా కూడా ఆయన రెండోసారి అడిగి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. నా రామ్‌లాగా నటించిన శర్వాకు థ్యాంక్స్. నా పెర్ఫామెన్స్‌కు ఏదైనా క్రెడిట్ దక్కితే అది శర్వా వల్లనే కుదిరింది. ప్రేమ్‌కుమార్‌గారికి థ్యాంక్స్. ఆయన మేజిషియన్‌లా మరోసారి మేజిక్‌ని క్రియేట్ చేశాడు. నేను మీ అందరినీ గర్వంగా ఫీలయ్యేలా చేస్తాననే అనుకుంటున్నాను’’ అన్నారు.
తొంబై ఏళ్ల వరకు కనెక్ట్ అయ్యే సినిమా
హీరో శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘కొంత మంది హీరోయిన్స్‌తో పనిచేయాలంటే కాస్త ఆలోచించుకుంటాం. నిత్యామీనన్, సాయిపల్లవి..సమంత వంటి వాళ్లు సీన్స్‌ను తినేస్తారు. వీళ్లతో సినిమా అనగానే కొంచెం మనం అలర్ట్‌గా ఉండాలి. సమంతతో తొలిసారి పనిచేశాను. ప్రతి సీన్‌ను వంద శాతం చెక్ చేసుకునే నటిస్తుంది. అందుకే తను సూపర్‌స్టార్ అయ్యింది. సమంత జానుగా చేయకుంటే ఈ సినిమా లేదు. నాకు ఏదైనా క్రెడిట్ అంటూ వస్తే.. దానికి కారణం సమంతే. ఆరు నుండి 90 ఏళ్ల వరకు అందరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ లవ్‌ను ఎవరూ మార్చలేరు. చాలా స్వీట్ మెమురీస్ ఉన్నాయి. రమేశ్, కిషోర్ క్యారెక్టర్స్ మనకు కనపడతాయి. నా టీమ్ అందరికీ థ్యాంక్స్. ఇలాంటి అద్భుతమైన సినిమాను ఇచ్చిన శిరీషన్న, రాజన్న, హర్షిత్‌లకు థ్యాంక్స్. నేను ఈ సినిమాను చూసి ‘క్లాసిక్ మూవీ కదా! మనం చేయాలా?’ అన్నాను. ‘నువ్వు నన్ను నమ్ము’ అని దిల్‌రాజు అన్నారు. ఆయనపై నమ్మకంతో సినిమా చేశాను. సారథి స్టూడియోలో నానితో ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ అయ్యింది. నేను, నరేశ్, నాని కలిసి చాలా ట్రిప్స్‌కు వెళ్లాం. తనకు థ్యాంక్స్’’ అన్నారు.
మనతో పాటు ఇంటికి తీసుకెళ్లే సినిమా
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ – ‘‘రాజుగారితో పాటు నాకు ఈ సినిమాను చూడమన్నప్పుడు.. ‘ఇంత మంచి సినిమా, ఎంతో బాగా చేశారు. దీన్ని టచ్ చేయకండి’ అని నా ఒపీనియన్ చెప్పాను. తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారని నా దగ్గర ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ తెలుగులో ఈ సినిమాను తీయకూడదని నేను చెప్పేవాడిని. కానీ.. ఈ సినిమాలో శర్వానంద్, సమంత చేస్తున్నారని అనౌన్స్ చేయగానే ఈ సినిమాను తెలుగులో ఎప్పుడు చూస్తామా? అనిపించింది. ట్రైలర్ చూసినప్పుడు ఆ నమ్మకం నిజమైంది. తమిళంలో నేను ఏదైతే చూశానో అదంతా పోయింది. ఇప్పుడు రామ్, జాను అంటే శర్వా, సామ్‌లే గుర్తకొస్తున్నారు. తమిళంలో సినిమాను డైరెక్ట్ చేసిన ప్రేమ్‌కుమారే ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. కాబట్టి ఫీల్ ఎక్కడా మిస్ అయ్యుండదు. శర్వా.. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా తొలి ఫ్రెండ్. శర్వా, సామ్ ఇద్దరూ మంచి పెర్ఫామెర్స్. పోటీ పడి నటించారు. శర్వా ఏ సినిమా చేసినా సరే! వాడికి మాత్రం చాలా మంచి పేరు వస్తుంటుంది. ఈ సినిమాకు మంచి పెర్ఫామర్ అవసరం. అందుకనే తమిళంలో విజయ్‌సేతుపతిని, తెలుగులో శర్వానంద్‌ని తీసుకున్నారు. ఇక సామ్ గురించి చెప్పాలంటే.. తనను చూసి.. తను ఎంచుకుంటున్న సినిమాలను చూసి గర్వపడుతున్నాను. ప్రతి సంవత్సరం పది మంచి సినిమాలున్నాయంటే అందులో రెండు, మూడు సమంత సినిమాలుంటున్నాయి. ఇప్పుడు తన లిస్టులో మరొకటి జాయిన్ అవుతుంది. రాజుగారి కౌంటింగ్ సంక్రాంతి నుండి స్టార్ట్ అయ్యింది. మళ్లీ ఫిబ్రవరి 7 నుండి మళ్లీ స్టార్ట్ అయ్యి మార్చి 25వరకు కంటిన్యూ అవుతుంది. అక్కడి నుండి నేను చూసుకుంటా. అలాగే శిరీష్‌గారికి కంగ్రాట్స్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గరే కాదు.. రాజుగారికి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. కొన్ని సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తాం. కొన్నింటిని ఎంజాయ్ చేయడమే కాదు.. ఇంటికి కూడా తీసుకెళతాం. అలా ఇంటికి తీసుకెళ్లే సినిమాల్లో ‘జాను’ ఒకటి. ఎంటైర్ యూనిట్‌కి కంగ్రాట్స్’’ అన్నారు.
జూనియర్ శర్వానంద్‌గా(రామ్ పాత్రలో) నటించిన సాయికిరణ్ మాట్లాడుతూ – ‘‘నాకు అవకాశం ఇచ్చిన దిల్‌రాజు, శిరీష్‌గారికి థ్యాంక్స్. ప్రేమ్‌కుమార్‌గారు మేజిషియన్. నాకు ఎంతో సపోర్ట్ అందించారు. యంగ్ రామ్ పాత్రలో నటించినందుకు హ్యాపీగా ఉంది. కిరణ్‌గారు చాలా మంచి డైలాగ్స్ రాశారు. సమంతగారికి నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఆమెతో కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు.
జూనియర్ సమంతగా(జాను చిన్నప్పటి పాత్రలో) నటించిన గౌరి మాట్లాడుతూ – ‘‘96’ సినిమాను నా డెబ్యూ మూవీగా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. జాను సినిమాతో అదే పాత్రను చేయడం మరింత అదృష్టంగా భావిస్తున్నాను. ప్రేమ్‌కుమార్‌గారు నా పాత్రను అద్భుతంగా మలిచారు. సమంతగారి చిన్నప్పటి పాత్రలో నటించడం గౌరవంగా ఉంది. మేం మేజిక్‌ను రీ క్రియేట్ చేశాం. ప్రేక్షకుల అభిమానాలు, ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నాను’’ అన్నారు.
ఇంకా ఈ సినిమాలో ఎంటైర్ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
Related Images:
-
-
శర్వానంద్ ‘శ్రీకారం’ ఏప్రిల్ 24 విడుదల
Category : Latest Reviews Movie News Sliders
యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘శ్రీకారం’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం దీని షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
ఇటీవల చిత్ర బృందం ఆవిష్కరించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు చాలా మంచి స్పందన వచ్చింది. తాజాగా నిర్మాతలు సినిమా విడుదల తేదీ ప్రకటించారు. ఏప్రిల్ 24న ‘శ్రీకారం’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
సినిమాల విడుదలకు సమ్మర్ అతి పెద్ద సీజన్ అనే విషయం తెలిసిందే. ‘శ్రీకారం’తో సమ్మర్ హాలిడేస్ ను క్యాష్ చేసుకోవడానికి శర్వానంద్ రెడీ అవుతున్నారు. కిషోర్ బి. డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో శర్వానంద్ జోడీగా ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది.
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ మూవీని నిర్మిస్తున్నారు. ‘గద్దలకొండ గణేష్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వాళ్లకు ఇది రెండో చిత్రం.
‘గద్దలకొండ గణేష్’ మూవీతో మాస్ ట్యూన్స్ కూడా ఇస్తానని నిరూపించుకొని మంచి ఫామ్ లో ఉన్న మిక్కీ జె మేయర్ ‘శ్రీకారం’కు వినసొంపైన బాణీలు అందిస్తున్నారు. పేరుపొందిన రైటర్ సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తుండగా, జె. యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
తారాగణం:
శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్, రావు రమేష్, ఆమని, సీనియర్ నరేష్, సాయికుమార్, మురళీ శర్మ, సత్యా, సప్తగిరి
సాంకేతిక వర్గం:
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
డైరెక్టర్: కిషోర్ బి.
మ్యూజిక్: మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
ఆర్ట్: అవినాష్ కొల్లా
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా
Related Images:
-
-
పిబ్రవరి 7న విడుదలవుతున్నయూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘త్రీ మంకీస్
Category : Latest Reviews Movie News Sliders
పిబ్రవరి 7న విడుదలవుతున్నయూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘త్రీ మంకీస్’.
జబర్దస్థ్ షో ద్వారా బుల్లితెరపై ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ బిగ్ స్క్రీన్‌పై ‘త్రీ మంకీస్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. కారుణ్య చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ జి. దర్శకత్వంలో నగేష్ జి. ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం పిబ్రవరి 7న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో,.
దర్శకుడు అనిల్ మాట్లాడుతూ – ‘త్రీ మంకీస్’ ఇప్పటి వరకు నేను భరించాను. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వదులుతున్నా జబర్దస్త్ ని మించి ఈ సినిమా ఉంటుంది. కామెడీ తోపాటు అన్ని అంశాలుంటాయి. పక్కా పైసా వసూల్ చిత్రమిది. ఈ సినిమాలో సుధీర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, గెటప్ శ్రీను అప్ కమింగ్ డైరెక్టర్‌గా, రాంప్రసాద్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ గా కనిపిస్తారు. ఇక హీరోయిన్ కారుణ్య సన్నీలియోన్ గా మిమ్మల్ని అలరిస్తుంది. రేపు థియేటర్ లో సినిమా చూసి తప్పకుండా ఎమోషన్ అవుతారు“అన్నారు.
చిత్ర నిర్మాత నగేష్ – “ సినిమా పూర్తయి చాలా రోజులైంది మంచి టైమ్ కోసం వెయిట్ చేశాం ఫిబ్రవరి 7న
మంచి టైమ్ గా భావిస్తున్నాం ‘త్రీ మంకీస్’ టైటిల్ కి సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ యాప్ట్ అనేలా పెర్‌ఫామ్ చేశారు. నాకు మా బేనర్‌కి మంచి పేరు చిత్రమవుతుంది“ అన్నారు.
సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ – “శ్రీను, రాంప్రసాద్ ఈ ఇద్దరే నా బలం. మేము ముగ్గురం కలిసి సరదాగా నటించాం.
కామెడీతోపాటు సెంటిమెంట్, ఎమోషన్స్ ఉంటాయి. ఈ సినిమా విజయవంతం చేసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం“ అన్నారు.
గెటప్ శ్రీను మాట్లాడుతూ – ‘సినిమా విడుదల కోసం నేను మా టీమ్అందరం చాలా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నాం ముగ్గురం
కలిసి నటించిన తొలి చిత్రమిది, ఫ్యామిలీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఉంటుంది“అన్నారు.
ఆటో రామ్ ప్రసాద్ మాట్లాడుతూ – “జబర్దస్త్ లో మొదటి స్కిట్ చేసినప్పుడు ఎంత టెన్షన్ పడ్డామో, ఈ సినిమా కోసం అంతే టెన్షన్ గా వెయిట్ చేస్తున్నాం. అందులో సక్సెస్ అయ్యాం. సినిమా విషయంలో కూడా తప్పకుండా సక్సెస్ అవుతామని నమ్ముతున్నాను. మంచి సినిమాలను ఆడియెన్స్ ఆదరిస్తారు. మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా“ అన్నారు.
హీరోయిన్ కారుణ్య మాట్లాడుతూ – “ఇందులో డిఫరెంట్ రోల్ చేస్తున్నాను. నేను గతంలో ఎప్పుడూ ఇలాంటి పాత్ర చేయలేదు. ఈ పాత్రని నా కంటే దర్శకుడే ఎక్కువగా నమ్మారు ‘త్రీ మంకీస్’ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది“ అన్నారు
సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, కారుణ్య తదితరులు నటిస్తున్న ఆ చిత్రానికి
కథ, సంగీతం, దర్శకత్వం: అనిల్ కుమార్. జి,
నిర్మాత: నగేష్. జి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి బాబు వాసిరెడ్డి,
లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ సాయి,
సినిమాటోగ్రఫీ: సన్నీదోమల,
ఎడిటింగ్: ఉదయ్ కుమార్,
సంగీతం: అనిల్ కుమార్ జి.
మాటలు: అరుణ్. వి,
లిరిక్స్: శ్రీమణి,
పిఆర్ఓ: వంశీ – శేఖర్.
Related Images:
-
-
‘‘పలాస 1978’’ మూవీ నుండి నక్కిలీసు గొలుసు అనే సాంగ్ ను రిలీజ్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్
Category : Latest Events Latest Reviews Movie News Sliders
రక్షిత్ నటన నన్ను ఆశ్చర్య పరిచింది- ‘‘పలాస 1978’’ మూవీ నుండి నక్కిలీసు గొలుసు అనే సాంగ్ ను రిలీజ్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్
1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘‘పలాస 1978’’ . తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో
రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. డైరెక్టర్ కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ విడుదలకు ముందే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. జిఎ2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్న ఈ
మూవీ త్వరలో విడుదలకు సిద్దం అవుతుంది. ‘పలాస 1978’ సినిమా చూసి, టీం ని అభినందించి ‘పక్కన పడ్డాది చూడరో పిల్లా నాది నక్కిలీసు గొలుసు’ అనే పాటను టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ గారు లాంఛ్ చేసారు..
ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ గారు మాట్లాడుతూ:
‘దర్శకుడు కరుణ్ కుమార్ గారు రైటర్ గా ఉన్నప్పుటి నుండి నాకు తెలుసు, ఆయన కథలు కొన్ని నేను చదివాను చాలా బాగుంటాయి. దర్శకుడిగా తన తొలి ప్రయత్నంలోనే వాస్తవ సంఘటనల ఆధారంగా కథను రెడీ చేసుకొని ‘పలాస 1978’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు రక్షిత్ నటన నన్ను ఆశ్చర్యపరిచింది. కొత్త కుర్రాడు ఎలా చేస్తాడు అనుకున్నాను కానీ చాలా బాగా చేసాడు. పల్లెటూరి కుండే సంస్కృతిని తెరమీద ఆవిష్కరించే దర్శకులు తెలుగులో తక్కువ మంది ఉన్నారు. వారి కంటే దర్శకుడు కరుణాకుమార్ ముందడుగు వేసాడు. మిగతా వారు ఆయన్ను ఫాలో అవ్వాలి. ఇందులో పాటలు కూడా చాలా బాగున్నాయి. ఉత్తరాంధ్ర జానపదం చాలా ఫేమస్ మా కాలేజ్ రోజుల్లో కూడా ఆపాటలే పాడుకునే వాళ్ళం. అలాంటి ఉత్తరాంధ్ర జానపదం నుండి వచ్చిన ‘ పక్కన పడ్డాది చూడరో పిల్లా నాది నక్కిలీసు గొలుసు’ పాట చాలా బాగుంది. ఈ సినిమాకు మ్యూజిక్ ని అందించడమే కాకుండా ముఖ్య పాత్రను పోషించిన రఘ కుంచె ను అభినందిస్తున్నాను. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని
కోరుకుంటున్నాను’ అన్నారు.
రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్
సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్దం అవుతున్న ఈ చిత్రానికి పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం :
రఘు కుంచె,
పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా,
నిర్మాత : ధ్యాన్ అట్లూరి.
రచన- దర్శకత్వం : కరుణ కుమార్.
Related Images:
Search
Latest Updates
- శ్రీకృష్ణుడు ఏకలవ్యుడిని ఎందుకు చంపాడో తెలుసా?
- రూ.16వేల కోట్లు చాలవు… ‘అవతార్ 2’ హిట్ కావాలంటే
- నా వారసుడు వచ్చేస్తున్నాడు.. నందమూరి బాలకృష్ట
- విశాఖ కనకమహాలక్ష్మి.. ఇక్కడ భక్తులే పూజలు చేయొచ్చు
- ప్రభాస్ ఫ్యాన్‌కి బ్యాడ్‌న్యూస్… ‘ఆదిపురుష్’ మళ్లీ వాయిదా?
- ‘కాంతార’ సర్ప్రైజ్.. ఈ అర్ధరాత్రి నుంచే ఓటీటీ స్ట్రీమింగ్
© Copyright 2020. All Rights Reserved