Degree collage trailers
Category : Latest Events Latest Reviews Movie News Sliders videos
Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
Category : Latest Events Latest Reviews Movie News Sliders videos
Category : Latest Events Latest Reviews Movie News Sliders
Youth sensation Vijay Deverakonda will next be seen in World Famous Lover which is all set for grand release on February 14th as Valentine’s Day special. Aishwarya Rajesh, Raashi Khanna, Catherine Tresa and Izabelle Leite are the heroines in the film directed by Kranthi Madhav and produced by KA Vallabha while KS Rama Rao presents it.
World Famous Lover Trailer date has been locked now. The makers will release the theatrical trailer of the film on February 6th at 4:05 PM, nearly a week days ahead of the theatrical release. In the announcement poster, Vijay Deverakonda and Aishwarya are seen dismayed.
Lead Cast: Vijay Deverakonda, Raashi Khanna, Aishwarya Rajesh, Catherine Tresa and Izabelle Leite.
Crew:
Story, Screenplay, Direction: Kranthi Madhav
Producer: K. A. Vallabha
Presenter: K. S. Rama Rao
Music: Gopi Sundar
Cinematography: Jaya Krishna Gummadi
Editing: Kotagiri Venkateswara Rao
Banner: Creative Commercials
PRO: Vamshi Shekar
Category : Latest Events Latest Reviews Movie News Sliders
డాన్సర్ గా ‘తలైవి’ లేటెస్ట్ లుక్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఎ.ఎల్. విజయ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, సుప్రసిద్ధ నటుడు ఎం.జి. రామచంద్రన్ పాత్రలో ప్రముఖ నటుడు అరవింద స్వామి నటిస్తుండగా, మరో దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్నది.
జయలలిత ఉన్నత స్థాయి నటిగానే కాకుండా గొప్ప డాన్సర్ గానూ కీర్తి పొందారు. ఆమె పాత్రలో పరకాయప్రవేశం చేసిన కంగనా రనౌత్ లేటెస్ట్ లుక్ ను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. ఈ లుక్ లో శాస్త్రీయ నృత్యం చేస్తున్న భంగిమలో కంగనా అమితంగా ఆకట్టుకుంటున్నారు. చుట్టూ పలువురు డాన్సర్లు నాట్యం చేస్తుండగా, మధ్యలో జయలలితగా కంగన నాట్యం చేస్తున్న తీరు చూస్తుంటే, అది ఒక నృత్య రూపకమనే అభిప్రాయం కలుగుతోంది.
ఇప్పటికే విడుదల చేసిన రాజకీయ నాయకురాలిగా జయలలిత లుక్, టీజర్, ఎంజీ రామచంద్రన్ లుక్ లకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 2020 జూన్ 26న ‘తలైవి’ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు సంకల్పించారు. ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Category : Latest Events Latest Reviews Movie News Sliders
* ‘భీష్మ’ నుంచి ‘వాటే వాటే వాటే బ్యూటీ’ గీతం విడుదల
* నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ‘భీష్మ’
* ఫిబ్రవరి 21 న విడుదల
‘భీష్మ’
నితిన్,రష్మిక మందన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’.
ఈ చిత్రంలోని మరో గీతం ఈరోజు అధికారికంగా సామాజిక మాధ్యమం అయిన ‘యు ట్యూబ్’ ద్వారా విడుదల అయింది. హీరో నితిన్, నాయిక రష్మిక మందన బృందంపై చిత్రీకరించిన ఈ గీతానికి జానీ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. పలు అందమైన సెట్స్ లో ఈ పాట చిత్రీకరణ జరిగింది. గీత రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యానికి, సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ స్వరాలూ సమకూర్చగా, గాయకుడు ధనుంజయ్, గాయని అమల చేబోలు ల గాత్రంలో ప్రాణం పోసుకుందీ పాట. ‘వాటే వాటే వాటే బ్యూటీ’ పేరుతో విడుదలయిన ఈ గీతానికి సంగీత ప్రియులనుంచి, అభిమానులనుంచి విశేష స్పందన లభించింది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన వీడియో దృశ్యాలు, ‘సింగిల్స్ యాంధం’ గీతం వంటి వీటికి ప్రేక్షకాభిమానులనుంచే కాక, సామాజిక మాధ్యమాలలో సైతం విశేషమైన ప్రాచుర్యం లభించింది. చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరి 21 న విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ …ఈ చిత్రం లోని మరో గీతం ఈరోజు విడుదల అయింది. ‘వాటే బ్యూటీ’ పేరుతో విడుదల అయిన ఈ గీతానికి ప్రేక్షకాభిమానులనుంచి అద్భుతమైన స్పందన లభించింది. జానీ మాస్టర్ సమకూర్చిన నృత్య రీతులు అభిమానులను అలరిస్తాయి. నితిన్,రష్మిక జంట చూడ ముచ్చటగా ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇప్పటికే విడుదల అయిన ఈ చిత్రం లోని వీడియో దృశ్యాలు, సింగిల్స్ యాంధం’ గీతం వైరల్ అయ్యాయి. అలాగే భీష్మ ప్రచార చిత్రాలకు కూడా ప్రేక్షకాభిమానులనుంచి విశేషమైన స్పందన లభిస్తోంది అన్నారు. ‘భీష్మ’ చిత్ర కధ,కధనాలు,సన్నివేశాలు,సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.
నటీ,నటులు :
నితిన్,రష్మిక మండన,నరేష్,సంపత్,రఘుబాబు,బ్రహ్మాజీ,నర్రా శ్రీనివాస్,వెన్నెల కిషోర్,అనంత నాగ్,శుభలేఖ సుధాకర్,జస్సెన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్,రాజశ్రీ నాయర్,ప్రవీణ తదితరులు నటిస్తున్నారు.
మ్యూజిక్ : మహతి స్వర సాగర్ , డి .ఓ .పి : సాయి శ్రీరామ్ , ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్,
ఎడిటర్ : నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం(వెంకట్ ),
సమర్పణ : పి.డి .వి. ప్రసాద్ ,
ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగ వంశి ,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : వెంకీ కుడుముల.
Category : Latest Events Latest Reviews Movie News Sliders
రూపేష్, శివల క్రైమ్ థ్రిల్లర్ `22` టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా డెఫినెట్‌గా పెద్ద హిట్ అవుతుంది – కింగ్ నాగార్జున.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ’22’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతులమీదుగా విడుదలైన హీరో ఫస్ట్‌లుక్ గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం టీజర్ ను 2ఫిబ్రవరి2020న ఉదయం 8:59 నిమిషాలకు కింగ్ నాగార్జున విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి ముఖ్య అతిథిగా పాల్గొని `22` మూవీ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత కొండా కృష్ణం రాజు పాల్గొన్నారు.
కింగ్ నాగార్జున మాట్లాడుతూ – “అందరికి ఎంతో ఇష్టమైన బి.ఎ.రాజు గారి, జయగారి అబ్బాయి శివ. జయగారు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి చాలా ఇష్టం. వాళ్ళిద్దరితో నేను బాగా క్లోజ్ గా ఉంటాను. జయగారు ఇప్పుడు మన మధ్య లేరు కానీ వాళ్ళ అబ్బాయి డైరెక్టర్ అవుతున్నాడు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆమె అందరికి బాగా తెలిసిన మహిళా దర్శకురాలు. శివ దర్శకుడిగా జయగారి పేరు నిలబెట్టాలి. అలాగే బి.ఎ.రాజు గారిది కూడా. రూపేష్ వెల్ కమ్ టు ఫిలిం ఇండస్ట్రీ. బయట ఎన్నో సక్సెస్ ఫుల్ బిజినెస్ లు ఉన్నా సినిమా అంటే ఫ్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చాడు. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. ఇప్పుడే టీజర్ చూశాను. ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టైటిల్ 22. టీజర్ విడుదలయింది 2-2-2020. అన్ని రెండులే ఉన్నాయి. న్యూమరాలజి ప్రకారం నాది కూడా రెండు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్” అన్నారు.
శివ దర్శకుడిగా తప్పక సక్సెస్ అవుతాడు!!
సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – శివ దర్శకుడు కావడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ కాపీ కూడా వారం రోజుల్లో రెడీ అవుతుందని చెప్పాడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా వద్దకు వచ్చి ఓ సినిమా ప్రొస్ట్ ప్రొడక్షన్ అంతా హ్యాండిల్ చేశాడు. రాజుగారు ఎలా ఒక సినిమా సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకొని కష్టపడి ప్రమోషన్ చేస్తారో… అలా శివ కూడా చాలా కష్టపడతాడు. దర్శకుడుగా సక్సెస్ కావడానికి ఈ సినిమాతో ఒక మంచి ప్రయత్నం చేశాడు. కొత్తగా దర్శకులు కావాలనుకునేవారు తొలుత ప్రేమకథను తీయాలనుకుంటారు. కానీ శివ విభిన్నంగా ఆలోచించి ఓ క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌ను తీసుకుని ఇంత బాగా తీశాడంటే అతని మెచ్యూరిటీ లెవల్ ఏంటో తెలుస్తోంది. ఈ కథను నమ్మి, రూపేష్ హీరోగా నటించాడు. రూపేష్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడనిపిస్తోంది. సలోనితో పాటు టీమ్ అందరు బాగా చేశారు. టీమ్ అందరికీ ఆల్‌దిబెస్ట్.అలాగే నాగార్జునగారు కొత్తవారిని ప్రొత్సహించడంలో ఎప్పుడూ ముందుఉంటారు. టీజర్ చూసి ఆయన అంత మాట్లాడారు అంటే…రాజుగారిపై అభిమానం ఉన్నప్పటికీ టీజర్ ఆయనతో మాట్లాడేలా చేసింది. నేను శివ చేసిన ఓ వెబ్‌సిరీస్ చూసి షాక్ అయ్యాను. టెక్నికల్‌గా బాగా చేశాడు. ఒక కథ రాసుకుని, ఇంత తక్కువ సమయంలో దాన్ని స్క్రీన్‌మీదకు తీసుకురావడం అంత సులువు కాదు. వి.వి.వినాయక్‌గారు, నేను ఈ సినిమా లాంచ్ చేశాం. అప్పుడే ఈ సినిమా టీజర్ లాంచ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి దర్శకుడు ఇండస్ట్రీకి చాలా అవసరం. శివ దర్శకుడిగా తప్పక సక్సెస్ అవుతాడు. కో-డైరెక్టర్ పుల్లారావుగారు ఉంటే ఆ ప్రొడక్ట్ బాగా వస్తుంది. ఆయన సినిమాను సినిమాలాగే చూస్తారు చాలా సిన్సియర్‌గా వర్క్ చేస్తారు. ఇలాంటి సీనియర్ దర్శకులతో పని చేసే అవకాశం శివకు వచ్చింది. ఈ సినిమాను ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాలనుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్‌దిబెస్ట్“ అన్నారు.
ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు మాట్లాడుతూ – “నాగార్జునగారు, పూరీ జగన్నాథ్‌గారు, మారుతిలాంటి ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈ సినిమాకు ముందుకొచ్చి శివమీద వారికి ఉన్నప్రేమను, నమ్మకాన్ని తెలియజేస్తుంటే శివ చాలా అదృష్టవంతుడనిపిస్తోంది. ఇంతమంది పెద్దల అశీస్సులతో శివకు, రూపేష్ గారికి ఈ సినిమా పెద్ద బ్రేక్ అవ్వాలని, ఎంటైర్ యూనిట్‌కి ఈ ఇదొక పెద్ద సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.
ఆదిత్యమ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ – “రాజుగారు, జయగారు మొదటి సినిమా నుంచి మమ్మల్ని ఆదరించి, వారి సినిమాల ఆడియో హక్కులను మాకే ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఆ పరంపరని అలాగే కొనసాగిస్తూ ఇప్పుడు వారి అబ్బాయి శివగారు డైరెక్టర్‌గా రూపొందించిన ఈ సినిమా ఆడియో హక్కులను కూడా మాకు ఇవ్వడం చాలా సంతోషం. శివగారికి జయగారితో సహ మా అందరి ఆశీస్సులు ఉన్నాయి. అలాగే బి.ఎ.రాజుగారు తోడుగా ఉన్నారు. భవిష్యత్‌లో ఇంకా మంచి సినిమాలు చేయాలి. వీరి పరంపర ఇలాగే మాతోనే కొనసాగలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి మాకు సాధ్యమైనంత సహాయం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను“ అన్నారు.
కో డైరెక్టర్ పుల్లారావు కొప్పినీడి మాట్లాడుతూ – “శివ ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఎంత గొప్పగా ఫీలయ్యామో, సినిమాను కూడా అంతే గొప్పగా తీశాడు. సినిమా చాలా బాగా వచ్చింది. టీజర్ అద్భుతంగా ఉంది. హీరోహీరోయిన్లు చాలా బాగా చేశారు. ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను.
హీరో రూపేష్‌కుమార్ చౌదరి మాట్లాడుతూ – ` మా అయి ఈ ప్రొడక్షన్ బ్యానర్ లొగొ లాంచ్ కార్యక్రమానికి మారుతిగారు వచ్చి వారి ఆశీస్సులు అందించారు. మళ్లీ ఈ సినిమా క్యాలెండర్ లాంచ్ చేసినందుకు మారుతిగారికి థ్యాంక్స్. నాగార్జునగారిచేతుల మీదుగా మా సినిమా టీజర్ లాంచ్ అవడం నెక్ట్స్ లెవల్ ఆనందంగా ఉంది“ అన్నారు.
చిత్ర దర్శకుడు శివకుమార్ బి.మాట్లాడుతూ – “నాగార్జున టీజర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. కొత్త దర్శకులను ప్రొత్సహించే నాగార్జునగారి చేతుల మీదుగా మా టీజర్ లాంచ్ కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎంటైర్ 22టీమ్ తరఫున నాగార్జునగారికి థ్యాంక్స్. మారుతిగారు ఇటీవల ప్రతిరోజూపండగే సినిమాతో పెద్ద సక్సెస్ అందుకున్నారు. ఆ పండగను ఈ పండగకి తీసుకువచ్చారు. మా 22లో ఆ పండగ జరుగుతుంది. ఈ సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులు అందరికీ థ్యాంక్స్. కొండాకృష్ణంరాజుగారికి, మారుతిగారికి స్పెషల్ థ్యాంక్స్. ఆడియో విషయంలో ఆదిత్యమ్యూజిక్ మాధవ్‌గారు, నిరంజన్‌గారు చాలా సపోర్ట్ చేశారు. కమర్షియల్‌గాకూడా ప్రొత్సహిస్తున్నారు. ఇప్పుడు ఈ టీజర్‌లాంచ్‌కి కూడా వారి సహకారం అందించారు. కథ ప్రకారమే 22 అనే టైటిల్ పెట్టాం. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్“ అన్నారు.
హీరోయిన్ సలోని మిశ్రా మాట్లాడుతూ – ఇక్కడికి వచ్చిన మారుతిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాలో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నాకు కంఫర్ట్‌జోన్‌కు విభిన్నమైన మంచి పాత్ర ఇచ్చిన శివగారికి థ్యాంక్స్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. రూపేష్‌గారు బాగా నటించారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది“ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ రవికిరణ్ మాట్లాడుతూ -“ టీజర్ విడుదలచేసిన నాగార్జునగారికి, ఇక్కడికి వచ్చిన మారుతిగారికి థ్యాంక్స్. మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. టీమ్ అందరికీ ధన్యవాదాలు“ అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ పెద్దిరాజు మాట్లాడుతూ – “సినిమా బాగా వచ్చింది. మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు“ అన్నారు.
నటుడు కృష్ణచైతన్య మాట్లాడుతూ – “టైటిల్ మాదిరిగానే సినిమా కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాలో శివ నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారు. ఈ ఏడాదిలోనే నా కెరీర్‌లో ఇదొక బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పగలను“ అన్నారు.
నిర్మాత బి.ఎ. రాజు మాట్లాడుతూ – “ఎంతోమంది కొత్త దర్శకులను ప్రొత్సహించి, వారు ఈ రోజు మంచి స్థాయిలో ఉండటానికి కారణమైన నాగార్జున చేతులు మీదుగా టీజర్‌ను లాంచ్ చేయించాలని వారిని కలిశాను. మా అబ్బాయి..శివ ఓ సినిమాను
డైరెక్ట్ చేశాడు..అని చెబుతుండగానే నాగార్జునగారు తప్పక లాంచ్ చేస్తానని ప్రోత్సహించి టీజర్ రిలీజ్ చేసి ఆశీస్సులు అందించారు. అలాగే నాగచైతన్యగారు ఆల్‌ది బెస్ట్ చెప్పారు. డైరెక్టర్ మారుతి గారి దగ్గర శివ వర్క్ చేశాడు, శివ మీద అభిమానంతో మారుతి గారు విచ్చేసి క్యాలెండర్ లాంచ్ చేసినందుకు థాంక్స్. అలాగే మా ఆత్మీయులు కొండా కృష్ణంరాజుగారు రావడం ఎంతో ఆనందం. శివ కు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన రూపేష్ గారికి స్పెషల్ థాంక్స్. ఇండస్ట్రీ ప్రముఖుల సపోర్ట్‌తో ఈ సినిమా ముందుకు వెళుతోంది.టీజర్ చూసినవారు శివ పెద్ద దర్శకుడు అవుతాడని అంటున్నారు. అది తప్పక జరగాలని కోరుకుంటున్నాను. శివకు జయ ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయి.“ అన్నారు.
రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా, విక్రమ్ జీత్ విర్క్, దేవిప్రసాద్, జయప్రకాష్, రవి వర్మ, శశిధర్ కోసూరి, ఫిదా శరణ్య, రాజశ్రీనాయర్, పూజా రామచంద్రన్, కృష్ణ చైతన్య, ఆఫ్ఘనిస్తాన్ రామరాజు, బేబి సంస్కృతి, మాస్టర్ తరుణ్, మాస్టర్ దేవాన్ష్, బేబి ఓజల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ : బి.వి. రవికిరణ్, సంగీతం: సాయికార్తీక్, ఎడిటింగ్: శ్యామ్ వాడవల్లి, కొరియోగ్రఫీ: అనీలామా, ఆర్ట్: పెద్దిరాజు అడ్డాల, స్టంట్స్: జాషువ, లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, ప్రొడక్షన్ మేనేజర్: కిరణ్ కాసా, పిఆర్ఓ: బి.ఎ రాజు, చీఫ్ కో-డైరెక్టర్: పుల్లారావు కొప్పినీడి, నిర్మాత: శ్రీమతి సుశీలాదేవి, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: శివకుమార్ బి.
Category : Latest Events Latest Reviews Movie News Sliders
‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం` ఒక ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ – నటి షకీల
షకీల ప్రధానపాత్రధారిణిగా విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా 24 క్రాఫ్ట్స్ బ్యానర్ పై సీవీ రెడ్డి సమర్పణలో సి.హెచ్ వెంకట్ రెడ్డి నిర్మాతగా సాయిరాం దాసరి దర్శకత్వ పర్యవేక్షణలో సతీష్ వి.ఎన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం’. ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ఆవిష్కరణ ఆదివారం ఫిల్మ్ చాంబర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో..
నటి షకీల మాట్లాడుతూ – `’నేను నిర్మించిన ‘లేడీస్ నాట్ అలౌడ్’ సినిమా పది నెలలుగా సెన్సార్ అవడం లేదు. ఎంతో వల్గారిటీతో వచ్చిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ మా సినిమాకే సెన్సార్ వాళ్లు ఎందుకు అభ్యంతరాలు చెపుతున్నారో అర్థం కావడం లేదు. ప్రస్తుతం ట్రిబ్యునల్ లో ఉంది. షకీలా అంటే వల్గారిటీ సినిమాలేనా.. ఫ్యామిలీ సినిమాలు చేయదా అనే విమర్శలున్నాయి. అన్ని రకాల సినిమాలు చేయగలనని నిరూపించడం కోసం కుటుంబ కథాచిత్రంగా ఈ సినిమా చేస్తున్నాను. షకీలా నిర్మాత అంటేనే సెన్సార్ ఇవ్వడం లేదు.. ఇది నేను రాసిన కథ అంటే ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారో. కానీ ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స “ అన్నారు.
దర్శకుడు సతీష్ వి.ఎన్ మాట్లాడుతూ – ‘ కొత్తగా ప్రయత్నించాం. అన్ని వర్గాలకు నచ్చే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఏప్రిల్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’ అని అన్నాడు. హీరో విక్రాంత్ మాట్లాడుతూ ‘గత చిత్రం ‘లేడీస్ నాట్ అలౌడ్’కి సహనిర్మాతగా పనిచేశాను. ఆ సినిమా విడుదలకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సాయిరాం దాసరి కొత్తగా ప్రయత్నించాడు. కచ్చితంగా ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం` అన్నారు
డిఓపి తరున్ కరామ్‌తోత్ మాట్లాడుతూ – సాయిరాంతో నాలుగు సినిమాలకు పని చేశా. ఈ చిత్రానికి మంచి డైలాగులు అందించడమే కాదు బాగా తెరకెక్కించారు. అందరినీ ఆకట్టుకుంది’అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మిత్ర, నటుడు హర్ష తదితరులు పాల్గొన్నారు.
షకీలా, విక్రాంత్, పల్లవి ఘోష్, నల్లబెల్లి, తేజ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి
దర్శకత్వ పర్యవేక్షణ: సాయిరాం దాసరి,
దర్శకుడు: సతీష్ విఎన్,
నిర్మాత: సి హెచ్ వెంకట రెడ్డి,
సహ నిర్మాత: లండన్ గణేష్, ఆడియో గ్రాఫి: శ్రీ మైత్రా,
ఎడిటర్: కెఆర్ స్వామి,
డిఓపి: శ్యామ్ ప్రసాద్, తరున్ కరామ్‌తోత్.
పిఆర్ఒ: సాయి సతీష్.
Category : Latest Events Latest Reviews Movie News Sliders
జయంత్ సి పరాన్జి సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ ‘నరేంద్ర`లో ఫీమేల్ ఫైటర్ పైలట్ గా ప్రత్యేక పాత్రలో పాయల్ రాజ్ పూత్.
ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసి ‘వెంకీమామ’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్ పూత్ ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జి లేటెస్ట్ మూవీ ‘నరేంద్ర’ లో ఇండియన్ ఫస్ట్ ఫీమేల్ ఫైటర్ పైలట్ గా ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. ఒక అమాయకుడైన భారతీయ బాక్సర్ పాకిస్థాన్ జైలులో ఎలా బందీ అయ్యాడు అక్కడి నుండి ఎలా తప్పించుకుని బయట పడ్డాడు అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘నరేంద్ర’ తెరకెక్కుతోంది. చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ రిలీజ్ కి సిద్దం అవుతోంది. హీరోగా పరిచయం అవుతున్న నీలేష్ పాకిస్థాన్ జైల్ లో ఖైదీ అయిన మాజీ బాక్సర్ గా నటిస్తున్నారు. బ్రెజిలియన్ బ్యూటీ ఇసాబెల్లా లియేటి స్వేఛ్చా పోరాటానికి మద్దతు ఇచ్చే మానవ హక్కుల కార్యకర్త పాత్ర పోషిస్తుంది. అలాగే భారత ఖైదీలను రక్షించే ప్రయత్నంలో తనను తాను త్యాగం చేసుకునే ఆఫ్ఘన్ ఖైదీ గా ఫేమస్ W.W.E స్టార్ ద గ్రేట్ ఖలి నటిస్తున్నారు. ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, బావగారూ బాగున్నారా, లక్ష్మి నరసింహా, టక్కరి దొంగ, ఈశ్వర్, శంకర్ దాదా ఎంబిబిఎస్, వంటి ఎన్నో కమర్షియల్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు జయంత్ సి పరాన్జి సరికొత్త ట్విస్టులతో తెలుగు స్క్రీన్ మీద ఇంతవరకూ రాని అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ గా ‘నరేంద్ర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
పాయల్ రాజపూత్, ది గ్రేట్ ఖలి, ఇసాబెల్లా లియేటి, నీలేష్ ఏటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: విరేన్ తంబిదొరై, సంగీతం: రామ్ సంపత్, నిర్మాణ సంస్థ: ఈషాన్ ఎంటర్టైన్మెంట్, రచన, దర్శకత్వం: జయంత్ సి పరాన్జి
Category : Latest Events Latest Reviews Movie News Sliders
© Copyright 2020. All Rights Reserved