Category Archives: Latest Reviews


జిఏ 2 పిక్చర్స్ , అల్లు అరవింద్ , బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” గా రాబోతున్న అఖిల్ అక్కినేని

జిఏ 2 పిక్చర్స్ , అల్లు అరవింద్ , బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” గా రాబోతున్న అఖిల్ అక్కినేని

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ప్రోడ‌క్ష‌న్ నెం 5 కి టైటిల్ కంఫర్మ్ అయ్యింది. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో నిర్మాత‌లు బ‌న్నీవాసు , వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” గా టైటిల్ ఖరారు చేసినట్టు చిత్రం యూనిట్ తెలిపింది. అలానే ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ వంటి యూత్ ఫుల్ టైటిల్ కి తగినట్లుగానే ఈ సినిమా యూత్ ని అలరించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే రీతిన రెడీ అవుతుంది అని దర్శక నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు.

అక్కినేని నాగేశ్వ‌రావు గారి, అక్కినేని నాగార్జున గారి న‌ట వార‌సుడుగా ప‌రిచ‌య‌మైన అఖిల్ అక్కినేని తన సినిమాల ద్వారా ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. త‌ను చేసిన హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్జూ లాంటి ల‌వ్ కమ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్స్ తో అక్కినేని అభిమానుల‌నే కాకుండా ఫ్యామిలి అండ్ గ‌ర్ల్స్ సెక్టార్ లో అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

బొమ్మ‌రిల్లు చిత్రం ఇప్ప‌టికి ట్రెండ్ సెట్ట‌ర్ ఇన్ ల‌వ్ అండ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా నిలిచిపోయిందంటే అది కేవ‌లం ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ విజ‌న్ అండ్ వాల్యూస్ అని చెప్పాలి. ఆ త‌రువాత వ‌చ్చిన ప‌రుగు చిత్రం ప్ర‌తి ఓక్క‌రిని ఆలోచింప‌చేసేలా అద్బుతంగా తీర్చిదిద్దాడు. ఫ్యామిలీ ఆడియ‌న్స్ లో భాస్క‌ర్ ది సెప‌రేటు ఇమేజ్ వుంది. ఇప్ప‌డు వీర‌ద్దిరి కాంబినేష‌న్ లో చిత్రం అన‌గానే ఈ క్రేజ్ మ‌రింత పెరిగింది.

గ‌తం లో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో మెగా హీరోలు కాకుండా చేసిన చిత్రం 100% ల‌వ్‌.. ఈ చిత్రం లో అక్కినేని న‌ట వార‌సుడు నాగ చైత‌న్య హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం లో బ‌న్ని వాసు నిర్మించాడు. ఆ చిత్రం చాలా మంచి విజ‌యాన్ని సాధించ‌టం విశేషం.. మ‌ళ్ళి ఇప్పుడు అక్కినేని వారి మ‌రో న‌ట వార‌సుడు అఖిల్ అక్కినేని హీరోగా, నిర్మాత‌లు బ‌న్ని వాసు, వాసు వ‌ర్మ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని బొమ్మ‌రిల్లు, ప‌రుగు లాంటి ట్రెండ్ సెట్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నారు.

అల్లు అర‌వింద్ గారు-జిఏ2 పిక్చ‌ర్స్‌- బ‌న్నివాసు-వాసువ‌ర్మ కాంబినేష‌న్‌

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్స‌ణలో బ‌న్ని వాసు ప్రొడ్యూస‌ర్ గా 100% ల‌వ్ నుండి పిల్లా నువ్వులేని జీవితం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, గీతా గోవిందం, ప‌త్రిరోజు పండుగే వ‌ర‌కూ వ‌ర‌స బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాలు సొంతం చేసుకున్నారు. అల్లు అర‌వింద్ గారి సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా ఇప్ప‌డు మ‌రో యంగ్ ద‌ర్శ‌కుడు వాసు వ‌ర్మ తో కలసి “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో నిర్మిస్తున్నారు..

న‌టీ న‌టులు

అఖిల్ అక్కినేని
పూజా హెగ్ఢే
ఆమ‌ని
ముర‌ళి శ‌ర్మ‌
జ‌య ప్ర‌కాశ్
ప్ర‌గ‌తి
సుడిగాలి సుధీర్
గెటెప్ శ్రీను
అభ‌య్
అమిత్

టెక్నీష‌య‌న్స్

డైరెక్ట‌ర్ : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్
మ్యూజిక్ : గోపీ సుంద‌ర్
సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ
ఎడిట‌ర్ : మార్తండ కే వెంక‌టేశ్
ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా
నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌
స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్
బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్


Latest Pictures of Raashi Khanna




కన్నుల పండుగగా ‘సవారి’ ప్రి రిలీజ్ ఈవెంట్

కన్నుల పండుగగా ‘సవారి’ ప్రి రిలీజ్ ఈవెంట్

నందు, ప్రియాంకా శర్మ జంటగా నూతన దర్శకుడు సాహిత్ మోత్కూరి రూపొందించిన ‘సవారి’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి హోటల్ దసపల్లా కన్వెన్షన్స్ లో కన్నుల పండుగగా జరిగింది. ఈ చిత్రాన్ని కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుడితి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న సినిమా విడుదలవుతోంది. చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రి రిలీజ్ ఈవెంట్ కు అతిథులుగా విచ్చేసి, సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపి, ‘సవారి’ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఆకాక్షించారు. ‘సవారి’ బిగ్ టికెట్ ను హీరోలు కార్తికేయ, విష్వక్ సేన్ సంయుక్తంగా లాంచ్ చేశారు. ఇద్దరూ రూ. 10 వేలకు టికెట్లను కొనుగోలు చేశారు.
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, “చాలా రోజుల క్రితమే ఈ సినిమా చూశాను. చాలా పర్ఫెక్టుగా తయారైంది. ఒక డైరెక్టర్ కి మంచి ఆర్టిస్టులు దొరికితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో హీరోగా నందు చూపించాడు. అతని నటన చూసి నేను చాలా ఆశ్చర్యపోయా. అలాగే హీరోయిన్ ప్రియాంకా శర్మ నటన కూడా నన్ను ఆశ్చర్యపరిచింది. బెస్ట్ యాక్ట్రెస్ అనిపించింది. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చిన అన్ని పాటలూ బాగున్నాయి. కచ్చితంగా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంది. సాహిత్ పడ్డ కష్టానికి ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, అతనికి డబ్బులు రావాలి” అని చెప్పారు.
నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ, “సవారి అనేది చాలా పెప్పీ టైటిల్. ఆ పేరు వినగానే చాలా బాగా అనిపించింది. ట్రైలర్ చూస్తే, సాహిత్ లో బాలీవుడ్ శైలి డైరెక్టర్ కనిపించాడు. పాయింట్ కొత్తగా ఉంది. నందు సూపర్ టాలెంటెడ్ యాక్టర్. తనకి చక్కటి అందం, ఒడ్డూ పొడుగా, ప్రతిభ అన్నీ ఉన్నాయి. ఇప్పుడతనికి బ్లాక్ బస్టర్ కొట్టే టైమొచ్చింది. ‘సవారి’తో అది అవుతుందని అనుకుంటున్నా. స్క్రీన్ మీద ప్రియాంక్ అద్భుతంగా ఉంది” అన్నారు.
నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ, “నందు నాకు స్పెషల్ ఫ్రెండ్. అతనితో నాకు సన్నిహిత అనుబంధం ఉంది. ఇటీవల నేను చూసిన చక్కని సినిమా టీజర్, ట్రైలర్లలో ‘సవారి’ సినిమావి ఉన్నాయి. లిమిటెడ్ బడ్జెట్ లో ఇంత చక్కని ఫిల్మ్ తీసిన సాహిత్, అతని బృందానికి అభినందనలు. టీజర్, ట్రైలర్ చూసినప్పుడే వాటిలోని విజువల్స్ మన మైండ్ లో నిలిచిపోయేట్లు ఉన్నాయి. సాహిత్ డైరెక్షన్ లో కన్విక్షన్, కాన్ఫిడెంట్ కనిపిస్తున్నాయి. శేఖర్ చంద్ర పాటలతో ఇప్పటికే ఈ సినిమా విన్నర్ అయ్యింది” అని చెప్పారు.
కమెడియన్, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, “ట్రైలర్ చూస్తుంటే చాలా ఆసక్తికరంగా అనిపించింది. నేను ‘ఇడియట్’లో అండర్ వేర్ తో నటించాక, మళ్లీ ఇప్పుడు నందు అలా నటించాడు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చిన ప్రతి సినిమా పాటలూ సిక్సరే. సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా” అన్నారు.
గేయరచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ, “ఈ సినిమాకు హిట్ కళ కనిపిస్తోంది. సాహిత్ ఈ సినిమా కోసం అందర్నీ మోశాడు. ఆయన కృషికి కచ్చితంగా ఫలితం లభిస్తుంది. సినిమా హిట్టు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అన్నారు.
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ, “ఇందులో శేఖర్ చంద్ర నాచేత పాడించిన పాట ఇవాళ ఎక్కడ దావత్ జరుగుతుంటే అక్కడ వినిపిస్తోంది. కాసర్ల శ్యామ్ చాలా బాగా దాన్ని రాశారు. నందుకు ఈ సినిమా బ్లాస్టింగ్ హిట్ కావాలని కోరుకుంటున్నా” అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ, “సినిమాలోని అన్ని పాటల్నీ సంగీతప్రియులు ఎంకరేజ్ చేస్తున్నారు. నేనిచ్చిన ట్యూన్స్ కి కాసర్ల శ్యామ్ రాసిన పాట చూసి దీనికి ఇంత కిక్ వస్తుందా అని నేనే ఆశ్చర్యపోయా. పూర్ణాచారి ఎంతో చక్కని మెలోడీ సాంగ్ రాశారు. సూఫీ సాంగ్ ను శ్రీరాం, సవారీ టైటిల్ సాంగ్ ను రామాంజనేయులు చాలా బాగా రాశారు. డైరెక్టర్ మంచి సందర్భాలు, మంచి కథ ఇవ్వడం వల్లే పాటలూ బాగా వచ్చాయి. సోషల్ మీడియాలో, ముఖ్యంగా టిక్ టాక్ లో ఈ సినిమా పాటలకు పెడుతున్న వీడియోలు చూస్తుంటే నాకు అవార్డులు తీసుకున్నంత ఆనందగా అనిపిస్తోంది. సినిమా తప్పకుండా హిట్టవుతుందని ఆశిస్తున్నా. నందు ఇలా నటిస్తాడని నేను ఊహించలేదు” అని చెప్పారు.

డైరెక్టర్ సాహిత్ మోత్కూరి మాట్లాడుతూ, “ఈ సినిమాను మా అన్నయ్య సంతోష్, మా ఫ్రెండ్ నిషాంక్ ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు. యు.ఎస్.లో ఈ సినిమా 25 స్క్రీన్స్ లో రిలీజవుతోంది. గత 25 రోజులుగా మా యూనిట్ మెంబర్స్ ఎవరూ నిద్రపోకుండా ఈ సినిమా కోసం కష్టపడుతూ వస్తున్నారు. మోనిష్ భూపతిరాజా సినిమాటోగ్రఫీ వల్లే విజువల్స్ ఇంత బాగా వచ్చాయి. షూటింగ్ పూర్తయిన దగ్గర్నుంచీ నాకంటే ఎక్కువగా ఎడిటర్ సంతోష్ పనిచేస్తూ వచ్చాడు. నేను సినిమా డైరెక్షన్ చేయాలనుకున్నప్పుడే శేఖర్ చంద్రను మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నా. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నందు ఒక అండర్ రేటెడ్ యాక్టర్ అని అనుకుంటున్నా. ఆడిషన్ చేసేవరకు తనలో ఇంత టాలెంట్ ఉందని నాకు తెలీదు. సీన్ ఇస్తే చింపేసేవోడు. స్క్రీన్ మీద తన పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. తెలంగాణా యాసలో డైలాగ్స్ బాగా చెప్పాడు. తన పర్ఫార్మెన్స్ కు నేనైతే షాకైపోయి చాలా సార్లు క్లాప్స్ కొట్టాను. ఈ సినిమా తర్వాత తను ఇంకో స్థాయికి వెళ్తాడని గట్టిగా నమ్ముతున్నా. నా ఇండిపెండెంట్ ఫిల్మ్ ‘బందం రేగడ్’లో చేసిన ప్రియాంక ఈ సినిమాతో తనదైన ముద్ర వేస్తుందని నమ్ముతున్నా. కొత్త ఫిలింలు రావాలని అందరూ అంటుంటారు. కచ్చితంగా ‘సవారి’ కొత్త కథతో వస్తున్న మూవీ. ప్రేక్షకులు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను. కచ్చితంగా హిట్ కొడతామని అనుకుంటున్నా. ఈ సినిమాను నైజాంలో ఏషియన్ ఫిలింస్ వాళ్లు, ఆంధ్రా, సీడెడ్ ఏరియాల్లో సుధా శ్రీ పిక్చర్స్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 7న మా సినిమాని థియేటర్లలో చూడండి” అని చెప్పారు.
హీరోయిన్ ప్రియాంకా శర్మ మాట్లాడుతూ, “సాహిత్ గారు నా కెరీర్ లోని మోస్ట్ మెమరబుల్ ఫిలింస్ లో ఒకటిగా నిలిచే ‘సవారి’ని ఇచ్చారు. నందు చాలా సపోర్ట్ చేసే, ఎంకరేజ్ చేసే సహనటుడు. ఇలాంటి హీరో, డైరెక్టర్, టీం లభించినందుకు నేను చాలా లక్కీ. ఫిబ్రవరి 7న ఈ సినిమా చూసినవాళ్లు గర్వంగా ఫీలవుతారు” అన్నారు.
హీరో కార్తికేయ మాట్లాడుతూ, “నందు నటుడిగా చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. అతనిది స్ఫూర్తిదాయక ప్రయాణం. నేనొచ్చి ఒకటిన్నర ఏడాదే అయినా, ఏకొంచెం తేడా వచ్చినా భయమేస్తుంటుంది. పదేళ్ల నుంచి ఫైటింగ్ స్పిరిట్ తో నందు ముందుకెళ్తున్నాడు. అతని నుంచి ఆ స్పిరిట్ ను నేర్చుకోవాలనుకుంటున్నా. ‘ఆర్ ఎక్స్ 100’లో ‘పిల్లా రా’ సాంగ్ క్లిక్ అవడంతో అది హిట్టని అర్థమైపోయింది. అలాగే ఈ సినిమాలో రెండు పాటలు బాగా క్లిక్ అయ్యాయి. అంటే ఇప్పటికే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని రాసేసి ఉంది. ట్రైలర్ చాలా బాగా క్లిక్ అయ్యింది. సినిమాల్లో షర్ట్ తీసేస్తుంటావని సాధారణంగా నన్నందరూ వెక్కిరిస్తుంటారు. అందుకని షర్ట్ విప్పడం ఆపాను. కానీ ఈ సినిమాలో నందు షర్టు, ప్యాంటు కూడా తీసేశాడు కాబట్టి నేను మళ్లీ ధైర్యంగా షర్ట్ తీసేస్తా (నవ్వుతూ). ఈ సినిమా రిలీజయ్యాక సాహిత్ ను పెద్ద పెద్ద హీరోలు అడుగుతారు. అందుకని ముందుగానే అడుగుతున్నా, నాకు ఏదైనా స్క్రిప్ట్ ఉంటే చెప్పమని. ప్రియాంక అందంగా ఉంది, ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఫిబ్రవరి 7న ఈ సినిమాని చూస్తాను” అన్నారు.
హీరో విష్వక్ సేన్ మాట్లాడుతూ, “ఈ సినిమాకీ, నాకూ కొన్ని కనెక్షన్లున్నాయి. మొదటి కనెక్షన్ సాహిత్. మేం కలిసి పనిచేయాల్సి ఉండింది. కానీ నేను రెండు మూడు సినిమాల్లో స్టక్కయిపోయి ఉండటం వల్ల కుదరలేదు. తను చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. నందు, నేను దిల్ సుఖ్ నగర్ బ్యాచ్. నేను ఇంటర్లో ఉన్నప్పుడు తను జిమ్ కు వెళ్తూ సిక్స్ ప్యాక్ చేసేవాడు. ఇండస్ట్రీలో ఎవ్వరూ ఛాన్సులియ్యరు. మనమే తీసుకోవాలి. అల్రెడీ నందు తీసుకున్నాడు. నేనూ అట్లానే తీసుకున్నా. సాహిత్ కూడా ఎవరి దగ్గరా చెయ్యిచాపకుండా తన బ్రదర్, ఫ్రెండ్ తో కలిసి ఈ సినిమా చేశాడు. ఇలాంటి వాళ్లు తమ డబ్బుపెట్టి, తమ టాలెంట్ చూపించాలని గుడ్ ఇన్టెన్షన్ తో సినిమాలు తీస్తారు. మంచి ఇన్టెన్షన్ తో సినిమా తీసేవాడికెప్పుడూ తప్పు జరగదు. నేనూ అలాంటి ఇన్టెన్షన్ తోటే సినిమాల్లోకి వచ్చినా. చాలామంది విష్వక్ డబ్బులెక్కువయ్యి సినిమా తీశాడనుకుంటారు. అది తప్పు. చాలామంది దగ్గర కొంచెం కొంచెం డబ్బులు తీసుకుని, అందరికీ వాళ్ల డబ్బులు ఇచ్చేస్తే చాలనే ఇన్టెన్షన్ తో, ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూపిద్దామనే ఉద్దేశంతో సినిమా తీసినా. సాహిత్ కు కూడా అలాగే జరుగుతుంది. ఇప్పట్నుండీ నందు ట్రాక్ రికార్డ్ చాలా బాగుంటుంది. చాలామంది హీరోలతో పాటు చాలామంది కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. ఆ డైరెక్టర్లకు మనం అందుబాటులో ఉంటే చాలు. శేఖర్ చంద్ర మ్యూజిక్ కు నేను అభిమానిని. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా” అన్నారు.
‘సవారి’ హీరో నందు మాట్లాడుతూ, “ఫిలిం నగర్ లో సెటిల్ అవనీకి బ్యాగ్రౌండ్ ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్. కార్తికేయ, విష్వక్ సేన్ అలా కంటెంట్ తో, దిల్ సుఖ్ నగర్ నుంచి వచ్చారు. నేనూ అక్కడ్నుంచి వచ్చినా. అర్హుడైన యాక్టర్ కు ఏదైనా రావాలంటే ఒక మంచి స్క్రిప్ట్ రావాలి. ఈసారి ఆ స్క్రిప్ట్ 100 శాతం వచ్చిందని పక్కాగా చెప్తున్నా. ఫిబ్రవరి 7న ‘సవారి’ రిలీజవుతోంది. ఈ సినిమాకి అసలైన హీరో సాహిత్. అసాధారణ స్క్రిప్ట్ రాశాడు. నందులో మంచి యాక్టర్ ఉన్నాడని, అతనికి చాన్స్ రావాలని చాలమంది అంటుంటారు. ఫైనల్ గా ఒకడు సాహిత్ రూపంలో ముందుకొచ్చి నాకు చాన్స్ ఇచ్చాడు. అతను నా దేవుని లెక్క. ఈ సినిమా హిట్టవుతుందని పక్కా చెప్తున్నా. సినిమా 2 గంటల 19 నిమిషాల రన్ టైమ్ వచ్చింది. షార్ప్ గా ఉంటుంది. చూసినోళ్లందరూ మెచ్చుకున్నారు. ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో చూసి స్పందించిన నాగచైతన్య, సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్, మంచు మనోజ్, సుకుమార్, సురేందర్ రెడ్డి గార్లకు చాలా థాంక్స్. మన సినిమా చూసి అందరూ మెచ్చుకోవాలని దేనికోసమైతే కలలు కంటున్నానో, ఎదురు చూస్తున్నానో అది ఈ సినిమాతో వచ్చిందనిపిస్తోంది. కంటెంట్ బాగుంటే ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తుందని ఈ సినిమా ట్రైలర్ ప్రూవ్ చేసింది. 100 పర్సెంట్ బ్లాక్ బస్టర్ మూవీతో మీ ముందుకు వస్తున్నాం” అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో నటులు వీరేన్ తంబిదొరై, శ్రీకాంత్ రెడ్డి, శివ, జీవన్, బల్వీందర్, మ్యాడీ, టీఎన్నార్, గేయరచయితలు పూర్ణాచారి, రామాంజనేయులు, సింగర్ నోయల్, ఎడిటర్ సంతోష్ మీనం తదితరులు మాట్లాడారు.


హీరో వడ్డే నవీన్ కుమారుడు వడ్డే జిష్ణు పంచకట్టు వేడుక

ప్రముఖ హీరో వడ్డే నవీన్ కుమారుడు వడ్డే జిష్ణు పంచకట్టు వేడుక ఇటీవల హైదరాబాద్ మాదాపూర్ లోని ఆవాస హోటల్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిరంజీవి జిష్ణుకు శుభాశీస్సులు అందజేశారు.

మెగాస్టార్ చిరంజీవి, శ్రీమతి సురేఖా చిరంజీవి, కళాబంధు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి, ప్రముఖ నిర్మాత , నటులు మురళీమోహన్, సునీల్, వేణు, హీరో శ్రీకాంత్ ఆయన సతీమణి ఊహ, నగరి ఎమ్మెల్యే ప్రముఖ నటీమణి రోజా, శివాజీ రాజా, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్, రాశి, హేమ, బిగ్ బాస్ విన్నర్ శివ బాలాజీ ఆయన సతీమణి మధులత తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ విజయ మాధవి పిక్చర్స్ అధినేతలైన వడ్డే సోదరులు కీర్తిశేషులు వడ్డే శోభనాద్రి, వడ్డే రమేష్ ల దివ్యాశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమానికి వడ్డే సంస్థలలో
పనిచేస్తున్న ఉద్యోగులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


`జాను` సినిమాను చూసిన ప్రేక్ష‌కులు ఎగ్జయిట్‌మెంట్‌తో సినిమాకు క‌నెక్ట్ అవుతారు : దిల్‌రాజు

`జాను` సినిమాను చూసిన ప్రేక్ష‌కులు ఎగ్జయిట్‌మెంట్‌తో సినిమాకు క‌నెక్ట్ అవుతారు : దిల్‌రాజు

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ ‘జాను’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత దిల్‌రాజుతో ఇంట‌ర్వ్యూ…

రీమేక్‌ల‌కు మీరు వ్య‌తిరేక‌మా?

– రీమేక్ సినిమాలు చేయ‌కూడ‌ద‌ని కాదు.. దిల్ సినిమా నుండి స్క్రిప్ట్‌లో కూర్చునేవాడిని. అలా ట్రావెల్ చేస్తే ఆ మేజిక్ బావుంటుంద‌ని నేను ఎప్పుడూ రీమేక్‌ల గురించి ఆలోచించ‌లేదు. మ‌ధ్య‌లో `ప్రేమ‌మ్‌`, `బెంగ‌ళూర్ డేస్` చిత్రాల‌ను తెలుగులో రీమేక్ చేయాల‌ని అనుకున్నాను. వాటిని చూసిన‌ప్పుడు ఎగ్జ‌యిట్ అయ్యాను. ముఖ్యంగా `బెంగళూరు డేస్` సినిమా రీమేక్ చేయ‌డానికి చాలా వ‌ర్క‌వుట్ చేశాను. అప్పట్లో నాని, శ‌ర్వా ఇద్ద‌రూ ఆ సినిమాలో చేస్తామ‌ని చెప్పారు. అయితే మూడో క్యారెక్ట‌ర్ ఎందుక‌నో మాకు శాటిస్పాక్ష‌న్‌గా అనిపించ‌లేదు. సరే! ఎందుక‌లే అని డ్రాప్ అయ్యాం. త‌ర్వాత `ప్రేమ‌మ్` చేద్దామ‌ని అనుకుంటే సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నాగ‌వంశీ అన్నా! నేను రీమేక్ చేసుకుంటా అన్నాడు. స‌రేనని అప్పుడు కూడా కామ్ అయ్యాను. రీమేక్ చేయాలంటే ఎక్స్‌ట్రార్డిన‌రీ ఫీలింగ్ రావాలి. ఈ సినిమాను మ‌నం మిస్ అవ‌కూడ‌ద‌నే ఫీలింగ్ వ‌చ్చిన‌ప్పుడే రీమేక్ చేయాలి. యాదృచ్చికంగా ఈ ఏడాది మూడు సినిమాలు రీమేక్ చేస్తున్నాం. త‌మిళ `96` చిత్రాన్ని తెలుగులో `జాను`గా రీమేక్ చేస్తుంటే..తెలుగులో హిట్ట‌యిన జెర్సీని హిందీలో రీమేక్ చేస్తున్నాం. అలాగే హిందీ చిత్రం `పింక్‌`ను తెలుగులో రీమేక్ చేస్తున్నాం. ఈ మూడు హార్ట్ ట‌చింగ్ మూవీస్‌. దేనికి అదే ప్ర‌త్యేక‌మైన సినిమా. `జాను` విష‌యానికి వ‌స్తే.. త‌మిళ చిత్రం `96` టీజ‌ర్‌ను చూడ‌గానే ఆస‌క్తిగా అనిపించింది. అప్ప‌టి నుండి నేను దాన్ని ఫాలో అవుతూ వ‌చ్చాను. మా నెల్లూరు డిస్ట్రిబ్యూట‌ర్ హ‌రి ద్వారా నిర్మాత‌ను సంప్ర‌దించాను. ప్రివ్యూ చూశాను. నేను, హ‌రి సినిమా చూశాం. నాకు త‌మిళంలో పెద్ద‌గా అర్థం కాదు.. కానీ సినిమా చూస్తున్న‌ప్పుడు నాకు విప‌రీత‌గా ఎక్కేసింది. థియేటర్ బ‌య‌ట‌కు రాగానే.. అక్క‌డే నిర్మాతతో మాట్లాడాను. తెలుగులో నేను రీమేక్ చేయాల‌నుకుంటున్నానని చెప్పాను. అలా సినిమా నాకు బాగా ఎక్కేసింది.

సినిమా అంత బాగా న‌చ్చ‌డానికి ప్ర‌త్యేక‌మైన కార‌ణ‌మేమైనా ఉందా?
– ప్ర‌త్యేక‌మైన కార‌ణమేమీ లేదు. సినిమాలో ఫ్లో ఉంది. అద్భుత‌మైన సన్నివేశాలున్నాయి. అంతే కాకుండా.. చిన్న‌ప్ప‌టి ఫ్రెండ్స్‌, రీ యూనియ‌న్ అన‌గానే మ‌నం పాత రోజుల‌కు వెళ్లిపోతాం. సాధార‌ణంగా ల‌వ్, క్ర‌ష్ ఉంటుంది. అది బ్రేక‌ప్ అయిపోతుంది. ప‌ద‌వ త‌ర‌గ‌తి ప్రేమ అనేది ఎప్పుడూ స‌క్సెస్ కాదు. అలాంటి ప్యూరిటీ ఉన్న ప్రేమ‌క‌థ 96. అలాంటి ప్రేమ‌క‌థ ఉన్న‌వారంద‌రూ క‌నెక్ట్ అవుతారు. అదే చూసే ఎగ్జ‌యిట్ అవుతారు. ఇది తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా క‌నెక్ట్ అవుతుంద‌ని సినిమా చూస్తున్న‌ప్పుడే అనిపించింది.

రీమేక్ చేసేట‌ప్పుడు మాతృక‌లోని మేజిక్ క్రియేట్ అవుతుందో కాదోన‌నే టెన్ష‌న్ ఫీల‌య్యారా?
– నేను చేసిన మంచి పనేంటంటే త‌మిళ సినిమాను డైరెక్ట్ చేసిన ప్రేమ్‌కుమార్‌నే ఈ సినిమాకు తీసుకురావ‌డం. హ‌లోగురు ప్రేమ‌కోస‌మే కెమెరామెన్ విజ‌య్ కె.చ‌క్ర‌వ‌ర్తి నేను 96 సినిమా చూడ‌టానికి చెన్నై వెళుతున్నాన‌ని తెలియ‌గానే.. ఆ సినిమా డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారు? మ‌న ఆర్య సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా ప‌నిచేశాడ‌ని చెప్పాడు. ప్రివ్యూ చూసిన‌ప్పుడు నిర్మాత‌తో పాటు డైరెక్ట‌ర్‌తోనూ మాట్లాడాను. మీకు ఆస‌క్తి ఉంటే తెలుగులోనూ డైరెక్ట్ చేయ‌మ‌ని చెప్పాను. త‌మిళంలో సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత ప్రేక్ష‌కుల‌తో క‌లిసి చూశాను. ఆ స‌మ‌యంలో డైరెక్ట‌ర్‌తో నువ్వు సినిమా చెయ్యాల‌ని అన్నాను.

రీమేక్ చేయాల‌నుకున్న‌ప్పుడు మీకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది?
– నేను `96` రీమేక్ గురించి అనౌన్స్ చేయ‌గానే అదొక క్లాసిక్ ఎందుకు చెడ‌గొడుతున్నారంటూ చాలా మంది అన్నారు. హీరోల్లో నాని సినిమా చూసి సూప‌ర్బ్ మూవీ అన్నాడు. త‌ర్వాత సినిమాను బ‌న్నీకి చూపించాను. అప్ప‌టికి త‌మిళంలోనూ సినిమా రిలీజ్ కాలేదు. త‌ను సినిమా చూసొచ్చిన త‌ర్వాత క్లాసిక్ మూవీ అన్నాడు. అప్పుడు నాకు న‌మ్మ‌కం పెరిగింది.

రీమేక్ చేసే సంద‌ర్భాల్లో మీరెలాంటి టెన్ష‌న్ ప‌డ్డారు?
– త‌మిళంలో `96` సినిమాకు అప్రిషియేష‌న్‌తో పాటు అద్భుత‌మైన కలెక్ష‌న్స్ వ‌చ్చాయి. సినిమా ఆడియెన్స్‌కు ఎంత క‌నెక్ట్ అయ్యిందంటే చాలా మంది తెలుగు వాళ్లు కూడా ఈ సినిమా రింగ్ టోన్‌ను పెట్టుకున్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు. ప్రేమ్‌తో డిస్క‌ష‌న్ చేస్తున్న‌ప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్టు ఐదారు పాయింట్స్ చేంజ్ చేస్తే బావుంద‌నుకున్నాం. అలాగే చేంజ‌స్ చేశాం. కంపేరిజ‌న్ వ‌స్తాయ‌ని.. స‌మంత అయితే భ‌య‌ప‌డింది. అలాగే శ‌ర్వాను కూడా ఒప్పించాను. ఈ సినిమాకు ఒక మీట‌ర్ ఉంది. కాబ‌ట్టి డైరెక్ట‌ర్‌ను మేకింగ్ ప‌రంగా ఎక్క‌డా తొంద‌ర‌పెట్టలేదు. సినిమాను ఓ హృద‌యంతో చూశాను. రేపు త‌మిళంలో సినిమాను చూసిన ఆడియెన్స్ కూడా అదే ఫీల్ అవుతారు.

త‌మిళంలో స‌న్నివేశాల‌ను తెలుగు మేకింగ్‌లో ఉప‌యోగించారా?
– లేదు.. ఫ్రెష్ సినిమా చేసిన‌ట్లు చేశాను. త‌మిళంలో చూసిన‌ప్పుడు ఎలా ఫీల‌య్యానో.. తెలుగులో చూసిన‌ప్పుడు అలాగే ఫీ

స‌మంత గురించి ?
– ముందు `జాను`లో న‌టించ‌డానికి భ‌య‌ప‌డ్డ స‌మంత‌.. షూటింగ్ స్టార్ట్ అయిన రెండు రోజుల త‌ర్వాత ప్ర‌తిరోజూ మేజిక్ జ‌రుగుతుందంటూ నాకు మెసేజ్‌లు పెట్టింది. మీరు న‌న్ను ఒప్పించ‌కుంటే.. నేను చాలా మిస్ అయ్యుండేదాన్ని అని కూడా చెప్పింది. స‌మంత‌, శ‌ర్వానంద్ ఇద్ద‌రూ చిన్న‌వాళ్లేం కాదు.. సినిమాను ఓన్ చేసుకుని అద్భుతంగా న‌టించారు.

ఇప్పుడు రీమేక్ .. స‌్ట్ర‌యిట్ సినిమాల్లో ఏదీ చేయ‌డం సుల‌భ‌మ‌నుకుంటున్నారు?
– స్ట్ర‌యిట్ సినిమా చేయ‌డ‌మే సుల‌భం

డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్ గురించి?
– సాధార‌ణంగా ఓ డైరెక్ట‌ర్ ఓ సినిమాను చేసిన త‌ర్వాత అదే సినిమాను మ‌రోసారి చేస్తున్న‌ప్పుడు అక్క‌డేం చేశాడు..ఇక్క‌డేం చేస్తున్నాడ‌ని చూస్తాం. ప్రేమ్ ఆ విష‌యంలో ఎలాంటి డిస‌ప్పాయింట్ కాలేదు. విజ‌య్ సేతుప‌తి ఎక్స్‌ట్రార్డిన‌రీ పెర్ఫామ‌ర్‌. శ‌ర్వానంద్ చాలా హ్యాపీ. స‌మంత ఎలాగూ చేస్తుందని…శ‌ర్వా విష‌యంలో ప్రేమ్ కాస్త టెన్ష‌న్ ప‌డేవారు. విజ‌య్ సేతుప‌తి మ్యాచ్ చేయ‌డం అంత సుల‌భం కాదు.. అయితే శ‌ర్వా క‌థ‌ను ఓన్ చేసుకుని అద్భుతంగా బాలెన్స్ చేశాడు. సినిమా చూసిన త‌ర్వాత త‌ను నాపై న‌మ్మ‌కంతో ఒక‌రోజు మాత్ర‌మే టైమ్ తీసుకుని సినిమాకు ఓకే చెప్పేశాడు.

త్రిష తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితురాలే క‌దా! ఆమెను ఎందుకు తీసుకోలేదు?
– నేను సినిమా చూస్తున్న‌ప్పుడు స‌మంతే గుర్తుకొచ్చింది. ఇక త‌మిళంలో చేసిన త్రిష‌తోనే మ‌ళ్లీ చేస్తే అందులో మేజిక్ ఏముంటుంది?. అందుక‌నే స‌మంత‌ను తీసుకున్నాను.

సంక్రాంతి సినిమాల గురించి చెప్పండి?
– ఈ సంక్రాంతి తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ గెలిచింది. ఎందుకంటే ఇద్ద‌రు స్టార్స్ క్రేజీ సినిమాలు ఒకేసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. ఇద్ద‌రు స్టార్స్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన‌ప్పుడు ఇద్ద‌రూ హిట్ అవుతారు లేక‌పోతే యావ‌రేజ్ అవుతారు.. లేదా ఒక‌రే అవుతారు. కానీ ఈసారి సంక్రాంతి సినిమాలు ఇద్ద‌రు హీరోల‌కు కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచాయి . రెండు సినిమాల‌కు సెన్సేష‌న‌ల్ ఫిగర్స్ వ‌చ్చాయి. స‌రైన సినిమాలొస్తే ఇలా ఉంటుందా? అని మాకే మైండ్ బ్లాక్ అయ్యాయి.

ప్ర‌భాస్ సినిమాకు `జాన్` అనే టైటిల్ విన‌ప‌డుతుందిగా?
– టైటిల్ విష‌యంలో ప్ర‌భాస్‌, యువీ క్రియేషన్స్‌కు స్పెష‌ల్ థ్యాంక్స్‌. నిజానికి మా సినిమాకు జాను అనే టైటిల్ పెట్టాల‌నుకున్న‌ప్పుడు.. వంశీని సంప్ర‌దించాను. తాను కాస్త స‌మ‌యం తీసుకున్నా..`జాను` టైటిల్‌ను పెట్టుకోమ‌ని అన్నాడు. వారి సినిమా రిలీజ్‌కు టైమ్ ఉంద‌ని వాళ్లు ఒప్పుకున్నారు. ప్ర‌స్తుతం వాళ్ల సినిమాకు జాన్ అనే టైటిల్ అనుకుంటున్నారు. అయినా ఇప్పుడు సినిమాకు నాలుగు వారాల లైఫే. ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత జాను సినిమా గురించి ప్రేక్ష‌కులు మ‌రిచిపోతారు. త‌ర్వాత వాళ్లు జాన్ అనే టైటిల్‌ను అనౌన్స్ చేస్తే ప్రేక్ష‌కులు దాన్నే ఫాలో అవుతారు. ఎందుకంటే అది ప్ర‌భాస్ సినిమా.

`పింక్‌` రీమేక్ గురించి?
– ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారితో సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుండో అనుకుంటే ఇప్ప‌టికి కుదిరింది. పింక్ సినిమాను రీమేక్ చేస్తున్నాం. ఈ సినిమా టైటిల్‌పై ప‌లు వార్త‌లు వ‌స్తున్నాయి. సినిమాను మే 15న విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం. మే 11న గ‌బ్బ‌ర్ సింగ్ విడుద‌లైంది. కాబ‌ట్టి స‌మ్మ‌ర్‌లోనే రావాల‌ని అనుకుంటున్నాం. టైటిల్ విష‌యంలో అధికారికంగా ఏమీ అనుకోలేదు. ఉగాది టైటిల్‌ను అనౌన్స్ చేస్తాం. `వి` సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత ప‌వ‌న్ సినిమా ప్ర‌మోష‌న్స్ గురించి ఆలోచిస్తాం. హిందీ, త‌మిళంలో చూసిన‌ట్టు కాకుండా సినిమాను మ‌రో కోణంలో చూపిస్తాం.

మ‌హేష్‌తో సినిమా ఎప్పుడు?
– వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్‌గారితో సినిమా ఉంటుంది. మ‌హేశ్‌గారు నెక్ట్స్ సినిమా అదే. స్క్రిప్ట్ రెడీ అవుతుంది. అంతా ఓకే అయిన త‌ర్వాత సినిమా టేకాఫ్ అవుతుంది.


Chadarangam – Telugu English Press Release and Poster

తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుక ఇచ్చిన జీ 5
జనవరి 13,2020 హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వివిధ భాషలలో అధిక వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్న జీ5 . సంక్రాంతి పండుగ సందర్భంగా త్వరలో తెలుగు ప్రజల ముందుకు తీసుకురానున్న నాలుగు వెబ్ సిరీస్ వివరాలను మీడియా మిత్రులతో పంచుకున్నారు.

జీ5 గతంలో విడుదల చేసిన గాడ్,హై ప్రిస్టిస్, కైలాసపురం,Mrs.సుబ్బలక్ష్మి,నర్డ్,హవాలా, బీటెక్,ఎక్కడికి ఈ పరుగు, వాట్సాప్ పనిమనిషి , చిత్ర విచిత్రం ,నాన్న కూచి వంటి వినూత్నమైన వెబ్ సిరీస్ లను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు జీ5 ప్రోగ్రామింగ్ హెడ్ అపర్ణ అచరేకర్ కృతజ్ఞతలు తెలిపారు. తమ వద్దకు ఎవరైనా మంచి కథతో వస్తే తమను తప్పక ఎంకరేజ్ చేస్తామని అన్నారు.2020 ప్రథమ భాగంలో రానున్న తమ వెబ్ సిరీస్ ల గురించి తెలిపారు.

చదరంగం : ఒక పొలిటికల్ డ్రామా. తన ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల లోకి వచ్చిన ఒక నటుడు.తన లక్ష్యం కోసం ఏం చేశాడు అన్నది ఈ చదరంగం కథ. ఈ సిరీస్ కు రాజ్ అనంత దర్శకత్వం వహించారు.ఇందులో శ్రీకాంత్, సునైన,నాగినీడు ముఖ్య పాత్రలలో నటించారు.మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ బ్యానర్ పై దీన్ని నిర్మించారు.చదరంగం ఫిబ్రవరి 20వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానున్నది.

లూసర్ : ఒక స్పోర్ట్స్ డ్రామా.ఇందులో క్రికెటర్,బ్యాడ్మింటన్ ప్లేయర్,రైఫిల్ షూటర్ అవ్వాలి అనుకునే ముగ్గురు వ్యక్తులు ఆటలలో ఉండే రాజకీయాల వల్ల ఎలా ఇబ్బందులు పడ్డారో ఎన్ని కష్టాలను ఎదురుకున్నారో అన్నది ఈ లూసర్ కథ.ఇందులో ప్రియదర్శి, కల్పిక, షియాజి షిండే, శశాంక్ ముఖ్య పాత్రలలో నటించారు. లూసర్ కు అభిలాష్ రెడీ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ వారు దీన్ని నిర్మించారు.లూసర్ మార్చి లో ప్రేక్షకుల ముందుకి రానున్నది.

ఎక్స్పైరీ డేట్ : ఇది తెలుగు,హిందీ బైలింగ్వల్ క్రైమ్ థ్రిల్లర్.తనను మోసం చేసినందుకు భర్త భార్యను ఏం చేశాడో అన్నది ఎక్స్పైరీ డేట్ కథ. స్నేహ ఉల్లాల్, మధు శాలిని, టోనీ లుక్, అలీ రెజ్జ ముఖ్య పాత్రలలో నటించారు.ఎక్స్పైరీ డేట్ కు శంకర్ మార్తాండ దర్శకత్వం వహించారు. శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు.ఎక్స్పైరీ డేట్ జూన్ లో ప్రేక్షకుల ముందుకి రానున్నది.

అమృతం ద్వితీయం : నవ్వుల ఆణిముత్యం మైన అమృతం మరోసారి సీక్వెల్ తో మన ముందుకు వస్తున్నది. గత అమృతం లో భాగమైన హర్షవర్ధన్, శివ నారాయణ ,వాసు ఇంటూరి లతో ఎల్బీ శ్రీరామ్, సత్య కృష్ణ మనల్ని నవ్వించడానికి చేతులు కలిపారు. ఈ ద్వితీయ భాగం కి గంగరాజు కలం పట్టగా, సందీప్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. గంగరాజు , సందీప్ సంయుక్తంగా లైట్ బాక్స్ మీడియా బ్యానర్ లో ఈ ఉగాదికి అంటే 25 మార్చి న నవ్వించడానికి జీ5 ఉన్న వారి ఇంటికి వస్తున్నారు.


న‌వీన్ చంద్ర హీరోగా నేను లేని నా ప్రేమ‌క‌థ‌

న‌వీన్ చంద్ర హీరోగా నేను లేని నా ప్రేమ‌క‌థ‌

విభిన్న‌మైన పాత్ర‌లు ఎంచుకుని మ‌రీ సెల‌క్ట్ గా సినిమాలు చేస్తూ త‌న‌కంటూ న‌టుడిగా ప్ర‌త్యేఖ స్థానం సంపాయించుకున్న న‌వీన్ చంద్ర హీరోగా ఒ కొత్త‌ర‌కం ప్రేమ క‌థా చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ఎమ్ ఎస్ సుబ్బల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణ‌లో త్రిషాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై క‌ళ్యాణ్ కందుకూరి నిర్మాత‌గా సురేష్ ద‌ర్శ‌క‌త్వం లో రూపోందిన చిత్రానికి టైటిల్ గా నేను లేని నా ప్రేమ‌క‌థ టైటిల్ ని ఖ‌రారుచేశారు. ఈ సినిమాలో న‌వీన్ చంద్ర స‌ర‌స‌న గాయ‌త్రి ఆర్ సురేష్ హీరోయిన్ గా చేస్తుంది. క్రిష్ సిద్దిప‌ల్లి, అదితి లు మ‌రో ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రంల ప్ర‌ముఖ న‌టుడు రాజార‌వీంద్ర కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ చిత్రం యెక్క మెద‌టి లుక్ టైటిల్ ని లాంచ్ చేశారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత క‌ళ్యాణ్ కందుకూరి మాట్లాడుతూ.. చాలా రొజుల త‌రువాత ఓ ఫ్రెష్ ల‌వ్ స్టోరి తో ద‌ర్శ‌కుడు సురేష్ మా ద‌గ్గ‌ర‌కి రావ‌టం జ‌రిగింది. విన్న‌వెంట‌నే చాలా కొత్త‌గా అనిపించింది. కాన్సెప్ట్ కి క‌నెక్ట్ అయ్యాను. నేనే కాదు ఈ సినిమా చూసిన ప్ర‌తిఓక్క‌రూ వారి వారి ప్రేమ క‌థ‌కి కి ద‌గ్గ‌ర‌వుతారు. న‌వీన్ చంద్ర‌, హీరోయిన్ గాయ‌త్రి ఆర్ సురేష్ వారి పాత్ర‌ల్లో ఇమిడిపోయి న‌టించారు. ఈ సినిమాకి జువిన్ సింగ్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌త్యేఖంగా రాజార‌వీంద్ర పాత్ర అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రం యెక్క మెద‌టి టైటిల్ లుక్ టీజ‌ర్ ని పోస్ట‌ర్ ని విడుద‌ల చేశాము. టైటిల్ కి చాలా మంచి రెస్పాన్స్ రావ‌టం చాలా ఆనందంగా వుంది. త్వ‌ర‌లో ఈ మెద‌టి లుక్, మెద‌టి లుక్ టీజ‌ర్ ని విడుద‌ల చేస్తాము.. అని అన్నారు..

image description

ద‌ర్శ‌కుడు సురేష్ మాట్లాడుతూ.. ప్రేమ అంటే అది ప్ర‌తి ఓక్క‌రి మ‌న‌సులోని చ‌క్క‌టి ఫీలింగ్.. ఆ ఫీలింగ్ కి ఎదుట మ‌నిషికి తెలియ‌జేయ‌టం అంటే అంత ఈజీ కాదు అది ప్రేమ విష‌యం లో దేశ ప్ర‌ధాని కూడా చిన్న పిల్ల‌వాడ‌వుతాడు. అలాంటి చ‌క్క‌టి ఫీలింగ్ ని అంతే చ‌క్క‌గా తెర‌కెక్కించిన చిత్రం నేను లేని నా ప్రేమ‌క‌థ‌.. ఇలాంటి ప్రేమ‌క‌థ ని నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌టం.. ఆ ఛాన్స్ నిర్మాత క‌ళ్యాణ్ గారు నాకు ఇవ్వ‌టం చాలా ఆనందంగా వుంది. ఈరోజు విడుద‌ల చేసిన ఈ టైటిల్ టీజ‌ర్ చాలా వినూత్నం గా వుంద‌ని అంద‌రూ ప్ర‌శంశించ‌టం చాలా ఆనందంగా వుంది. అంత‌పురం, ఖ‌డ్గం లాంటి అద్బుత‌మైన చిత్రాలకి పనిచేసిన ఎస్‌.కె.ఏ.భూప‌తి చాలా అద్బుతమైన విజువ‌ల్స్ అందించారు. అలాగే ఎన్నో చిత్రాల‌కి త‌న ప‌నితనంతో విజ‌యాల్ని సునాయ‌సం చేసిన ఎడిట‌ర్ ప్రవీణ్ పూడి ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు.

న‌టీన‌టులు.. న‌వీన్ చంద్ర‌, గాయ‌త్రి ఆర్ సురేష్‌, క్రిష్ సిద్దిప‌ల్లి, అదితి, రాజారవీంద్ర , బందు దివిజ త‌దిత‌రులు న‌టించ‌గా..

ఎమ్ ఎస్ సుబ్బ‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణ‌
బ్యాన‌ర్‌.. త్రిషాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
కొ-ప్రోడ్యూస‌ర్స్‌.. గూడురు వెంక‌ట్‌, గూడురు ప్ర‌సాద్‌
కెమెరా.. ఎస్‌.కె.ఏ.భూప‌తి
ఎడిట‌ర్‌.. ప్ర‌వీణ్ పూడి
మాట‌లు.. స‌భీర్ షా
సంగీతం.. జువెన్ సింగ్‌
లిరిక్స్‌.. రాంబాబు గొసాల‌
పి ఆర్ ఒ .. ఏలూరు శ్రీను, మెఘ శ్యామ్‌