Category Archives: Latest Reviews

Mega Star Chiranjeevi – Koratala Siva Project To Commence Soon

Category : Latest Reviews News

Konidela Production Company and Matinee Entertainments, the two production houses that will jointly be producing the upcoming film that will see Koratala Siva and Chiranjeevi collaborating, have condemned the rumours surrounding the project and have confirmed that the pre-production is going on in full swing.

Putting a rest to the rumours that the film isn’t progressing as per plan, the makers have given an official statement to this tune. Koratala Siva and Mega Star Chiranjeevi have locked the script of this prestigious project.

The Megastar is presently busy with his film Sye Raa Narasimha Reddy, that he is working on with director Surender Reddy. He will commence work on the new project soon after he is done with the work.

Related Images:


Malli Malli Chusa poster

Ace producer D Suresh Babu to launch the teaser of #AnuragKonidena, Shweta Awasthi, Cairvee Thakkar starrer #MalliMalliChusa on January 22nd at 10:40 AM. Directed by #SaiDevaRaman and produced by Koteswara Rao, #MalliMalliChusa is a beautiful romantic entertainer. #MalliMalliChusaTeaser

Attachments area

Related Images:


మిస్ట‌ర్ మ‌జ్ను` సెన్సార్ పూర్తి … ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 25న విడుద‌ల‌

`మిస్ట‌ర్ మ‌జ్ను` సెన్సార్ పూర్తి … ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 25న విడుద‌ల‌

అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్టర్ మజ్ను`. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఈ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

అఖిల్‌ అక్కినేని సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: థమన్‌, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్‌ సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి.

Related Images:


శ్రీకారం చుట్టుకున్న “సింహనాదం”

శ్రీ లిఖిత మూవీ మేకర్స్-శ్రీ వైష్ణవ స్పిరిటైన్ మెంట్స్ సంయుక్తంగా.. యువ ప్రతిభాశాలి పి.శ్రీనివాస్ దర్శకత్వంలో నిర్మిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం “సింహనాదం” (శ్రీ నరసింహస్వామి వారి వైభవం). సుమన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది.

హైద్రాబాద్, భారతీయ విధ్యభవన్ లో జరిగిన కార్యక్రమంలో పలువురు స్వామిజీల ఆశీస్సులతో ఈ చిత్రం టైటిల్ లోగోను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సింహయాజి స్వామి, కామిశెట్టి శ్రీనివాస్, రామానుజాచార్యులు, విశ్రాంత న్యాయమూర్తి మాల్యాద్రి, బేజీపీ నాయకురాలు గీతామూర్తి, ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్(గోపి) తదితరులు పాల్గొన్నారు.

నరసింహస్వామి వైభవాన్ని చాటి చెబుతూ.. పి.శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సింహనాదం’ చిత్రం ఘన విజయం సాధించాలని వీరంతా అభిలాషించారు. ఈసందర్భంగా..
శ్రీ అహోబిల నరసింహ స్వామిపై తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన కీర్తనలతో కూడిన ‘సర్వం సింహమయం’ ఆడియో సీడీ ఆవిష్కరించారు. సుమన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం కోసం ప్రస్తుతం ఇతర నటీనటుల ఎంపిక జరుపుతున్నామని, త్వరలోనే సెట్స్ కు వెళ్లనున్నామని దర్శకుడు పి.శ్రీనివాస్ తెలిపారు.

ఈ చిత్రానికి కూర్పు: ఆవుల వెంకటేష్, ఛాయాగ్రహణం: మణి-దిలీప్, సంభాషణలు: చిట్టిశర్మ, సంగీతం: విజయ్ కురాకుల, నిర్మాణం: శ్రీలిఖిత మూవీ మేకర్స్-శ్రీ వైష్ణవ స్పిరిటైన్ మెంట్స్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పి.శ్రీనివాస్!!

Related Images:


ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు రివ్యూ

ntr-kathanayakudu-telugu-movie-review

కథ :

తారకరామారావు గారు మెదట రిజిస్టార్ ఆఫీస్ ఉద్యోగం చేసేవారు. కానీ 1947 వ సంవత్సరం లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తారు.
ఆ తరువాత సినిమా లపై ఉన్న మక్కువ తో చెన్నెకి వెళ్తాడు. సినిరంగం లో అందరిలాగనే అనేక ఇబ్బందులు ఎదుర్కోంటాడు. ఎల్వీ ప్రసాద్ గారి సహాయం తో సినిమా అవకాశాలు వస్తాయి. కానీ మయాబజార్ సినిమా లో కృష్ణడిగా వచ్చి అందరిని ఆకట్టుకుంటాడు. ఇక అప్పటినుంచి ఆయనోక గోప్ప స్టార్ గా ఎదుగుతాడు. ఈ కధ బసవతారకమ్మ గారి పాత్ర ని కూడా విశేషంగా చూపించారు. సినిమా లో అందరు లీనమై అయిపోయేలా సినిమాకధని తీర్చిదిద్దారు.

నటీనటుల ప్రతిభ :

బాలయ్య బాబు గారి గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. స్వర్గీయ నందమూరి తారకరామరావు గారిని అచ్చుగద్దినట్లు దింపేశాడు.
దాంతో పాటు ఆయన పై బాలయ్య బాబుకి ఉన్న గౌరవాన్ని కళ్ళకు కట్టీనట్లు చూపించారు. ఎన్టీఆర్ ని గుర్తుచేయడం లో ఫుల్ సక్సెస్ అయ్యడు అనే చెప్పాలి. ఆ తరువాత బసవతారకమ్మ గారి పాత్రని విద్యాబాలన్ ప్రాణం పోసింది అనే చెప్పాలి. ఇక సుమంత్ అక్కినేని నాగేశ్వర రావు గారి గెటప్ లో అదరగోట్టాడు. కళ్యాణ్ రామ్ కూడా హరికృష్ణ గారి పాత్రని చించేశాడు. చంద్రబాబు ను పాత్ర లో రానా ఇమిడిపోయాడు. సేమ్ టూ సేమ్ బాబు లాగే కనిపిస్తాడు. ఇక రకుల్,హాన్సిక, పాయల్,జయసుధ,జయ ప్రద లు అలా కనిపించి విందు చేస్తారు. నిత్యామీనన్ సావిత్రి పాత్ర లో నటించి అందరికి షాక్ ఇచ్చింది.

నటీనటులు అందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

నటనా అనుభవం లేని క్రిష్‌, సాయి మాధవ్‌ కూడా అనుభవజ్ఞులైన ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారు. తెరవెనుక ప్రతి ఒక్కరూ చక్కని ప్రతిభ చూపించారు.

సంభాషణలు, సినిమాటోగ్రఫీ, సంగీతం, ప్రొడక్షన్‌ డిజైన్‌ అన్నీ చాలా చక్కగా కుదిరాయి. ఆ కాలం వాతావరణాన్ని ప్రతిబింబించే ఆర్ట్‌కి తోడు, డ్రామాని ఎలివేట్‌ చేసిన కెమెరా, మ్యూజిక్‌ ఈ చిత్రానికి ప్లస్‌ అయ్యాయి. ‘మహానటి’ మాదిరిగా ఎమోషనల్‌గా కనక్ట్‌ చేసేంత డ్రామాకి తావు లేకపోయినా, తొలి సూపర్‌స్టార్‌ ఎదుగుదలని, ఆయన ఆలోచనలు, అంతరంగాన్ని ఆవిష్కరించి, ఆసక్తికరంగా చెప్పడంలో ‘ఎన్టీఆర్‌’ టీమ్‌ సక్సెస్‌ అయింది.

సాంకేతికవర్గం పనితీరు :

ఈ సినిమా కిగాను సినిమా ఆటో గ్రాపీ గా జ్ఞానశేఖర్ కి వందకి వంద మార్కులు వేయెచ్చు. బాలయ్య బాబు ని ప్రతి గెటప్ లో అదరగోట్టాడు. జ్ఞాన శేఖర్ ఈ సినిమా పై పెట్టిన శ్రద్ద స్రీన్ పై కనిపిస్తుంది. కీరవాణి మరోక సారి తన మార్క్ సంగీతం తో అందరిని కట్టి పడేశాడు.

పాటలకి, సన్నివేషాలకి తగ్గట్లుగా సంగీతాన్ని అందించాడు. క్రిష్ తనదైన కధనం తో మరోకసారి తన టాలెంట్ ను బయటపెట్టాడు.తెలుగువాడు గర్వేపడేలా క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ తీశాడు. ఇక బాలయ్య బాబు నిర్మాతగా ఎక్కడ డబ్బు పెట్టడానికి వెనుకాడలేదు. ప్రోడక్షన్ వ్యాల్స్ సూపర్ గా ఉన్నాయి.

విశ్లేషణ :

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో మొదటి పార్ట్ గా వచ్చిన కథానాయకుడు ఎన్.టి.ఆర్ యవ్వనం, సినిమాల్లోకి ప్రవేశం వంటి అంశాలతో తెరకెక్కించారు. సినిమా పరిశ్రమలో ఆయన చేసిన పాత్రలు.. తెలుగు పరిశ్రమకు ఆయన చేసిన సేవలను ఈ కథానాయకుడు సినిమాలో ప్రస్థావించారు. అయితే సినిమాలో బాలకృష్ణ అచ్చం ఎన్.టి.ఆర్ లా అభినయం అదరగొట్టాడు.

మనం నిజంగా చూసేదీ ఎన్టీఆరే కదా అన్నట్లు చూపించాడు క్రిష్. బాలయ్య బాబు తన తండ్రిపై ఉన్న గౌరవం తో ఈ సినిమా చాలా శ్రద్ద కనబరిచారు. అది స్రీన్ పై కనిపించింది. ఈ సినిమా లో దాదాపు 60 గెటప్స్ వేశారు. ప్రతీ గెటప్ లో బాలయ్య బాబు గారి ఆహార్యం కానీ డెలాగ్ డెలీవరీ కానీ నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుంది.

ప్లస్ పాయింట్స్ :

బాలయ్య బాబు,బాలయ్య బాబు

సంగీతం

సినిమాటో గ్రఫీ

మాయబజార్ సీన్స్

అలనాటి ట్రెండింగ్ పాటలు,ఫరెఫక్ట్ టైమింగ్

బాటం లైన్ :

ఒక్క మాటలో చెప్పాలంటే మనం బాలయ్య బాబు ఈ రేంజ్ లో సినిమా తీస్తాడు అస్సలు ఉహించి ఉండం. మనం ఉహించిన దాని కన్నా కూడా సినిమా డబుల్ రేంజ్ లో ఉంది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ఎన్టీఆర్ ఫాన్స్ కి కనులపండగ ఉంటుంది. తప్పనిసరిగా చుడండి

Related Images:


Anchor Pradeep Pelli Choopulu

Anchor Pradeep Pelli Choopulu

https://www.youtube.com/watch?v=zorqJrPamd0

Related Images:


Goodachari Official Trailer 4K

Happy Journey Movie Teaser

Happy Journey Movie Teaser

https://www.youtube.com/watch?v=B3mm_Q-6ysM

Related Images:


సంతోషం మీ చేతుల్లోనే | osho Rajneesh

ప్రాణ స్నేహితుడు చనిపోతున్నా కాపాడకుండా ఎలా వీడియో తీస్తున్నాడా చూడండి