Category Archives: Latest Reviews

‘సరిలేరు నీకెవ్వరు` ప్ర‌తి సాంగ్‌కి ఎక్స్‌ట్రార్డిన‌రి రెస్పాన్స్ రావ‌డం హ్యాపీగా ఉంది – రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్.

టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ మ్యూజికల్ హిట్స్ ను అందించి అందరి అభిమానుల మన్ననలు పొందుతూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్. ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. చిత్రానికి స్వరాలను అందించారు. ఇప్పటికే విడుదలైన అన్ని పాటలకు దేశవ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న సినిమా విడుదలవుతున్న సందర్భంగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇంటర్వ్యూ..

ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు కదా ఇంకా ఏం చేయగలం అని ఎప్పుడైనా అనిపించిందా?
లక్కీ గా ఎప్పుడూ అలా అనిపించింది లేదు. ఎందుకంటే 2020 లో విడుదలయ్యే నా మొదటి సినిమా `సరిలేరు నీకెవ్వరు`. నిజంగా ఇది నాకు ఫస్ట్ సినిమాలానే అనిపిస్తుంది. ప్రతి సినిమా కి ఆ భయం అయితే ఉంటుంది. ‘అది ఉన్నంతకాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆ భయం మనలో ఉంటే ప్రతి సినిమా ఒక ఛాలెంజ్ లా తీసుకొని చేస్తాము. ఈ విషయం ‘మన్మధ బాణం’ సినిమా చేస్తున్నప్పుడు కమల్ హాసన్ గారు చెప్పారు. అలాగే మా టీమ్ అందరి ఎఫర్ట్ కూడా ఒక కారణం. మనచుట్టూ ఉన్నవాళ్ళని భయపడకుండా వాళ్ళ ఒపీనియన్ మనకు చెప్పే ఫ్రీడమ్ ఇవ్వడం కూడా మన సక్సెస్ లో ఒక పార్ట్ అని నా భావన.
ఈ సినిమా ఓపెనింగ్ రోజు మహేష్ బాబు ఫ్యాన్స్ కి మాస్ సాంగ్, ల‌వ్‌, పార్టీ సాంగ్ ఇస్తానని మాట ఇచ్చారు క‌దా?
– ఈ సినిమా ఓపెనింగ్ రోజు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ నచ్చేలా ఒక మాస్ సాంగ్ ఇస్తానని చెప్పాను. అలాగే `మైండ్ బ్లాక్`,`డాంగ్ డాంగ్‌` సాంగ్ కి సోషల్ మీడియా లో టెర్రిఫిక్ రెస్పాన్స్ వస్తోంది. అందరి హీరోలకి మాస్ సాంగ్స్ చేశాను. ఇప్పుడు మహేష్ గారికి మాస్ సాంగ్ చేయాలన్నకోరిక ఈ సినిమాతో తీరింది. అందుకు కారణమైన అనిల్ రావిపూడి గారికి ఈ సందర్భంగా థాంక్స్ తెలియజేస్తున్నా అలాగే డిసెంబర్ లో మాస్ `ఎస్ఎస్‌ఎంబి మండేస్` అని ప్రతి సోమవారం ఒక సాంగ్ ని విడుదల చేశాం. ఇది నాకు, మా టీమ్ అందరికీ ఒక పరీక్ష లాంటిది. అయితే విడుదల చేసిన ప్రతి సాంగ్ కి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. అన్ని పాటలను ఆదరించిన ప్రేక్షకులకి, మీడియా వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
మహేష్ బాబుతో మీ జ‌ర్నీ గురించి?
– మహేష్ గారితో ఇది నా ఐదవ సినిమా. ఆయనతో జర్నీ చేయడం ఎప్పుడూ గొప్పగా ఉంటుంది. నేను ఎప్పుడూ చెప్తుంటాను `మహేష్ గారు కేవలం సూపర్ స్టార్ మాత్రమే కాదు ఒక సూపర్ స్టార్ కి కావాల్సిన మంచి మనసు ఉంది’అని. ఎందుకంటే ఇప్పటివరకు ఆయనతో పనిచేసిన డైరెక్టర్స్ అందరితో నేను వర్క్ చేశాను. అందరూ కూడా ఒకే మాట అంటారు ఏంటంటే `మహేష్ తో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలనుంది` అని. ఒక సారి కథ విని ఓకే అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఆయన టెక్నీషియన్స్ కి సపోర్ట్ చేస్తారు. కంప్లీట్ గా డైరెక్టర్స్ యాక్టర్ ఆయన. అంత పెద్ద స్టార్ మనమీద నమ్మకం పెట్టినప్పుడు మనకు తెలియకుండానే పని మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. అందుకే అన్నీ బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవ్వగలిగాను.
ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడితో వ‌ర్క్ ఎక్స్‌పీరియ‌న్స్‌?
– అనిల్ రావిపూడి గారితో నేను `ఎఫ్ 2` మూవీ చేశాను. ఈ సినిమాను చాలా ఎక్స్ట్రార్డినరీ గా హ్యాండిల్ చేశారు. అనిల్ అనగానే మనకు ఎంటర్టైన్మెంట్ గుర్తొస్తుంది. కానీ మహేష్ బాబు గారి సినిమాల్లో ఉండే సందేశం మిస్ కాకుండా, మహేష్ ఫ్యాన్స్ ఆయన్ని ఎంత ఎనర్జీ గా చూడాలనుకుంటున్నారో ఈ రెండు పర్ఫెక్ట్ మిక్స్ గా ఈ సినిమా వచ్చింది. మహేష్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. నేను ఆర్.ఆర్ చేస్తున్నప్పుడే రిపీటెడ్ గా చూశాను. ఈ సినిమాలో ఆయన డాన్సులు ఆడియన్స్ కి బోనస్.
సరిలేరు నీకెవ్వరు ఆంథ‌మ్‌ సాంగ్ గురించి?
– నాకు ఆర్మీ అంటే చాలా గౌరవం. ఇప్పటివరకు ఆ జోనర్ లో సినిమా చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు ఒక సూపర్ స్టార్ తో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సినిమా అనగానే చాలా హ్యాపీ గా ఫీలయ్యాను. అనిల్ గారు ఫస్ట్ చెప్పడమే సరిలేరు నీకెవ్వరు అనేది ఆర్మీ వారికి ఒక ట్రిబ్యూట్ అని చెప్పారు. ఆ ఇన్స్పిరేషన్ తోనే ఆంథ‌మ్‌ సాంగ్ `భగ భగ భగ భగ మండే నిప్పులవర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకే వాడే సైనికుడు`.. నేనే రాశాను. ఆ లిరిక్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే యూరప్ లో మేసెడోనియన్ సింఫనీ ఆర్కస్ట్రా తో రికార్డ్ చేశాం. వారు కూడా చాలా ఎగ్జైట్ గా ఫీలయ్యారు. మహేష్ గారు కూడా ఆ పాట విని డైరెక్టర్ ఒక కథ రెండున్నర గంటల కథ చెప్తే దేవి ఒక పాటలో వినిపించాడు. దేవి మామూలోడు కాదు అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది.
మైండ్ బ్లాక్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది కదా! దాని గురించి చెప్పండి?
– నా దృష్టిలో ఒక పెద్ద హీరో నుండి మాస్ సాంగ్ వచ్చినపుడు ఆ పాట ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి అదేవిధంగా ఆ సాంగ్ కి హీరోకి లింక్ కూడా ఉండాలి అనేది నా కోరిక. అందులోనూ కథ చెప్పటప్పుడే మహేష్ గారిని పక్కా మాస్ గా చూపించబోతున్నాము అని చెప్పారు. నాకు చాలాఎగ్జైట్ మెంట్ వచ్చింది. అందుకే ఎపుడు ప్యాంటేసే వాడు ఇపుడు లుంగీ తొడిగాడు,.అని రాశాం. ఆ పాట‌ని మహేష్ గారు విన్నప్పుడు పడి పడి నవ్వారు. ఏంటి ఇప్పుడు ఇవన్నీ నాతో చేయిస్తారా? అని అడిగారు. అందుకే కదా సర్ లిరిక్స్ లో రాశాం అని చెప్పాము. మీరు ముందునుండి ప్రిపేర్ అయి ఉన్నారు అన్నట్టుగా చూశారు. రేపు థియేటర్ లో ఆ సాంగ్ వేరే రేంజ్ లో ఉంటుంది.
తొమ్మిది ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు కదా ! రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతారా?
– తప్పకుండా అండీ, నేను అవార్డ్స్ ని రెండు కోణాలలో చూస్తాను. ఒకటి మన వర్క్ నచ్చి ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేశారో దాన్ని మించిన అవార్డ్ లేదు. ఇక అవార్డ్ అనేది వారు మనకు ఇచ్చే గొప్ప గౌరవం. అది నాకు రెస్పాన్సిబుల్ ని పెంచుతుంది.
నిర్మాత అనిల్ సుంకర గురించి?
– మా నిర్మాత అనిల్ సుంకర గారు చాలా స్వీట్ పర్సన్. చాలా ఎంకరేజింగ్ గా ఉంటారు. ఒక సాంగ్ యూరప్ వెళ్లి కంపోజ్ చేద్దాం అన్నప్పుడు తప్పకుండా చెప్పడం అని సపోర్ట్ చేశారు. ఒక ప్యూర్ సినిమా లవర్. మాస్ సాంగ్ చేయబోతున్నాం అన‌గానే తప్పకుండా చేద్దాం. మహేష్ గారిని అలా చూపించాలి. చాలా బాగుంటుంది. అని చాలా ఎగ్జైట్ అయ్యారు.
మీరు హీరోగా సినిమా చేస్తున్నారనే వార్త చాలా సంవత్సరాలుగా వినిపిస్తోంది. ఆ సినిమా ఎంతవరకూ వచ్చింది ?
– సినిమా చేయమని అడుగుతున్నారు గాని, నాకు మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రస్ట్ వల్లనేమో యాక్టింగ్ చేయాలనే ఆసక్తి రావడం లేదు. అయితే నాకు తమిళంలో ఎక్కువమంది కథలు చెబుతున్నారు. సంగీతం ప్రధానంగా సాగే కొత్త కథ ఉంటే ఏదైనా ఉంటే త‌ప్ప‌కుండా చేస్తాను.
మీ తదుపరి సినిమాల గురించి ?
– సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లోఒక సినిమా చేస్తున్నాను. మా కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఉంటుంది. అలాగే ‘ఉప్పెన’ సినిమా చేస్తున్నాను. నితిన్, కీర్తి సురేష్ ల ప్యూర్ లవ్ స్టోరీ ‘రంగ్ దే’ చేస్తున్నాను. అలాగే కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ సినిమా కూడా చేస్తున్నాను. అలాగే హిందీలో ఒక సినిమా చేయబోతున్నాను దాని వివరాలు త్వరలో తెలియజేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Related Images:




“విట్టల్ వాడి” రిలీజ్ కి ముందే హిందీ రీమేక్ రైట్స్ కోసం ఉత్సాహం చూపిస్తున్న గురుదేవ్ పిక్చర్స్

ఎన్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రోహిత్,సుధా రావత్,నటీనటులుగా నాగేందర్.టి.దర్శకత్వంలో జి.నరేష్ రెడ్డి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా
నిర్మిస్తున్న చిత్రం “విట్ఠల్ వాడి” ఈ కొత్త మూవీ రిలీజ్ కి రెడి అయిన సందర్భంగా చిత్ర యూనిట్ సినీ ప్రముఖుల కు సినిమా ప్రివ్యూ చూయించారు. సినిమా ప్రివ్యూ చూసిన కొంతమంది ప్రముఖులు సినిమా బాగా చిత్రీకరించారని సాంగ్స్ సినిమా కి హైలెట్ అని రోషన్ కోటి మ్యూజిక్ చాలా బావుందని కొత్తవాళ్ళైన హీరో రోహిత్ ని హీరోయిన్ ని మెచ్చుకున్నారు. గొప్ప కథ ని ప్రేక్షకులకు అందించబోతున్న డైరెక్టర్ టి నాగేందర్, ప్రొడ్యూసర్ నరేష్ గారిని అభినందించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జి.నరేష్ రెడ్డి మాట్లాడుతూ: -ఇందులో రొమాంటిక్ సీన్స్ బాగా వచ్చాయి.హీరో రోహిత్ బాగా యాక్ట్ చేసాడు,సెంటిమెంట్స్ సీన్స్ కూడా బాగా వచ్చాయి.ఈ యాక్షన్, సెంటిమెంట్స్ సీన్స్ కు అందరూ కనెక్ట్ అయ్యారు.సినిమా చూసిన గురుదేవ్ పిక్చర్స్ అధినేత ప్రమోద్ కుమార్ సినిమా బాగుందని హిందీ లో ఒక ప్రముఖ నటుడి కొడుకుని లాంచ్ చెయ్యడానికి హిందీ రీమేక్ రైట్స్ కోసం ఆసక్తి చూపుతున్నారని ప్రొడ్యూసర్ నరేష్ హర్షం వ్యక్తం చేశారు..సినిమా ఫస్ట్ లుక్ తో పాటు ట్రైలర్ పై మంచి రేస్పాన్స్ రావడం తో మేమంతా చాలా సంతోశంగా ఉన్నాము.త్వరలో గ్రాండ్ గా ప్రి రేలీజ్ ఈవెంట్ జరిపి,భారీ ఎత్తున
“విట్టల్ వాడి” సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

నటీనటులు
రోహిత్ రెడ్డి
కైషా రావత్
అమిత్
రోల్ రిడా
అప్పాజీ అంబరీష్ దర్బా
చమ్మక్ చంద్ర

సాంకేతిక నిపుణులు
కెమెరా మెన్ – సతీష్ అడపా
మ్యూజిక్ – రోషన్ కోటి
ఎడిటింగ్ – శ్రీనివాస్ మోపర్తి
పి ఆర్ ఓ – మధు వి ఆర్
ఫైట్స్ – శంకర్
ప్రొడ్యూసర్ – జి నరేష్ రెడ్డి
డైరెక్టర్ – నాగేందర్ టి

Related Images:



అన్న‌య్య నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ఓ మంచి కుటుంబ క‌థా చిత్రంలో న‌టిస్తే చూడాల‌ని కోరిక.. స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ `ఎంత మంచివాడ‌వురా`తో తీరింది – యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్

అన్న‌య్య నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ఓ మంచి కుటుంబ క‌థా చిత్రంలో న‌టిస్తే చూడాల‌ని కోరిక.. స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ `ఎంత మంచివాడ‌వురా`తో తీరింది – యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎంత మంచివాడ‌వురా`. ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణప్రసాద్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ఎలాంటి క‌ట్స్ లేకుండా క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది. సంక్రాంతి సంద‌ర్భంగా సినిమాను జ‌న‌వ‌రి 15న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ విడుదల చేశారు.

ఆర్ట్ డైరెక్ట‌ర్ రామాంజనేయులు మాట్లాడుతూ – “`ఎంత మంచివాడ‌వురా` మంచి కుటుంబ క‌థా చిత్రం. ఈ సంక్రాంతికి అందరికీ బావుండాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
టి.ఎన్‌.ఆర్ మాట్లాడుతూ – “తొలిసారి నాకు పూర్తినెగిటివ్ రోల్ ఇచ్చిన డైరెక్ట‌ర్ స‌తీశ్ వేగేశ్న గారికి థ్యాంక్స్‌“ అన్నారు.
రాజీవ్ క‌న‌కాల మాట్లాడుతూ – “డైరెక్ట‌ర్ స‌తీశ్ వేగేశ్న‌గారు నన్ను కొత్త కోణంలో చూపించ‌బోతున్నారు. ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్త‌, సుభాష్ గుప్త నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి చేస్తోన్న తొలి చిత్ర‌మిది. క‌ల్యాణ్‌రామ్‌గారికి కూడా థ్యాంక్స్‌. సినిమాలో గొప్ప న‌టీన‌టులు ఉన్నారు. అంద‌రూ అద్భుతంగా న‌టించారు. వీరితో క‌లిసి న‌టించ‌డం ఆనందంగా ఉంది. ఈ నెల 15న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న ఈ సినిమాను పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

న‌టాషా దోషి మాట్లాడుతూ – “జైసింహ‌లో బాల‌కృష్ణ‌గారితో న‌టించాను. ఇప్పుడు క‌ల్యాణ్‌రామ్‌గారితో ఈ సినిమాలో చేయ‌డం హ్యాపీగా ఉంది. సంక్రాంతికి విడుద‌ల‌వుతోన్న ఈసినిమాను పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

శ‌ర‌త్ బాబు మాట్లాడుతూ – “ఎంత‌మంచివాడ‌వురా` సినిమా సంక్రాంతికి వ‌చ్చి ష‌డ్ర‌సోపేత‌మైన విందును అందించ‌బోతుంది. ప్రేక్ష‌కులు ఈ సినిమా పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

శుభ‌లేఖ సుధాక‌ర్ మాట్లాడుతూ – “ప్రేక్ష‌కుల కేరింత‌లు ఈ పండ‌గ‌కి నాలుగింత‌లు కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

ఆదిత్య మ్యూజిక్ అధినేత‌లు, నిర్మాత‌లు ఉమేష్ గుప్త‌,సుభాష్ గుప్త మాట్లాడుతూ – “మా బ్యాన‌ర్‌లో చేస్తోన్న తొలి సినిమాను నంద‌మూరి క‌ల్యాణ్‌గారితో ప‌నిచేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. గోపీసుంద‌ర్‌గారు, డైరెక్ట‌ర్ స‌తీశ్‌గారు స‌హా ఎంటైర్ టీమ్ చాలా డేడికేష‌న్‌తో ప‌నిచేశారు. సినిమా బాగా వ‌చ్చింది. హార్ట్ ట‌చింగ్‌, ఫీల్ గుడ్ మూవీ. త‌ప్ప‌కుండా ఈ నెల 15న విడుద‌ల‌వుతున్న ఈ సినిమా మీ అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. ఎంటైర్ యూనిట్‌కి థ్యాంక్స్‌“ అన్నారు.

ఆదిత్య మాట్లాడుతూ – “మా కుటుంబం ప్రొడ్యూస్ చేస్తున్న తొలి చిత్రం. ప్రేక్ష‌కులు ఇంత‌కు ముందు మ‌మ్మ‌ల్ని ఆద‌రించిన‌ట్లుగానే ఇప్పుడు కూడా ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను“ అన్నారు.
మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ మాట్లాడుతూ – “ఆదిత్య నిర్మాణ సంస్థ‌తో క‌లిసి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. పాట‌ల‌న్నీ చ‌క్క‌గా కుదిరాయి. ప్రేక్ష‌కులు ఆద‌రించారు. రేపు సినిమా కూడా అంద‌రికీ న‌చ్చుతుంది. కుటుంబ క‌థా చిత్రం. స‌పోర్ట్ చేసిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థ్యాంక్స్‌“ అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కులు శ్రీదేవి మూవీస్ అధినేత శివ లెంక కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ – “నంద‌మూరి హీరోలు క్ర‌మ‌శిక్ష‌ణ‌కు పెట్టింది. బాల‌కృష్ణ‌గారితో నేను నాలుగు సినిమాలు చేశాను. అంతే ప‌ట్టుద‌ల‌తో ఉంటారు. ఎన్టీఆర్, క‌ల్యాణ్‌రామ్‌గారికి సినిమాలంటే ఎంతో ప్యాష‌న్‌. ఎంత మంచివాడ‌వురా పండ‌గ సినిమా. త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు“ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న మాట్లాడుతూ – “నా త‌ల్లిదండ్రుల‌కు, న‌న్ను రైట‌ర్‌ని చేసిన ముప్ప‌ల‌నేని శివ‌గారికి, న‌న్ను డైరెక్ట‌ర్‌ని చేసిన ఈవీవీగారికి, అల్ల‌రి న‌రేశ్‌గారికి, నాకు శ‌త‌మానం భ‌వ‌తితో పున‌ర్జ‌న్మ‌ను ఇచ్చిన దిల్‌రాజుగారికి థ్యాంక్స్‌. 1963లో సీనియ‌ర్ ఎన్టీఆర్‌కి మా నాన్న‌గారు పెద్ద అభిమాని, అఖిల భార‌త ఎన్టీఆర్ సంఘానికి ఉపాధ్య‌క్షుడిగా పనిచేశారు. ఒక మ‌నిషికి ఆనందం, బాధ ఒకేసారి రాదు. చాలా అరుదు. నేను అభిమానించే తార‌క్‌, నాతో సినిమా చేసిన క‌ల్యాణ్‌రామ్‌ను చూసి ఆనంద‌ప‌డాలో.. మా నాన్న‌గారు ఈరోజు లేర‌ని బాధ‌ప‌డాలో తెలియ‌డం లేదు. `ఎంత మంచివాడ‌వురా` సినిమా ఎన్టీఆర్ మాస్ చేస్తే సింహాద్రి.. క్లాస్ చేస్తే బృందావ‌నం.. క్లాస్‌, మాస్ మిక్స్ చేస్తే ఒక అర‌వింద స‌మేత‌, ఒక జ‌న‌తాగ్యారేజ్. అలాగే నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌గారు మాస్ చేస్తే అత‌నొక్క‌డే, క్లాస్ చేస్తే 118, క్లాసు, మాసు క‌లిపి చేస్తే `ఎంత‌మంచివాడ‌వురా`. సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా థ్యాంక్స్‌. ఈ సినిమాను 72 రోజుల్లో పూర్తి చేయ‌డానికి కార‌ణ‌మైన నా టెక్నీషియ‌న్స్ అంద‌రికీ థ్యాంక్స్‌. ప్ర‌తి ఒక్కరూ ర‌క్తం చిందించి(జ‌ల‌గ‌ల మ‌ధ్య) సినిమాను పూర్తి చేశాం. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని భావిస్తున్నాం“ అన్నారు.

మెహ‌రీన్ మాట్లాడుతూ – “నాకు ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చిన క‌ల్యాణ్‌రామ్‌గారికి, ద‌ర్శ‌కుడు స‌తీశ్‌గారికి, నిర్మాత‌లు ఉమేష్‌గుప్త‌, సుభాష్ గుప్త‌, కృష్ణ ప్ర‌సాద్‌గారికి థ్యాంక్స్‌. టైటిల్ మాత్ర‌మే కాదు.. మా ఎంటైర్ యూనిట్ అంద‌రూ మంచివాళ్లే. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది“ అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ – “సంక్రాంతి సినిమాల పోటీలో నంద‌మూరి సినిమా కూడా నిల‌బ‌డింది. ఉమేష్ గుప్తా నాకు 20 ఏళ్లుగా మిత్రుడు. ఆయ‌న‌కు ఈ సినిమాకు పెద్ద‌గా హిట్ కావాలి. క‌ల్యాణ్‌రామ్‌గారి ప‌టాస్‌, 118 త‌ర్వాత ఈ సినిమా మా ఆధ్వ‌రంలో వ‌స్తోంది. పెద్ద హిట్ కావాలి“ అని అన్నారు.

ఎన్టీఆర్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. అనంత‌రం
క‌ల్యాణ్ రామ్ మాట్లాడుతూ – “ఆదిత్య మ్యూజిక్ వారికి మొద‌టి సారి ప్రొడ‌క్ష‌న్‌కి వ‌చ్చినందుకు ఆహ్వానం ప‌లుకుతున్నాం. జ‌న‌వ‌రి 15న మ‌న సినిమా వ‌స్తోంది. చూసి ఆనందిస్తార‌ని కోరుకుంటున్నా. సంక్రాంతి అంటేనే సినిమాల పండ‌గ‌. 9న ద‌ర్బార్‌, 11న మా అనిల్ రావిపూడి స‌రిలేరు నీకెవ్వ‌రు వ‌స్తోంది. థాంక్స్ బ‌న్నీ అండ్ త్రివిక్ర‌మ్‌గారూ… వాళ్ల సినిమా 12న వ‌స్తోంది. మా సినిమా 15న వ‌స్తోంది. చూసి ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా“ అని చెప్పారు.
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ – “బ్ర‌ద‌ర్స్ సైలెంట్‌గా ఉంటే మాట్లాడ‌తా. లేకుంటే ఇక్క‌డి నుంచి వెళ్లిపోతాను. ఇక్క‌డికి అభిమానులు, శ్రేయోభిలాషులు వ‌చ్చారు. వారంద‌రితో పాటు నేను కూడా వ‌చ్చినందుకు ఆనందంగా ఉంది. క‌ల్యాణ్ అన్న ఎన్నో వైవిధ్య‌మైన చిత్రాలు చేశారు. థ్రిల్లర్లు చేశారు. క‌మ‌ర్షియ‌ల్‌ మాస్ పంథా సినిమాలు చేశారు. అయితే ఆయ‌న ప‌ట్ల నాకు ఒక వెలితి ఉండేది. క‌ల్యాణ్ అన్న మంచి కుటుంబ సినిమా చేస్తే చూడాల‌ని ఉండేది. ఈ సినిమాతో మా ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న దాన్ని పూర్తి చేశారు. నిర్మాత కృష్ణ‌ప్ర‌సాద్‌గారు మా కుటుంబానికి శ్రేయోభిలాషి. మా కుటుంబ‌స‌భ్యుడు. బాబాయ్‌తో ఎన్నో సినిమాలు చేశారాయ‌న‌. అతిపెద్ద మ్యూజిక్ సంస్థ ఆదిత్య ఉమేష్ గుప్తాగారు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. వారిద్ద‌రూ క‌లిసి చేస్తున్న ఈ సినిమా చాలా పెద్ద‌గా ఆడాలి. గోపీసుంద‌ర్‌గారు మ్యూజిక్ ఇచ్చారు. వీరంద‌రి కాంబినేష‌న్‌లో ఎంత మంచివాడ‌వురా జ‌న‌వ‌రి 15న అంద‌రి ముందుకు రానుంది. మంచి మ‌న‌సుతో, మంచి చిత్రాన్ని ఆద‌రించే గొప్ప గుణం అంద‌రిలో ఉంది. తెలుగు ప్రేక్ష‌కదేవుళ్ల‌లో ఉంది. ఎంత మంచి వాడవురా టీమ్‌కి అంద‌రూ స‌హాయస‌హ‌కారాలు అందిస్తార‌ని ఆశిస్తున్నాను. అభిమానుల అంద‌రి ప్రాణం త‌ల్లిదండ్రుల‌కు, అన్న‌చెల్లెళ్ల‌కు, ఆ త‌ర్వాత నాకు, క‌ల్యాణ్ అన్న‌కి, మా కుటుంబానికి ఎంతో అవ‌స‌రం. అభిమానుల ఇంటిల్లిపాదీ ఆనందంగా ఉండాలి. అంద‌రికీ నూత‌న్య సంవ‌త్స‌ర, సంక్రాంతి శుభాకాంక్ష‌లు. ఈ పండ‌గ వాతావ‌ర‌ణంలో విడుద‌ల‌వుతున్న ద‌ర్బార్‌, స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పురం, ఎంత మంచి వాడ‌వురా… పెద్ద హిట్ కావాలి. ఈ చిత్రాల విజ‌యం తెలుగు చిత్ర సీమ ముందుకు వెళ్లేలా దోహ‌ద‌ప‌డాల‌ని కోరుకుంటున్నా“ అని అన్నారు.

Related Images:




అగాపే అకాడమీ బ్యానర్ లో వస్తోన్న నేను కేర్ ఆఫ్ నువ్వు చిత్రం ఫిబ్రవరి 14న విడుదల

అగాపే అకాడమీ బ్యానర్ లో వస్తోన్న నేను కేర్ ఆఫ్ నువ్వు చిత్రం ఫిబ్రవరి 14న విడుదల

ఆగాపే అకాడమీ పతాకంపై రతన్ కిషోర్,సన్య సిన్హా,సాగారెడ్డి,సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీనటులుగా సాగారెడ్డి తుమ్మ దర్శకత్వంలో అతవుల,శేషిరెడ్డి,పోలీస్ వెంకటరెడ్డి,శరద్ మిశ్రాలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం అయ్యారు. బెక్కం వేణు గోపాల్ ఈ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలుపుటకు రావడం జరిగింది.

ఈ సందర్భంగా లిరిక్ రైటర్ ప్రణవం మాట్లాడుతూ….
ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉన్నాయి. అన్ని పాటలు సందగర్భానుసారం వస్తాయి. ఈ చిత్రంలో నాకు అగాపే అకాడమీ బ్యానర్ వారు అవకాశం ఇచ్చారుమ్ వారికి ధన్యవాదాలు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం ఉందన్నారు.

నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ….
ఒక యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 1980 లో జరిగిన కథ ఇది. పల్లెటూరు లో పేదింటి అబ్బాయి. ఉన్నత స్థితిలో ఉన్న అమ్మాయి మధ్య జరిగిన ఒక కథను ఈ సినిమాలో అందంగా చూపించారు దర్శకుడు.

నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ….
సినిమా ట్రైలర్ చూశాను బాగుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది ఇది. సినిమా సక్సెస్ అయ్యి నిర్మాతలకు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్న. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఏ సట్టిఫికెట్ లభించింది. ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది అన్నారు.

డైరెక్టర్ సాగారెడ్డి తుమ్మ మాట్లాడుతూ….
ఈ సినిమాలో విలన్ పాత్రలో కూడా నటించాను. సెన్సార్ సభ్యుల నుండి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది. చిన్న సినిమాలు సక్సెస్ కావాలంటే అందరి సహకారం కావాలి. ప్రేమ మనిషిని జయిస్తుందని ఈ సినిమాలో చెప్పడం జరిగింది.

బ్యానర్: అగపే అకాడమీ
డిఓపి: జి.కృష్ణ ప్రసాద్
లిరిక్స్: ప్రణవం
మ్యూజిక్: ఎన్.ఆర్.రఘునందన్
ఆర్ట్: పి.ఎస్.వర్మ
యాక్షన్: షొలిన్ మల్లేష్
కొరియోగ్రాఫర్: నరేష్
సహా నిర్మాతలు: అతుల, శేష్ రెడ్డి, పోలిష్ వెంకట్ రెడ్డి, శరద్ మిశ్రా
కథ- స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరెక్షన్: సాగా రెడ్డి తుమ్మ

Related Images: