Category Archives: Latest Reviews

నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ‘టక్ జగదీష్’ ప్రారంభం

నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ‘టక్ జగదీష్’ ప్రారంభం

టాలీవుడ్ లోని మినిమం గ్యారంటీ హీరోల్లో ఒకరైన నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నారు. ‘నిన్నుకోరి’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఆ ఇద్దరి కాంబినేషనులో తయారవుతున్న సినిమా ఇది.

షైన్ స్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది నానికి 26వ చిత్రం.

గురువారం ఉదయం పూజా కార్యక్రమాలతో ‘టక్ జగదీష్’ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. ముందుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శక నిర్మాతలకు స్క్రిప్టును అందజేశారు. ఆ తర్వాత చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ కొట్టగా, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని కెమెరా స్విచ్చాన్ చేశారు.

నానితో ఇదివరకు ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నటించిన రీతు వర్మ, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ఫేమ్ ఐశ్వర్యా రాజేష్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్నారు.

‘టక్ జగదీష్’ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ఔట్ డోర్ లొకేషన్లలో జరుగుతుంది.

తారాగణం:
నాని, రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్, జగపతిబాబు, నాజర్, రావు రమేష్, నరేష్, మురళీశర్మ

సాంకేతిక వర్గం:
సంగీతం: ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: సాహి సురేష్
ఫైట్స్: వెంకట్
పీఆర్వో: వంశీ-శేఖర్
కాస్ట్యూం డిజైనర్: నీరజ కోన
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్)
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
రచన-దర్శకత్వం: శివ నిర్వాణ.
బ్యానర్: షైన్ స్క్రీన్స్

Related Images:



`జాను` ట్రైల‌ర్ విడుద‌ల‌

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ ‘జాను’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా…

హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – ”నా పదిహేడేళ్ల కెరీర్‌లో తొలి రీమేక్‌ ‘జాను’. తమిళ చిత్రం ’96’కు ఇది రీమేక్‌. ఎప్పుడైనా రీమేక్‌ చేయాలంటే ఏముంటుందిలే అనుకునేవాడిని. అలా అంతకు ముందు రెండు సినిమాలు రీమేక్‌ చేద్దామనుకుని మిస్‌ అయ్యాను. ’96’ సినిమాను తమిళంలో రిలీజ్‌ కంటే ఓ నెల ముందే చూశాను. ప్రివ్యూ థియేటర్‌ నుండి బయటకు రాగానే సినిమాను తెలుగులో రీమేక్‌ చేయాలని ఫిక్స్‌ అయ్యాను. ఈ సినిమాకు శర్వానంద్‌, సమంత ఫైనల్‌ కాకముందు చాలా చాలా అనుకున్నాను. ఆ సమయంలో చాలా కామెంట్స్‌ వినిపించాయి. వీళ్లకేమైనా పిచ్చా? అదొక క్లాసిక్‌ మూవీ. దిల్‌రాజుకేమైనా మెంటలా? ఎందుకు రీమేక్‌ చేస్తున్నాడు? అని చాలా కామెంట్స్‌ వచ్చాయి. నాకు అర్థం కాలేదు. ఒక ఆడియన్‌గా నేను సినిమా చూశాను. తమిళం నాకు పూర్తిగా రాదు. అయినా కూడా పాత్రలతో నేను ట్రావెల్‌ అయ్యి.. సినిమాకు ఎక్కువగా కనెక్ట్‌ అయ్యాను. నేను ఏదైనా ఆరోజు నమ్మానో..ఈరోజు కూడా అదే నమ్ముతున్నాను. సామ్‌ సినిమా చూసి ఓరిజినల్‌ డైరెక్టర్‌ అయితేనే సినిమా చేస్తానని అంది. చివరకు నేను ఓరిజినల్‌ డైరెక్టర్‌నే తెచ్చాను. సమంత నన్ను కలిసినప్పుడు నాపై నమ్మకంతో సినిమా చేయమని చెప్పాను. తను ఓకే అంది. రెండు రోజుల తర్వాత తనే ఫోన్‌ చేసి నాకు థ్యాంక్స్‌ చెప్పడమే కాదు.. మేజిక్‌ను ప్రతిరోజూ ఎంజాయ్‌ చేస్తున్నానని చెప్పింది. శర్వానంద్‌ కూడా సినిమా చూసి బ్యూటీఫుల్‌ మూవీ చేస్తానని నాకు ఫోన్‌ చేశాడు. అలా శర్వా, సామ్‌ ఈ సినిమాలోకి వచ్చారు. తమిళ సినిమాను డైరెక్ట్‌ చేసిన ప్రేమ్‌కుమార్‌, టెక్నీషియన్స్‌ అందరూ ఈ సినిమాకు వర్క్‌ చేశారు. ఫిబ్రవరి 7న తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నాం. నేను ఏదైతే ఫీలింగ్‌తో ఉన్నానో.. రేపు సినిమా చూసి ప్రేక్షకులు అదే ఫీలింగ్‌ నిజమని నమ్ముతారు. అమ్మాయిలైతే శర్వాతో ప్రేమలో పడితే.. అబ్బాయిలు సామ్‌తో లవ్‌లో పడతారు. అలాంటి సోల్‌ ఫుల్‌ లవ్‌స్టోరీ. అహా! అలాంటి లవర్‌ మనకుంటే బాగుండు అనే ఈర్ష్యతోనే లవ్‌లో పడతాం” అన్నారు.
అక్కినేని సమంత మాట్లాడుతూ – ” ఈ సినిమా క ఓసం దిల్‌రాజుగారు మా మేనేజర్‌కి ఫోన్‌ చేసి నన్ను కలవాలని అనగానే నేను భయపడ్డాను. ఎందుకంటే ఓ క్లాసిక్‌ సినిమాను రీమేక్‌ చేయాలి. విజయ్‌సేతుపతి, త్రిష అద్భుతంగా పెర్ఫామ్‌ చేశారు. దాంతో నేను నిజంగానే భయపడ్డాను. ఒకవేళ దిల్‌రాజుగారిని కలిస్తే ఓకే చెప్పేస్తాను. కాబట్టి దాదాపు వద్దనే చెబుతూ వచ్చాను. చివరికి ఆయన్ని కలిసి ఒక నిమషంలోనే నేను సినిమా చేస్తానని చెప్పాను. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌తో ఉన్న అనుబంధం కారణంగా.. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. తొలిరోజు షూటింగ్‌ పూర్తి కాగానే దిల్‌రాజుగారికి ఫోన్‌ చేసి థ్యాంక్స్‌ చెప్పాను. శర్వానంద్‌కి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్‌. ప్రతిరోజూ ప్రతి సీన్‌ వందశాతం పెర్ఫామెన్స్‌ ఇవ్వాలి. మేజిక్‌ జరగాలి. అలాంటిది చాలా కష్టం. దాన్ని కూడా క్రాస్‌ చేశానంటే ఏకైక కారణం శర్వానంద్‌ మాత్రమే. రేపు నాకేదైనా క్రెడిట్‌ దక్కినా మా ఇద్దరికీ దక్కుతుంది. ప్రతిసీన్‌ను ఇద్దరం డిస్కస్‌ చేసుకుని చేశాం. ఇద్దరం వందశాతం ఎఫర్ట్‌ పెట్టాం. మేం మేజిక్‌ క్రియేట్‌ చేశామని అర్థమవుతుంది. ఆ మేజిక్‌ను మీరు ఫిబ్రవరి 7న వెండితెరపై చూస్తారు” అన్నారు.
హీరో శర్వానంద్‌ మాట్లాడుతూ – ”దిల్‌రాజుగారు ఫోన్‌ చేసి సినిమా చూడమంటే చూశాను. ‘అన్నా ఇది క్లాసిక్‌ చేద్దామా?’ అన్నాను. దానికి దిల్‌రాజు ‘నన్ను నమ్ము’ అన్నారు. ఆయన జడ్జ్‌మెంట్‌పై బాగా నమ్మకం ఉంది. శతమానం భవతి అప్పుడు కూడా నన్ను నమ్ము అన్నారు. నేను నమ్మాను. నాకు పెద్ద హిట్‌ ఇచ్చారు. ఈసారి ఆయన ఆ సినిమాను కూడా దాటిస్తారని అనుకుంటున్నాను. సినిమా విషయానికి వస్తే.. సమంతగారు లేకుంటే నేను అంతగా చేయలేపోయేవాడినేమో. ప్రతిరోజూ సన్నివేశాల్లోని మేజిక్‌ను ఎంజాయ్‌ చేసేవాళ్లం. అది అన్ని సినిమాలకు కుదరదు. రేపు నాకేదైనా పేరొస్తే ఆ క్రెడిట్‌ సమంతకే దక్కుతుంది. ఈ మేజిక్‌ ప్రతి సీన్‌లో ప్రతి మూమెంట్‌లో కనపడుతుంది. చాలా మందికి లవ్‌ ఫెయిల్యూర్‌ అనేది జరుగుతుంటుంది. అయితే అందరికీ ఫస్ట్‌ లవ్‌ అనేది గుర్తుండిపోతుంది. నాకు తెలిసి ఈ మధ్య నాలుగైదేళ్లలో అంతకంటే ఎక్కువగా.. అంటే పదేళ్లపైగానే ఇలాంటి లవ్‌స్టోరీ రాలేదనే చెప్పాలి. చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్‌ చేస్తున్నాను. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చి తప్పకుండా ఏదో మేజిక్‌ అయితే జరుగుతుందని అనుకుంటున్నాను. డైరెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ సహా ఎంటైర్‌ టీమ్‌కు థ్యాంక్స్‌. ఫిబ్రవరి 7 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు.

న‌టీన‌టులు:
శ‌ర్వానంద్‌, సమంత‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, వెన్నెల కిషోర్‌, ర‌ఘుబాబు, తాగుబోతు ర‌మేశ్‌, శ‌ర‌ణ్య‌, గౌరి, సాయికిర‌ణ్‌, హాసిని త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: సి.ప్రేమ్‌కుమార్‌
నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్‌
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి అనిత‌
బ్యాన‌ర్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
సంగీతం: గోవింద్ వ‌సంత‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌హేంద్ర‌న్ జ‌య‌రాజ్‌
ఆర్ట్‌: రామాంజ‌నేయులు
మాట‌లు: మిర్చి కిర‌ణ్‌
పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శ్రీమ‌ణి

Related Images:


పది వసంతాలు పూర్తి చేసుకున్న ‘వై నాట్’ స్థూడియోస్

* ‘లవ్ ఫెయిల్యూర్’, ‘గురు’, గేమ్ ఓవర్’
తెలుగు నాట ‘వై నాట్’ స్థూడియోస్ విజయ కేతనం
* పది వసంతాలు పూర్తి చేసుకున్న ‘వై నాట్’ స్థూడియోస్
* మీడియా కు కృతఙ్ఞతలు

29 జనవరి 2020: ఒక ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియోగా మేం ఒక దశాబ్దం పూర్తి చేసుకున్నాం. ఒక బ్యానరుగా సాధారణం కంటే భిన్నమైన కంటెంట్ తో స్థిరంగా సినిమాలు నిర్మించడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాం. మా సంస్థను ప్రొడ్యూసర్ ఎస్. శశికాంత్ 2010లో నెలకొల్పారు. ఈ జనవరితో సినీ నిర్మాణంలో పదో సంవత్సరాన్ని గర్వంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పటివరకూ మేం 18 ఫీచర్ ఫిలిమ్స్ నిర్మించాం. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో చిత్రాలు నిర్మించే అతికొద్ది నిర్మాణ సంస్థల్లో ఒకటిగా మా సంస్థ గుర్తింపు పొందింది. ఎ.ఆర్. రెహమాన్, రాజ్ కుమార్ హిరాణీ, ఆనంద్ ఎల్. రాయ్ వంటి గొప్ప ప్రతిభావంతులతో కలిసి ఉన్నతస్థాయి చిత్రాల్ని నిర్మించామని చెప్పుకోవడానికి ఆనందిస్తున్నాం అని తెలిపారు సంస్థ అధినేత శశికాంత్

2010లో తమిళ చిత్రం ‘తమిళ్ పాడం’తో మేం చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించాం. సి.ఎస్. అముదన్ డైరెక్ట్ చేయగా శివ హీరోగా నటించిన ఆ మూవీ భారతదేశపు తొలి పూర్తి స్థాయి స్పూఫ్ ఫిలింగా గుర్తింపు పొందింది. మా బ్యానర్ నుంచి ప్రేక్షకులు ఎలాంటి చిత్రాల్ని ఆశించవచ్చో ఆ సినిమా తెలియజేసింది. అది మూసకు భిన్నమైన ఆసక్తికర, వినోదాత్మక చిత్రం. వినోదాన్నిచ్చే, ఉత్కంఠ కలిగించే ప్రభావవంతమైన కథలతో ‘వై నాట్ స్టూడియోస్’ సినిమాలు నిర్మిస్తుందనే విషయం ఆ మూవీతో ప్రేక్షకులకు తెలిసింది.

మా హిట్ మూవీస్ లో వినూత్న కథనంతో బాలాజీ మోహన్ రూపొందించగా అటు విమర్శకులు, ఇట్లు ప్రేక్షకులు మెచ్చిన ‘లవ్ ఫెయిల్యూర్’ (2013) వంటి ద్విభాషా రొమాంటిక్ కామెడీలు ఉన్నాయి. వసంత బాలన్ దర్శకత్వంలో ఒక చిత్రం నిర్మించాం. 2016లో సుధ కొంగర దర్శకత్వంలో మేం నిర్మించిన స్పోర్ట్స్ డ్రామా ‘గురు’ మూడు భాషల్లో నిర్మాణమైంది. సహ నిర్మాతగా హిందీలో తీసిన కామెడీ డ్రామా ‘శుభ్ మంగళ్ సావధాన్’ (2017), ఆ తర్వాత నిర్మించిన ‘గేమ్ ఓవర్’ (2019) సినిమాలు వాణిజ్యపరంగా విజయాలు సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందాయి.

అన్ని భాషల్లో సినిమాలు నిర్మించి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి 2018లో అనిల్ డి. అంబాని ఆధ్వరంలోని రిలయెన్స్ ఎంటర్‌టైన్మెంట్, ఏపీ ఇంటర్నేషనల్ సంస్థలతో కలిసి జాయింట్-వెంచర్ భాగస్వామ్యాన్ని ఏర్పాటుచేశాం.

2018లో ‘వైనాట్ ఎక్స్ మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్’ అనే లేబుల్ తో మార్కెంటింగ్, డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వెళ్లాం. ‘తమిళ్ పాడం 2’ (2018), ‘సూపర్ డీలక్స్’ (2019), ‘గేమ్ ఓవర్’ (2019), ’83’ (2020) సహా పలు కంటెంట్-డ్రివెన్ మూవీస్ ని డిస్ట్రిబ్యూట్ చేశాం, చేస్తున్నాం. చురుకైన మార్కెటింగ్ విభాగం.. అది ఏర్పాటైన దగ్గర్నుంచి అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల ప్రమోషన్సును నిర్వహిస్తూ వస్తోంది. 2019లో ‘వైనాట్ మ్యూజిక్’ అనే లేబుల్ తో సంగీతం ప్రపంచంలో అడుగుపెట్టాం. సమీప భవిష్యత్తులో ఉత్తేజకరమైన కేటలాగ్ ని విడుదల చేయబోతున్నాం.

మా పదో వార్షికోత్సవం సందర్భంగా, మా సృజనాత్మక అభిరుచిని నమ్మిన, కొంతకాలం కొత్త బృందంతో ప్రయోగాలు చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ మేము థాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇంతదాకా మా జర్నీలో ఒక భాగంగా ఉంటూ వస్తున్న మా భాగస్వాములు, తోటి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ఆడియో సంస్థలు, డైరెక్టర్లు, మ్యుజీషియన్లు, ప్రతిభావంతులు, సాంకేతిక నిపుణులు, సర్వీస్ ప్రొవైడర్స్, పీఆర్వోలు, ప్రెస్ అండ్ మీడియా అందరికీ సిన్సియర్ గా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.

‘న్యూ-వేవ్ సినిమా’ ప్రాజెక్ట్స్ ను రూపొందించే మార్గదర్శిగా, ప్రత్యేకించి ఇండియాలో, గుర్తింపు పొందడాన్ని గర్విస్తున్నాం.

“ఈ తరుణంలో మేము మరింత ఉత్తేజకరమైన సినిమాను రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాం. మా ముందున్న రహదారి ఎప్పటిలాగే ఉత్తేజకరమైనదిగా కనిపిస్తోంది. ఈ జర్నీని మీ అందరితో పంచుకోడానికి మేం ఎక్కువగా ఆశ్చర్యపోవట్లేదు. ఎందుకంటే, మా కృషి, పట్టుదలకు మీరందిస్తున్న ప్రశంసలు మమ్మల్ని భావజాలాలు, కొత్త కాన్సెప్టుల రూపకల్పనకు ప్రేరేపించి, మరింత పెద్ద కలలు కనేందుకు ముందుకు తోస్తున్నాయి. ఈ సంవత్సరం మీరు ‘వైనాట్ స్టూడియోస్’ బ్యానర్ కింద ‘డి40’ (ధనుష్ 40వ చిత్రం), ‘మండేలా’, ‘ఏలే’ సినిమాల్ని ఊహించవచ్చు.” అని తెలిపారు – ఎస్. శశికాంత్ (ఫౌండర్, ‘వైనాట్’ గ్రూప్) ఈ సందర్భంగా మీడియాకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

Related Images:



అభిమానుల ఆద్వర్యం లో సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ జన్మదిన వేడుకలు

అభిమానుల ఆద్వర్యం లో సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ జన్మదిన వేడుకలు

చిలకలూరిపేట :

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి శ్రీమతి నమ్రతా శిరోద్కర్ జన్మదినోత్సవ సందర్బంగా చిలకలూరిపేట కృష్ణ మహేష్ యువత హీలింగ్ పీపుల్స్ సొసైటీ ఇ. శ్రీనివాస్ రెడ్డి ఫ్రెండ్స్ సర్కిల్ ఆద్వర్యం లో చౌత్ర సెంటర్ లో ని శివాలయం వద్ద శ్రీ వాసవి జ్ఞాన మందిరం లో రక్త దాన శిబిరం ఏర్పాటు చేసి, ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషిత్ సామాజిక వైద్య శాల రక్త నిల్వ కేంద్రం వారికి అందజేశారు . ఈ కార్యక్రమం లో డా.రామ కృష్ణ గారు గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ స్టోరేజ్ టెక్నీషియన్ యస్ . ప్రసాద్, స్టాఫ్ నర్స్ లక్ష్మి, మరియు అభిమానులు నాజర్ వలి , షేక్ షంషుద్దీన్ , బషీర్ , నరేంద్ర పోతురాజు , సిద్ధిక్ , శివ , రామ కృష్ణ, హజరుద్దిన్ , షేక్ వల్యాసా , తిరుపతయ్య నాయక్ , నటరాజు, అంజిబాబు తదితర అభిమానులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ బాలికల దినోత్సవ సందర్బంగా క్యాన్సర్ వ్యాధి తో భాద పడుతున్న హఫిజున్ , ఆమె మనవరాలు జాన్ బి మతి స్థిమితం లేక ఫిట్స్ తో భాద పడుతున్నందున రూ. 11 వేల ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది .

జంగారెడ్డిగూడెం :
జంగారెడ్డిగూడెం లో సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి శ్రీమతి నమ్రతా శిరోద్కర్ జన్మదినోత్సవ సందర్బంగా బవిరిశెట్టి మురళి కృష్ణ ఆద్వర్యం లో స్థానిక ఏరియా ఆసుపత్రి నందు సత్య సాయి బాబా ట్రస్ట్ లో రోగులు, అభిమానుల సమక్షం లో కేక్ కట్ చేసి వార్డ్ లో ని రోగులకు పాలు రొట్టెలు పంపిణి చేసి భోజన వసతి ని ఏర్పాటు చేసారు . మురళి కృష్ణ మాట్లాడుతూ అభిమానులు సేవ దృక్పధం తో సేవ కార్యక్రమాలు చేస్తూ నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలి అని పేర్కొన్నారు . ఈ కార్యక్రమం లో 2020 క్యాలెండరు ను ఆవిష్కరించారు . రాపోలు భావన ఋషి , షేక్ వళ్ళి , షేక్ రజాక్ , కర్ణ పవన్ , తడికల పౌలు , పావలా చారి, రాంబాబు, పి . సురేష్ తదితర అభిమానులు పాల్గొన్నారు .

హైదరాబాద్:
R.T.C క్రాస్ రోడ్స్ లో ని సుదర్శన్ 35mm లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్బంగా, మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి శ్రీమతి నమ్రతా శిరోద్కర్ జన్మదినోత్సవ సందర్బంగా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన జాతీయ అధ్యక్షులు దిడ్డి రాంబాబు ఆద్వర్యం లో అభిమానుల సమక్షం లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసారు . ఈ కార్యక్రమం లో ప్రధాన కార్య దర్శి ప్. మల్లేష్, బ్యాంకు రాజు శ్రీనివాస్ గౌడ్, మహేందర్, డ్. వెంకటేష్, శివ, మోండా అశోక్,తదితర అభిమానులు పాల్గొన్నారు

విజయవాడ :
కృష్ణ జిల్లా విజయవాడ కృష్ణ లంక నల్ల గేట్ సెంటర్ వద్ద సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన సీనియర్ అభిమానం లొల్ల కృష్ణ మోహన్ ఆద్వర్యం లో ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్బంగా నిర్వహిస్తున్నట్టే మరియు ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ లో నిర్మించి, నటించిన సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్బంగా రక్త దానం నిర్వహించారు . ఈ రక్త దాన శిబిరాన్ని నగర వై. సి. పి . అధ్యక్షులు బొప్పన భావ కుమార్, ప్రారంభించి అభిమానులు ఇటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తమ హీరో లకు ఆదర్శంగా నిలిచి మానవత్వం చాటుకుంటున్నారు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమం లో వై. సి. పి .నాయకురాలు నిమ్మల జ్యోతిక తో పాటు అభిమానులు బడుగు సురేష్ , ప్రకాష్, డ్. యల్. ప్. సుబ్బా రెడ్డి, గుండు శ్రీనివాస్ రావు , కే. ప్. సీరం బుజ్జి, వేగి దుర్గ రావు, తదితర అభిమానులు పాల్గొన్నారు .

Related Images:


శ్రీమాతా క్రియేషన్స్ సుమన్, షియాజి షిండే ముఖ్య పాత్రల్లో వస్తోన్న సత్యం చిత్రం మొదటి షెడ్యూల్ తలకొన అడవుల్లో పూర్తి !!!

శ్రీమాతా క్రియేషన్స్ బ్యానర్ పై కె.మహాంతేష్ నిర్మాతగా అశోక్ కడబ దర్శకత్వంలో సంతోష్ బాలరాజు హీరోగా షియాజి షిండే, సుమన్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం సత్యం. నవంబర్ 2019లో అన్నపూర్ణ స్టూడియోన్స్ లో ప్రారంభం అయిన ఈ మూవీ మొదటి షెడ్యూల్ తలకొన అడవుల్లో పూర్తి అయ్యింది. ఈ షెడ్యూల్ లో షియాజి షిండే, సుమన్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

త్వరలో ఈ చిత్ర కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా కె.మహాంతేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అవినాష్, రంజిని రాఘవన్, వినయ్ ప్రసాద్, శృంగేరి రమణ, ఉమ , బసవ రాజు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. కెజిఎఫ్ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ రవి బన్సురు ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. సినిటెక్ సూరి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ మూవీకి కెవి.రాజు మాటలు రాస్తున్నారు అలాగే ఈ మూవీకి ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఎదురూరి అంజిబాబు వ్యవహరిస్తున్నారు.

Related Images:


దర్శకుడిగా మారుతున్న నిర్మాత విశ్వనాథ్ తన్నీరు

సినీ నిర్మాత విశ్వనాధ్ తన్నీరు ఇటీవల “యమ్ 6” వంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నారు, ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2 గా ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు.

ఈ సందర్భంగా విశ్వనాధ్ తన్నీరు మాట్లాడుతూ….
ఈ క్రొత్త ప్రాజెక్ట్ విశేషాలను తెలియజేసారు . సినిమా మీద ప్యాషన్ తో ఈరంగం లోకి వచ్చిన నేను “యమ్ 6” సినిమా తో నిర్మాతగా మారా . ఐతే నాకు దర్శకుడు కావాలనే కోరిక ఎప్పట్నుంచో ఉంది . ఈ క్రమంలో ఎన్నో కథలు విన్నా . చివరకు ఓ అద్భుతమయిన కథ దొరికింది . కంటెంట్ ఆధారం గా నిర్మితమవుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది . అలాగే ఈ సినిమా ద్వారా సమాజానికి ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తున్నాం . ముఖ్యంగా ఈ చిత్రం లోని క్లైమాక్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది . ఈ సినిమా లో హీరోగా మా గత చిత్రం “యమ్ 6 “లో హీరో గా చేసిన ధ్రువ ను ఎంపిక చేసాం. తనలో మంచి టాలెంట్ ఉంది . ఈ క్యారెక్టర్ కి తను బాగా మ్యాచ్ అవుతాడు . ఈ సినిమా ఫిబ్రవరి నెల లో హైదరాబాద్, రెండో షెడ్యూల్ వైజాగ్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కంప్లీట్ చేస్తాము. ఇలా 4 షెడ్యూల్స్ లో సినిమా మొత్తం కంప్లీట్ చేస్తాం అన్నారు . రాగిణి, డి.యస్ .రావు , గురురాజ్ , నామాల రవీంద్ర సూరి , మాస్టర్ జైనీత్ , దిల్ రమేష్ ,శివమ్ శివరాత్రి, గిరి , తిలక్ , నర్సిరెడ్డి , చంటి , సందీప్ , కుమరం మొదలగువారు నటిస్తున్నారని తెలిపారు.

హీరో ధ్రువ మాట్లాడుతూ…
M6 సినిమాతో నన్ను హీరోగా పరిచయం చేసిన విశ్వనాధ్ గారికి ధన్యవాదాలు. ఆయన దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా ఇది, నాకు రెండో సారి ఈ వినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాతో నేను మరింత పేరు తెచ్చుకొని ప్రేక్షకుల ఆదరణ పొందుతాను. ఫిబ్రవరి మొదటివారంలో షూటింగ్ కు వెళ్లి కంటిన్యూటి షెడ్యూల్ లో షూట్ కంప్లీట్ చెయ్యబోతున్నాము అన్నారు.

ఆర్టిస్ట్స్:
హీరో ధ్రువ, రాగిణి, డి.యస్ .రావు , గురురాజ్ , నామాల రవీంద్ర సూరి , మాస్టర్ జైనీత్ , దిల్ రమేష్ ,శివమ్ శివరాత్రి, గిరి , తిలక్ , నర్సిరెడ్డి , చంటి , సందీప్ , కుమరం

టెక్నీషియన్స్:
కథ , మాటలు:వేమగిరి , మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ కూరాకుల
పాటలు :మౌనశ్రి మాలిక్
ఎడిటింగ్ : సోమేశ్వర్ పోచం
పిఆర్ఓ: మధు. విఆర్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌ : గుర్రపు విజయ్
స్క్రీన్ ప్లే , దర్శకత్వం: నిర్మాత : విశ్వనాధ్ తన్నీరు

Related Images: